Diamond Business
-
రిటైల్‌లోకి డి బీర్స్
న్యూఢిల్లీ: వజ్రాల వ్యాపారంలో ఉన్న దిగ్గజ సంస్థ డి బీర్స్ భారత్‌లో రిటైల్‌లోకి ప్రవేశిస్తోంది. ఈ ఏడాది 15 ఫరెవర్‌మార్క్ బ్రాండ్ స్టోర్లను ప్రారంభించనున్నట్లు బుధవారం తెలిపింది. 2030 నాటికి 100 రిటైల్ స్టోర్లను నెలకొల్పాలని యోచిస్తున్నామని డి బీర్స్ ఇండియా ఎండీ అమిత్ ప్రతిహారి వెల్లడించారు. ‘తద్వారా ఆ సమయానికి ఒక మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఫరెవర్‌మార్క్ జ్యువెలరీ బ్రాండ్ ద్వారా రిటైల్‌లో పెట్టుబడి పెడుతున్నాం. ఈ ఏడాది ఢిల్లీలో ఎనిమిది, ముంబైలో 15 స్టోర్లను ప్రారంభిస్తాం. జూన్–జూలైలో తొలి కేంద్రం రానుంది. మార్కెట్ వాటాను పెంచుకోవడానికి సొంతంగా, లేదా ఫ్రాంఛైజీ విధానంలో ప్రత్యేక స్టోర్ల ఏర్పాటుపై ఎక్కువ దృష్టి పెడతాం. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద వజ్రాభరణాల మార్కెట్‌గా భారత్ నిలిచింది. ఈ పరిశ్రమ ఇక్కడ 10 శాతం మాత్రమే వ్యాప్తి చెందింది.విస్తరణకు భారీ అవకాశం ఉంది’ అని తెలిపారు. డైమండ్ వెరిఫికేషన్ టెక్నాలజీతో కూడిన చిన్న పరికరాన్ని కంపెనీ విడుదల చేసిందని, దీనిని భారత్‌లో వాణిజ్యీకరిస్తామని చెప్పారు. వజ్రం సహజమైనదా లేదా కృత్రిమమైనదా అని ఈ పరికరం గుర్తిస్తుందని వివరించారు. సింథటిక్ డైమండ్స్ వల్ల సహజ వజ్రాల పరిశ్రమకు ఎలాంటి ముప్పు లేదని అన్నారు. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు రెండింటినీ వేరు చేయడానికి నాణ్యత ధృవీకరణ అవసరం ఉందని చెప్పారు. -
కృత్రిమ వజ్రాలు తయారీ.. లాభనష్టాలు ఎవరికంటే..
వజ్రం అంటే దాదాపు అందరికీ కోహినూర్ వజ్రం గుర్తొస్తుంది. భూమిలోపల కొన్ని ఏళ్ల తరబడి చోటు చేసుకున్న రసాయన చర్య ఫలితంగా వజ్రం పుట్టుకొస్తుంది. వజ్రాన్ని కార్బన్ ఘన మూలకంగా భావించొచ్చు. అందులోని పరమాణువులు స్ఫటికాల ఆకారంలో కనిపిస్తాయి. దీంతో వజ్రం గట్టిగా ఉంటుంది. ఇతర ఏ పదార్థాల్లో లేని ఉష్ణవాహకత సామర్థ్యం వజ్రంలో ఉంటుంది. సహజంగా దొరికే వజ్రాల వయసు 1 బిలియన్ నుంచి 3.5 బిలియన్ సంవత్సరాలు ఉంటుంది. భూమిలో 150 నుంచి 250 కిలోమీటర్ల లోపలికి తవ్వితే కానీ వజ్రాలు లభ్యం కావు. అలాంటి సహజ వజ్రాలకు పోటీగా ఇప్పుడు కృత్రిమ వజ్రాలను తయారుచేస్తున్నారు. తాజాగా యాంట్వెర్ప్ వరల్డ్ డైమండ్ సెంటర్ (ఏడబ్ల్యూడీసీ) నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ల్యాబ్ గ్రోన్ డైమండ్ల మార్కెట్ వాటా 2016లో 1% నుంచి 2024లో 20%కి పెరిగినట్లు తేలింది. 2030లో అది భారీ వృద్ధిని సాధిస్తుందని అంచనా వేసింది. కృత్రిమ వజ్రం ఎలా తయారు చేస్తారంటే.. న్యూయార్క్‌లోని జనరల్ ఎలక్ట్రిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో 1954లో తొలిసారి ల్యాబ్ గ్రోన్ డైమండ్‌ను సృష్టించారు. తరువాత అనేక పరిశోధనలు చేసి వాటి తయారీ వేగం పెంచడానికి రెండు పద్ధతులు కనుగొన్నారు. అందులో ఒకటి అధిక పీడనం, అధిక ఉష్ణం(హెచ్‌పీహెచ్‌టీ) రెండోది రసాయన ఆవిరి నిక్షేపణ(సీవీడీ). ఈ రెండు పద్ధతులకు సీడ్ తప్పనిసరి. అంటే ఏదైనా ఇతర డైమండ్లోని కొంత భాగం సీడ్‌గా పని చేస్తుంది. అధిక పీడనం, అధిక ఉష్ణం పద్ధతిలో సీడ్, స్వచ్ఛమైన గ్రాఫైట్ కార్బన్‌ను ఒక చోట ఉంచుతారు. వాటిని దాదాపు 1500 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేస్తారు. అలాగే పీడనాన్ని కలిగిస్తారు. దాంతో కార్బన్ డైమండ్గా రూపాంతరం చెందుతుంది. రసాయన ఆవిరి నిక్షేపణ విధానంలో కార్బన్ రిచ్ గ్యాస్ నింపిన ఛాంబర్లో సీడ్‌ను ఉంచి 800 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేస్తారు. దాంతో కార్బన్ డైమండ్గా మారుతుంది. నాణ్యత ఎలా ఉంటుందంటే.. భూమిలో నుంచి తవ్వి తీసిన వజ్రాల్లాగే ల్యాబ్ వజ్రాలను డైమండ్ టెస్టర్‌తో పరీక్షిస్తారు. వాటిలోని కార్బన్ మిశ్రమం, ఉష్ణవాహకత ఇంచుమించు సహజ వజ్రాల్లానే ఉంటాయి. దృఢంగా ఉండటంతోపాటు, గీతలు పడవు. కిందపడినా పగిలిపోవు. సహజంగా వజ్రాన్ని ఎలా కోస్తారో వీటిని కూడా అలాగే కోయాల్సి ఉంటుంది. యంత్రాల్లో వినియోగించే కొన్ని లోహాలు గట్టిదనం లేక విరిగిపోతుంటాయి. అటువంటి చోట కృత్రిమ వజ్రాలనే వాడుతున్నారు. కృత్రిమ వజ్రాలతో పనిముట్లు కూడా తయారు చేస్తున్నారు. విద్యుత్ తయారీ రంగంలోనూ స్వచ్ఛమైన సింథటిక్ డైమండ్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. హైపవర్ లేజర్ డయోడ్స్లో వాటిని ఉష్ణవాహకాలుగా వినియోగిస్తున్నారు. డిమాండ్ ఎలా ఉందంటే.. సహజంగా అరుదుగా దొరికే వాటిపై ఉన్న వ్యామోహం కృత్రిమంగా దొరికే వాటిపై ప్రజలకు ఉండదు. పురాతన వజ్రం అనగానే ధనికులు కోట్లు కుమ్మరించి కొనుగోలు చేస్తుంటారు. కృత్రిమం అనగానే చిన్నచూపు చూస్తారు. నేటి రోజుల్లో వివాహ శుభకార్యాలకు బంగారం కొనడం సర్వ సాధారణమైంది. దాంతో భిన్నంగా ఉండాలని కొందరు వజ్రాల ఉంగరం, వజ్రాల నగల కొనుగోళ్లపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇదీ చదవండి: త్వరలో భారత మొబైల్ ఫోన్ బ్రాండ్ మధ్య తరగతి ప్రజలు కూడా కనీసం ఓ డైమండ్ ఉంగరమైనా సరే కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. ఇలాంటి వారు కృత్రిమ వజ్రాలు ఎంపిక చేసుకుంటే ఖర్చు కలిసి వస్తుందని తయారీదారులు చెబుతున్నారు. అయితే సహజ వజ్రాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్న కృత్రిమ వజ్రాల ధర భవిష్యత్తులో మరింత తగ్గిపోవచ్చనే ఊహాగానాలున్నాయి. దాంతో కొనడానికి వెనకడుగు వేస్తున్నారు. -
Narendra Modi: నా మూడో ఇన్నింగ్స్ పక్కా!
సూరత్: ప్రధానమంత్రిగా తన మూడో ఇన్నింగ్స్‌లో మన దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం ఖాయమని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. తద్వారా తాను వరుసగా మూడోసారి ప్రధానిగా ఎన్నికవుతానని పరోక్షంగా తేలి్చచెప్పారు. గుజరాత్‌లోని సూరత్ నగరంలో ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య సముదాయంగా అభివృద్ధి చేసిన ‘సూరత్ డైమండ్ బోర్స్’ భవనాన్ని ఆయన ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ వాణిజ్య కేంద్రం నూతన భారతదేశ బలానికి, అంకితభావానికి ఒక ప్రతీక అని చెప్పారు. సూరత్ వజ్రాల పరిశ్రమ 8 లక్షల మందికి ఉపాధి కలి్పస్తోందని ప్రశంసించారు. కొత్త వాణిజ్య సముదాయంతో మరో 1.5 లక్షల మందికి ఇక్కడ ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. సూరత్ కీర్తికిరీటంలో మరో వజ్రం చేరిందని హర్షం వ్యక్తం చేశారు. ఇది చిన్న వజ్రం కాదని, ప్రపంచంలోనే అత్యుత్తమమైన వజ్రమని వ్యాఖ్యానించారు. దీని వెలుగుజిలుగుల ముందు ప్రపంచంలోనే పెద్దపెద్ద భవనాలు కూడా వెలవెలబోతాయని అన్నారు. ప్రపంచంలో వజ్రాల పరిశ్రమ గురించి ఎవరూ మాట్లాడుకున్నా ఇకపై సూరత్‌ను ప్రస్తావించాల్సిందేనని చెప్పారు. సూరత్ భాగస్వామ్యం పెరగాలి వచ్చే 25 ఏళ్లలో సాధించాల్సిన లక్ష్యాలకు ప్రభుత్వం నిర్దేశించుకుందని మోదీ చెప్పారు. దేశాన్ని దాదాపు 10 ట్రిలియన్ డాలర్ల(10 లక్షల కోట్ల డాలర్లు) ఆర్థిక వ్యవస్థగా మార్చడంతోపాటు ఎగుమతుల్లో కొత్త రికార్డులు సృష్టించాలన్నదే తమ ధ్యేయమని వివరించారు. దేశం నుంచి ఎగుమతుల విషయంలో సూరత్ సిటీ భాగస్వామ్యం మరింత పెరగాలని పిలుపునిచ్చారు. వజ్రాలు, ఆభరణాల పరిశ్రమకు ఇదొక గొప్ప అవకాశమని అన్నారు. భారత్ వైపు ప్రపంచ దేశాల చూపు నేడు ప్రపంచ దేశాలు భారత్‌వైపు చూస్తున్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు. ఎన్నో అంశాల్లో మనపై ఆధారపడుతున్నాయని, మన దేశ పేరు ప్రతిష్టలు పెరిగాయని, మేడిన్ ఇండియా ఇప్పుడు బలమైన బ్రాండ్‌గా మారిందన్నారు. లక్షలాది మంది యువతకు సూరత్ డ్రీమ్ సిటీగా మారిందని, ఇక్కడ ఐటీ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆనందం వ్యక్తం చేశారు. సూరత్ ఎయిర్‌పోర్టులో నూతన ఇంటిగ్రేటెడ్ టెరి్మనల్ బిల్డింగ్‌ను మోదీ ఆదివారం ప్రారంభించారు. -
భారీగా తగ్గిన డైమండ్ ధరలు!
గతేడాది నవరాత్రి-దసరా కాలంతో పోలిస్తే ఈసారి పాలిష్ చేసిన వజ్రాల ధరలు గణనీయంగా 35 శాతం తగ్గాయి. కొన్ని కేటగిరీలకు చెందిన వజ్రాల ధరలు 2004లో ఉన్న ధరలతో సమానమయ్యాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, యుఎస్, చైనాలో నెలకొంటున్న ఆర్థిక మాంద్యంతోపాటు ల్యాబ్‌లో తయారుచేసిన వజ్రాలకు పెరుగుతున్న ఆదరణ వల్ల ధరలు క్షీణిస్తున్నట్లు సమాచారం. పాలిష్ చేసే వజ్రాల్లో ప్రపంచంలోనే 90 శాతం భారత్‌లోనే తయారవుతాయి. అయితే ధరలు తగ్గడంతో కంపెనీలు దేశీయ మార్కెట్లో తక్కువ ధరలకు విక్రయించాలని చూస్తున్నాయి. డైమండ్ ధరలు తగ్గడం వల్ల దేశంలోని స్టోర్‌ల్లో దసరా సందర్భంగా 20 శాతం అమ్మకాలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. దేశీయ మార్కెట్లో ముడి వజ్రాల ధరలు కూడా తగ్గడం ప్రారంభించాయని, దాంతో పాలిష్ చేసిన వజ్రాల ధరలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గత మూడు నెలలుగా పాలిష్ చేసిన వజ్రాల కొనుగోలుదారుగా ఉన్న యూఎస్‌లో డిమాండ్ తగ్గడంతో కూడా వజ్రాలు సరసంగా లభిస్తున్నాయి. -
ఉద్యోగులకు ఖరీదైన ఫ్లాట్స్: బిలియనీర్ గొప్పమనసు
Savji Dholakia ఉద్యోగులకు ఖరీదైన కార్లు, ఇళ్లు, బంగారం లాంటి భారీ బహుమతులుఇవ్వడంలో సూరత్‌లోని వ్యాపారుల తరువాతే ఎవరైనా. తాజాగా సూరత్‌కుచెందిన బిలియనీర్ కార్మికులకు ఫ్లాట్లను బహుమతిగా ఇవ్వడం విశేషంగా నిలిచింది. ప్రతి సంవత్సరం దీపావళికి తన ఉద్యోగులకు ఖరీదైన బహుమతుల వర్షం కురిపించడం వజ్రాల వ్యాపారికి అలవాటు. (లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను విక్రయించిన ముఖేష్ అంబానీ) సూరత్‌లో అత్యంత ధనవంతుడు హరికృష్ణ ఎక్స్ పోర్ట్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సావ్జీ ధోలాకియా ఏటా తన ఉద్యోగులకు రూ.50 కోట్లకు పైగా ప్రోత్సాహకాలను అందిస్తారు. ఒకసారి తన కార్మికులకు దీపావళి బోనస్‌గా 400 ఫ్లాట్లు , 1260 కార్లను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రతీ ఏడాదిదీపావళి బోనస్‌గా ఉద్యోగులకు ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా బహుమతిగా ఇస్తారు. అత్యంత ప్రతిభ చూపించిన వారికి ఖరీదైన వస్తువులు, నగలు కూడా అందిస్తారు. జీవితంలో ఎవరికైనా తొలి కారు కొనుక్కోవడం అంటేచాలా గొప విషయం. తన ఉద్యోగుల్లో ఉత్సాహం నింపేలా ఏటీ బహుమతులు ఇస్తూ ఉంటానని, తద్వారా పనితీరు, జీవనశైలి మెరుగుపడుతుంది,వారి కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. అంతిమంగా అది కంపెనీకి కూడా ఉపయోగపడుతుంది అని ధోలాకియా ఒకసారి చెప్పారు. (కేంద్రం కీలక నిర్ణయం: టీసీఎస్‌కు బంపర్ ఆఫర్) అంతేకాదు ఎనలేని సంపద ఉన్నప్పటికీ మనవడిని సామాన్య జీవనం గడిపేలా చేశాడు. సావ్టీ మనవడు రువిన్ ధోలాకియా, విద్యను పూర్తి చేసిన తర్వాత అమెరికా నుండి తిరిగి వచ్చాడు. రోజూ సామాన్య జనం పడుతున్న కష్టాలను నేర్చుకోవాలని, గొప్ప మేనేజ్మెంట్ స్కూల్‌తో పోలిస్తే మంచి ఉపాధ్యాయుడిచ్చే అనుభవాలు గొప్పవని సావ్జీ ధోలాకియా విశ్వాసం. ధోలాకియా అమెర్లీలోని ఒక రైతు కుటుంబంలో జన్మించారు. 13 ఏళ్లకే చదువు మానేశాడు. 1977లో స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్సులో తన జేబులో టిక్కెట్టు ఛార్జీగా కేవలం పన్నెండు రూపాయల యాభై పైసలతో సూరత్‌కు వచ్చారు. సూరత్‌లోని తన మామ వజ్రాల వ్యాపారంలో చేరాడు. అతని సోదరులు కూడా వ్యాపారంలో చేరారు. వీరిద్దరూ కలిసి 1984లో తమ సొంత వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించారు. సాధారణ కార్మికుడిగా, కూలిగా జీవనం సాగించి అంచెలంచెలుగా ఎదిగిన సావ్జీ ధోలాకియా ప్రస్తుత నికర విలువ దాదాపు రూ. 12000 కోట్లు. 2014 నాటికి, వారు 6500 మంది ఉద్యోగులను కలిగి ఉన్నారు.2022లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం అందించింది. అంతేకాతు కుటుంబం తనకు గిఫ్ట్‌గా ఇచ్చిన హెలికాప్టర్‌ను సూరత్‌లో వైద్యం ఇతర అత్యవసర పరిస్థితుల కోసం రూ. 50-కోట్ల బ్రాండ్-న్యూ ఛాపర్‌ని విరాళంగా అందించాలని(గతంలో) నిర్ణయించడం విశేషం. అలాగే సౌరాష్ట్రలోని అమ్రేలి జిల్లాలోని లాఠీ తాలూకాలోని తన స్వస్థలంలో ఇప్పటికే 75 చెరువులను నిర్మించడమేకాదు 20 లక్షలకుపైగామొక్కల్నినాటారు. మొదట్లో ధోలాకియా మొదట గార్మెంట్ షాపులో సేల్స్‌మెన్‌గా, హెటల్లో , వాచ్ అవుట్‌లెట్‌లో ఆఖరికి కూలీగా కూడా పనిచేశాడట.. రెండు రోజులు కూలి పని కూడా చేశాడు. చెన్నైలో రోజుకు అతని సంపాదన. కేవలం రూ.200 మాత్రమే. అందుకే జీవితంలో సగటుమనిషి కష్టాలు, కన్నీళ్లు తెలుసు. ఎంత ఎదిగినా. తాను నడిచి వచ్చిన త్రోవను మర్చిపోలేదు. అందుకే తన సంపాదనలో సింహ భాగం ఉద్యోగులకు ఇస్తూ తన గొప్పదనాన్ని చాటుకుంటున్నారు. -
Surat Diamond Bourse: ఇది ‘వజ్రాల వ్యాపార గని’
బెల్జియంలోని యాంట్వెర్ప్ పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది ఒక్కటే. ప్రపంచంలోనే వజ్రాల వ్యాపారానికి చిరునామాగా చలామణి అవుతున్న నగరమది. ఇప్పుడు ఆ పేరుకు చెల్లుచీటి రాసేస్తూ గుజరాత్‌లోని సూరత్ పట్టణం కొత్త అధ్యయనం లిఖించింది. ఒకేసారి 65,000 మందికిపైగా వ్యాపారులు, పనివాళ్లు, పరిశ్రమ నిపుణులు వచ్చి పనిచేసుకునేందుకు వీలుగా సువిశాల అధునాతన భవంతి అందుబాటులోకి వచ్చింది. 71 లక్షల చదరపు అడుగులకుపైగా ఆఫీస్ స్పేస్‌తో నూతన ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. అమెరికా రక్షణ శాఖ ప్రధానకార్యాలయం (పెంటగాన్) పేరిట ఉన్న ఈ రికార్డును చెరిపేసిన అద్భుత భవంతి విశేషాలు ఇవీ.. రూ. 3,200 కోట్ల వ్యయంతో.. విశ్వవ్యాప్తంగా వెలికితీసిన వజ్రాల్లో దాదాపు 90 శాతం వజ్రాలను సానబట్టేది సూరత్‌లోనే. దాంతో భారత్‌లో జెమ్ క్యాపిటల్‌గా సూరత్ కీర్తిగడించింది. అందుకే సూరత్‌లో వజ్రాల వ్యాపార అవసరాలు తీర్చేందుకు అనువుగా ఈ భవనాన్ని నిర్మించారు. దీనికి ‘సూరత్ డైమండ్ బౌర్స్’ అని నామకరణం చేశారు. బౌర్స్ పేరుతో గతంలో ఫ్రాన్స్‌లో పారిస్ స్టాక్ఎక్సే్ఛంజ్ ఉండేది. అంటే వజ్రాల వ్యాపారానికి సిసలైన చిరునామా ఇదే అనేట్లు దీనికి ఆ పేరు పెట్టారు. వజ్రాలను సానబట్టే వారు, వ్యాపారులు, కట్టర్స్ ఇలా వజ్రాల విపణిలో కీలకమైన వ్యక్తులందరూ తమ పని మొత్తం ఇక్కడే పూర్తిచేసుకోవచ్చు. తొమ్మిది దీర్ఘచతురస్రాకార భవంతులను విడివిడిగా నిర్మించి అంతర్గతంగా వీటిని కలుపుతూ డిజైన్‌చేశారు. మొత్తంగా 35 ఎకరాల్లో ఈ కట్టడం రూపుదాల్చింది. అంటే 71 లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌స్పేస్ అందుబాటులోకి వచ్చింది. కోవిడ్ సమయంలో తప్పితే నాలుగేళ్లుగా విరామమెరుగక కొనసాగిన దీని నిర్మాణం ఇటీవలే పూర్తయింది. నవంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా ప్రారంభోత్సవం జరిగే అవకాశం ఉంది. దాదాపు రూ.3,200 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. మొత్తంగా 4,700 భారీ దుకాణాలు ఇందులో ఉన్నాయి. అన్నివైపులా ఎక్కడికక్కడ అనువుగా 131 ఎలివేటర్లను ఏర్పాటుచేశారు. అందరికీ భోజన సదుపాయం, రిటైల్ వర్తకులకు ప్రత్యేక సౌకర్యాలు, వెల్నెస్, కార్మికుల కోసం సమావేశ మందిరాలను కొలువుతీర్చారు. ‘150 మైళ్ల దూరంలోని ముంబై నుంచి వేలాది మంది వ్యాపారాలు రోజూ సూరత్‌కు వచ్చిపోతుంటారు. ఇలా ఇబ్బందిపడకుండా వారికి సకల సౌకర్యాలు కల్పించాం’ అని ప్రాజెక్టు సీఈవో మహేశ్ గధావీ చెప్పారు. ప్రజాస్వామ్య డిజైన్! ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు డిజైన్ చేయాల్సిందిగా అంతర్జాతీయంగా బిడ్డింగ్‌కు ఆహ్వానించగా భారత్‌కే చెందిన మోర్ఫోజెనిసిస్ ఆర్కిటెక్చర్ సంస్థ దీనిని కైవసం చేసుకుంది. డైమండ్లకు ఉన్న డిమాండ్ ఈ ప్రాజెక్టు పరిమాణాన్ని అమాంతం పెంచేసింది. ఇప్పటికే అన్ని దుకాణాలను డైమండ్ కంపెనీలు నిర్మాణానికి ముందే కొనుగోలుచేయడం విశేషం. ఎయిర్పోర్ట్ టెర్మినల్ తరహాలో అన్ని బిల్డింగ్‌లను కలుపుతూ ఒక్కటే భారీ సెంట్రల్ కారిడార్‌ను నిర్మించారు. ‘‘అందరికీ సమానంగా అన్ని సౌకర్యాలు అనే విధానంలో ‘ప్రజాస్వామ్య’ డిజైన్‌ను రూపొందించాం. సెంట్రల్ కారిడార్ ద్వారా అందరికీ అన్ని సౌకర్యాలు సమదూరంలో ఉంటాయి’’ అని మోర్ఫోజెనిసిస్ సహ వ్యవస్థాపకురాలు సోనాలీ రస్తోగీ చెప్పారు. అంటే ప్రధాన ద్వారాల్లో ఎటువైపు నుంచి లోపలికి వచ్చినా చివరి దుకాణానికి ఏడు నిమిషాల్లోపు చేరుకోవచ్చు. కాంక్రీట్ వనంగా కనిపించకుండా ఉండేందుకు 1.5 ఎకరాల విస్తీర్ణంలో పచ్చికబయళ్లను సిద్ధంచేశారు. ఇలాంటివి లోపల తొమ్మిది ఉన్నాయి. ప్లాటినమ్ రేటింగ్ సూరత్‌కు దక్షిణంగా 1,730 ఎకరాల్లో స్మార్ట్ సిటీని ఒకదానిని నిర్మిస్తే బాగుంటుందని ప్రధాని మోదీ గతంలో అభిలషించారు. ఆయన సంకల్పానికి బాటలు వేస్తూ ఇప్పుడు ఈ భవంతి నిర్మాణం పూర్తయ్యాక చుట్టూతా నూతన జనావాసాలు, వ్యాపార సముదాయాలు ఏర్పడతాయని భావిస్తున్నారు. ఎండాకాలంలో ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత 110 డిగ్రీస్ ఫారన్‌హీట్‌ను దాటుతుంది. అయినాసరే భవంతిలో ఎక్కువ ఇంథనం వాడకుండా పర్యావరణహితంగా డిజైన్‌చేశారు. సాధారణ భవనాలతో పోలిస్తే ఈ భవంతి 50 శాతం తక్కువ ఇంధనాన్ని వినియోగించుకుంటుంది. అందుకే దీనికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ‘ప్లాటినమ్’ రేటింగ్‌ను కట్టబెట్టింది. మధ్యమధ్యలో వృత్తాకారంగా వదిలేసిన శ్లాబ్స్ కారణంగా గాలి ధారాళంగా దూసుకొచ్చి బిల్డింగ్ లోపలి భాగాలను చల్లబరుస్తుంది. దాదాపు సగం భవంతి సాధారణ వెంటిలేషన్ ద్వారానే చల్లగా ఉంటుంది. ఇక మిగతా కామన్ ఏరియాస్‌లో సౌర ఇంధనాన్ని వినియోగించనున్నారు. ఆకృతిపరంగానేకాదు పర్యావరణహిత, సుస్థిర డిజైన్‌గా ఈ భవంతి భాసిల్లనుంది. కట్టడం కథ లెక్కల్లో.. మొత్తం కట్టింది: 35 ఎకరాల్లో భారీ దుకాణాలు: 4,700 అందుబాటులోకొచ్చే ఆఫీస్ స్పేస్: 71 లక్షల చదరపు అడుగులు ఎలివేటర్లు: 131 బిల్డింగ్ రేటింగ్: ప్లాటినమ్ మొత్తం వ్యయం: రూ.3,200 కోట్లు – సాక్షి, నేషనల్ డెస్క్ -
అదానీ తనయుడి ఎంగేజ్మెంట్, ముచ్చటైన జంట ఫోటో వైరల్
సాక్షి, ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూపు అధినేత గౌతం అదానీ ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. అదానీ కుమారుడు జీత్ అదానీతో, వ్యాపారి సీ దినేష్ అండ్ కో ప్రైవేట్ లిమిటెడ్ అధినేత దివా జైమిన్ షా కుమార్తె దివాతో నిశ్చితార్థ వేడుక జరిగింది. మార్చి 12న ఆదివారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ వేడుక జరిపించారు. ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫోటో ఒకటి ఇపుడు హాట్ టాపిక్‌గా నిలిచింది. జీత్, దివా జంట చూడముచ్చటగా ఆకట్టుకునేలా కనిపిస్తున్నారు. ఇరు కుటుంబ సభ్యుల సన్నిహితులు మధ్య ఈ నిశ్చితార్థ వేడుక నిర్వహించినట్టు తెలుస్తోంది. దీంతో సోషల్‌మీడియా వేదికగా కాబోయే జంటకు అభినందనలు వెల్లువెత్తాయి. అయితే ఈ వేడుకపై ఇరు కుటుంబాలు అధికారికంగా స్పందించాల్సి ఉంది. గౌతం అదానీ చిన్నకుమారుడైన జీత్ అదానీయూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్ నుండి తన చదువు పూర్తి చేశారు. ప్రస్తుతం గ్రూప్ ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. అంతేకాదు జీత్ అదానీ ఒక ఔత్సాహిక పైలట్ కూడా. గతంలో జీత్ తాను విమానం నడుపుతున్న చిత్రాన్ని ట్విటర్లో షేర్ చేస్తూ తోటి పైలట్లు, వర్ధమాన ఆశావహులందరికీ ప్రపంచ పైలట్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇక దివా తండ్రి జైమిన్ షా సీ దినేష్ అండ్ కో-ప్రైవేటు లిమిటెడ్ ప్రస్తుత డైకెర్టర్లలో జైమిన్ షా కూడా ఉన్నారు. కాగా గౌతం అదానీ పెద్ద కుమారుడు కరణ్, న్యాయ సంస్థ సిరిల్ అమర్‌చంద్ మంగళదాస్ మేనేజింగ్ భాగస్వామి సిరిల్ ష్రాఫ్ కుమార్తె పరిధి ష్రాఫ్‌ను పెళ్లాడారు. కరణ్ అదానీ అదానీ పోర్ట్స్ & సెజ్ లిమిటెడ్ సీఈవో, అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ డైరెక్టర్‌గా ఉన్నారు. Good news for #Adani Tycoon Gautambhai Adani's youngest son Jeet gets engaged to Mumbai girl Diva, daughter of diamond merchant Jaimin Shah. Cheers to the couple! @gautam_adani pic.twitter.com/d7z7nqdOMK — Rovina (@rovi2525) March 14, 2023 Wishing all fellow pilots and budding aspirants a happy world pilot’s day ✈️#WorldPilotsDay pic.twitter.com/DY9LVEEpn5 — Jeet Adani (@jeet_adani1) April 26, 2022 p> -
మన వజ్రం.. వజ్రమే!
కరోనా ప్రేరిత అంశాల నేపథ్యంలో దేశీయ వజ్రాల పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందన్న తొలి అంచనాలు తాజాగా కొంత మెరుగుపడుతున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) విభాగం క్రిసిల్ తన నివేదికలో పేర్కొంది. నివేదికలోకి ప్రధానాంశాలను పరిశీలిస్తే... తొలి అంచనాలు ఇలా.. కోవిడ్–19 తీవ్ర ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో 2020–21 దేశీయ వజ్రాల పరిశ్రమ ఆదాయాలు 33 శాతానికి పైగా పడిపోతాయన్నది (2019–20 ఆర్థిక సంవత్సరంతో పోల్చి) తొలి అంచనా. లాక్డౌన్ తత్సంబంధ అంశాల నేపథ్యంలో ఎదురయిన బలహీన డిమాండ్ పరిస్థితుల వల్ల ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెప్టెంబర్) దేశీయ ఎగుమతుల పరిశ్రమ దాదాపు సగానికి సగం నష్టపోయి, (2019 ఇదే కాలంతో పోల్చి) కేవలం 5.5 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పరిశ్రమ వద్ద అటు ముడి, పాలిష్డ్ డైమండ్ల పరిమాణం భారీగా ఉంది. దాదాపు 7 నెలల పాటు ఈ పరిస్థితి కొనసాగింది. ప్రతికూల అంచనాలకు ఇదీ ఒక కారణం అయ్యింది. రఫ్ డైమండ్ ధరలు స్థిరంగా ఉండి, పాలిష్డ్ డైమండ్ల ధరలు పడిపోతుంటే బలహీన డిమాండ్‌కు ఇది సంకేతమవుతుంది. ఇది పరిశ్రమను నిల్వల పరమైన నష్టానికి గురిచేస్తుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రెండవ త్రైమాసికం ముగిసే నాటికి మైనింగ్ సంస్థలు రఫ్ డైమండ్ ధరలను దాదాపు 10 శాతం తగ్గించేశాయి. నిజానికి ప్రతియేడాదీ నిల్వల పెంపుపై రెండవ త్రైమాసికం నుంచే ఇండియన్ డైమండ్ పాలిష్డ్ పరిశ్రమ దృష్టి సారిస్తుంది. నవంబర్ ప్రారంభం నుంచీ ప్రపంచ వ్యాప్తంగా వివిధ పండుగల సీజన్, అలాగే చైనా కొత్త ఏడాది ఉత్సవాల ప్రారంభం వంటి అంశాలు దీనికి నేపథ్యం. అయితే 2020లో ఈ తరహా పరిస్థితి చోటుచేసుకోలేదు. కేవలం నిల్వలు తగ్గించుకోవడం ఎలా అన్న అంశంపైనే పరిశ్రమ దృష్టి పెట్టింది. రికవరీకి దోహదపడిన అంశాలు.. ఎగుమతుల మార్కెట్లో చక్కటి రికవరీ నమోదవుతోంది. డిమాండ్ కూడా క్రమంగా పెరుగుతోంది. ప్రత్యేకించి అమెరికా, చైనా, హాంకాంగ్ మార్కెట్లలో సానుకూల పరిస్థితులు వేగంగా మెరుగుపడుతున్నాయి. భారత్ ప్రధాన మార్కెట్లు అయిన అమెరికా, చైనాల్లో రిటైల్ అమ్మకాలు దాదాపు 3 నుంచి 5 శాతం మేర వృద్ధి చెందుతున్నాయి. స్వల్ప కాలంలో ఈ రంగం పురోగతిలో ఉందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. యూరోపియన్ యూనియన్‌లోని కొన్ని దేశాల్లో కొత్తగా లాక్డౌన్లు విధిస్తున్నప్పటికీ, వజ్రాల పరిశ్రమ డిమాండ్ తగ్గదని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్–19 వ్యాక్సినేషన్ పక్రియ క్రియాశీలంగా ఉండడం దీనికి కారణం. రుణాలకు సంబంధించి భారత్ బ్యాంకింగ్ సకాలంలో ఇచ్చిన మద్దతు కూడా పరిశ్రమ సవాళ్లను ఎదుర్కొనడానికి దోహదపడింది. నవంబర్ గణాంకాలు చూస్తే.. 2020 మేలో భారత్ డైమండ్ ఎగుమతులను చూస్తే, ఈ పరిమాణం విలువలు వరుసగా దాదాపు 5 లక్షల క్యారెట్లు, 389 మిలియన్ డాలర్లులుగా ఉన్నాయి. నవంబర్ 2020 నాటికి ఈ లెక్కలు 23 లక్షల క్యారెట్లు, 1,665 మిలియన్ డాలర్లుగా ఉంది. 2019 మేలో విలువలు 21 లక్షల క్యారెట్లు, 1,864 మిలియన్ డాలర్లు. అమెరికా, యూరప్‌లే మన ప్రధాన మార్కెట్లు భారత్ పాలిష్డ్ డైమండ్ ఎగుమతుల విలువ దాదాపు రూ.1.32 లక్షల కోట్లు. వీటిలో దాదాపు సగం వాటా అమెరికా, యూరప్లదే కావడం గమనార్హం. రూ. 1.8 లక్షల కోట్ల డైమెండ్ మార్కెట్‌తో ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్ పాలిష్డ్ హబ్‌గా సూరత్ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ దాదాపు ఐదు లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ప్రపంచంలోని ప్రతి 10 పాలిష్డ్ డైమండ్స్‌లో 9 ఇక్కడి దాదాపు 6000 పాలిషింగ్ యూనిట్ల నుంచే సరఫరా అవుతున్నాయి. భారత్ మొత్తం ఎగుమతుల్లో 80 శాతం ఇక్కడి నుంచే జరుగుతోంది. నగదు లభ్యత సవాళ్లు తగ్గాయ్... ప్రస్తుతం పరిశ్రమకు నగదు లభ్యత సవాళ్లు తగ్గాయి. కఠిన లాక్డౌన్ అమలు జరిగిన తొలి త్రైమాసికంలో అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. ఈ పరిస్థితుల్లో భారత డైమండ్ వ్యాపారస్తులు నిల్వల స్థాయిని తగ్గించుకోవడంపై ప్రణాళికలు రూపొందించుకున్నారు. అలాగే రావాల్సిన వసూళ్లు, ఆదాయాల స్థిరత్వంపై దృష్టి సారించారు. ఇప్పుడు క్రమంగా పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. నిల్వలు అలాగే ఆదాయ వసూళ్ల సమయాలు యథాపూర్వ పరిస్థితికి చేరుకుంటున్నాయి. మార్చి నాటికి పరిశ్రమ పూర్తి స్థాయిలో గాడిన పడుతుందని విశ్వసిస్తున్నాము. – రాహుల్ గుహ, క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ తాజా అధ్యయనం చెబుతోంది ఇదీ.. వజ్రాల పరిశ్రమ వేగంగా కోలుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర ఆదాయ నష్టం 20 శాతానికి పరిమితం అవుతోంది. ఆదాయాలు 15 బిలియన్ డాలర్లపైనే నమోదయ్యే అవకాశాలు సుస్పష్టమవుతున్నాయి. డిసెంబర్ 2020తో ముగిసిన మూడవ త్రైమాసికంలో ఎగుమతులు నెలవారీగా సగటున 1.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.దీనితో ఆర్థిక సంవత్సరం మొత్తంగా ఆ రంగంలో ఆదాయాలు కనీసం 15 బిలియన్ డాలర్లను దాటతాయన్న అంచనా నెలకొంది. ఇదే జరిగితే ఆదాయ నష్టం కేవలం 20 శాతంగానే భావించాల్సి వస్తుంది. గడచిన మూడు నెలల్లో ముడి, పాలిష్డ్ డైమండ్ నిల్వలు క్రమంగా తగ్గాయి. పాలిష్డ్ డైమండ్ ధరలు మూడవ త్రైమాసికంలో దాదాపు 2 శాతం పెరిగాయి. మొదటి ఆరు నెలల నష్టాలను కొంత పూడ్చుకోడానికి ఈ పరిస్థితి దోహదపడింది. ప్రస్తుత ధరల పరిస్థితి స్థిరంగా ఉంది. ఆయా అంశాల నేపథ్యంలో నిర్వహణా పరమైన లాభదాయకత పూర్తి ఆర్థిక సంవత్సరం చెక్కుచెదరదన్నది తాజా విశ్లేషణ. -
వజ్రాల ఎగుమతులకూ దెబ్బ..
ముంబై: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్–19 వైరస్ మరింతగా ప్రబలుతున్న నేపథ్యంలో భారత వజ్రాల ఎగుమతులు గణనీయంగా తగ్గనున్నాయి. 2020–21 ఆఖరు నాటికి 19 బిలియన్ డాలర్ల స్థాయికి పడిపోనున్నాయి. ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరంలోనూ ఎగుమతులు తగ్గడమో లేదా అదే స్థాయిలో ఉండవచ్చని క్రిసిల్ రేటింగ్స్ ఒక నివేదికలో వెల్లడించింది. 2018–19లో భారత్ నుంచి వజ్రాల ఎగుమతులు 24 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో భారత్ నుంచి మొత్తం వజ్రాల ఎగుమతులు విలువపరంగా 18% తగ్గాయి. వీటిలో 40% ఎగుమతులు హాంకాంగ్‌కి జరిగాయి. అయితే, జనవరి 15 నుంచి హాంకాంగ్‌కు ఎగుమతులు నిల్చిపోయాయి. ‘ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు త్రైమాసికంలో ఎగుమతులు మరింత తగ్గవచ్చు. ఆగ్నేయాసియా ప్రాంతంలో సెలవులు, కోవిడ్ వ్యాప్తితో మార్కెట్లు మూతబడటం మొదలైన అంశాల కారణంగా ఈ ఒక్క త్రైమాసికంలోనే దాదాపు బిలియన్ డాలర్ల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం ఉండొచ్చని అంచనా’ అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ సుబోధ్ రాయ్ తెలిపారు. ఇప్పటికే డిమాండ్ పడిపోయి, వసూళ్లు తగ్గిపోవడం.. హాంకాంగ్‌లో రాజకీయ సంక్షోభం వంటి సమస్యలతో సతమతమవుతున్న వజ్రాల పరిశ్రమకు కోవిడ్19 మరో కొత్త సమస్యగా పరిణమించిందని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం మధ్య భాగంలో గానీ పరిశ్రమ పరిస్థితి చక్కబడకపోవచ్చని చెప్పారు. -
ఉద్యోగులకు కార్లు, ఫ్లాట్లు
-
ఉద్యోగులకు కార్లు, ఫ్లాట్లు
సూరత్ వజ్రాల వ్యాపారి దీపావళి కానుక సూరత్: తన కంపెనీల్లో పనిచేసే ఉద్యోగస్తులకు ప్రతిఏడాదీ ఘనమైన దీపావళి కానుకలిచ్చే సూరత్ వజ్రాల వ్యాపారి సావ్జీ ధొలాకియా.. ఈ ఏడాది కూడా భారీ కానుకలను ప్రకటించారు. బాగా పనిచేసే ఉద్యోగులకు 1260 కార్లు, 400 ఫ్లాట్లను కానుకగా ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ‘హరే కృష్ణ ఎక్స్‌పోర్ట్స్’ పేరుతో వజ్రాల వ్యాపారం చేస్తున్న ధొలాకియా.. ఈ ఏడాది 1716 మంది బాగా పనిచేస్తున్న ఉద్యోగులను గుర్తించామన్నారు. 1100 చదరపు అడుగుల ఇంటికి (ధర 15 లక్షలు), కారుకు మొదటి ఐదేళ్లపాటు రూ.5వేల ఈఎంఐ (నెలసరి వాయిదా)ని కంపెనీ భరిస్తుంది. తర్వాత మొత్తం ఈఎంఐ (ఇంటికి రూ.11వేలు, కారు ధరను బట్టి) ఉద్యోగే కట్టుకోవాలి. అంటే ఉద్యోగి ఇల్లు కొనుక్కునేందుకు కంపెనీ రూ.3 లక్షలు సాయం (ఉచితం) చేస్తోందన్నమాట. గతేడాది కూడా 491 కార్లు, 200 ఫ్లాట్లను గిఫ్ట్‌గా ఇచ్చిన ఈ కోటీశ్వరుడు.. అంతకుముందు సంవత్సరం.. రూ. 50 కోట్లను పండగబోనస్గా ఉద్యోగులకు పంచిపెట్టారు. తన మామయ్య దగ్గరినుంచి అప్పు తీసుకుని వ్యాపారాన్ని మొదలుపెట్టిన ధొలాకియా కోటీశ్వరుడిగా ఎదిగినా.. తన కుమారుడికి డబ్బు విలువ చెప్పేందుకు చిన్న చిన్న ఉద్యోగాలు చేయించిన సంగతి తెలిసిందే.