Deva Gouda
-
రాజ్యసభ బరిలోకి మాజీ ప్రధాని దేవెగౌడ
-
కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్: బరిలో మాజీ ప్రధాని
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో జరిగే రాజ్యసభ ఎన్నికల బరిలో మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ (87) నిలుస్తున్నారని జేడీఎస్ ప్రకటించింది. పార్టీ ఎమ్మెల్యేలతో సహా, మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీ పెద్దల విజ్ఞప్తి మేరకు పోటీ చేస్తున్నారని తెలిపింది. ఈ మేరకు జేడీఎస్ చీఫ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ట్విటర్ వేదికగా సోమవారం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతులో రాజ్యసభ పోరులో దిగనున్నారని తెలిపారు. మంగళవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారని పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలకు ఈనెల 19న పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. (ఉత్కంఠగా రాజ్యసభ పోరు) మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో ఒక్కో సభ్యుడిని గెలిపించుకునేందుకు 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కానుంది. ప్రస్తుతం జేడీఎస్‌కు 34 మంది సభ్యుల మద్దతు ఉంది. తమ అభ్యర్థిని గెలిచేందుకు మరో 10 స్థానాలకు దూరంగా ఉంది. ఇక సభలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు 68 మంది సభ్యులు ఉన్నారు. ఓ సభ్యుని గెలిపించుని, మిగిలిన వారిని దేవెగౌడ్కు మద్దతు తెలిపేలా ఇరుపార్టీల నేతలు సంప్రదింపులు జరిపారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే దేవెగౌడ మరోసారి రాజ్యసభలో అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. తొలిసారి ఆయన 1996లో పెద్దల సభకు ఎన్నికయ్యారు. (రిసార్ట్‌కు గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు) కాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గేను అధిష్టానం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇక అధికార బీజేపీకి సభలో 117 మంది సభ్యులు మద్దతుతో సునాయాసంగా ఇద్దరు సభ్యులను గెలిపించుకునే సంఖ్యా బలం ఉంది. ఈ రెండు స్థానాల కోసం విపరీతమైన పోటీ నడుమ బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది. పార్టీ సీనియర్ నేతలు అశోక్ గస్తీ, ఎరన్న కాదడిలను రాజ్యసభ అభ్యర్థులకు ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సోమవారం ప్రకటించారు. మరోవైపు నాలుగు స్థానాలకు జరిగే ఎన్నికలకు మంగళవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈనెల 10న నామినేషన్ల పరిశీలన, 12 వరకు ఉపసంహరణ గడువు ఉంది. -
ఫేజ్ 2 @96 కూటముల కోలాటం
ఏడు దశల పోలింగ్‌లో రెండో దశ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. తొలి ఘట్టంలో 91 స్థానాలకు పోలింగ్ జరగ్గా.. రెండో దశలో అంత కంటే కొంచెం ఎక్కువ అంటే.. 96 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌జరగనుంది. మొన్న 11న జరిగిన తొలిదశ పోలింగ్ శాతాన్ని బట్టి(తెలంగాణలో 8 శాతం, ఉత్తరాఖండ్‌లో నాలుగు శాతం తక్కువ)బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని.. మరోసారి అధికారం చేపట్టడం కల్ల అని కొందరు ఇప్పటికే లెక్కలు వేసినా.. వాస్తవం ఏమిటో తేలేది మే 23న మాత్రమే. ఏదెలా ఉన్నప్పటికీ రెండో దశ ఎన్నికలు మొత్తం కూటముల కుప్ప అని స్పష్టమవుతోంది. రాష్ట్రాల వారీగా ఇదీ పరిస్థితి.. తమిళనాట కుంపట్ల మంట దక్షిణాదిలో అత్యధిక లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రం తమిళనాడు. గత ఎన్నికల్లో నాలుగు కూటములు హోరాహోరీగా తలపడ్డాయిక్కడ. ఏఐఏడీఎంకే ఒకవైపు.. డీఎంకే, ఐయూఎంఎల్, వీసీకే ఒక కూటమి గా, బీజేపీ, డీఎండీకే, పీఎంకే, ఐజేకే, పీఎన్కే మరో కూటమిగా.. కాంగ్రెస్, వామపక్షాలు ఇంకో కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగాయి. దేశవ్యాప్తంగా వీచిన మోదీ హవాను అడ్డుకుని మరీ ఏఐఏడీఎంకే విజేతగా నిలిచింది. 39 స్థానాల్లో 44 శాతం ఓట్లు పోగేసుకుని 37 సీట్లు సాధించింది. మిగిలిన రెండింటినీ బీజేపీ, పీఎంకే పంచుకున్నాయి. రెండేళ్ల తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఏఐఏడీఎంకే విజయఢంకా మోగించగా.. ఆ తరువాత కొద్దికాలానికే జయలలిత, కరుణానిధి కన్నుమూశారు. రాజకీయ శక్తుల పునరేకీకరణకూ ఆస్కారం కలిగింది. డీఎంకే పగ్గాలు కరుణ కుమారుడు ఎంకే స్టాలిన్‌కు దక్కగా.. ఏఐఏడీఎంకే వారసత్వం మాత్రం గందరగోళానికి దారితీసి, పార్టీ రెండు ముక్కులయ్యేలా చేసింది. ఎట్టకేలకు అధికార పంపిణీపై రాజీ కుదిరిన తరువాత కె.పళనిస్వామి, ఓపీఎస్ పన్నీర్ సెల్వమ్ వర్గాలు రెండూ ఒక్కటయ్యాయి. మరోవైపు జయలలిత సమీప బంధువు టీటీవీ దినకరన్ 18 మంది ఎమ్మెల్యేలతో అమ్మ మక్కళ్ మున్నేట్ర కజగం పేరుతో సొంత కుంపటి పెట్టారు. ఈ లోక్‌సభ ఎన్నికల తరువాత త్వరలో జరిగే 22 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు అటు దినకరన్ పార్టీకి, ఇటు ఏఐఏడీఎంకే మనుగడకూ కీలకంగా మారాయి. బరిలో నాలుగు కూటములు 2019 ఎన్నికల్లోనూ తమిళనాట చతుర్ముఖ పోటీ నెలకొంది. ఏఐఏడీఎంకే కాస్తా ఎన్డీయే పక్షాన చేరిపోగా.. డీఎంకే యూపీఏ వైపు నిలిచింది. సినీ నటుడు కమల్‌హాసన్ పార్టీ మక్కళ్ నీది మయ్యమ్, దినకరన్ పార్టీ కూడా బరిలో నిలిచాయి. ఏఐఏడీఎంకే 20 స్థానాల్లో పోటీ చేస్తుండగా, భాగస్వామ్య పక్షాలైన పీఎంకే (7), బీజేపీ (5), డీఎండీకే (4), తమిళ మానీల కాంగ్రెస్, తమిజగం కచ్చి, పుదియ నీది కచ్చి ఒక్కో సీటుకు పోటీ పడుతున్నాయి. పుదుచ్చేరి నుంచి మరో భాగస్వామ్య పార్టీ ఏఐఎన్ఆర్సీ పోటీ చేస్తోంది. మరోవైపు యూపీఏ కూటమిలో డీఎంకే 20, కాంగ్రెస్ 9 స్థానాల్లోనూ పోటీ చేస్తుండగా వీసీకే (2), సీపీఐ, సీపీఎం, ఎండీఎంకే, ఐజేకే, కేఎండీకే, ఐయూఎంఎల్ ఒక్కో స్థానంలో పోటీలో ఉన్నాయి. డీఎంకే, ఏఐఏడీఎంకే 8 చోట్ల ముఖాముఖి తలపడుతున్నాయి. కాగా వేలూరు లోక్‌సభ ఎన్నిక చివరి నిమిషంలో వాయిదా పడింది. స్థానికాంశాలే ప్రచారాస్త్రాలు.. తమిళనాట ఎన్నికలు ప్రధానంగా స్థానిక అంశాల ఆధారంగానే జరుగుతుంటాయి. చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న కావేరీ నదీ జలాల వివాదంతోపాటు తూతుక్కుడిలో స్టెరిలైట్ కాపర్ స్మెల్టింగ్ ప్లాంట్ మూసివేత ఆందోళనలో జరిగిన కాల్పులు ప్రధానాంశాలుగా మారాయి. సేలమ్ –చెన్నై గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంపై పర్యావరణ వేత్తల నుంచి వస్తున్న అభ్యంతరాలు ఎన్నికలపై ప్రభావం చూపవచ్చు. ఈ ఏడాది జరిగిన ప్రపంచ పెట్టుబడుల సదస్సు, గాజా తుపాను విపత్తును సమర్థంగా ఎదుర్కోవడం, మదురైకు ఎయిమ్స్ రావడాన్ని తమ విజయాలుగా ఏఐఏడీఎంకే చెబుతోంటే.. సంక్షేమ పథకాల అమలులో వైఫల్యాలు. పరిపాలన కుంటుపడటాన్ని డీఎంకే ఎత్తి చూపుతోంది. అధికార పార్టీకి మంచి పట్టున్న దక్షిణ తమిళనాడు ప్రాంతంలో దీపావళి టపాకాయల ఫ్యాక్టరీలపై సుప్రీంకోర్టు కొరడా ఝళిపించడంతో వేలాది మంది ఉపాధి కోల్పోగా 2017లో వచ్చిన ఓఖీ తుపాను కారణంగా 191 మంది జాలర్లు మరణించడం ఏఐఏడీఎంకే వైఫల్యాలుగా చూపుతోంది. అన్నిటినీ పరిశీలించిన తరువాత తమిళనాట ఈ దఫా ఎన్నికల్లో డీఎంకేకు ఎక్కువ సీట్లు దక్కవచ్చునని అంచనా. అయితే ఇవి 2004 నాటి స్థాయిలో ఉండవు. ఏఐఏడీఎంకే ఎన్డీయే కూటమి ప్రభావం ఉంటుంది. ఏఐఏడీఎంకే రెండంకెల స్థానాలు కైవశం చేసుకోవచ్చు. కీలక నియోజకవర్గాలు: చెన్నై సెంట్రల్: దయానిధి మారన్ (డీఎంకే) ధర్మపురి: సిట్టింగ్ ఎంపీ అన్బుమణి రామ్‌దాస్ పోటీ చేస్తున్నారు. నీలగిరీస్ (ఎస్సీ): బడగ (ఎస్టీ), అరుంధరియార్లు, వెల్లలా గౌండర్లు (ఓబీసీ) పెద్దసంఖ్యలో గల ఈ స్థానంలో ఏ.రాజా పోటీ చేస్తున్నారు. కోయంబత్తూరు: బీజేపీ, సీపీఎం మధ్య ఇక్కడ ప్రత్యక్ష పోరు నెలకొంది. శివగంగ: కార్తి (కాంగ్రెస్)–హెచ్.రాజ (బీజేపీ) పోటీలో ఉన్నారు. తూతుక్కుడి: కరుణానిధి కుమార్తె కనిమొళి (డీఎంకే), తమిళసాయి సౌందరరాజన్ (బీజేపీ) పోటీ పడుతున్న స్థానమిది. కన్యాకుమారి: పొన్ రాధాకృష్ణన్ (బీజేపీ), హెచ్.వసంతకుమార్ (కాంగ్రెస్) మధ్య ప్రత్యక్ష పోరు.. హిందువులు, క్రిస్టియన్లు సమానంగా ఉన్నారిక్కడ. మహారాష్ట్రలో ఎవరు ‘పది’లం? మహారాష్ట్రలో పది లోక్‌సభ స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. ఈ పది స్థానాల్లో.. గత ఎన్నికల్లో బీజేపీ, శివసేన తలో నాలుగు సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ రెండు స్థానాల్లో విజేతగా నిలిచింది. ప్రభావం చూపే అంశాలివే.. ►కరువుకు మారుపేరుగా నిలిచే మరాఠ్వాడ ప్రాంతంలో వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు ఈ ఎన్నికల్లో కీలకాంశాలుగా మారాయి. ►వ్యవసాయ సంక్షోభం, తాగునీటి లభ్యత, నిరుద్యోగం, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి వాటిని కాంగ్రెస్, వీబీఏ ప్రచారాస్త్రాలుగా మార్చుకున్నాయి. పోటీ.. నువ్వా?నేనా? ►బీజేపీ నేత ప్రీతమ్ ముండే పోటీ చేస్తున్న బీడ్ నియోజకవర్గంలో పోటీ ఉత్కంఠ కలిగిస్తోంది. ►దశాబ్దాలుగా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న లాతూర్‌లో మచ్చీంద్ర కామత్.. సుధాకర్ శ్రాంగరే (బీజేపీ) మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. వారానికి ఒక్కసారి మాత్రమే తాగునీరు దొరికే లాతూర్‌లో నీటి లభ్యతే ముఖ్యమైన ఎన్నికల అంశం. ►షోలాపూర్‌లో కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే (కాంగ్రెస్), లింగాయత్ వర్గ మఠాధిపతి మహాస్వామి జై సిద్ధేశ్వర్ శివాచార్య (బీజేపీ), అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ (వీబీఏ) మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొంది. దాదాపు నాలుగు లక్షల ఓట్లు ఉన్న లింగాయత్‌లు తమ విజయానికి అక్కరకొస్తారని బీజేపీ ఆశిస్తుండగా మూడు లక్షల మంది ధంగర్లు, 2.50 లక్షల ముస్లింలను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రకాశ్ అంబేడ్కర్ ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలు జరిగే స్థానాలు: విదర్భ ప్రాంతంలోని బుల్దానా, అకోలా, అమ్రావతి (ఎస్సీ), మరాఠ్వాడ ప్రాంతంలోని హింగోలి, నాందేడ్, పర్బని, బీడ్, ఒస్మానాబాద్, లాతూర్, రాష్ట్ర పశ్చిమ ప్రాంతంలోని షోలాపూర్. ‘ఉత్తరాది’ వస్తాదులెవరో? దేశంలోనే అతి ఎక్కువ లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో గురువారం రెండో దశ పోలింగ్ జరగనుంది. ఎనిమిది స్థానాలకు పోలింగ్ జరగనుండగా, గత ఎన్నికల్లో ఈ ఎనిమిదింటినీ బీజేపీ గెలుచుకుంది. బాలాకోట్ దాడుల తరువాత జరుగుతున్న ఈ ఎన్నికలు కాషాయ పార్టీకి మేలు చేసే అవకాశాలున్నాయి. అయితే ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ పొత్తు, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదన్న కాంగ్రెస్ విమర్శల నేపథ్యంలో యూపీ ఎన్నికలు మతం రంగు పులుముకున్నాయి. ముస్లింలు అందరూ తమ సెక్యులర్ కూటమికి ఓటేయాలన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి పిలుపు విమర్శలకు తావిచ్చింది. మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘అలీ వర్సెస్ బజరంగభళి’ వ్యాఖ్య.. ఎన్నికల కమిషన్ ఆయనపై మూడు రోజుల ప్రచార నిషేధాన్ని ప్రకటించేందుకు కారణమైన విషయం తెలిసిందే. మతాల ప్రాతిపదికన జరుగుతున్న ఈ ఎన్నికలు కూటమి లెక్కలను తారుమారు చేసే అవకాశముంది. అలాగే, ఈ ఎనిమిది స్థానాల్లో బీజేపీ ఈసారి కొన్నిటిని కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. ప్రాంతీయ పార్టీల మధ్య పొత్తులు పనిచేస్తే.. బీజేపీకి నష్టమే. ►అలీగఢ్‌లో బీజేపీ ఎంపీ సతీశ్ కుమార్ గౌతమ్, బీఎస్పీ అభ్యర్థి అజిత్ బలియాన్, కాంగ్రెస్ అభ్యర్థి బిజేంద్ర సింగ్ మధ్య ముక్కోణపు పోటీ నడుస్తోంది. ఈ నియోజకవర్గంలో ముస్లింలు దాదాపు 20 శాతం మంది ఉన్నారు. అయితే ఇక్కడి నుంచి ముస్లింలు ఎప్పుడూ గెలుపొందకపోవడం గమనార్హం. 2014లో దళిత, జాఠ్, లోధ్ సామాజిక వర్గాల మద్దతుతో బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. ►ఆగ్రాలోనూ బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉండగా.. మథురలో సినీ నటి హేమామాలిని బరిలో ఉన్నారు. ఎన్నికలు జరిగే స్థానాలు: నగీనా (ఎస్సీ), అమ్రోహా, పశ్చిమ యూపీలోని అలీగఢ్, హత్రాస్ (ఎస్సీ), మథుర, ఆగ్రా (ఎస్సీ), ఫతేపూర్ సిక్రీ, బులంద్‌షహర్. అస్సాం, బిహార్, ఒడిశా, పశ్చిమబెంగాల్.. ఈశాన్య రాష్ట్రమైన అస్సాంతోపాటు బిహార్, ఒడిశాలోనూ రెండో దశ ఎన్నికల్లో భాగంగా ఐదేసి స్థానాలకు ఈ నెల 18న పోలింగ్ జరగనుంది. అస్సాంలో.. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ రాకతో ఆ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. 2014 డిసెంబర్ 31వ తేదీని కటాఫ్‌గా పెట్టి హిందూ, పార్శీ, బౌద్ధులు, జైన్, సిక్కులను అక్రమ వలసదారులుగా గుర్తించేందుకు ఉద్దేశించిన సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ బిల్ (2016) కూడా ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశముంది. అనేక ప్రదర్శనలు, ఆందోళనల తరువాత ఇప్పుడు పరిస్థితి సాధారణ స్థితికి చేరుకున్నా ఈ అంశాలు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ►బిహార్ తూర్పు ప్రాంతంలోని కిషన్‌గంజ్, కథిహార్, పూర్ణియా, భగల్పూర్, బంకా స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. ►ఒడిశాలో బార్‌బాగ్, సుందర్‌గఢ్ (ఎస్టీ), బోలన్‌గిర్, కాంధమాల్, అస్కా పోలింగ్‌కు సిద్ధమయ్యాయి. 2014లో బీజేడీ నాలుగు, బీజేపీ ఒక స్థానం గెలుచుకున్నాయి. ఈసారి బోలన్‌గిర్, అస్కాలలో బీజేపీ, బీజేడీ మధ్య హోరాహోరీ నడుస్తోంది. 1999 నుంచి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గెలుస్తూ వస్తున్న అస్కా నియోజకవర్గంలో ఈసారి ఆ పార్టీ సీనియర్ రామకృష్ణ పట్నాయక్, కాంగ్రెస్ కార్యకర్తల మద్దతుతో రామకృష్ణ పాండా (సీపీఎం) పోటీ చేస్తున్నారు. ►ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్లో మూడేసి స్థానాలకు, జమ్మూ కశ్మీర్లో రెండు, మణిçపూర్, త్రిపురలో ఒక్కో స్థానం, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఒక స్థానానికి కూడా గురువారమే పోలింగ్ జరగనుంది. రక్తి కట్టిస్తోన్న‘కర్ణాటక’ం కర్ణాటకలో ఈసారి ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. ఈ నెల 18న జరిగే తొలిదశలో రాష్ట్రంలోని మొత్తం 28 నియోజకవర్గాల్లో సగం స్థానాలకు పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మధ్య ముక్కోణపు పోటీ జరగ్గా మోదీ హవాతో బీజేపీ 17 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్ ఎనిమిది, జేడీఎస్ రెండు స్థానాలు గెలుపొందాయి. 2004 నుంచి బీజేపీ ఆధిపత్యం సాధిస్తున్న ఈ రాష్ట్రంలో గత ఏడాది తృటిలో అధికారం కోల్పోయింది. ఫలితాలు వెలువడ్డాక కాంగ్రెస్ జేడీఎస్ జట్టుకట్టడంతో బీజేపీ ప్రతిపక్షంగా నిలవాల్సి వచ్చింది. తాజా ఎన్నికల్లో కుదిరిన ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ 18 స్థానాల్లోనూ, జేడీఎస్ పది స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ –జేడీఎస్ కూటమి.. రైతు రుణమాఫీ, ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు అధిష్టానానికి డబ్బులిచ్చానన్న బీఎస్ యడ్యూరప్ప ఆడియో టేపులు బీజేపీని ఇరుకున పెడుతుండగా.. దేశ భద్రత, దేశభక్తి, నరేంద్ర మోదీ శక్తియుక్తుల ఆధారంగా బీజేపీ ఓట్లు అడుగుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ –జేడీఎస్ ఉమ్మడి ఓట్లు పది శాతం వరకూ ఎక్కువగా ఉండటాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఈసారి కూటమికి 17–20 స్థానాలు దక్కాలి. అయితే భాగస్వామి పక్షాల్లోని లుకలుకలు, ఓట్ల బదలాయింపు, కార్యకర్తల మధ్య సమన్వయం తదితర అంశాలన్నీ తుది ఫలితాలపై ప్రభావం చూపనున్నాయి. ►18న జరిగే ఎన్నికల్లో చామరాజ నగర... సినీనటి సుమలత పోటీ చేస్తున్న మండ్య స్థానాలు కీలకంగా ఉన్నాయి. ►మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ పోటీ చేస్తున్న హాసన్, దేవెగౌడ స్వయంగా బరిలోకి దిగుతున్న తుముకూరు కూడా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. లింగాయతులు, ఒక్కళిగలు సమాన సంఖ్యలో ఉన్న తుముకూరులో సిట్టింగ్ ఎంపీ ఎస్.పి.ముద్ద హనుమేగౌడ (కాంగ్రెస్) తిరుగుబాటు చేయడం దేవెగౌడ గెలుపు అవకాశాలపై ప్రభావం చూపే అవకాశముంది. ఎన్నికలు జరిగే స్థానాలు: బెంగళూరులోని నాలుగు స్థానాలతో పాటు తీర ప్రాంతంలోని ఉడుపి చిక్కమగళూరు, దక్షిణ కన్నడ స్థానాలు, హాసన్, చిత్రదుర్గ, తుముకూరు, మండ్య, మైసూరు, చామరాజనగరలు, రాష్ట్ర దక్షిణ ప్రాంతంలోని చిక్కబళ్లాపుర, కోలార్ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. 2014 ఎన్నికల్లో.. ఎవరికెన్ని? ►33 ఎన్డీఏ (బీజేపీ–27, భాగస్వామ్య పార్టీలు–6) ►15యూపీఏ (కాంగ్రెస్–12, భాగస్వామ్య పార్టీలు–3) ►02 వామపక్షాలు ►37ఏఐఏడీఎంకే ►10ఇతరులు -
కాంగ్రెస్‌కు బై బై
ఈ నెల 10 నుంచి ప్రారంభం కాబోయే స్థానికసంస్థల ఎన్నికల సంగ్రామంలో సంకీర్ణ కాంగ్రెస్–జేడీఎస్ ఎవరికివారేనని తేటతెల్లమైంది. కాంగ్రెస్ వైఖరి వల్లే తాము ఒంటరిగా పోటీ చేయబోతున్నట్లు దళపతి దేవేగౌడ ప్రకటించారు. అయితే అప్పటిలోగా ఏమైనా జరగవచ్చనేది రాజకీయ వర్గాల కథనం. సాక్షి బెంగళూరు: త్వరలో జరిగే 105 స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌తో మైత్రి లేదని జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ స్పష్టం చేశారు. ఆదివారం నగరంలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు పాల్గొన్నారు. దేవెగౌడ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు. ‘కాంగ్రెస్‌తో మైత్రి లేదు. అయితే కాంగ్రెస్ నిర్ణయం మేరకే మేం కూడా పొత్తు వదులుకుంటున్నాం. కాంగ్రెస్‌తో ఎలాంటి విభేదాలు లేవు. స్థానిక ఎన్నికల్లో యువకులకు అధిక ప్రాధాన్యం ఇస్తాం. ముస్లిం, బడుగు, బలహీన వర్గాల వారికి అవకాశం కల్పిస్తాం. అత్యధిక సీట్లను గెలవడమే లక్ష్యం. సంకీర్ణ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు. వచ్చే సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తాం’ అని తెలిపారు. దేవేగౌడ నిర్ణయానుసారమే ఈ సందర్భంగా జేడీఎస్ నాయకులు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండాలా, వద్దా అనేది దేవెగౌడ నిర్ణయించాలన్నా రు. ఆయన ఆదేశానుసారమే నడుచుకుంటామని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో జేడీఎస్‌తో మైత్రి వద్దనే నిర్ణయానికి కాంగ్రెస్ నాయకులు వ చ్చారని ఆరోపించారు. దీనిపై ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయబోమన్నారు. అయితే కాంగ్రెస్ వైపు నుంచి స్నేహహస్తం ఎదురైతే కలిసి పోటీ చేసే అవకాశమూ లేకపోలేదని సమాచారం. -
మమతకు మద్దతు
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మద్దతిచ్చేందుకు తమకు అభ్యంతరమేమీ లేదని మాజీ ప్రధాన మంత్రి, జేడీఎస్ జాతీయాధ్యక్షుడు దేవెగౌడ స్పష్టం చేశారు. ఢిల్లీలో పీటీఐకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయడంలో కాంగ్రెస్ కీలకంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ‘ప్రధాని అభ్యర్థిగా విపక్షాలు మమతా బెనర్జీని ఎన్నుకోవడాన్ని మేం పూర్తిగా స్వాగతిస్తాం. ఇందిరాగాంధీ 17 ఏళ్ల పాటు దేశాన్ని పాలించారు. ఎప్పుడూ మగవాళ్లే ప్రధానులుగా ఉండాలా? మమత లేదా మాయావతి (బీఎస్పీ అధ్యక్షురాలు) ఎందుకు కాకూడదు?’ అని దేవెగౌడ ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మైనారిటీలు అభద్రతా భావంతో ఉన్నారనీ, దేశంలో భయానక వాతావరణం ఉందని ఆరోపించారు. 2019లో బీజేపీని ఓడించాలంటే ఓ బలమైన కూటమి ఉండాల్సిందేనన్నారు. సాధారణ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్‌తో కలిసే తమ పార్టీ పోటీ చేస్తుందని దేవెగౌడ చెప్పారు. జేడీఎస్ కర్ణాటక అధ్యక్షుడిగా విశ్వనాథ్ జేడీఎస్ కర్ణాటక అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కుమారస్వామి స్థానంలో హెచ్.విశ్వనాథ్‌ను దేవెగౌడ ఆదివారం నియమించారు. -
1996లో అలా.. 2018లో ఇలా!
ఇప్పుడు కర్ణాటకలో తమను కాదని గవర్నర్ వజూభాయ్ వాలా బీజేపీ నేత యడ్యూరప్పను ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ ఆహ్వానించడాన్ని కాంగ్రెస్, దేవెగౌడ పార్టీ జేడీఎస్ అన్యాయం, అక్రమమని గొంతు చించుకుంటున్నాయి. అయితే, ఒకప్పుడు గుజరాత్లో పూర్తి మెజారిటీ ఉన్న బీజేపీ సర్కారును అక్రమంగా గద్దెదించడంలో కాంగ్రెస్ పార్టీ, దేవెగౌడ తమ పాత్రలను మరచిపోయినట్లు కనిపిస్తోంది. గవర్నర్ సిఫార్సుతో మెహతా బర్తరఫ్! అది 1996 సెప్టెంబర్. గుజరాత్లో సురేశ్ మెహతా నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై సీనియర్ నేత శంకర్‌సింహ్ వాఘేలా వర్గీయులు తిరుగుబాటు చేశారు. మెహతా ప్రభుత్వానికి అసెంబ్లీలో 121 మంది బీజేపీ శాసనసభ్యుల మద్దతు ఉండగా, వారిలో 40 మంది తనను సమర్థిస్తున్నారని వాఘేలా ప్రకటించి, ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. వాఘేలా, కాంగ్రెస్‌కు చెందిన పారిఖ్ కలిసి సురేశ్మెహతా సర్కారుపై అవిశ్వాసం ప్రకటించి, తిరుగుబాటు చేయడంతో బీజేపీ ప్రభుత్వానికి అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీకి చెందిన స్పీకర్ హెచ్ఎల్ పటేల్ అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న సమయంలో సభను నడిపిన కాంగ్రెస్‌కు చెందిన ఉపసభాపతి చందూభాయ్ ధాబీ వాఘేలా–పారిఖ్ వర్గానికి గుర్తింపు ఇచ్చారు. మళ్లీ కోలుకుని అసెంబ్లీకి వచ్చిన స్పీకర్ పటేల్ డెప్యూటీ స్పీకర్ ఉత్తర్వును రద్దు చేయడం గందరగోళం, కొట్లాటలకు దారితీసింది. అసెంబ్లీలో రభస జరగడంతో బలపరీక్షకు ఓటింగ్ నిర్వహించడం కుదరలేదు. వాఘేలా వర్గం, కాంగ్రెస్ నేతలు గవర్నర్ కృష్ణపాల్ సింగ్‌ను కలసి మెహతా సర్కారును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ సర్కారు రద్దుకు గవర్నర్ సిఫార్సు దాంతో మెహతా ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశా>రు. ఆ సమయంలో దేవెగౌడ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వానికి కాంగ్రెస్ బయటినుంచి మద్దతిస్తోంది. దేవెగౌడ ప్రభుత్వం గుజరాత్ నుంచి గవర్నర్ నివేదిక అందిన వెంటనే సురేశ్ మెహతా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసింది. ఇప్పటి కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలా అప్పుడు గుజరాత్ బీజేపీ అధ్యక్షుని హోదాలో తమ పార్టీ సర్కారుకు జరిగిన ‘అన్యాయాన్ని’ కళ్లారా చూశారు.. అర్థం చేసుకున్నారు. ఇప్పుడు అదే దేవెగౌడ కొడుకు కుమారస్వామికి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ ప్రభుత్వం ఏర్పాటుకు ఆయనను ఆహ్వానించాలని కాంగ్రెస్, జేడీఎస్ నేతలు కోరినా వజూభాయ్ పట్టించుకోలేదు. వాజ్‌పేయి ఔట్.. దేవెగౌడ ఇన్ 1996లోనే సభలో మెజారిటీ నిరూపించుకోలేక ప్రధాని పదవికి వాజ్‌పేయి రాజీనామా చేసిన సందర్భాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. 1996 లోక్‌సభ ఎన్నికల తర్వాత 161 సీట్లతో అతి పెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ తరఫున ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా అటల్ బిహారీ వాజ్‌పేయిని అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ ఆహ్వానించారు. బలపరీక్ష నాటికి అవసరమైన మద్దతు కూడగట్టుకోలేకపోవడంతో.. ఓటింగ్‌కు ముందే వాజ్‌పేయి రాజీనామా చేశారు. అయితే, విశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా వాజ్‌పేయి చేసిన ఆవేశపూరిత ప్రసంగాన్ని నేటికీ గుర్తు చేసుకుంటారు. అనంతరం, కాంగ్రెస్ నాయకత్వాన ఏర్పడే సంకీర్ణ సర్కారుకు మద్దతివ్వడానికి కాంగ్రెసేతర జాతీయ. ప్రాంతీయపార్టీలు అంగీకరించకపోవడంతో.. కాంగ్రెస్ మద్దతుతో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కొలువుతీరింది. ఆ ప్రభుత్వానికి దేవెగౌడ నేతృత్వం వహించడం కొసమెరుపు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఒక సీటు..ఇద్దరు పోటీ
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ఎన్నికల ప్రక్రియలో ఓ ఘట్టం ముగిసింది. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ పెద్దలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే రాష్ట్రంలో ఫలితాలపై కీలక ప్రభావం చూపనున్న జేడీఎస్‌లో గందరగోళం నెలకొంది. నామినేషన్ల పర్వంలో భాగంగా టికెట్ల కేటాయింపు చివరిరోజు వరకు పెండింగ్‌లో ఉంచడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. హైదరాబాద్ కర్ణాటక, ముంబయి కర్ణాటక ప్రాంతాల్లోని పలు స్థానాల్లో ఇద్దరు చొప్పున జేడీఎస్ బీఫారం, సీఫారాలతో నామినేషన్ వేశారు. నామినేషన్ల ఉపసంహరణ రోజున ఈ సమస్యను పరిష్కరిస్తామంటున్నారు. చివరిరోజు హడావుడి జేడీఎస్ 126 మంది అభ్యర్థులతో ఫిబ్రవరిలోనే తొలిజాబితా విడుదల చేసింది. తరువాత ఇతర పార్టీల నుంచి వచ్చిన బలమైన నేతలకు రెండోజాబితాలో టికెట్లు ఇచ్చింది. కానీ నామినేషన్ల సమర్పణకు చివరిరోజైన మంగళవారం కూడా ఇంకా 22 స్థానాలకు అభ్యర్థులను నిర్ణయించాల్సి ఉంది. ఈ హడావుడిలో కొందరికి బీ ఫారం ఇచ్చి అదేస్థానంలో మరొకరిని ఎంపిక చేసినట్లుగా కొందరికి సీ ఫారం అందజేశారు. సుమారు 10 నియోజకవర్గాల విషయంలో ఇలా జరిగింది. అయితేబీ, సీ ఫారాలు పొందిన ఇద్దరూ నామినేషన్లు వేయడంతో ఒకేచోట ఇద్దరు పోటీ పడినట్లు అయ్యింది. పార్టీ అధిష్టానం మాత్రం బీఫారం రద్దు చేస్తూ సీఫారం అందజేసినట్టు తెలిపింది. కేఆర్ పేట ఎమ్మెల్యే నారాయణగౌడకు పార్టీ టికెట్ తిరస్కరించింది. ఆ స్థానంలో బీఎల్ దేవరాజ్ సి ఫారం అందుకుని చివరి నిమిషంలో నామినేషన్ సమర్పించారు. దేవనహళ్లి స్థానానికి కూడా అధిష్టానం కొత్త అభ్యర్థికి సీ ఫారం అందజేసింది. అక్కడ ఉన్న పిళ్లమునిశామప్ప టికెట్‌ను రద్దు చేస్తూ ఆ స్థానంలో నిసర్గ నారాయణస్వామిని బరిలో దింపింది. శిడ్లఘట్ట అభ్యర్థిపై కూడా గందరగోళం నెలకొంది. రవికుమార్, రాజన్నలు నామినేషన్ వేశారు. 27న సర్దుబాటు చేస్తారా ఈ నెల 27న నామినేషన్ల ఉపసంహరణ ఉంది. ఈ నేపథ్యంలో ఒకే స్థానంలో పోటీ చేస్తున్న ఇద్దరిలో ఒకరు ఉపసంహరించుకునేలా అధిష్టానం బుజ్జగింపులు చేపడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బరిలో ఎవరున్నారనేది స్పష్టమవుతుందని పార్టీ పెద్దలు తెలిపారు. అంతా సర్దుకుంటుంది: దేవేగౌడ పార్టీలో చోటు చేసుకున్న అసమ్మతి సర్దుకుంటుందని మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్ అధ్యక్షుడు హెచ్డీ దేవేగౌడ అన్నారు. ఆస్ట్రేలియా డిప్యూటీ కాన్సుల్ జనరల్ జాన్ బోనర్ దేవేగౌడతో బుధవారం బెంగళూరులో సమావేశమయ్యారు. అనంతరం దేవేగౌడ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో తిరుగుబాటుదారులు ఉన్నమాట వాస్తవమే. కానీ త్వరలోనే అన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. ఎన్నికల్లో బరిలో నిలిపే అభ్యర్థుల ఎంపికలో కాస్త గందరగోళమైందన్నారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పెద్దనోట్లు వైఫల్యంలో దేశంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయన్నారు. మోదీ ఏదో చేయాలని ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. జాన్‌బోనర్ మాట్లాడుతూ తాను దేశంలోని పలు రాష్ట్రాలను సందర్శించానన్నారు. అయితే దేవేగౌడ పాలనలో దేశం, జేడీఎస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి బాటలో నడిచాయని తెలిసినట్టు చెప్పారు. -
దేవె గౌడ (మాజీ ప్రధాని) రాయని డైరీ
కేసీఆర్ వస్తానంటే నిద్ర ఆపుకుని కూర్చున్నాను. ఎప్పుడు పట్టేసిందో పట్టేసింది! ఆయన వచ్చింది కూడా తెలియలేదు. ‘‘నాన్నా.. హైదరాబాద్ నుంచి కేసీఆర్ వచ్చారు, లేవండి’’ అని తట్టి లేపాడు కుమారస్వామి. ‘‘కొంచెం మెల్లిగా లేపొచ్చు కదా నాన్నా..’’ అన్నాను. ‘‘చాలాసేపటి నుంచి లేపుతున్నాను నాన్నా’’ అన్నాడు కుమారస్వామి. కుమారస్వామికి అన్నీ డీటెయిల్డ్‌గా చెప్పడం అలవాటు. ‘నిద్రలేచిన వాళ్లకు అన్ని డీటెయిల్స్ ఎందుకు నాన్నా?’ అంటే వినడు. కేసీఆర్ వచ్చాడంటే సరిపోదా! హైదరాబాద్ నుంచి కేసీఆర్ వచ్చాడు అని చెప్పాలా? కేసీఆర్ ఢిల్లీలో ఏం ఉండడు కదా. ఢిల్లీలో ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తాడు? అక్కడికే పిలిపించుకుంటాడు కానీ. ‘‘మారాలి’’ అన్నాడు కేసీఆర్, నేను హాల్లోకి వెళ్లగానే. హాల్లో సోఫాలో కూర్చొని ఉన్నారు ఆయన. ‘‘మారితే ఎప్పుడో మారాల్సింది చంద్రశేఖర్. ఇక మార్పు రాదు’’ అన్నాను. ‘‘నేను మార్చగలను’’ అన్నాడు కేసీఆర్. ఎప్పుడూ ఎవరో ఒకర్ని మార్చందే ఈ బక్క పలుచని మనిషికి నిద్రపట్టదేమో! ‘‘ఇది ఇప్పటి అలవాటు కాదు చంద్రశేఖర్. చూసే ఉంటావ్, పేపర్లలో అక్కడ.. ప్రధానిగా ఉన్నప్పుడు కూడా పార్లమెంటులో నాకు బాగా పట్టేసేది. కొన్నాళ్లు ట్రై చేశాను.. ఆపుకోవాలని. నా వల్ల కాలేదు. టైమర్ కూడా పెట్టుకున్నాను. అయినా కాలేదు’’ అన్నాను. ‘‘టైమర్ ఏమిటి?’’ అన్నాడు కేసీఆర్. ‘‘ఎవరైనా నిద్ర లేవడానికి టైమర్ పెట్టుకుంటారు. నేను నిద్రపోడానికి టైమర్ పెట్టుకునేవాడిని. అంత సిన్సియర్‌గా ట్రై చేశాను. అదీ వర్కవుట్ కాలేదు. ఎప్పుడు వాలిపోతానో ఎక్కడ వాలిపోతానో నాకే తెలియదు చంద్రశేఖర్’’ అన్నాను. కేసీఆర్ నవ్వాడు. ‘‘పెద్ద వయసు కదా’’ అన్నాడు. ‘‘ఇరవై ఏళ్ల క్రితం కూడా పెద్ద వయసేనా చంద్రశేఖర్! అప్పుడు కూడా బాగా పట్టేసేది కదా మరి!’’ అన్నాను. కేసీఆర్ మళ్లీ నవ్వాడు. ‘‘అయినా నేను ‘మారాలి’ అన్నది, ‘నేను మార్చగలను’ అన్నది మీ నిద్రవేళల్ని కాదు గౌడాజీ. మనం మారాలి. బీజేపీని, కాంగ్రెస్‌నీ మార్చాలి. ఏం? ఈ దేశ పౌరులకు మార్పును కోరుకునే హక్కు లేదా’’ అన్నాడు కేసీఆర్. ఫోన్లో చెప్పిన మాటల్నే మళ్లీ చెప్తున్నాడు. నిద్రొచ్చినట్టుగా అయింది. ‘‘గౌడాజీ.. కాంగ్రెస్ పోతే బీజేపీ, బీజేపీ పోతే కాంగ్రెస్ రావడం కాదు మార్పు. బీజేపీ పోవాలీ, కాంగ్రెస్సూ రాకూడదు. అదీ మార్పంటే. ఆ మార్పు కోసం మీరు కలిసొస్తారా? మీ..రు.. క..లి..సొ..స్తా..రా?’’ అన్నాడు. ‘‘కలిసొస్తారా.. అని వెంటవెంటనే రెండుసార్లు అడిగావేంటి చంద్రశేఖర్?’’ అని అడిగాను. ‘‘ఒత్తి పలికాను గౌడాజీ’’ అన్నాడు కేసీఆర్. ఆయన ఒత్తి పలకడం చూస్తుంటే.. బలమైన మార్పునే ఆయన కోరుకుంటున్నట్లుగా ఉంది! -
ఒక్క కేసీఆర్..అనేక ఊహాగానాలు
సాక్షి, బెంగళూరు: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బెంగళూరు పర్యటన విజయవంతంగా ముగిసింది. సీఎం కేసీఆర్ ఒక్కరోజు బెంగళూరు పర్యటన అనేక అంచనాలు ఊహగానాలకు దారి తీసింది. తృతీయ కూటమి ఏర్పాటు ప్రధాన లక్ష్యంతో రాష్ట్రంలో అడుగిడినప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల వాడీవేడి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ పర్యటన రాష్ట్రంలో విశిష్టతనుసంతరించుకుంది. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా తృతీయ కూటమి ఏర్పాటు కోసం తీవ్రంగా శ్రమిస్తున్న కేసీఆర్ రాష్ట్ర ఎన్నికల్లోనూ ఆ పార్టీల ఓటమికి కృషి చేస్తారని అంచనాలు మొదలయ్యాయి. తొలుత కర్ణాటకలో ఎన్నికల్లో జేడీఎస్‌ను గెలిపించి కేసీఆర్ శక్తి ఏంటో ఆ పార్టీలకు హెచ్చరికలు పంపే అవకాశాలు లేకపోలేదని స్థానిక నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. శుక్రవారం జేడీఎస్ జాతీయాధ్యక్షుడు దేవెగౌడతో సమావేశమయ్యేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ బెంగళూరుకు చేరుకున్నారు. ఆయన నేరుగా బెంగళూరు పద్మనాభనగర్లోని దేవెగౌడ నివాసానికి చేరుకుని అధినేతతో భేటీ అయ్యారు. దీంతో శుక్రవారం రాజకీయ వర్గాల్లో ఆయన భేటీపై బహిరంగంగానే చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా వరుస భేటీలు.. ఇటీవల కాలంలో దేశ రాజకీయాల్లో మార్పు అనివార్యమంటూ కేసీఆర్ వార్తల్లో నిలుస్తున్నారు. రాష్ట్రాలపై కేంద్రం ఆధిపత్యాన్ని నివారించాలంటే తృతీయ కూటమి తప్పక అవసరమని ఆయన దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందుకోసం ఇప్పటికే తృతీయ కూటమిలో భాగస్వామ్యం కావాలని ప్రాంతీయ పార్టీలకు ఆయన పలు వేదికల్లో పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా మార్చి 19న కోల్‌కతాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశమై తృతీయ కూటమికి మద్దతును కోరారు. అంతేకాకుండా జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌ను కలసి కేసీఆర్ తృతీయ కూటమిపై మద్దతు కోరారు. త్వరలోనే ఒడిశాకు చెందిన బిజు జనతాదల్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కలవనున్నారు. ఈ క్రమంలో శుక్రవారం దేవెగౌడతో సమావేశమయ్యారు. దేవెగౌడతో భేటీలో భాగంగా తృతీయ కూటమి ఏర్పాటు ఉద్ధేశాలను కేసీఆర్ వివరించినట్లు సమాచారం. అంతేకాకుండా తృతీయ కూటమి ఏర్పాటుపై రాజకీయ భీష్ముడు దేవెగౌడ సలహాలు, సూచనలను తీసుకున్నారు. రాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం.. శుక్రవారం వీరి భేటీలో భాగంగా రాష్ట్ర ఎన్నికలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఎన్నికల్లో జేడీఎస్ అనుసరిస్తున్న వైఖరిని, పార్టీ విజయావకాశాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా అవసరమైతే జేడీఎస్ తరపున హైదరాబాద్–కర్ణాటక ప్రాంతంలో కేసీఆర్ ప్రచారం చేసేందుకు కూడా అంగీకరించినట్లు తెలిసింది. ఇప్పటికే నటుడు పవన్ కల్యాణ్ రూపంలో స్టార్ క్యాంపెయినర్ జేడీఎస్‌కు అండగా నిలుస్తారని వార్తలు గుప్పుమన్నాయి. పవన్ జేడీఎస్ తరఫున ప్రచారం నిర్వహిస్తారని ఊహగానాల మధ్య ఇక కేసీఆర్ కూడా ప్రచారం నిర్వహిస్తే ఊహించిన దానికంటే అత్యధిక స్థానాల్లో జేడీఎస్ గెలవడం ఖాయంగా కనపడుతుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కేసీఆర్ తన మాటల గారడీతో కాంగ్రెస్, బీజేపీలకు చెమటలు పట్టించగలరని ప్రతిపక్షాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఈ ఎన్నికల్లో జేడీఎస్‌కు మద్దతివ్వాలని కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు పిలుపునివ్వడం గమనార్హం. -
మాజీ ప్రధాని దేవెగౌడతో వైఎస్ జగన్ భేటీ
-
ప్రజలు తగిన బుద్ధి చెప్పారు:వైఎస్ జగన్
కాంగ్రెస్‌కు నేడు నాలుగు రాష్ట్రాల్లో జరిగిందే రేపు దేశమంతా జరుగుతుంది: వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: ‘‘నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత అయినా కాంగ్రెస్‌కు బుద్ధి రావాలి. ఆ పార్టీ ఇప్పటికైనా ప్రజలకు మంచి చేయడం కోసం ఆరాటపడుతుందని కోరుకుంటున్నా. ఇప్పుడు నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో జరిగిందే.. రేపు దేశమంతా జరుగుతుంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌కు నాలుగు రాష్ట్రాల ప్రజలు, దేవుడు తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాదని చెప్పారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి జరుగుతున్న యత్నాలకు వ్యతిరేకంగా, ఆర్టికల్ 3ని సవరించేందుకు కృషి చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాల మద్దతును కూడగడుతున్న జగన్మోహన్రెడ్డి... అందులో భాగంగా సోమవారమిక్కడ సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ) అధినేత ములాయంసింగ్ యాదవ్, జనతాదళ్(ఎస్) అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ అయ్యారు. ఉదయం పదిన్నర గంటలకు ములాయంతో పార్లమెంట్లో సమావేశమయ్యారు. ఇందులో ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్‌తోపాటు ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డి, పార్టీ నేతలు ఎంవీ మైసూరారెడ్డి, బాలశౌరి పాల్గొన్నారు. తర్వాత సాయంత్రం 4 గంటల సమయంలో దేవెగౌడతో ఆయన నివాసంలో జగన్ నేతృత్వంలోని బృందం సమావేశమైంది. ఇందులో జేడీ(ఎస్) నేతలు డానిష్ అలీ, ఓవీ రమణ కూడా పాల్గొన్నారు. ఈ భేటీల్లో ఆర్టికల్ 3 సవరణ ఆవశ్యకత, ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో యూపీఏ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, విభజనకు అసెంబ్లీ సమ్మతి లేని వైనం తదితర అంశాలను జగన్ సవివరంగా వారి దృష్టికి తీసుకెళ్లారు. ఒక రాష్ట్రాన్ని విభజించాలంటే అసెంబ్లీతోపాటు పార్లమెంట్‌లోనూ మూడింట రెండొంతుల మెజారిటీని తప్పనిసరి చేస్తూ రాజ్యాంగాన్ని సవరిస్తేనే భవిష్యత్తులో ఢిల్లీ పాలకులు తమ ఇష్టానుసారం రాష్ట్రాలను విభజించే వీలుండదని, ఈ రాజ్యాంగ సవరణకు మద్దతునివ్వాలని కోరారు. జగన్ చెప్పినదంతా సావధానంగా ఆలకించిన ములాయం, దేవెగౌడ ఈ సవరణకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. భేటీ అనంతరం జగన్మోహన్రెడ్డి, దేవెగౌడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్యంలో ఒక రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు అందరూ మౌనంగా ఉండటం మంచిదికాదు. ఎవరూ మాట్లాడకుంటే.. వారి రాష్ట్రాలు కూడా విభజనకు ఎంతో దూరం లేవనే విషయాన్ని గుర్తించాలి. శాసనసభ తీర్మానం లేకుండా రాష్ట్ర విభజన చేయడం దేశ చరిత్రలో ఇంత వరకు జరగలేదు. ఆంధ్రప్రదేశ్ విషయంలో సంప్రదాయాలకు భిన్నంగా, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోంది’’ అని జగన్ అన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే.. ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు కేంద్రం విభజన నిర్ణయాన్ని తీసుకుందని, ఇది ఎవరికీ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఢిల్లీలో 272 స్థానాలున్న ఎవరికైనా రాష్ట్రాలను విభజించే అధికారం ఇస్తే.. అసెంబ్లీ తీర్మానంతో పనిలేకుండా, ప్రజలను విశ్వాసంలోకి తీసుకోకుండా రాష్ట్రాలను విభజించుకుంటూ పోయే ప్రమాదం ఉందన్నారు. అడ్డగోలు విభజనకు అవకాశం కల్పిస్తున్న ఆర్టికల్-3ని సవరించాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. జరుగుతున్న అన్యాయాన్ని నిలువరించడానికి మద్దతు ఇస్తానని హామీ ఇచ్చినందుకు దేవెగౌడకు కృతజ్ఞతలు తెలిపారు. ఆఖరు దాకా పోరాడతాం.. రాష్ట్ర విభజనను అడ్డుకోగలనన్న విశ్వాసం మీకుందా అని విలేకరులు అడగ్గా.. ‘‘రాష్ట్ర విభజనను ఆపడానికి, కేంద్రం చేస్తోన్న అన్యాయాన్ని అడ్డుకోవడానికి ఆఖరు వరకు పోరాడతాం’’ అని జగన్ సమాధానమిచ్చారు. ‘‘మాది చిన్న పార్టీ. నేను సామాన్యుడిని. మా పార్టీకి నాతో కలిపి ముగ్గురు ఎంపీల బలమే ఉంది. ముగ్గురు ఎంపీల బలంతో మొత్తం పరిస్థితిని మార్చలేం. కానీ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడటానికి మాత్రం వెనకాడం. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నవారంతా.. గొంతెత్తాల్సిన సమయం ఇది. ప్రజాస్వామ్యంలో ఉన్నవారంతా కలసిరావాలి. జరుగుతున్న అన్యాయానికి అడ్డుకట్ట వేయాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతోంది. రేపు మరో రాష్ట్రానికి జరగచ్చు. అందుకే అందరూ కలసిరావాల్సిన అవసరం ఉంది’’ అని చెప్పారు. అన్యాయానికి వ్యతిరేకంగా మీడియా కూడా నినదించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సోషల్ మీడియా, ప్రతి పాత్రికేయుడు కూడా అన్యాయాన్ని అడ్డుకోవడానికి గొంతెత్తి నినదించాలని కోరారు. సవరణ కోసం పాటుపడతా: దేవెగౌడ ఇష్టారాజ్యంగా రాష్ట్రాల విభజన జరగకుండా చూడటానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని సవరించాల్సిందేనని, ఈ సవరణ కోసం తాను పాటుపడతానని జేడీ(ఎస్) అధ్యక్షుడు దేవెగౌడ చెప్పారు. ‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 3కి సవరణ ఆవశ్యకతపై జగన్ నాతో చర్చించారు. ఏ రాష్ట్రాన్నయినా విభజించడానికి అటు అసెంబ్లీలో, ఇటు పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజారిటీని తప్పనిసరి చేస్తూ ఆర్టికల్ 3కి రాజ్యాంగ సవరణ తీసుకురావాల్సిన అవసరంపై మాట్లాడారు. అలాంటి సవరణ కోసం వాయిదా తీర్మానం రూపంలో ఆయన పార్లమెంట్లో ప్రయత్నించనున్నారు. ఈ తీర్మానం పెట్టడానికి లెఫ్ట్ అంగీకరించింది. నేను సహజంగానే లెఫ్ట్ పార్టీల మిత్రుడిని. కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో వారి మిత్రపక్షంగా మేమున్నాం. అందువల్ల వారు తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడతాను. ఆర్టికల్ 3 సవరణ కోసం పెడుతున్న వాయిదా తీర్మానానికి మద్దతునిస్తాం’’ అని దేవెగౌడ అన్నారు. తెలంగాణ విషయంలో ఆర్టికల్-3 దుర్వినియోగం కాకుండా చూస్తామన్నారు. తెలంగాణపై మీ వైఖరి ఏమిటి? అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘తెలంగాణ విషయంలో వారు నిబంధనలను ఉల్లంఘించి వెళ్తున్నారు. రాష్ట్రాన్ని ఈ తరహాలో విభజించడం తెలివైన నిర్ణయం కాదు’’ అని పేర్కొన్నారు. ‘‘తొమ్మిదిన్నరేళ్లు వారు ఎందుకు కిమ్మనకుండా ఉన్నారు? తమ హయాం ముగింపుకొచ్చిన సమయంలోనే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? రాజకీయ ప్రయోజనాల కోసం కాకపోతే మరెందు కోసం? భాషాప్రయుక్త రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణాలర్పించారు. ఇప్పుడు భాషాప్రయుక్త రాష్ట్రం ఏమైంది? తెలంగాణలో తెలుగు కాకుండా మరేదన్నా భాషను మాట్లాడుతున్నారా? కోస్తాంధ్రలో మాట్లాడుతున్నది కూడా అదే భాష కదా... మరి ఇలాంటి డిమాండ్‌తో ముందుకెళ్తే మనం ఎక్కడికి పోతాం? ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఆందోళనకర పరిస్థితి ఎందుకు తీసుకువచ్చారు?’’ అని కేంద్రాన్ని నిలదీశారు. బిల్లును అడ్డుకుంటాం: ములాయం రాష్ట్రాల విభజనకు మేం వ్యతిరేకం పార్టీ సిద్ధాంతం రీత్యా రాష్ట్రాల విభజనకు తాము వ్యతిరేకమని ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్ స్పష్టం చేశారు. ఏ రాష్ట్ర విభజననైనా సరే తమ పార్టీ వ్యతిరేకిస్తుందని, ఆంధ్రప్రదేశ్ విభజనను సైతం అదే తరహాలో వ్యతిరేకిస్తామని ఆయన జగన్‌తో భేటీ సందర్భంగా అన్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును తమ పార్టీ పార్లమెంట్లో అడ్డుకుంటుందని చెప్పారు. ఆర్టికల్ 3 సవరణ కోసం జరిపే పోరాటంలో కలసిరావడానికి ఇప్పటికే సిద్ధమైన పలు పార్టీలతో కలిసి తాము కూడా పోరాడతామని ఆయన హామీ ఇచ్చారు. -
నేడు బెంగళూరులో జగన్ పర్యటన వాయిదా
వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి బెంగళూరు పర్యటన వాయిదా పడింది. విభజనకు వ్యతిరేకంగా అన్ని పార్టీల మద్దతు కూడగడుతున్న ఆయన గురువారం బెంగళూరుకు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడను కలవాల్సి ఉంది. ఈ మేరకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే బ్రదర్ అనిల్‌కుమార్ తండ్రి డాక్టర్ రమణారావు బుధవారం మృతి చెందిన వార్త తెలుసుకున్న జగన్ తన బెంగళూరు పర్యటనను రద్దు చేసుకున్నారు. కాగా జగన్ లక్నో వెళ్లేందుకు అనుమతి కోరుతూ వేసిన పిటిషన్‌పై విచారణను కోర్టు గురువారానికి వాయిదా వేసింది. విజయమ్మ ధర్నాలు కూడా వాయిదా కృష్ణా నదీ జలాలపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈనెల 5న వైఎస్సార్ జిల్లా గండికోట వద్ద చేపట్టాల్సిన ధర్నా రమణారావు మృతి కారణంగా ఈనెల 6వ తేదీకి వాయిదా పడిందని పార్టీ వర్గాలు తెలిపాయి. 6వ తేదీన మహబూబ్‌నగర్ జిల్లా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద చేయతలపెట్టిన ధర్నా కూడా వాయిదా పడింది. -
ఓట్లకోసం రాష్ట్ర విభజన తగదు: దేవెగౌడ
సాక్షి, తిరుమల : ఓట్లకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలని చూడడం సరికాదని మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ అభిప్రాయపడ్డారు. గురువారం రాత్రి ఆయన తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దేశంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడ్డాయన్నారు. ఆంధ్రరాష్ట్రం కోసం పొట్టిశ్రీరాములు తన ప్రాణాలను అర్పించారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను ఏ ప్రాతిపదికన విభజిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.