Dhana Lakshmi
-
విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు ఫలితాలనిస్తున్నాయి
-
నాడు వైఎస్ఆర్ నేడు సీఎం వైఎస్ జగన్
-
LB Nagar: కారు డోర్ తగిలి రెండేళ్ల పాప మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎల్బీ నగర్ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి నిర్లక్ష్యం రెండేళ్ల పాప జీవితాన్ని బలి తీసుకుంది. చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం మన్సురాబాద్ నుంచి ఎల్బీ నగర్ రూట్లో.. కారు డ్రైవర్ రోడ్డులో కారు ఆపాడు. ఓ వ్యక్తి దిగి వెళ్లిపోగా.. డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి హఠాత్తుగా కారు డోర్ తీశాడు. ఆ సమయంలో పక్క నుంచి వెళ్తున్న బైకు కారుడోర్కు తగిలింది. దీంతో ఆ బైక్‌పై ఉన్న కుటుంబ సభ్యులు కిందపడిపోయారు. రెండేళ్ల వయసున్న చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆ కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. మృతి చెందిన చిన్నారిని ధనలక్ష్మి(2)గా గుర్తించారు పోలీసులు. చిన్నారి తల్లి శశిరేఖ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆమె భర్త గాయాలతో బయటపడినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.] కేసు నమోదు ఎల్బీనగర్లో చిన్నారి మృతి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కారును సీజ్ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే చిన్నారి మృతిచెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద స్థలంలో ఇప్పటికీ రోడ్డుపైనే వాహనాలు నిలిచిపోయాయి. అయినా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదు. -
24నే దీపావళి పండుగ
-
Diwali Festival 2022: 24నే దీపావళి పండుగ
సాక్షి, హైదరాబాద్: దీపావళి 24వ తేదీనా.. 25వ తేదీనా..? దివ్వెల పండుగపై నెలకొన్న గందరగోళం ప్రజలను అయోమయానికి గురిచేస్తోంది. అయితే ఈ విషయంలో ఎలాంటి ప్రతిష్టంభనా లేదని, నిస్సందేహంగా 24వ తేదీనే జరుపుకోవాలని పండితులు తేల్చి చెబుతున్నారు. పంచాంగాల్లో కూడా ఇదే విషయం పొందుపరిచి ఉన్నా, అనవసరంగా కొంతమంది లేవనెత్తిన సంశయం ప్రజల్లో అయోమయానికి కారణమైందని అంటున్నారు. నిజానికి ఈనెల 25న మంగళవారం అమావాస్యగా క్యాలెండర్లలో ఉంది. సాధారణంగా ఆశ్వయుజమాసం బహుళ అమావాస్య రోజున దీపావళి పండుగ నిర్వ హించుకోవటం ఆనవాయితీ. క్యాలెండర్లలో 25వ తేదీనే అమావాస్య ఉండటంతో పండుగ అదే రోజు ఉంటుందన్న భావన జనంలో వ్యక్తమైంది. కానీ, పంచాంగాలు మాత్రం, 25న కాదు, 24వ తేదీనే దీపావళి అని స్పష్టం చేస్తున్నాయి. ఇదీ కారణం..: దీపావళిని ప్రదోష వేళ నిర్వహించటం ఆనవాయితీ, అంటే సూర్యాస్తమయ సమయంలో నిర్వహిస్తారు. 25న మంగళవారం అమావాస్య తిథి ఉన్నా.. ప్రదోషవేళ(సూర్యాస్తమయం) వచ్చేసరికి పాడ్యమి ఘడియలు వచ్చాయి. ఆరోజు సాయంత్రం 4.25 కల్లా అమావాస్య ముగిసి పాడ్యమి వచ్చేసింది. సూర్యాస్తమయానికి అమావాస్య లేదు. 24న సోమవారం సాయంత్రం 4.25 సమయానికి అమావాస్య ప్రారంభమవుతోంది. సూర్యాస్తమయానికి అమావా స్య ఘడియలే ఉన్నందున 24న సాయంత్రాన్ని అమావాస్యగా పరిగణించి అదే రోజు దీపావాళి నిర్వహించుకోవాలని పండితులు పేర్కొంటున్నారు. అదే రోజు ధనలక్ష్మి పూజలు కూడా నిర్వహించాలని పేర్కొంటున్నారు. చాలామందికి దీపావళి రోజున కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించే సంప్రదాయం ఉంది. సాధారణంగా మధ్యాహ్నం వేళ అమావాస్య ఉన్న సమయంలో కేదారేశ్వర వ్రతం జరుపుతుంటారు. 24న మధ్యాహ్నం అమావాస్య తిథి లేనందున, మరుసటి రో జు వ్రతం జరుపుకోవాలని, కానీ ఆ రోజు సూర్యగ్రహణం ఉన్నందున, గ్రహణం విడిచిన తర్వాత గృహ శుద్ధి చేసి సాయంత్రం వేళ జరుపుకోవాలని కొందరు పండితులు పేర్కొంటున్నారు. కానీ దీపావళి రోజునే ఆ వ్రతాన్ని ఆచరించే పద్ధతి ఉన్నందున, అమావాస్య మధ్యాహ్నం లేన్పటికీ 24వ తేదీనే వ్రతం చేసుకోవాలని కొందరు పేర్కొంటున్నారు. ఈ విషయంలో కొంత భిన్నాభిప్రాయాలున్నాయి. గ్రహణంతో సంబంధం లేదు..: ‘అమావాస్య తిథి ప్రదోష వేళ ఉన్న రోజునే దీపావళి నిర్వహించాలి. అది సోమవారం సాయంత్రం ఉన్నందున ఆ రోజే పండుగ. అంతేకానీ, మంగళవారం సూర్యగ్రహణం అడ్డుపడినందున పండుగను సోమవారానికి జరిపారు అన్న వాదన అర్థరహితం. పండుగ సోమవారం నిర్వహించాల్సి రావటానికి, సూర్యగ్రహణానికి ఎలాంటి సంబంధం లేదు’అని ప్రముఖ పండితుడు పంతంగి రమాకాంత శర్మ పేర్కొన్నారు. -
23 ఏళ్ల పీటీ ఉష రికార్డు బద్దలు
పాటియాలా: ఫెడరేషన్ కప్ మహిళల 200 మీటర్ల పరుగులో 23 ఏళ్లుగా అథ్లెటిక్స్ దిగ్గజం పీటీ ఉష పేరు మీద చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును తమిళనాడుకు చెందిన ఎస్ ధనలక్ష్మి తిరగరాసింది. జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా గురువారం జరిగిన 200 మీటర్ల సెమీఫైనల్ హీట్‌ను అందరి కంటే ముందుగా 23.26 సెకన్లలో ముగించిన ధనలక్ష్మి మొదటి స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించింది. దాంతో 1998లో ఇదే మీట్లో పీటీ ఉష నెలకొల్పిన 23.30 సెకన్ల రికార్డు కనుమరుగైంది. రెండు రోజుల కిందట 100 మీటర్ల పరుగులో ద్యుతీచంద్‌కు షాక్ ఇస్తూ స్వర్ణం నెగ్గిన ధనలక్ష్మి... 200 మీటర్ల సెమీస్ హీట్‌లోనూ మరో స్టార్ స్ప్రింటర్ హిమదాస్ (24.39 సెకన్లు) కంటే మెరుగైన టైమింగ్‌ను నమోదు చేసింది. -
దంపతుల ఆత్మహత్యాయత్నం
నార్పల, న్యూస్‌లైన్ : కుటుంబ కలహాలతో గొడవ పడి దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, భార్య మృతి చెందింది. క్రిమి సంహారక మందు తాగిన భర్తను అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.మండల కేంద్రంలోని శక్తినగర్ కాలనీలో సోమవారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు, కాలనీవాసుల చెప్పిన వివరాల మేరకు.. శింగనమల మండలం చిన్నమట్టగొంది గ్రామానికి చెందిన ధనలక్ష్మి(26)కి, పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట గ్రామానికి చెందిన పెద్దన్నతో ఏడేళ్ల క్రితం వివాహమైంది.. పెద్దన్నకు ధనలక్ష్మి స్వయానా అక్క కూతురు. చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులను కోల్పోయింది. కాగా 15 ఏళ్ల క్రితమే పెద్దన్న స్వగ్రామం నుంచి నార్పలకు వలస వచ్చి, ఓ మిఠాయి అంగడిలో పని చేస్తూ జీవిస్తుండేవాడు. పెళ్లైన తర్వాత పానీపూరీ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కొంత కాలంగా అతను జూదానికి బానిసయ్యాడు. భర్తను ఆ వ్యసనం నుంచి తప్పించాలని భావించిన భార్య అతని చేత అయ్యప్పస్వామి మాలధారణ చేయించింది. అయినా అతను జూదాన్ని మానలేదు. దీంతో తన మాట వినలేదని తీవ్ర మనస్తాపం చెందిన ఆమె భర్త ఇంట్లోలేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుంది. ఇరుపొరుగు ఇళ్ల పిల్లలు గమనించి విషయం చెప్పడంతో స్థానికులు పరుగున ఇంట్లోకి వెళ్లి ఆమె మెడకు బిగుసుకున్న తాడును తెంపారు. కొనఊపిరితో ఉన్న ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మరణించింది. స్థానికుల ద్వారా ఈ సమాచారం తెలియడంతో ఖిన్నుడైన పెద్దన్న క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు వెంటనే అతన్ని 108 అంబులెన్స్‌లో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా ఈ దంపతులకు పిల్లలకు లేరు. ఎస్ఐ శేఖర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సినీ నిర్మాతలకు దడలక్ష్మి!
సినీ నిర్మాతలకు, సెన్సార్ బోర్డు సభ్యులకు విబేధాల నెలకొన్నాయనే వార్తలు వినిపించడం సహజమే. తమ సృజనాత్మకతపై సెన్సార్ బోర్డు అధికారులు కత్తెర వేస్తున్నారనే ఆరోపించడం మనం గమనిస్తూ ఉంటాం. ఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమ నిర్మాతలకు, సెన్సార్ కు మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా సెన్సార్ బోర్డు ప్రాంతీయ అధికారి ధనలక్ష్మిపై టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు వివాదస్పద ఆరోపణలు చేయడం మీడియాలో సంచలనంగా మారాయి. సినిమాలను నిర్మించడం ఒక ఎత్తు అయితే.. ధనలక్ష్మిని ఎదుర్కోవడం మరో ఎత్తు అనే భావనలో ఉన్నారు. ఇన్నాళ్లు తమ గోడును ఎవరికి చెప్పుకోలేక...ధనలక్ష్మిని ఎదురించలేక ఊరుకున్నారు. ప్రాంతీయ సెన్సార్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ధనలక్ష్మికి, పలువురు సినీ నిర్మాతలకు మధ్య గొడవలు మీడియాకే పరిమితంగా కాగా.. తాజాగా కోర్టు మెట్లెక్కాయి. గతంలో ధనలక్ష్మి నియామకంపై కోర్టులో డీవీ శైలేంద్ర కుమారి పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని 29(1) ఆర్టికల్ నిబంధనను ఉల్లంఘించి నియామకం చేపట్టారని పిటిషన్ దాఖలైంది. ధనలక్ష్మిపై చాలా మంది నిర్మాతలు ఆరోపణలు చేసినా.. వ్యవహారాన్ని కోర్టు వరకు తీసుకువెళ్లలేదు. అయితే ప్రస్తుతం ధనలక్ష్మికి ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మధ్య సత్య2 చిత్ర విషయంలో వివాదం నెలకొంది. సత్య2 చిత్ర విడుదల సమయంలో ధనలక్ష్మి తనను వేధించిందని వర్మ సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడమే కాకుండా.. పలు మీడియా చానెల్లలో వెల్లడించారు. 'సత్య2' చిత్ర విషయంలో తొలగించిన సన్నివేశాలపై ధనలక్ష్మి వివరణ ఇచ్చారు. ఓ టెలివిజన్ సమర్పించిన వినతిపత్రం ఆధారంగానే స్పందించి కొన్ని సన్నివేశాలను తొలగించాం అని ధనలక్ష్మి తెలిపారు. తనను వేధించిన ధనలక్ష్మిపై నాంపల్లి క్రిమినల్ కోర్టులో కేసు నమోదు చేస్తాను అని అన్నారు. తన పట్ల ప్రవర్తించిన తీరుతో మానసికంగా బాధను అనుభవించానని.. అంతేకాకుండా ఆర్ధికంగా కూడా నష్టపోయానని వర్మ తెలిపారు. బాలీవుడ్ చిత్రాలను నిర్మించిన వర్మకు ముంబైలో మాఫియాను మేనేజ్ చేసిన సామర్ధ్యం ఉంది. పరిస్థితులను బాలీవుడ్ లో తనకు అనుకూలంగా మలచుకోవడంలో సఫలీకృతమైన వర్మకు ధనలక్ష్మి చుక్కలు చూపించినట్టు వర్మ మాటలతో అర్ధమైంది. గతంలో ధనలక్ష్మిని బారిన పడిన ఇతర సినీ నిర్మాతలు రాంగోపాల్ వర్మ రియాక్షన్ కు మద్దతుగా నిలిచారు. దేనికైనా రెఢీ చిత్రం విడుదల సందర్భంగా కూడా నిర్మాత మంచు మోహన్ బాబు ఇదే బాధను అనుభవించారు. ఆ సమయంలో ధనలక్ష్మిపై కేంద్ర సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేస్తానని మీడియాలో తెలిపారు. మోహన్ బాబు మాదిరిగానే కాలిచరణ్ దర్శకుడు ప్రవీణ్ శ్రీ, నిర్మాతలు అశ్వినీదత్, దిల్ రాజు ఇతరులు తమ చిత్రాల విడుదల సమయంలో ఇబ్బందిని ఎదుర్కొన్నట్టు సమాచారం. వీరెవ్వరూ కూడా బయటకు చెప్పలేక.. ధనలక్ష్మితో సర్ధుబాటు ధోరణి ప్రదర్శించారు. గత కాలంగా అవకాశం ఎదురు చూస్తున్న బాధితులందరికి వర్మ ఆసరా దొరికింది. ఎందరో నిర్మాతలకు దడ పుట్టిస్తున్న ధనలక్ష్మిని వర్మ సహాయంతో ఎలా చెక్ పెడుతారో వేచి చూడాల్సిందే. a.rajababu@sakshi.com