సస్యశ్యామలం చేస్తాం
- పాకాలకు జూరాల నీటిని రప్పిస్తాం
- వ్యవసాయ అభివృద్ధి ప్రాతిపదికతో ముందుకు సాగుతాం
- వంద శాతం హామీలు నెరవేరుస్తా
- పొన్నాల భూకబ్జాపై కలెక్టర్ స్పందించాలి
- ఆ భూములను తిరిగి దళితులకు ఇవ్వాలి
- {పచార సభల్లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
స్టేషన్ ఘన్‌పూర్ టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాకు సాగు, తాగు నీరు అందించి సస్యశ్యా మలంగా మారుస్తామని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. వ్యవసాయ అభివృద్ధి ప్రాతిపదికతో ముందుకు సాగుతామన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన మూడో దఫా హెలికాప్టర్ ద్వారా జిల్లాను చుట్టేశారు. స్టేషన్ ఘన్‌పూర్, పరకాల, నర్సంపేట, జనగామ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన బహిరంగ సభల్లో ప్రసంగించారు.
తొలుత స్టేషన్ ఘన్‌పూర్ మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం ఎదుట ఉన్న భోజ్యానాయక్ ప్రాంగణంలో మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభం కాగా... వివిధ గ్రామాల నుంచి పార్టీ శ్రేణులు, మహిళలు పోటెత్తారు. డప్పు చప్పుళ్లు, బతుకమ్మలు, బోనాలతో అధిక సంఖ్యలో తరలివచ్చారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ పరిధిలోని రాంపూర్‌లో తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల ఆక్రమిం చుకున్న భూములపై కలెక్టర్ వెంటనే స్పందించాలని కోరారు. ఆ భూములను తిరిగి దళితులకు ఇప్పించాలని కోరారు. ఆంధ్ర పార్టీల నేతలు 60 ఏళ్లుగా తెలంగాణను దోచుకుంటూనే ఉన్నారని... ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు సోయిలోకి రావాలని, ఎవరిని గెలిపిస్తే తెలంగాణ రాష్ర్ట పునర్నిర్మాణం, అభివృద్ధి జరుగుతుందో ఆలోచించాలన్నారు.
ఉద్యమ గడ్డ ఘన్‌పూర్
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజక వర్గం ఉద్యమాల గడ్డ అని, ఉప ఎన్నికల్లో రాజయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపిం చి ఉద్యమానికి ఊపు తీసుకువచ్చిన ప్రాంతమని కేసీఆర్ అన్నారు. ఘన్‌పూర్ అంటే తనకు ప్రత్యేక అభిమానమని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాగానే నియోజకవర్గానికి ఐదు వేల ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. తానే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేస్తానన్నారు.
ఉప ఎన్నికలు ఫలితాలు పునరావృతం కావాలని, సాధారణ ఎన్నికల్లో అందరూ కారు గుర్తుకు ఓటు వేసి వరంగల్ ఎంపీగా టీఆర్‌ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరిని, ఘన్‌పూర్ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ రాజయ్యను గెలిపించాలని ఆయన కోరారు. సభలో కడియం శ్రీహరి, డాక్టర్ రాజయ్య, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపెల్లి రవీందర్‌రావు, రాష్ట్ర కార్యదర్శి ఎడవెల్లి కృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చింతకుంట్ల నరేందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ గట్టు రమేష్‌గౌడ్, సర్పంచ్ ఇల్లందుల ప్రతాప్‌తో పాటు జిల్లా, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జూరాల నుంచి పాకాలకు..
టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే జూరాల, పాకాల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యావులం చేస్తామని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. నర్సంపేటలో జరిగిన బహిరంగ సభలో వూట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సవుగ్ర అభివృ ద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని, వ్యవసాయు అభివృద్ధి ప్రాతిపదికలతో వుుందుకు సాగుతావున్నారు. నల్లగొండ జిల్లాలోని కృష్ణా నది పరివాహక ప్రాంతం జూరాల వద్ద ఎత్తిపోతల పథకం చేపట్టి నర్సంపేటలోని పాకాలకు నీటిని తీసుకురావడం వల్ల వరంగల్ జిల్లాలో సాగు, తాగు నీరు సవుస్య తీరుతుందన్నారు. వ్యవసాయూనికి ఎనిమిది గంటలపాటు ఉచిత విద్యుత్ అందించడంతోపాటు వుూడేళ్లలో విద్యుత్ ఉత్పత్తి పెంచి 24 గంటల విద్యుత్ సరఫరా చేసేలా పనిచేస్తామన్నారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు, సానుభూతిపరులపై దాడులు చేస్తే సహించబోవున్నారు.
మన తలరాతలు మార్చే ఎన్నికలివి..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటయ్యాక.. తొలిసారిగా జరుగుతున్న ఈ ఎన్నికలు మన తలరాతలు మార్చేవని.. ఏమాత్రం ఏమరపాటుకు గురికాకుండా టీఆర్‌ఎస్‌కే ఓటు వేసి పట్టం కట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. జనగామ ప్రెస్టన్ మైదానంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ అంటే నీళ్లు లిఫ్ట్ చేయడం.. ఆంధ్రకు తెఫ్ట్ చేయడం అనేది ఇన్నాళ్లుగా జరిగిందన్నారు. జూరాల ఉంచి సక్కగా పాకాలకు నీళ్లు వచ్చే అవకాశం ఉన్నా.. లిఫ్ట్‌ల పేరుతో ఆన్యాయం చేశారని ధ్వజమెత్తారు.
ఈ విషయం పొన్నాలకు తెలిసినా.. ఆంధ్ర ముఖ్యమంత్రులకు సేవలు చేస్తూ పట్టించుకోలేదని విమర్శించారు. 2003లో తాను బచ్చన్నపేట పర్యటనకు వచ్చినప్పుడు సభకు సుమారు 500 మంది వస్తే అందులో అందరు వృద్ధులే ఉన్నారని ఆ సంఘటనను కేసీఆర్ గుర్తు చేశారు. ఇదేమని అడిగితే.. ఏడేళ్ల కరువుతో యువకులందరూ వలస వెళ్లారని చెప్పడం తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. ఉద్యమ తీవ్రతకు బచ్చన్నపేట కారణమైందన్నారు. తెలంగాణలో ముఠా, స్వార్థ, గ్రూపు రాజకీయాలు ఎక్కువ అభివృద్ధి జరగలేదన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జనగామ నియోజకవర్గంలో 5వేల ఇళ్లను నిర్మించి.. వాటిని తానే స్వయంగా ప్రారంభిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.
ఉద్యమానికి కేంద్ర బిందువైన వరంగల్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని కేసీఆర్ అన్నారు. అవసరమైతే తాను కుర్చీ వేసుకుని కూర్చొని పనులు పూర్తి చేస్తామన్నారు. ఎవరు అడ్డు వచ్చినా.. దేవాదుల, కంతనపల్లి ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. జనగామలో పొన్నాల చేసిన అభివృద్ధి ఏం లేదన్నారు. దేవాదుల నీళ్లను ఎందుకు తెప్పించలేదని విమర్శించారు. పొన్నాల చేసిన అభివద్ధి... బొంద అభివద్ది, బోకే అభివద్ధి అంటూ ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి రాగానే.. ప్రాజెక్టులను పూర్తి చేసి జనగామ నియోజకవర్గంలో 1.50 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు. ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ను గెలిపించాలని కోరారు.