
సాక్షి, హైదరాబాద్: రైతుల అభ్యున్నతి కోసం శ్రమించాలని, సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని మార్కెటింగ్ శాఖ ఉద్యోగులకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. మార్కెట్‌కు వచ్చే రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించి మార్కెటింగ్ శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. మార్కెటింగ్ శాఖలో పదోన్నతులు కల్పించినందుకు శనివారం మంత్రి అధికార నివాసంలో ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రైతులకు గిట్టుబాటు ధర కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో ప్రత్యేక శ్రేణి కార్యదర్శి నుంచి ఉన్నత శ్రేణి కార్యదర్శులుగా పదోన్నతులు పొందిన వారిని మంత్రి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment