Division of judges
-
విచారణ నుంచి వైదొలిగిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయాధికారుల విభజనలో హైకోర్టు మార్గదర్శకాలను సవాల్ చేస్తూ తెలంగాణ జడ్జెస్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ నుంచి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ వైదొలిగారు. ఈ కేసును తాను లేని ధర్మాసనానికి బదిలీ చేయాలంటూ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలోని జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసులో ఇరుపక్షాల వాదనలను నాలుగు వారాలుగా వింటూ వచ్చింది. న్యాయాధికారుల విభజనకు హైకోర్టు రూపొందించిన ముసాయిదా మార్గదర్శకాలపై తెలంగాణ న్యాయాధికారుల సంఘం అభ్యంతరం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ముసాయిదా ఆధారంగా మరో మార్గదర్శకాల ముసాయిదాను తయారు చేయాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ గతంలో ఈ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా కేంద్రం ముసాయిదా రూపొందించింది. అయితే న్యాయాధికారుల విభజనను స్థానికత ఆధారంగా చేపట్టాలని కేంద్రం మార్గదర్శకాలను రూపొందించగా.. హైకోర్టు దానికి సవరణలు చేసి సీనియారిటీ ఆధారంగా విభజన జరపాలన్న మార్గదర్శకాలను చేర్చిందని తెలంగాణ న్యాయాధికారుల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది ఇందిరా సింగ్ వాదనలు వినిపించారు. మరోవైపు హైకోర్టు మార్గదర్శకాలనే పరిగణనలోకి తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ న్యాయాధికారుల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు వాదనలు వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున హరేన్ రావల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది వీవీఎస్ రావు వాదించారు. మంగళవారం జరిగిన విచారణలో వీవీఎస్ రావు తన వాదనలు వినిపించాల్సి ఉంది. అయితే గతంలో ఈ కేసు విచారణ జరుగుతున్నప్పుడే జస్టిస్ చలమేశ్వర్ పలుమార్లు కీలక అంశాన్ని ప్రస్తావించారు. తాను ఏపీకి చెందినందున ఈ కేసును విచారించడంపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే చెప్పాలని, తాను తప్పుకొంటానని పేర్కొన్నారు. అయినా ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. దీంతో విచారణను ఇప్పటివరకు కొనసాగిస్తూ వచ్చారు. కానీ మంగళవారం అనూహ్యంగా ఈ కేసును తాను లేని ధర్మాసనం వింటుందంటూ ఉత్తర్వులు జారీచేశారు. -
న్యాయాధికారుల విభజనలో హైకోర్టుకు పాత్ర లేదు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య న్యాయాధికారుల (జిల్లా జడ్జిలు, సీనియర్ సివిల్ జడ్జిలు, సివిల్ జడ్జిలు) విభజన ప్రక్రియలో హైకోర్టుకు పాత్ర లేదని తెలంగాణ జడ్జెస్ అసోసియేషన్ సుప్రీం కోర్టులో వాదించింది. బుధవారం రెండో రోజు కూడా సంబంధిత పిటిషన్‌పై జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా తెలంగాణ జడ్జెస్ అసోసియేషన్ తరఫున న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపించారు. సుప్రీం మధ్యంతర ఉత్తర్వుల మేరకు కేంద్రం హైకోర్టు సాయంతో ముసాయిదా మార్గదర్శకాలను రూపొందించి హైకోర్టుకు పంపిస్తే హైకోర్టు వాటిని మార్చేసిందని నివేదించారు. క్లాజ్ 5లో కేంద్రం న్యాయాధికారుల విభజన స్థానికత ఆధారంగా జరగాలని సూచించగా.. దానిని హైకోర్టు మార్చివేసి సీనియారిటీ ప్రాతిపదికన జరగాలని పేర్కొందన్నారు. వాస్తవానికి హైకోర్టే తొలుత రూపొందించిన ముసాయిదా మార్గదర్శకాల్లో స్థానికతను ప్రాతిపదికగా తీసుకోగా కేంద్రం దానికి సమ్మతించిందని ఇప్పుడు కేంద్రం రూపొందించిన ముసాయిదా మార్గదర్శకాన్ని హైకోర్టు ఏ ప్రాతిపదికన మార్చిందని ఆక్షేపించారు. అలాగే న్యాయాధికారుల విభజనపై నిర్ణయం తీసుకోవడానికి కేంద్ర సిబ్బంది, శిక్షణశాఖ కార్యదర్శి నేతృత్వంలో సలహా కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉండగా.. హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి చైర్మన్‌గా ఉంటారని ఇప్పుడు హైకోర్టు ప్రతిపాదించడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. రాష్ట్ర విభజన లక్ష్యాన్ని గమనంలోకి తీసుకోవాలని కోరారు. న్యాయాధికారుల విభజనలో హైకోర్టుకు అధికారం లేదంటూ అందుకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
సీనియారిటీ, స్థానికత ప్రాతిపదికన విభజన
న్యాయాధికారుల విభజనపై సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం సాక్షి, న్యూఢిల్లీ: సీనియారిటీ, స్థానికత, ఆప్షన్లను ప్రాతిపదికగా తీసుకుని న్యాయాధికారుల విభజన చేపడతామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య న్యాయాధికారుల విభజన చేపట్టేందుకు వీలుగా మార్గదర్శకాల ముసాయిదాను కోర్టుకు సమర్పి ంచింది. న్యాయాధికారుల కేడర్ విభజనకు సంబంధించి ఉమ్మడి హైకోర్టు రూపొందించిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ తెలంగాణ న్యాయాధికారుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఉమ్మడి హైకోర్టు రూపొందించిన కేడర్ విభజన మార్గదర్శకాలను ముసాయిదాగా పరిగణించాలని, వీటిపై తగిన సూచనలు తీసుకుని జూన్ 17 లోగా మార్గదర్శకాల తుది ముసాయిదాను తయారు చేయాలని ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ఉమ్మడి హైకోర్టుతో సంప్రదింపులు జరిపి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు తమ తమ రాష్ట్రాల్లో ఉండాల్సిన సబార్డినేట్ జుడీషియల్ అధికారుల సంఖ్యను నిర్ధారించాలని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ కేసు విచారణకు రాగా... కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ మణిందర్‌సింగ్ మార్గదర్శకాల తుది ముసాయిదాను ధర్మాసనానికి సమర్పించారు. న్యాయాధికారుల విభజనలో సీనియారిటీ, స్థానికతను పరిగణనలోకి తీసుకుని ప్రాంతం ఎంపికకు ఆప్షన్ ఇవ్వాలన్నదే ప్రధాన మార్గదర్శకమని వివరించారు. ఈ సందర్భంలో జస్టిస్ చలమేశ్వర్ జోక్యం చేసుకుంటూ... ఒక రాష్ట్రంలో స్థానికుడై ఉండి మరో రాష్ట్రంలో ఆప్షన్ ఎంచుకున్నప్పుడు దానిని ఏ ప్రాతిపదికన పరిగణనలోకి తీసుకుంటారని ప్రశ్నించారు. ఆమోదయోగ్యం కాదు.. ఇదే సందర్భంలో తెలంగాణ న్యాయాధికారుల సంఘం తరçఫున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ తన వాదన వినిపిస్తూ... సీనియారిటీ, ఆప్షన్ ప్రాతిపదిక తమకు ఆమోదయోగ్యం కాదని చెప్పారు. విభజన తేదీ నాటికి మంజూరైన న్యాయాధికారుల పోస్టుల సంఖ్య, ఖాళీలు, విభజన తేదీ తరువాత రెండు రాష్ట్రాల్లో న్యాయాధికారుల సంఖ్య, ఖాళీలు తదితర వివరాలు ఉన్నాయా అంటూ న్యాయమూర్తి ప్రశ్నించగా... జాబితా సిద్ధంగా లేదని, కొంత సమయం కావాలని హైకోర్టు తరఫు సీనియర్ న్యాయవాది రమణీరావు విన్నవించారు. సంబంధిత వివరాలను బుధవారం నాటికి కోర్టుకు సమర్పించాల ని న్యాయమూర్తి ఆదేశిస్తూ కేసు విచారణను సెప్టెంబరు 5కు వాయిదా వేశారు. -
జూన్ 17లోగా ముసాయిదా
- తుది మార్గదర్శకాలు మేం ఖరారు చేస్తాం - న్యాయాధికారుల విభజనపై కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి హైకోర్టుతో సంప్రదింపులు జరిపి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో ఉండాల్సిన సబార్డినేట్ జ్యుడీషియల్ అధికారుల సంఖ్యను నిర్ధారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉమ్మడి హైకోర్టు రూ పొందించిన క్యాడర్ విభజన మార్గదర్శకాలను ముసాయి దాగా పరిగణించాలని, వీటిపై తగిన సూచనలు తీసుకుని కేంద్రం జూన్ 17లోగా మార్గదర్శకాల ముసాయిదాను త యారు చేయాలని పేర్కొంది. ఈ ముసాయిదాను పరిశీలించి తుది మార్గదర్శకాలను తాము ఖరారు చేస్తామని చెబు తూ సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. న్యా యాధికారుల విభజనకు సంబంధించి ఉమ్మడి హైకోర్టు రూపొందించిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ తెలంగాణ జడ్జెస్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలోని ధర్మాసనం 3 రోజులుగా విచారణ జరిపి శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది. వివాదాన్ని పరిష్కరించే ప్రక్రియ ఇలా... న్యాయాధికారుల కేటాయింపునకు సంబంధించి దాఖలైన రిట్ పిటిషన్, స్పెషల్ లీవ్ పిటిషన్లు విభిన్నమైన ప్రశ్నల ను లేవనెత్తాయని, ఆయా అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది. ఇక వాద ప్రతివా దులకు ఈ ప్రక్రియలో భాగంగా కోర్టు 3 సూచనలు చేసింది. ► అవతరణ తేదీని దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి హైకోర్టుతో సంప్రదింపులు జరిపి 2 రాష్ట్రాల్లో జ్యుడీషియల్ అధికారుల క్యాడర్ ఎంత ఉండాలో తేల్చేందుకు తగిన మార్గదర్శకాలు రూపొందించి క్యాడర్ సంఖ్యను నిర్ధారించాలి. ► ఈ కసరత్తు నేటి నుంచి నాలుగు వారాల్లో పూర్తవ్వాలి. ► క్యాడర్ సంఖ్యను నిర్ధారించిన మీదట, విభిన్న క్యాడర్లకు సంబంధించిన అధికారుల కేటాయింపునకు తగిన మార్గదర్శకాలు రూపొందించాలి. న్యాయాధికారుల కేటాయింపునకు సంబంధించి ఉమ్మడి హైకోర్టు రూపొందించిన మార్గదర్శకాలపై తెలంగాణ జడ్జెస్ అసోసియేషన్, తెలంగాణ ప్రభుత్వం కొన్ని సూచ నలు చేయాలని తలచాయని, మరో రకంగా చెప్పాలంటే హైకోర్టు మార్గదర్శకాలు వారికి అంగీకారం కాదని ధర్మాసనం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను అంగీకరించిందని పేర్కొంది. ఇటీవలి నియామకాలపై... అవతరణ తేదీ అనంతరం ఉమ్మడి హైకోర్టు.. జ్యుడిషియల్ సర్వీసెస్‌కు సంబంధించి 130 మంది సివిల్ జడ్జెస్ నియామకాలు జరిపిందని, ఇలా నియమితులైన వారికి సంబంధించి కేటాయింపుల విషయంలో కూడా తగిన మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ ప్రక్రియ జూన్ 30 లోపు పూర్తవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 11కు వాయిదా వేసింది.