DRDA Department
-
దశాబ్ద కాలం తర్వాత డీఆర్సీ
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా అభివృద్ధిపై బుధవారం సుమారు 4 గంటల పాటు సుదీర్ఘమైన సమీక్ష సమావేశం జరిగింది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత డీఆర్సీ సమావేశ దృశ్యం కనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఇన్చార్జి మంత్రి హోదాలో పొన్నం ప్రభాకర్ జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా పూర్తి స్థాయి వివరాలు, అభివృద్ధి పనుల పురోగతి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో ఆరా తీయడంతోపాటు సమస్యలను ఆయన నోట్ చేసుకున్నారు. అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. శాఖాపరంగా సమగ్ర అవగాహన, సమాచారం లేనివారిపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. వచ్చే సమావేశానికైనా సమగ్ర సమాచారంతో రావాలని పలు శాఖల అధికారులను స్వల్పంగా మందలించారు. అధికారులు తమ విధులు, బాధ్యతలు విస్మరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గత ప్రభుత్వం మాదిరిగా వన్‌సైడ్ నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. పరీక్షల్లో ఉత్తీర్ణతపై సమ్మతి లేఖ తప్పనిసరి త్వరలో జరగనున్న పదోతరగతి, ఇంటరీ్మడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించి ఉత్తీర్ణతపై సమ్మతి లేఖ తప్పనిసరి అని మంత్రి పొన్నం అధికారులను ఆదేశించారు. సంబంధిత హెచ్ఎం, టీచర్, వార్డెన్లను నుంచి సమ్మతి లేఖ తీసుకోవాలని, విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించకుంటే వారినే బాధ్యులు చేయాలని సూచించారు. ఇప్పటి నుంచే సంబంధిత అధికారులు పాఠశాలలపై పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. గురుకులాలు, బీసీ వెల్ఫేర్ హాస్టళ్ల లో సమస్యలు లేకుండా చూసుకోవాలన్నారు. పరిష్కారానికి హామీ.. ప్రభుత్వ విభాగాల్లో పలు పలు సమస్యలు, పెండింగ్ పనులను అధికారులు మంత్రి దృష్టికి తీసుకురావడంతో.. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రెండు మోడ్రన్ ధోబీఘాట్ల పూర్తైనప్పటికీ న్యాయపరమైన సమస్యలు ఉండడంతో మిషన్లు తుప్పుపట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొనడంతో సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ఉన్న తాధికారులను ఆదేశించారు బీసీ హాస్టళ్లు అధిక శాతం ప్రైవేట్ భవనల్లో ఉన్నాయని వాటి సొంత భవనాల నిర్మాణం, 6 హాస్పిటళ్ల నిర్మాణం కోసం గత ప్రభుత్వం జీఓ ఇచి్చందని, నిధులు విడుదల చేయలేదని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. అధునాతన చేపల మార్కెట్ ఏర్పాటు నగరంలో అధునాతన చేపల మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. చేపల మార్కెట్ లేకపోవడంతో వ్యాపారులు రోడ్లపై విక్రయిస్తున్నారని, ప్రత్యేకంగా మార్కెట్ ఏర్పాటు చేసి మత్స్యకారులు, వినియోగదారులకు సౌకర్యం కలి్పస్తామన్నారు. కూరగాయల మార్కెట్లను సైతం రెగ్యులరైజ్ చేస్తామన్నారు. పెండింగ్ అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు. కలెక్టరేట్‌కు కొత్త భవనాన్ని నిర్మిస్తాం.. త్వరలో హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌కు నూతన భవన సముదాయాన్ని నిర్మిస్తామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. విశాలమైన స్థలంలో ఎవరూ ఊహించని విధంగా భారీ సముదాయాన్ని నిర్మిస్తామన్నారు. సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందజేస్తామన్నారు. రేషన్ కార్డులు లేని వారికి సైతం కొత్తవి అందిస్తామని స్పష్టం చేశారు. 58, 59 జీఓకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఒక్కో నియోజకవర్గానికి రూ.10 కోట్లు రాబోయే వేసవితో పాటు విద్య, వైద్యానికి సంబంధించి అత్యవసర పనుల కోసం ఒక్కో నియోజక వర్గానికి రూ.10 కోట్ల చొప్పున ఖర్చు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బుధవారం హైదరాబాద్ కలెక్టరేట్లో జరిగిన ‘జిల్లా స్థాయి సమీక్ష సమావేశం’ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రజల అత్యవసర సమస్యల పరిష్కారం కోసం తన కోటా నిధులు కేటాయించినట్లు తెలిపారు. త్వరలో ఎమ్మెల్యే, ఎమెల్సీలు, ఎంపీలతో జిల్లా అభివృద్ధిపై సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. -
జాబ్ మేళా.. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు..
అనంతపురం అర్బన్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సీడాప్ ఆధ్వర్యంలో ఈనెల 11న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ– వైఎస్సార్ క్రాంతి పథకం పీడీ ఐ.నరసింహారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో 11వ తేదీ ఉదయం10 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయన్నారు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ధన్వి లోన్స్, సర్వీసెస్, వికాస్ ప్లేస్మెంట్ (కియా అనుబంధ సంస్థ), సిల్వర్ పార్క్ తదితర కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు జిరాక్స్ తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. వివరాలకు 8985091256 నంబర్లో సంప్రదించాలన్నారు. చదవండి: ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల అర్హత... వేతనం ►ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ : సేల్స్ ఆఫీసర్, డెవలప్మెంట్ మేనేజర్, ఏదైనా డిగ్రీ, మార్కెటింగ్ రంగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి (స్త్రీ, పురుషులు), వయసు 25 ఏళ్ల నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం రూ.18 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంటుంది. జిల్లాలోనే పనిచేయాల్సి ఉంటుంది. ►ధన్వి లోన్స్, సర్వీసెస్: కలెక్షన్ ఆఫీసర్, ఇంటర్ (పురుషులు), వయసు 19 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. వేతనం రూ.16 వేల నుంచి రూ.17,200 వరకు ఉంటుంది. రవాణా భత్యం ఇస్తారు. జిల్లాలోనే పనిచేయాల్సి ఉంటుంది. ►వికాస్ ప్లేస్మెంట్ (కియా అనుబంధ సంస్థ): మెషిన్ ఆపరేటర్, పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, డిగ్రీ (పురుషులు), వయసు 18 ఏళ్ల నుంచి 28 ఏళ్లలోపు ఉండాలి. వేతనం రూ.11 వేల నుంచి రూ.13 వేల వరకు ఉంటుంది. ఉచిత భోజనం, రవాణా సౌకర్యం కల్పిస్తారు. పెనుకొండ వద్ద ఉన్న సంస్థలో పనిచేయాలి. ►సిల్వర్ పార్క్ (రేమాండ్): టైలర్, క్వాలిటీ ప్యాకింగ్, కటింగ్. పదో తరగతి ఆపై చదివిన స్త్రీలు అర్హులు. వయసు 20 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం రూ.13,340, ఉచిత వసతి, రాయితీతో కూడిన భోజన వసతి కల్పిస్తారు. బెంగుళూరులో పనిచేయాల్సి ఉంటుంది. -
రూ.వంద కోట్లతో ఉపాధి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు వచ్చే ఏడాది విస్తృతంగా చేపట్టేందుకు యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేసింది. సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేసి కూలీలకు మరింత ఉపాధి కల్పించడంతోపాటు గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని నిర్ణయించింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) 2018–19 సంవత్సరానికి ప్రణాళిక రూపొందించింది. ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త పనులు చేపట్టేందుకు ఇప్పటి నుంచే అధికారులు కసరత్తు చేస్తున్నారు. పని కావాలని కోరిన ప్రతి కుటుంబానికి ఏడాదిలో గరిష్టంగా వంద రోజులపాటు ఉపాధి కల్పించాలన్నది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ముఖ్య ఉద్దేశం. వచ్చే ఏడాది రూ.100 ఖర్చు చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకోగా.. ఇందులో సుమారు రూ.70 కోట్లను కూలి కిందనే చెల్లించనుండడం విశేషం. జిల్లాలో 415 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో 356 పంచాయతీల్లో ఉపాధి పనులు జరుగుతున్నాయి. వీటి పరిధిలో జాబ్ కార్డులు పొందిన 1.36 లక్షల కుటుంబాలు ఉపాధి పనులకు ఏ డాది పొడవునా హాజరవుతున్నట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నా యి. ఇందులో కనీసం లక్ష కుటుంబాలకు వంద రోజుల పని కల్పించా లని డీఆర్డీఏ లక్ష్యం పెట్టుకుంది. మరో రూ.30 కోట్లను మెటీరియల్ కోసం వెచ్చించనున్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, శ్మశాన వాటికలు, ప్ర భుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, కిచెన్ షెడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. నీటి సంరక్షణకు పెద్దపీట వర్షపు నీటి సంరక్షణకు పెద్దపీట వేయనున్నారు. వాన నీటిని ఎక్కడికక్కడ నిల్వచేసి ప్రతి బొట్టుని భూమిలోకి ఇంకించేందుకు విస్తృతంగా నిర్మాణాలు చేపట్టాలని యోచిస్తున్నారు. జిల్లాలో 90 శాతం పంటల సాగుకు భూగర్భ జలాలే ప్రధాన వనరు. వాన నీటి నిల్వ, సంరక్షణ కోసం విస్తృతంగా ఊట కుంటలు, చెక్‌డ్యాంలు, ఇంకుడు గుంతలు నిర్మించాలని నిర్ణయించారు. అలాగే వ్యవసాయానికి అనుబంధంగా రైతులకు ఉపయోగపడేలా బావుల పూడికతీత, నీటి పారుదల కాల్వల నిర్వాణం, ఫీడర్ చానెళ్ల ఏర్పాటు తదితర పనులకూ ప్రాధాన్యం ఇస్తామని అధికార వర్గాలు వెల్లడించాయి. ‘వచ్చే ఏడాది మరింత ఉత్సాహంతో పనులు చేపట్టనున్నాం. ప్రతి కుటుంబానికి వంద రోజుల పని కల్పించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని డీఆర్డీఓ ప్రశాంత్ కుమార్ తెలిపారు. అలాగే స్వచ్ఛభారత్‌లో భాగంగా పెద్ద ఎత్తున వ్యక్తిగత మరుగుదొడ్లను త్వరితగతిన నిర్మిస్తామని చెప్పారు. ఈ ఏడాది రూ.80 కోట్లు ఖర్చు ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనుంది. దాదాపు 10 నెలల కాలంలో ఉపాధి హామీ పథకం కింద రూ.80 కోట్లు ఖర్చు చేశారు. 7,200 కుటుంబాలకు వంద రోజుల పని కల్పించారు. హాజరైన కూలీల కు సుమారు రూ.57 కోట్లు కూలి రూపంలో చెల్లించారు. మరో రూ.24 కోట్లను మెటీరియల్ పనులకు ఖర్చు చేశారు. మార్చి 31లోగా మరో రూ.10 కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. -
ప్రభుత్వ అధికారికి ఆసరా పింఛన్
ఐదేళ్ల పాటు రూ.69 వేలు మింగిన వైనం డీఆర్డీఏ శాఖలో ఓ అధికారి నిర్వాకం సంగారెడ్డి క్రైం: ఏ ఆసరా లేని వారి కోసం ఉద్దేశించి ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పింఛన్ ఓ అధికారి అక్రమంగా మింగేస్తున్నారు. దాదాపు ఐదేళ్లపాటు వికలాంగుల కోటాలో మొత్తం 69 వేలు జమ చేసుకున్నాడు. విశ్వసనీయ కథనం మేరకు.. డీఆర్డీఏ శాఖలో నీరుడి డాకయ్య ఫైనాన్స్ ఏపీఎంగా, ఇన్చార్జి డీపీఎంగా పనిచేస్తున్నారు. ఆయన దౌల్తాబాద్ మండలం ముబారస్పూర్ గ్రామం నుంచి తెల్ల రేషన్‌కార్డు జతపరిచి సదరం శిబిరంలో వికలాంగుల ధ్రువపత్రం (54 శాతం) పొందాడు. తన సొంత శాఖలో ఆసరా పథకం కింద పింఛన్ మంజూరు చేయించుకున్నాడు. ఇలా 2010 నుంచి 2015 మే వరకు మొదటి మూడున్నరేళ్లలో వెయ్యి రూపాయల చొప్పున రూ.42 వేలు, ఏడాదిన్నరలో రూ.1,500 చొప్పున రూ.27 వేలు.. ఇలా మొత్తం రూ.69 వేలు స్వాహా చేశాడు. ఎటువంటి ఆసరా లేకుండా ఉన్న నిరుపేద వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు చెల్లించాల్సిన పింఛన్ ఇలా ఆ శాఖలోని కొందరు ఉద్యోగులు స్వాహా చేయడంపై విమర్శలు వస్తున్నాయి. -
కుటుంబాలే గల్లంతు..
ఆన్లైన్లో కనిపించని పేర్లు * పట్టణంలో నమోదు కానివి.. * 263 కుటుంబాలు * పట్టణం పేర్లు పల్లెల్లోకి.. హుస్నాబాద్ : సమగ్ర కుటుంబ సర్వేలో వివరాలు గల్లంతయ్యూయి. హుస్నాబాద్ పట్టణంలోని రెండువందల కుటుంబాలకు సంబంధించిన సమాచారం ఆన్లైన్లో కనిపించకపోవడంపై నిరసన వ్యక్తమవుతోంది. ఆగస్టు 19న సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించగా.. పట్టణంలో 6,943 కుటుంబాలు ఉన్నట్లు తేలింది. ఈ వివరాలను అధికారులు తిమ్మాపూర్ మండలంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఆన్లైన్లో న మోదు చేయించారు. అయితే సర్వేలో వివరాలను సమర్పించిన 263 కుటుంబాల సమాచారం ఆన్లైన్లో కనిపించడంలేదు. పట్టణంలోని పలువార్డులకు సంబంధించిన ఈ సమాచారం లేకపోవడంతో పింఛన్లు, ఆహారభద్రత కార్డులకోసం దరఖాస్తులు చేసుకున్న వారు వీటిని పొందలేని పరిస్థితి నెలకొంది. ఎవరిది తప్పు.. సమగ్రసర్వేలో అధికారులు సైతం నిర్లక్ష్యంగానే వ్యవహరించినట్లు తెలుస్తోంది. అన్నింటికి సమగ్రసర్వే ఆధారమని ప్రభుత్వం ఓవైపు ప్రకటించినప్పటికీ స్థానిక అధికార యంత్రాంగం ఈ విషయంపై శ్రద ్ధ కనబర్చకపోవడంతో సమాచారం గల్లంతైనట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంలోని 263 కుటుంబాల సమాచారాన్ని హుస్నాబాద్ మండలంలోని ఆయా గ్రామాల్లోని కుటుంబాలుగా నమోదు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే పట్టణమని సర్వేపత్రాల్లో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ గ్రామాల్లో ఎందుకు నమోదుచేశారనే దానిపై స్పష్టత కరువైంది. రూరల్‌లో 49 కుటుంబాల సమాచారం ఉన్నప్పటికీ మిగతా సమాచారం ఎక్కడికి వెళ్లందన్నది ఇప్పటికీ అంతుచిక్కడంలేదు. దీనిపై అర్హుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తిరిగి నమోదుకోసం ప్రయత్నాలు.. సమగ్రసర్వేలో గల్లంతైన కుటుంబాలను తిరిగి నమోదుచేసే ప్రక్రియను నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు డీఆర్డీఏ శాఖకు ఈ బాధ్యతలు అప్పగించనట్లు సమాచారం. ప్రత్యేక సాఫ్ట్వేర్ వస్తేనే నమోదుచేసేందుకు వీలుకల్గుతుంది. త్వరలోనే దీన్ని అందించి కుటుంబాల వివరాలను నమోదుచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.