the driver
-
ఆటో నుంచి కింద పడి బాలుడు మృతి
పోరుమామిళ్ల: మండలంలోని తోకలపల్లెకు చెందిన ఆటో డ్రైవర్ పుల్లయ్య ఒక్కగానొక్క కుమారుడు పండు(3) సోమవారం సాయంత్రం ఆటో నుంచి కింద పడి మృతి చెందాడు. వివరారాలు ఇలా ఉన్నాయి. పుల్లయ్య ఆటో డ్రైవర్. సోమవారం సరదాగా కుమారున్ని ఆటోలో కూర్చోపెట్టుకుని వెళుతుండగా పండు జారి కిందపడ్డాడు. అంతే అక్కడికక్కడే చలనం లేకుండా పోయింది. చిన్నారిని రాత్రి ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రికి తెచ్చారు. డాక్టర్ రహిమాన్ పరీక్షించి ప్రాణం పోయినట్లు నిర్ధారించారు. అంతే తల్లిదండ్రులు పుల్లయ్య, ధనమ్మ రోదన చెప్పనలవి కాలేదు. ఆ గ్రామం నుంచి వచ్చిన వారు వారి దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. పండుగ రెండ్రోజులు ఉందనగా కళ్ల ముందు కన్నకొడుకు విగతజీవిగా మారడం ఆ తల్లిదండ్రులకు పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. -
మృత్యు వేగం
మద్యం మత్తులో డ్రైవర్ వీరంగం గొల్లపూడి శివారులో ఘోర ప్రమాదం మృతుల కుటుంబాల్లో తీరని విషాదం ట్రావెల్స్ నిర్లక్ష్యమూ ఘటనకు కారణం మద్యం మత్తు.. ఆపై మితి మీరిన వేగం.. పైగా విద్యార్థులతో ఘర్షణ... వెరసి నలుగురు వైద్య విద్యార్థుల విలువైన జీవితాలను డ్రైవర్ చిదిమేశాడు. ఇదే ప్రమాదంలో తాను కూడా మరణించి కుటుంబాన్ని విషాదంలోకి నెట్టాడు. అప్పటికే అతడు మద్యం తాగి ఉన్నట్లు పసిగట్టిన విద్యార్థులు బస్సును వేగంగా నడపవద్దంటూ పదేపదే చెప్పినా వారి మాటల్ని ఖాతరుచేయలేదు. ఇదే విషయాన్ని ట్రావెల్స్ యాజమాన్యానికి చెబితే వారు కూడా స్పందించలేదు. ఫలి తంగా ఈ ఘోరం జరిగింది.. ఆయా కుటుంబాల్లో విషా దాన్ని నింపింది. విజయవాడ సిటీ/భవానీపురం : గుంటూరుకు చెందిన వేముల శివశంకర్ హైదరాబాద్‌లో ఉంటూ ధనుంజయ్ ట్రావెల్స్‌లో డ్రైవరుగా పనిచేస్తున్నాడు. పదేళ్లుగా ఇదే సంస్థలో పని చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. మూడు రోజులపాటు తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జరిగిన మెడికో అంతర్ కళాశాలల స్పోర్ట్స్‌మీట్‌లో పాల్గొన్న ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన 46 మంది వైద్య విద్యార్థులు సోమవారం ఉదయం ధనుంజయ్ ట్రావెల్స్‌లో తిరుగు ప్రయాణమయ్యారు. మధ్యాహ్నం గుంటూరు జిల్లా చినకాకానిలోని హాయ్‌లాండ్‌కు వెళ్లారు. అక్కడి నుంచి రాత్రి 7.30 గంటల సమయంలో బయలుదేరేందుకు సిద్ధమవగా.. కొందరి విద్యార్థుల నగదు, మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు కనిపించలేదు. డ్రైవర్‌ను గట్టిగా నిలదీయగా తెలియదని బుకాయించాడు. క్లీనర్ కోసం ప్రయత్నిస్తే కనిపించలేదు. ఎట్టకేలకు క్లీనర్ మొబైల్ నంబర్‌ను గుర్తించి ఫోన్ చేశారు. తర్జనభర్జనలు జరిగాక విజయవాడ పోలీసు కంట్రోల్ రూమ్ వద్దకు వస్తే తీసుకున్న వస్తువులు తిరిగిచ్చేస్తానంటూ క్లీనర్ చెప్పాడు. ఆ మేరకు అదే బస్సులో వీరు విజయవాడ చేరుకుని పాత బస్టాండ్ సమీపంలో కొద్దిసేపు వేచి ఉన్నారు. క్లీనర్ వచ్చిన తర్వాత సామగ్రి తీసుకుని తమతోపాటు బస్సులో ఎక్కించారు. ఇదే సమయంలో ట్రావెల్స్ నిర్వహకులకు సమాచారం ఇచ్చి డ్రైవర్‌ను మార్చాలని చెప్పగా తగిన సమాధానం రాకపోవడంతో ఆ బస్సులో వెళ్లేందుకు విద్యార్థులు సుముఖత చూపలేదు. ఇదే సమయంలో డ్రైవర్ సూచనల మేరకే వాటిని తాను దొంగిలించినట్టు క్లీనర్ తెలిపాడు. విద్యార్థుల ప్రమేయం లేకుండానే బస్సును నడుపుతుండడంపై పలువురు విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ వీరి మాటలను ఖాతరు చేయకుండా బస్సును నడుపుతున్నాడు. నగర శివారుకు వెళ్లిన తర్వాత డ్రైవర్ వాలకంతో బెంబేలెత్తిన కొందరు విద్యార్థులు వెళ్లి బస్సు ఆపాలని అరిచారు. ఓ వైపు వీరితో వాదిస్తూనే బస్సును మరింత వేగంగా శివశంకర్ నడిపాడు. నల్లకుంట సమీపంలో బస్సు ఒక్కసారిగా బస్సు డివైడర్‌ను ఢీకొంది. అక్కడ రోడ్డు కొద్దిమేర ఎడమ వైపు మలుపు ఉంటుంది. ఇది గమనించక నేరుగా వెళ్లి డివైడర్‌ను కొట్టి కంగారుపడి వేగంగా ఎడమ వైపు స్టీరింగ్ తిప్పాడు. బస్సు వేగంగా వెళ్లడం, పవర్ స్టీరింగ్ కావడంతో రోడ్డు మార్జిన్లో ఉన్న చెట్టును బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయి తిరగబడింది. డ్రైవర్‌తో పాటు నలుగురు విద్యార్థులు మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా, 31 మంది స్వల్పంగా గాయపడ్డారు. వీరిని గొల్లపూడిలోని ఆంధ్రా ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ట్రావెల్స్ నిర్లక్ష్యం.. ట్రావెల్స్ నిర్వాహకుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. సామగ్రి చోరీతో పాటు డ్రైవర్ ప్రవర్తనపై సాయంత్రమే విద్యార్థులు ట్రావెల్స్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. పదే పదే సమాచారం ఇచ్చినా వారు సక్రమంగా స్పందించలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పైగా గట్టిగా నిలదీస్తే సూర్యాపేటలో డ్రైవర్‌ను మార్చుతామంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్టు చెబుతున్నారు. విద్యార్థుల సమాచారంపై యాజమాన్యం స్పందించినట్టయితే విజయవాడలోనే ఆగిపోయేవారు. మరో డ్రైవరు వచ్చేవరకు వేచి చూసే వాళ్లమని విద్యార్థులు చెబుతున్నారు. గతంలో కూడా ధనుంజయ్ ట్రావెల్స్ నిర్వాహకులపై పలు ఆరోపణలు ఉన్నట్టు అధికారులు చెప్పారు. హైదరాబాద్ నల్లకుంట ప్రధాన కార్యాలయంగా దూర ప్రాంత బస్సులకు ఓల్వో బస్సులను వీరు నడుపుతుంటారని తెలిపారు. హైదరాబాద్ నుంచి అమలాపురానికి దీపక్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు మాట్లాడుకున్న విద్యార్థులు తిరుగు ప్రయాణంలో హైదరాబాద్‌కు చేరడానికి ధనుంజయ్ ట్రావెల్స్ బస్సును మాట్లాడుకున్నట్టు పేర్కొన్నారు. -
లారీని ఢీకొట్టిన కంటైనర్
ప్రత్తిపాడు : జాతీయ రహదారిపై ధర్మవరం వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ముందు వెళ్తున్న లారీని వేగంగా ఖాళీ కంటైనర్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఖాళీ కంటైనర్ డ్రైవర్ మృతి చెందగా, మరో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక పోలీసుల కథ నం మేరకు .. భీమవరం నుంచి రొయ్యలను తీసుకు వచ్చేం దుకు విశాఖ నుంచి ఖాళీ కంటైనర్ బయలుదేరింది. ధర్మవరం ఎన్‌హెచ్‌పై జెడ్పీ హైస్కూల్ జంక్షన్ సమీపానకొచ్చేసరికి ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. లారీ వెనుక చక్రాలు ఊడిపోయి, దాని కిందకు కంటైనర్ ముందుభాగం దూసుకుపోయింది. ఈ సంఘటనలో విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం సందులూరు గ్రామానికి చెందిన కంటైనర్ డ్రైవర్ కాటపల్లి శివ (23) కేబిన్‌లోనే ఇరుక్కుపోయి మృతిచెందాడు. విజయనగరం జిల్లా జామి మం డలం కొత్తవలస గ్రామానికి చెందిన కంటైనర్ రెండో డ్రైవర్ బాజిరెడ్డి వెర్రినాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెర్రినాయుడును కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలిం చారు. ప్రత్తిపాడు ఎస్సై ఎం.నాగదుర్గారావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేబిన్‌లోనే నరకయాతన రోడ్డు ప్రమాదంలో లారీని ఢీకొన్న ఖాళీ కంటైనర్‌లో డ్రైవర్ ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించి, చివరకు మృతి చెందాడు. ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో ముందు లారీ కిందకు కంటైనర్ కేబిన్ దూసుకుపోయి, నుజ్జునుజ్జయ్యింది. కేబిన్‌లోనే విజయనగరం జిల్లా లక్కవరపు కోట మండలం సందులూరు గ్రామానికి చెందిన డ్రైవర్ కాటపల్లి శివ ఇరుక్కుపోయాడు. సుమారు అరగంటకు పైగా మృత్యువుతో పోరాడి, చివరకు ప్రాణాలొదిలాడు. పోలీసులు, హైవే మెయిన్టినెన్స్ సిబ్బంది డ్రైవర్‌ను కేబిన్ నుంచి వెలికి తీసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. క్రేన్‌ను రప్పించి, దాని సహాయంతో లారీ కింద ఇరుక్కుపోయిన కేబిన్ నుంచి డ్రైవర్ మృతదేహాన్ని మూడు గంటల తరువాత గానీ వెలికి తీయలేకపోయారు. -
ఆయిల్ ట్యాంకర్ లో మంటలు
ఘట్కేసర్: ఎండ తీవ్రతకు ఓ ఆయిల్ ట్యాంకర్ ఇంజిన్‌లోంచి మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పింది. లారీ క్యాబిన్లో ఉన్న డ్రైవర్, క్లీనర్‌తో సహా 8 మంది సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. పోలీసులు, ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన గోవర్ధన్‌రెడ్డి ఆయిల్ ట్యాంకర్ మండల పరిధిలోని అంకుశాపూర్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ నుంచి శుక్రవారం సాయంత్రం 5 వేల లీటర్ల పెట్రోలు, 15 వేల లీటర్ల డీజిల్‌తో శివరాంపల్లిలోని సుప్రజ ఫిల్లింగ్ స్టేషన్‌కు బయలుదేరింది. డ్రైవర్ రాజేష్, క్లీనర్‌తో పాటు మరో ఆరుగురు వాహనంలో ఉన్నారు. మార్గమధ్యలో మండల కేంద్రంలోని మాధవరెడ్డి ఫ్లైఓవర్ వద్ద ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి. గమనించిన డ్రైవర్ రాజేష్ మిగతా వారిని అప్రమత్తం చేశాడు. వారంతా నడుస్తున్న ట్యాంకర్ నుంచి దూకేశారు. డ్రైవర్ రాజేష్ వాహనానికి ఆపి దిగాడు. క్షణాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇంజిన్, క్యాబిన్ పూర్తిగా కాలిపోయాయి. రాజేష్ వెంటనే హెచ్‌పీసీఎల్ సంస్థ వారికి సమాచారం ఇచ్చారు. వారు ఫైర్ ఇంజిన్‌ను ఘటనా స్థలానికి పంపించారు. ముందు జాగ్రత్తగా నగరంలోని అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. మంటలు కొద్దిసేపటికి అదుపులోకి వచ్చాయి. ట్యాంకర్‌లోని డీజిల్, పెట్రోల్‌కు నిప్పు అంటుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు, హెచ్‌పీసీఎల్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ముందస్తు జాగ్రత్తగా రోడ్డుపై రాకపోకలు సాగించే వాహనాలను మరో మార్గంలోకి మళ్లించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవీందర్ తెలిపారు. -
ఇరువురి ప్రాణం తీసిన సమ్మె!
సాక్షి, సిటీబ్యూరో/సికింద్రాబాద్/లాలాపేట్ : ఆర్టీసీ సమ్మె కారణంగా నగరంలో సోమవారం వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. తార్నాకలో ఆర్టీసీ అద్దెబస్సు ఢీకొని ఓ ఎంబీఏ విద్యార్థిని దుర్మరణం పాలవగా...మౌలాలీ స్టేషన్ సమీపంలో ఓ మహిళ రైల్లోంచి జారి పడి మృతిచెందింది. వివరాల్లోకి వెళ్తే... మౌలాలీ హౌసింగ్‌బోర్డుకు చెందిన అభిషేక్ (21) స్నేహ (19)లు బైకుపై మౌలాలీ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తుండగా, తార్నాక రైల్వే డిగ్రీ కళాశాల సమీపంలో మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు (ఏపీ 11వి 3693) ఢీకొంది. దీంతో బైక్ వెనక కూర్చున స్నేహ ఒక్కసారిగా ఎగిరి బస్సు వెనుక చక్రాల కింద పడి మృతి చెందింది. బస్సు డ్రైవర్ వెంకటయ్య ఒత్తిడిలో విధులు నిర్వహిస్తూ...ప్రమాదానికి కారకుడయ్యాడని విమర్శలు వచ్చాయి. ఇక విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో తన కుటుంబంతో కలిసి శ్రీకాకుళం నుంచి నగరానికి వస్తున్న అన్నపూర్ణ (32) మౌలాలీ స్టేషన్ సమీపంలో రైల్లోంచి జారి కింద పడి మృతి చెందింది. ఆర్టీసీ సమ్మె దృష్ట్యా రైళ్లన్నీ కిక్కిరిసి నడుస్తున్నాయి. రిజర్వేషన్లు లభించని ప్రయాణికులు జనరల్ బోగీలను ఆశ్రయిస్తున్నారు. అలా విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరిన అన్నపూర్ణ మౌలాలీ సమీపంలో తన ఎనిమిదేళ్ల కొడుకును టాయిలెట్‌కు తీసుకెళ్లే క్రమంలో రద్దీని దాటుకుంటూ వెళ్తుండగా...జారి పడి ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులు లేక రైల్వే స్టేషన్లో రద్దీ పెరగడంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని తోటి ప్రయాణికులు చెప్పారు. ఒత్తిడే కారణమా.... సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు పట్టుదలగా బస్సులు నడుపుతున్నారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఎక్కువ బస్సులు నడపాలనే ఉద్దేశ్యంతో ప్రైవేట్ డ్రైవర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. మరోవైపు ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు కూడా ధనార్జనే లక్ష్యంగా నిబంధనలను తుంగలోతొక్కి సిబ్బందిపై భారాన్ని పెంచుతున్నారు. ఈ క్రమంలో రోజుకు 4 ట్రిప్పులు కూడా నడపలేని డ్రైవర్లు ఏకంగా ఐదారు ట్రిప్పులు తిప్పుతున్నారు. తార్నాక బస్సు ప్రమాదానికి కారణమైన మెదక్ జిల్లా జగదేవ్‌పూర్‌కు చెందిన డ్రైవర్ సిహెచ్ వెంకటయ్య గత 14 ఏళ్లుగా అద్దె బస్సు నడుపుతున్నట్లు సమాచారం. అనుభవం లేని డ్రైవర్ వల్లే ప్రమాదం గత వారం రోజుల నుంచి ఆర్టీసి ఉద్యోగులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి మణికంఠ ఆరోపించారు. ప్రత్యామ్నాయ మార్గాల పేరుతో ప్రభుత్వం అనుభవం లేని వారి ద్వారా బస్సులు నడపడం ద్వారానే ప్రమాదాలు చోటుచేసుకంటున్నాయని, సోమవారం ఘటన అలాంటిదేనని ఆయన పేర్కొన్నారు. -
కోమా నుంచి బయటకు..
జపాన్ గ్రాండ్ ప్రి రేసులో గాయపడి కోమాలోకి వెళ్లిన ఫార్ములావన్ మరూసియా జట్టు డ్రైవర్ జూల్స్ బియాంచి ఏడు వారాల తర్వాత స్పృహలోకి వచ్చాడు. అక్టోబర్ 5వ తేదీన తన కారు నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదానికి గురైన బియాంచి ఆ తరువాత సృహ కోల్పోయాడు. అతని తలకు బలమైన గాయాలు కావడంతో వైద్యులు బియాంచికి శస్త్ర చికిత్స నిర్వహించారు. గత నెల్లో గాయపడిన బియాంచి కోమా నుంచి బయటకు వచ్చినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉందన్నారు. ఇప్పటికీ సృహలోకి రాలేదని తెలిపారు. -
బియాంచికి శస్త్ర చికిత్స
వర్షంలోనే కొనసాగిన జపాన్ గ్రాండ్‌ప్రిలో అపశ్రుతి చోటు చేసుకుంది. 42వ ల్యాప్‌లో సాబెర్ జట్టు డ్రైవర్ అడ్రియన్ సుటిల్ కారుపై నియంత్రణ కోల్పోయి ట్రాక్‌కు పక్కన ఉన్న గోడను ఢీకొట్టి రేసు నుంచి తప్పుకున్నాడు. సుటిల్ కారును ట్రాక్‌పై నుంచి తీయడానికి మరో వాహనం వచ్చింది. అయితే ఈ వాహనాన్ని వెనుక నుంచి మారుసియా జట్టు డ్రైవర్ బియాంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే బియాంచి సృహ కోల్పోయాడు. వెంటనే నిర్వాహకులు అతణ్ని అంబులెన్స్‌లో ఆస్ప్రతికి తరలించారు. తలకు బలమైన గాయాలు కావడంతో వైద్యులు బియాంచికి శస్త్ర చికిత్స నిర్వహించారు. -
రూ.30 లక్షలతో డ్రైవర్ పరార్
నాగోలు, న్యూస్‌లైన్: ఏటీఎం కేంద్రా ల్లో జమ చేయాల్సిన రూ.30 లక్షల నగదుతో ఓ డ్రైవర్ ఉడాయించాడు. ఎల్బీనగర్ ఠాణా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సికింద్రాబాద్‌లో లాగి క్యాష్ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా వివిధ ఏటీఎంలలో నగదు జమ చేస్తారు. నేరేడ్మెట్లో ఉండే నల్లగొం డ జిల్లా వాసి ఎల్క సత్యనారాయణ తన క్వాలిస్ (ఏపీ 29 ఈ 2988)ను లాగి ఏజెన్సీకు అద్దెకివ్వడమే కాకుండా డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ ఇండియన్ బ్యాంకులో రూ.60 లక్షలు డ్రా చేసుకొని ఏటీఎంలలో డబ్బు జ మ చేసే టెక్నీషియన్స్ రామ్‌కుమార్, వినయ్, సెక్యూరిటీ గార్డు ఖాసీం వలి (రిటైర్డ్ సీఆర్పీఎఫ్ జవాన్)తో క్వాలిస్ లో బయల్దేరారు. అత్తాపూర్, అశోక్‌నగర్, చౌటుప్పల్ ఏటీఎంలలో రూ.10 లక్షల చొప్పున జమ చేశారు. కడ్తాల్‌లోని ఇండియన్ బ్యాంకులో రూ.20 లక్షలు డ్రా చేసి, అక్కడే ఉన్న ఏటీఎంలో జమ చేశారు. కర్మన్‌ఘాట్ గాయత్రినగర్, ఈసీఐఎల్, సైదాబాద్‌లలోని ఏటీఎంలలో రూ.10 లక్షల చొప్పున జమ చేయాల్సి ఉంది. అయితే, కర్మన్‌ఘాట్‌కు వచ్చేసరికి రాత్రి అయింది. దీంతో సత్యనారాయణ బైరామల్‌గూ డ మాధవనగర్‌లో ఉండే తన స్నేహితుడు శ్రీనివాస్‌కు ఫోన్ చేసి భోజనానికి ఇంటికి వస్తున్నామని తెలిపాడు. మధ్యలో బిర్యానీ తీసుకొన్నారు. ఇం టి ముందు కారును పార్క్ చేసి, రెం డో ఫ్లోర్లో ఉన్న శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నారు. బిర్యా నీ తిన్నాక, సిగరెట్ తాగి వస్తానని కిందకు దిగిన సత్యనారాయణ క్వాలి స్తో సహా పరారయ్యాడు. కొంతసేపటి తర్వా త కిందకు దిగిన సిబ్బందికి వాహనం కనిపించక పోవడంతో సత్యనారాయణకు ఫోన్ చేయగా స్విచాఫ్ వచ్చింది. దీంతో బ్యాంకు మేనేజర్‌కు సమాచారమిచ్చిన సిబ్బంది.. వనస్థలిపురం ఠా ణాలో ఫిర్యాదు చేశారు. తమ పరిధిలోకి రాదని వారు చెప్పడంతో శనివా రం రాత్రి ఎల్బీనగర్ ఠాణాలో ఫిర్యా దు చేశారు. కేసు నమోదు చేసిన పోలీ సులు సిబ్బంది రామ్‌కుమార్, వినయ్, ఖాసీంవలీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.