denmark open badminton
-
క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ టూర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్‌కు ప్రిక్వార్టర్ ఫైనల్లో పరాజయంపాలయ్యాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ పోరులో సింగపూర్‌కు చెందిన ఏడో సీడ్ లో కీన్ యూ 21–13, 21–15 స్కోరుతో శ్రీకాంత్‌ను ఓడించాడు. 35 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో ఏపీ షట్లర్ శ్రీకాంత్ తగిన పోటీ ఇవ్వడంలో విఫలమయ్యాడు. అయితే మరో భారత ప్లేయర్ లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. ప్రిక్వార్టర్స్‌లో లక్ష్య 21–9, 21–18 స్కోరుతో భారత్‌కే చెందిన హెచ్ఎస్ ప్రణయ్‌ను చిత్తు చేశాడు. గత రెండు మ్యాచ్‌లలో ప్రణయ్ చేతిలో ఓడిన సేన్ ఈ సారి పదునైన ఆటతో చెలరేగి 39 నిమిషాల్లో ప్రత్యర్థి ఆటకట్టించాడు. గాయత్రి–ట్రెసా జోడి ఓటమి... పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జంట క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ప్రిక్వార్టర్స్‌లో ఈ భారత షట్లర్లు 21–14, 2–16తో ఇండోనేసియాకు చెందిన ముహమ్మద్ షోహిబుల్ – బగాస్ మౌలానాలను ఓడించారు. అయితే మహిళల డబుల్స్‌లో భారత జోడి పుల్లెల గాయత్రి గోపీచంద్ – ట్రెసా జాలీకి చుక్కెదురైంది. థాయిలాండ్‌కు చెందిన జొంగొల్ఫాన్ కిటిథారకుల్ – రవీంద ప్రజొంగ్‌జాయ్ ద్వయం 23–21, 21–13 స్కోరుతో గాయత్రి–ట్రెసాపై విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్‌లో భారత్‌కు చెందిన ఇషాన్ భట్నాగర్ – తనీషా క్రాస్టో 16–21, 10–21 తేడాతో యుటా వతనబె – అరిసా హిగాషినో (జపాన్) చేతిలో ఓటమిపాలయ్యారు. చదవండి: World Shooting Championship: భారత షూటర్ల జోరు -
సింధు మళ్లీ చిత్తు
ఒడెన్స్: ప్రపంచ చాంపియన్ పీవీ సింధు మళ్లీ తేలిపోయింది. మరో టోరీ్నలోనూ చిత్తుగానే ఓడిపోయింది. మిగతా భారత షట్లర్లందరూ డెన్మార్క్ ఓపెన్‌లో చేతులెత్తేశారు. దీంతో ఈ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 750 ఈవెంట్లో భారత్ కథ ముగిసింది. మహిళల సింగిల్స్‌లో ఐదో సీడ్‌గా బరిలోకి దిగిన తెలుగుతేజం సింధు రెండో రౌండ్లోనే పరాజయం చవిచూసింది. 40 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో ఆమె 14–21, 17–21తో అన్ సె యంగ్ (కొరియా) చేతిలో ఓడింది.24 ఏళ్ల సింధు ఇక్కడ కూడా తన స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చలేకపోయింది. ఆగస్టులో ప్రపంచ చాంపియన్ అయ్యాక చైనా ఓపెన్‌లో రెండో రౌండ్లో, కొరియా ఓపెన్‌లో అయితే తొలిరౌండ్లోనే ఆమె కంగుతింది. గురువారం భారత ఆటగాళ్లెవరికీ కలిసిరాలేదు. పాల్గొన్న ప్రతీ ఈవెంట్లోనూ అందరికీ చుక్కెదురైంది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో భమిడిపాటి సాయిప్రణీత్ 6–21, 14–21తో టాప్‌సీడ్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో చిత్తుగా ఓడాడు. మరో మ్యాచ్‌లో సమీర్ వర్మ 12–21, 10–21తో ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో ఓటమి పాలయ్యాడు. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి ద్వయం 16–21, 15–21తో ఆరో సీడ్ హన్ చెంగ్ కయ్–జౌ హో డాంగ్ (చైనా) జంట చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీకి కూడా నిరాశ ఎదురైంది. భారత జంట 24–26, 21–13, 11–21తో నాలుగో సీడ్ మలేసియన్ జోడి చన్ పెంగ్ సున్–గొ లియు చేతిలో పరాజయం చవిచూసింది. ఇది వరకే సైనా, శ్రీకాంత్ తొలిరౌండ్లోనే ని్రష్కమించిన సంగతి తెలిసిందే. కెరీర్‌కు లీ జురుయ్ గుడ్‌బై ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా ముద్రపడిన చైనీస్ బ్యాడ్మింటన్ దిగ్గజం లీ జురుయ్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పింది. లండన్ ఒలింపిక్స్ చాంపియన్ అయిన ఆమె గాయం తర్వాత పూర్తిస్థాయిలో కోలుకోలేదు. 2012లో ఆమె ఒలింపిక్స్‌తో పాటు ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లోనూ విజేతగా నిలిచింది. 2013, 2014లలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచి రియో ఒలింపిక్స్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. అక్కడ గాయపడిన ఆమె ఆ తర్వాత కెరీర్‌నే ఇలా ముగించాల్సి వచ్చింది. తన అంతర్జాతీయ కెరీర్లో లీ జురుయ్ 14 సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచింది. 2013లో బీడబ్ల్యూఎఫ్ మహిళా ప్లేయర్ అవార్డును గెలుచుకుంది. -
సైనా, శ్రీకాంత్‌లకు షాక్
ఒడెన్స్: ఈ సీజన్లో భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌లకు మరోసారి నిరాశ ఎదురైంది. డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో ఈ ఇద్దరు మాజీ చాంపియన్స్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఎనిమిదో సీడ్ సైనా 15–21, 21–23తో సయాక తకహాషి (జపాన్) చేతిలో పరాజయం పాలైంది. ఈ ఏడాది తకహాషి చేతిలో సైనా ఓడిపోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. మోకాలి గాయంతో చైనా ఓపెన్, కొరియా ఓపెన్ టోరీ్నల్లో బరిలోకి దిగని శ్రీకాంత్ డెన్మార్క్ ఓపెన్‌లో ఆకట్టుకోలేకపోయాడు. ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 14–21, 18–21తో నాలుగో సీడ్ ఆంటోన్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓటమి చవిచూశాడు. 2017 ప్రపంచ చాంపియన్íÙప్లో ఆంటోన్సెన్పై ఇదే స్కోరుతో శ్రీకాంత్ గెలుపొందడం విశేషం. గత రెండేళ్లలో ఆంటోన్సెన్ ఆటతీరులో ఎంతో పురోగతి కనిపించింది. ఈ ఏడాది ఇండోనేసియా మాస్టర్స్, బార్సిలోనా మాస్టర్స్, యూరోపియన్ గేమ్స్‌లలో స్వర్ణాలు నెగ్గిన ఆంటోన్సెన్ ప్రపంచ చాంపియన్íÙప్లో రన్నరప్‌గా నిలిచాడు. పురుషుల సింగిల్స్ మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో భారత ప్లేయర్ సమీర్ వర్మ 21–11, 21–11తో సునెయామ (జపాన్)పై గెలిచాడు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో నేలకుర్తి సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) జంట 21–16, 21–11తో మారి్వన్ సీడెల్–లిండా ఎఫ్లెర్ (జర్మనీ) జోడీపై నెగ్గింది. రెండో సీడ్ వాంగ్ యి లియు–హువాంగ్ డాంగ్ పింగ్ (చైనా) జోడీకి సాతి్వక్ సాయిరాజ్–అశి్వని పొన్నప్ప జంట వాకోవర్ ఇచి్చంది. -
సింధుకు చుక్కెదురు
ఓడెన్స్: కొన్నాళ్లుగా నిలకడగా రాణిస్తూ... పలు టోర్నీలలో ఫైనల్‌కు చేరుకొని తుది పోరులో తడబడుతోన్న స్టార్ షట్లర్ పీవీ సింధుకు డెన్మార్క్ ఓపెన్‌లో మాత్రం నిరాశ ఎదురైంది. చైనా సంతతికి చెందిన అమెరికా క్రీడాకారిణి బీవెన్ జాంగ్ పోరాట పటిమ ముందు సింధు చేతులెత్తేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 17–21, 21–16, 18–21తో ప్రపంచ పదో ర్యాంకర్ బీవెన్ జాంగ్ చేతిలో ఓడిపోయింది. 55 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో చెరో గేమ్ గెలిచాక... నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు రెండుసార్లు 13–12తో... 15–13తో స్వల్ప ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే బీవెన్ జాంగ్ వెంటనే తేరుకొని వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 17–15తో ముందంజ వేసింది. అదే జోరులో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. బీవెన్ జాంగ్ చేతిలో సింధు ఓడిపోవడం ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం. ఈ ఏడాది ఇండియా ఓపెన్ ఫైనల్లో, 2017 ఇండోనేసియా ఓపెన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోనూ బీవెన్ జాంగ్ చేతిలో సింధుకు పరాజయం ఎదురైంది. వచ్చే వారం పారిస్‌లో మొదలయ్యే ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ తొలి రౌండ్లో బీవెన్ జాంగ్తోనే సింధు తలపడనుంది. గతేడాది అక్టోబరు 18న డెన్మార్క్ ఓపెన్ తొలి రౌండ్లో చెన్ యుఫె (చైనా) చేతిలో ఓడిపోయాక ఈ హైదరాబాద్ అమ్మాయికి మళ్లీ డెన్మార్క్ ఓపెన్లోనే తొలి రౌండ్లో ఓటమి ఎదురైంది. అయితే ఈ ఏడాది కాలంలో సింధు హాంకాంగ్ ఓపెన్, వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్, ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్, థాయ్‌లాండ్ ఓపెన్, కామన్వెల్త్ గేమ్స్, ఇండియా ఓపెన్లలో ఫైనల్లోకి చేరి రన్నరప్‌గా నిలిచింది. మరోవైపు మాజీ నంబర్‌వన్ సైనా నెహ్వాల్ హోరాహోరీ పోరులో గెలిచి ఊపిరి పీల్చుకుంది. ప్రపంచ 24వ ర్యాంకర్ యి ఎన్గాన్ చెయుంగ్ (హాంకాంగ్)తో 81 నిమిషాలపాటు జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో సైనా 20–22, 21–17, 24–22తో విజయం సాధించింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సైనా 20–21తో, 21–22తో రెండుసార్లు పరాజయం అంచున నిలిచింది. అయితే కీలకదశలో ఒత్తిడికి లోనుకాకుండా పాయింట్లు సాధించి గట్టెక్కింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)తో సైనా తలపడుతుంది. సమీర్ సంచలనం పురుషుల సింగిల్స్ విభాగంలో సమీర్ వర్మ సంచలనం సృష్టించాడు. ప్రపంచ రెండో ర్యాంకర్ షు యుకి (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 23వ ర్యాంకర్ సమీర్ వర్మ 21–17, 21–18తో గెలుపొందాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి–మను అత్రి 23–25, 21–18, 16–21తో కిమ్ యాస్‌ట్రప్–ఆండెర్స్ (డెన్మార్క్) చేతిలో... మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్–అశ్విని పొన్నప్ప 17–21, 18–21తో సియో సెయుంగ్ జే–కాంగ్ హీ యోంగ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయారు. -
ఫైనల్లో సింధుకు నిరాశ
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్ పోరులో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు ఓటమి చవిచూసి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో సింధు 19-21, 12-21 స్కోరుతో నాలుగో సీడ్ లీ జ్యురుయ్ (చైనా) చేతిలో ఓడిపోయింది. కెరీర్లో తొలిసారి సూపర్ సిరీస్ స్థాయి టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లిన సింధుకు టైటిల్ కల ఫలించలేదు. కాగా ఈ ఈవెంట్లో సింధు అద్భుత ప్రదర్శన చేసింది.