Domestic equity
-
సానుకూలతలు కొనసాగొచ్చు
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఈ వారమూ సానుకూలతలు కొనసాగొచ్చని స్టాక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయ కార్పొరేట్ డిసెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. అలాగే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల ట్రేడింగ్ కార్యకలాపాలపై కూడా ఇన్వెస్టర్లు దృష్టి సారించే వీలుందంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి, క్రూడాయిల్ ధరల కదలికలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించొచ్చంటున్నారు నిపుణులు. ఇదే వారంలో మెడి అసిస్ట్ హెల్త్‌కేర్ సరీ్వసెస్ ఐపీఓ జనవరి 15న(నేడు) ప్రారంభం కానుంది. ఇటీవల పబ్లిక్ ఇష్యూను పూర్తి చేసుకున్న జ్యోతి సీఎన్సీ ఆటోమేషన్ షేర్లు మంగళవారం(జనవరి 16న) ఎక్చేంజీలో లిస్ట్ కానున్నాయి. గత వారం మొత్తంగా సెన్సెక్స్ 542 పాయింట్లు, నిఫ్టీ 184 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. దేశీయ ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టీవీఎస్‌ల క్యూ2 ఆర్థిక ఫలితాలు మెప్పించడంతో శుక్రవారం సూచీలు తాజా జీవితకాల గరిష్టాన్ని నమోదు చేశాయి. ‘‘దేశీయ మార్కెట్‌ను సానుకూల వాతావారణ నెలకొనప్పట్టికీ.., సూచీలను స్థిరంగా లాభాల వైపు నడిపే అంశాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు మూమెంటమ్‌ను నిర్దేశిస్తాయి. సాంకేతికంగా నిఫ్టీ బలమైన అవరోధం 21,500 – 21,850 శ్రేణిని చేధించింది. కావున ఎగువ స్థాయిలో 22,000 స్థాయిని పరీక్షించవచ్చు. ప్రతికూల పరిస్థితులు ఎదురైతే దిగువ స్థాయిలో 21,750 వద్ద తక్షణ మద్దతు లభిస్తుంది. ఈ స్థాయిని కోల్పోతే 21,650 – 21,575 పరిధిలో మరో బలమైన మద్దతు ఉంది’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ అమోల్ అథవాలే తెలిపారు. క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రభావం దేశీయ మార్కెట్ ముందుగా గతవారం మార్కెట్ ముగింపు తర్వాత వెల్లడైన హెచ్‌సీఎల్ టెక్, విప్రో, అవెన్యూ సూపర్‌మార్ట్స్ డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో దాదాపు 200కు కంపెనీలు తమ క్యూ3 ఫలితాలు ప్రకటించనున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్, ఏషియన్ పేయింట్స్, ఎల్టీఐఎం, ఇండస్ఇండ్ బ్యాంక్, అ్రల్టాటెక్ సిమెంట్, జియో కంపెనీలు ఇందులో ఇన్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. ప్రపంచ పరిణామాలు యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లపై ప్రభావం చూపించే అమెరికా డిసెంబర్ ద్రవ్యోల్బణ డేటా, ఉపాధి కల్పన గణాంకాలు అంచనాలకు మించి నమోదడవంతో ‘వడ్డీరేట్ల తగ్గింపు వాయిదా’ అంచనాలు తెరపైకి వచ్చాయి. అలాగే ఎర్ర సముద్రం చుట్టూ నెలకొన్న రాజకీయ అనిశి్చతి, తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో చైనా వ్యతిరేకి డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ) విజయం పరిణామాలను ఈక్విటీ మార్కెట్ నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు జపాన్ మెషిన్ టూల్ ఆర్డర్స్ డేటా, యూరోజోన్ నవంబర్ వాణిజ్య లోటు, పారిశ్రామికోత్పత్తి గణాంకాలతో పాటు దేశీయ హోల్‌సేల్ ద్రవ్యోల్బణ డేటా సోమవారం విడుదల కానుంది. చైనా 2023 డిసెంబర్ క్వార్టర్ జీడీపీ, పారిశ్రామికోత్పత్తి, రిటైల్ అమ్మకాలతో పాటు బ్రిటన్ డిసెంబర్ ద్రవ్యోల్బణం, పీపీఐ ఇన్పుట్–అవుట్‌పుట్ డేటా బుధవారం వెల్లడి కానుంది. గురువారం యూరోజోన్ నవంబర్ కరెంట్ అకౌంట్, జపాన్ మెషనరీ ఆర్డర్స్, పారిశ్రామికోత్పత్తి డేటా వెల్లడి అవుతుంది. ఇక శుక్రవారం జపాన్ డిసెంబర్ ద్రవ్యోల్బణం, బ్రిటన్ డిసెంబర్ రిటైల్ సేల్స్ విడుదల అవుతాయి. తొలి 2 వారాల్లో రూ.3,900 కోట్లు దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఏడాది తొలి రెండు వారాల్లో రూ.3900 కోట్లు పెట్టుబడి పెట్టారు. గతేడాది డిసెంబర్లో రూ.66,134 కోట్లతో పోలిస్తే పెట్టుబడులు నెమ్మదించాయి. భారత ఈక్విటీ మార్కెట్ జీవితకాల గరిష్టాలకు చేరుకోవడంతో పాటు ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై నెలకొన్న అస్థిరతల నేపథ్యంలో ఎఫ్ఐఐలు ఆచితూచి వ్యవహరిస్తున్నారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈక్విటీ పట్ల అప్రమత్తత వహిస్తున్న ఎఫ్ఐఐలు డెట్ మార్కెట్లో మాత్రం ఉదారంగా ఇన్వెస్టర్లు చేస్తున్నారు. ఈ జనవరి 12 నాటికి డెట్ మార్కెట్లో రూ.7,91 కోట్ల పెట్టుబడులు జొప్పించారు. ఇక 2023లో భారత్ ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్‌పీఐలు రూ.1.71 లక్షల కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. -
ఈక్విటీలపై మళ్లీ ఎఫ్‌పీఐల చూపు
న్యూఢిల్లీ: వరుసగా మూడు త్రైమాసికాలలో క్షీణిస్తూ వచ్చిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడులు జులై–సెప్టెంబర్(క్యూ2)లో 8 శాతం పుంజుకున్నాయి. దీంతో దేశీ ఈక్విటీలలో ఎఫ్‌పీఐల పెట్టుబడుల విలువ 566 బిలియన్ డాలర్లను తాకింది. అంతకుముందు త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో ఇవి 523 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు మార్నింగ్‌స్టార్ నివేదిక వెల్లడించింది. ప్రపంచస్థాయిలో వేగంగా మారుతున్న స్థూలఆర్థిక పరిస్థితులు, సెంటిమెంట్లు, అవకాశాలు దేశీ ఈక్విటీ మార్కెట్లకు ఆకర్షణను తీసుకువచ్చినట్లు పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం జనవరి–మార్చిలో ఇవి 612 బిలియన్ డాలర్లుకాగా.. 2021 అక్టోబర్–డిసెంబర్లో 654 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే గత ఆర్థిక సంవత్సరం(2021–22) క్యూ2లో ఇవి 667 బిలియన్ డాలర్లకు చేరాయి. కాగా.. తాజా సమీక్షా కాలంలో దేశీ ఈక్వి టీ మార్కెట్ల క్యాపిటలైజేషన్(విలువ)లో ఎఫ్‌పీఐ పెట్టుబడుల వాటా సైతం క్యూ1లో నమోదైన 16.95 శాతం నుంచి 16.97 శాతానికి బలపడింది. ఎఫ్‌పీఐల జాబితాలో ఎఫ్‌పీఐ విభాగంలో ఆఫ్‌షోర్ మ్యూచువల్ ఫండ్స్ ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. వీటితోపాటు ఆఫ్‌షోర్ బీమా కంపెనీలు, హెడ్జ్ ఫండ్స్, సావరిన్ వెల్త్‌ఫండ్స్ సైతం ఈ జాబితాలో నిలిచే సంగతి తెలిసిందే. ఈ ఏడాది(2022–23) క్యూ1లోనూ దేశీ ఈక్విటీలలో అమ్మకాల వెనకడుగు వేసిన ఎఫ్‌పీఐలు తిరిగి క్యూ2లో పెట్టుబడుల యూటర్న్ తీసుకోవడం గమనార్హం! అయితే పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నివేదిక అభిప్రాయపడింది. యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, అధిక ద్రవ్యోల్బణం ప్రపంచ ఆర్థిక పురోగతిపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్న విషయం విదితమే. మరోపక్క నెలల తరబడి కొనసాగుతున్న రష్యా– ఉక్రెయిన్ యుద్ధం సైతం ఎఫ్‌పీఐ పెట్టుబడులను ప్రభావితం చేస్తున్నట్లు పేర్కొంది. ఇక చమురు ధరలు బలపడటం, రూపాయి క్షీణతతో దేశీయంగా పెరుగుతున్న కరెంట్ ఖాతా లోటు వంటి అందోళనల నేపథ్యంలో ఎఫ్‌పీఐలు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు వివరించింది. ఇటీవల అమ్మకాలు ప్రస్తుత త్రైమాసికం(క్యూ2)లో తొలుత జులైలో 61.8 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌పీఐలు ఆగస్ట్‌లో ఏకంగా 6.44 బిలియన్ డాలర్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. అయితే తిరిగి సెప్టెంబర్‌లో అమ్మకాలు చేపట్టి 90.3 కోట్ల డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇందుకు ప్రధానంగా అంతర్జాతీయ అనిశ్చితులు కారణమైనట్లు మార్నింగ్ స్టార్ నివేదిక పేర్కొంది. ధరల కట్టడికి ఫెడ్ వేగవంత రేట్ల పెంపు ప్రపంచ ఆర్థిక వృద్ధిని దెబ్బతీయవచ్చన్న అంచనాలు పెరుగుతున్నట్లు తెలియజేసింది. డాలరుతో మారకంలో రూపాయి భారీ క్షీణత, యూఎస్ బాండ్ల ఈల్డ్స్ బలపడటం వంటి అంశాలు సైతం ఎఫ్‌పీఐల పెట్టుబడులను ప్రభావితం చేయగలవని వివరించింది. కాగా.. ఈ నెల(నవంబర్)లో ఎఫ్‌పీఐలు మళ్లీ భారీ పెట్టుబడులకు తెరతీయడం ప్రస్తావించదగ్గ అంశం. ఈ నెలలో ఇప్పటివరకూ 3.53 బిలియన్ డాలర్ల విలువైన ఈక్విటీలను జత చేసుకున్నారు. ఫెడ్ వడ్డీ పెంపు చివరి దశకు చేరుకున్న అంచనాలు, యూఎస్‌లో స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడనున్న సంకేతాలను నివేదిక ఇందుకు ప్రస్తావించింది. -
ఈక్విటీల్లో ఎఫ్‌పీఐల వాటా డౌన్
న్యూఢిల్లీ: దేశీ ఈక్విటీలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) వాటాల విలువ వరుసగా మూడో త్రైమాసికంలోనూ క్షీణించింది. మార్నింగ్‌స్టార్ నివేదిక ప్రకారం 2022 ఏప్రిల్–జూన్(క్యూ1)లో 14 శాతం నీరసించి 523 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అంతకుముందు క్వార్టర్లో ఈ విలువ 612 బిలియన్ డాలర్లుకాగా.. 2021 జూన్ క్వార్టర్‌కల్లా 592 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఈ ఏడాది ప్రారంభం నుంచీ విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దేశ, విదేశాలలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల ప్రభావంతో పెట్టుబడుల్లో వెనకడుగు వేస్తున్నారు. దేశీ ఈక్విటీ మార్కెట్ల విలువలోనూ ఎఫ్‌పీఐల వాటా మార్చిలో నమోదైన 17.8 శాతం నుంచి 16.9 శాతానికి నీరసించింది. 2022 జూన్ త్రైమాసికంలో ఎఫ్‌పీఐలు 13.85 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను విక్రయించారు. మార్చి క్వార్టర్లో వెనక్కి తీసుకున్న పెట్టుబడులు 14.59 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇవి తక్కువే కావడం గమనార్హం! యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కఠిన విధాన నిర్ణయాల నేపథ్యంలో ఎఫ్‌పీఐల సెంటిమెంటు బలహీనపడినట్లు నివేదిక పేర్కొంది. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు కారణంగా బాండ్ల ఈల్డ్స్ సైతం జోరందుకున్నట్లు తెలియజేసింది. వీటికి చమురు హెచ్చుతగ్గులు, కమోడిటీ ధరల పెరుగుదల, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు జత కలిసినట్లు వివరించింది. -
మార్కెట్ల పతనంపై ఆందోళన వద్దు
న్యూఢిల్లీ: దేశీ ఈక్విటీ, కరెన్సీ మార్కెట్ల పతనంపై కలవరపడుతున్న ఇన్వెస్టర్లకు భరోసా కల్పిం చేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. భారత మార్కెట్లపై అంతర్జాతీయ ప్రతికూలాంశాల ప్రభావం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భారత ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం ఉంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. లాభదాయకతను దెబ్బతీస్తూ గుదిబండలా మారిన మొండిబకాయిల సమస్యలను పరిష్కరించుకోవడానికి బ్యాంకులకు మరిన్ని అధికారాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. అంతర్జాతీయంగా మందగమన పరిస్థితుల్లోనూ అధిక వృద్ధిని సాధించేందుకు తగు విధానాలను ప్రభుత్వం ప్రవేశపెడుతుందని శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో జైట్లీ చెప్పారు. ప్రపంచ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తిన ప్రభావం భారత్ సహా ఇతర దేశాలపైనా పడిందని చెప్పారు. -
బంగారం వెలవెల.. షేర్లు మిలమిల
న్యూఢిల్లీ: షేర్ల మెరుపుల ముందు పసిడి వెలవెలపోయింది. ఈ ఏడాది ఇప్పటి వరకు బీఎస్ఈ సెన్సెక్స్ 22.76 శాతం పెరగ్గా బంగారం ధరలు 5 శాతం క్షీణించాయి. వెండి రేటు నామమాత్రంగా 2.38 శాతం పెరిగింది. ఇన్వెస్టర్ల సెంటిమెంటు మెరుగవ్వడం, విదేశీ నిధులు పుష్కలంగా వస్తుండడంతో దేశీయ ఈక్విటీలకు ఇది శుభ సంవత్సరమని మార్కెట్ నిపుణులు అంటున్నారు. షేర్లు, బంగారం ధరలు సాధారణంగా భిన్నమార్గాల్లో పయనిస్తుంటాయి. అంటే, షేర్ల రేట్లు ఎగువముఖంలో ఉంటే పసిడి ధరలు దిగువముఖంలో ఉంటాయి. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని అధిగమించడానికి ప్రజలు బంగారాన్ని ఆశ్రయిస్తుంటారు. మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్నపుడు పుత్తడిలో పెట్టుబడులు భద్రమని భావిస్తుంటారు. ధరల పెరుగుదల పరంగా దశాబ్దానికిపైగా షేర్లపై పైచేయి సాధించిన బంగారం వరుసగా రెండో ఏడాది వెనుకంజ వేసింది. గత డిసెంబరు 31న 10 గ్రాముల బంగారం ధర రూ.29,800, కిలో వెండి రేటు రూ.43,755గా ఉన్నాయి. సోమవారం ముగింపు ధరలు చూస్తే బంగారం రూ.28,370, వెండి రూ.44,800గా ఉన్నాయి. డిసెంబరు 31వ తేదీన 21,170.68 పాయింట్లుగా ఉన్న సెన్సెక్స్ సోమవారం 25,991.23 పాయింట్ల వద్ద క్లోజైంది. ఈ నెల 25న 26,300 పాయింట్ల ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి సెన్సెక్స్ చేరింది. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా 2,550 కోట్ల డాలర్లను (రూ.1.53 లక్షల కోట్లు) భారత్‌లో ఇన్వెస్ట్ చేశారు. సెన్సెక్స్ గతేడాది ఇన్వెస్టర్లకు 9 శాతం ఆదాయాన్నివ్వగా బంగారం ధరలు 3 శాతం, వెండి రేటు ఏకంగా 24 శాతం పడిపోయాయి.