discount on prices
-
ఇవి కదా ఆఫర్లు..ఫ్లిప్ కార్ట్ బంపర్ సేల్..వీటిపై 80 శాతం డిస్కౌంట్!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ప్లిప్‌కార్ట్ బంపరాఫర్ ప్రకటించింది. న్యూఇయర్‌కు వెల్కమ్ చెబుతూ డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 21 వరకు ఫ్లిప్‌కార్ట్ న్యూ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ ప్రారంభించనుంది. ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లకే అందిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఫోన్లతో పాటు ఇతర డివైజ్‌లను డిస్కౌంట్లకే దక్కించుకోవచ్చు. ఆరు రోజుల పాటు జరిగే ఈ సేల్‌లో ప్లస్ మెంబర్షిప్ సభ్యులు ఒకరోజు ముందు నుంచి అంటే డిసెంబర్ 15 నుంచి వారికి నచ్చిన ప్రొడక్ట్‌కు కొనుగోలు చేయొచ్చు. ఇక ఈ విక్రయాల్లో అర్హులైన కష్టమర్లు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. కొద్ది రోజుల క్రితం ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్‌ను నిర్వహించింది. ఆ సేల్ మిస్సైన వాళ్లు ఈ న్యూ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ పాల్గొనవచ్చు. స్మార్ట్ ఫోన్లతో పాటు, డిస్కౌంట్ ధరలో ఐఫోన్ 13ను సొంతం చేసుకోవచ్చు. ట్యాబ్లెట్స్, మానిటర్లు, ప్రింటర్లు సహా ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం వరకూ డిస్కౌంట్స్, టీవీలు, గృహోపకరణాలపై 75 శాతం వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని ఈకామర్స్ దిగ్గజం వెల్లడించింది. -
మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు: ఆలస్యం చేస్తే...!
సాక్షి,ముంబై: దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి డిసెంబరు నెలలో కూడా కొన్ని ఎంపిక చేసిన కార్లపై డిస్కౌంట్ ధరలను ప్రకటించింది. ముఖ్యంగా వచ్చేఏడాది జనవరి నుంచి అన్ని మోడళ్లకార్ల ధరలను పెంచక తప్పదని ఇటీవల ప్రకటించిన తరువాత అందిస్తున్న ఈ తగ్గింపు ధరలకు ప్రాధాన్యత లభిస్తోంది. స్విఫ్ట్, డిజైర్, వవ్యాగన్ ఆర్, సెలెరియో తోపాటు, న్యూజెన్ ఆల్టో, మారుతి అరేనా మోడళ్లపై కొనుగోలు దారులు డిస్కౌంట్ ఆఫర్‌ను పొందివచ్చు. కార్పొరేట్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్, క్యాష్ బ్యాక్ లాంటి ఆఫర్లుంటాయి. అలాగే నవంబరు నెలలో మాదిరిగానే ఎర్టిగా ఎమ్‌పివి. బ్రాండ్-న్యూ బ్రెజ్జా ఎస్‌యూవీలపై డిస్కౌంట్లు ఉండవు. మారుతి సుజుకి డిసెంబర్ 2022 నెలలో తన అరేనా లైన్ వాహన తగ్గింపును రూ. 52,000 వరకు అందిస్తోంది ఇటీవల విడుదల చేసిన మారుతి సుజుకి ఆల్టో కె10 మాన్యువల్ మోడల్స్‌పై రూ.52,000 వరకు డిస్కౌంట్. ఏఎంటీ మోడల్స్ రూ. 22వేలు, ఇటీవల విడుదలైన సీఎన్జీ మోడల్ కూడా రూ.45,100 తగ్గింపుతో అందుబాటులో ఉంది. సెలెరియో సీఎన్జీ రూ. 45,100, పెట్రోల్-మాన్యువల్ కార్లపై రూ. 36వేల వరకు తగ్గింపు అందు బాటులో ఉంది. ఏఎంటీ వెర్షన్‌పై రూ. 21,000 తగ్గింపు లభ్యం. హై ఎండ్ వేరియంట్లపై రూ. 42,000 వరకు తగ్గింపు , బేసిక్ మోడల్స్‌పై 17వేలు తగ్గింపు అందిస్తోంది. మారుతి మాన్యువల్ ఎస్-ప్రెస్సో వేరియంట్లపై గరిష్టంగా రూ. 46,000, ఏఎంటీ వేరియంట్లు రూ. 20వేలు, సీఎస్జీ వేరియంట్‌పై రూ. 45,100 తగ్గింపు లభిస్తుంది. అలాగే స్విప్ట్ ఏఎంటీ, మాన్యువల్ మోడల్స్ రెండింటిలోనూ దాదాపు రూ. 32వేలు తగ్గింపు. -
మారుతి బంపర్ ఆఫర్స్: అన్ని మోడల్స్‌పై ఫెస్టివ్ డిస్కౌంట్స్
సాక్షి, ముంబై: దేశీయ టాప్ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి తన కస్టమర్ల కోసం భారీ ఫెస్టివ్ ఆఫర్లను అందిస్తోంది. సీఎన్జీ మోడల్ సహా, పలు కార్ల మోడళ్లపై సుమారు రూ. 56,000 వరకు తగ్గింపును అందిస్తోంది. అరేనా షోరూమ్‌లు ఈ (అక్టోబర్) నెలలో తగ్గింపు ధరలకు అందుబాటులో ఉంటాయి. ఇందులో కార్పొరేట్, క్యాస్, ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మారుతీ సుజుకి ఆల్టో 800, స్విఫ్ట్ ,వ్యాగన్-ఆర్, సెలెరియో, డిజైర్ సహా పలు కార్లు ఇపుడు తగ్గింపు ధరల్లో లభ్యం. మారుతి సుజుకి డిజైర్ మారుతి సుజుకి ఏఎంటీ వెర్షన్లపై రూ. 52,000 దాకా తగ్గింపు అందిస్తోంది. ఇందులో రూ. 35,000 నగదు తగ్గింపు, రూ. 7,000 కార్పొరేట్ డిస్కౌంట్లు రూ. 10,000 ఎక్స్చేంజ్ బోనస్‌లు ఉన్నాయి. అలాగే మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడల్ కార్లపై రూ. 17,000 తగ్గింపు లభ్యం. మారుతీ సుజుకి S-ప్రెస్సో రూ. 35,000 నగదు తగ్గింపు. రూ. 6,000 కార్పొరేట్, రూ. 15,000 ఎక్స్చేంజ్ ప్రోత్సాహకాలున్నాయి. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో S Presso హై-రైడింగ్ హ్యాచ్‌బ్యాక్‌కు మొత్తం తగ్గింపును రూ. 56,000కి తగ్గింపు లభిస్తుంది. అలాగే S ప్రెస్సో AMT మోడల్లకు మొత్తం రూ. 46వేలు డిస్కౌంట్ లభ్యం. మారుతీ సుజుకి స్విఫ్ట్ అక్టోబర్ నెలలో, మారుతి సుజుకి స్విఫ్ట్ యొక్క ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ (AMT) వెర్షన్లు రూ. 47,000 మొత్తం ప్రయోజనాలకు అర్హమైనవి, స్విఫ్ట్ యొక్క మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్లు రూ. 30,000 విలువైన మొత్తం ప్రయోజనాలకు అర్హులు. ఆల్టో 800కి మొత్తం రూ. 36,000 తగ్గింపు ఉంటుంది. మారుతి సుజుకి వ్యాగన్-ఆర్ మారుతి సుజుకి డ్యూయల్‌జెట్ టెక్నాలజీతో వచ్చిన రెండు ఎకనామిక్ పెట్రోల్ కార్ల (1.0 ,1.2 లీటర్లు) వ్యాగన్ ఆర్ కొనుగోలుదారులు మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మోడల్‌లలో రూ. 31,000 ఆదా చేయవచ్చు. అదనంగా, మారుతీ రూ. 15,000 ధర తగ్గింపును కూడా అందిస్తోంది. సీఎన్జీ బేస్ మోడల్, టాప్-టైర్ వేరియంట్‌పై రూ. 5000 తగ్గింపు. మారుతి సుజుకి ఆల్టో K10 కొత్తగా విడుదల చేసిన ఆల్టో కె10 బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ ఆటోమేటిక్ మరియు మాన్యువల్ వెర్షన్లపై రూ.39,500 తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ. 17,500 విలువైన రూ. 7,000 నగదు తగ్గింపు , రూ. 15,000 విలువైన ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ రివార్డు ఉన్నాయి. -
మరో అదిరిపోయే సేల్..ఏకంగా 80 శాతం డిస్కౌంట్లు, ఆఫర్లు ఇవే!
కొనుగోలు దారులకు ప్రముఖ దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ బంపరాఫర్ ప్రకటించింది. సెప్టెంబర్ 23 నుంచి 30వ తేదీ వరకు ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ ను నిర్వహించింది. తాజాగా దసరా సందర్భంగా ఈ నెల 5 నుంచి 8 వరకు బిగ్ దసరా సేల్ 2022ను నిర్వహించనున్నట్లు తెలిపింది. నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ సేల్‌లో కొనుగోలు దారులకు భారీ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు ప్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఎలక్ట్రానిక్ వస్తువులపై 80 శాతం వరకు తగ్గింపులు, టీవీలపై 75 శాతం డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చని చెప్పింది. ఫ్యాషన్ వస్తువులపై 60 నుంచి 80 శాతం, ఏసీలు 55 శాతం తగ్గింపు ధరతో ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. అంతేకాదు 4కే అల్ట్రా హెచ్డీ టీవీలు రూ.17,249 నుంచి ప్రారంభం కానుండగా..వాషింగ్ మిషన్లు రూ.6,990 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించింది. ఈ సేల్‌లో టీవీల ప్రారంభ ధర రూ.7199 కాగా, బ్యూటీ, ఫుడ్, టాయ్స్,హోం, కిచెన్ వస్తువుల ప్రారంభ ధరలు రూ.99గా ఉన్నాయని ఫ్లిప్ కార్ట్ పేర్కొంది. -
అదిరిపోయే సేల్..అస్సలు మిస్సవ్వద్దు! 75 శాతం భారీ డిస్కౌంట్!
ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ మరో సేల్‌తో ముందుకు వచ్చింది. ఆగస్ట్ 6 నుంచి ఆగస్ట్ 10 వరకు గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ ఆఫర్ సేల్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్‌లో స్మార్ట్ ఫోన్లు, ఎల్జీ ఓఎల్ఈడీ టీవీలు, రిఫ్రిజిరేటర్లపై ఆఫర్లు అందిస్తున్నట్లు అమెజాన్ ప్రతినిధులు వెల్లడించారు. ఇక ఈ సేల్‌లో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు అదనంగా 10శాతం డిస్కౌంట్ పొందవచ్చు. 60 రకాలైన ప్రొడక్ట్‌లు లాంచ్ కానున్న ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్లు, యాక్ససరీస్‌పై 40శాతం డిస్కౌంట్‌కే కొనుగోలు చేసే అవకాశం లభిస్తుండగా.. బడ్జెట్ స్మార్ట్ఫోన్లు రూ. 6,599కే కొనుగోలు చేయొచ్చు. మొబైల్ ఉపకరణాలు రూ.69 నుంచి ప్రారంభం కానున్నాయి. ల్యాప్‌టాప్ కొనుగోలుదారులు రూ.40,000 వరకు డిస్కౌంట్, హెడ్ఫోన్లపై 75శాతం వరకు డిస్కౌంట్, ట్యాబ్స్‌పై 45శాతం డిస్కౌంట్, స్మార్ట్‌వాచ్‌లపై 70శాతం డిస్కౌంట్ ఉంటుందని అమెజాన్ తెలిపింది. అదనంగా టీవీలు,ఉపకరణాలపై 60 శాతం, ప్రీమియం టీవీలు 50 శాతం డిస్కౌంట్ ధరలో లభిస్తాయి.ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఆఫర్‌తో పాటు మొబైల్ ఫోన్ కొనుగోళ్లపై నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్ పొందవచ్చు. -
పెట్రోల్‌పై ఈ రాయితీ కూడా ఎత్తేశారహో..!
న్యూఢిల్లీ: పెట్రోల్ కొనుగోళ్లకు డిజిటల్‌గా చేసే చెల్లింపులపై పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) ఇంతకాలం ఇస్తున్న 0.75 శాతం రాయితీని ఎత్తివేసింది. గత నెల నుంచే ఈ ప్రయోజనాన్ని నిలిపివేసినట్టు, ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు దీన్ని ఉపసంహరించుకోవడమే దీనికి కారణమని పీఎన్బీ తెలిపింది. ఇందుకు సంబంధించి బ్యాంకు వెబ్సైట్లో ఓ నోటిఫికేషన్ ఉంచింది. ‘‘ఇంధన కొనుగోళ్లపై అన్ని రకాల డిజిటల్ చెల్లింపులకు ఇస్తున్న 0.75 శాతం ప్రోత్సాహకాన్ని నిలిపివేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నట్టు భారత్ పెట్రోలియం (బీపీసీఎల్) తెలిపింది’’ అంటూ పీఎన్బీ తన నోటిఫికేషన్లో పేర్కొంది. దీంతో మే నెల నుంచి డిజిటల్ చెల్లింపులపై ఈ ప్రయోజనాన్ని నిలిపివేసినట్టు పీఎన్బీ తెలిపింది. 2016 నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. నాటి నిర్ణయం వల్ల వ్యవస్థలో నగదుకు కొంత కాలం పాటు తీవ్ర కొరత ఏర్పడింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర సర్కారు డిజిటల్ రూపంలో చెల్లింపులను ప్రోత్సహించేందుకు 0.75 శాతం రాయితీ ఇవ్వాలని ఆయిల్ కంపెనీలను కోరింది. దీంతో 2016 డిసెంబర్ 13 నుంచి ఇప్పటి వరకు క్రెడిట్, డెబిట్ కార్డు, యూపీఐ చెల్లింపులపై రాయితీ లభించింది. ఈ ప్రోత్సాహకాన్ని క్రెడిట్ కార్డులపై ముందే తొలగించారు. ఇప్పుడు మిగిలిన డిజిటల్ చెల్లింపులపైనా ఎత్తేసినట్టు అయింది. చదవండి: ధరలు పెరిగినా.. తగ్గేదేలే అంటున్నారు.. -
ఎల్పీజీ రాయితీ... ‘ఉజ్వల’ లబ్ధిదారులకే
న్యూఢిల్లీ: వంట గ్యాస్ వినియోగదారులకు చేదువార్త. ఉజ్వల పథకం కింద ఉచితంగా వంటగ్యాస్ సిలిండర్లు పొందినవారికే ఇకపై రాయితీ దక్కనుంది. దాదాపు 9 కోట్ల మంది పేద మహిళలకు ఒక్కో సిలిండర్‌పై రూ.200 చొప్పున రాయితీ అందుతుంది. మిగతా వినియోగదారులంతా మార్కెట్ ధర చెల్లించాల్సిందేనని కేంద్ర చమురు శాఖ కార్యదర్శి పంజక్ జైన్ వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర ప్రస్తుతం రూ1,003గా ఉంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఒక్కో సిలిండర్‌పై రూ.200 రాయితీ వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. అంటే వారికి ఒక్కో సిలిండర్ రూ.803కే లభిస్తుంది. ఏడాదికి 12 సిలిండర్లకే ఈ రాయితీ అందుతుంది. మిగిలిన వినియోగదారులంతా రూ.1,003 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. -
ఫెస్టివల్ సీజన్: ఆన్లైన్ షాపింగ్‌లో ఆఫర్లే ఆఫర్లు! ఇక 'పండగ' చేస్కోండి!
న్యూఢిల్లీ: పండుగల సందర్భంగా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు విక్రయాలను పెంచుకునేందుకు తగ్గింపులను ఆఫర్ చేస్తున్నాయి.ఈ సీజన్లో వినియోగ డిమాండ్ పుంజుకుంటుందని వస్త్రాలు, ఇంటి డెకరేటివ్ ఉత్పత్తులు, గృహోపకరణాల కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఉగాదితో పండుగల సందడి మొదలైంది. త్వరలో శ్రీరామనవమి రానుంది. అలాగే రంజాన్ మాసం మొదలైంది. దీంతో విక్రయాలు పెంచుకోవడంపై కంపెనీలు దృష్టి సారించాయి. ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నప్పటికీ డిస్కౌంట్ (ఎంఆర్పీపై తగ్గింపు)లను ఎక్కువగానే ఆఫర్ చేస్తున్నట్టు కంపెనీల ప్రతినిధులు తెలిపారు. గత రెండు వేసవి సీజన్లలో కరోనా తీవ్రత కంపెనీల అమ్మకాలపై పడడంతో.. ప్రస్తుత సీజన్ సానుకూలంగా ఉంటుందని అంచనాతో ఉన్నాయి. అమెజాన్, మింత్రా, షాపర్స్‌స్టాప్, లైఫ్‌స్టయిల్ సంస్థలు 20–50 శాతం మేర వస్త్రాలు, ఫ్యాషన్ ఉత్పత్తులపై తగ్గింపును ఆఫర్ చేస్తున్నాయి. వస్త్రాలు, కాస్మొటిక్స్, వాచీలు, గహోపకరణాలు, డైరెక్ట్ టు కన్జ్యూమర్ బ్రాండ్లపై ఆఫర్లు అమలు చేస్తున్నట్టు ఆయా ప్లాట్‌ఫామ్‌ల ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. వస్త్రాలు, సౌందర్య ఉత్పత్తులపై.. అమెజాన్ అయితే షావోమీ, వన్‌ప్లస్, మేబెల్లిన్ (సౌందర్య ఉత్పత్తులు), షుగర్ కాస్మెటిక్స్, సోనీ, అలెక్సా స్పీకర్లపై ప్రస్తుతం ఆఫర్లను అమలు చేస్తోంది. శామ్సంగ్ అయితే ఖరీదైన టీవీలు, ఏసీలు, వాషింగ్ మెషిన్లపై బ్లూఫెస్ట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ నెల చివరి వరకు ఇది అందుబాటులో ఉంటుంది. ఆదిదాస్, పూమ ఉత్పత్తులపై షాపర్స్‌స్టాప్ 50 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. నైకా కూడా షుగర్, ప్లమ్, మామాఎర్త్ సౌందర్య ఉత్పత్తులపై డిస్కౌంట్స్ ప్రకటించింది. ఫర్నిచర్ బ్రాండ్ (ఆన్లైన్, ఆఫ్‌లైన్) పెప్పర్ఫ్రై, జేబీఎస్ స్పీకర్స్ 25–40 శాతం మధ్యలో తగ్గింపు ఇస్తున్నాయి. అధిక నిల్వలు.. ‘‘చాలా ఈ కామర్స్ సంస్థల పరిధిలో ఉత్పత్తుల నిల్వలు పేరుకున్నాయి. జనవరి నుంచి వీటిని తగ్గించకోవడంపై అవి దృష్టి సారించాయి. కానీ, కరోనా మూడో విడత ప్రతికూలతల వల్ల ఇది సాధ్యపడలేదు. పైగా ఆన్లైన్లో షాపింగ్ చేసే కస్టమర్లు ప్రధానంగా డిస్కౌంట్స్, ఆఫర్స్ చూస్తారు’’ అని రిటైల్ కన్సల్టెన్సీ సంస్థ ‘థర్డ్ ఐసైట్’కు చెందిన దేవాన్షు దత్తా తెలిపారు. జివామే, వావ్ స్కిన్ సైన్స్, మింత్రా, అజియో, ఎంకెఫైన్ తదితర బ్రాండ్లు ఆఫర్ చేసే డిస్కౌంట్లకు ఆన్లైన్ షాపర్స్ నుంచి మంచి స్పందన కనిపిస్తోందని క్యాష్‌కరో సహ వ్యవస్థాపకుడు రోహన్ భార్గవ తెలిపారు. ఆన్లైన్ షాపింగ్ పోర్టళ్లపై క్యాష్‌బ్యాక్ కూపన్లను క్యాష్ కరో ఆఫర్ చేస్తుంటుంది. ‘‘ఆన్లైన్ ఆఫర్ల విషయానికొస్తే డీ2సీ బ్రాండ్స్ ముందున్నాయి. దీంతో యూజర్ల నుంచి కూడా డిమాండ్ పెరిగింది’’ అని భార్గవ వివరించారు. హోలి పండుగ నుంచే డిస్కౌంట్స్, ఆఫర్ల సందడి మొదలైనట్టు కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. ముఖ్యంగా టైర్–2, టైర్–3 పట్టణాల నుంచి ఎక్కువ స్పందన వస్తోందని పేర్కొన్నారు. కన్సల్టింగ్ సంస్థ రెడ్‌సీర్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మధ్యాదాయ వర్గాల కొనుగోలుదారులే 80 శాతంగా ఉంటారు. 2021 నాటికి 7.8 కోట్లుగా ఉన్న వీరి సంఖ్య 2026 నాటికి మూడు రెట్లు పెరిగి 25.6 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ‘‘రష్యా యుద్ధం వల్ల తయారీ వ్యయాలు పెరిగి, సరఫరా సమస్యలు నెలకొన్నప్పటికీ.. దేశవ్యాప్తంగా, ప్రాంతీయంగా పండుగలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన ఆఫర్లు, ప్రోత్సాహక కార్యక్రమాలను అమలు చేస్తున్నాం’’అని గృహోపకరణాల సంస్థ వండచర్చెఫ్ ఎండీ రవి సక్సేనా వెల్లడించారు. చదవండి: ఆన్లైన్లో వస్తువులు కొని మోసపోయారా? అయితే వెంటనే ఇలా చేయండి? -
ఐఫోన్ ధర మరి ఇంత తక్కువా!! ఇంకెందుకు ఆలస్యం..ఇప్పుడే సొంతం చేసుకోండి!!
ప్రముఖ దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ యాపిల్ ఐఫోన్లపై బంపరాఫర్లు ప్రకటించింది. ఐఫోన్11, ఐఫోన్ ఎస్ఈపై భారీ డిస్కౌంట్లతో పాటు, ఎక్ఛేంజ్ ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపింది. పలు రిపోర్ట్‌ల ప్రకారం..టెక్ జెయింట్ యాపిల్ మార్చి 8న ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఈ ఈవెంట్లో యాపిల్ కొత్త ప్రొడక్ట్‌లను మార్కెట్‌కు పరిచయం చేయనుంది. అంతకంటే ముందే మార్కెట్లో విడుదల చేసిన పలు ఐఫోన్లపై యాపిల్ భారీ డిస్కౌంట్,ఎక్ఛేంజ్ ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. ఆ ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్‌లో అందిస్తున్నట్లు వెల్లడించింది. ఫ్లిప్ కార్ట్ మార్చి 4 నుంచి మార్చి 6 వరకు బిగ్ బచత్ ధమాల్ పేరుతో సేల్ నిర్వహిస్తుంది. ఈ సేల్‌తో పాటు ప్రత్యేకంగా ఐఫోన్ 11, ఐఫోన్ ఎస్ఈ పై ఆఫర్లకే అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్11 అసలు ధర రూ.32,000 ఉండగా..ఎక్ఛేంజ్ ఆఫర్ కింద రూ.17,800కే పొందవచ్చు. ఎక్ఛేంజ్ ఆఫర్‌తో పాటు యాక్సిస్ కార్డ్ వినియోగదారులు ఫోన్ కొనుగోలు చేస్తే 5శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అదే సమయంలో మరో ఈకామర్స్ సంస్థ అమెజాన్ సైతం రూ.14,900వరకు ఎక్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తుంది. మరో యాపిల్ ఐఫోన్ ఎస్ఈని రూ.15,499కే కొనుగోలు చేయోచ్చు. వాస్తవంగా ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ ఎస్ఈ ధర రూ.39,900 ఉండగా..రూ.30,299కే యూజర్లకు అందిస్తున్నట్లు తెలిపింది. ఎక్ఛేంజ్ ఆఫర్‌ను రూ.14,800కే అందిస్తే ఆఫోన్ ధర రూ.15,499కే సొంతం చేసుకోవచ్చు. మీ ఫోన్ పై ఎక్ఛేంజ్ ఆఫర్ ఎంతుందో ఇలా తెలుసుకోండి ఫ్లిప్ కార్ట్, అమెజాన్‌లో ఐఫోన్లపై ఎక్చేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్లో మీరు ఐఫోన్ కొనుగోలు చేయాలంటే సింపుల్ గా రెండు ఈ కామర్స్ సైట్లలో మీ ఫోన్బ్రాండ్ నేమ్, మోడల్, ఐఎంఈ నెంబర్ ఎంటర్‌చేస్తే మీ ఫోన్ పై యాపిల్ సంస్థ ఎక్ఛేంజ్ ఆఫర్లో ఎంత ధర పలుకుతుందో తెలుసుకోవచ్చు. ఐఎంఈ నెంబర్ కావాలంటే ఫోన్లో *#06# డయల్ చేసి పొందవచ్చు. చదవండి: రష్యా - ఉక్రెయిన్ సంక్షోభం, యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఏమంటారో!! -
మహీంద్రా కార్లపై బంపరాఫర్, ఏకంగా రూ.80వేల వరకు డిస్కౌంట్!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఫిబ్రవరి నెల వరకు పలు మోడళ్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు ప్రకటించింది. ఎక్స్‌యూవీ300, స్కార్పియో, అల్ట్రాస్ జీ4, బొలెరో, మరాజో మోడళ్లపై డిస్కౌంట్లలో సొంతం చేసుకోవచ్చు. ►బొలెరో నియోపై ఆఫర్లు లేనప్పటికీ, బొలెరో ఎస్‌యూవీపై రూ.3వేల కార్పొరేట్ తగ్గింపు, రూ.15వేల వరకు ఎక్ఛేంజ్ బోనస్, రూ.6వేల వరకు డిస్కౌంట్‌కే లభిస్తుంది. ►మరాజో మూడు వేరియంట్లలో ఆఫర్లో కొనుగోలు చేయోచ్చు. ఇందులో ఎం2,ఎం4 ప్లస్, ఎం6 ప్లస్ వేరియంట్లపై రూ.20,000 వరకు డిస్కౌంట్,రూ.15,000 వరకు ఎక్ఛేంజ్ బోనస్,రూ.5,200 కార్పొరేట్ ప్రయోజనాల్ని అందిస్తుంది. ►మహీంద్రా ఎక్స్‌యూవీ 300 కాంపాక్ట్ ఎస్యూవీ ఈ నెలలో రూ.30,003వరకు డిస్కౌంట్, రూ.25,000 వరకు ఎక్ఛేంజ్ బోనస్, రూ.4,000 వరకు కార్పొరేట్ తగ్గింపుతో కొనుగోలు చేయోచ్చు. రూ.10వేల వరకు ఇతర ఆఫర్లకే అందిస్తుంది. ►మహీంద్రా ఆల్ట్రాస్ జీ4పై భారీ డిస్కౌంట్‌కే అందిస్తుంది. ఎక్ఛేంజ్ బోనస్ రూ.50,000, రూ.11,500 వరకు కార్పొరేట్ తగ్గింపు, రూ.20,000 వరకు ఇతర అదనపు ఆఫర్లు ఉన్నాయి. ►ఇది కాకుండా స్కార్పియో రూ.15,000 వరకు ఎక్ఛేంజ్ బోనస్, రూ.4,000 వరకు కార్పొరేట్ ప్రయోజనాలు, రూ.15,000 వరకు ఇతర తగ్గింపులతో అందిస్తుంది. -
కార్ల కొనుగోలు దారులకు శుభవార్త!!
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ కొనుగోలు దారులకు బంపరాఫర్లు ప్రకటించింది. హ్యుందాయ్ ఇండియా ఫిబ్రవరి నెల వరకు ఐ20, గ్రాండ్ఐ10 నియోస్, ఆరా,శాంత్రోపై డిస్కౌంట్‌తో పాటు ఎక్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి. హ్యుందాయ్ ఐ20 హ్యాచ్‌బ్యాక్ పెట్రోల్, డీజిల్ వెర్షన్లను రూ.40,000 విలువైన తగ్గింపుతో అందిస్తుంది. ఐ20 అనేక రకాలైన ఇంజన్, గేర్‌బాక్స్ కాంబినేషన్లో అందించబడుతోంది. దీని ధరలు రూ. 6.98 లక్షల నుండి ప్రారంభమవుతాయి (ఎక్స్-షోరూమ్). ఈ నెలలో శాంత్రో కారుపై రూ.40,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. కేవలం పెట్రోల్ వేరియంట్లకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి. సీఎన్జీ వెర్షన్లకు ఎలాంటి ఆఫర్లను లేవని హ్యుందాయ్ తెలిపింది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, ఆరా వెహికల్స్‌పై రూ.50వేల డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. వీటిలో సంబంధిత మోడళ్ల సీఎన్జీ వెర్షన్లు మినహా పెట్రోల్, డీజిల్ వేరియంట్లపై ఆఫర్లు ఉన్నట్లు ఆ కంపెనీ నిర్వాహకులు తెలిపారు. -
యాపిల్ ఐఫోన్ లవర్స్ కు బంపరాఫర్,భారీ డిస్కౌంట్లకే!
iPhone 12 Discount: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు యాపిల్ ఐఫోన్12పై భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. డిస్కౌంట్‌తో పాటు ఎక్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తున్నాయి. దీంతో ఐఫోన్ 12 ఫోన్ రీటైల్ మార్కెట్ లో ఉన్న ధర కంటే భారీగా తగ్గనుంది. ఐఫోన్ 12 మోడల్స్ ధర ఉన్న స్టాక్‌తో పాటు కలర్ వేరియంట్ ఆధారంగా ఆఫర్ పొందవచ్చు. అమెజాన్‌లో ఐఫోన్-12 64 జీబీ బ్లాక్ వేరియంట్ ఫోన్ ను కేవలం రూ.42,049కి కొనుగోలు చేయోచ్చు. అయితే, మీరు ఎక్ఛేంజ్ ఆఫర్‌తో ఫోన్ ధరను మరింత తగ్గించుకోవచ్చు. ఎక్ఛేంజ్ ఆఫర్ల ద్వారా రూ.14,950 వరకు తగ్గిస్తుంది. ఇంకా, ఐఫోన్12ను సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే రూ.1500 తక్షణ తగ్గింపు, ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై డిస్కౌంట్లు,హెచ్డీ ఎఫ్‌సీ బ్యాంక్ మనీబ్యాక్+ క్రెడిట్ కార్డ్‌లు, మనీబ్యాక్ క్రెడిట్ కార్డ్‌లపై అమెజాన్ డిస్కౌంట్/క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. మరోవైపు, మీరు ఫ్లిప్‌కార్ట్ సైతం ఐఫోన్ పై ఆఫర్లు ప్రకటించింది. 64జీబీ బ్లాక్ కలర్ వేరియంట్ ఐఫోన్ 12ని రూ. 44,799కి కొనుగోలు చేయోచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.5,601 తగ్గింపుతో రూ.60,299కి విక్రయిస్తోంది. ఎక్ఛేంజ్ ఆఫర్ల ద్వారా రూ. 15,500 వరకు తగ్గుతుంది. దీంతో ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్లో రూ.44,799 వద్ద స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయోచ్చు. -
ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్..ఎక్సేంజ్,డిస్కౌంట్
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ ప్రియులకు శుభవార్త చెప్పింది. యాపిల్ ఐఫోన్ 12 మినీపై రూ.9,500 భారీ డిస్కౌంట్ ను అందిస్తున్నట్లు ప్రకటించింది. స్మాల్ స్క్రీన్, క్వాలీటీ ఐఫోన్ కావాలనుకునే వారికి మంచి ఆఫర్ తో పాటు తక్కువ బడ్జెట్ లో ఈ ఫోన్ లభిస్తున్నట్లు ఐఫోన్ ప్రతినిథులు తెలిపారు. కాంపాక్ట్ ఐఫోన్ ధర ఇంకా తగ్గించుకోవాలంటే మీ ఓల్డ్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లతో ఎక్సేంజ్ ద్వారా సొంతం చేసుకోవచ్చు. రూ.9,500 డిస్కౌంట్ పొందడం ఎలా? ప్రస్తుతం ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ 'యాపిల్ డేస్' సేల్ ను ప్రారంభించింది. ఈ సేల్ లో ఐఫోన్ తో పాటు ఇతర ఫోన్లపై ఆఫర్లను అందిస్తుంది. ఐఫోన్ 12మినీ ఫోన్‌ను కొనుగోలు చేసే కష్టమర్లకు రూ.3,500 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తుంది. ఎవరైతే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అకౌంట్ ద్వారా కొనుగోలు చేస్తారో వారికి రూ.6000 డిస్కౌంట్ అందిస్తుంది. దీంతో మొత్తం రూ.9.500 డిస్కౌంట్‌తో ఐఫోన్ మినీని సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ మినీ 12ధర ఎంతంటే? ఐఫోన్ మినీ12.. 64జీబీతో రూ.60,400 ధరకే అందుబాటులో ఉంది. 128జీబీ వేరియంట్ ధర కాస్త ఎక్కువగానే ఉన్నా.. ప్రస్తుతం దాని రీటెయిలింగ్ ధర రూ. 65,150 ఉన్నట్లు ఐఫోన్ ప్రతినిథులు వెల్లడించారు. చదవండి : దేశంలో బంగారం ధరలు తగ్గాయ్, తొలిసారే ఇలా -
ఈ కార్లపై రూ. 3.06 లక్షల భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: కొత్తగా కారు సొంతం చేసుకోవాలనుకునే వారికి, అలాగే కొత్తకారు అప్డేట్ అవ్వాలనుకునే వారికి ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా మరోసారి తీపి కబురు చెప్పింది. ఇటీవల లాంచ్ చేసిను థార్ మినహా అన్ని కార్లపై భారీ తగ్గింపు ధరలను ప్రకటించింది. బీఎస్-6 కార్లను భారీ డిస్కౌంట్ ధరలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ అఫర్లో దాదాపు 3.06 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ డిస్కౌంట్ రేట్లు ఏప్రిల్ 30, 2021 వరకు అందుబాటులో ఉంటాయి. అధికారిక వెబ్సైట్ ప్రకారం ఆయా డీలర్ల పరిధిల ఈ తగ్గింపులో స్వల్ప మార్పులు ఉండవచ్చు. ఆసక్తిగల కొనుగోలుదారులు కెయువి 100 ఎన్ఎక్స్టి నుండి అల్టురాస్ జీ 4 ఫ్లాగ్షిప్ ఎస్యూవీ వరకు పలు మోడళ్ల కార్లపై నగదు ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్ , కార్పొరేట్ డిస్కౌంట్ లాంటి ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా అల్టురాస్ జీ 4 ఎస్యూవీ కొనుగోలుపై మొత్తం 3.06 లక్షల వరకు తగ్గింపు లభించనుంది. ఇందులో 2 2.2 లక్షల వరకు నగదు ఆఫర్ రూ 50,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉన్నాయి. కార్పొరేట్ ఆఫర్ , ఇతర ప్రయోజనాలు వరుసగా 16,000, 20,000 వరకు లభ్యం. మరాజ్జో ఎంపీవీలో అందించే గరిష్ట తగ్గింపు 41,000 రూపాయలు. ఇందులో రూ. 20,000 వరకు నగదు ప్రయోజనాలు, ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ. 15,000 వరకు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 6,000 వరకు లభిస్తాయి. చదవండి: ఉన్నట్టుండి పేలిన ఫోన్, షాకైన జనం: వైరల్ వీడియో ఎన్నిసార్లు గెలుస్తావ్ భయ్యా..! నెటిజన్లు ఫిదా -
విమాన టికెట్ల ధరలపై డిస్కౌంట్
న్యూఢిల్లీ: ఎయిర్ ఏషియా మరోసారి ఆఫర్లను ప్రకటించింది. దేశవాళీ, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో టికెట్ల ధరలపై డిస్కౌంట్ ఆఫర్ చేసింది. అక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది నుంచి మే 22 మధ్యకాలంలో ప్రయాణించడానికి డిస్కౌంట్ ధరలతో కూడిన విమాన టికెట్లను సోమవారం నుంచి ఈ నెల 13 వరకు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. బెంగళూరు, విశాఖపట్నం, గువహటి, కోచి, ఇంపాల్, పనాజీ, ఢిల్లీ వంటి నగరాల మధ్య దేశవాళీ సర్వీసుల్లో కనీస ధర 1099 రూపాయల నుంచి టికెట్లను అందుబాటులో ఉంచారు. కోచి నుంచి చెన్నై లేదా హైదరాబాద్ మీదుగా మలేసియా రాజధాని కౌలాలంపూర్‌కు 2999 రూపాయల నుంచి టికెట్ ధరలను ఎయిర్ ఏషియా ఆఫర్ చేసింది. ఇక చెన్నై నుంచి బెంగళూరు మీదుగా థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌కు 3999 రూపాయల నుంచి టికెట్లు అందుబాటులో ఉన్నాయి.