The diagnosis of the disease
-
స్వైన్‌ఫ్లూ అలజడి
తాజాగా ఇద్దరికి వ్యాధి నిర్ధారణ 8మందికి రోగ లక్షణాలు వైద్యులు, సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తున్న వ్యాక్సిన్ల కొరత తిరుపతి మెడికల్ : జిల్లాలో స్వైన్‌ఫ్లూ బాధితుల సంఖ్య పెరగడం కలవరపెడుతోంది. మంగళవారం 10 మంది స్వైన్‌ఫ్లూ వ్యాధి లక్షణాలతో స్విమ్స్‌కు చేరుకున్నారు. వారిలో ఇద్దరికి స్వైన్‌ఫ్లూ వ్యాధి ఉన్నట్టు నిర్థారించారు. మిగిలిన వారు ౖవైద్య సేవలు పొందుతున్నారు. వీరిలో కడపకు చెందిన వారు ఇద్దరు, విశాఖకు చెందిన వారు ఒకరు కాగా మిగిలిన వారు జిల్లాకు చెందినవారు. సోమవారం అర్ధరాత్రి ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా స్వైన్‌ఫ్లూ రోగుల కోసం రుయాలో ప్రత్యేక Üదుపాయాలతో గదులను ఏర్పాటుచేశారు. వెంటిలేటర్లను సమకూరుస్తున్నారు. వీరికి సేవలందించే వైద్యులు, సిబ్బందికి యాంటీ స్వైన్‌ఫ్లూ వ్యాక్సిన్లను వాడాల్సి ఉంది. ఈ వ్యాక్సిన్లును ప్రభుత్వం సరఫరా చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఓ హౌస్ సర్జన్‌కు వ్యాధి లక్షణాలు రావడం, శాంపిల్స్‌కు పంపిన నేపథ్యంలో ఎక్కడ తమకు వ్యాధి సోకుతుందోనని బెంబేలెత్తిపోతున్నారు. మంగళవారం తిరుపతి రుయా ఆసుపత్రికి వచ్చిన జిల్లా కలెక్టర్ సిద్దార్థ్ జైన్ వచ్చారు. ఈ సందర్భంగా రుయాలో వ్యాక్సిన్ల కొరత ఉందని, వైద్యం చేయాలంటే ఎక్కడ వ్యాధి సోకుతుందేమోనని వైద్యులు, వైద్య సిబ్బంది ఆందోళన చెందుతున్నారని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. స్వైన్‌ఫ్లూ వ్యాధి ప్రాణాలు తీసేంత ప్రమాదం కాదని, వ్యాధి లక్షణాలు వచ్చిన వెంటనే వైద్యుల వద్దకు వస్తే వ్యాధికి తగ్గేలా మందులు ఇస్తే తగ్గిపోతుందని కలెక్టరు వ్యాఖ్యానించడంతో వైద్యులు విస్తుపోయారు. -
డయాబెటిక్ చిన్నారులు...
జాగ్రత్తలు చిన్నారుల్లో సాధారణంగా కనిపించే టైప్-1 డయాబెటిస్ అకస్మాత్తుగా బయటపడుతుంది. అందువల్ల ముందుగానే దీనిని గుర్తించే అవకాశాలు తక్కువ. సాధారణంగా ఏడు నుంచి పద్నాలుగేళ్ల లోపు వయసు ఉన్న పిల్లల్లో కనిపించే టైప్-1 డయాబెటిస్, అత్యంత అరుదుగా కొందరిలో పుట్టుక నుంచే కనిపించవచ్చు. టైప్-1 డయాబెటిస్ ఉన్న పిల్లలు ఒక్కోసారి అకస్మాత్తుగా మైకం కమ్మి పడిపోతారు. కళ్లు తేలేస్తారు. నిమిషాల్లో తలెత్తే డీహైడ్రేషన్ కారణంగా వాళ్ల శరీరమంతా ఎండిపోయినట్లు అయిపోతుంది. ఈ లక్షణాలన్నీ ఒకేసారి బయటపడతాయి. అలాంటప్పుడు ఏమాత్రం జాప్యం చేయకుండా వైద్య సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. రక్తపరీక్ష, మూత్రపరీక్షల ద్వారా డాక్టర్లు వ్యాధి నిర్ధారణ చేసి, పరిస్థితిని బట్టి తగిన చికిత్స చేస్తారు. చిన్నారులకు టైప్-1 డయాబెటిస్ సోకినట్లు తెలిసినా తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. దీనివల్ల వారి శారీరక, మానసిక ఎదుగుదలకు ఎలాంటి ఆటంకం ఉండదు. అందువల్ల ఇలాంటి చిన్నారుల తల్లిదండ్రులు ఈ సూచనలు పాటిస్తే చాలు... తమ పిల్లల ఆనందానికి లోటు లేకుండా వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. చక్కెర వ్యాధి గురించి పిల్లలకు అతిగా చెప్పి వాళ్లలో భయాందోళనలు రేకెత్తించవద్దు. ఇదంతా చిన్న లోపమని, దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతూ వాళ్లలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేయాలి. చక్కెర వ్యాధి ఉంది కదా అని వాళ్లకు ఎలాంటి ఆంక్షలూ విధించవద్దు. అందరు పిల్లల్లానే వాళ్లనూ ఆటలు ఆడుకోనివ్వాలి. మామూలు దినచర్యనే పాటించనివ్వాలి. ఆహారం విషయంలోనూ ఆంక్షలు వద్దు. పిల్లల ఎదుగుదలకు అన్ని రకాల పదార్థాలతో కూడిన సమతుల ఆహారం అవసరం కాబట్టి అన్నీ తిననివ్వాలి. చాక్లెట్లు, స్వీట్లు పూర్తిగా మానేయాలని కట్టడి చేయడం కంటే తక్కువ మోతాదులో వాటిని కూడా రుచి చూడనివ్వాలి. అయితే అలాంటి సందర్భాల్లో డాక్టర్ల సలహాపై ఇన్సులిన్ మోతాదును పెంచితే సరిపోతుంది. సెరులిన్తో మరో సరికొత్త చికిత్స సెరులిన్ అనేది రెండు అమినో ఆసిడ్స్ మధ్య ఉండే ఒకరకం బంధంతో ఏర్పడే మాలిక్యూల్. ఈ మాలిక్యూల్‌ను రోగి శరీరంలోని పాంక్రియాస్ వద్ద వెలువరిస్తే... అది క్రమంగా పాంక్రియాస్లో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే బీటా సెల్స్ అభివృద్ధి అయ్యేలా చేస్తుంది. అమెరికాలోని స్టాన్ఫోర్డ్-బర్న్‌హామ్ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన శిశువైద్య పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు ఈ విధంగా సెరులిన్ మాలిక్యూల్‌ను ప్రవేశపెట్టే పద్ధతి ద్వారా పాంక్రియాస్‌లోని బీటా కణాలను పునరుత్తేజితం చేయడం, కొత్త బీటా కణాలు పుట్టుకొచ్చేలా చేయడం ద్వారా టైప్-1 డయాబెటిస్తో బాధపడే చిన్నారుల రక్తంలో చక్కెర స్థాయి ని గణనీయంగా అదుపు చేయగలిగారు. ఈ ప్రక్రియను అనసరిస్తూ టైప్-1 డయాబెటిస్ చిన్నారులకు ఇంజెక్షన్ల ద్వారా ఇచ్చే ఇన్సులిన్ మోతాదును క్రమంగా తగ్గించే అవకాశం ఉందని స్టాన్ఫోర్డ్-బర్న్‌హామ్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, ఈ పద్ధతిలో ఒక ఇబ్బంది ఉంది. సెరులిన్ను ప్రవేశపెట్టే క్రమంలో ఒక్కోసారి పాంక్రియాస్‌కు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం లేకపోలేదు. దీనిని అధిగమించే దిశగా పరిశోధనలను సాగిస్తున్నామని వారు చెబుతున్నారు. టైప్-1 డయాబెటిస్ చికిత్సలో సరికొత్త విధానాలు టైప్-1 డయాబెటిస్ చికిత్సలో సరికొత్త విధానాలు సమీప భవిష్యత్తులోనే రోగులకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాధిని అదుపులో ఉంచడానికి, రోగి జీవన నాణ్యతను గణనీయంగా మెరుగుపరచడానికి దోహదపడగల ఈ అత్యధునాతన చికిత్సా విధానాలేమిటో తెలుసుకుందాం... ఎన్‌క్యాప్సులేటెడ్ బీటా సెల్ రీప్లేస్మెంట్ థెరపీ: క్లోమగ్రంథిలో (పాంక్రియాస్) ఇన్సులిన్ ఉత్పత్తికి దోహదపడే బీటా సెల్స్‌ను దాతల వద్ద నుంచి సేకరించి రోగి పాంక్రియాస్ వద్ద ప్రవేశపెడతారు. ఇవి క్రమంగా క్రియాశీలమై, రోగి రక్తంలోకి ఎంత మొత్తంలో చక్కెర విడుదలవుతోందో గ్రహించి, దానిని నియంత్రించడానికి కావలసినంత పరిమాణంలో ఇన్సులిన్‌ను విడుదల చేస్తాయి. అయితే, బయటి దాతల నుంచి సేకరించిన బీటా సెల్స్‌ను రోగి శరీరంలోకి ప్రవేశపెట్టేటప్పుడు ఒక్కోసారి రోగిలోని రోగనిరోధక శక్తి వాటిని శత్రుకణాలుగా భావించి, నాశనం చేసే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని నివారించడానికే మూలకణాలను (స్టెమ్‌సెల్స్) వయాసైట్స్ అనే తొడుగుతో రోగి చర్మం కింద పాంక్రియాస్ వద్ద ప్రవేశపెడతారు. సురక్షితమైన ఈ తొడుగు కారణంగా రోగనిరోధక కణాలు వాటిని నాశనం చేయలేవు. క్రమంగా ఈ స్టెమ్‌సెల్స్ పరిపూర్ణమైన బీటా సెల్స్‌గా మారి ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రారంభిస్తాయి. ఈ చికిత్సా విధానం ఎఫ్‌డీఏ అనుమతి కోసం ఎదురుచూస్తోంది. ఎఫ్‌డీఏ అనుమతి లభించిన వెంటనే ఈ విధానం రోగులకు అందుబాటులోకి రానుంది. డయాబెటిక్ న్యూరోపతి డయాబెటిక్ రోగులు కొందరిలో చేతుల్లోని నరాలు లాగినట్లుగా ఉండటం, చేతుల చివర్లు తిమ్మిరెక్కినట్లుగా ఉండటం, స్పర్శ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు ఇలాంటి లక్షణాల ద్వారానే రోగిలోని చక్కెర వ్యాధి బయటపడుతుంది. రక్తంలో పరిమితికి మించి చేరిన చక్కెర ఇతర అవయవాల మాదిరిగానే నరాలనూ దెబ్బతీస్తుంది. ఈ పరిస్థితినే డయాబెటిక్ న్యూరోపతి అంటారు. దీనిని కనుగొనేందుకు వైద్యులు ట్యూనింగ్ ఫోర్క్ టెస్ట్, మోనోఫిలమెంట్ ఎగ్జామినేషన్ వంటి పరీక్షలు చేస్తారు. ఇలాంటి పరీక్షలేవీ చేయించుకోకుండా వదిలేస్తే వ్యాధి ముదిరిపోయి, స్పర్శ కోల్పోయిన శరీరభాగం కుళ్లిపోవచ్చు. ఆ భాగాన్ని శస్త్రచికిత్సతో తొలగించాల్సి కూడా రావచ్చు. కరోనరీ ఆర్టరీ డిసీజెస్ చక్కెరజబ్బు ఉన్నవాళ్లకు శరీరంలో ఎక్కడ సమస్య ఉన్నా నొప్పి పెద్దగా తెలియదు. గుండె కూడా ఇందుకు మినహాయింపు కాదు. దాంతో లక్షణాలను పసిగట్టి, అది గుండెజబ్బు అని తెలుసుకునే లోపే జరగాల్సిన అనర్థం జరిగే ప్రమాదాలు ఉంటాయి. డయాబెటిస్ రోగుల్లో గుండె రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. అందుకే ఏడాదికి ఒకసారైనా ఈసీజీ, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ వంటి పరీక్షలు చేయించుకుంటూ, వైద్యుల సలహాపై జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ రక్తంలో చక్కెర ఎక్కువైతే, అది చిక్కబడి అక్కడక్కడా క్లాట్స్ ఏర్పడే పరిస్థితి తలెత్తుతుంది. ఇలాంటి క్లాట్స్ మెదడులో ఏర్పడితే స్ట్రోక్ వంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయి. శరీరం అంతటా విస్తరించి ఉండే రక్తనాళల్లో ఎక్కడ ఇలాంటి అవరోధాలు ఏర్పడినా ఇబ్బందులు తప్పవు. కాళ్లు, చేతుల్లోని రక్తనాళాల్లో అవరోధాలు ఏర్పడితే ఆ అవయవాలు మొద్దుబారిపోయి గ్యాంగ్రీన్‌కు (కుళ్లిపోవడం) గురవుతాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ అవయవాలను తొలగించాల్సి వస్తుంది. ఈ పరిస్థితి నివారించడానికి శరీర అవయవాలన్నింటికీ రక్తం సక్రమంగా సరఫరా అవుతోందో లేదో తెలుసుకునేందుకు ‘యాంకిల్ బ్రాకియల్ ఇండెక్స్’ (ఏబీఐ) అనే పరీక్ష నిర్వహిస్తారు. కాళ్లు, చేతులకు సరైన రీతిలో రక్తసరఫరా జరుగుతున్నదీ, లేనిదీ తెలుసుకునేందుకు ‘డాప్లర్ టెస్ట్’ నిర్వహిస్తారు. డయాబెటిస్ రోగులు అవసరం మేరకు ఈ పరీక్షలు చేయించుకుని, వైద్యుల సలహా మేరకు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అధిక రక్తపోటు డయాబెటిస్ రోగులకు స్థూలకాయం, డయాబెటిక్ నెఫ్రోపతి వంటి సమస్యలు ఉన్నట్లయితే, అలాంటి వారికి అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. రక్తపోటు పరిస్థితిని తెలుసుకునేందుకు చక్కెర జబ్బు ఉన్నవారు కనీసం మూడు నెలలకు ఒకసారైనా పరీక్షలు చేయించుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముందు జాగ్రత్తగా ఆహారంలో ఉప్పును తగ్గించుకోవడం మంచిది. నిర్లక్ష్యం చేస్తే అధిక రక్తపోటు ఒత్తిడికి మూత్రపిండాల్లోని సూక్ష్మ రక్తనాళాలు చిట్లిపోయే ప్రమాదం లేకపోలేదు.గుండెకు సంబంధించిన కరోనరీ ఆర్టరీ డిసీజెస్, అధిక రక్తపోటు, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ వంటి సమస్యలను మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్‌గా పరిగణిస్తారు. -
మళ్లీ కోరలు చాస్తున్న... హెచ్ఐవీ భూతం
► చాప కింద నీరులా వ్యాధి వ్యాప్తి ► రాష్ట్రంలో గుంటూరు జిల్లా టాప్ ► మూడో స్థానంలో కృష్ణాజిల్లా ► తాజా సర్వేలో వెల్లడి ► వ్యాధి నిర్ధారణకు కిట్లు కూడా లేవు ► పట్టించుకోని ప్రభుత్వం హెచ్ఐవీ భూతం మళ్లీ కోరలు చాస్తోంది. పాలకులు పట్టించుకోక.. నిధులు విడుదల కాకపోవడంతో వ్యాధి నిర్ధారణ కిట్లు కూడా అందుబాటులో ఉండటం లేదు. మందుల కొరత వల్ల అనేకమంది మృత్యువాత పడుతున్నారు. అవగాహన కార్యక్రమాలు కూడా స్తంభించిపోవటంతో మరోసారి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. విజయవాడ (లబ్బీపేట) : ఐదేళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాప్తిలో గుంటూరు, కృష్ణాజిల్లాలు రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉండేవి. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 20 శాతం ఈ జిల్లాల్లోనే నమోదవడంతో అప్పటి ప్రభుత్వం అప్రమత్తమై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. వ్యాధి నిర్ధారణకు ఐసీటీసీ సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు, వ్యాధి సోకిన వారికి మందులు ఇచ్చేందుకు ఏఆర్టీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. దీంతో ఈ రెండు జిల్లాల్లో రెండేళ్ల కిందట హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాప్తి గణనీయంగా తగ్గింది. ప్రస్తుత ప్రభుత్వ తీరుతో పాత రోజులు పునరావృతమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (ఏపీ సాక్స్)కి సరైన నిధులు విడుదల చేయకపోవడంతో హెచ్ఐవీ నియంత్రణ గురించి పట్టించుకునేవారే కరువయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో హెచ్ఐవీ వ్యాప్తిలో గుంటూరు జిల్లా అగ్రస్థానంలో, కృష్ణాజిల్లా మూడో స్థానంలో ఉన్నాయంటూ ప్రభుత్వం వెల్లడించిన తాజా సర్వేలో తేటతెల్లమైంది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరే దీనికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిర్ధారణ కిట్లు లేవు వ్యాధి లక్షణాలతో స్వచ్ఛందంగా పరీక్షల కోసం వచ్చిన వారికి ఆయా కేంద్రాల్లో ఉచితంగా పరీక్షలు చేయాల్సి ఉంది. పీవీటీసీటీలో గర్భిణులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఏడాదిగా వ్యాధి నిర్ధారణకు అవసరమైన కిట్లు లేక ఈ పరీక్షలు నిలిచిపోయాయి. దీంతో హెచ్ఐవీ లక్షణాలు ఉన్నా.. ప్రైవేటు ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకునే ఆర్థిక స్థోమత లేనివారు అలాగే ఉండిపోవాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు హెచ్ఐవీ బాధిత గర్భిణి నుంచి బిడ్డకు హెచ్ ఐవీ సోకకుండా పుట్టిన వెంటనే ‘నెవిరిఫిన్’ అనే సిరప్ వేస్తారు. ప్రస్తుతం సిరప్లు లేకపోవడంతో తల్లి నుంచి బిడ్డకు వచ్చే హెచ్ఐవీని నిరోధించలేకపోతున్నారు. దీంతో పది నెలల కాలంలో గుంటూరులో 3,495 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణాజిల్లాలో 2,376 కేసులు నమోదయ్యాయి. మందుల కొరత కృష్ణాజిల్లాలో మూడు, గుంటూరు జిల్లాలో ఆరు ఏఆర్టీ సెంటర్లు ఉం డగా, వాటిలో 32,660 మంది మందులు వాడుతున్నారు. ఒక్కసారి మందుల వాడకం ప్రారంభిస్తే జీవితాంతం వాడాల్సిందే. ఒక్కో సమయంలో ఏఆర్టీ మందుల కొరత నెలకొనడంతో, రోగులకు ఏంచేయాలో దిక్కుతోచని దుస్థితి నెలకొంటోంది. దీంతో వ్యాధి ముదిరి కొందరు రోగులు మృత్యువాత పడుతున్నట్లు చెపుతున్నారు. దీనంతటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవగాహన కార్యక్రమాలెక్కడ? ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడంతో జిల్లాల్లో హెచ్ఐవీ వైరస్‌పై నిర్వహించాల్సిన అవగాహన కార్యక్రమాలు కూడా పూర్తిగా స్తంభించిపోయాయి. ఒకప్పుడు ప్రభుత్వాలు ప్రకటనలు, ప్రచారంతో విస్తృత స్థాయిలో ఈ వ్యాధిపై అవగాహన కలిగించాయి. ప్రస్తుతం హెచ్ఐవీ అంశాన్ని పక్కన పెట్టేశారు. కనీస నిధులు మంజూరు చేయకపోవడమే గాక సిబ్బంది జీతాలు కూడా చెల్లించని దుస్థితి నెలకొంది. దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పనిచేస్తున్న 500 మంది సిబ్బంది జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. పింఛను విషయంలో మొండిచేయి... ఏఆర్టీ కేంద్రాల్లో ముందులు వాడుతున్న వారందరికీ ప్రతినెలా పింఛను మంజూరు చేయాల్సి ఉంది. ఇలా రెండు జిల్లాల్లో 32,660 మందికి ఫించన్లు అందాల్సి ఉండగా, మూడువేల మందికి మాత్రమే అందుతున్నాయి. మిగిలినవారు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ వేర్వేరు కారణాలు చూపుతూ వారికి మొండిచేయి చూపుతున్నారు. దీంతో వారంతా పింఛను కోసం ఎదురుచూస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. రెండు జిల్లాల్లో లక్షన్నరకు పైగానే... హెచ్ఐవీ వ్యాధి నిర్ధారణ చేసేందుకు కృష్ణాజిల్లాలో 14 ఐసీటీసీ కేంద్రాలు, 4 పీపీటీసీటీలు, 87 ఎఫ్‌ఐసీటీసీలు ఉన్నాయి. వాటిలో ఇప్పటివరకు ఏడు లక్షల మందికి పైగా పరీక్షలు చేయగా, 66,276 మందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారిక లెక్కలు చెపుతున్నాయి. కొందరు మృతి చెందగా, ఏఆర్టీ సెంటర్లలో 37,739 మంది పేర్లు నమోదు చేయించుకున్నారు. వారిలో వ్యాధి నిరోధకశక్తి తగ్గిన వారు 14,660 మంది మందులు వాడుతున్నారు. గుంటూరు జిల్లాలో 19 ఐసీటీసీలు, 6 ఏఆర్టీ సెంటర్లు ఉండగా, వంద వరకు ఎఫ్‌ఐసీటీసీలు ఉన్నాయి. ఇప్పటివరకు వాటిలో పరీక్షలు చేసిన వారిలో 66 వేల మందికి హెచ్ఐవీ పాజిటివ్ రాగా, 47 వేల మంది ఏఆర్‌టీల్లో పేర్లు నమోదు చేయించుకున్నారు. వారిలో 18 వేల మంది మందులు వాడుతున్నట్లు అధికారిక లెక్కలు చెపుతున్నాయి. వీరు కాక అనధికారికంగా మరో 20 వేల మంది ఉంటారనేది అంచనా. ఇలా రెండు జిల్లాల్లో కలిపి మొత్తం లక్షా 50 వేల మంది ఉంటారని అధికారులే చెపుతున్నారు. -
పెద్దాసుపత్రుల్లో టెక్నీషియన్ల కొరత
► కీలకమైన కార్డియాలజీ, క్యాథ్‌ల్యాబ్, ఈసీజీ, ఆఫ్తాల్మిక్ టెక్నీషియన్లు లేరు ► అల్లాడుతున్న రోగులు.. ► వైద్య పరీక్షలకోసం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన దుస్థితి ► రోగులకే కాదు.. ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులకూ ఇక్కట్లు ► 350 మంది టెక్నీషియన్ల కొరత ఉన్నట్టు ప్రాథమిక నివేదిక హైదరాబాద్: జబ్బు నిర్ధారణలో వైద్య పరీక్షలు చాలా కీలకం. తద్వారా ఈ పరీక్షలు చేసే టెక్నీషియన్లది ఎంతో కీలక పాత్ర. రోగికి సరైన వైద్యం చేయాలంటే వైద్యుడు సైతం టెక్నీషియన్పైన ఆధారపడాల్సిందే. దురదృష్టవశాత్తూ మన ప్రభుత్వాసుపత్రుల్లో టెక్నీషియన్లే లేరు. ఫలితంగా పేదలకు ప్రభుత్వాసుపత్రుల్లో సరిగా వైద్యమందని పరిస్థితి నెలకొంది. పెద్దాసుపత్రికి వెళ్లి, ఔట్‌పేషెంట్ చిట్టీ రాయించుకుని.. వైద్యుని వద్దకు వెళ్లగానే.. జబ్బు నిర్ధారణకోసం వైద్య పరీక్షలు రాస్తే అవి చేసే టెక్నీషియన్లు పూర్తి స్థాయిలో లేక రోగులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఫలితంగా వారు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది. వేధిస్తున్న టెక్నీషియన్ల కొరత..: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యకళాశాలలూ.. వాటికి అనుబంధంగా ఉన్న పెద్దాసుపత్రులను టెక్నీషియన్ల కొరత వేధిస్తోంది. రాష్ట్రంలో ఉన్న పెద్దాసుపత్రులకు ఏటా దాదాపు 40 లక్షల మంది ఔట్పేషెంట్లు వస్తుంటే.. అందులో ఐదారు లక్షల మందికి మాత్రమే కొద్దోగొప్పో వైద్య పరీక్షలు అందుతున్నాయి. మిగతావారిలో చాలామంది ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్నారు. ఏటా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం పొందే ఔట్పేషెంట్లు లేదా ఇన్‌పేషెంట్లు వైద్య పరీక్షలకోసం కనీసం రూ.1,500 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల వరకూ ప్రైవేటు ఆస్పత్రులకు చెల్లిస్తున్నట్టు అంచనా. ప్రభుత్వాసుపత్రుల్లో టెక్నీషియన్లు లేకపోవడమే ఇందుకు కారణం. టెక్నీషియన్ల కొరత కారణంగానే.. మన పెద్దాసుపత్రుల్లో సుమారు రూ.200 కోట్ల విలువైన పరికరాలు మూలనపడి ఉండడం గమనార్హం. కీలకమైన విభాగాల్లోనే కొరత.. రాష్ట్రంలో ఔట్పేషెంట్ల రద్దీ బాగా ఉండే ఆస్పత్రుల్లో విశాఖ కింగ్‌జార్జి, గుంటూరు పెద్దాసుపత్రి, కర్నూలు, కాకినాడలోని రంగరాయ, విజయవాడలోని సిద్ధార్థ వంటివి ఉన్నాయి. వీటికి రోజూ వేలల్లో పేషెంట్లు వస్తారు. కానీ వీటిలో కీలకమైన కార్డియాలజీ, ఈసీజీ, క్యాథ్‌ల్యాబ్, అనస్థీషియా, రేడియోగ్రాఫర్, సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, థియేటర్ అసిస్టెంట్లు, ఆఫ్తాల్మిక్ టెక్నీషియన్లు లేరు. దీంతో వైద్యులు నిర్ధారణ పరీక్షలు రాసినా అవి చేసేవారు అక్కడ లేకుండా పోయారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంటున్నది. కొన్నిసార్లు అత్యవసర పరిస్థితుల్లో రోగులు ఈసీజీలకు వస్తూంటారు. వీళ్లు బయటకు పోలేరు. లోపల టెక్నీషియన్లు ఉండరు. దీంతో వారి మనోవేదన వర్ణనాతీతం. వైద్యవిద్యార్థులకూ ఇక్కట్లే.. టెక్నీషియన్లు లేకపోవడం, వైద్య పరీక్షలు సరిగా జరగకపోవడంతో ఎంబీబీఎస్, పీజీ వైద్యవిద్యార్థులూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోగ నిర్ధారణ పరీక్షలు సక్రమంగా జరిగితేనే ఆ రోగమేంటీ? ఎలా వైద్యమందించాలన్నది వైద్యవిద్యార్థులకు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఏటా 1,750 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, 675 మంది పీజీ విద్యార్థులు కొత్తగా చేరుతుంటారు. అయితే పలు రకాల వైద్య నిర్ధారణ పరీక్షలు జరగకపోవడంతో వీరందరికీ పలు రోగాల విషయంలో నేర్చుకోవాల్సి అంశాలపై సందిగ్ధత ఏర్పడుతున్నట్టు విద్యార్థులే చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెద్దాసుపత్రులు, వైద్య కళాశాలల్లో 350 మందికిపైగా టెక్నీషియన్ల కొరత ఉన్నట్టు వైద్యాధికారుల ప్రాథమిక అంచనాలో తేలింది. రాష్ట్రంలోని కొన్ని ముఖ్యమైన ఆసుపత్రుల్లోని వివిధ విభాగాల్లో టెక్నీషియన్ల ఖాళీల వివరాలివీ... ఆస్పత్రి టెక్నీషియన్ల కొరత జీజీహెచ్, కాకినాడ 40 జీజీహెచ్, గుంటూరు 45 కింగ్‌జార్జి, విశాఖ 40 జీజీహెచ్, అనంతపూర్ 25 జీజీహెచ్, కర్నూలు 35 ఎస్వీఆర్, తిరుపతి 33 జీజీహెచ్, విజయవాడ 28