economic security
-
కుటుంబానికి బీమా ధీమా..
షణ్ముఖ్, నిత్య దంపతులకు ఇద్దరు పిల్లలు. షణ్ముఖ్ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. నిత్య గృహిణి. ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లేవు. సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం చిచ్చు పెట్టింది. షణ్ముఖ్ పేరిట లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు రెండున్నాయి. ఆ రెండింటి నుంచి వచ్చిన మొత్తం కేవలం రూ.15 లక్షలు. కుటుంబ జీవన అవసరాలకు ఈ మొత్తం చాలదని తెలియడంతో.. బాధను దిగమింగుకుని నిత్య ప్రైవేటు ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. జీవిత బీమా రక్షణ లేని వారు కొందరు అయితే.. ఉన్నా తగినంత కవరేజీతో సరైన ప్లాన్ తీసుకోని వారే ఎక్కువ. ఇలాంటి వారికి షణ్ముఖ్ కేసు కనువిప్పు కలిగిస్తుంది. సరైన బీమా పథకాన్ని, తగినంత కవరేజీతో తీసుకున్నప్పుడే దాని లక్ష్యం, ఉద్దేశం నెరవేరుతుంది. ఈ దిశగా అవగాహన కలి్పంచే కథనమే ఇది...తమపై ఎవరైనా ఆరి్థకంగా ఆధారపడి ఉంటే, అలాంటి ప్రతి ఒక్కరూ జీవిత బీమా రక్షణను (పాలసీ) తప్పకుండా తీసుకోవాలి. ఆర్జించే వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణించిన సందర్భాల్లో వారి కుటుంబం జీవన అవసరాల కోసం ఆరి్థకంగా ఇబ్బందులు పడకుండా జీవిత బీమా పరిహారం సాయంగా నిలుస్తుంది. కానీ, ఇదంతా సరైన, సరిపడా రక్షణ తీసుకున్నప్పుడే అని తప్పకుండా దృష్టిలో పెట్టుకోవాలి. తమ విలువైన జీవితంపై చేస్తున్న అసలైన పెట్టుబడిగా అర్థం చేసుకోవాలి.కవరేజీ ఎంత?ఏజెంట్ లేదా బ్రోకర్ చెప్పిన మేరకు లేదా ప్రీమియం తమకు సౌకర్యంగా అనిపించిన మేరకు జీవిత బీమా కవరేజీని ఎక్కువ మంది తీసుకుంటుంటారు. కానీ, ఇది సరైన విధానం కాదు. ఎంత లేదన్నా వార్షిక ఆదాయానికి కనీసం 10 రెట్ల మొత్తం జీవిత బీమా రక్షణగా తీసుకోవాలన్నది ప్రాథమిక సూత్రం. అలాగే, వార్షిక ఆదాయానికి 25 రెట్ల వరకు కవరేజీని ఎంపిక చేసుకోవచ్చు. 20 రెట్లు మధ్యస్థంగా ఉంటుంది. ఒకవేళ రుణాలు తీసుకుని ఉంటే ఆ మేరకు కవరేజీని అదనంగా ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు వార్షికాదాయం రూ.12 లక్షలు ఉంటే, కనీసం రూ.1.2 కోట్ల సమ్ అష్యూర్డ్‌తో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇల్లు, కారు లేదా వ్యక్తిగత రుణాలు రూ.10 లక్షలు ఉన్నాయనుకుంటే.. అప్పుడు రూ.1.2 కోట్లకు బదులు రూ.1.3 కోట్లను ఎంపిక చేసుకోవాలి. దురదృష్టవశాత్తు పాలసీదారు మరణించినట్టయితే బీమా సంస్థ చెల్లించే పరిహారంతో అప్పులు తీర్చి, మిగిలిన మొత్తంతో కుటుంబం సాఫీగా జీవించడానికి అవకాశం ఉంటుంది.సరిపోతుందా..?ఇంతకు ముందు ఉదాహరణలో వార్షిక ఆదాయం రూ. 12 లక్షలకు పది రెట్లు అంటే రూ.1.2 కోట్లకు టర్మ్ లైఫ్ ప్లాన్ తీసుకున్న తర్వాత.. పాలసీదారు మరణించినట్టయితే వచ్చే పరిహారం కుటుంబానికి సరిపోతుందా..? ఇక్కడ రూ.1.2 కోట్ల డిపాజిట్‌పై 6 శాతం వార్షిక రేటు ఆధారంగా వచ్చే మొత్తం రూ.7.2 లక్షలు మించదు. అంటే అప్పటి వరకు వచ్చిన వార్షికాదాయం కంటే తక్కువ. తమకు ఏదైనా జరిగినా.. ఎప్పటి మాదిరే కుటుంబ జీవనం సాఫీగా సాగిపోవాలంటే ఇక్కడ రూ. 2.4 కోట్లకు బీమా రక్షణను (సమ్ అష్యూర్డ్) తీసుకోవాలి. ఉదాహరణకు షణ్ముఖ్ వయసు 30 ఏళ్లు. ప్రస్తుత వార్షికాదాయం రూ.12 లక్షలకు 20 రెట్ల చొప్పున రూ.2.4 కోట్లకు టర్మ్ లైఫ్ కవరేజీ తీసుకున్నాడని అనుకుందాం. 40 ఏళ్లకు వచ్చే సరికి షణ్ముఖ్ వార్షికాదాయం రూ.24 లక్షలకు పెరిగింది. ఈ ప్రకారం చూస్తే పదేళ్ల క్రితం తీసుకున్న టర్మ్ ప్లాన్‌లో రక్షణ వార్షిక ఆదాయానికి పది రెట్లకు తగ్గిపోయిందని తెలుస్తోంది. వయసు పెరిగే కొద్దీ జీవితంలో బాధ్యతలు, ఖర్చులు పెరుగుతాయని తెలిసిందే. కనుక పెరుగుతున్న ఆదాయానికి, జీవన వ్యయాలకు అనుగుణంగా బీమా కవరేజీ కూడా పెరిగేలా చూసుకోవాలి. సొంతిల్లు, పిల్లలకు మెరుగైన విద్య అన్నవి తల్లిదండ్రులకు ఎంతో ముఖ్యమైన లక్ష్యాలు. ఇంటికి ఆధారమైన వ్యక్తి మరణించినప్పుడు వచ్చే పరిహారం కేవలం ఆ కుటుంబ జీవన అవసరాలే కాదు, ముఖ్యమైన జీవిత లక్ష్యాల సాకారానికీ తోడ్పాటునివ్వాలి. అందుకుని వాటికయ్యే వ్యయాలను కూడా కవరేజీని నిర్ణయించుకునే విషయంలో పరిగణనలోకి తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి..? ‘‘వివాహం అయిన తర్వాత లేదా పిల్లలు కలిగిన తర్వాత టర్మ్ ప్లాన్ తీసుకోవాలనే ధోరణి సరికాదు. ఎంత వీలైతే అంత ముందుగా టర్మ్ ప్లాన్ కొనుగోలు చేయడం మంచిది. దీనివల్ల ప్రీమియం తక్కువగా ఉంటుంది. అంతేకాదు పాలసీ పూర్తి కాలానికి అదే కొనసాగుతుంది’’ అని ఆనంద్‌రాఠి ఇన్సూరెన్స్ బ్రోకర్స్‌కు చెందిన దినేష్ దిలీప్ భోయ్ సూచించారు. వీలైనంత ముందుగా అంటే.. సంపాదన మొదలు పెట్టిన వెంటనే అని అర్థం చేసుకోవచ్చు. జీవితంలో స్థిరపడడంలో ఆలస్యమైన వారు.. కనీసం తమ సంపాదన మొదలైన మొదటి 30 రోజుల్లో అయినా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం మరిచిపోవద్దు. సాధారణంగా 18 సంవత్సరాల నుంచి 65 ఏళ్ల వయసు వారు టర్మ్ ప్లాన్ తీసుకోవచ్చు. ఆలస్యం చేసిన కొద్దీ వయసుతోపాటు ప్రీమియం పెరుగుతుంది. పైగా నేటి రోజుల్లో చిన్న వయసులోనే జీవనశైలి వ్యాధులైన మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ తదితర సమస్యలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు జీవిత బీమా తీసుకోవడాన్ని నిర్లక్ష్యం చేసి, అనారోగ్య సమస్యలు పలకరించిన తర్వాత తీసుకోవాలంటే అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. ఆరోగ్య వంతులతో పోలి్చతే ప్రీమియం 20–50 శాతం అధికంగా పడుతుంది. కొన్ని సందర్భాల్లో రిస్క్ మరీ ఎక్కువ ఉంటుందని బీమా సంస్థలు భావిస్తే బీమా కవరేజీని తిరస్కరించే అవకాశం కూడా లేకపోలేదు.ఎంత కాలానికి? జీవిత బీమా తీసుకోవడం ఎంత ముఖ్యమో, ఎంత వయసు వచ్చే వరకు ఈ రక్షణ ఉండాలన్నది కూడా ముఖ్యమైన అంశమే అవుతుంది. మనలో చాలా మంది ఇక్కడే తప్పు చేస్తుంటారు. ఎక్కువ మంది 20–25 ఏళ్ల కాలానికే రక్షణను ఎంపిక చేసుకుంటుంటారు. ఉదాహరణకు 25 ఏళ్ల వ్యక్తి 25 ఏళ్ల కాలానికి జీవిత బీమా కవరేజీ తీసుకున్నారని అనుకుంటే.. అతడికి/ఆమెకు 50 ఏళ్లు వచ్చే సరికి ఆ రక్షణ ముగిసిపోతుంది. దీంతో అక్కడి నుంచి మళ్లీ కొంత కాలానికి మరో పాలసీ కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీనివల్ల ప్రీమియం భారంగా మారుతుంది. ప్లాన్ తీసుకునే నాటికి తమ వయసు ఎంతన్నది పరిగణనలోకి తీసుకోవాలి. ఎంతలేదన్నా రిటైర్మెంట్ వరకు (60 ఏళ్లు) జీవిత బీమా కవరేజీ ఉండాలి. కొందరికి ఆలస్యంగా వివాహం కావచ్చు. అంటే 30–45 ఏళ్ల మధ్యలో వివాహం చేసుంటే.. 60 ఏళ్లు వచ్చినా పిల్లలకు సంబంధించి, కుటుంబ బాధ్యతలు ఇంకా మిగిలి ఉంటాయి. పిల్లలకు కనీసం 23–25 ఏళ్ల వయసు వచ్చే వరకు అయినా తమకు టర్మ్ కవరేజీ ఉండేలా చూసుకోవడం సరైనది. రిటైర్మెంట్ నాటికి లేదా జీవితంలో అన్ని ముఖ్యమైన బాధ్యతలు తీరే నాటికి బీమా కవరేజీ ఉంటే సరిపోతుంది.ఎలాంటి టర్మ్ ప్లాన్? టర్మ్ ప్లాన్ అంటే అచ్చమైన బీమా రక్షణతో కూడిన పాలసీ కదా? అన్న సందేహం రావచ్చు. అవును టర్మ్ ప్లాన్ ఉద్దేశంఅదే. కానీ, వినియోగదారుల ధోరణి, అంచనాలు, అవసరాలకు అనుగుణంగా ఇందులోనూ పలు రకాలు వచ్చాయి. సంప్రదాయ ఎండోమెంట్ ప్లాన్లలో బీమా రక్షణతోపాటు, పాలసీ గడువు ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉన్నా కానీ రాబడి ప్రయోజనం లభిస్తుంది. అంటే అది బీమా, పెట్టుబడి కలిసిన సాధనం. టర్మ్ ప్లాన్ ఎలాంటి రాబడి ఇవ్వని.. కేవలం మరణించిన సందర్భాల్లోనే (పాలసీ కాల వ్యవధిలో) పరిహారం చెల్లించేది. కానీ, పాలసీ గడువు ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం నుంచి జీఎస్టీ మినహాయించి మిగిలిన మొత్తాన్ని వెనక్కిచ్చే టర్మ్ ప్లాన్లు మార్కెట్లోకి ప్రవేశించాయి. టర్మ్ ఇన్సూరెన్స్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం (టీఆర్‌వోపీ)గా దీన్ని పిలుస్తారు. లెవల్ టర్మ్ ఇన్సూరెన్స్: ఇది అందరికీ తెలిసిన ప్లాన్. కాల వ్యవధి పూర్తయ్యే వరకు కవరేజీ స్థిరంగా ఉంటుంది. ఉదాహరణకు 30 ఏళ్ల కాలానికి రూ.50 లక్షల కవరేజీతో ప్లాన్ తీసుకుంటే, కాల వ్యవధి ముగిసే వరకు రూ.50 లక్షల కవరేజీయే కొనసాగుతుంది. ఇంక్రీజింగ్ టర్మ్ ఇన్సూరెన్స్: ఇందులో సమ్ అష్యూర్డ్ స్థిరంగా ఉండదు. నిరీ్ణత కాలానికోసారి పెరుగుతూ పోతుంది. దీనివల్ల ద్రవ్యోల్బణం నుంచి పరిహారానికి హెడ్జింగ్ లభిస్తుంది. అంతేకాదు పెరిగే వయసుకు తగ్గట్టు బాధ్యతలు కూడా అధికమవుతుంటాయి. ఈ విధంగానూ అదనపు రక్షణ అక్కరకు వస్తుంది. డిక్రీజింగ్ టర్మ్ ఇన్సూరెన్స్: ఇంక్రీజింగ్ ప్లాన్‌కు వ్యతిరేకంగా ఇది పనిచేస్తుంది. నిరీ్ణత కాలానికోసారి కవరేజీ తగ్గుతూ వెళుతుంది. ఉదాహరణకు ఏదైనా లోన్ తీసుకుని, దానికి రక్షణ కోసం టర్మ్ ప్లాన్ తీసుకున్నారని అనుకుందాం. కొంత కాలానికి రుణ భారం తగ్గిపోతుంది. దీనికి అనుగుణంగా బీమా రక్షణ తగ్గేలా ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. కన్వర్టబుల్ టర్మ్ ఇన్సూరెన్స్: ఇందులో టర్మ్ ప్లాన్‌ను ఎండోమెంట్ లేదా హోల్‌లైఫ్ పాలసీగా మార్చుకోవచ్చు. హోల్ లైఫ్ ఇన్సూరెన్స్: నూరేళ్ల కాలానికి ఈ ప్లాన్‌లో రక్షణ లభిస్తుంది. నోట్: టర్మ్ ప్లాన్‌లో ఎన్ని రకాలున్నా.. అచ్చమైన టర్మ్ ప్లాన్ (లెవల్ టర్మ్ఇన్సూరెన్స్) సులభమైనది. మిగిలిన వాటిల్లో తమకు ఏదైనా మరింత ప్రయోజనం అనిపిస్తే దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. లెవల్ టర్మ్ ప్లాన్‌లో కాల వ్యవధి ముగిసే వరకు ప్రీమియం మారదు. ఇంక్రీజింగ్ టర్మ్ ప్లాన్‌లో, కన్వర్టబుల్, హోల్‌లైఫ్ ప్లాన్లలో ప్రీమియం అధికంగా ఉంటుంది. సాధారణ లెవల్ టర్మ్ ప్లాన్‌తో పోల్చితే రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్‌లోనూ ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటుంది. రైడర్లు..టర్మ్ ప్లాన్‌కు అనుబంధంగా పలు రైడర్లను బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. క్రిటికల్ ఇల్నెస్ రైడర్: కేన్సర్, కాలేయ వైఫల్యం తదితర 20 నుంచి 64 వరకు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడినప్పుడు ఈ రైడర్ నుంచి ఏక మొత్తంలో పరిహారం లభిస్తుంది. ఈ రైడర్లో ఎన్నింటికి కవరేజీ అన్నది బీమా సంస్థలను బట్టి మారుతూ ఉంటుంది. వేవర్ ఆఫ్ ప్రీమియం: ప్రమాదంలో అంగవైకల్యం పాలైనా లేక తీవ్ర వ్యాధుల బారిన పడినా ఇక అక్కడి నుంచి పాలసీదారు ప్రీమియం చెల్లించే అవసరాన్ని ఇది తప్పిస్తుంది. బీమా సంస్థే మిగిలి ఉన్న కాలానికి ప్రీమియం చెల్లిస్తుంది. యాక్సిడెంటల్ డెత్, టోటల్, పర్మనెంట్ డిజేబిలిటీ రైడర్: ప్రమాదంలో మరణించినా లేదా అంగవైకల్యం పాలైనా ఈ రైడర్లో ఎంపిక చేసుకున్న మేర పరిహారం పొందొచ్చు. పరిహారం చెల్లింపు ఎలా..? పాలసీదారు మరణించినప్పుడు పరిహారం చెల్లింపులో పలు ఆప్షన్లను టర్మ్ ప్లాన్లు ఆఫర్ చేస్తుంటాయి. → ఎంపిక చేసుకున్న సమ్ అష్యూర్డ్ మొత్తాన్ని ఒకే విడత చెల్లించడం ఇందులో ఒకటి. → సమ్ అష్యూర్డ్‌లో 50 శాతాన్ని ఏకమొత్తంగా చెల్లించి, మిగిలిన 50 శాతాన్ని సమాన వాయిదాల్లో కొన్ని సంవత్సరాల పాటు చెల్లించడం మరో ఆప్షన్. → సమ్ అష్యూర్డ్‌లో కొంత మొత్తాన్ని ఒకే విడత చెల్లించి, మిగిలిన మొత్తాన్ని నెలవారీగా పెంచుతూ చెల్లించడం మూడో ఆప్షన్.చిట్కాలు→ తగినంత కవరేజీ ఎంపిక చేసుకున్న తర్వాత.. అందుకు ఏటా చెల్లించే ప్రీమియం తమ సామర్థ్యం మేరకే ఉండేలా చూసుకోవాలి. ప్రీమియం చెల్లించలేనంత భారంగా మారకూడదు. ప్రీమియం చెల్లించలేక పాలసీ మధ్య లో లాప్స్ అయ్యే రిస్క్ ఉంటుంది. అందుకని తగినంత బీమా రక్షణ ఒక్కటే కాదు, తమ చెల్లింపుల సామర్థ్యాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. → ఏదో ఒక కంపెనీ నుంచి పాలసీ తీసుకోవడం కాకుండా, వివిధ కంపెనీల మధ్య ఫీచర్లు, ప్రీమియం రేట్లను పరిశీలించి చూసుకోవాలి. → టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్‌కు అనుబంధంగా వచ్చే రైడర్లు, యాడాన్‌లను తప్పకుండా పరిశీలించాలి. ముఖ్యంగా యాక్సిడెంటల్ డిజేబిలిటీ రైడర్‌ను తీసుకోవడం ఎంతో అవసరం. → ఆఫ్‌లైన్ కంటే ఆన్లైన్లో పాలసీ తీసుకుంటే ప్రీమియంలో కొంత తగ్గింపు లభిస్తుంది. → పెరుగుతున్న జీవన అవసరాలకు అనుగుణంగా, అదనపు రుణం తీసుకున్న ప్రతి సందర్భంలో ఆ మేరకు బీమా కవరేజీని పెంచుకోవాలి. → ఎంపిక చేసుకునే బీమా సంస్థ, క్లెయిమ్‌లను ఏ మేరకు ఆమోదిస్తుందో తప్పకుండా పరిశీలించాలి. దీర్ఘకాలంలో మెరుగైన చెల్లింపుల చరిత్ర ఉన్న సంస్థను ఎంపిక చేసుకోవాలి.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
టర్మ్ ఇన్సూరెన్స్‌తో ఆర్థిక భద్రత
మన పరోక్షంలో మన కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించేందుకు సమర్థమంతమైన మార్గాల్లో నిస్సందేహంగా టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఒకటి. ఇది పూర్తిగా ప్రొటెక్షన్‌పై మాత్రమే ఫోకస్ చేసే సరళతరమైన బీమా పథకం. పాలసీదారు మరణించినా కుటుంబ పరిస్థితి తల్లకిందులు కాకుండా ఆర్థికంగా భరోసా అందించే టర్మ్ ఇన్సూరెన్స్‌ను తీసుకునేందుకు పలు కారణాలు ఉన్నాయి. అవేమిటంటే.. → ఆదాయ నష్టం నుంచి రక్షణ: సంపాదించే కుటుంబ పెద్ద కన్నుమూస్తే ఆదాయం నిలి్చపోయి ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం కాకుండా టర్మ్ ఇన్సూరెన్స్ కాపాడుతుంది. ఉదాహరణకు నలుగురు సభ్యులున్న కుటుంబంలో ఏకైక సంపాదనపరుడైన పాలసీదారు ఇటు ఇంటిరుణం చెల్లిస్తూ అటు పిల్లల చదువులకూ కడుతున్నారనుకుందాం. దురదృష్టవశాత్తూ ఒకవేళ ఆయన మరణించిన పక్షంలో టర్మ్ ఇన్సూరెన్సు పిల్లల చదువు ఖర్చులు, రుణాల చెల్లింపు, జీవనం సాగించడానికి అవసరమయ్యే నిధులను సమకూర్చగలదు. → చౌకైనది: టర్మ్ ప్లాన్లతో తక్కువ ప్రీమియంలకే అత్యధిక కవరేజీ లభించగలదు. ముఖ్యంగా యుక్తవయస్సులో ఉన్నప్పుడు తీసుకుంటే రిసు్కలు తక్కువ కాబట్టి కాబట్టి ప్రీమియంలు మరింత తక్కువగా ఉంటాయి. కనుక 20లలో లేదా 30లలో ఉన్నప్పుడు టర్మ్ పాలసీని తీసుకోవడానికి ప్రాధాన్యమివ్వాలి. → రుణాలకు కవరేజీ: పాలసీదారు ఏవైనా రుణాలు తీసుకున్నా వాటిని తీర్చేందుకు కూడా టర్మ్ ఇన్సూరెన్స్‌తో కవరేజీ లభించగలదు. ఎంత కవరేజీ ఉండాలి.. → ఇది మీ ఆర్థిక పరిస్థితులు, మీపై ఆధారపడిన వారి అవసరాలు, లైఫ్‌స్టయిల్, భవిష్యత్ లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. బండగుర్తు ఏమిటంటే వార్షిక ఆదాయానికి 10 రెట్లు అధికంగా లైఫ్ కవరేజీ ఉండాలి. అదనంగా ద్రవ్యోల్బణం, నిర్దిష్ట ఆర్థిక లక్ష్యాల్లాంటివి కూడా పరిగణనలోకి తీసుకుంటే ఎంత కవరేజీ అవసరమవుతుందనేది ఒక అవగాహనకు రావచ్చు. → చివరగా చెప్పాలంటే.. మీ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాల్సిన అవసరం గురించి అర్థం చేసుకునేందుకు, మీకేదైనా అయితే మీ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవగలిగే వారు ఎవరైనా ఒక అయిదుగురు ఉన్నారేమో ఆలోచించి చూడండి. నా మిత్రులను అడిగితే ఏదో ఒకటో రెండో పేర్లు చెప్పారు. కొందరైతే అదీ లేదు. కాబట్టి ఏదైనా జరిగితే మానసికంగా భరోసానిచ్చేవారు చాలా మందే ఉన్నా ఆర్థికంగా వెన్నంటి ఉండేవారు అంతగా ఉండరనేది ఇది తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో కుటుంబానికి ఆర్థిక భద్రత కలి్పంచడానికి టర్మ్ ఇన్సూరెన్స్ ఎంతగానో తోడ్పడగలదు.సమీర్ జోషి, చీఫ్ ఏజెన్సీ ఆఫీసర్, బజాజ్ అలయంజ్ లైఫ్ -
రిటైర్మెంట్ ఫండ్స్‌తో ఆర్థిక ప్రణాళిక ఇలా..
రిటైర్మెంట్ ఫండ్స్ అనేవి పదవీ విరమణ అనంతరం ఆర్థిక అవసరాల కోసం నిధిని సమకూర్చుకునేందుకు, ఆర్థిక భద్రతను సాధించేందుకు, స్థిరంగా ఆదాయాన్ని పొందేందుకు ఉపయోగపడే మ్యూచువల్ ఫండ్ స్కీములు. సాధారణంగా వీటికి అయిదేళ్లు లేదా రిటైర్మెంట్ వయస్సు వరకు (ఏది ముందైతే అది) లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఇంతకీ పదవీ విరమణ తర్వాత రోజుల కోసం ముందునుంచే ఎందుకు ప్లానింగ్ చేసుకోవాలి అంటే.. రిటైర్మెంట్ తర్వాత స్థిరంగా ఆదాయం వచ్చే ఉద్యోగావకాశాలు ఉండవు. కాబట్టి పదవీ విరమణ తర్వాత కూడా ప్రస్తుత జీవన విధానం విషయంలో రాజీ పడకూడదనుకుంటే, ముందు నుంచే ఒక ప్రణాళిక వేసుకోక తప్పదు. మీ జీవితంలోని సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా ఆర్థికంగా నిశ్చింతగా ఉండే విధంగా ఈ ప్లానింగ్ ఉండాలి. ఈ ప్రణాళిక అవసరాన్ని మరింతగా వివరించాలంటే, కొన్ని అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుతం సైన్స్, టెక్నాలజీ మెరుగుపడటంతో మనుషుల జీవితకాలం కూడా పెరుగుతోంది. దీనితో మన దగ్గరున్న ఆర్థిక వనరులు అంత కాలానికి సరిపోకపోవడమనే రిస్కులు ఉంటున్నాయి. అందుకే వృద్ధాప్యంలో ఆర్థికంగా ఇబ్బందిపడకుండా ముందునుంచే ప్రణాళికలు వేసుకోవడం చాలా ముఖ్యం. ఇక సామాజిక వ్యవస్థ స్వరూపం కూడా మారుతోంది. రిటైర్మెంట్ అవసరాల కోసం భవిష్యత్ తరాలపై ఆధారపడే పరిస్థితులు ఉండటం లేదు. ఇవే కాకుండా ఇక ద్రవ్యోల్బణం అనేది ఒకటి ఉండనే ఉంది. ఎప్పటికప్పుడు అన్నింటి రేట్లూ, ఖర్చులూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ రకంగా చూసినా.. సరిగ్గా ప్లానింగ్ చేసుకోకపోతే పదవీ విరమణ తర్వాత కూడా పాత జీవన విధానమే కొనసాగించాలంటే కష్టమైపోతుంది. ఇక మరో విషయం ఏమిటంటే.. ఈ మధ్య రిటైర్మెంట్ నిర్వచనమే మారిపోతోంది. ఇప్పుడు రిటైర్మెంట్ అంటే ఒక కొత్త అడ్వెంచర్‌గా కూడా చూస్తున్నారు. బరువు బాధ్యతలు కొంత తగ్గి, కాస్త స్వేచ్ఛ లభిస్తుంది కాబట్టి ఇతరత్రా హాబీల వైపు మళ్లేందుకు కొంత అవకాశం లభిస్తుంది ఈ దశలో. మరి ఇలాంటి దశను ఆస్వాదించాలంటే తగినన్ని ఆర్థిక వనరులు ఉంటేనే సాధ్యపడుతుంది. ప్లానింగ్ ఇలా.. రిటైర్మెంట్ ప్లానింగ్‌లో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి. వీలైనంత త్వరగా మొదలుపెట్టడమనేది ముఖ్యం. దీనివల్ల మీ పెట్టుబడులు వృద్ధి చెందేందుకు తగినంత సమయం లభిస్తుంది. కాంపౌండింగ్ ప్రయోజనాలను పొందేందుకూ వీలుంటుంది. ఎన్నాళ్లకు ప్లానింగ్ చేసుకోవాలనేదీ చూసుకోవాలి. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి, 58 ఏళ్లకు రిటైర్ అయి, 80 ఏళ్ల వరకు జీవిస్తారనుకుంటే .. వారు 28 ఏళ్ల పాటు పని చేయాల్సి ఉంటుంది, రిటైర్మెంట్ తర్వాత 22 ఏళ్ల పాటు జీవితకాలం ఉంటుంది. ఇప్పుడు దీనికి అనుగుణంగా ప్రస్తుత, భవిష్యత్ ఖర్చుల లెక్క వేసుకోవాలి. ఇందుకోసం ధరల పెరుగుదల రేటునూ పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు ప్రస్తుత ఖర్చులు నెలకు రూ. 50,000గా ఉంటే, 5.3 శాతం ద్రవ్యోల్బం రేటు అంచనాను పరిగణనలోకి తీసుకున్నప్పుడు 20 ఏళ్ల తర్వాత నెలవారీ ఖర్చులు రూ. 1.4 లక్షల స్థాయిలో ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని రిటైర్మెంట్ నిధికి రూపకల్పన చేసుకోవాలి. రిటైర్మెంట్ నిధి అనేది మీరు పదవీ విరమణ చేసే నాటికి కూడబెట్టుకోవాల్సిన మొత్తం. ఇది మీ పదవీ విరమణ అనంతరం ఎదురయ్యే ఖర్చులన్నింటికీ కనీసం సరిపోయే విధంగా ఉండాలి. సాధారణంగా అత్యవసర పరిస్థితుల కోసం 10–15 శాతం బఫర్ మొత్తాన్ని కూడా చేర్చుకోవడం మంచిది. దీన్ని చూసుకుని, అంత నిధిని పోగేసేందుకు మీరు ఇప్పటి నుంచి ప్రతి నెలా ఎంత పెట్టుబడి పెట్టాలనేది లెక్కించుకోవాలి. దీన్ని క్రమానుగతంగా, ఒక పద్ధతి ప్రకారం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇందుకోసం రిటైర్మెంట్ ప్లాన్లు అనువైనవిగా ఉండగలవు. ఫండ్స్ ప్రత్యేకతలు.. రిటైర్మెంట్ ఫండ్స్ అనేవి ఓపెన్ ఎండెడ్, రిటైర్మెంట్ సొల్యూషన్–ఆధారిత స్కీములుగా ఉంటాయి. వీటికి ముందుగానే చెప్పుకున్నట్లు అయిదేళ్లు లేదా రిటైర్మెంట్ వయస్సయిన 58 ఏళ్ల వరకు లాకిన్ పీరియడ్ (ఏది ముందైతే అది) ఉంటుంది. రిటైర్మెంట్ ఫండ్స్ అనేవి పదవీ విరమణ అనంతరం ఇన్వెస్టర్లకు ఆర్థిక భరోసా కలి్పంచేందుకు, స్థిరమైన ఆదాయ మార్గాన్ని ఏర్పర్చేందుకు ఉపయోగపడతాయి. ఇవి అటు ఈక్విటీలు (65 శాతం – 80 శాతం వరకు), అటు ఫిక్సిడ్ ఇన్‌కం సెక్యూరిటీస్‌లోనూ (35 శాతం నుంచి 20 శాతం వరకు) ఇన్వెస్ట్ చేస్తాయి. తద్వారా డైవర్సిఫికేషన్, అసెట్ అలొకేషన్ ప్రయోజనాలు అందిస్తాయి. రిటైర్మెంట్ తర్వాత ఇన్వెస్టర్లు ఆటో సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్స్ ద్వారా వీటి నుంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఇక వీటిలో ఏకమొత్తంగా ఇన్వెస్ట్ చేయాలా లేక కొంచెం కొంచెంగానా అంటే.. సాధారణంగా పదవీ విరమణ అవసరాలకు సంబంధించి భారీ మొత్తాన్నే కూడబెట్టుకోవాల్సి ఉంటుంది. కనుక ఈ ఫండ్స్‌లో క్రమానుగతంగా సిప్ల (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) రూపంలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెడితే ప్రయోజనకరంగా ఉంటుంది. కావాలనుకుంటే స్టెప్–అప్ సిప్ విధానాన్ని ఎంచుకుని వీలైనంతగా పెట్టుబడిని పెంచుకుంటూ వెళ్లొచ్చు. రిటైర్మెంట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల భవిష్యత్ అవసరాలపై స్పష్టత, ఫోకస్ వస్తుంది. అయిదేళ్ల లాకిన్ వ్యవధి కారణంగా పెట్టుబడి విషయంలో ఇన్వెస్టర్లు తమ లక్ష్యానికి కట్టుబడి ఉండేలా మరింత క్రమశిక్షణను నేర్పుతుంది. అంతేగాకుండా సుదీర్ఘ కాలం పాటు ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలను కూడా వారు పొందేందుకు తోడ్పడుతుంది. -
‘ఉపాధి’కి తగ్గిన బడ్జెట్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో లబ్ధి పొందుతున్న కుటుంబాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రతి ఏటా తగ్గుతున్న నిధుల కేటాయింపులకు తోడు ఆధార్ అనుసంధానిత చెల్లింపులు, ఆన్లైన్ హాజరు వంటి చర్యలతో పథకం కింద పనిచేసే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. కోవిడ్ సమయంలో సొంతూళ్లకు తిరిగి వచ్చిన వలసదారులకు ప్రధాన ఆర్థిక భద్రతగా ఉంటూ ఆసరాగా నిలిచిన ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య 2021 ఆర్ధిక సంవత్సరం నుంచి తగ్గుతూ వస్తోంద కేంద్ర గణాంకాలు చాటుతున్నాయి. కోవిడ్ సమయంలో 2020–21లో రికార్డు స్థాయిలో 7.55 కోట్ల కుటుంబాలు దీనిద్వారా ఉపాధి పొందాయి. ఆ తర్వాత 2021–22 వచ్చేసరికి ఈ సంఖ్య 7.25కోట్లకు తగ్గింది. 2022–23 నాటికి 6.19 కోట్లకు పడిపోయింది. తగ్గిన కుటుంబాలకు తోడు పనిదినాల సంఖ్య కుచించుకుపోవడం ఆందోళనకరం. 2020–21లో సగటు పనిదినాల సంఖ్య 51.42 రోజులుకాగా, ఆ సంఖ్య 2022–23 ఏడాదికల్లా 47.84 రోజులకు పడిపోయింది. 2021–22లో కేంద్ర బడ్జెట్లో ఈ పథకానికి రూ.98,467కోట్లు కేటాయించారు. 2022–23లో ఆ కేటాయింపులు కేవలం రూ.89వేల కోట్లకు పరిమితమయ్యాయి. ఈసారి బడ్జెట్లో కేవలం రూ.60వేల కోట్లే విదిల్చేందుకు సిద్ధమైంది. బడ్జెట్‌లేక పనిదినాలను కుదిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. -
‘సిరియా’ భయాలతో పసిడి మెరుపులు!
♦ వారాంతంలో 1,272 డాలర్లకు పరుగు... మళ్లీ వెనక్కు! ♦ డాలర్ పటిష్టత, ట్రంప్ విధానాల అనిశ్చితీ కారణం న్యూయార్క్/ముంబై: బంగారం ధరపై 7వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో అంతర్జాతీయ ఉద్రిక్తతల పరిస్థితి ప్రభావం స్పష్టంగా కనిపించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ద్రవ్య, పరపతి విధానాలు, దీనికి అనుగుణంగా డాలర్ పటిష్టతపై అనుమానాలతో అసలే బలంగా కనిపిస్తున్న పసిడి... సిరియాపై అమెరికా వైమానిక దాడుల వార్తలతో శుక్రవారం జోరందుకుంది. ఔన్స్ (31.1గ్రా) ధర అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ నైమెక్స్‌లో ఒక్కసారిగా 1,272 డాలర్లకు చేరింది. చివరకు 1,256 డాలర్ల వద్ద ముగిసింది. వారం వారీగా చూస్తే ఇది దాదాపు 10 డాలర్లు అధికం. మున్ముందూ దూకుడే! అంతర్జాతీయ ఉద్రికత్తల నేపథ్యంలో ఇన్వెస్టర్లకు రాబోయే కొద్ది వారాల్లో పసిడి ‘ఆర్థిక రక్షణ’గానే కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనికితోడు ట్రంప్ విధానాలు, తదనుగుణంగా డాలర్ పటిస్టతపై అనిశ్చితి కూడా పసిడికి బలాన్నిచ్చే అంశాలేనన్నది వారి అభిప్రాయం. కాగా సిరియాపై దాడుల వార్తలతో ఒక్కసారిగా 100.42 స్థాయికి పడిన డాలర్ ఇండెక్స్... ఉద్రిక్తత క్రమంగా తగ్గిన కొద్దీ పెరుగుతూ 101.19 స్థాయికి చేరింది. చివరకు 101.08 వద్ద ముగిసింది. అంతక్రితం వారంలో డాలర్ 99.59–100.42 శ్రేణిలో తిరిగింది. మార్చి 15న అమెరికా ఫెడ్– ఫండ్ రేటును 0.25 శాతం (0.75 శాతం – 1 శాతం శ్రేణికి) పెంచిన తరువాత, అనూహ్య రీతిలో డాలర్ బలహీనత– బంగారం బలోపేతం అయిన విషయం తెలిసిందే. కేవలం నాలుగు వారాల్లో పసిడి 40 డాలర్లకుపైగా పెరిగింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, డాలర్ బలహీనత కొనసాగితే, పసిడి మరింత ముందుకు కదలడం ఖాయమని తాజా విశ్లేషణలు చెబుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిస్తే ఆయన అనుసరించే ‘డాలర్ బలహీనత’ విధానాల వల్ల పసిడి 1,800 డాలర్లకు క్రమంగా చేరుతుందని అధ్యక్ష ఎన్నికలకు ముందు పలు విశ్లేషణలు వెలువడ్డాయి. కాగా పసిడికి 1,200 డాలర్ల వద్ద మద్దతు ఉందనీ, ఇది పోతే 1,170 డాలర్ల వద్ద మరో మద్దతు ఉందనీ విశ్లేషకులు చెబుతున్నారు. దేశీయంగానూ అదే ట్రెండ్.. అంతర్జాతీయ ప్రభావం దేశీ ఫ్యూచర్స్ మార్కెట్‌పైనా పడుతోంది. మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధర 10 గ్రాములకు 7వ తేదీతో ముగిసిన వారంలో రూ.221 పెరిగి రూ.28,684కి చేరింది. ఇక దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో వారం వారీగా పసిడి ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములకు రూ.150 పెరిగి రూ.28,925కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో పెరిగి రూ.28,775కి చేరింది. మరోవైపు వెండి పెరుగుదల కొనసాగుతోంది. వారంలో కేజీ ధర రూ. 265 పెరిగి రూ.42,630కి పెరిగింది. గడచిన నాలుగు వారాల్లో వెండి కేజీ ధర దాదాపు రూ.1,500 పెరిగింది. -
ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించాలి
సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో ధర్నా టీసీపీఎస్‌ఈఏ జిల్లా అధ్యక్షుడు వి. లింగమూర్తి ఖిలావరంగల్ : ఉద్యోగులకు ప్రభుత్వం ఆర్ధిక భద్రత కల్పించాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా ఆధ్యక్షుడు వి.లింగమూర్తి కోరారు. ఆదివారం శివనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టీసీపీఎస్‌ఈఏ జిల్లా కార్యదర్శి ఆర్.మనోహర్ అధ్యక్షతన జిల్లాస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సెప్టెం బర్ 1న చేపట్టే చలో హైదరాబాద్ కార్యక్రమం వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సీపీఎస్ విధానం వల్ల రిటైర్ తర్వాత ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు ఆర్ధిక భరోసా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహాధర్నాను విజయవంతం చేయాలని ఆయ న పిలుపునిచ్చారు. సమావేశంలో కమిటీ బా ధ్యులు వి.రాంబాబు, కుమారస్వామి, మహిళా కార్యదర్శి ఉమాదేవి, శ్రీనివాస్‌రావు, కె.భాస్కర్‌రావు, కె.రమేష్, రాకేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళకు ఆర్థిక సాధికారత అవసరం..
నేటి మహిళకు ఆర్థిక స్వతంత్రం, సాధికారిత అవసరం. ఆధునిక కాలంలో భవిష్యత్ ఆర్థిక భద్రత వైపు వారు దృష్టి సారించాలి. మొదటిజీతం అందిన రోజు నుంచే దీనికి శ్రీకారం చుట్టాలి. మహిళలు చాలా మందిలో అద్భుత ప్రతిభా పాటవాలు ఉన్నాయి. అయితే ఆయా అంశాలను వారు తమ సొంత వ్యక్తిగత ఆర్థికాభివృద్ధికి వినియోగించుకోవడంలేదు. ఈ పరిస్థితి మారాలి. మొదటి మదుపు సిప్‌లో...! తమ కాళ్లపై తాము నిలబడుతూ, ఆర్థిక భరోసా పొందే క్రమంలో మహిళ మొదటిగా మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేసే క్రమానుగత పెట్టుబడుల ప్రణాళికలపై (సిప్) దృష్టి పెడితే బాగుంటుంది. దీర్ఘకాలంలో మదుపు ప్రయోజనాన్ని భారీగా అందించడానికి దోహదపడే పథకాలివి. కొద్ది మొత్తాల్లో మదుపు దీర్ఘకాలంలో మంచి ఆర్థిక లబ్ధిని సిప్ స్కీమ్‌లు చేకూర్చుతాయి. మార్కెట్ భారీ ఒడిదుడుకుల ప్రభావం అంత భారీగా సిప్‌లపై ఉండదు. లక్ష్యాలు అవసరం ఆర్థిక భద్రత భరోసా పొందే క్రమంలో మహిళ తొలుత తన ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవడం అవసరం. అది బిడ్డ చదువు విషయంలో భవిష్యత్ వ్యయానికి సంబంధించినది కావచ్చు. లేదా హాలిడే ట్రిప్‌కు ఉద్దేశించినది కావచ్చు. ఆయా అంశాలను, వ్యయాలను మదింపుచేసుకుని, అవసరమైన మొత్తాన్ని సమకూర్చుకోడానికి ముందునుంచే ఆలోచించాలి. విద్య వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలను ఉద్దేశించనదైతే ఈక్విటీ ఫండ్స్‌లో మదుపు బెస్ట్. ఇప్పటి నుంచీ రెండేళ్లలో ఏదైనా విహారయాత్రకు ప్రణాళిక వేసుకుంటే... స్వల్పకాలిక డెట్ ఫండ్స్ తగిన ప్రయోజనాన్ని చేకూర్చే వీలుంది. ఇలా ఎన్ని లక్ష్యాలున్నా.... సంపదలో కొంత మొత్తాలను వేర్వేరుగా ఆయా లక్ష్యాలకు కేటాయించడం సముచితం. సలహాలూ తీసుకోవాలి... ఆర్థిక ప్రణాళికలకు సంబంధించి చక్కటి ప్రయోజనాలు పొందడానికి నిపుణుల సలహాలూ కీలకమే. సంపాదన మొత్తం, లక్ష్యాలు, జీవిత భద్రత, ఆర్థికంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇత్యాధి అంశాలన్నింటినీ ఒక పేపర్‌మీద ఉంచుకుని తగిన భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకోవాలి. ప్రణాళికల రూపకల్పన విషయంలో అవసరమైతే నిపుణుల సలహాలనూ మహిళలు తీసుకోవాలి. మదుపు అంశాల విషయంలో నిపుణుల సలహాలు కీలకం.