
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ ప్రియులకు శుభవార్త చెప్పింది. యాపిల్ ఐఫోన్ 12 మినీపై రూ.9,500 భారీ డిస్కౌంట్ ను అందిస్తున‍్నట్లు ప్రకటించింది. స్మాల్ స్క్రీన్, క్వాలీటీ ఐఫోన్ కావాలనుకునే వారికి మంచి ఆఫర్ తో పాటు తక్కువ బడ్జెట్ లో ఈ ఫోన్ లభిస్తున్నట్లు ఐఫోన్ ప్రతినిథులు తెలిపారు. కాంపాక్ట్ ఐఫోన్ ధర ఇంకా తగ్గించుకోవాలంటే మీ ఓల్డ్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్‌లతో ఎక్సేంజ్ ద్వారా సొంతం చేసుకోవచ్చు.
రూ.9,500 డిస్కౌంట్ పొందడం ఎలా?
ప్రస్తుతం ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ 'యాపిల్ డేస్' సేల్ ను ప్రారంభించింది. ఈ సేల్ లో ఐఫోన్ తో పాటు ఇతర ఫోన్లపై ఆఫర్లను అందిస్తుంది. ఐఫోన్ 12మినీ ఫోన్‌ను కొనుగోలు చేసే కష్టమర్లకు రూ.3,500 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తుంది. ఎవరైతే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అకౌంట్ ద్వారా కొనుగోలు చేస్తారో వారికి రూ.6000 డిస్కౌంట్ అందిస్తుంది. దీంతో మొత్తం రూ.9.500 డిస్కౌంట్‌తో ఐఫోన్ మినీని సొంతం చేసుకోవచ్చు.
ఐఫోన్ మినీ 12ధర ఎంతంటే?
ఐఫోన్ మినీ12.. 64జీబీతో రూ.60,400 ధరకే అందుబాటులో ఉంది. 128జీబీ వేరియంట్ ధర కాస్త ఎక్కువగానే ఉన్నా.. ప్రస్తుతం దాని రీటెయిలింగ్ ధర రూ. 65,150 ఉన్నట్లు ఐఫోన్ ప్రతినిథులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment