Diwali fireworks
-
బాణసంచా గోదాంలో భారీ పేలుడు.. నలుగురు మృతి
భోపాల్: బాణసంచా నిలువ చేసిన గోదాంలో భారీ పేలుడు సంభవించి నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు సైతం ఉన్నారు. ఈ విషాద సంఘటన మధ్యప్రదేశ్‌లోని మొరేనా జిల్లా బన్మోర్ నగర్లో గురువారం జరిగింది. భారీ పేలుడుతో ఫైర్‌క్రాకర్స్ నిలువ చేసిన గోదాం తునాతునకలైంది. శిథిలాల కింద మరింత మంది చిక్కుకొని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ పేలుడులో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడగా వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ‘గోదాంలోని గన్‌పౌడర్ వల్ల పేలుడు జరిగిందా లేదా గ్యాస్ సిలిండర్ పేలటం వల్లనా అనే అంశంపై దర్యాప్తు చేపట్టాం. ఈ పేలుడులో గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. వారికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి.’ అని మొరేనా కలెక్టర్ బక్కి కార్తికేయన్ తెలిపారు. గోదాం శిథిలాలను తొలగించేందుకు సహాయక బృందాలను మోహరించామని, పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు ఐజీ రాజేశ్ చావ్లా తెలిపారు. మూడేళ్ల క్రితం పంజాబ్‌లో ఇలాంటి సంఘటనే జరిగి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: దీపావళి సెలవుపై ప్రభుత్వం కీలక ప్రకటన.. పబ్లిక్ హాలీడే ఎప్పుడంటే.. -
ఇబ్రహీంపట్నంలో భారీ పేలుడు
ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు మందుగుండు సామగ్రితో ప్రయోగం చేస్తుండగా ఘటన ధ్వంసమైన ఇల్లు ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం సుందరయ్యనగర్ కాలువ కట్టపై గురువారం సాయంత్రం ఒక ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో వీరు దీపావళి బాణసంచాలో వినియోగించే మందుగుండు సామగ్రితో ప్రయో గం చేస్తుండగా ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం భావిస్తున్నారు. వివరాల్లోకెళితే.. సుందరయ్యనగర్ కట్టపై ఉంటున్న పోతాబత్తుల భాస్కరరావు వెల్డింగ్ పనులు చేస్తుంటాడు. అతని కువ ూరుడు రఘువర్మ (20) ముదినేపల్లిలో పాలిటెక్నిక్ చదువుతూ మధ్యలోనే ఆపేశాడు. అతని స్నేహితులు సైకం వెంకటేష్ (14) విజయశక్తి స్కూల్లో తొమ్మిదో తరగతి, కన్నా కోమలరాజు (17) చైతన్య కళాశాలలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ముగ్గురూ కలసి ఇంట్లో ఏదో ప్రయోగం చేస్తుండగా ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో రఘువర్మ అరచేతి భాగం విరిగి సుమారు 200 మీటర్ల దూరంలో పడింది. రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. వెంకటేష్‌కు రెండు కళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఛాతీ, పొట్ట భాగం, కాళ్లకు గాయాలయ్యాయి. కోమలరాజు రెండు కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న తహశీల్దార్ హరిహర బ్రహ్మాజీ, సీఐ జె.మురళీకృష్ణ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ముగ్గురినీ 108 సిబ్బంది గొల్లపూడిలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు ధాటికి ఇంటి గోడలు, పైకప్పు రేకులు, ఇంట్లోని సామగ్రి పూర్తిగా ధ్వంసమయ్యాయి. పరిసరాల్లో పడివున్న విద్యుత్ వైర్లు, బ్యాటరీ తదితర వస్తువులను పరిశీలించిన పోలీసులు.. వీరు ఏదో ప్రయోగం చేస్తుండగా ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. సమీపంలోని క్వారీల్లో ఉపయోగించే పేలుడు సామగ్రిని ఏమైనా వినియోగించారా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న వెస్ట్ ఏసీపీ రాఘవరావు సీఐ మురళీకృష్ణ, తహశీల్దార్ బ్రహ్మాజీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను పరిశీలించారు. గాయపడిన ముగ్గురి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. క్లూస్ టీం నిపుణుల బృందం ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ ప్రాంతంలో ఇంతటి భారీ పేలుడు జరగడం చర్చనీయాంశమైంది. -
ముడుపుల ‘బాంబులు’
దీపావళి వస్తోందంటే ప్రజలకే కాదు.. టపాసుల వ్యాపారులకు.. ఆ దుకాణాలకు అనుమతిలిచ్చే అధికారులకు పండగే. ఎందుకంటే వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు ఏర్పాటు చేసి అధిక ధరలకు బాణాసంచా విక్రయిస్తుంటారు. ఈ తతంగమంతా కళ్లముందే జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించినందుకు వారికీ కొంత ‘ప్రతిఫలం’ దక్కుతుంది. ఇలా వ్యాపారులు, అధికారుల వైఖరి పుణ్యమాని మోసపోయేది ప్రజలేనన్నది ఏటా జరుగుతున్న తంతే. సిరిసిల్ల/మంథని/జగిత్యాల, న్యూస్‌లైన్ : దీపావళి టపాసుల వ్యాపారులు నిబంధనల ప్రకారం అగ్నిప్రమాదాలు జరగకుండా నివాస ప్రాంతాలకు దూరంగా దుకాణాలను ప్రారంభించాలి. ఒక్కో దుకాణం అనుమతికి రెవెన్యూ, మున్సిపాలిటీ, మేజర్ గ్రామపంచాయతీ, పోలీసు, అగ్నిమాపక శాఖల నుంచి అనుమతులు కావాలి. దుకాణదారులు అగ్నిప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం కారణంగా అన్ని శాఖల అధికారులు డబ్బులు తీసుకుంటూ కళ్లు మూసుకొని అనుమతులిస్తున్నారు. దీపావళి పండగకు టపాసులు అమ్ముకొని నాలుగు డబ్బులు సంపాదించుకోవాలన్న వ్యాపారుల మధ్య పోటీ ముడుపులకు ఆజ్యం పోస్తోంది. ఇప్పటికే లక్షలాది రూపాయల టపాసులను కొనుగోలు చేసిన వ్యాపారులు లెసైన్స్ రాకుంటే నష్టపోతామని పోటాపోటీగా అధికారులకు డబ్బులిస్తూ లెసైన్స్ సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ అన్నీ సక్రమంగా ఉన్నా అధికారులకు ముడుపులు ముట్టజెప్పాల్సిందే. లేకుంటే ఏదో ఒక సాకుతో దుకాణాల లెసైన్స్‌లు ఇవ్వకుండా సతాయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లావ్యాప్తంగా సిరిసిల్ల, వేములవాడ, కోరుట్ల, మెట్పల్లి, కరీంనగర్, హుస్నాబాద్, సుల్తానాబాద్, ధర్మపురి, రాయికల్, చొప్పదండి, గంగాధర, హుజూరాబాద్, జమ్మికుంట, పెద్దపల్లి, మంథని, రామగుండం, గోదావరిఖని ప్రాంతాల్లో 475 దుకాణాల అనుమతికి దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ముడుపులే ఎక్కువ.. నిబంధనల ప్రకారం రెవెన్యూ, అగ్నిమాప క, పోలీసు, మున్సిపల్ అధికారులకు నిర్దిష్ట రుసుమును వ్యాపారులు ఎస్టీవోల్లో చలాన చెల్లించాల్సి ఉంది. రెవెన్యూ, ఫైర్, మున్సిపాలిటీలకు రూ.500 చొప్పున, పోలీసు శా ఖకు రూ.1500 ప్రభుత్వానికి పన్ను చెల్లిం చాల్సి ఉండగా, వ్యాపారుల నుంచి ముడుపులే ఎక్కువ దండుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు తాత్కాలిక అనుమతి కోసం రూ.3000, మున్సిపల్ అధికారులు రూ. 2000, అగ్నిమాపక అధికారులు ఒక్కో లెసైన్స్‌కు రూ.2000, అందరికంటే ఎక్కువగా పోలీసుశాఖ రూ.3000 చొప్పున వసూలు చేస్తున్నారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. టపాసులపై ఎమ్మార్పీ లేకపోవడం, ఎక్కడ తయారయ్యాయో ముద్రించకపోవడంతో దీన్ని సాకుగా చూపుతూ తూనికలు, కొలతల అధికారులు దుకాణం తెరచిన రోజు వచ్చి వేధిస్తారని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో ఒక్కో లెసైన్స్‌కు రూ.5000 వరకు ఖర్చయితే ఈసారి రూ.10 వేలవుతోందని వ్యాపారులు వాపోతున్నారు. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా రూ.47.50 లక్షల మేరకు అధికార యంత్రాంగం దీపావళి అవినీతి ధమాకాను మోగించారు. ‘హోల్‌సేల్’ లాభాలు టపాసులను నిల్వ చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. నిబంధనల మేరకు గోదాముల నిర్మాణం చేపట్టాలి. జిల్లాలో జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, కోరుట్లతోపాటు మరో రెండు పట్టణాల్లో టపాసులు నిల్వ చేయడానికి వ్యాపారులకు అనుమతి ఉంది. వీరు గోదాముల సామర్థ్యానికి మించి టపాసులను నిల్వ ఉంచి అమ్మకాలు చేపట్టి లాభాలు గడిస్తారు. దీపావళికి రెండు రోజుల ముందు ఆయా పట్టణాల్లో ఒక దుకాణానికి అనుమతి తీసుకుని రెండు దుకాణాలు ఏర్పాటు చేసి అమ్మకాలు సాగిస్తారు. మరికొందరు పట్టణాల్లో తమ గృహాల్లో అక్రమంగా నిల్వ చేసి రిటేల్ వ్యాపారులకు అమ్ముతారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారనేది అధికారులకే తెలియాలి. భారీగా పెరిగిన ధరలు ప్రతి సంవత్సరం అన్ని ముడిసరుకుల రీతిలో టపాసులకు సంబంధించిన ముడిసరుకుల ధరలు, లేబర్ చార్జీలు పెరుగడంతో టపాసుల ధరలు 20-30 శాతం పెరుగుతాయని హోల్‌సేల్ వ్యాపారులు అంటున్నారు. గతంలో కిలో టపాసులు రూ.240 ఉండగా, ఈసారి రూ.300కు పైగా పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ సంవత్సరం జిల్లావ్యాప్తంగా రూ.5కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా. -
దొడ్డిదారిన దీపావళి బాణసంచా
సాక్షి, హైదరాబాద్: అక్రమ వ్యాపారులకు దీపావళి బాణసంచా కోట్లు కురిపిస్తోంది. లెక్కా పత్రం లేని సంపాదనలో ఆదాయం పన్ను శాఖకు చిల్లిగవ్వ కూడా కట్టడంలేదు. శివకాశీ నుంచి హైదరాబాద్ వరకు ఏ చెక్పోస్టులోనూ బాణసంచాను అడ్డుకున్న దాఖలాలు లేవు. దీంతో బాణసంచా వ్యాపారంపై ఆదాయం పన్నుశాఖ దృష్టి పెట్టింది. రాష్ట్రంలో పరిమిత సంఖ్యలోనే వ్యాపారులు బాణసంచా అమ్మకాలకు లెసైన్సులు పొందినట్టు అధికారిక లెక్కలు పేర్కొంటున్నాయి. అయితే. రాష్ట్రవ్యాప్తంగా 1,540 మంది ఈ ఏడాది బాణసంచా కొనుగోలు చేసినట్లు శివకాశీ నుంచి అందిన వివరాలు తెలుపుతున్నాయి. వీటి విలువ రూ. 850 కోట్లు. లెసెన్సులు లేకుండా జంటనగరాల్లోనే 600 మంది బాణసంచా అమ్ముతున్నారు. లెసైన్సులు పొందిన 70 మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారు. మిగతా వారి నుంచి పైసా ఆదాయం రావడంలేదు. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే పన్ను 15 శాతం కూడా ఉండటంలేదు. అనుమతి లేని వ్యాపారులు నేరుగా శివకాశీ నుంచి సరుకు తెస్తున్నారు. పన్నుల బెడద లేకపోవడం వల్ల వీరికి 50 శాతం లాభాలు వస్తున్నాయి. ఇందులో కొంత మొత్తాన్ని చెక్‌పోస్టుల వద్ద వెచ్చిసున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. మరోపక్క బాణసంచాను నగర శివారు ప్రాంతాల్లో జనావాసాలు లేని ప్రాంతాల్లో నిల్వ చేయాలని నిబంధనలున్నా, లెసైన్సులు లేని వ్యాపారులు నగరం నడిబొడ్డునే గోడౌన్లలో పెడుతున్నారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది, మున్సిపల్, రెవెన్యూ అధికారులకు ముడుపులు ఇవ్వడం వల్ల ఎలాంటి తనిఖీలు ఉండటం లేదనే ఆరోపణలున్నాయి.