కలల సాకారానికి కలిసి నడుద్దాం
డైరీ ఆవిష్కరణ సభలో టీజీవోలకు మంత్రి కేటీఆర్ పిలుపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎంతో మేలు చేకూరుతుందని ప్రజలు కన్న కలలను నెరవేర్చడానికి గెజిటెడ్ అధికారులు ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు పిలుపునిచ్చారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రూపొందించిన డైరీని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్‌తో కలిసి మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొన్న ఉద్యోగులు, అధికారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.
బ్రహ్మాండమైన పీఆర్సీ ఖాయం!
హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. నాడు ఉద్యమ సెగను రగిలించింది ఉద్యోగులేనని, అటువంటి ఉద్యోగులకు బ్రహ్మాండమైన పీఆర్సీ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మహమూద్ అలీ మాట్లాడుతూ ఉద్యమానికి మూలస్తంభాలుగా నిలిచిన అధికారులు అదే ఉద్యమ స్ఫూర్తితో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలన్నారు. జేఎసీ చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ.. గతంలో ఉద్యమ వేదికలుగా నిలిచిన డైరీ ఆవిష్కరణ సభలు.. ఇకపై బంగారు తె లంగాణ దిశగా ఉద్యోగులను, అధికారులను కార్యోన్ముఖులను చేసే వేదికలు కావాలన్నారు.
అదనంగా పనిచేస్తాం: టీజీవో సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ నిర్మాణంలో ఉద్యోగులు, అధికారులు మరింత కష్టపడేందుకు సిద ్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రతిరోజూ ఒక గంట అదనంగా పనిచేయాలని, ప్రతినెలలో ఒక రోజు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించాలని టీజీవో కార్యవర్గం తీర్మానించిందన్నారు. కార ్యక్రమంలో టీజీవో అధ్యక్షురాలు మమత, రాష్ట్ర నాయకులు పురుషోత్తమ్‌రెడ్డి, రామేశ్వర్రావు, విష్ణువర్థన్‌రావు, మధుసూదన్‌గౌడ్, కృష్ణయాదవ్, సుజాత, సబిత, అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.