development of agriculture
-
రైతుల అభ్యున్నతికి శ్రమించాలి
సాక్షి, హైదరాబాద్: రైతుల అభ్యున్నతి కోసం శ్రమించాలని, సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని మార్కెటింగ్ శాఖ ఉద్యోగులకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. మార్కెట్‌కు వచ్చే రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించి మార్కెటింగ్ శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. మార్కెటింగ్ శాఖలో పదోన్నతులు కల్పించినందుకు శనివారం మంత్రి అధికార నివాసంలో ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రైతులకు గిట్టుబాటు ధర కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో ప్రత్యేక శ్రేణి కార్యదర్శి నుంచి ఉన్నత శ్రేణి కార్యదర్శులుగా పదోన్నతులు పొందిన వారిని మంత్రి అభినందించారు. -
వ్యవసాయరంగంలో తెలంగాణ భేష్
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ, రైతు సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం చాలా వేగంగా ముందుకెళ్తోందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశంసించారు. రాష్ట్ర రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని కితాబిచ్చారు. రైతు అయిన నిరంజన్‌రెడ్డి వ్యవసాయమంత్రిగా ఉండటం వల్ల రైతులకు మరింత మేలు జరుగుతుందని పేర్కొన్నారు. త్వరలోనే జోగుళాంబ ఆలయాన్ని, మంత్రి మామిడితోటను సందర్శిస్తానని చెప్పారు. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రెండ్రోజుల పాటు నిర్వహించనున్న ‘యూత్ యాజ్ టార్చ్ బేరర్స్ ఆఫ్ బిజినెస్ ఓరియెంటెడ్ అగ్రికల్చర్ ఇన్ సౌతిండియా’సదస్సును ఆమె సోమవారం ప్రారంభించారు. రాజేంద్రనగర్‌లోని వర్సిటీ ఆడిటోరియంలో ఈ సదస్సు జరుగుతోంది. రైతు ఆదాయం రెట్టింపు చేసేందుకు, వ్యవసాయరంగ సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోదీ అనేక చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు . వ్యవసాయం వైపు యువతను మరింత ఆకర్షించాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే నెలలో జరగనున్న గవర్నర్ల సదస్సులో తాను వ్యవసాయం అంశంపై మాట్లాడుతానని పేర్కొన్నారు. తెలంగాణ జనాభాలో 60 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండి, వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వారి సంక్షేమం కోసం తమ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ వంటి పథకాలెన్నో అమలు చేస్తోందని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘అగ్రికల్చర్ ఇన్నొవేషన్ ఫండ్’ఏర్పాటు చేయాలని ‘ట్రస్ట్ ఫర్ అడ్వాన్స్ మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్’చైర్మన్ ఆర్.ఎస్.పరోడా అన్నారు. వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు వర్క్‌షాప్ స్వాగతోపన్యాసం ఇచ్చారు. -
వరాలు కురిసేనా?
రేపు సిద్దిపేటకు కేసీఆర్ ఆశలన్నీ వీటిపైనే.. ⇒ సిద్దిపేట జిల్లా ఏర్పాటు ఆవశ్యకతపై ప్రకటన ⇒ సిద్దిపేట ప్రాంతానికి యూనివర్శిటీ ఏర్పాటు ⇒ కళలకు నిలయమైన సిద్దిపేటలో కళా క్షేత్రం ఏర్పాటు ⇒ వ్యవసాయరంగం అభివృద్ధికోసం ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తిచేసే ప్రకటన ⇒ విద్యారంగంలో దూసుకెళుతున్న ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాల పెంపు కోసం భారీ పరిశ్రమల ఏర్పాటు ⇒ మెడికల్ కళాశాల ఏర్పాటు ⇒ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల.. సిద్దిపేట అర్బన్: సిద్దిపేట ముద్దుబిడ్డ సీఎం హోదాలో తొలిసారి పురిటిగడ్డకు వస్తున్నారు. అది కూడా తెలంగాణకే మోడల్‌గా నిలిచిన సిద్దిపేట శాశ్వత తాగునీటి పథకాన్ని రాష్ట్ర అధికారులకు చూపించేందుకు. ఆ తర్వాత సిద్దిపేట ఖ్యాతిని దశదిశలా చాటిన వారిని సన్మానించేందుకు. అందువల్లే సీఎం పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ఉద్యమ శక్తిగా ఎదిగి ఆరున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలను తీర్చిన ఆయన, ఇపుడు సీఎంగా సొంతగడ్డపై ఎలాంటి వరాలు కురిపిస్తారోనని అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉంటూనే కేసీఆర్ అప్పటి ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి నిధులు రాబట్టడంతో పాటు సిద్దిపేటవాసుల తాగునీటి కష్టాలు శాశ్వతంగా తీర్చారు. ఇక ఉద్యమ సమయంలో పల్లెపల్లె తిరిగిన కేసీఆర్, ప్రజల ఎదుర్కొంటున్న నీటికష్టాన్ని స్వయంగా చూశారు. రానున్న రోజుల్లో నీటికోసం గుక్కపట్టే ఒక్క పల్లె కూడా ఉండకూడదని అప్పుడే నిర్ణయించుకున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో తొలి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్...తన తొలి ప్రాధాన్యంగా ఇంటింటికీ ‘నల్లా’ అందించాలని సంకల్పించారు. అందులో భాగంగానే సిద్దిపేట శాశ్వత మంచినీటి ప్రత్యేకతను, విశిష్టతను రాష్ట్ర స్థాయి అధికారులతో ప్రత్యక్షంగా పరిచయం చేయడం కోసం ఈ నెల 10న కేసీఆర్ తన పురిటిగడ్డ సిద్దిపేటకు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆత్మీయులు, సన్నిహితులు ఆయన్ను కలవాలని ఆరాటపడుతున్నారు. గులాబీ దళపతికి ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే సీఎం కేసీఆర్ వరాల జల్లులు కురిపిస్తారని గంపెడాశతో ప్రజలు ఉన్నారు. సీఎం పర్యటన సాగుతుందిలా...! రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకానికి సిద్దిపేట తాగునీటి పథకం స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ పథకం సిద్దిపేట నియోజకవర్గంలో అమలు జరుగుతున్న తీరుతెన్నులపై రాష్ట్రస్థాయి అధికారుల బృందానికి సీఎం కేసీఆర్ స్వయంగా వివరిస్తారు. ఈ మేరకు ఈ నెల 10న సిద్దిపేటలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఆర్డబ్ల్యూఎస్ అధికారుల బృందం, ఇతర ఉన్నతాధికారులు పర్యటించనున్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి నేరుగా కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాం యశ్వాడ వద్ద ఇన్‌టెక్‌వెల్‌ను పరిశీలిస్తారు. అనంతరం చిన్నకోడూరు మండలం అనంతసాగర్ వద్ద నీటి పంపింగ్ సిస్టంను పరిశీలిస్తారు. ఆ తర్వాత సిద్దిపేట పట్టణంలోని కోమటిచెరువు వద్ద నిర్వహిస్తున్న ఫిల్టర్‌బెడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ తాగు నీటిసరఫరా విధానం, నీటిశుద్ధి విధానం తదితర వాటిపై రాష్ట్రస్థాయి ఆర్‌డబ్ల్యూస్ అధికారుల బృందానికి పూర్తి స్థాయిలో వివరిస్తారు. అనంతరం సిద్దిపేట పబ్లిక్ సర్వెంట్హోం స్వర్ణోత్సవాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా సిద్దిపేట డివిజన్ పరిధిలో జన్మించి వివిధ రంగాల్లో సిద్దిపేట ఖ్యాతిని దశదిశలా చాటిన 25 మందిని సీఎం కేసీఆర్ సన్మానిస్తారు. అదేవిధంగా పబ్లిక్ సర్వెంట్హోం స్వర్ణోత్సవ సంచికను ఆవిష్కరిస్తారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారు. -
సస్యశ్యామలం చేస్తాం
పాకాలకు జూరాల నీటిని రప్పిస్తాం వ్యవసాయ అభివృద్ధి ప్రాతిపదికతో ముందుకు సాగుతాం వంద శాతం హామీలు నెరవేరుస్తా పొన్నాల భూకబ్జాపై కలెక్టర్ స్పందించాలి ఆ భూములను తిరిగి దళితులకు ఇవ్వాలి {పచార సభల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్టేషన్ ఘన్పూర్ టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాకు సాగు, తాగు నీరు అందించి సస్యశ్యా మలంగా మారుస్తామని టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. వ్యవసాయ అభివృద్ధి ప్రాతిపదికతో ముందుకు సాగుతామన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన మూడో దఫా హెలికాప్టర్ ద్వారా జిల్లాను చుట్టేశారు. స్టేషన్ ఘన్పూర్, పరకాల, నర్సంపేట, జనగామ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. తొలుత స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఎదుట ఉన్న భోజ్యానాయక్ ప్రాంగణంలో మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభం కాగా... వివిధ గ్రామాల నుంచి పార్టీ శ్రేణులు, మహిళలు పోటెత్తారు. డప్పు చప్పుళ్లు, బతుకమ్మలు, బోనాలతో అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ పరిధిలోని రాంపూర్‌లో తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల ఆక్రమిం చుకున్న భూములపై కలెక్టర్ వెంటనే స్పందించాలని కోరారు. ఆ భూములను తిరిగి దళితులకు ఇప్పించాలని కోరారు. ఆంధ్ర పార్టీల నేతలు 60 ఏళ్లుగా తెలంగాణను దోచుకుంటూనే ఉన్నారని... ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు సోయిలోకి రావాలని, ఎవరిని గెలిపిస్తే తెలంగాణ రాష్ర్ట పునర్నిర్మాణం, అభివృద్ధి జరుగుతుందో ఆలోచించాలన్నారు. ఉద్యమ గడ్డ ఘన్పూర్ స్టేషన్‌ఘన్‌పూర్ నియోజక వర్గం ఉద్యమాల గడ్డ అని, ఉప ఎన్నికల్లో రాజయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపిం చి ఉద్యమానికి ఊపు తీసుకువచ్చిన ప్రాంతమని కేసీఆర్ అన్నారు. ఘన్పూర్ అంటే తనకు ప్రత్యేక అభిమానమని, టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే నియోజకవర్గానికి ఐదు వేల ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. తానే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేస్తానన్నారు. ఉప ఎన్నికలు ఫలితాలు పునరావృతం కావాలని, సాధారణ ఎన్నికల్లో అందరూ కారు గుర్తుకు ఓటు వేసి వరంగల్ ఎంపీగా టీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరిని, ఘన్పూర్ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ రాజయ్యను గెలిపించాలని ఆయన కోరారు. సభలో కడియం శ్రీహరి, డాక్టర్ రాజయ్య, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపెల్లి రవీందర్రావు, రాష్ట్ర కార్యదర్శి ఎడవెల్లి కృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చింతకుంట్ల నరేందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ గట్టు రమేష్‌గౌడ్, సర్పంచ్ ఇల్లందుల ప్రతాప్‌తో పాటు జిల్లా, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జూరాల నుంచి పాకాలకు.. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే జూరాల, పాకాల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యావులం చేస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. నర్సంపేటలో జరిగిన బహిరంగ సభలో వూట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సవుగ్ర అభివృ ద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని, వ్యవసాయు అభివృద్ధి ప్రాతిపదికలతో వుుందుకు సాగుతావున్నారు. నల్లగొండ జిల్లాలోని కృష్ణా నది పరివాహక ప్రాంతం జూరాల వద్ద ఎత్తిపోతల పథకం చేపట్టి నర్సంపేటలోని పాకాలకు నీటిని తీసుకురావడం వల్ల వరంగల్ జిల్లాలో సాగు, తాగు నీరు సవుస్య తీరుతుందన్నారు. వ్యవసాయూనికి ఎనిమిది గంటలపాటు ఉచిత విద్యుత్ అందించడంతోపాటు వుూడేళ్లలో విద్యుత్ ఉత్పత్తి పెంచి 24 గంటల విద్యుత్ సరఫరా చేసేలా పనిచేస్తామన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, సానుభూతిపరులపై దాడులు చేస్తే సహించబోవున్నారు. మన తలరాతలు మార్చే ఎన్నికలివి.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటయ్యాక.. తొలిసారిగా జరుగుతున్న ఈ ఎన్నికలు మన తలరాతలు మార్చేవని.. ఏమాత్రం ఏమరపాటుకు గురికాకుండా టీఆర్ఎస్కే ఓటు వేసి పట్టం కట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. జనగామ ప్రెస్టన్ మైదానంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ అంటే నీళ్లు లిఫ్ట్ చేయడం.. ఆంధ్రకు తెఫ్ట్ చేయడం అనేది ఇన్నాళ్లుగా జరిగిందన్నారు. జూరాల ఉంచి సక్కగా పాకాలకు నీళ్లు వచ్చే అవకాశం ఉన్నా.. లిఫ్ట్‌ల పేరుతో ఆన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ఈ విషయం పొన్నాలకు తెలిసినా.. ఆంధ్ర ముఖ్యమంత్రులకు సేవలు చేస్తూ పట్టించుకోలేదని విమర్శించారు. 2003లో తాను బచ్చన్నపేట పర్యటనకు వచ్చినప్పుడు సభకు సుమారు 500 మంది వస్తే అందులో అందరు వృద్ధులే ఉన్నారని ఆ సంఘటనను కేసీఆర్ గుర్తు చేశారు. ఇదేమని అడిగితే.. ఏడేళ్ల కరువుతో యువకులందరూ వలస వెళ్లారని చెప్పడం తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. ఉద్యమ తీవ్రతకు బచ్చన్నపేట కారణమైందన్నారు. తెలంగాణలో ముఠా, స్వార్థ, గ్రూపు రాజకీయాలు ఎక్కువ అభివృద్ధి జరగలేదన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జనగామ నియోజకవర్గంలో 5వేల ఇళ్లను నిర్మించి.. వాటిని తానే స్వయంగా ప్రారంభిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఉద్యమానికి కేంద్ర బిందువైన వరంగల్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని కేసీఆర్ అన్నారు. అవసరమైతే తాను కుర్చీ వేసుకుని కూర్చొని పనులు పూర్తి చేస్తామన్నారు. ఎవరు అడ్డు వచ్చినా.. దేవాదుల, కంతనపల్లి ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. జనగామలో పొన్నాల చేసిన అభివృద్ధి ఏం లేదన్నారు. దేవాదుల నీళ్లను ఎందుకు తెప్పించలేదని విమర్శించారు. పొన్నాల చేసిన అభివద్ధి... బొంద అభివద్ది, బోకే అభివద్ధి అంటూ ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి రాగానే.. ప్రాజెక్టులను పూర్తి చేసి జనగామ నియోజకవర్గంలో 1.50 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు. ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ను గెలిపించాలని కోరారు.