eco friendly ganesh
-
మట్టి గణేషుడిని ఉపయోగిద్దాం.. మనల్ని మనం కాపాడుకుందాం
-
అమెరికాలో ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాలు తయారు
-
కొబ్బరికాయలతో గణనాథుడు
-
వినాయకుని పూజకు ముఖ్యంగా అవి ఉండాల్సిందే!
ఆదిదంపతుల మానసపుత్రుడు, ఓంకార స్వరూపుడు, విఘ్నాలను శాసించే వాడు, సర్వకార్యాలను సిద్ధింపజేసే సర్వ దేవతా లక్షణసమన్వితుడు, స్వల్పకాలంలో భక్తులకు ముక్తినిచ్చే మోక్షప్రదాత మన గణపయ్య.. ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా గణపతికి పూజ చేయ్యాల్సిందే.. తలచిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగాలంటే ఆ విఘ్ననాయకుని అనుగ్రహం తప్పనిసరిగా కావాల్సిందే! దైవారాధనలో, పూజాదికాలలో, సర్వ శుభకార్యాల ఆరంభంలో ఈ మొత్తం జగత్తులో తొలి పూజలందుకునే స్వామి శ్రీగణేశ్వరుడే అందుకే ఆయన్ని ‘జ్యేష్ఠరాజం బ్రహ్మాణాం’ అన్నది వేదం. జపహోమాదుల్లోనూ గణపతిపూజే ప్రథమ కర్తవ్యం. నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా అనేది అందుకే! అమ్మ చేతిలో పసుపుముద్దగా అవతరించి పసుపు గణపతిగా మనందరి పూజలందుకుంటున్న గణపతి స్వామి విఘ్న నివారకుడు మాత్రమే కాదు, విద్యాప్రదాత కూడా! అందుకే కోరిన విద్యలకెల్ల ఒజ్జయైయుండెడి పార్వతీ తనయ, ఓయి! గణాధిప నీకు మ్రొక్కెదన్ అంటూ మనం గణపతిని ప్రార్థిస్తూ ఉంటాము. వినాయకచవితి నాడు ఉదయాన్నే మేల్కొని, కాలకృత్యాలు తీర్చుకొని, అభ్యంగన స్నానమాచరించి, శుభ్రమైన దుస్తులు ధరించి, వ్రతమాచరించాలి. ఇంటిని శుభ్రపరచుకొని, స్వస్తిక్ పద్మాన్ని లిఖించి, అరటిబోదెలతో మంటపాన్ని ఏర్పాటు చేసుకొని, పాలవెల్లి కట్టిన పీఠంపై తెల్లటి వస్త్రం పరచి, హరిద్రా గణపతిని, మట్టి వినాయకుని స్థాపించి, ఆహ్వానించి దూర్వా (గరిక) తదితర ఏకవింశతి (21) రకాల పత్రాలతోను, షోడశోపచారాలతో పూజించి, వినాయకోత్పత్తి కథను చదువుకొని, అక్షతలను శిరస్సుపై ధరించాలి. స్వామివారికి వడపప్పు, కొబ్బరి, చెరకు, బెల్లం, ఉండ్రాళ్లు, లడ్డూలు, మోదకాలు, కుడుములు నివేదించాలి. మన హిందూ సంప్రదాయంలో ప్రతిరోజూ ఓ పండుగే! పండుగ వస్తుందంటే పిల్లలకు ఎంతో సంబరం. వినాయకుడు అనే పేరు విన్నా, పలికినా ఏదో తెలియని శక్తి మనల్ని ఆవహించి ఆనందం కలుగుతుంది. గణపతి తనగోడు వింటాడు, తను తలచిన ఏ కార్యక్రమానికైనా ఎటువంటి ఆటంకం కలుగనీయడు అని ప్రతి భక్తుడు భావిస్తాడు. భక్తుల భావాల్లో ఇంతగా సుప్రతిష్ఠమైన గణపతిని ఆరాధించటంలో అనంతమైన భావాలు నిక్షిప్తమై ఉన్నాయి. భాద్రపదమాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది వినాయక చవితి పండుగ. ఆనాడు ఆదిదేవుడైన వినాయకుడి ఆవిర్భావం జరిగిన రోజు. ఆరోజు గణపతి పూజ విశేష ఫలితాన్నిస్తుంది. ఎన్ని కష్టాలు, అవరోధాలున్నా, వాటన్నిటినీ తొలగించే తొలిదైవం వినాయకుడు అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వినాయక చవితి పర్వదినాన సకల విఘ్నాలకు అధిపతియైన ఆ విఘ్నేశ్వరున్ని భక్తితో కొలిస్తే చాలు విఘ్నాలన్నింటినీ తొలగించి స్వామి కోరిన వరాలిస్తాడు. ఈ వ్రత పరమార్థం సమాజంలో ఐకమత్యాన్ని, దైవభక్తిని, జీవనశైలిని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పెంపొందింప జేయటమే కాక, భావసమైక్యతకు సహజజీవన సిద్ధాంతానికి నిదర్శనం. పూజా ద్రవ్యములు: వినాయక ప్రతిమ, పత్రి, పసుపు, కుంకుమ, అగరువత్తులు, హారతి కర్పూరం, గంధం, సాంబ్రాణి, అక్షతలు, బియ్యం, ఆవునేయి లేదా నువ్వుల నూనె, పంచామృతాలు (ఆవుపాలు, పెరుగు, నేయి, తేనె, పంచదార), తమలపాకులు, పోకచెక్కలు, పువ్వులు, పూమాల, పళ్ళు, కొబ్బరి కాయలు, కలశము, నైవేద్య పదార్థములు, సుగంధ ద్రవ్యములు. పూజా వస్తువులు: దీపం కుందులు, వత్తులు, అగ్గిపెట్టె, వస్త్రం, యజ్ఞోపవీతం, పంచపాత్ర, ఉద్ధరిణి, కలశం మీద నూతన వస్త్రం, పూజాస్థలంలో పీఠంపై వేయడానికి తగిన పరిమాణంలో తెల్లని వస్త్రం, పళ్ళెం, పాలవెల్లి, నూలు వస్త్రాలు, మామిడి తోరణాలు, దేవునికి తగిన పీఠము. నైవేద్యం: ఉండ్రాళ్లు–21, కుడుములు, వడపప్పు, పానకం, అటుకులు, కొబ్బరిముక్కలు, బెల్లం, అరటిపళ్ళు, పిండివంటలు మొదలగునవి. పూజాపత్రి: గరిక, మాచి, బలురక్కసి లేక ములకీ, మారేడు, ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, తులసి, మామిడి, గన్నేరు, విష్ణుక్రాంతం, దానిమ్మ, దేవదారు, మరువం, వావిలాకు, జాజి, దేవకాంచనం, జమ్మి, రావి, తెల్లమద్ది, జిల్లేడు మొదలగునవి తమకు లభ్యమగు పత్రిని సంపాదించి, ఆయా మంత్రాలతో స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి. ఒకవేళ పత్రిలో లోపము కల్గినను భక్తిలో మాత్రం లోపం ఉండరాదు. పత్రి సకాలంలో లభ్యంకానిచో పువ్వులు, అక్షింతలతో పూజించి నమస్కరించాలి. పాలవెల్లి పూజ: శ్రీ విఘ్నేశ్వరస్వామివారి పీఠానికి పైభాగాన పాలవెల్లిని కట్టాలి, పాలవెల్లిని పసుపు కుంకుమలతోను, పూజాపత్రితో శోభాయమానంగా అలంకరించుకోవచ్చు. దీనినే మనం సాధారణంగా పాలవెల్లి పూజ అంటాము. పూజా మందిరంలో: విఘ్నేశ్వరస్వామి పూజకు ఉపక్రమించే ముందు తమ ఇంటిలో చదువుకునే పిల్లలు ఉన్నట్లయితే స్వామి ప్రతిమతోపాటు సరస్వతీదేవి పటం, వారి పాఠ్యపుస్తకాలు, పెన్ను, పెన్సిల్. అలాగే గృహస్థు(యజమాని) వ్యాపారి అయితే శ్రీలక్ష్మీ అమ్మవారి పటం, వ్యాపార లెక్కల పుస్తకాలు, సంబంధిత వస్తువులు ఇలా ఏ వృత్తి వున్నవారు వారి ప్రధానమైన వస్తువులతోపాటుగా వారి ఇష్టదైవం పటాన్ని పెట్టి పూజించడం శుభఫలదాయకం. మట్టి వినాయకుడ్ని పూజిద్దాం... పర్యావరణాన్ని కాపాడుకుందాం !! మనం మట్టితో చేసే గణపతి విగ్రహం పంచమహాభూతాల సమాహారం. ఆ మట్టి ప్రతిమను పూజించటం ద్వారా పంచభూతాలను, వాటి అధిష్ఠాన దేవతలను పూజిస్తున్నాం. ఇది ఇతర పదార్థాలతో తయారు చేసిన గణపతి మూర్తులను ఆరాధించడం వలన కలగదు. ఏ తత్త్వాలతో ఒక వస్తువు ఏర్పడుతుందో, తన జీవితకాలం పూర్తయిన తర్వాత ఆ తత్త్వాలలోనే ఆ వస్తువు లయం అవుతుంది. ఇది సృష్టిధర్మం. వినాయక విగ్రహాన్ని నీళ్ళలో కలపడం వల్ల, ఆ విగ్రహంలో ఉన్న పంచతత్వాలు క్రమంగా వాటిల్లో లీనమవుతాయి. (చదవండి: ఓట్స్ – యాపిల్ లడ్డూలు) -
పచ్చగా నిను కొలిచేమయ్యా.. చల్లగా చూడు మా బొజ్జ గణపయ్యా..
వినాయక చవితి... యువతరం గుండెల్లో పెట్టుకునే పండగ. ఆనందం, ఆధ్యాత్మిక భావన... వాడవాడల్లో నిండుగా వెలిగే పండగ. కొంతకాలంగా ‘పర్యావరణహితం’ యూత్ ఎజెండాలో మొదటి వరుసలో చేరింది. రసాయన రహిత విగ్రహాలను కొనుగోలు చేయడానికే యువతరంలో ఎక్కువమంది ఇష్టపడుతున్నారు. కొందరు మరో అడుగు ముందుకు వేసి, మట్టితో విగ్రహాలను తయారు చేసి ఉచితంగా పంపిణి చేస్తున్నారు. పర్యావరణహిత సందేశానికి రెక్కలు ఇస్తున్నారు... వినాయక చవితి యువతరం సొంతం చేసుకునే పండగ. పండగ ముందు పందిరిగుంజలు పాతడం నుంచి నిమజ్జనం వరకు ప్రతిక్షణం ఆధ్యాత్మిక భావన, ఆనందం వారి సొంతం. అయితే గత కొద్దికాలంగా ‘ఎకో–ఫ్రెండ్లీ గణేశ’ విగ్రహాల వైపు యూత్ మొగ్గుచూపుతోంది. వారిలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. లక్నోలోని ఐటీ కళాశాల ముందు గత అయిదు సంవత్సరాలుగా వినాయకుడి విగ్రహాలను అమ్ముతున్నాడు ఆకాష్ కుమార్. ‘గతంతో పోల్చితే మార్పు వచ్చిందనే చెప్పాలి. మట్టితో తయారు చేసిన గణేశుడి విగ్రహాలు కొనడానికి ప్రాధాన్యత ఇస్తున్న వారిలో యువత ఎక్కువ సంఖ్యలో ఉంది. కొద్దిపాటి కృత్రిమ రంగులు, ప్లాస్టిక్ అలంకరణను కూడా యువత ఇష్టపడడం లేదు’ అంటున్నాడు ఆకాష్ కుమార్. తనీష ఈసారి ఎకో–ఫ్రెండ్లీ గణేశుడి విగ్రహాన్ని కొనుగోలు చేసింది. గత సంవత్సరం కొనుగోలు చేసిన విగ్రహంతో పోల్చితే ఆకర్షణీయంగా లేకపోవచ్చుగాక, కాని తన మనసుకు మాత్రం తృప్తిగా ఉంది. ‘ఆకర్షణీయమైన రసాయన రంగుల కంటే పర్యావరణం ముఖ్యం’ అంటుంది తనీష. మరో కస్టమర్ అనీష కూడా ఎకో–ఫ్రెండ్లీ విగ్రహాన్నే కొనుగోలు చేసింది. ‘నేను కొనడమే కాదు, ఇతరులు కూడా కొనేలా నా వంతు ప్రచారాన్ని చేస్తున్నాను’ అంటుంది అనీష. సాధారణ విగ్రహాలతో పోల్చితే పర్యావరణహిత వినాయక విగ్రహాల ధర ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని కొనడానికి ఆసక్తి చూపడం విశేషం. సాధారణంగా కోల్‌కతాలో మట్టితో తయారు చేసిన విగ్రహాలు ఎక్కువగా ఉంటాయి. ముంబైలో మాత్రం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను ఉపయోగించి తయారు చేసే విగ్రహాలే ఎక్కువ. అయితే బాంద్రాలోని పాలి హిల్‌కు చెందిన యువత మట్టిని ఉపయోగించి విగ్రహాలు తయారు చేయడమే కాదు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, మట్టి విగ్రహాలకు మధ్య తేడా గురించి ప్రచారం చేస్తున్నారు. ‘ఏదైనా మంచి విషయం చెబితే ఈ చెవిన విని ఆ చెవిన వదిలేస్తారు చాలామంది. కాని మేము చెప్పే విషయాలను చాలా ఆసక్తిగా వింటున్నారు. మార్పు వస్తుందనే నమ్మకం వచ్చింది’ అంటున్నాడు మట్టితో వినాయక విగ్రహాలు తయారుచేసే సచిన్. బాంద్రా నుంచి బెంగళూరు వచ్చేద్దాం. బెంగళూరుకు చెందిన శ్రీ విద్యారణ్య యువక సంఘ, కర్ణాటక స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌తో కలిసి ఔషధ గింజలతో కూడిన పదివేల మట్టి వినాయకుడి విగ్రహాలను పంపిణీ చేశారు. జైపుర్‌కు చెందిన కెరీర్ కౌన్సెలర్ షల్లీ కపూర్ తన ఫ్రెండ్ శ్వేతతో కలిసి ‘పర్యావరణహిత వినాయక చవితి’ గురించి స్కూల్, కాలేజీలలో విస్తృతంగా ప్రచారం చేయడమే కాదు, మట్టితో చిన్న చిన్న వినాయక విగ్రహాలు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తుంది. ‘మార్పు అనేది యువతరంతోనే మొదలవుతుందనే బలమైన నమ్మకం ఉంది. అందుకే ఈ ప్రయత్నం’ అంటుంది శ్వేత. ‘నేను సొంతంగా గణేశుడి విగ్రహాన్ని తయారు చేయడం సంతోషంగా అనిపించింది. వర్క్‌షాప్‌లో నేర్చుకున్న, విన్న విషయాలను తల్లిదండ్రులతో పంచుకున్నాను’ అంటుంది అర్చనా గుప్తా. పదిమంది నడిచే బాటే ఆ తరువాత ట్రెండ్ అవుతుంది. యువతరంలో మొదలైన మార్పును చూస్తుంటే పర్యావరణహిత విగ్రహాలను ఇష్టపడే ధోరణి ట్రెండ్‌గా మారడానికి అట్టే కాలం పట్టకపోవచ్చు. -
తొలిసారి మట్టితో మహా గణపతి.. ప్రత్యేకతలివే..
సాక్షి, ఖైరతాబాద్: ఒక్క అడుగుతో మొదలైన ఖైరతాబాద్ మహా గణపతి ప్రస్థానం ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఏడాదికో అడుగు పెరుగుతూ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందాడు. ఈసారి 68వ సంవత్సం సందర్భంగా శ్రీ పంచముఖ మహా లక్ష్మీ గణపతిగా 50 అడుగుల ఎత్తుతో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. విగ్రహ తయారీ పనులను ఉత్సవ కమిటీ సభ్యులు ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలని శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ నేతృత్వంలో రూపు దిద్దుకోనున్న మహాగణపతి నమూనాను సోమవారం సాయంత్రం స్థానిక కార్పొరేటర్ విజయారెడ్డి, వీణామాధురి, ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్‌లతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో సందీప్‌రాజ్, రాజ్‌కుమార్, మహేష్‌యాదవ్, బిల్డర్ రమేష్‌లతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ప్రత్యేకతలివే.. ► తొలిసారిగా 50 అడుగుల ఎత్తు మేర మట్టితో తయారుచేస్తున్న శ్రీ పంచముఖ మహా లక్ష్మీ గణపతి నిల్చున్న ఆకారంలో ఉంటాడు. ► పాముపై కమలం పువ్వులో నిలబడి ఉన్న మహాగణపతి పక్కనే కుడివైపు లక్ష్మీదేవి అమ్మవారు మరో పక్క మూషికం ఉంటాయి. ► అయిదు తలలపై పాము పడగ, ఆరు చేతులతో అద్బుతంగా దర్శనమిచ్చేవిధంగా డిజైన్ చేశారు. ► మహాగణపతికి కుడివైపు శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, ఎడమవైపు శ్రీ త్రిశక్తి మహా గాయత్రీదేవి అమ్మవార్ల విగ్రహాలు దర్శనమివ్వనున్నాయి. ► గతంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారయ్యే గణపతిని.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈసారి మట్టితోనే మహాగణపతిని తయారుచేస్తున్నారు. ► ఈ నెల 10న కర్రపూజ తర్వాత మహాగణపతి విగ్రహ తయారీపనులు ప్రారంభమయ్యాయి. ► మొదట ఐరన్ ఫ్రేమ్‌తో అవుట్‌లైన్ తయారు చేస్తారు. అనంతరం దానిపై గడ్డిని మట్టితో కలిపి నారలాగా తయారుచేసి ఐరన్ చుట్టూ ఔట్ లుక్ కోసం అంటిస్తారు. దానిపై టన్నుకు పైగా సుతిలి తాడును చుడతారు. దానిపై మట్టితో రూపు రేఖల్ని తీర్చి దిద్దుతారు. ► ఆ తర్వాత గాడా క్లాత్‌పై పల్చటి మట్టిని పూసి ఫినిషింగ్ పనులు పూర్తి చేసి.. వాటర్ పెయింట్స్ వేయడంతో మట్టి వినాయకుడు పూర్తిస్థాయిలో పూర్తవుతుంది. విగ్రహాన్ని నిమజ్జనం చేయడంలోనూ ఇబ్బందులు తలెత్తవని శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ తెలిపారు. -
మట్టి గణేశుడ్ని తయారు చేసిన అల్లు అర్హా... అభిమానులు ఫిదా
దేశవ్యాప్తంగా భక్తులు వైభవంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. ఆ పండుగ సందర్భంగా టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి ఆర్హా అభిమానుల మనసులు దోచుకుంటోంది. వివరాల్లోకి వెళితే..వివిధ రకాల కెమికల్స్‌తో తయారు చేసే గణేశుడి విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని జరుగుతుందని తెలిసిందే. ఈ విషయాన్నే చెబుతూ ఎంతోమంది టాలీవుడ్ స్టార్స్ ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను పూజించేలా అభిమానుల్లో అవగాహన కలిగిస్తుంటారు. అలాంటి వాటిలో అల్లు అర్జున్ ఎప్పుడు ముందుంటారు.. కాగా ఈ వినాయక చవితి సందర్భంగా ఆయన కూతురు ఆర్హా తన చిట్టి చేతులతో మట్టి గణేశుడ్ని తయారు చేసింది. కాలుష్య రహిత పండుగను ప్రోత్సహించేలా ఉన్న ఈ పిక్ చూసిన ‘వావ్ ఆర్హా’ అంటు ఫిదా అవుతున్నారు. Cutie Arhalu ❤️😘#GaneshChaturthi Vibes ✨#AlluArjun #Allusnehareddy#AlluAyaan #AlluArha@alluarjun || #AA20 #Pushpa pic.twitter.com/VsFcGZYx15 — Dinesh krishna AADHF™ 🥳 (@dinesh_krishna) September 9, 2021 -
గోదావరి నదీ తీరాన ఇల్లు.. నాడు ఆ వ్యక్తి చేసిన పనితో వినూత్నంగా
Nashik Trupti Gaikwad After Puja Turns Idols Into Toys: జైజై గణేశా! జై కొట్టు గణేశా!! వరములిచ్చు ఓ బొజ్జ గణేశా!!! అని పాటలు పాడుకుని ఆటలు ఆడుకుని వేడుక చేసుకున్నంత వరకు బాగానే ఉంటుంది. వేడుక పూర్తయిన తర్వాత ఆ బొజ్జ గణపయ్యను ఏం చేయాలనేదే పెద్ద ప్రశ్న. ఓ దశాబ్దం కిందటి వరకు దగ్గరలో ఉన్న చెరువు, సముద్రం, సరస్సు, కొలను... ఏదో ఒకచోట నీటిలో కలిపేసే వాళ్లం. సింథటిక్ రంగులు, ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి జరిగే హాని పట్ల చైతన్యవంతం అవుతున్న కొద్దీ గణేశ్ విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి అనేక దారులు వెతుక్కుంటున్నాం. అందుకోసం మేధోమధనమే చేస్తున్నాం. మట్టి గణపతిని బకెట్లో నీటిలో వేసి కరిగించి మొక్కలకు పోయడం నుంచి గణపతిని విత్తనాలతో మలిచి, పూజ పూర్తయిన తరవాత పంటమడిగా మార్చడం వరకు ఎన్ని కొత్త ఆలోచనలో. మహారాష్ట్ర, నాసిక్‌కు చెందిన అడ్వొకేట్ తృప్తి గైక్వాడ్ కూడా వినూత్నంగా ఆలోచించారు. ఆమె గణపతి బొమ్మలను రీసైకిల్ చేసి బొమ్మలుగా మారుస్తున్నారు. రెండేళ్ల కిందట మొదలైంది ‘మా ఇల్లు గోదావరి నది తీరాన ఉంది. ఓ రోజు ఓ వ్యక్తి నదికి ఓ భారీ లగేజ్‌తో వచ్చాడు. అందులో ఉన్న వస్తువులన్నింటినీ నదిలో కలిపేయాలనేది అతడి ప్రయత్నం. వీటిని జలమయం చేయవద్దు, రీసైకిల్ చేసి ఉపయోగించుకోదగిన వస్తువులుగా మార్చుకోవచ్చని చెప్పాను. అతడు అంగీకరించాడు. అలా మొదలైన నా ప్రయత్నంలో ఆ తర్వాత గణేశ విగ్రహాల రీసైక్లింగ్ కూడా చేరింది. విగ్రహాల తయారీలో ఉపయోగించిన మెటీరియల్ మొత్తాన్ని వేరు చేసి కొత్త బొమ్మలను చేస్తున్నాం. ఆ బొమ్మలను అల్పాదాయ వర్గాల కాలనీల పిల్లలకు పంచుతున్నాం. ఒక్కోసారి ఒక్కోచోటకు వెళ్లి ఇస్తుంటాం. మా ప్రయత్నం గురించి తెలుసుకున్న వాళ్లు పండుగ తర్వాత వాళ్లంతట వాళ్లే బొమ్మలను తెచ్చి ఇస్తున్నారు. పూనా, నాగపూర్, ముంబయి నుంచి కూడా మాకు గణేశ బొమ్మలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఇరవై వేలకు పైగా విగ్రహాలను కరిగించి పిల్లలు ఆడుకునే బొమ్మలను చేశాం’’ అని చెప్తున్నారు తృప్తి గైక్వాడ్. చదవండి: Ganesh Chaturthi: గోమయ గణేషుడు.. ఇలా ఎందుకంటే.. -
గోమయ గణేషుడు.. ఇలా ఎందుకంటే..
వినాయకుడు వరములు ఇచ్చువాడు. ఇవాళ ప్రపంచానికి ఒక వరం కావాలి. అది గ్లోబల్ వార్మింగ్ వల్ల గతి తప్పుతున్న రుతువులను, ఉష్ణోగ్రతలను అదుపులోకి తేవడం. వినాయకుడు విఘ్నాలు తొలగిస్తాడు. కాని ఒక విషయంలో మాత్రం పదే పదే విఘ్నాలు కలిగించాలి. ఏ విషయంలో? పర్యావరణానికి హాని చేసే ఏ పని ఎవరు మొదలెట్టినా అది జరగకుండా విఘ్నాలు కలిగిస్తూ ఉండాలి. అప్పుడు గిరులు పచ్చగా ఉంటాయి. ఝరులు కళకళలాడుతాయి. వినాయకుడు గణపతి. ఆయన ఏ గణాలకు అధిపతి అయినా అసలు అధిపతిగా ఉండాల్సింది మాత్రం ప్రకృతి గణాలకే. అవి శక్తిమంతమయ్యి మనుషులకు శక్తి ఇవ్వాలి. అది కూడా ఈ వినాయక చవితి పండగ సందర్భంగా మనం కోరుకోవాలి. Bhopal Kanta Yadav Eco Friendly Idol With Cow Dung: భోపాల్‌లోని కాంతా యాదవ్ వినాయకుడి శక్తి ప్రకృతికి అందాలంటే ఏం చేయాలో ఆలోచించింది. ఇంతకాలం ఆమె కుటుంబం దేవతల విగ్రహాలు చేస్తూ బతికింది. అవి దాదాపు పర్యావరణ కాలుష్యాన్ని కలిగించే పదర్థాలతోనే అయి ఉండేవి. కాని ఈసారి కొత్త పని మొదలెడదాం అనుకుందామె. కొత్త పని అంటే ప్రకృతికి మేలు చేసేదే. వినాయకుడి పూజకు మట్టి విగ్రహం తయారు చేయడం ఒక మంచి ఆలోచన. కాని కాంతా యాదవ్ కొంచెం ముందుకు వెళ్లి వినాయకుడు తిరిగి మొక్కకు శక్తిగా మారే విధంగా విగ్రహం తయారు చేయాలనుకుంది. అందుకు గోమయం (ఆవుపేడ)ను ఎంచుకుంది. ఆవుపేడకు ఒక పవిత్రత ఉంది. దాంతోపాటు ఎరువు స్వభావం కూడా ఉంది. అందుకే కాంత ఆవు పేడతో వినాయకుడి విగ్రహాలు తయారు చేయడం మొదలెట్టింది. ‘ఆవు పేడను ఎండ పెడతాను. తర్వాత దానికి రంపంపొట్టు, మైదా పిండి కలిపి మెత్తటి పదార్థంగా చేసి అచ్చులో పోసి విగ్రహం తయారు చేస్తాను. ఇది తయారు చేయడం పది నిమిషాల పనే అయినా ఆరడానికి మూడు నాలుగు రోజులు పడుతుంది. ఆ తర్వాత రంగులు వేస్తాను. విగ్రహం పూజలు అందుకున్నాక నీటి బకెట్టులో సులభంగా నిమజ్జనం అవుతుంది. ఆ తర్వాత ఆ నీటిని మొక్కలకు పోస్తే ఎరువు అవుతుంది. ఈ ఆలోచన చాలామందికి నచ్చింది. అందుకే నా దగ్గరకు వచ్చి చాలామంది బొమ్మలు కొంటున్నారు. అంతే కాదు ఢిల్లీ, పూనా నుంచి కూడా నాకు ఆర్డర్లు వస్తున్నాయి’ అంది కాంత. కాంత ఈ పనిని అందరికీ నేర్పుతుంది. బహుశా వచ్చే సంవత్సరం నాటికి చాలాచోట్ల గోమయ వినాయకుడు దర్శనం ఇచ్చినా ఆశ్చర్యం లేదు. చదవండి: మహా గణపతిం మనసా స్మరామి... -
మట్టి గణనాదుల పై పెరుగుతున్న అవేర్ నెస్
-
సాక్షి టీవీ లైవ్ చూస్తు చిన్నారుల మట్టి వినాయకుల తయారీ
-
‘సాక్షి’ చూస్తూ ఇంట్లోనే ఎకో ఫ్రెండ్లీ గణేశా తయారీ..
వినాయక చవితి.. ఈ పేరు వినగానే ఎక్కడలేని ఉత్సాహం ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. ఊరు వాడా మొత్తం అసలైన పండగ వాతావరణం నెలకొంటుంది. గణేష్ నవరాత్రి వేడుకలు ప్రారంభం కాకముందే ప్రతి వీధిలో మండపాల ఏర్పాటు, విగ్రహ కొనుగోలు వంటి పనులతో బిజీగా ఉంటుంది. అయితే ఈ ఏడు వినాయక చవితికి ఈ హంగామా అంతా కనిపించేలా లేదు. ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో బహిరంగ వినాయక మండపాలు, భారీ గణనాథుల ఏర్పాటు, నదులు, చెరువుల్లో సామూహిక నిమజ్జనానికి అనుమతి లేనట్లు తెలుస్తోంది. గణపతి బప్ప మోరియా అంటూ మారుమోగే నినాదాలు ఈసారి వినిపించేలా లేవు. ఊరేగింపులు, లౌడ్ స్పీకర్లు, డీజేలకు అనుమతులు లేనట్లు స్పష్టం చేసింది. ఇళ్లలోనే కరోనా నియమాలు పాటిస్తూ ఎవరిళ్లలో వారు వినాయక చవితి జరుపుకోవాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. (కరోనా మార్గదర్శకాలకు లోబడే చవితి వేడుకలు) మచిలిపట్నం : ఈ క్రమంలో ‘సాక్షి’ టీవీలో మట్టి వినాయకుడిని ఎలా తయారు చేయాలో వివరించడాన్ని చూస్తూ మచిలిపట్నంలోని చిన్నారులు ఇంట్లోనే మట్టి గణపతులను తయారు చేస్తున్నారు. సకల విఘ్నాలను తొలగించే దేవాధిదేవుడు విఘ్నేశ్వరుడి ప్రతిమను చిన్నారులు తమ చిట్టి చిట్టి చేతులతో తయారు చేసేందుకు పూనుకున్నారు. అయితే ఈ ఏడాది పర్యావరణహిత గణేశ విగ్రహాల ప్రాధాన్యం పెరిగింది. పర్యావరణ పరిరక్షణకు ప్రతీక అయిన వినాయక చవితి పండగను జరుపుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇలాగే ప్రతి ఒక్కరూ ఏకో ప్రెండ్లీ గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిద్దాం. (‘ఎకో’దంతుడికి జై!) ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో పరిసరాలు మరింత కాల్యుష్యం అయ్యే అవకాశం ఉన్నందున మట్టి గణపతికి భక్తులు జై అంటున్నారు. దీంతో ఎకో ఫ్రెండ్లీ విత్తన వినాయకుడిని రూపొందించి పూజించాలనే ఈ ఏడు ప్రచారం కొనసాగుతోంది. పర్యావరణ స్నేహపూర్వక గణేష్ విగ్రహాలు ఇప్పుడిప్పుడే ముందడుగు వేస్తున్నాయి. ఇంతక ముందు కేవలం బంకమట్టి, సహజ రంగులతో తయారు చేసేవి. కానీ ఇప్పుడు మట్టి లోపల వివిధ చెట్ల గింజలతో రానున్నాయి. రాష్ట్రంలో పర్యావరణాన్ని పరిరక్షించడానికి, ఆకు పచ్చ కవచాన్ని పెంచే విధంగా గణేష్ పండుగను జరుపుకునేందుకు ప్రజలు సంకల్పించారు. (‘ఈ ఏడాది లడ్డూ వేలం లేదు’) -
ఇళ్లలోనే వినాయక నవరాత్రి ఉత్సవాలు
లక్డీకాపూల్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, మట్టి గణపతి విగ్రహాలకే ప్రాధాన్యమివ్వాలని మంత్రి కేటీఆర్ సూచించారు. వినాయక చవితిని పురస్కరించుకుని హెచ్ఎండీఏ ఈ ఏడాది 8 ఇంచుల ఎత్తున్న 50 వేల పర్యావరణహిత వినాయక (మట్టి) విగ్రహాలను 32 కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేయనుంది. శుక్రవారం మంత్రి కేటీఆర్ మట్టి వినాయక విగ్రహాలను ఆవిష్కరించారు. తొలి ప్రతిమను మేయర్ బొంతు రామ్మోహన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలు మట్టి విగ్రహాలనే పూజించాలని కోరారు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను ఇళ్లలోనే భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని కేటీఆర్ సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్‌కుమార్, కార్యదర్శి, బీపీపీ ఓఎస్డీ సంతోష్, చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హుస్సేన్‌సాగర్ శుద్ధి కార్యక్రమంలో భాగంగా రసాయనాలతో తయారైన వినాయక విగ్రహాల వినియోగాన్ని తగ్గిండమే లక్ష్యంగా హెచ్ఎండీఏ ఎనిమిదేళ్లుగా సంప్రదాయ మట్టి వినాయక విగ్రహాలను తయారు చేయించి స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తోంది. -
చిన్నారుల చేతుల్లో మట్టి గణపతి
సాక్షి మీడియా గ్రూప్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త ఆధ్వర్యంలో అన్ని విద్యలకు ఆది గురువైన సిద్ధి వినాయకుని పండుగ వచ్చేస్తోంది. వినాయక పండుగ నాడు మీరు పుస్తకాలు పూజలో ఉంచి.. గణపతికి ఇష్టమైన, మధురమైన పిండి వంటలు ఆరగింప జేసి.. మీ కోరికలు కోరే సమయం ఆసన్నమైంది. మీరు పూజించాల్సిన వినాయకుణ్ని మీరే మీ చిట్టిచేతులతో తయారుచేస్తే ‘గణాధిపతి’ ఎంతో సంతషించి వరాలనిస్తాడు. మాకు విగ్రహం తయారు చేయడం రాదని చింతించకండి. ‘‘పర్యావరణ హితమైన మట్టి వినాయక విగ్రహం...’’ తయారు చేసే విధానం గురించి సాక్షి మీడియా గ్రూప్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వారి సహకారంతో.. ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణ శిబిరాన్ని నిర్వహించనుంది. ఈనెల 21(ఆగస్టు 21)వ తేదీన జరిగే మట్టి వినాయక విగ్రహం తయారీ ఆన్లైన్ శిక్షణలో 6 నుంచి 18 సంవత్సరాల వారందరూ ΄ాల్గొనవచ్చు. దీనికి ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదు. 6 నుంచి 12ఏళ్ల వయసు గల వారు మొదటి కేటగిరీగా... 13 నుంచి 18 సంవత్సరాల వయసుగల వారిని రెండో కేటగిరీగా పరిగణిస్తారు. ప్రతి కేటగిరీలో మొదటి మూడు బహుమతులతో΄ాటు ఐదు కన్సోలేషన్ బహుమతులు గెలుచుకోవచ్చు. రిజిస్టర్ ఇలా:దిగు వ ఇచ్చిన వాట్సప్/ఈ మెయిల్ ఐడీకి మీ పేరు, తండ్రి పేరు, తరగతి, ΄ాఠశాల/ కళాశాల పేరు, పుట్టిన తేది, వయసు, అడ్రస్, జిల్లా, మొబైల్ నెంబర్ మొదలైన వివరాలు పంపి రిజస్టర్ చేసుకోవాలి. మట్టి గణపతి కిట్:రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల(ఆగస్టు) 18,19 తేదీల్లో నిర్దేశించిన సాక్షి ఆఫీసు ద్వారా ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మట్టి గణపతి కిట్(బంకమట్టి, విత్తనాలు, శానిటైజర్) అందజేస్తారు. ఆన్లైన్ శిక్షణ: ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం గం.12:30 ని.లకు అనుభవజ్ఞులైన టీచర్ ద్వారా మట్టి వినాయకుణ్ని తయారు చేసే విధానాన్ని సాక్షి టీవీ, యూ ట్యూబ్ లింక్‌లో ప్రసారం చేస్తారు. ఆ ప్రసారం ద్వారా మీరు మట్టి విగ్రహం తయారీని నేర్చుకోవచ్చు. అలా తయారు చేసిన విగ్రహాన్ని ఫోటో తీసి.. అదే రోజు సాయంత్రం 5 గంటల లోపు మీరు రిజస్టర్ చేసుకున్న వాట్సప్ నెంబర్‌కు, ఈ మెయిల్ ఐడీకి పంపించాలి. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆన్లైన్ శిక్షణలో ΄ాల్గొని.. మీ చేతులతో తయారు చేసిన మట్టి విగ్రహాన్ని పండుగ రోజున పూజించడంతో΄ాటు బహుమతులూ అందుకోండి!! రిజిస్ట్రేషన్ కొరకు చివరి తేది : 17–08–2020 మీ పేరు రిజిస్టర్ చేసుకునేందుకు వాట్సప్/ఈ–మెయిల్ ఐడీ:9666283534, a.venkatarakesh@sakshi.com -
ట్రెండ్ సెట్ చేస్తున్నారు..
సాక్షి, అనకాపల్లి టౌన్ (విశాఖ జిల్లా): నిమజ్జనం అంటే అదో ఉత్సాహం. ఊరేగింపులో తీన్మార్ డప్పుల దరువులు ఓ వైపు.. జై.. చిందెయ్ అంటూ నృత్యాలు చేసే యువత మరో వైపు.. ఇప్పటి వరకూ మనం ఇలాంటి సన్నివేశాల్నే చూశాం. గంగ దరికి గణపయ్యను చేర్చే ట్రెండ్‌కి ఈ యువకులు ఫుల్స్టాప్ పెట్టారు. గంగను గణపయ్య దరికి చేర్చే ట్రెండ్‌ను సెట్ చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినియోగం.. జలవనరులు కలుషితమవ్వడం.. ఊరేగింపు కోసం ఇంధనం ఖర్చు.. ఇలాంటి పర్యావరణ సంబంధిత అంశాలు ఆ యువకుల్ని ఆలోచింపజేశాయి. అందుకే ఈ ఏడాది గణపయ్య పండుగను పూర్తి పర్యావరణహితంగా చేయాలని నిర్ణయించుకున్నారు గవరపాలెం సత్తెమ్మతల్లి యూత్ క్లబ్ సభ్యులు. 25 అడుగుల భారీ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనికోసం 2 ట్రాక్టర్ల మట్టిని వినియోగించారు. పి.శ్యామ్ అనే శిల్పి 30 రోజుల పాటు శ్రమించి ఈ విగ్రహాన్ని రూపొందించారు. నిమజ్జనాన్ని కూడా మండపంలోనే చేయాలని సంక్పలించారు. ఈ నెల 21న దీనికి ముహూర్తంగా నిర్ణయించారు. ఆ రోజు రాత్రి 7 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేయనున్నారు. నిమజ్జనం కోసం 5000 లీటర్ల నీటిని వినియోగిస్తారు. చివరి రోజు పార్వతీపుత్రుడ్ని 20 నుంచి 30 లీటర్ల పాలతో అభిషేకించనున్నారు. ఇన్ని ప్రత్యేకతలున్న మృణ్మయనాథుడ్ని చూసేందుకు అనకాపల్లితో పాటు పరిసర ప్రాంతాల వాసులు మక్కువ చూపుతున్నారు. -
జై..జై..గణేశా..
-
‘ప్లాంట్ గణేశ్’ విగ్రహాలు
సాక్షి,సిటీబ్యూరో: మట్టికి, మనిషికి విడదీయరాని అనుబంధం ఉంది. మానవ మనుగడ ప్రకృతితో ముడిపడి ఉంది. ప్రకృతి ఆరాధనతో మొదలైన పూజలు ఇప్పుడు విగ్రహారాధన దాకా వచ్చాయి. అయితే, ఇప్పుడు ఈ మహోన్నతమైన అనుబంధాన్ని, ఆధ్మాత్మిక సంబంధాన్ని తిరిగి మట్టితో ముడిపెట్టి సమున్నతంగా ఆవిష్కరిస్తున్నారు నగరవాసులు. పర్యావరణంపై చైతన్యవంతులైన సిటీ ప్రజలు ఇప్పుడు వినాయక చవితికి ‘ప్లాంట్ గణేశుడి’ని మొక్కుతున్నారు. కుండీల్లో నిమజ్జనం చేసి మొక్కై మొలచి పుడమిని పులకింపజేసే గణనాథుడిని పూజిస్తున్నారు. ఇప్పుడిది నగరంలో సరికొత్త ట్రెండ్. పర్యావరణ ప్రియులైన భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న ‘ప్లాంట్ గణేశుడు’ తొలుత నవరాత్రులు మట్టి ప్రతిమగా పూజలందుకొని నిమజ్జనంతో భూమిలో కలిసిపోతాడు. మొక్కలో జీవం పోసుకుని పైకి లేస్తాడు. ఇప్పటికే నగరంలో మట్టి విగ్రహాలపై అవగాహన ఉద్యమ స్థాయిలో కొనసాగుతోంది. కాలుష్య నియంత్రణ మండలి, హెచ్ఎండీఏ వంటి సంస్థలతో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలు, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వేదికలు మట్టి విగ్రహాలను అందజేస్తున్నాయి. ప్రజలు సైతం అలాంటి విగ్రహాలనే ఎక్కువగా పూజించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో మట్టి విగ్రహాలను చెరువుల్లో నిమజ్జనం చేసి వాటిలో పూడిక భారాన్ని పెంచకుండా ఇంట్లోనే మొక్కలుగా పెంచాలనే లక్ష్యంతో నగరానికి చెందిన ‘ప్లాన్ ఏ ప్లాంట్ ’ సంస్థ ఈ విగ్రహాలను అందజేస్తోంది. హైదరాబాద్‌తో పాటు దేశ విదేశాలకు విగ్రహాలను పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 12 వేల ప్లాంట్ గణేశ విగ్రహాలను భక్తులకు చేరవేశారు. మరో రెండు రోజుల పాటు భక్తులకు విక్రయించేందుకు అనుగుణంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచారు. వివిధ రకాల నాణ్యమైన కూరగాయల విత్తనాలతో తయారు చేసిన ప్లాంట్ గణేశ విగ్రహాలు నిమజ్జనం అనంతరం ఏడు రోజుల్లో చక్కగా మొలకెత్తుతాయి. ఇంటి పరిసరాల్లో పచ్చగా వికసిస్తాయి. ఆలోచన ఇలా మొలకెత్తింది.. మూడేళ్ల క్రితం గణేశ్ అమర్నాథ్, దివ్యాంజలి దంపతుల మదిలో ఈ ఆలోచన రూపుదిద్దుకుంది. ప్లాన్ ఏ ప్లాంట్ సంస్థ ద్వారా అప్పటికే వివిధ రకాల ఇండోర్ మొక్కలను పెంచి విక్రయిస్తున్న ఈ దంపతులు.. వినాయక చవితి వేడుకలను కూడా ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో పర్యావరణహితంగా జరుపుకొనేందుకు ప్లాంట్ గణేశ (మొక్క ప్రతిమ) విగ్రహాలకు రూపమిచ్చారు. సారవంతమైన మట్టితో విగ్రహాలను తయారు చేసి వాటిలోనే వివిధ జాతుల కూరగాయల విత్తనాలను ఉంచుతున్నారు. ఒక కుండలో కొకోపిట్, వర్మి కంపోస్టుతో నింపి దానిపై ఈ ప్రతిమను అలంకరిస్తారు. నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ గుర్తించిన నాణ్యమైన హైజర్మినేషన్ సీడ్స్‌ను మాత్రమే ఇందుకోసం ఎంపిక చేస్తున్నారు. ‘విగ్రహంలో ఉంచిన ప్రతి విత్తనం కచ్చితంగా మొలకెత్తి, పెరిగి పెద్దయ్యేలా అత్యంత నాణ్యమైనవి తీసుకున్నాం. ఏడు రోజుల్లో విత్తనాలు కచ్చితంగా మొలకెత్తుతాయి’ అని చెబుతున్నారు గణేశ్ అమర్నాథ్. ‘చెరువులను పరిరక్షించుకోవాలంటే మట్టి విగ్రహాలు కూడా వాటికి భారం కాకుండా చూసుకోవాలి. అందుకే ఇంటి వద్దే నిమజ్జనం చేసుకోవడంతో పాటు, చక్కటి కూరగాయలను ఇచ్చేలా ప్లాంట్ గణేశులను తయారు చేశాం’ అని చెప్పారు. రూ.499 విలువ చేసే ఈ ప్రతిమలను ఇప్పటికే పూణె, ముంబై, ఢిల్లీ, కోల్కత్తా తదితర నగరాలకు, దుబాయ్, షార్జా, బ్రిటన్, అమెరికా, జర్మనీ వంటి దేశాల్లోని భక్తులకు పంపించారు. విగ్రహాల తయారీపై వర్క్‌షాప్ మరోవైపు మట్టి ప్రతిమల తయారీ కోసం సికింద్రాబాద్‌లోని అవర్ సాక్రెడ్ స్పేస్‌లో సెప్టెంబర్ 1న పిల్లల కోసం ప్రత్యేక వర్క్‌షాపు ఏర్పాటు చేయనున్నారు. నిజామాబాద్ నుంచి ఇందుకోసం ప్రత్యేకంగా బంకమట్టిని తెప్పిస్తున్నట్లు నివ్వాహకులు తెలిపారు. ఆదివారం ఉదయం 10.30 నుంచి 12 వరకు ఈ మట్టి విగ్రహాల వర్క్‌షాపు ఉంటుంది. ఎక్కడ లభిస్తాయంటే.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్2లోని నృత్య ఫోరం ఫర్ పర్ఫార్మెన్స్ ఆర్ట్స్, మణికొండలోని హోమ్‌క్రాప్,కూకట్పల్లి వివేకానందనగర్‌లోని హిమట్రి రెస్టారెంట్, సైనిక్‌పురి ప్రాంతాల్లో భక్తులకు అందుబాటులో ఉంచారు. కూకట్‌పల్లిలోని ప్లాన్ఏ ప్లాంట్ కార్యాలయంలోనూసంప్రదించవచ్చు. -
ఏకదంతుడికి ఎన్ని ఉండ్రాళ్లో!
అంత పెద్ద బొజ్జ! ఒకటే దంతం!! ‘అరిగింపు’ సరే.. ఆరగింపు ఎలా! ఏం పర్లేదు. గణపయ్యకు దంతపుష్టి ఉంది. మనకే.. భక్తిపుష్టి ఉండాలి. స్వామికి దండిగా పెట్టండి. స్వామిని సంతుష్టి పరచండి.అధినాయకా అందుకో..అష్టవిధ ఉండ్రాళ్లు ఇవిగో.. బెల్లంకుడుములు కావలసినవి బియ్యప్పిండి – ఒక కప్పు నీళ్లు – ముప్పావు కప్పు ఏలకుల పొడి – అర టీ స్పూను బెల్లం తరుగు – ఒక కప్పు నెయ్యి – ఒక టీ స్పూను పచ్చికొబ్బరి తురుము – పావు కప్పు తయారీ స్టౌ మీద బాణలిలో బెల్లం తరుగు, నీళ్లు వేసి బాగా కలుపుతూ బెల్లం కరిగించి దింపేయాలి ∙బియ్యప్పిండి వేస్తూ ఆపకుండా కలుపుతుండాలి ∙ఏలకుల పొడి, కొబ్బరితురుము జత చేయాలి ∙అన్నీ బాగా కలపాలి (మిశ్రమం గట్టిగా ఉంటే ఉండ్రాళ్లు గట్టిగా వస్తాయి) నెయ్యి జత చేసి, కలియబెట్టి, చల్లారనివ్వాలి ∙కుకర్‌లో రెండు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి ∙తయారు చేసి ఉంచుకున్న మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని ఉండలు చేసి, ఒక పాత్రలో ఉంచాలి ∙మరుగుతున్న నీళ్లలో ఈ పాత్ర ఉంచాలి ∙మూత పెట్టి, సుమారు పది నిమిషాల పాటు ఉడికించి దింపేయాలి ∙భగవంతుడికి నివేదన చేసి ఆరగించాలి. జొన్నకుడుములు కావలసినవి జొన్నరవ్వ – ఒక కప్పు; పచ్చి సెనగ పప్పు – పావు కప్పు; జీలకర్ర – ఒక టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; నీళ్లు – తగినన్ని; ఉప్పు – కొద్దిగా తయారీ స్టౌ మీద మందపాటి పాత్రలో నూనె కాగాక, జీలకర్ర వేసి వేయించాలి ∙కరివేపాకు వేసి మరోమారు వేయించాలి ∙నీళ్లు, ఉప్పు వేసి మరిగించాలి ∙మంట తగ్గించి, నీళ్లలో జొన్నరవ్వ వేస్తూ కలపాలి ∙మూత పెట్టి పదినిమిషాల తరవాత దింపేయాలి ∙చల్లారాక ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని కుడుములు తయారు చేయాలి ∙వినాయకుడికి నైవేద్యం పెట్టి, ప్రసాదంలా తినాలి. ఫ్రైడ్‌మోదకాలు కావలసినవి గోధుమ పిండి – 2 కప్పులు; ఉప్పు – అర టీ స్పూను; గోరు వెచ్చని నూనె – 2 టీ స్పూన్లు; నీళ్లు – తగినన్ని ఫిల్లింగ్ కోసం బెల్లం తరుగు – ఒకటిన్నర కప్పులు; పచ్చి కొబ్బరి తురుము – ఒకటిన్నర కప్పులువేయించిన నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను; నీళ్లు – ముప్పావు కప్పు పైభాగం తయారీ ఒక పాత్రలో గోధుమ పిండి, గోరు వెచ్చని నూనె, ఉప్పు, నీళ్లు వేసి చపాతీ పిండిలా కలిపి, సుమారు అరగంట సేపు పక్కన ఉంచాలి. ఫిల్లింగ్ తయారీ ఫిల్లింగ్ కోసం చెప్పిన పదార్థాలను ఒక మందపాటి పాత్రలో వేసి బాగా కలిపి, స్టౌ మీద ఉంచి ఉడికించి, దింపి పక్కన ఉంచాలి. మోదకాల తయారీ గోధుమపిండి మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని చపాతీ కర్రతో చపాతీలా ఒత్తి చేతిలోకి తీసుకోవాలి ∙ఫిల్లింగ్ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని, ఒత్తిన చపాతీ మధ్యలో ఉంచి, అన్ని పక్కలా కొద్దికొద్దిగా దగ్గరకు తీసుకుంటూ (బొమ్మలో చూపిన విధంగా) మూసేయాలి ∙ఈ విధంగా అన్నీ తయారుచేసి పక్కన ఉంచుకోవాలి ∙బాణలిలో నూనె పోసి స్టౌ మీద ఉంచి, కాగిన తరవాత, తయారుచేసి ఉంచుకున్న మోదకాలను నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి కిచెన్ టవల్ మీదకు తీసుకోవాలి. పల్లీమోదకాలు కావలసినవి పల్లీలు – ఒక కప్పు; బెల్లం తరుగు – ముప్పావు కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూను; నీళ్లు – 4 టేబుల్ స్పూన్లు; కొబ్బరి తురుము – పావు కప్పు పైభాగం కోసం బియ్యప్పిండి – ఒకటిన్నర కప్పులు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; పిండి కలపడం కోసం నీళ్లు – 3 టేబుల్ స్పూన్లు; ఉప్పు – చిటికెడు; నెయ్యి – ఒక టీ స్పూను. తయారీ ∙స్టౌ మీద బాణలిలో నూనె లేకుండా పల్లీలను వేయించాలి ∙చల్లారాక పొట్టు తీసేయాలి ∙మిక్సీలో వేసి కొద్దిగా రవ్వలా ఉండేలా మిక్సీ పట్టాలి ∙బెల్లం తరుగు, ఏలకుల పొడి జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి. పైభాగం తయారీ ∙స్టౌ మీద బాణలిలో నీళ్లు పోసి మరిగించాలి ∙ఒక టీ స్పూను నెయ్యి, చిటికెడు ఉప్పు జత చేయాలి ∙బియ్యప్పిండి జత చేసి, స్టౌ ఆర్పేయాలి ∙కిందకు దింపి గరిటెతో బాగా కలపాలి ∙కొద్దికొద్దిగా పిండి చేతిలోకి తీసుకుని, చెయ్యి తడి చేసుకుంటూ చిన్న పూరీలా ఒత్తాలి ∙పల్లీ మిశ్రమాన్ని చిన్న ఉండలా చేసుకుని, మధ్యలో ఉంచి అంచులు మూసేయాలి ∙మోదకాల మౌల్డ్‌లో ఉంచి కొద్దిగా ఒత్తి, జాగ్రత్తగా బయటకు తీయాలి ∙ కుకర్‌లో రెండు కప్పుల నీళ్లు పోసి, తయారుచేసి ఉంచుకున్న మోదకాలను ఇడ్లీ రేకులలో ఉంచి, ఇడ్లీ స్టాండును కుకర్‌లో ఉంచి మూత పెట్టాలి (విజిల్ పెట్టకూడదు) ∙స్టౌ మీద ఉంచి పావు గంట తరవాత దింపేయాలి. మలై మోదక్ కావలసినవి: పాలు – రెండు లీటర్లు; పంచదార – అర కప్పు; నిమ్మ రసం – 2 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; డ్రై ఫ్రూట్స్ – అలంకరించడానికి తగినన్ని; కుంకుమ పువ్వు – చిటికెడు. తయారీ: పాలను స్టౌ మీద ఉంచి మీగడ కట్టే వరకు కాచాలి ∙మీగడను పక్కను జరిపి మరోసారి కాచిన తరవాత, రెండు కప్పుల పాలను విడిగా గిన్నెలోకి తీసి పక్కన ఉంచాలి ∙నిమ్మ రసం జత చేయగానే పాలు విరుగుతాయి ∙విరిగిన పాలను పల్చటి వస్త్రంలో వేసి నీళ్లు పోస్తూ బాగా కడిగి వడకట్టాలి ∙పక్కన ఉంచిన రెండు కప్పుల పాలలో పంచదార వేసి స్టౌ మీద ఉంచి, పాలు సగం అయ్యేవరకు మరిగించాలి ∙వడకట్టిన పనీర్ జత చేసి బాగా కలపాలి ∙మిశ్రమం బాగా చిక్కబడ్డాక ఏలకుల పొడి జత చేసి కలిపి దింపి చల్లారబెట్టాలి ∙మోదక్ మౌల్డ్స్కి నెయ్యి పూసి, అందులో తగినంత మిశ్రమం స్టఫ్ చేయాలి (విరగకూడదు) ∙గట్టిగా ప్రెస్ చేసి, మౌల్డ్ మూత తీసి మోదకాలను బయటకు తీయాలి (చేతితో కూడా గుండ్రంగా చేసుకోవచ్చు) రాగి మోదక్ కావలసినవి: రాగి పిండి – ఒక కప్పు; బెల్లం తరుగు – 4 టేబుల్ స్పూన్లు; నీళ్లు – 4 టేబుల్ స్పూన్లు; కప్పు – ఒక కప్పు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు; స్టఫింగ్ కోసం.. కొబ్బరి తురుము – ఒక కప్పు; వేయించిన నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు; బెల్లం తరుగు – పావు కప్పు; ఏలకుల పొడి – పావు టీ స్పూను. తయారీ: ఒక పాత్రలో బెల్లానికి కొద్దిగా నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి, బెల్లం కరిగేవరకు కలిపి పక్కన ఉంచాలి ∙ఒక బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగించాలి ∙రాగి పిండి వేసి దోరగా అయ్యేవరకు కలుపుతూ, మూడు నాలుగు నిమిషాల పాటు వేయించి దింపేయాలి ∙పాలు, నీళ్లు పోసి ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుతుండాలి ∙ఏలకుల పొడి జత చేసి, మరోమారు స్టౌ మీద ఉంచి, నీరంతా ఇంకిపోయేవరకు ఉడికించాలి ∙పిండి బాగా ఉడికిన తరవాత ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసి, అంచులు విడేవరకు ఉడికించి దింపేయాలి ∙గోరు వెచ్చగా ఉన్నప్పుడే మెత్తగా చపాతీ పిండిలా కలిపి పక్కన ఉంచాలి ∙ఒక పాత్రలో బెల్లం, తగినన్ని నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి, బెల్లం కరిగేవరకు కలిపి, మూత పెట్టి, మంట ఆర్పేయాలి ∙కరిగించిన బెల్లాన్ని వడ కట్టాలి ∙కొబ్బరి తురుము, ఏలకుల పొడి జత చేసి స్టౌ మీద ఉంచాలి ∙పాకం కొద్దిగా దగ్గర పడుతుండగా నువ్వులు వేసి కలిపి, దింపి పక్కన ఉంచాలి ∙చేతికి కొద్దిగా నెయ్యి పూసి, రాగి పిండిని కొద్దికొద్దిగా తీసుకుని చేతితో వెడల్పుగా ఒత్తాలి ∙కొబ్బరి మిశ్రమాన్ని చిన్న ఉండలా చేసి ఇందులో ఉంచి అంచులు మూసేయాలి ∙ఇలా అన్నిటినీ తయారుచేసుకోవాలి ∙వీటిని ఇడ్లీ రేకులలో ఉంచాలి ∙కుకర్‌లో కొద్దిగా నీళ్లు పోసి, ఇడ్లీ రేకులను అందులో ఉంచి మూత పెట్టి, స్టౌ మీద ఉంచాలి (విజిల్ పెట్టకూడదు) ∙పది నిమిషాల తరవాత దింపేసి, గణనాయకునికి సమర్పించి ప్రసాదం స్వీకరించాలి. డ్రై ఫ్రూట్స్ మోదక్ కావలసినవి: అంజీర్ – 6; గింజలు లేని ఖర్జూరాలు – 8; బాదం పప్పులు – 15; వాల్నట్స్ – ఒక టీ స్పూను; పల్లీలు – రెండు టేబుల్ స్పూన్లు; పిస్తా పప్పులు – 10; జీడి పప్పులు – 10; నువ్వులు – ఒక టీ స్పూను; చిరోంజీ – ఒక టీ స్పూను; గసగసాలు – ఒక టీ స్పూను; కొబ్బరి తురుము – ఒక టీ స్పూను; నెయ్యి – ఒక టేబుల్ స్పూను; కిస్మిస్ – 10; ఏలకుల పొడి – అర టీ స్పూను తయారీ: అంజీర్, ఖర్జూరాలను విడివిడిగా రెండు గంటలసేపు నానబెట్టాలి ∙బాదం పప్పులు, పల్లీలు, వాల్నట్స్, పిస్తాలు, జీడిపప్పులను మిక్సీలో వేసి పొడి చేయాలి (మరీ మెత్తగా చేయకూడదు) ∙స్టౌ మీద బాణలిలో ఈ పొడి వేసి కలియబెట్టాలి ∙మరొక బాణలిలో నువ్వులు, చిరోంజీ, గసగసాలు వేసి దోరగా వేయించాలి ∙నానబెట్టిన అక్రోట్, ఖర్జూరాలను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక మెత్తగా చేసిన ఖర్జూరాల మిశ్రమం వేసి కలపాలి ∙సన్నగా తరిగిన కిస్మిస్, ఆప్రికాట్స్లను జత చేసి మరోమారు కలపాలి ∙మిక్సీ పట్టిన డ్రై ఫ్రూట్స్‌ను జత చేసి మరోమారు కలపాలి ∙కొబ్బరి తురుము, ఏలకుల పొడి జత చేసి మరోమారు బాగా కలపాలి ∙మోదక్ మౌల్డ్స్‌లో కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని ఉంచాలి ∙మౌల్డ్ నొక్కి, మళ్లీ మూత తీసి, మోదకాలను జాగ్రత్తగా బయటకు తీసి పళ్లెంలో ఉంచి, వినాయకుడిని నివేదన చేసి, ప్రసాదంగా స్వీకరించాలి. బియ్యపు రవ్వ ఉండ్రాళ్లు కావలసినవి: బియ్యపు రవ్వ – ఒక కప్పు; పచ్చి సెనగ పప్పు – పావు కప్పు; జీలకర్ర – ఒక టీ స్పూను; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – కొద్దిగా; పచ్చి కొబ్బరి తురుము – ఒక టేబుల్ స్పూను; కరివేపాకు – ఒక రెమ్మ తయారీ: స్టౌ మీద మందపాటి పాత్ర ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి ∙జీలకర్ర వేసి వేగాక, కరివేపాకు వేసి వేయించాలి ∙తగినన్ని నీళ్లు, ఉప్పు జత చేసి బాగా కలపాలి ∙పచ్చి సెనగ పప్పు జత చేసి కలిపి నీళ్లు మరిగించాలి ∙మంట తగ్గించి, బియ్యం రవ్వ కొద్దికొద్దిగా వేస్తూ ఉండకట్టకుండా కలుపుతుండాలి ∙మూత ఉంచి పది నిమిషాలయ్యాక దింపేయాలి ∙ చల్లారిన తరవాత ఈ పిండిని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుంటూ, ఉండ్రాళ్లు తయారుచేసుకోవాలి ∙వినాయకుడి పూజ చేసి, ఉండ్రాళ్లను బొజ్జ గణపయ్యకు నివేదించి, ప్రసాదంగా తినాలి. -
నాయనలారా! ఇది నా కోరిక!
కృష్ణద్వీపంలో నివసించే వేదవ్యాసుడికి మదిలో ఒక కథ మెదిలింది. ఆ కథను అక్షరీకరించాలనుకున్నాడు. తాను నిరాఘాటంగా చెబుతుంటే, ఆపకుండా రాయగలిగే వ్రాయసగాని కోసం చూశాడు. ఈ సత్కార్యం విఘ్ననాయకుడైన వినాయకుని పవిత్ర హస్తాల మీదుగా సాగితే బాగుంటుందనుకున్నాడు. నేరుగా వినాయకుడి దగ్గరకు వెళ్లి, ‘నాయనా! నేను మహాభారత రచన ప్రారంభిద్దామనుకుంటున్నాను. నాకు వ్రాయసకాడు కావాలి. నేను వేగంగా చెబుతుంటే, అంతే వేగంగా రచన చేయాలి. ఇలా రాయాలంటే వ్రాయసకాడు కూడా జ్ఞాని అయి ఉండాలి. అందుకు నువ్వే తగినవాడివని భావించాను. మన భారత రచన ఎప్పుడు ప్రారంభిద్దాం గణేశా’ అని ఆప్యాయంగా పలకరించాడు. అందుకు ఆ గజాననుడు వినమ్రంగా శిరసు వంచి, మహర్షీ! మీ అంతటివారు నన్ను ఎంచుకున్నందుకు సదా ధన్యుడిని. మీరు సుముహూర్తం నిర్ణయించండి, ప్రారంభిద్దాం’ అన్నాడు ఉమాపుత్రుడు. ‘మంచిపనికి ముహూర్తం అక్కర్లేదు నాయనా! తక్షణమే ప్రారంభిద్దాం’ అన్నాడు బాదరాయణుడు. లంబోదరుడు పాదప్రక్షాళనం చేసుకుని, తాళపత్రాలు, ఘంటం చేత బట్టి, తన తల్లిదండ్రులైన ఆదిదంపతులను స్మరించి, మనస్సును భ్రూమధ్యం లో లగ్నం చేసి, రచనకు సన్నద్ధుడయ్యాడు. వ్యాసుడి నోటి నుంచి శ్లోకాలు నిశిత శరాలుగా వెలువడుతున్నాయి, వినాయకుడి ఘంటం అంతే వేగంతో పరుగులు తీస్తోంది. భారత రచన పూర్తయ్యేవరకు వినాయకుడు కదలలేదు, మెదలలేదు, పెదవి కదపలేదు. నిర్విఘ్నంగా లక్ష శ్లోకాలు పూర్తయ్యాయి. వ్యాసుడి దగ్గర సెలవు పుచ్చుకుని కైలాసం చేరుకున్నాడు. తల్లిదండ్రులను దర్శించాడు. కుశల సమాచారం అడిగారు పార్వతీపరమేశ్వరులు. వ్యాసభగవానుడి అద్భుత సృష్టికి తమ కుమారుడు ఘంటం పట్టినందుకు ఆనందపారవశ్యం చెందారు. భూమి మీద భారతం ఉన్నంతకాలం వినాయకుడి పేరు కూడా నిలబడిపోతుందని పరవశించారు. అమ్మా! ఇంతకాలం వ్యాసభగవానుడి దగ్గర ఉండి, జ్ఞానసముపార్జన చేశాను. ఎంతో విజ్ఞానదాయకమైన భారతాన్ని అందరికంటె ముందుగా తెలుసుకోగలిగాను. అనితర సాధ్యమైన ఇటువంటి రచనను, కొన్ని యుగాలు గడిచినా ఎవ్వరూ రచించలేరమ్మా! ఇంతకాలం మీకు దూరంగా ఉన్నందుకు నేను ఎన్నడూ చింతించలేదమ్మా. మీరు కూడా సంబరపడే ఉంటారు. ఇప్పుడు నా మనసుకి కొంచెం విశ్రాంతి కావాలనిపిస్తోంది. కొంతసేపు భూలోకంలో సంచరించాలని ఉంది. పైగా ఈ రోజు నా పుట్టిన రోజు కదమ్మా! ఈ వేడుకలను భూలోక వాసులు ఎంతో సంబరంగా జరుపుకుంటారు కదా! నీ అనుమతితో భూలోకంలో సంచరించి వస్తానమ్మా’ అన్నాడు గణనాయకుడు. అందుకు పార్వతి, ‘నాయనా! ఇంతకాలం నువ్వు మాకు దూరంగా ఉన్నావు. నిన్ను విడిచి ఉండలేమయా. నేను కూడా నీ వెంట వస్తాను. నిన్ను ఒక్కో సంవత్సరం ఒక్కో కొత్త అవతారం లో భూలోకవాసులు రూపొందిస్తున్నారు కదా. ఎక్కడెక్కడ ఎవరెవరు నిన్ను ఎలా పూజిస్తున్నారో కనులారా చూసి ఆనందించాలని ఉంది’ అంది పార్వతి. ‘నా మూషికం మీద ఈ యావత్ప్రపంచం నీకు చూపిస్తానమ్మా. ముందుగా నన్ను ఆశీర్వదించు’ అని తల్లి దీవెనలు అందుకుని, తల్లిని తన వాహనం మీద కూర్చుండబెట్టి బయలుదేరాడు వినాయకుడు. నారద విలేకరి... వినాయకుడు భూలోక సంచారానికి బయలుదేరుతున్నాడన్న వార్త తెలిసిన త్రిలోక సంచారి నారదుడు, ఈ సమాచారాన్ని తానే ముందుగా అందరికీ అందించాలని, వినాయకుడి కంటె ముందుగానే తన సామాగ్రితో బయలుదేరాడు. వినాయకుడి వెంట తల్లి కూడా ఉండటం చూసి, వెంటనే ‘తాజా వార్త’ అంటూ ప్రచారం చేసేసి, మళ్లీ వారి వెంట బయలుదేరాడు మరింత సమాచార సేకరణ కోసం. దారి పొడుగునా తల్లికొడుకులు ఎన్నో విషయాలు మాట్లాడుకుంటున్నారు. ‘నాయనా! నిన్ను రకరకాల రూపాలుగా విగ్రహాలు చేస్తుంటారు కదా! నీకు కోపం రాదా’ అని ప్రశ్నించింది. వినాయకుడు చిరునవ్వులు చిందిస్తూ, ‘అమ్మా! నువ్వు నీకు కావలసిన విధంగా నన్ను అలంకరించుకుంటావు! అవునా! మనకు చనువైన వారి దగ్గరే మనకు కావలసినవి అడుగుతాం. భూలోక వాసులకు నా మీద చనువుతో కూడిన ప్రేమ ఉంది. నన్ను వారి ఇంటి మనిషిగా భావించి, వారికి నచ్చిన రూపంలో నన్ను అలంకరిస్తుంటారు. అంతేనా! చిత్రకారులు నా మీద వ్యంగ్య చిత్రాలు వేస్తూనే ఉంటాడు, హాస్యకథలు రాస్తూనే ఉంటారు. నేనంటే ప్రీతి కనుకనే వారు ఇన్ని విధాలుగా నన్ను అక్కున చేర్చుకుంటున్నారు’ అన్నాడు వినాయకుడు. ‘నాయనా! నీ మాటలు బాగానే ఉన్నాయి. నిన్ను కొందరు నులక మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్న వినాయకుడిగా చూపుతారు, కొందరేమో స్కూటర్ వినాయకుడిగా కొలుస్తారు, మరి కొందరు నీకు నల్ల కళ్లజోడు పెడతారు. కొందరు నువ్వు క్రికెట్ ఆడుతుంటే చూసి మోజుపడుతున్నారు’ అని పార్వతీదేవి ఏకరువు పెడుతుంటే, మధ్యలోనే అడ్డుతగిలి వినాయకుడు, ‘అంతేనా అమ్మా! కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ, నాలోని సిద్ధి, బుద్ధి లక్షణాలను నా భార్యలుగా చేశారు’ అంటుంటే, మధ్యలో నారదుడు అడ్డు తగిలి, ‘అయ్యా! వినాయకా! మీతో కోలాటం ఆడించారు. ఆకులను మీ రూపంగా మలిచారు. ముచ్చటగా మీ ఒడిలో శ్రీకృష్ణుడిని కూర్చోపెట్టారు’ అంటూ రకరకాల రూపాలను వివరించాడు. నారదుడి మాటలకు తొండం వెనుక నుంచి ముసిముసిగా నవ్వుతూ, ‘త్రిలోక సంచారీ! నా పుట్టినరోజు పేరుతో ఎంతోమంది తమలోని సృజనను వెలికి తీస్తున్నారు. దేవతలలో ఎవ్వరికీ దక్కని ఈ ఘనత నాకు మాత్రమే దక్కింది. నా భక్తులు నన్ను వారి కుమారుడిగా భావించి, నన్ను అలంకరిస్తున్నారు. ఎవరు ఏ రూపంలో ఆరాధించినా నాకు అందరి మీద ఒకే ప్రేమ ఉంటుంది’ అని పలికాడు గణనాథుడు. ఇది నా అభ్యర్థన... నా పేరున జరుగుతున్న ఈ తొమ్మిది రోజుల పండగ సందర్భంగా ప్రతి పందిరిలోను, భక్తి పాటలను మాత్రమే వేయాలని కోరుకుంటున్నాను. అసభ్యపు పాటలు వేస్తున్నారని, అసభ్య పదాలను పలుకుతున్నారని నలుగురూ అనుకోవడం నాకు బాధగా ఉంటుంది. నా పుట్టినరోజును సంబరంగా, సంతోషంగా, ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే అందరూ నన్ను మట్టితో రూపొందించాలి. ఇది నా అభ్యర్థన. – గణపతి, కైలాసం ఇంతలోనే నారదుడు మళ్లీ, ‘వినాయకా! ఋషులు సైతం నిన్ను విడిచిపెట్టలేదు! నిన్ను షోడశ గణపతులుగా పేర్కొన్నారు. నిరుత్త గణపతి నుంచి మళ్లీ నిరుత్త గణపతిగా అమావాస్య నుంచి పౌర్ణమి దాకా అర్చిస్తున్నారు. ఎంతటి ఘనత గణనాథా నీది. నాది ఒక్కటే చిన్న విన్నపం! నీ పేరు చెప్పుకుని పర్యావరణాన్ని పాడు చేస్తున్నారని కొందరు నిన్ను నిందిస్తున్నారు. ఈ నీలాపనిందలు పడకుండా, నీ భక్తులందరికీ నిన్ను మీ అమ్మ రూపొందించినట్టుగా మట్టితోనే తయారు చేయమని ఆశీర్వదించు’ అంటూ నారదుడు సాష్టాంగపడ్డాడు.– వైజయంతి పురాణపండ -
గణ గణ గణపయ్య
నారు పోసినవాడే నీరు పోస్తాడని అంటారు. నారు పోసి నీరు పోసే ఆ దైవానికే మట్టితో చక్కటి ఆకృతినిచ్చి, ధాన్యపు గింజలతోకనుల‘పంట’గా అలంకరిస్తున్నారు పుదూరు స్కూలు పిల్లలు. వినాయక చవితి వస్తోందంటే పిల్లలకు ఆటవిడుపు. వినాయకుడి రూపమే వాళ్లకు పెద్ద వినోదం. పెద్ద బొజ్జ, తొండం, విశాలమైన చెవులు.. అన్నీ సంతోషమే పిల్లలకు. తొండాన్ని తాకి చూసి, చెవుల్ని లాగి, బొజ్జను తడిమి మురిసిపోతారు. చేతిలో ఓ మట్టిముద్ద పెట్టి వినాయకుడి బొమ్మ చేయమంటే... తలా ఒక్క తీరుగా చేస్తారు. ఒకరి బొమ్మలో తల పెద్దదై, బొజ్జ చిన్నదయిపోతుంది. మరొకరి బొమ్మలో చెవులు సాగిపోయి తొండం ఎక్కడుందో వెతుక్కోవాల్సి వస్తుంది. ఎన్ని తీరులుగా చేసినా అది గణపతి రూపం అని ఒకరు చెప్పాల్సిన పనే ఉండదు. ఆ చిన్న చేతుల్లో, వారి చేతల్లో ఇమిడిపోతుంది గణేశుడి రూపం. ఈ బొమ్మలు చూడండి. సుష్మ అనే అమ్మాయి శనగల గణేశుడిని చేసింది. హిమ తన గణేశుడిని కాకర, బెండ, మొక్కజొన్న గింజలతో అలంకరించింది. ఒక అమ్మాయి గణేశుడికి సొర గింజలద్దింది. ఓ అమ్మాయి మెంతులతో అలంకరించి, ధనియాలతో గణేశుడికి కళ్లు పెట్టింది. ఇలా అలసంద, టొమాటో, కాకర వంటి గింజలతో గణేశుడి బొమ్మలు చేశారు. వీళ్లంతా నెల్లూరు జిల్లా, నాయుడుపేట మండలం, పుదూరు బాలయోగి బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు. పుదూరు బాలయోగి బాలికల పాఠశాలలో ఆరువందలకు పైగా విద్యార్థినులు చదువుకుంటున్నారు. ఆ స్కూలు ప్రిన్సిపల్ ఎల్. కిరణ్మయి, గణిత అధ్యాపకురాలు తన్నీరు శశి ఆధ్వర్యంలో స్కూలు విద్యార్థినులకు ఇటీవల వర్క్‌షాప్ జరిగింది. గడచిన పన్నెండేళ్లుగా ఈ స్కూల్లో పర్యావరణ హితమైన గణేశ విగ్రహాల తయారీ వర్క్‌షాప్, ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఏటా వినాయక చవితికి ఓ పది రోజుల ముందు వర్క్‌షాప్ నిర్వహిస్తారు. ఆ వర్క్‌షాప్‌లో టీచర్, కొంతమంది చెయ్యి తిరిగిన పిల్లలతో కలిసి రకరకాల బొమ్మలు తయారు చేస్తారు. మిగిలిన విద్యార్థినులు సొంతంగా వినాయకుడి విగ్రహాలు తయారు చేసి, ఆ విగ్రహాలను వినాయక చవితి రోజు ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తారు. ఏటా మట్టి గణపతికి మాత్రమే పరిమితమైన పుదూరు గురుకుల పాఠశాల వర్క్‌షాప్ ఈ ఏడాది ఆగ్రో గణపతికి మారింది. గింజల గణపతి విగ్రహాలను అగ్రికల్చరల్ ఒకేషనల్ ట్రైనర్ జగదీశ్ సహకారంతో తయారు చేసినట్లు చెప్పారు ప్రిన్సిపల్ కిరణ్మయి. వినాయక చవితి తర్వాత ఈ విగ్రహాలను నీటిలో కరిగించి స్కూలు ఆవరణలోనే ఉన్న వ్యవసాయ మడులలో చల్లుతారని, ఈ గింజలు మొలకెత్తిన తరవాత వాటి సాగు కూడా పిల్లలకు నేర్పిస్తామని చెప్పారు గణిత అధ్యాపకురాలు తన్నీరు శశి. పిల్లలకు విగ్రహాల తయారీ నేర్పించడంలో గణితాన్ని కూడా భాగం చేస్తున్నారు ఇక్కడి ఉపాధ్యాయులు. మట్టిని స్థూపాలు, శంఖువులు, అర్ధ గోళాలుగా చేసి వాటితో వినాయకుడి రూపం తెస్తారు. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, క్రియేటివిటీ, గణిత బోధనలను సమ్మిళితం చేస్తారు. వీరి ఉత్సాహం, కృషి అభినందనీయం.– వాకా మంజులారెడ్డి -
మట్టిగణపతుల పంపిణీకి పీసీబీ శ్రీకారం..
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్‌వ్యాప్తంగా మట్టిగణపతుల పంపిణీకి పీసీబీ,హెచ్ఎండీఏ విభాగాలు సన్నాహాలు చేస్తున్నాయి. సెప్టెంబరు 2న వినాయకచవితి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్న నేపథ్యంలో..ఈనెల 27 నుంచి నగరంలోని ముఖ్యకూడళ్లు,కమ్యూనిటీహాళ్లు,జీహెచ్ఎంసీ జోనల్,డివిజన్ కార్యాలయాలు,పార్కులు,మార్కెట్లు,ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో ఈసారి 2 లక్షల మట్టిగణపతుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులోపీసీబీ ఆధ్వర్యంలో 1.60 లక్షలు...హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో సుమారు 40 వేల విగ్రహాలను పంపిణీచేయనున్నారు. గతేడాది కూడా ఈ రెండు విభాగాలు ఇదే సంఖ్యలో మట్టిగణపతులను పంపిణీచేయడం విశేషం. కాగా గతేడాది కూడళ్లలో ఏర్పాటుచేసే మంటపాల్లో పూజించుకునేందుకు వీలుగా ఐదు,ఆరు,ఏడు,ఎనిమిది అడుగుల గణపతి విగ్రహాలను పంపిణీ చేసినప్పటికీ..వాటిని రవాణా చేసే సమయంలో విగ్రహాలు ముక్కలుగా విరిగిపోతున్నాయన్న కారణంతో ఈ సారి కేవలం ఇళ్లలో పూజలందుకునేలా ఎనిమిది అంగుళాల గణపతులను మాత్రమే పంపిణీ చేయనుండడం విశేషం. మట్టి గణపతులే పర్యావరణ హితం.. ♦ రంగులు,రసాయనాలు లేని మట్టి వినాయక ప్రతిమలను మాత్రమే ప్రతిష్టించి.. నిమజ్జనం చేయాలి. వీటి పరిమాణం సైతం చిన్నవిగానే ఉండాలి. ♦ ఆయా జలాశయాల్లో నిమజ్జనం చేసే వినాయక విగ్రహాల సంఖ్యను ఏటేటా తగ్గించా లి. ఎక్కడి విగ్రహాలను అక్కడే నిమజ్జనం చేసేలా ఆయా విభాగాలు చర్యలు తీసుకోవాలి. ♦ నగరంలో మంచినీటి చెరువులు, బావుల్లో విగ్రహాల నిమజ్జనం చేయరాదు. ♦ వినాయక విగ్రహాలతోపాటు జలాశయాల్లోకి పూవులు,కొబ్బరి కాయలు,నూనె, వస్త్రాలు,పండ్లు,ధాన్యం,పాలిథీన్ కవర్లను పడవేయరాదు. ♦ నిమజ్జనం జరిగిన గంటలోపే వ్యర్థాలను తొలగించాలి. ♦ పర్యావరణంలో త్వరగా కలిసిపోయే పదార్థాలనే విగ్రహాల తయారీలో వాడాలి. ♦ పీఓపి(ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్)తో తయారు చేసిన విగ్రహాలను ఎట్టి పరిస్థితిలో నిమజ్జనం చేయరాదు. వాటిని జలాశయం వద్దకు తీసుకొచ్చి కొంత నీరు చల్లాలి.వచ్చే ఏడాది వీటిని వినియోగించేలా ప్రోత్సహించాలి. ♦ జలాశయాల్లో వ్యర్థాలు పోగుపడడంతో దోమలు వృద్ధిచెంది.. మలేరియా,డెంగీ వ్యాధులు విజృంభిస్తాయి. ♦ జలాశయంలో వృక్ష,జంతు జాతులు,నీరు,మృతిక, గాలి,పర్యావరణం దెబ్బతినకుండా అన్ని వర్గాల్లో అవగాహన పెంచాలి. పర్యావరణ హననం ఇలా.. మట్టివిగ్రహాలకు బదులుగా ప్లాస్టర్‌ఆఫ్ ప్యారిస్ ఇతర హానికారక రసాయనాలతో తయారుచేసిన విగ్రహాలను జలాశయాల్లో నిమజ్జనం చేసినపుడు వాటిలో హానికారక రసాయనాలు నీటిలో చేరుతున్నాయి. ముఖ్యంగా లెడ్ సల్ఫేట్, చైనా క్లే,సిలికా,జింక్ ఆక్సైడ్, రెడ్ ఐరన్ ఆౖMð్సడ్, రెడ్ లెడ్, క్రోమ్ గ్రీన్,పైన్ ఆయిల్,లిన్సీడ్ ఆయిల్, లెడ్ అసిటేట్, వైట్ స్పిరిట్,టర్పీన్,ఆల్కహాల్, కోబాల్ట్ తదితరాలు ప్రమాదకరమవుతున్నాయి. పీఓపీ విగ్రహాల నిమజ్జనంతో తలెత్తే అనర్థాలివే.. ♦ ఆయా జలాశయాల్లో సహజ ఆవరణ వ్యవస్థ దెబ్బతింటుంది. చేపలు,పక్షులు,వృక్ష,జంతు అనుఘటకాలమనుగడ ప్రశ్నార్థకమౌతుంది. ♦ పర్యావరణం దెబ్బతింటుంది. సమీప ప్రాంతాల్లో గాలి,నీరు కలుషిత మౌతుంది. దుర్వాసన వెలువడే ప్రమాదం ఉంది. ♦ ఆయా జలాశయాల్లో పట్టిన చేపలను పలువురు మత్స్యకారులు నగరంలోని వివిధ మార్కెట్లలో విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసి తిన్న వారికి శరీరంలోకి హానికారక మూలకాలు చేరుతున్నాయి. ♦ చేపల ద్వారా మానవ శరీరంలోకి మెర్క్యురీ మూలకం చేరితే మెదడులో సున్నితమైన కణాలు దెబ్బతింటాయి. ♦ మలేరియా,డెంగీ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు గరళంగా మారతాయి. ♦ నగరంలో జీవావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. జలాల్లో అరుదుగా పెరిగే వృక్షజాతులు అంతర్థానమౌతాయి. ♦ ఆర్సినిక్, లెడ్, మెర్క్యురీ మూలకాలు పరిశోధనాసంస్థలు సూచించిన పరిమితులను మించి ఉండడం గమనార్హం. -
మట్టి విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణ
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కేఎన్నార్ విద్యార్థులకు మట్టి విగ్రహాల పంపిణీ నెల్లూరు, సిటీ: పర్యావరణ పరిరక్షణకు ^è వితి ఉత్సవాలను మట్టి విగ్రహాలతో జరుపుకోవాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. నగరంలోని భక్తవత్సల్‌నగర్‌లోని కురుగుండ్ల నాగిరెడ్డి(కేఎన్ఆర్) ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు శనివారం మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ బొమ్మలకు లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి అనారోగ్యాలను కొనితెచ్చుకుంటున్నామన్నారు. మట్టి విగ్రహాలతో ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు. స్వర్ణభారతి ట్రస్ట్ తరుపున రూ.లక్ష విరాళం అందిస్తాం కేఎన్నార్ పాఠశాలలో కంప్యూటర్లు, ఇతర సౌకర్యాల కోసం స్వర్ణభారతి ట్రస్ట్ తరుపున రూ.లక్ష విరాళంగా అందజేస్తానని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు. పాఠశాలకు అవసరమైన వసతులను తన దృష్టికి తీసుకురావాలని ప్రధానోపాధ్యాయుడ్ని కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అబ్దుల్ అజీజ్, కమిషనర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి, టీడీపీ నాయకులు కిలారీ వెంకటస్వామినాయుడు, కార్పొరేటర్లు , తదితరులు పాల్గొన్నారు. వృత్తినైపుణ్య శిక్షణ కేంద్రం ప్రారంభం వెంకటాచలం: స్వర్ణభారత్ ట్రస్టు, బీవీ రాజు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వెంకటాచలంలోని సరస్వతీనగర్‌లో∙నిర్మించిన వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత కోసం శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం శుభపరిణామమన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీతో వెంకటాచలంలో తక్కువ ఖర్చుతో మోడల్ గృహ సముదాయాన్ని నిర్మించడం సంతోషకరమన్నారు. తిరుపతి ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడ్ని స్ఫూర్తిగా తీసుకుని అందరూ పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కలెక్టర్ ముత్యాలరాజు, తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలోబీఎంటీపీసీ సంస్థ ఈడీ శైలేష్‌కుమార్ అగర్వాల్, నెల్లూరు నగర మేయర్ అబ్ధుల్ అజీజ్, స్వర్ణభారత్‌ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్, ఆర్డీఓ కాసా వెంకటేశ్వర్లు, గృహనిర్మాణాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.