వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి బెంగళూరు పర్యటన వాయిదా పడింది. విభజనకు వ్యతిరేకంగా అన్ని పార్టీల మద్దతు కూడగడుతున్న ఆయన గురువారం బెంగళూరుకు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడను కలవాల్సి ఉంది. ఈ మేరకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే బ్రదర్ అనిల్కుమార్ తండ్రి డాక్టర్ రమణారావు బుధవారం మృతి చెందిన వార్త తెలుసుకున్న జగన్ తన బెంగళూరు పర్యటనను రద్దు చేసుకున్నారు. కాగా జగన్ లక్నో వెళ్లేందుకు అనుమతి కోరుతూ వేసిన పిటిషన్పై విచారణను కోర్టు గురువారానికి వాయిదా వేసింది.
విజయమ్మ ధర్నాలు కూడా వాయిదా
కృష్ణా నదీ జలాలపై బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ తీర్పును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈనెల 5న వైఎస్సార్ జిల్లా గండికోట వద్ద చేపట్టాల్సిన ధర్నా రమణారావు మృతి కారణంగా ఈనెల 6వ తేదీకి వాయిదా పడిందని పార్టీ వర్గాలు తెలిపాయి. 6వ తేదీన మహబూబ్నగర్ జిల్లా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద చేయతలపెట్టిన ధర్నా కూడా వాయిదా పడింది.
నేడు బెంగళూరులో జగన్ పర్యటన వాయిదా
Published Thu, Dec 5 2013 5:27 AM | Last Updated on Wed, Aug 8 2018 5:51 PM
Advertisement