dengue patients
-
ఢిల్లీలో డెంగ్యూ విజృంభణ.. సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం
వరుసగా కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడాలేకుండా వైరల్ జ్వరాలతోపాటు డెంగ్యూ జ్వరం భయపెడుతండటంతో ప్రజలు ఆందోలన చెందుతున్నారు. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా లక్షణాలతో జ్వరాలు వస్తుండడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు నిండిపోతున్నాయి. ఢిల్లీని వణికిస్తున్న డెంగ్యూ దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఎన్సీర్ పరిధిలో ఇటీవల వచ్చిన వర్షాలు, వరదలతో ఢిల్లీలో డెంగ్యూ, మలేరియా కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది జూలై 22 వరకు ఢిల్లీలో మొత్తం 187 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. 2018 నుంచి పోలిస్తే ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే అత్యధికం. కేవలం జూలై మొదటి మూడు వారాల్లో డెంగ్యూ కేసులు దాదాపు 65 నమోదయ్యాయి. జూన్‌లో 40, మేలో 23 వెలుగు చూశాయి. వీటికి తోడు 61 మలేరియా కేసులు నమోదయ్యాయ్యాయి. సీఎం సమీక్ష ఈ నేపథ్యంలో ఢిల్లీలో డెంగ్యూ పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం సచివాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నగరాన్ని పట్టి పీడిస్తున్న డెంగ్యూ కేసులను ఎదుర్కోవడానికి సమగ్ర వ్యూహాన్ని రూపొందించాలని లక్ష్యంగా నిర్వహించిన ఈ సమావేశానికి ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్, మేయర్ షెల్లీ ఒబెరాయ్, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు. అధికారులకు కేజీవ్రాల్ ఆదేశాలు అనంతరం ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 20 డెంగ్యూ నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించగా.. వాటిలో 19 నమూనాలలో టైప్-2 తీవ్రమైన స్ట్రెయిన్ ఉన్నట్లు తేలినట్లు చెప్పారు. డెంగ్యూ రోగులకు ఆసుపత్రుల్లో పడకలు రిజర్వ్ చేయాలని, ఆసుపత్రులు ‘మొహల్లా’ క్లినిక్‌లలో తగినన్ని మందుల నిల్వ ఉండేలా చూడాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య శాఖను ఆదేశించినట్లు భరద్వాజ్ తెలిపారు. జరిమానా పెంపు ఇంటి చుట్టుపక్కలా ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి ఉండటం, పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాల్లో దోమలువృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందన్న ఆయన.. ఈ కారణంగానే దేశ రాజధానిలో పరిస్థితి తీవ్రతరంగా మారినట్లు తెలిపారు. ఈ క్రమంలో డెంగ్యూ వ్యాప్తిని నియంత్రించే చర్యల్లో భాగంగా దోమల ఉత్పత్తికి అవకాశమిచ్చే ఇళ్లకు రూ. 1000, వాణిజ్య సంస్థలకు రూ. 5000కు జరిమానాను పెంచుతున్నట్లు పేర్కొన్నారు. -
డెంగీ విజృంభణ.. ఆ జిల్లాలో రోజుకు 28 కేసులు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అధిక వర్షాలు.. వాతావరణ మార్పులు.. పెరుగుతున్న దోమలతో డెంగీ పంజా విసురుతోంది. ఉమ్మడి జిల్లాలో డెంగీ కేసులు అధికమవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగీ, టైఫాయిడ్, మలేరియా లాంటి ప్రమాదకర జ్వరాలు వ్యాపిస్తుండడంతో పల్లెలన్నీ మంచం పడుతున్నాయి. ప్రతీఇంట్లో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పవచ్చు. రెండు నెలలుగా జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఫలితంగా పీహెచ్‌సీలతో పాటు జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రులలో ఓపీ, ఐపీ కోసం రోగులు బారులు తీరుతున్నారు. ఆగస్టు, సప్టెంబర్‌లో విజృంభణ వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా అనారోగ్య వాతావరణం నెలకొంది. ఈ వాతావరణమే వైరల్ ఫీవర్ల వ్యాప్తికి కారకంగా మారుతోంది. గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుధ్య లోపం కారణంగానే దోమలు వృద్ధి చెందుతున్నాయి. దీంతో జ్వరాల ప్రభావం పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ విపరీతంగా పెరిగిపోయింది. ఆగస్టు, సెపె్టంబర్ నెలల్లోనే డెంగీ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆగస్టులో 181 కేసులు, సెపె్టంబర్ (15 నాటికి)లో ఇప్పటి వరకే 422 కేసులు నమోదుతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఆసుపత్రులు కిటకిట సీజనల్ వ్యాధుల కారణంగా ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇటీవల అనధికారికంగా పదుల సంఖ్యలో డెంగీ మరణాలు నమోదు కావడంతో జ్వరం అంటేనే ప్రజలు వణికిపోతున్నారు. జ్వరం వస్తే చాలు ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా రోగులు వైద్యం కోసం ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ ప్రతి రోజు 2 వేలకుపైగా నమోదవుతుండగా, ఇన్‌పేషెంట్లకు సరిౖయెన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో జ్వరాల బారినపడిన పిల్లల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్లేట్లెట్స్ పేరుతో దోపిడీ డెంగీ ప్రయివేటు ఆసుపత్రులకు కాసుల వర్షం కురిపిస్తుంది. కరోనా తర్వాత అంతటి సంపాదన తెచ్చే అస్త్రమైంది. డెంగీ జ్వరం వచ్చిందంటే ప్లేట్లెట్స్ తగ్గడం సర్వసాధారణం. ప్లేట్లెట్స్ సాకుగా చూపుతూ ప్రయివేటు ఆసుపత్రులు పేషెంట్లను వారి బం«ధువులను భయాందోళనకు గురిచేసి సొమ్ము చేసుకుంటున్నారు. అవసరం ఉన్నా లేకుండా ప్లేట్లెట్స్ పరీక్ష చేయడం, ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్నాయంటూ తప్పుడు రిపోర్టులు ఇస్తూ పేషెంట్‌ను ఆసుపత్రికి పరిమితం చేస్తున్నారు. ఇక ఆంటిబయోటిక్స్, సెలాయిన్స్ పెట్టుకుంటూ రోజుల తరబడి ఆసుపత్రిలోనే ఉంచుతున్నారు. అవకాశం వచి్చందే తడవుగా సీజనల్ వ్యాధులను సొమ్ము చేసుకుంటున్నాయి. డెంగీకి మెరుగైన వైద్యసేవలు అందించాలని అందుకు ఖర్చు రూ.వేలల్లో ఉంటుందని ఆసుపత్రి నిర్వాహకులు చెబుతుండడంతో ప్రాణాలను కాపాడుకునేందుకు డబ్బులకు వెనుకాడకుండా పేదలు జేబులను గుల్ల చేసుకుంటున్నారు. రోజుకు 28 కేసులు ఉమ్మడి జిల్లాలో డెంగీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో రోజుకు ఒకటి లేదా రెండుకు మించి కేసులు నమోదు కాలేదు. తాజాగా సెప్టెంబరులో డెంగీ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఒక్కసారిగా రోజుకు 28 కేసులు చొప్పున నమోదవడం పరిస్థితికి అద్ధం పడుతోంది. దోమల సంఖ్య పెరగడమే ఈ వైరల్, డెంగీ, మలేరియా జ్వరాలకు కారణమని వైద్యులు స్పష్టంచేస్తున్నారు. గతంతోపోలిస్తే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కాలువలు, చెరువులు, కుంటలు నిండాయి. ఈ కారణం వల్ల కూడా దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరీంనగర్ విషయానికి వస్తే.. చుట్టూ హారంలా జలాశయాలు, కాలువలు ఉండటంతో దోమల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. ఇదీ చదవండి: వారం వారం.. ప్రగతి లక్ష్యం.. కొత్త విధానానికి శ్రీకారం -
‘వారు ఇంక్ చల్లింది ప్రజాస్వామ్యం మీద’
పట్నా: కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్విని చౌబేకు పరాభవం ఎదురయ్యింది. డెంగ్యూ పేషెంట్లను పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లిన మంత్రిపై గుర్తు తెలియని వ్యక్తి ఇంకు చల్లాడు. వివరాలు.. బిహార్‌లో డెంగ్యూ వ్యాధి తీవ్రంగా ఉంది. ఐదు రోజుల్లోనే దాదాపు 1500 మందిలో డెంగ్యూ లక్షణాలను గుర్తించారు. ఒక్క రాజధానిలోనే దాదాపు 900 కేసులు నమోదయ్యాయి. తాజాగా రాష్ట్రంలో సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా డెంగ్యూ మరింత విజృంభించింది. ఈ నేపథ్యంలో అశ్విని చౌబే పట్నా మెడికల్ కాలేజీ అండ్ హస్పటల్‌ని సందర్శించారు. అనంతరం ఆస్పత్రి నుంచి తిరిగి వెళ్తుండగా ఓ వ్యక్తి అశ్విని చౌబేపై ఇంక్ చల్లాడు. అప్రత్తమైన భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఈలోపే ఆ వ్యక్తి అక్కడ నుంచి వెళ్లి పోయాడు. అనంతరం అశ్విని చౌబే మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇది నా మీద జరిగిన దాడి కాదు. ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి. ఆ వ్యక్తి మీడియా మీద ఇంక్ చల్లేందుకు ప్రయత్నించాడు. దాంతో కొంత ఇంక్ నా మీద పడింది. ఈ సంఘటన వెనక ఉన్న నేరస్తులు నేడు రాజకీయ నాయకులుగా ఎదగాలని చూస్తున్నారు. ఈ రోజు వారు ఇంక్ చల్లింది నా మీద కాదు.. ప్రజాస్వామ్యం మీద, జనాల మీద.. ప్రజాస్వామ్య మూల స్తంభం మీద’ అని చెప్పి వెళ్లి తన వాహనంలో కూర్చున్నారు. ఇక అశ్విని చౌబే మీద దాడి చేసిన వ్యక్తిని మాజీ ఎమ్మెల్యే పప్పు యాదవ్ అనుచరుడిగా అనుమానిస్తున్నారు. -
'నిర్లక్ష్యం చేసి మా పిల్లల్ని చంపకండి'
న్యూఢిల్లీ: నిర్లక్ష్యం చేసి తమ పిల్లల చావులకు కారణం కావొద్దని ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి శ్రద్ధ తమ పిల్లలకు వైద్య సేవలు అందించి వారి ప్రాణాలు రక్షించాలని ఢిల్లీ వైద్యులకు విజ్ఞప్తి చేశారు. ప్రమోద్ కుమార్ చౌదరీ అనే వ్యక్తికి ఓ కూతురు ఉండగా ఆమె నాలుగేళ్ల కిందట డెంగ్యూ వ్యాధితో చనిపోయింది. అయితే, వ్యాధికి తగిన మందులు ఇవ్వడంలో వారు నిర్లక్ష్యం చేసి చేజేతులా తన కూతురు చనిపోవడానికి కారణమయ్యారని తెలిసింది. సమాచార హక్కు చట్టం ద్వారా తన కూతురుకు ఎలా వైద్యం చేశారు, ఏమందులు ఇచ్చారు అనే వివరాలను తెలుసుకున్న ఆ తండ్రికి కొన్ని నిజాలు తెలిసి ఆవేదన చెందారు. జబ్బుకు తగిన మందులు ఇవ్వకుండా వేరే మందులు ఇవ్వడం వల్లే తన కూతురు చనిపోయిందని ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ప్రమోద్‌కు తెలిసింది. ప్రస్తుతం ఢిల్లీలో డెంగ్యూ మరణాలు అధికమవుతున్న నేపథ్యంలో వైద్యులు నిర్లక్ష్యం చేయరాదని విజ్ఞప్తి చేశారు. డెంగ్యూ రోగుల విషయంలో వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది జాగ్రతతో, అప్రమత్తతో ఉండి వారి ప్రాణాలు రక్షించాలని వేడుకున్నారు.