Delhi University Professor
-
బీసీలకు శాపంగా జాతీయ విద్యా విధానం.. దేశవ్యాప్తంగా బీసీ పోరు!
సాక్షి, హైదరాబాద్: బీసీలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలంటే మండల్ కమిషన్ నిర్దేశించినట్టుగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో, పదోన్నతుల్లో తప్పకుండా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సూరజ్ మండల్ డిమాండ్ చేశారు. దేశంలో బీసీలు సహా కులాల వారీగా జనాభా ఎంత ఉందన్న స్పష్టత వచ్చేలా జనగణన చేయాలని.. ఈ రెండు అంశాల అమలు కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నామని తెలిపారు. ఆ దిశగానే ఈ నెల 11న హైదరాబాద్‌లో బీసీ సదస్సును నిర్వహించి, అందులో లేవనెత్తిన అంశాలతో ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని.. వచ్చే నెలలో హైదరాబాద్‌లో మహా ధర్నా నిర్వహించబోతున్నామని వెల్లడించారు. హైదరాబాద్‌లో బీసీ సదస్సు కోసం వచి్చన సూరజ్ మండల్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. బిహార్ సీఎంగా పనిచేసి బీసీల కోసం ఉద్యమించిన నేత బిందేశ్వర్ ప్రసాద్ మండల్ (బీపీ మండల్) మనవడిగా బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తాను కృషి చేస్తున్నట్టు చెప్పారు. సూరజ్ మండల్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ఏపీ తరహా స్ఫూర్తిని అనుసరించాలి.. ‘‘చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్ ఎప్పట్నుంచో ఉన్నా ఆచరణలోకి రాలేదు. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపుల్లో వైఎస్సార్సీపీ తీసుకున్న నిర్ణయం హర్షించదగినది. బీసీ ల్లోని పలు సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం దక్కేలా ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపు జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే పంథా అనుసరిస్తానని, బీసీలకు ప్రత్యేక ప్రాధా న్యత ఇస్తానని సీఎం జగన్మోహన్రెడ్డి ప్రకటించడం శుభపరిణామం. ఇదే స్ఫూర్తిని దేశ ప్రధాని సహా ఇతర రాష్ట్రాల సీఎంలు, అన్ని రాజకీయ పార్టీలు అనుసరిస్తే బీసీలకు తగిన న్యాయం జరుగుతుంది. బీసీలకు శాపంగా జాతీయ విద్యా విధానం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానం బీసీల పాలిట శాపంలా మారబోతోంది. ఆ పాలసీ పేరిట ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఫీజులను అడ్డగోలుగా పెంచేశారు. అరకొర ఆదాయ కేటగిరీలో ఉన్న బీసీలు ఈ పెరిగిన ఫీజులతో కేంద్ర విద్యా సంస్థల్లో చదువుకోవడంకష్టమే. ఆ సీట్లు చివరికి అగ్రవర్ణాలకే అందుతాయి. అందుకే ఎన్ఈపీలో మార్పులు చేయాలని, ఫీజులు తగ్గించాలని కోరినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం అత్యంత మూర్ఖంగా నిర్ణయం తీసుకుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక బీసీలు అన్ని విధాలా నష్టపోయారు. కేంద్రంలో కనీసం బీసీ మంత్రిత్వ శాఖ లేదు. ఎన్సీబీసీ చైర్మన్, సభ్యులను సకాలంలో నియమించకుండా కాలయాపన చేసి బీసీల హక్కులతో ఆటలాడుతున్నారు. కులాల వారీగా జనగణన అవసరం జనగణనలో కులాల వారీగా లెక్కలు తేల్చాలని ఏళ్లుగా ఉద్యమిస్తున్నాం. అన్ని వర్గాల నుంచి ఈ డిమాండ్ వస్తుండటంతో కేంద్రం జనగణన ప్రక్రియనే వాయిదా వేసింది. జనాభాలో కులాల వారీగా సంఖ్య తేలితే రిజర్వేషన్లు, ఇతర సంక్షేమ పథకాల అమలుకు మార్గం సుగమం అవుతుంది. ఈ అంశం కేంద్ర ప్రభుత్వానికి నచ్చడం లేదు. జనాభాలో అగ్రవర్ణాల సంఖ్య ఎంతో తేల్చకుండానే 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేసింది. బీజేపీ పాలనలో అగ్రవర్ణాలకు ఒక విధంగా, అణగారిన వర్గాలకు ఒక విధంగా న్యాయం ఉంటుందనిపిస్తోంది. -
ఈ సర్వేల ‘న్యాయం’ ఎన్నాళ్లు?
జ్ఞాన్ వాపి మసీదును వివాదాస్పద స్థలంగా మార్చడానికి గతంలోనూ ప్రయత్నించారు. 1991వ సంవత్సరం నుంచి మత స్థలాల ప్రతిపత్తికి చెందిన విస్పష్టమైన చట్టం అమలులో ఉన్నప్పటికీ ముస్లింల చేతుల్లోంచి మసీదును లాక్కోవాలనే డిమాండుకు హేతువును జొప్పించడానికి నిర్విరామంగా ప్రయత్నిస్తున్నారు. వారణాసిలో జ్ఞాన్ వాపి మసీదులో సర్వేని కొనసా గించడానికి అనుమతించడం ద్వారా భారత అత్యున్నత న్యాయస్థానం కొన్ని విమర్శలకు తావిచ్చింది. జ్ఞాన్ వాపి మసీదులో సర్వే జరపాలని వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశంతో అక్కడ ఒక సంక్షోభం ఏర్పడింది. మసీదులో ఒక భాగాన్ని మూసివేయాలనీ, అక్కడికి ఎవరినీ అనుమతించవద్దనీ ఆదేశించడం ద్వారా న్యాయస్థానం మసీదు స్వరూపాన్నే మార్చి పడేసింది. ఈ అంశంలో కోర్టు ఎంత వేగంగా స్పందించిందంటే, మన న్యాయ స్థానాలు నిదానంగా వ్యవహరించే తీరుకు పూర్తి భిన్నంగా కనిపించింది. ఇది జరిగిన 3 రోజులకు అంటే మే 20 నాటికి కోర్టుకు సీల్డ్ కవర్లో పంపించిన వీడియో సర్వే వివరాలు దేశం మొత్తానికీ తెలిసిపోయాయనుకోండి! జ్ఞాన్ వాపి మసీదును వివాదాస్పద స్థలంగా మార్చడానికి గతంలోనూ అనేక ప్రయత్నాలు జరిగాయి. అయితే అలాంటి ప్రతి సందర్భంలోనూ అలహాబాద్ హైకోర్టు ఆ ప్రయత్నాలను నిలువరించింది. 1991 నుంచి మత స్థలాల ప్రతిపత్తికి చెందిన విస్పష్టమైన చట్టం అమలులో ఉన్నప్పటికీ ముస్లింల చేతుల్లోంచి మసీదును లాక్కోవాలనే డిమాండుకు హేతువును జొప్పించడానికి నిర్విరామంగా ప్రయత్నిస్తున్నారు. 1947 ఆగస్టు 15 నాటికి ఉనికిలో ఉంటున్న మతస్థలాల ప్రతిపత్తిని ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చకూడదని ఆ చట్టం స్పష్టంగా పేర్కొంది. ఇలాంటి ప్రక్రియను అను మతించినట్లయితే అది తప్పకుండా ఏదో ఒక మతానికి సంబంధించిన రూపాన్ని లేక లక్షణాన్నైనా మార్చివేయడానికే దారితీస్తుందని ఆ చట్టం సూచిస్తోంది. బాబ్రీ మసీదును ఈ ప్రార్థనా స్థలాల చట్టం పరిధిలోకి తేలేదు. కాబట్టే దాన్ని ధ్వంసం చేశారు, ఆ భూమిని కూడా (న్యాయబద్ధంగా) లాక్కు న్నారు. అయితే ఆ ప్రయత్నంలో కూడా, మత స్థలాల ప్రతిపత్తికి సంబంధించి 1991 చట్టం చెప్పినదాన్ని కచ్చితంగా పాటించాలని సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. దీనర్థం ఏమి టంటే, మతస్థలం స్వరూపాన్ని ప్రశ్నించే ఏ చర్యనూ ప్రోత్సహించకూడదనే! హిందూ సెంటి మెంట్లను ఈ దేశంలో ఏ కోర్టూ నిర్లక్ష్యం చేయదు. కాబట్టే తాము పూజించే దేవతల విగ్రహాలు మసీదు ఆవరణలో ఉన్నందున వాటిని పూజించే హక్కు తమకుందని భక్తులు వాదిస్తే కోర్టులు వారి వాదనను తప్పక వింటాయి. వెంటనే ఇదే అంశంపై అలహాబాద్ హైకోర్టు సమన్వయ బెంచ్ ఇచ్చిన స్టే ఆర్డర్లను కూడా సుప్రీంకోర్టు పక్కన పెట్టేసింది. అంతే కాకుండా మసీదు రూపం ఎలా ఉందో నిర్ధారించుకోవడానికి మసీదు సర్వేపై ఆదే శాలు జారీ చేసింది. ఈ క్రమంలో మసీదు స్వరూపమే వివాదాస్పదంగా మారిపోయింది. హిందూ సభ్యులతో కూడిన ఆ సర్వే టీమ్ మసీదులోని వజూఖానాలో ఒక శివ లింగాన్ని కనుక్కుంది. ముస్లింలు అది లింగం కాదు ఫౌంటైన్ అని ప్రకటించారు. ఇదే మరింత ఆమోద నీయంగా కనిపిస్తోంది. తాము ప్రార్థనలు జరిపే ముందు కాళ్లూ చేతులు కడుక్కునే స్థలమే అదని ముస్లింలు మొత్తుకుంటున్నా, భూమి ఉపరితలం పైన శివలింగాన్ని తాము చూశామని చెబు తున్న హిందువులతో ఎవరు విభేదించగలరు? మసీదు లోపల శిలకు ఎరుపురంగు రాసింది చూశామనీ, ఆ ఇమేజ్ ‘హనుమాన్’ అనీ సర్వే టీమ్ ప్రకటిం చింది. ఈ వార్త వెల్లడయ్యాక సర్వే టీమ్ లేదా దాని హిందూ సభ్యులు కోర్టుకు పరుగెత్తారు. బీజేపీ శ్రేణులకు ఇది అమితానందం కలిగించే విషయమే. 1949లో కాళరాత్రి వేళ అతి రహస్యంగా జరిపిన చర్యలో విగ్రహాలను బాబ్రీ మసీదులోకి తరలించారు. సుప్రీంకోర్టు ఆనాడే దాన్ని నేరపూరిత చర్య అని పిలిచింది. 73 ఏళ్ల తర్వాత మరో నేరపూరిత చర్య జరిగింది. పట్ట పగలు న్యాయవ్యవస్థ పర్యవేక్షణలో ఆ నేరం జరిగిపోయింది. అలహాబాద్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ గోవింద్ మాధుర్ ఒక వ్యాసంలో, ఈ ప్రార్థనా స్థలాల ప్రతి పత్తిపై చట్టం ఉద్దేశం... మరో బాబ్రీమసీదు తరహా విధ్వంస చర్య, ఆక్రమణ చర్య జరగకూడ దనేదేనని చెప్పారు. కానీ ఇప్పుడు జరిగిందేమిటి? ఉద్దేశపూర్వకంగా, తెలిసి తెలిసీ ఘర్షణకు దారితీసే ప్రక్రియను ప్రారంభించడమే కదా! సుప్రీంకోర్టు వారణాసి కోర్టు నిర్ణయాన్ని తోసి పుచ్చి 2022 మే 16కి ముందున్న యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించిన ట్లయితే అలాంటి హింసాత్మక పరిణామం జరగకుండా ఇప్పటికైనా నిలిపి వేయవచ్చు. (చదవండి: ఇది ఎదురుకాల్పుల కనికట్టు కథ!) అయితే 1991 నాటి చట్టాన్ని సవాలు చేస్తున్న పిటిషన్‌ని విచారించడానికి సుప్రీకోర్టు సంసిద్ధత తెలపడంవల్ల మనకు ఒక విషయం బోధపడుతుంది. అదేమిటంటే, ఈ దేశంలో ముస్లింల శాంతి, సామరస్యం, న్యాయం, గౌరవం వంటి వన్నీ ఏదో ఒక విస్తృతమైన లక్ష్యం కోసం ఎల్లప్పుడు త్యాగం చేయాల్సి ఉంటుంది. ఆ లక్ష్యం ఏమిటో ఊహించడం ఇప్పుడు ఏమంత కష్టమైన పని కాదు. (చదవండి: మతం, మార్కెట్ కలిసిన రాజకీయం) - అపూర్వానంద్ హిందీ అధ్యాపకుడు, ఢిల్లీ విశ్వవిద్యాలయం -
జ్ఞానవాపి మసీదుపై వివాదాస్పద వ్యాఖ్యలు.. హిస్టరీ ప్రొఫెసర్ అరెస్ట్
వారణాసిలోని జ్ఞానవాపి మసీదుపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. జ్ఞాన్వాపి మసీదు వీడియోగ్రాఫి సర్వే అభ్యంతర పిటిషన్‌పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ వాడివేడీగా సాగిన విషయం తెలిసిందే. ఈ కేసు పరిణామాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని, జోక్యం చేసుకోబోమని బెంచ్.. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ శివలింగాన్ని సంరక్షించడంతో పాటు నమాజ్ కొనసాగించుకోవచ్చన్న మధ్యంతర ఆదేశాలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. అంతేకాదు.. ట్రయల్ జడ్జి కంటే అనుభవం ఉన్న జిల్లా జడ్జి సమక్షంలోనే వాదనలు జరగడం మంచిదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు పిటిషన్‌ను వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ తరుణంలో జ్ఞాన్వాపి మసీదు విషయంపై ఢిల్లీ యూనివర్సిటీలోని హిందూ కాలేజీ హిస్టరీ సబ్జెక్ట్ అసోసియేట్ ప్రొఫెసర్ రతన్ లాల్ సోషల్ మీడియాలో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో..‘‘దేశంలో మీరు దేని గురించి మాట్లాడినా.. అది మరొకరి సెంటిమెంట్‌ను దెబ్బతిస్తుంది. ఇది కొత్తేమీ కాదు. నేను చరిత్రకారుడిని, అనేక పరిశీలనలు చేశాను. నా పరిశీలనలో నేను అన్వేషించిన వాటి గురించి రాశాను. నన్ను నేను రక్షించుకుంటాను’’ అని వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై ఢిల్లీ లాయర్ వినీత్ జిందాల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు లాల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ 153ఏ, 295ఏ కింద ప్రొఫెసర్‌ను అరెస్టు చేసినట్లు ఢిల్లీ సైబర్ పోలీసులు తెలిపారు. ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేవిధంగా ఉన్నట్లు లాయర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. జ్ఞాన్వాపి మసీదు సమస్యపై తాను కామెంట్స్ చేసిన తర్వాత తన 20 ఏళ్ల కుమారుడికి ఫేస్బుక్ మెసెంజర్లో బెదిరింపులు వస్తున్నాయని రతన్ లాల్ తెలిపారు. లాల్ తన టీచింగ్ ఉద్యోగంతో పాటు, దళిత సమస్యలపై దృష్టి సారించే ‘అంబేద్కర్నామా’ అనే న్యూస్ పోర్టల్ వ్యవస్థాపకుడు, ఎడిటర్-ఇన్-చీఫ్‌గా కొనసాగుతున్నారు. మరోవైపు.. రతన్ లాల్ అరెస్ట్‌ను కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఖండించారు. ట్విట్టర్ వేదికగా.. ‘‘ప్రొఫెసర్ రతన్ లాల్ అరెస్టును నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజ్యాంగబద్ధమైన అభిప్రాయం, భావ వ్యక్తీకరణ హక్కు ఆయనకు ఉంది.’’ అంటూ దిగ్విజయ్ కామెంట్స్ చేశారు. I strongly condemn Prof Ratn Lal’s arrest. He has the Constitutional Right of opinion and expression. @INCIndia https://t.co/gupumAwuXr — digvijaya singh (@digvijaya_28) May 21, 2022 ఇది కూడా చదవండి: జ్ఞానవాపి మసీదు పిటిషన్: వీడిన సస్పెన్స్.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు -
ప్రొఫెసర్ నందినిపై హత్యకేసు
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్ నందిని సుందర్ పై హత్యకేసు నమోదయింది. ఛత్తీస్ గఢ్లోని మావోయిస్టు ప్రభావిత జిల్లా సుక్మాలో గిరిజనుడి హత్య కేసులో ఆమెతో పాటు జేఎన్ యూ ప్రొఫెసర్ అర్చనా ప్రసాద్, మావోయిస్టులపై అభియోగాలు నమోదు చేశారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు బస్తర్ రేంజ్ ఐజీ ఎస్ ఆర్పీ కాళ్లూరి తెలిపారు. కుమాకోనెంగ్ గ్రామ పంచాయతీ పరిధిలోని నామా గ్రామానికి చెందిన శ్యామనాథ్ బాగహెల్ ను నవంబర్ 4న సాయుధ మావోయిస్టులు హత్య చేశారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా తమ గ్రామంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి శ్యామనాథ్ పలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాడు. ఈ కారణంగానే అతడిని మావోయిస్టులు హత్య చేశారు. తమకు మావోయిస్టుల నుంచి ముప్పు ఉందని పేర్కొంటూ నందినికి వ్యతిరేకంగా మే నెలలో తన భర్త ఫిర్యాదు చేసినట్టు శ్యామనాథ్ భార్య తెలిపింది. నందినితో పాటు తన భర్త హత్యకు కారణమైన మావోయిస్టులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. రిచా కేశవ్ అనే పేరుతో నామా గ్రామానికి వెళ్లి మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టొద్దని నందిని బెదిరించినట్టు పోలీసులు తెలిపారు. నందిని, అర్చనపై దర్యాప్తు చేపట్టనున్నట్టు డీయూ, జేఎన్ యూ వీసీలకు తెలిపామన్నారు. -
మహిళా ప్రొఫెసర్ నిర్వాకం
న్యూఢిల్లీ: సెల్ ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా కారు నడుపుతూ ఓ మహిళా ప్రొఫెసర్ పదేళ్ల బాలుడి మరణానికి కారకురాలైంది. దేశ రాజధాని ఢిల్లీలోని నజాఫ్‌గఢ్ ప్రాంతంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితురాలు అనుపమ అగర్వాల్ ను పోలీసులు అరెస్ట్ చేసి బెయిల్ పై విడిచిపెట్టారు. చావ్లా రోడ్డులో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షి వికాస్ భరద్వాజ్ తెలిపాడు. ఆల్టో కారులో వెళుతున్న అనుపమ నియంత్రణ కోల్పోయి సైకిల్ పై వెళుతున్న నితీశ్ మాన్ అనే బాలుడిని ఢీకొట్టిందని చెప్పాడు. కారును ఆపలేకపోవడంతో నితీశ్ ను కొంత దూరం ఈడ్చుకుపోయిందని వెల్లడించాడు. తర్వాత అగర్వాల్ ను ఒప్పించి ఆమె కారులోనే బాలుడిని ఆస్పత్రికి తరలించామని, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారని చెప్పాడు. తన సోదరికి నూడూల్స్ తెచ్చేందుకు నితీశ్ బయటకి వెళ్లాడని, 10 నిమిషాల్లో తిరిగి వస్తానని చెప్పినట్టు అతడి తల్లి ముకేశ్ మాన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అంగవైక్యలంగా కారణంగా ఆయన ఎక్కువ సమయంలో ఇంట్లోనే ఉంటారు. తన భార్య కేటరింగ్ వ్యాపారం నడుపుతూ కుటుంబాన్ని ముకేశ్ పోషిస్తోందని తెలిపాడు. తమకు న్యాయం చేయాలని ఆయన కోరుతున్నాడు. -
ప్రొఫెసర్ సాయిబాబాకు బెయిల్ మంజూరు
ఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ నాగ్ పూర్ జైల్లో ఉన్న ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు సోమవారం బెయిల్ లభించింది. ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేసిన సాయిబాబా గ్రీన్ హంట్ ను తీవ్రంగా వ్యతిరేకించారు. మావోయిస్టులతో సంబంధాలున్నట్లు ఆరోపణలు రావడంతో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా నాగ్‌పూర్‌లోని సెంట్రల్ జైల్లో 2015 మేలో లొంగిపోయారు. వికలాంగుడైన సాయిబాబాకు కనీస వసతులను కూడా జైల్లో కల్పించలేదని అతని భార్య ఆరోపించారు. మావోయిస్టు నెపంతో సాయిబాబాను వేధించవద్దని కేంద్రానికి సుప్రీం కోర్టు సూచించింది. ఎట్టకేలకు రాజద్రోహం కేసులో అరెస్టైన సాయిబాబాకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆదివాసీల హక్కుల కోసం తన భర్త పోరాడుతుంటే మావోలతో సంబంధం అంటగట్టారని సాయిబాబా భార్య అరోపించారు. పెరాలిసిస్తో బాధపడుతున్న ఆయకు కనీస వసతులు కూడా కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
జైలులో నా భర్త హత్యకు కుట్ర
డీయూ ప్రొఫెసర్ సాయిబాబా భార్య వసంత సాక్షి, న్యూఢిల్లీ:‘‘ నాగపూర్ కేంద్ర కారాగారంలో ఉన్న నా భర్తను హత్య చేయడానికి పోలీసులు కుట్ర పన్నుతున్నారు. ఆయనకు పౌష్టిక ఆహారం ఇవ్వడం లేదు. మందులు, వైద్యసేవలు అందించడం లేదు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించి చనిపోయేలా వ్యవహరిస్తున్నారు. ఈ చర్యలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి’’ అని ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా భార్య వసంత విన్నవించారు. సాయిబాబాను జైలు నుంచి విడిపించడానికి మద్దతుగా నిలిచేందుకు ఏర్పాటైన కమిటీ సభ్యులతో కలసి వసంత గురువారం ఇక్కడి ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజ్యహింసలో భాగంగా జుడీషియల్ కస్టడీలో ఉన్న తన భర్తను భౌతికంగా నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన సాయిబాబాను సంఘవిద్రోహకుడిగా చిత్రీకరించి ఏడాది క్రితం అరెస్టు చేసి నాగపూర్ సెంట్రల్ జైలుకు తరలించారని అన్నారు. 90 శాతం అంగవైకల్యం ఉన్న వ్యక్తిని అరెస్టు చేయకూడదని సీఆర్పీసీ సెక్షన్ చెబుతోందని కానీ, దానిని ఉల్లంఘించి సాయిబాబాను జైలు పెట్టారని ధ్వజమెత్తారు. ప్రజల హక్కులను కాపాడాల్సిన మానవ హక్కుల కమిషన్లు అధికారపక్షం చేతిలో పతనమయ్యాని విమర్శించారు. సాయిబాబా బెయిలుపై విడుదల కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. సాయిబాబా తల్లి సూర్యావతి మాట్లాడుతూ ఆదివాసీల బాగుకోసం పనిచేసిన తన కుమారుడిని పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారని వాపోయారు. సామాజికవేత్త అరుంధతిరాయ్, డీయూ ప్రొఫెసర్లు మాట్లాడుతూ ఆపరేషన్ గ్రీన్ హంట్‌కు వ్యతిరేకంగా పోరాడినందుకే సాయిబాబాపై ప్రభుత్వం కక్షకట్టిందని చెప్పారు. ఊచకోతలు, హత్యలు, కరుడుకట్టిన నేరస్తులు దర్జాగా బెయిల్‌పై బయట తిరుగుతుండగా, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సాయిబాబాకు బెయిల్ ఇవ్వకపోవడం మానవహక్కులను కాలరాయడమేనని విమర్శించారు. -
నక్సల్స్ సంబంధాలపై ప్రొఫెసర్ అరెస్టు
ఏపీకి చెందిన సాయిబాబాను అదుపులోకి తీసుకున్న మహారాష్ర్ట పోలీసులు మావోయిస్టు పార్టీతో సంబంధాలపై ఆధారాలున్నాయన్న అధికారులు హైదరాబాద్: మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను మహారాష్ట్ర పోలీ సులు అరెస్టు చేశారు. గత ఆరు నెలల్లో అనేకమార్లు ప్రశ్నించిన మీదట ఆయ న్ను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం సాయిబాబాను అరెస్టు చేశామని, ఢిల్లీ కోర్టు అనుమతితో అతడిని గడ్చిరోలికి తీసుకువస్తామని మహారాష్ట్ర డీఐజీ రవీంద్ర కదమ్ చెప్పారు. నిషేధిత తీవ్రవాద సంస్థ సీపీఐ-మావోయిస్టు సభ్యుడిగా వారికి అనేక రకాలుగా సాయిబాబా సహాయపడుతున్నారని ఆరోపించారు. మావోయిస్టుపార్టీలో కొత్త వారిని చేర్పించడంలో కూడా ప్రొఫెసర్ హస్తముందన్నారు. సాయిబాబా అరెస్ట్‌ను ఢిల్లీ పోలీసులు ధ్రువీకరించారు. ఇదివరకే ఆయన కంప్యూటర్ను పోలీసులు స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపారు. అందులోని కొన్ని ఫైల్స్ మావోయిస్టులతో అతని సంబంధాలను ధ్రువపరుస్తున్నాయని డీఐజీ చెప్పారు. మావోల కోసం పని చేస్తున్న ఓ సంస్థను సాయిబాబా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి హేమంత్ మిశ్రా అరెస్టు అనంతరం సాయిబాబా పేరు వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్మడ్ అడవుల్లో ఉన్న మావోయిస్టులకు, ప్రొఫెసర్‌కు మధ్య తాను కొరి యర్‌గా వ్యవహరిస్తున్నట్లు హేమంత్ అంగీకరించినట్లు పోలీసువర్గాలు తెలిపాయి. మావో నేతలు కోబాడ్‌గాంధీ, బచ్చా ప్రసాద్ సింగ్, ప్రశాంత్ రాహీలు కూడా సాయిబాబా పేరును వెల్లడించినట్లు చెప్పారు. ఈ ఆరోపణలను సాయిబాబా ఖండించారు. నల్లమిల్లి నుంచి ఢిల్లీకి... అమలాపురం టౌన్, ప్రొఫెసర్ గోకరకొండ సాయిబాబా అరెస్ట్‌తో తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో కలకలం రేగింది. సాయిబాబా సొంతూరు అమలాపురం పట్టణాన్ని ఆనుకుని ఉన్న నల్లమిల్లి గ్రామం. సామాన్య కుటుంబానికి చెందిన సాయిబాబా వికలాంగుడు. చిన్నతనం నుంచి సౌమ్యునిగా, చదువులో చురుగ్గా ఉండేవాడని గ్రామస్థులు చెప్పారు. అతని తండ్రి సత్యనారాయణ ఎంతో కష్టపడి సాయిబాబాను చదివించారన్నారు. సైకిల్‌పై అమలాపురంలోని ఎస్కేబీఆర్ కళాశాలకు తీసుకెళ్లి సాయిబాబా ఉన్నత చదువులు పూర్తి చేయించారన్నారు. తండ్రి చనిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయిన సాయిబాబా అక్కడే డిగ్రీ పూర్తి చేసి, తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ చేశారు. సీఫెల్ నుంచి డాక్టరేట్ పొందారు. ఆ సమయంలోనే ప్రేమించిన యువతిని కులాంతర వివాహం చేసుకున్నారు. ఇంట్లోకి చొరబడి ఎత్తుకెళ్లారు: సాయిబాబా భార్య వసంత న్యూఢిల్లీ: పోలీసులు ఇంట్లోకి చొరబడి తన భర్తను ఎత్తుకెళ్లారని సాయిబాబా భార్య వసంత ఆరోపించారు. అబూజ్‌మడ్‌లో పోలీసులు చేపట్టిన గ్రీన్ హంట్‌కి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నందునే అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన రెవల్యూషనరీ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఆర్డీఎఫ్) సంయుక్త కార్యదర్శి ప్రొఫెసర్ సాయిబాబాను బేషరతుగా విడుదల చేయాలని ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు వరవరరావు, కార్యదర్శి రాజ్‌కిషోర్, విరసం కార్యద ర్శి వరలక్ష్మి డిమాండ్ చేశారు.