Dhaka cafe attack
-
ఢాకా ఉగ్రదాడి: జేఎంబీ కమాండర్ హతం
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ కేఫ్ పై దాడులకు పాల్పడ్డ ఘటనలో కీలక నిందితుడిగా భావిస్తున్న ఉగ్రవాది అబు ముసా(32)ను పోలీసులు మంగళవారం హతం చేశారు. ఉగ్రవాది జహంగీర్ అలాంకు ఇతడు సన్నిహితుడని బంగ్లా పోలీసులు తెలిపారు. రాజధాని ఢాకాకు 200 కిలోమీటర్ల దూరంలో బోగ్రా జిల్లాలో ఉగ్రవాదుల కదలికపై సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టినట్లు స్థానిక పోలీసు చీఫ్ నూర్ అలామ్ సిద్ధిఖీ వెల్లడించారు. ఇందులో భాగంగా ఢాకా కేఫ్ దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదుల్లో ఒకడైన అబు ముసాను కాల్చి చంపేశారు. జమాత్ ఉల్ ముజాహిద్దిన్ బంగ్లాదేశ్ (జేఎంబీ)కి ముసా కమాండర్ అని పోలీసులు భావిస్తున్నారు. నాటి ఉగ్రచర్యలో ఇతడి పాత్ర కీలకమని సమాచారం. గతేడాది జూలై 1న ఢాకాలోని హోలీ ఆర్టిసన్ బేకరీపై జరిగిన ఉగ్ర దాడిలో ఒక భారతీయురాలు, 16 మంది విదేశీయులు సహా 22 మంది చనిపోయిన విషయం తెలిసిందే. దాడికి పాల్పడ్డ ఐదుగురు ఉగ్రవాదులను సిబ్బంది ఆదే సమయంలో కాల్చి చంపేశారు. దాడి జరిగినప్పటి నుంచీ ఇందుకు కారకులైన దాదాపు 50 మంది ఉగ్రవాదులను సిబ్బంది మట్టుబెట్టింది. -
మహిళ, యువకుడు పేల్చేసుకున్నారు
ఢాకా: బంగ్లాదేశ్‌లో ఓ మహిళ, ఓ యువకుడు తమను తాము పేల్చుకున్నారు. తనిఖీకి వచ్చిన పోలీసు బలగాల నుంచి బయటపడేందుకు తమను తాము బాంబులతో ఆత్మాహుతికి పాల్పడ్డారు. వారిని ఉగ్రవాదులుగా పోలీసులు భావిస్తున్నారు. ఓ మూడంతస్తుల భవనంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఢాకాలోని కేఫ్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు భయంకరమైన నరమేధానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు సంబంధించిన ఉగ్రవాదుల కోసం పోలీసులు గత కొన్ని నెలలుగా తీవ్ర గాలింపులు చేస్తున్నారు. అయితే, శనివారం ఓ మూడంతస్తుల భవనంలో పెద్ద మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలతో దాచుకొని ఉన్నారని తెలుసుకున్న పోలీసులు ఆ భవనాన్ని చుట్టుముట్టి వారిని లొంగిపోవాలని ఆదేశించారు. అందులో నుంచి తొలుత ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు బయటకు వచ్చి పోలీసులకు లొంగిపోగా మరో మహిళ, ఓ యువకుడు మాత్రం తమను తాము ఆ భవంతిలో పేల్చుకున్నారు. ఈ ఘటలో ఓ చిన్న బాలికకు స్వల్పగాయాలు అయ్యాయి. లొంగిపోయినవారు ఉగ్రవాద సంస్థ నియో జమాతన్ ముజాహిదీన్ బంగ్లాదేశ్(నియో-జేఎంబీ)కి చెందినవారని తెలుస్తోంది. -
యుద్ధభూమి కాదు.. క్రికెట్ స్టేడియం!
-
యుద్ధభూమి కాదు.. క్రికెట్ స్టేడియం!
స్డేడియంలో ఆటగాళ్ల ప్రాక్టీసులు, అనంతరం మ్యాచ్ లు ఆడటం చూస్తాంటాం. మరి క్రికెట్ స్టేడియంలో ఆర్మీ జవాన్లు ఎందుకున్నారు అని సందేహం వచ్చిందా? మీ అనుమానం నిజమే. క్రికెటర్లకు రక్షణ కల్పిస్తామన్న ధీమా కల్పించేందుకు ప్రస్తుతం బంగ్లాదేశ్ ఆర్మీ తీవ్రంగా శ్రమిస్తోంది. అసలు విషయం ఏంటంటే.. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జూలై 1న ఉగ్రవాదులు, ఒక భారతీయ యువతి సహా 22 మందిని దారుణంగా గొంతులు కోసి చంపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బంగ్లాదేశ్-ఇంగ్లండ్ జట్ల మధ్య సిరీస్ షెడ్యూల్ ఉంది. ఉగ్రదాడులు జరిగిన ప్రాంతంలో మళ్లీ అదే తరహా దాడులు పునరావృతమవుతాయని ఇంగ్లండ్ ఆటగాళ్లు మొదట పలు సందేహాలు వ్యక్తంచేశారు. కానీ, చివరికి బంగ్లా ఆర్మీ సహాయం తీసుకుని ఇంగ్లండ్ ఆటగాళ్లకు రక్షణ కల్పిస్తామని బంగ్లా క్రికెట్ బోర్డు హామితో అంతా ఓకే అయింది. గత శనివారం జరిగిన మూడో వన్డేలో నెగ్గిన బంగ్లా 2-1 తేడాతో అఫ్ఘానిస్తాన్ పై కైవసం చేసుకున్న ఆనందంలో ఉండగా.. మరోవైపు పర్యాటక ఇంగ్లండ్ జట్టు మాత్రం కాస్త బెరుకుగా ఉంది. ఈ నేపథ్యంలో బంగ్లా ఆర్మీ కమాండోల పర్యవేక్షణలో ఇరుజట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు. ఢాకా లోని షేర్ ఏ బంగ్లా స్డేడియంలో ఈ జట్ల మధ్య శుక్రవారం రాత్రి తొలి వన్డే జరగనుంది. గతంలో పాకిస్తాన్ లో లంక ఆటగాళ్లపై దాడులు జరిగడంతో ఇప్పటివరకూ ఏ జట్టు పాక్ లో ఆడటానికి సముఖత చూపడం లేదన్న విషయం తెలిసిందే. బంగ్లా మాత్రం అలాంటి వాటికి తావివ్వకుండా తమ దేశంలో మ్యాచ్ లను నిర్వహించాలని ముందడుగు వేసింది. -
భారత్ నుంచి బంగ్లా బేకరీ ఉగ్రదాడి ఆయుధాలు
ఢాకా: బంగ్లాదేశ్‌లోని బేకరీలో ఉగ్రవాదులు దాడికి వాడిన ఆయుధాల రూపును భారత్‌లోని బిహార్‌లో మార్చారని బంగ్లాదేశ్ ఉగ్ర నిరోధక చీఫ్ మొనిరుల్ ఇస్లాం పేర్కొన్నారు. ఢాకాలో జూలై 1న ఉగ్రవాదులు, ఒక భారతీయ యువతి సహా 20 మందిని గొంతులు కోసి చంపిన సంగతి తెలిసిందే. ఉగ్రదాడి అనంతరం స్వాధీనం చేసుకున్న మూడు ఏకే22 తుపాకులపై బిహార్‌లోని ముంగార్‌లో ఉన్న ఒక ఫ్యాక్టరీ స్టిక్కర్ ఉందని ఆయన చెప్పారు. దాడికి ఒక నెల ముందే మామిడి కాయల బుట్టల ద్వారా తుపాకులు, కొన్ని చిన్న ఆయుధాలు ఢాకాలో ఉన్న ఉగ్రవాదులకు చేరాయని ఆయన వివరించారు. -
ఆ 'మాస్టర్ మైండ్' హతం!
ఢాకా: ఢాకా కేఫే దాడి వెనుక 'మాస్టర్ మైండ్స్' ను పోలీసులు మట్టుబెట్టారు. బంగ్లాదేశ్ లో ఈ ఉదయం (శనివారం)భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మిలిటెంట్లకు, రక్షకబలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురిని హతమార్చినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. రాజధాని ఢాకాకు సమీపంలోని నారాయణ గంజ్ లోని ఒక భవనంలో తలదాచుకున్నారన్న సమాచారంతో దాడిచేశామని కౌంటర్ టెర్రరిజం యూనిట్ అదనపు డిప్యూటీ కమిషనర్ సానోర్ హోస్సైన్ తెలిపారు. ప్రధాన సూత్రధారి, బంగ్లాదేశ్ జాతీయుడైన కెనడా నివాసి తమీమ్ అహ్మద్ చౌదరి సహా అతని అనుచరులు మరో ఇద్దరిని కాల్చి చంపినట్టు వెల్లడించారు. బంగ్లాదేశ్ లోని నిషేధిత జమాతుల్ ముజాహిద్దీన్ (జెఎంబీ) కార్యకర్త ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ దాడిని నిర్వహించామని యూనిట్ ఛీప్ మోనిరుల్ ఇస్లాం తెలిపారు. కెనడాలో నివసించే తమీమ్ ఒక నెట్ వర్క్ ను డెవలప్ చేశాడని, 2013లో బంగ్లాదేశ్ వచ్చి కార్యకలాపాలు మొదలు పెట్టాడని పోలీసులు తెలిపారు. ఢాకాలోని కేఫ్ పై గత నెలలో జరిగిన ఉగ్రదాడి ఘటనలో ఒక భారతీయ యువతితో సహా 22 మంది మరణించారు. మరోవైపు తమీమ్ అహ్మద్ ఆచూకీపై సమాచారం ఇచ్చిన వారికి ఇటీవల భారీ బహుమతిని (రెండు మిలియన్ల టాకాలు) కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.