Derivatives Contract
-
పరిమిత శ్రేణిలో ట్రేడింగ్!
ముంబై: ఈ ఏడాది చివరి వారం స్టాక్ సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేసే పరిణామాలేవీ లేకపోవడంతో పాటు ఆయా దేశాల స్టాక్ మార్కెట్లు పనిచేయకపోవడం ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్ కేసుల పెరుగుదల, డిసెంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు అంశాలతో అప్రమత్తత చోటు చేసుకోవచ్చని చెబుతున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులపై ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించనున్నాయి. ‘‘రక్షణాత్మక రంగాలైన ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా షేర్లు రాణించడంతో గత వారంలో సాంకేతికంగా నిఫ్టీ 17,000 స్థాయిని నిలుపుకుంది. మార్కెట్ కరెక్షన్ కొనసాగితే దిగువ స్థాయిలో 16,700 వద్ద తక్షణ మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే 16,650 వద్ద మద్దతు లభించవచ్చు. ఒకవేళ దిగువ స్థాయిలో కొనుగోళ్ల మద్దతు లభిస్తే 17,150–17,200 శ్రేణిని పరీక్షించవచ్చు’’ అని స్వస్తిక్ ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. గతవారం సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనైనా.., రక్షణాత్మక రంగాలకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ 113 పాయింట్లు, నిఫ్టీ 18 పాయింట్లు స్వల్ప లాభంతో గట్టెక్కాయి. ఒమిక్రాన్ వ్యాప్తి ప్రభావం ఒమిక్రాన్ వేరియంట్ కట్టడికి ప్రభుత్వాలు విధిస్తున్న ఆంక్షలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. దేశంలో శనివారం నాటికి 150 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌తో సహా రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూలను అమలు చేస్తున్నాయి. వైరస్ కట్టడికి అనేక పలు దేశాల ప్రభుత్వాలు ప్రయాణాలపై ఆంక్షలను, కర్ఫ్యూలను విధిస్తుండటం వల్ల ఆర్థిక రివకరీకి ప్రతికూలం కావచ్చనే భయాలు వెంటాడుతున్నాయి. కేసుల సంఖ్య మరింత పెరగవచ్చనే ఆందోళనలతో ట్రేడర్లు తమ పొజిషన్లను పరిమితం చేసుకుంటున్నారు. గురువారం ఎఫ్అండ్ఓ ముగింపు ఈ గురువారం(ఈ నెల 30న) నిఫ్టీ సూచీకి చెందిన డిసెంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తన పొజిషన్లను స్క్వేయర్ ఆఫ్‌కు ఆసక్తి చూపుతుండటంతో స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు దేశీయ మార్కెట్లో మూడు నెలల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతున్నాయి. ఈ డిసెంబర్లో ఇప్పటి వరకు రూ.17,825 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఏడాది ముగింపు వారంలో అమ్మకాల తీవ్రత తక్కువగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మార్కెట్లో అస్థితరత తగ్గితే ఎఫ్ఐఐల విక్రయాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటున్నారు. సూక్ష్మ ఆర్థిక గణాంకాలు నవంబర్ నెల ద్రవ్యలోటు, మౌలిక రంగ ఉత్పత్తి గణాంకాలతో పాటు సెప్టెంబర్ క్వార్టర్‌కు సంబంధించిన కరెంట్ అకౌంట్ లెక్కలు శుక్రవారం విడుదల కానున్నాయి. అదేరోజున డిసెంబర్ 17తో ముగిసిన వారం డిపాజిట్, బ్యాంక్ రుణ వృద్ధి, డిసెంబర్ 24తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలను గణాంకాలను ఆర్బీఐ విడుదల చేయనుంది. మూడు లిస్టింగ్‌లు ఇటీవల ప్రాథమిక మార్కెట్ నుంచి నిధులు సమీకరించిన మూడు కంపెనీల షేర్లు ఈ వారంలో లిస్ట్ కానున్నాయి. హెచ్‌పీ అడెసివ్స్ షేర్లు సోమవారం(27న).., సుప్రియ లైఫ్‌సైన్సెన్స్ షేర్లు మంగళవారం(28న), సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ షేర్లు ఏడాది చివరిరోజున(డిసెంబర్ 31న) లిస్ట్‌కానున్నాయి. ఈ అంశమూ ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చు. -
ఒడిదుడుకుల వారం
ఈవారంలోనే డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు • సెలవుల కారణంగా స్వల్పంగా విదేశీ ఇన్వెస్టర్ల లావాదేవీలు • రేంజ్‌బౌండ్‌లోనే స్టాక్ సూచీలు • నిపుణుల అంచనాలు న్యూఢిల్లీ: డిసెంబర్ సిరీస్ డెరివేటివ్ కాంట్రాక్టులు ఈ వారమే ముగియనున్నందున ఈ వారం స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులమయంగా ఉంటుందని నిపుణుల అంచనా. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల పోకడలు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల గమనం, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల పోకడలు, జీఎస్టీకి అవరోధాలు తొలగించడానికి ప్రభుత్వం తీసుకునే చర్యలు...తదితర అంశాల ప్రభావం కూడా స్టాక్ మార్కెట్‌పై ఉంటుందని వారంటున్నారు. కొంత రికవరీ. అంతర్జాతీయంగా, దేశీయంగా ప్రధాన ఆర్థిక సంఘటనలేమీ లేకపోవడం వల్ల స్టాక్ మార్కెట్ స్వల్పకదలికలకే పరిమితం కానున్నదని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. ఈ నెల 31 తర్వాత నగదు కొరత కొంత తగ్గే అవకాశాలున్నాయని, అందుకని స్వల్పకాలంలో ఈక్విటీ మార్కెట్లు రికవరీ కావచ్చని కొందరు నిపుణులు భావిస్తున్నారు. కొత్త సంవత్సర సెలవుల సందర్భంగా విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడి ఒకింత తగ్గవచ్చని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డైరెక్టర్ అభ్నిష్ కుమార్ సుధాంశు అంచనా వేస్తున్నారు. అమెరికా నిరుద్యోగ గణాంకాలు, ముడిచమురు నిల్వల గణాంకాలు ఈ వారమే విడుదలవుతాయని, ఈ గణాంకాలు మన మార్కెట్ గమనానికి కీలకం కానున్నాయని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ సీఈఓ రోహిత్ గాడియా పేర్కొన్నారు. ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలకమైన 8,000 పాయింట్ల పైకి రావడానికి కష్టపడుతోందని, 8,000 పాయింట్లను మించలేకపోతే, మరింత పతనం తప్పదని పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే ఇన్వెస్టర్లు ట్రేడింగ్‌కు ఒకింత దూరంగా ఉండడమే మంచిదని ఏంజెల్ బ్రోకింగ్ సంస్థ పేర్కొంది. షార్ట్ కవరింగ్.. సంవత్సరాంతం సందర్బంగా మిడ్‌క్యాప్ షేర్లలో కదలికలు ఉంటాయని కోటక్ సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపేన్ షా పేర్కొన్నారు. స్వల్పకాలంలో కొంత స్తబ్దత ఉన్నా, మధ్య కాలానికి, దీర్ఘకాలానికి భారత స్టాక్ మార్కెట్ ఆశావహంగానే ఉందని ఎస్ఎంసీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అడ్వైజర్స్ సీఎండీ డి.కె. అగర్వాల్ చెప్పారు. అందుకని దీర్ఘకాలం లక్ష్యంగా ఇన్వెస్ట్‌చేసే ఇన్వెస్టర్లు భవిష్యత్తులో మంచి వృద్ధి సాధించే రంగాల్లోని కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయవచ్చని ఆయన సూచిస్తున్నారు. దిగువ స్థాయిల్లో షార్ట్ కవరింగ్ కారణంగా స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు ఉంటాయని ట్రేడ్‌బుల్స్ సీఓఓ ధ్రువ్ దేశాయ్ చెప్పారు. జోరుగా ‘విదేశీ’ నిధులు వెనక్కి... అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో మన క్యాపిటల్ మార్కెట్‌నుంచి 350 కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. వీటిల్లో అధిక భాగం డెట్‌మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్న పెట్టుబడులు ఉన్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పటిదాకా ఈ నెలలో ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.3,744 కోట్లు, డెట్ మార్కెట్‌నుంచి రూ.19,027 కోట్ల చొప్పున తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. వెరశి ఈ నెలలో మన క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు రూ.22,771 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. కాగా ఈ ఏడాది ఇప్పటిదాకా విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో నికరంగా రూ.24,998 కోట్లు పెట్టుబడులు పెట్టగా, డెట్ మార్కెట్ నుంచి రూ.43,737 కోట్లు వెనక్కి తీసుకున్నాయి. -
ఒడిదుడుకుల వారం..
డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు ప్రభావం వచ్చే నెల 5న ఆర్బీఐ పాలసీ సమీక్ష రేట్ల కోతపై అంచనాలు న్యూఢిల్లీ: మార్చి డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు వారమైనందున ఈ వారం స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు తప్పవని నిపుణులంటున్నారు. హోలి, గుడ్ ప్రైడే కారణంగా గత వారంలో గురు, శుక్రవారాలు స్టాక్ మార్కెట్‌కు సెలవు. ఈ దీర్ఘకాల సెలవుల అనంతరం ప్రారంభం కానున్న ఈ వారం స్టాక్ మార్కెట్‌పై అంతర్జాతీయ సంకేతాలు, ముడి చమురు ధరల గమనం, రూపాయి కదలికలు తదితర అంశాలు కూడా ప్రభావం చూపుతాయని విశ్లేషకులంటున్నారు. ఈ నెల విక్రయాల గణాంకాలను ఈ శుక్రవారం(ఏప్రిల్ 1న) వాహన కంపెనీలు వెల్లడించనున్నందున ఆ కంపెనీ షేర్లు వెలుగులోకి రావచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి వారం కూడా ఇదే. మరోవైపు మార్చి డెరివేటివ్స్ కాంట్రాక్టులు ఈ వారంలో గురువారం నాడు(మార్చి 31న) ముగియనున్నందున ట్రేడర్లు తమ పొజిషన్లను రోల్ ఓవర్ చేయనున్న నేపధ్యంలో స్టాక్ సూచీలు ఒడిదుడుకులకు గురవుతాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. రేట్ల కోత కీలకం.. వచ్చే నెల 5న జరగనున్న ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష.. సమీప కాలంలో స్టాక్ మార్కెట్‌కు కీలకం కానున్నదని సింఘానియా పేర్కొన్నారు. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ల పోకడలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, రూపాయి కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు... స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ సీఈఓ రోహిత్ గాడియా చెప్పారు. ఆర్బీఐ ద్రవ్య సమీక్షపైననే తర్వాతి దశ స్టాక్ మార్కెట్ ర్యాలీ ఆధారపడి ఉందని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(ఫండమెంటల్ రీసెర్చ్)వినోద్ నాయర్ చెప్పారు. ఈ సమీక్షలో సానుకూల నిర్ణయం వెలువడితే స్టాక్ మార్కెట్ మరింత దూసుకుపోతుందని పేర్కొన్నారు. పరిమితశ్రేణిలో ట్రేడింగ్.. ఈ వారంలో స్టాక్ మార్కెట్ పరిమితశ్రేణిలో ట్రేడవుతుందని జైఫిన్ అడ్వైజర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దేవేంద్ర నేవ్‌గి చెప్పారు. వచ్చే నెల రెండో వారం నుంచి ప్రారంభమయ్యే కంపెనీల ఆర్థిక ఫలితాల కోసం మార్కెట్ ఆసక్తిగా ఎదురు చూస్తోందని వివరించారు. చిన్న మొత్తాల పొదుపుపై వడ్డీరేట్లను తగ్గించినందున ఆర్బీఐ కీలక రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందన్న అంచనాలు సర్వత్రా నెలకొన్నాయని పేర్కొన్నారు. సుదీర్ఘ సెలవుల అనంతరం మార్కెట్ ప్రారంభమవుతోందని, తాజాగా పొజిషన్లు తీసుకోవడం ద్వారా ట్రేడర్లు.. స్టాక్ మార్కెట్ పెరిగితే లాభపడతారని మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (మిడ్‌క్యాప్స్ రీసెర్చ్) రవి షెనాయ్ చెప్పారు. డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా మార్కెట్ మరింత బలహీనపడవచ్చని ఏంజెల్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్(రీసెర్చ్) వైభవ్ అగర్వాల్ చెప్పారు. ఆర్బీఐ రేట్ల కోత, కంపెనీల ఆర్థిక ఫలితాలపై అంచనాలు మార్కెట్ పెరగడానికి దోహద పడవచ్చని పేర్కొన్నారు. ఒడిదుడుకులున్నప్పటికీ, స్టాక్ సూచీలు తమ జోరును కొనసాగిస్తాయని యెస్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ నిటాషా శంకర్ చెప్పారు. వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచే అవకాశాలున్నాయని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(టెక్నికల్ రీసెర్చ్) ఆనంద్ జేమ్స్ చెప్పారు. ఈ ప్రభావం ప్రపంచ మార్కెట్లపై తీవ్రంగానే ఉంటుందని వివరించారు. భారత్‌తో సహా అన్ని వర్ధమాన దేశాలకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు కీలకం కానున్నదని వివరించారు. మూడు రోజులే ట్రేడింగ్ జరిగిన గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 385 పాయింట్లు (1.54 శాతం)లాభపడి 25,338 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 112 పాయింట్లు(1.47 శాతం) లాభపడి 7,717 పాయింట్ల వద్ద ముగిశాయి. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు కొనసాగుతోంది. ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు క్యాపిటల్ మార్కెట్లో రూ.16,500 కోట్లు (250 కోట్ల డాలర్లు) పెట్టుబడులు పెట్టారు. ఆర్బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు దీనికి ప్రధాన కారణం. డిపాజిటరీల గణాంకాల ప్రకారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ)ఈ నెల 23 వరకూ ఈక్విటీ మార్కెట్లో రూ.15,660 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.816 కోట్లు పెట్టుబడుటు పెట్టారు. అంతకు ముందటి నాలుగు నెలల్లో విదేశీ ఇన్వెస్టర్లు రూ.41,661 కోట్ల పెట్టుబడులు స్టాక్ మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. -
ఒడిదుడుకుల వారం
{పపంచ మార్కెట్లు, డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు కారణాలు మార్కెట్ ట్రెండ్‌పై నిపుణుల అంచనా ముంబై : బలహీనంగా వున్న ప్రపంచ మార్కెట్లు, త్వరలో ముగియనున్న ఆగస్టు డెరివేటివ్స్ కాంట్రాక్టుల కారణంగా ఈ వారం భారత్ ఈక్విటీలు ఒడిదుడుకులకు లోనవుతాయని విశ్లేషకులు అంచనావేశారు. చైనా వృద్ధి మందగించిందన్న భయాలతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు గతవారం భారీగా తగ్గాయి. శుక్రవారం అమెరికా మార్కెట్ సైతం అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. ఈ ప్రభావం మన మార్కెట్‌పై కూడా వుంటుందని నిపుణులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ కాంట్రాక్టులు వచ్చే గురువారం ముగియనున్నందున, భారత్ సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని జియోజిత్ బీఎన్పీ పారిబాస్ టెక్నికల్ హెడ్ ఆనంద్ జేమ్స్ చెప్పారు. ఇదే సమయంలో రూపాయి పతనం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీయవచ్చని జైఫిన్ అడ్వయిజర్స్ దేవేంద్ర నావ్గి అన్నారు. గతవారం డాలరుతో రూపాయి విలువ రెండేళ్ల కనిష్టస్థాయి 65.83 వద్దకు పడిపోయిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం తగ్గిన కారణంగా రిజర్వుబ్యాంక్ వడ్డీరేట్లను తగ్గింవచ్చన్న అంచనాలు మార్కెట్‌కు ఊతమివ్వవచ్చని జేమ్స్ వివరించారు. అలాగే కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్)పై విదేశీ ఇన్వెస్టర్లకు ఊరట లభించడం మార్కెట్‌కు సానుకూలమని అన్నారు. గత వారం మార్కెట్.... గతవారం బీఎస్ఈ సెన్సెక్స్ 701 పాయింట్లు పతనమై 27,366 పాయింట్ల వద్ద ముగిసింది. వివిధ దేశాల కరెన్సీలు కుప్పకూలడంతో ప్రపంచవ్యాప్తంగా గతవారం మార్కెట్లు క్షీణించాయి. -
తీవ్ర హెచ్చుతగ్గులు!
ఫ్యూచర్స్, ఆప్షన్స్ కాంట్రాక్టుల ముగింపు ప్రభావం ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అంచనా న్యూఢిల్లీ : జూలై డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా ఈ వారం స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనవుతుందని విశ్లేషకులు హెచ్చరించారు. ఫ్యూచర్స్, ఆప్షన్స్ జూలై కాంట్రాక్టులు వచ్చే గురువారం ముగియనున్నాయి. ఈ సందర్భంగా మార్కెట్లో ఒడిదుడుకులుంటాయని, ఈక్విటీలు పటిష్టపడేందుకు అవసరమైన మద్దతును ఇచ్చే అంశమేదీ లేదని క్యాపిటల్‌వయా డెరైక్టర్ వివేక్ గుప్తా చెప్పారు. పార్లమెంటు సమావేశాల్లో సంస్కరణల బిల్లులు ఆమోదం పొందుతాయని లేదా క్యూ1 కార్పొరేట్ ఫలితాలు ఉత్సాహపరుస్తాయన్న ఆశలు ఇన్వెస్టర్లలో వున్నాయని, కానీ ఇప్పుడు మార్కెట్లో విశ్వాసం కొరవడిందని జీయోజిత్ బీఎన్పీ పారిబాస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. కొద్దికాలం దిద్దుబాటు... సంస్కరణలకు ప్రతీ స్థాయిలోనూ అడ్డంకులు ఏర్పడుతున్నందున, ఆర్థిక వ్యవస్థ వృద్ధి అవకాశాల పట్ల ఇన్వెస్టర్లకు సందేహాలు తలెత్తుతున్నాయని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అన్నారు. ఈ కారణంగా కొద్దికాలం మార్కెట్ దిద్దుబాటు బాటలో వుండవచ్చని, విస్తృత శ్రేణిలో సూచీలు కదలవచ్చని అంచనావేశారు. వర్షపాతం మెరుగ్గాఉంటుందన్న ఆశాభావం ఇన్వెస్టర్లలో ఉందని, వర్షాలు బావుంటే ఆగస్టు 4నాటి ఆర్బీఐ పాలసీ సమీక్షలో రేట్ల కోత వుండవచ్చని ఆయన చెప్పారు. ఈ వారం కార్పొరేట్ ఫలితాలు... ఈ వారం ఐటీసీ, మారుతి సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, టెక్ మహీంద్రా, పీఎన్బీ, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ తదితర బ్లూచిప్ కంపెనీలు ఆర్థిక ఫలితాల్ని వెల్లడించనున్నాయి. ఈ ఫలితాలు మార్కెట్ గమనాన్ని కొంతవరకూ నిర్దేశింప వచ్చని నిపుణులు చెప్పారు. గత శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత వెల్లడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫలితాల ప్రభావం సోమవారం మార్కెట్ ప్రారంభంలో కన్పిస్తుందని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమిత్ మోదీ తెలిపారు. రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ మార్జిన్లు పెరగడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాండెలోన్ నికరలాభం రూ. 6,318 కోట్లకు ఎగిసింది. గతవారం మార్కెట్... గతవారం అంతర్జాతీయ మార్కెట్లలో ట్రెండ్‌కు అనుగుణంగా బీఎస్ఈ సెన్సెక్స్ 351 పాయింట్లు నష్టపోయి, 28,112 పాయింట్ల వద్ద ముగిసింది. ఫలితాల వెల్లడి తర్వాత ఇన్ఫోసిస్ భారీగా పెరగడంతో సెన్సెక్స్ నష్టాలు పరిమితంగా వున్నాయి. బ్యాంకులు, మెటల్, రియల్టీ షేర్లు నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు రూ. 8,400 కోట్లు జూలై నెలలో ఇప్పటివరకూ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారత క్యాపిటల్ మార్కెట్లో రూ. 8,400 కోట్లు పెట్టుబడి చేశారు. ఈక్విటీల్లో రూ. 7,261 కోట్లు, రుణపత్రాల్లో రూ. 1,154 కోట్ల చొప్పున వారు నికర పెట్టుబడి చేసినట్లు సెంట్రల్ డిపాజిటరీల డేటా వెల్లడిస్తున్నది. -
సెన్సెక్స్ 170 పాయింట్ల పతనం
► కొనసాగుతున్న లాభాల స్వీకరణ ► 27,226 పాయింట్లకు సెన్సెక్స్ ► 46 పాయింట్ల నష్టంతో 8,240కు నిఫ్టీ రోజంతా ఒడిదుడుకులమయంగా సాగిన బుధవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ చివరకు నష్టాల్లో ముగిసింది. ఈ నెల డెరివేటివ్స్ కాంట్రాక్ట్ ముగింపు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం ఫలితాలు కూడా గురువారం రాత్రి వెల్లడి కానుండడంతో ఇన్వెస్టర్లు బుధవారం ఆచి తూచి వ్యవహరించారు. హెచ్డీఎఫ్సీ, ఎయిర్టెల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో బీఎస్ఈ సెన్సెక్స్ 170 పాయింట్లు నష్టపోయి 27,226 పాయింట్ల వద్ద, నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో 8,240 వద్ద ముగిశాయి. ఎఫ్ఐఐలకు సంబంధించి కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్)పై ఆందోళనలు, ఉత్తేజపరచని కంపెనీల క్యూ4 ఆర్థిక ఫలితాలు, భూ సేకరణ బిల్లులో జాప్యం తదితర కారణాల వల్ల లాభాల స్వీకరణ కొనసాగుతోందని జియోజిత్ బీఎన్పీ పారిబస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(ఫండమెంటల్ రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. ఎఫ్ఎంసీజీ, వాహన, లోహ, రిఫైనరీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తగా, రియల్టీ, కన్సూమర్ డ్యూరబుల్, ఫార్మా, ఐటీ, బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. సెన్సెక్స్ 27,396 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత 27,177 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. తదుపరి ఎంపిక చేసిన బ్లూ చిప్ షేర్లలో షార్ట్ కవరింగ్ కారణంగా ఇంట్రాడేలో గరిష్ట స్థాయి, 27,439 పాయింట్లకు ఎగసింది. చివరలో అమ్మకాల ఒత్తిడితో 170 పాయింట్ల నష్టంతో 27,226 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 8,219, 8,308 కనిష్ట, గరిష్ట స్థాయిల మధ్య కదలాడి చివరకు 46 పాయింట్ల నష్టంతో 8,240 వద్ద ముగిసింది. 30 సెన్సెక్స్ షేర్లలో 23 షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. లాభనష్టాలు.. క్యూ 4 ఫలితాలు ఆశించిన విధంగా లేకపోవడం భారతీ ఎయిర్టెల్ షేర్ 3.3 శాతం క్షీణించి వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో అత్యధికంగా నష్టపోయిన షేర్ ఇదే. ఇక హెచ్డీఎఫ్సీ ఫలితాలు కూడా అంతంతమాత్రంగానే ఉండటంతో ఈ షేర్ 2.11 శాతం పడిపోయింది. ఐటీసీ 2.7 శాతం, వేదాంత 2.1 శాతం, టాటా మోటార్స్ 1.8 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.5 శాతం, మారుతీ 1.4 శాతం, డాక్టర్ రెడ్డీస్ 1 శాతం చొప్పున తగ్గాయి. ఇక పెరిగిన షేర్ల విషయానికొస్తే యాక్సిస్ బ్యాంక్ 3.3 శాతం, గెయిల్ 2 శాతం, విప్రో 1.8 శాతం, సన్ ఫార్మా 1.6 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1 శాతం చొప్పున పెరిగాయి. 1,182 షేర్లు నష్టాల్లో, 1,524 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్.. టర్నోవర్ బీఎస్ఈలో రూ.2,964 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.16,802 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.4,63,657 కోట్లుగా నమోదైంది. -
10 వారాల కనిష్ట స్థాయి
ఆరో రోజూ నష్టాలే 50 పాయింట్ల నష్టంతో 28,112కు సెన్సెక్స్ 12 పాయింట్ల నష్టంతో 8,531కు నిఫ్టీ మార్కెట్ అప్డేట్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు మరో ఒక్క రోజు ఉన్న నేపథ్యంలో బుధవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే ముగిసింది. క్యాపిటల్ గూడ్స్, విద్యుత్, లోహ షేర్లకు నష్టాలు విస్తరించడంతో వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్లోనూ స్టాక్ మార్కెట్ సూచీలు క్షీణపధంలోనే సాగాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. మొత్తం మీద బీఎస్ఈ సెన్సెక్స్ 50 పాయింట్లు నష్టపోయి 28,112 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది పదివారాల కనిష్ట స్థాయి. తీవ్రమైన ఒడిదుడుకులు రిటైల్ ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగిస్తుండటంతో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ షేర్లూ నష్టాల్లోనే ముగిశాయి. మార్చి కాంట్రాక్టులు గురువారంతో ముగుస్తుండటంతో ట్రేడర్లు త పొజిషన్లను ఏప్రిల్ సిరీస్‌కు క్యారీ ఫార్వార్డ్ చేస్తున్నారు. దీంతో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ మందకొడిగా సాగిందని నిపుణులంటున్నారు. లాభాల్లోనే ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్ 28,250-28,031 గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య కదలాడి చివరకు 50 పాయింట్ల నష్టంతో 28,112 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తం ఆరు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 625 పాయింట్లు(2.17 శాతం) నష్టపోయింది. ఇక నిఫ్టీ బుధవారం నాటి ట్రేడింగ్‌లో 12 పాయింట్లు నష్టపోయి 8,531 పాయింట్ల వద్ద ముగిసింది. 12.5 శాతం తగ్గిన ఇప్కా ల్యాబ్స్ విలీన ప్రక్రియ పూర్తికావడంతో సన్ ఫార్మా 1.3 శాతం, ర్యాన్‌బాక్సీ 1.6 శాతం చొప్పున లాభపడ్డాయి. ప్రతి 10 ర్యాన్‌బాక్సీ షేర్లకు 8 సన్ ఫార్మా షేర్లు లభిస్తాయి. త్వరలో ర్యాన్‌బాక్సీని స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ చేయనున్నారు. పీతంపూర్, సిల్వెసా ప్లాంట్లకు అమెరికా ఎఫ్‌డీఏ ఇంపోర్ట్ అలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఇప్కా ల్యాబ్స్ షేర్ 12.5 శాతం తగ్గింది. మౌలిక, లోహ, మైనింగ్, ఆయిల్, గ్యాస్ రంగాల్లోని భారత కంపెనీలు భారీ రుణ ఊబిలోకి కూరుకుపోయాయని స్టాండర్డ్ అండ్ పూర్స్ రేటింగ్స్ సర్వీసెస్ వెల్లడించడంతో ఈ రంగాల్లోని షేర్లు డీలా పడ్డాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.4,406 కోట్లుగా, ఎన్ఎస్ఈలో రూ.16,401 కోట్లుగా, డెరివేటివ్స్ విభాగంలో రూ.3,57,911 కోట్లుగా నమోదైంది. మోసాల వివరాలు వెల్లడించాలి: సెబీ లిస్టెడ్ కంపెనీల్లో మోసాలు, ఆర్థిక అవకతవకలు, వాటి వెల్లడి గురించిన నియమని బంధనలను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కఠినతరం చేసింది. ఇన్వెస్టర్ల ప్రయోజనాలు లక్ష్యంగా ఈ చర్య తీసుకుంది. డిస్క్లోజర్ నిబంధనలను మరింత పటిష్టం చేసే చర్యల్లో భాగంగా సెబీ ఈ కొత్త నిబంధనలను రూపొందించింది. కొత్త నిబంధనల ప్రకారం, ఏదైనా కంపెనీలో మోసం జరిగిందని వెల్లడైనప్పుడు, ఏదైనా ఆర్థిక అవకతవకలు వెలుగులోకి వచ్చినప్పుడు, కీలకమైన వ్యక్తులు అరెస్టయినప్పుడు. ఆ వివరాలను, వాటికి గల కారణాలను, వాటి ప్రభావాన్ని కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజ్లకు తెలపాల్సి ఉంటుంది. -
డెరివేటివ్స్, ఆర్బీఐ ఎఫెక్ట్!
న్యూఢిల్లీ: ఓవైపు డెరివేటివ్ కాంట్రాక్ట్‌ల ముగింపు, మరోవైపు రెపో రేటు పెంపు కారణంగా ఈ వారం స్టాక్ మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశమున్నదని విశ్లేషకులు పేర్కొన్నారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ)లో సెప్టెంబర్ నెలకు డెరివేటివ్ కాంట్రాక్ట్‌ల గడువు గురువారం(26న) ముగియనుంది. ఇక గడిచిన శుక్రవారం(20న) రిజర్వ్ బ్యాంక్ కొత్త గవర్నర్ రఘురామ్ రాజన్ అనూహ్య రీతిలో రెపో రేటును 0.25%మేర పెంచిన సంగతి తెలిసిందే. ఈ రెండు అంశాల నేపథ్యంలో ఈ వారం స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులను చవిచూడవచ్చునని అభిప్రాయపడ్డారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ యథాతథ కొనసాగింపు వార్తలతో ఏర్పడ్డ బుల్లిష్ సెంటిమెంట్‌ను రాజన్ చేపట్టిన రెపో పెంపు నిర్ణయం దెబ్బకొట్టిందని చెప్పారు. ఇటీవల అదుపు తప్పుతున్న టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణాన్ని(డబ్ల్యూపీఐ) కట్టడిలో ఉంచేందుకు రిజర్వ్ బ్యాంక్ తాజా పాలసీ సమీక్షలో రెపో రేటును 7.25% నుంచి 7.5%కు పెంచింది. ఆగస్ట్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం 9.52%కు చేరగా, డబ్ల్యూపీఐ 6%ను అధిగమించడంతో మార్కెట్ అంచనాలకు విరుద్ధంగా రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు పెంపునకు ప్రాధాన్యత ఇచ్చింది. అయితే రూపాయికి బలాన్నిచ్చేందుకు వీలుగా కఠిన లిక్విడిటీ విధానాలను కొంతమేర సరళీకరించింది. కాగా, ఆర్బీఐ పాలసీ నేపథ్యంలో శుక్రవారం సెన్సెక్స్ 383 పాయింట్లు పతనమైంది. అయితే అంతకుముందు ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న యథాతథ పాలసీ నిర్ణయాలతో 684 పాయింట్లు జంప్ చేసింది. నెలకు 8,500 కోట్ల డాలర్లతో అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీలను కొనసాగించేందుకు నిర్ణయించడం ద్వారా ఫెడరల్ రిజర్వ్... పరోక్షంగా రిజర్వ్ బ్యాంక్‌ను మేలు చేసిందని కాప్రి గ్లోబల్ క్యాపిటల్ ఎండీ పీహెచ్ రవికుమార్ వ్యాఖ్యానించారు. తద్వారా కనీసం మూడు నెలలపాటు దేశీయ విధాన కర్తలకు కీలక నిర్ణయాలలో వెసులుబాటును తీసుకునే అవకాశాన్ని కల్పించిందని పేర్కొన్నారు. కన్సాలిడేషన్ దిశలో...: ఫెడరల్ రిజర్వ్, ఆర్బీఐ నిర్ణయాలు వెలుడటంతోపాటు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్ ముగింపు నేపథ్యంలో ఈ వారం మార్కెట్లు భారీ హెచ్చుతగ్గులకు లోనవుతాయని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ పేర్కొన్నారు. సమీప కాలంలో నిఫ్టీ 5,800-6,150 పాయింట్ల మధ్య స్థిరీకరణ(కన్సాలిడేషన్) చెందే అవకాశమున్నదని చెప్పారు. తద్వారా రానున్న కాలంలో ఏదైనా ఒక ట్రెండ్‌లో సాగేందుకు అవసరమైన బేస్‌ను ఏర్పరచుకుంటుందని అంచనా వేశారు. విదేశీ పెట్టుబడులపై చూపు దేశీయ స్టాక్ మార్కెట్లు విదేశీ పెట్టుబడులపై అత్యధికంగా దృష్టిసారిస్తాయని నిపుణులు పేర్కొన్నారు. వీటితోపాటు అంతర్జాతీయ పరిస్థితులను సైతం పరిగణనలోకి తీసుకుంటాయని తెలిపారు. ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) రూ. 11,000 కోట్లను(170 కోట్ల డాలర్లు) మన మార్కెట్లలో ఇన్వెస్ట్చేయడం గమనార్హం.