ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించాలి
-
సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో ధర్నా
-
టీసీపీఎస్‌ఈఏ జిల్లా అధ్యక్షుడు వి. లింగమూర్తి
ఖిలావరంగల్ : ఉద్యోగులకు ప్రభుత్వం ఆర్ధిక భద్రత కల్పించాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా ఆధ్యక్షుడు వి.లింగమూర్తి కోరారు. ఆదివారం శివనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టీసీపీఎస్‌ఈఏ జిల్లా కార్యదర్శి ఆర్.మనోహర్ అధ్యక్షతన జిల్లాస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సెప్టెం బర్ 1న చేపట్టే చలో హైదరాబాద్ కార్యక్రమం వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సీపీఎస్ విధానం వల్ల రిటైర్ తర్వాత ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు ఆర్ధిక భరోసా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహాధర్నాను విజయవంతం చేయాలని ఆయ న పిలుపునిచ్చారు. సమావేశంలో కమిటీ బా ధ్యులు వి.రాంబాబు, కుమారస్వామి, మహిళా కార్యదర్శి ఉమాదేవి, శ్రీనివాస్‌రావు, కె.భాస్కర్‌రావు, కె.రమేష్, రాకేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.