Elizabeth II
-
భారమైన హృదయాలతో... రాణికి వీడ్కోలు
లండన్: అసంఖ్యాక అభిమానుల అశ్రు నివాళుల నడుమ బ్రిటన్ దివంగత రాణి ఎలిజబెత్–2 అంత్యక్రియలు సోమవారం ముగిశాయి. కార్యక్రమం ఆసాంతం పూర్తి ప్రభుత్వ లాంఛనాల నడుమ సాగింది. రాచ కుటుంబీకుల అంతిమయాత్రకు ఉపయోగించే ప్రత్యేక వాహనంలో రాణి పార్థివ దేహాన్ని ఉదయం 11 గంటలకు వెస్ట్‌మినిస్టర్ హాల్ నుంచి వెస్ట్‌మినిస్టర్ అబేకు తరలించారు. రాజు చార్లెస్–3తో పాటు ఆయన తోబుట్టువులు, కొడుకులు, కోడళ్లు, మనవడు, మనవరాలు, ఇతర రాజకుటుంబీకులు వెంట నడిచారు. అబేలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులతో పాటు 2,000 మందికి పైగా దేశాధినేతలు, రాజులు, ప్రముఖులు చివరిసారిగా నివాళులర్పించారు. నేపథ్యంలో విషాద సంగీతం వినిపిస్తుండగా గంటకు పైగా ప్రార్థనలు కొనసాగాయి. బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ తదితరులంతా బైబిల్ వాక్యాలు పఠించారు. ఈ సందర్భంగా రాణికి నివాళిగా బ్రిటన్వ్యాప్తంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. వెస్ట్‌మినిస్టర్ డీన్ తదితరులు శోక సందేశం వినిపించారు. దేశసేవకు జీవితాన్ని అంకితం చేస్తానంటూ రాణి తన 21వ పుట్టినరోజున చేసిన ప్రతిజ్ఞను ఆసాంతం నిలబెట్టుకున్నారంటూ కొనియాడారు. అనంతరం ఎలిజబెత్–2 వివాహ, పట్టాభిషేక వేడుకలకు వేదికగా నిలిచిన వెస్ట్‌మినిస్టర్ అబే నుంచే ఆమె అంతిమయాత్ర మొదలైంది. చారిత్రక లండన్ వీధుల గుండా భారంగా సాగింది. ఈ సందర్భంగా ఇరువైపులా అభిమానులు అసంఖ్యాకంగా బారులు తీరారు. తమ అభిమాన రాణికి శోకతప్త హృదయాలతో తుది వీడ్కోలు పలికారు. రాణికి తుది నివాళులర్పిస్తున్నరాష్ట్రపతి ముర్ము, పలు దేశాధినేతలు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్లపై లక్షలాది మంది అంతిమయాత్రను వీక్షిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. 96 ఏళ్లు జీవించిన రాణికి నివాళిగా లండన్‌లోని చారిత్రక బిగ్‌బెన్ గడియారం నిమిషానికోసారి చొప్పున 96 సార్లు మోగింది. హైడ్ పార్కులో రాయల్ గన్ సెల్యూట్ నిరంతరాయంగా కొనసాగింది. అనంతరం రాణి పార్థివ దేహాన్ని జాతీయ గీతాలాపన నడుమ దాదాపు 40 కిలోమీటర్ల దూరంలోని చారిత్రక విండ్సర్ కోటకు ప్రత్యేక వాహనంలో తరలించారు. శవపేటికపై ఉంచిన రాజ చిహ్నాలైన కిరీటం తదితరాలను తొలగించారు. సంప్రదాయ ప్రార్థనల అనంతరం సెయింట్ జార్జి చాపెల్‌కు తరలించారు. రాజ కుటుంబీకుల సమక్షంలో రాణి తల్లిదండ్రులు, భర్త, సోదరి సమాధుల పక్కనే ఖననం చేశారు. బ్రిటన్ను అత్యధిక కాలం పాలించిన రాణి పవిత్రాత్మ పరలోకంలోని ప్రభువును చేరాలంటూ బైబిల్ వాక్యాల పఠనం తర్వాత మరోసారి జాతీయ గీతాలాపనతో అంత్యక్రియలు ముగిశాయి. క్వీన్ విక్టోరియా మెమొరియల్ మార్గం గుండా సాగుతున్న రాణి అంతిమయాత్ర ఇదీ చదవండి: బ్రిటన్ రాజు బాడీగార్డులకు నకిలీ చేతులు! నెటిజన్ల అయోమయం -
బ్రిటన్ రాణి అంత్యక్రియలు పూర్తి.. ప్రపంచ దేశాల అధినేతలు హాజరు
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 అంతిమయాత్రను అధికారిక లాంఛనాలతో సంప్రదాయబద్దంగా నిర్వహించారు. రాణి భౌతికకాయం ఉన్న వెస్ట్‌మినిస్టర్ అబెలో కుటుంబసభ్యులు సోమవారం తుది ప్రార్థనలు చేశారు. అనంతరం భారీ జన సందోహం మధ్య ఆమె శవపేటికను విండ్సోర్ కాస్టిల్‌కు తరలించారు. అక్కడే ఖననం చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా ప్రపంచ దేశాల అధినేతలు కలిపి మొత్తం 2000 మంది విదేశీ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భారత్ తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. లండన్‌లోని 125 థియేటర్లరో రాణి అంత్యక్రియలను లైవ్ ప్రదర్శన చేశారు. బ్రిటన్ చరిత్రలో అత్యధిక కాలం రాణిగా ఉన్న 96 ఏళ్ల ఎలిజబెత్ 2 సెప్టెంబర్ 8న స్కాట్లాండ్లోని బల్మోరల్ కోటలో కన్నుమూశారు. దీంతో రాజకుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రపంచ దేశాలు రాణి మృతి పట్ల సంతాపం తెలిపాయి. రాణి వారసుడిగా ఆమె కుమారుడు కింగ్ చార్లెస్-3 బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. చదవండి: రాణి చనిపోయింది కాబట్టి మా వజ్రాలు మాకిచ్చేయండి! -
రాణి అంత్యక్రియలకు సర్వం సిద్ధం
లండన్: బ్రిటన్ దివంగత రాణి ఎలిజబెత్–2 అంత్యక్రియలు సోమవారం ఉదయం జరగనున్నాయి. వాటిలో పాల్గొనేందుకు 500 మందికి పైగా దేశాధినేతలు, రాజులు, ప్రముఖులు ఒక్కొక్కరుగా బ్రిటన్ చేరుకుంటున్నారు. గత కొన్ని దశాబ్దాల్లో ఇంతమంది దేశాధినేతలు ఒక్కచోట కలుస్తున్న సందర్భం ఇదే కానుంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తదితరులు ఇప్పటికే లండన్ చేరుకున్నారు. బ్రిటన్, కామన్వెల్త్ దేశాలను 70 ఏళ్లపాటు సుదీర్ఘంగా పాలించిన 96 ఏళ్ల ఎలిజబెత్–2 సెప్టెంబర్ 8న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. తమ ప్రియతమ రాణిని కడసారి చూసుకునేందుకు గడ్డ కట్టించే చలిలోనూ బ్రిటన్వాసులు బారులు తీరుతూనే ఉన్నారు. రాణి మృతికి సంతాపంగా ఆదివారం రాత్రి దేశవ్యాప్తంగా నిమిషం పాటు మౌనం పాటించారు. రాష్ట్రపతి ముర్ము ఆదివారం లాంకెస్టర్ హౌస్‌ను సందర్శించారు. నివాళుల పుస్తకంలో భారత ప్రభుత్వం తరఫున శోక సందేశం రాశారు. అనంతరం వెస్ట్‌మినిస్టర్ హాల్లో రాణి భౌతికకాయానికి రాష్ట్రపతితో పాటు బైడెన్ దంపతులు కూడా నివాళులు అర్పించారు. ఇలా జరుగుతుంది... ► సోమవారం ఉదయం ఆరింటికల్లా రాణి సందర్శనకు వస్తున్న సందర్శకులను నిలిపేస్తారు. ► అనంతరం తుది నివాళుల కోసం దేశాధినేతలు, ప్రముఖుల రాక మొదలవుతుంది. ► 11 గంటలకు రాణి శవపేటికను వెస్ట్‌మినిస్టర్ హాల్ నుంచి అధికార లాంఛనాలతో సమీపంలోని వెస్ట్‌మినిస్టర్ అబేకు తరలిస్తారు. ► ప్రార్థనల అనంతరం మధ్యాహ్నం 12.15కు చారిత్రక లండన్ వీధుల గుండా రాణి అంతిమయాత్ర మొదలవుతుంది. శవపేటిక విండ్సర్ కోటకు చేరుకుంటుంది. ► అక్కడి సెయింట్ జార్జ్ చాపెల్‌లో గతేడాది మరణించిన భర్త ఫిలిప్ సమాధి పక్కనే రాణి భౌతికకాయాన్ని ఖననం చేస్తారు. వెస్ట్‌మినిస్టర్ డీన్ ఆధ్వర్యంలో సాయంత్రానికల్లా కార్యక్రమం పూర్తవుతుంది. అంత్యక్రియలను ప్రత్యక్షప్రసారం చేయనున్నారు. ► 10 వేల మంది పై చిలుకు పోలీసులు, వేలాది మంది సైనిక తదితర సిబ్బందితో లండన్‌లో బందోబస్తు ఏర్పాట్లు కనీవినీ ఎరగనంతటి భారీ స్థాయిలో జరుగుతున్నాయి. జనాన్ని అదుపు చేసేందుకు ఒక్క సెంట్రల్ లండన్‌లోనే ఏకంగా 36 కిలోమీటర్ల మేరకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ► అంత్యక్రియల సందర్భంగా సోమవారం కనీసం 10 లక్షల మంది లండన్‌కు వస్తారని అంచనా. -
ఎలిజబెత్ అస్తమయంతో మారిన వారసుల జాబితా
బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 మృతితో ఆమె పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్ సింహాసనమెక్కారు. కింగ్ చార్లెస్–3గా ఆయనకు త్వరలో లాంఛనంగా పట్టాభిషేకం జరగనుంది. రాణి మృతితో బ్రిటన్ సింహాసనానికి వారసుల జాబితాలో కూడా మార్పుచేర్పులు చోటుచేసుకున్నాయి. చార్లెస్ పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియం, ఆయన సంతానానికే వారసత్వంలో ఇక అగ్ర తాంబూలం దక్కనుంది. ఆ లెక్కన విలియం, తర్వాత ఆయన పిల్లలు జార్జ్, చార్లెటీ, లూయిస్ జాబితాలో వరుసగా ఒకటి, రెండు, మూడు, నాలుగో స్థానాల్లో ఉంటారు. తర్వాత ఐదో స్థానంలో మాత్రమే విలియం సోదరుడు హ్యారీ ఉంటారు! ఆ తర్వాత ఆయన పిల్లలిద్దరూ వస్తారు. రాణి బతికుండగా చార్లెస్, విలియం తర్వాత హ్యారీ మూడో స్థానంలో ఉండేవారు. ► బ్రిటన్‌లో రాజు/రాణి పెద్ద కుమారుడు మాత్రమే రాజయ్యే సంప్రదాయం ఇటీవలిదాకా కొనసాగింది. తొలి సంతానమైనా సరే అమ్మాయికి అవకాశం ఉండేది కాదు. గురువారం మరణించిన రాణి ఎలిజబెత్–2 కింగ్ జార్జి–6కు తొలి సంతానంగా జన్మించింది. ఆమెకు తమ్ములెవరూ లేకపోవడం వల్ల మాత్రమే రాణి కాగలిగింది. ఈ పురాతన సంప్రదాయాన్ని 2013లో సింహాసన వారసత్వ చట్టం ద్వారా మార్చారు. దాని ప్రకారం తొలిచూరు అమ్మాయైనా బ్రిటన్ సింహాసనం ఆమెకే దక్కుతుంది. దీని ప్రకారం ప్రిన్స్ విలియం కూతురు చార్లెట్ వారసత్వ జాబితాలో తన తమ్ముడు లూయీస్ కంటే ముందుంది. ► రోమన్ క్యాథలిక్కును పెళ్లాడే రాజ కుటుంబీకులు సింహాసనానికి అనర్హులన్న నిబంధనను కూడా 2013 చట్టం ద్వారా తొలగించారు. అయితే రాజు/రాణి కావాలనుకునేవారు మాత్రం రోమన్ క్యాథలిక్కులు అయి ఉండరాదు. ► సింహాసనానికి వారసులను చట్టాల ద్వారా నియంత్రించడానికి, మార్చడానికి కూడా బ్రిటన్ పార్లమెంటుకు అధికారముంది. పాలన సరిగా లేకుంటే రాజు/రాణిని కూడా పార్లమెంటు మార్చగలదు. సింహాసనమెక్కే వారు ఇంగ్లండ్ చర్చికి, ప్రొటస్టెంట్ సంప్రదాయాలకు విధేయులై ఉండాలి. జాతీయ గీతమూ మారుతుంది చార్లెస్ రాజు కావడంతో బ్రిటన్ జాతీయ గీతమూ మారనుంది. ఎలిజబెత్–2 హయాంలో 70 ఏళ్లుగా బ్రిటన్‌లో ‘గాడ్ సేవ్స్ ద క్వీన్’ అంటూ జాతీయ గీతాన్ని ఆలపించారు. ఇకపై అది ‘గాడ్ సేవ్ అవర్ గ్రేషియస్ కింగ్’ అంటూ మొదలవుతుంది. బ్రిటన్ రాచరికాన్ని లాంఛనంగా అంగీకరించే న్యూజిలాండ్‌కూ ఇదే జాతీయ గీతం కాగా ఆస్ట్రేలియా, కెనడాలకు రాయల్ ఆంథెమ్‌గా కొనసాగుతోంది. తరతరాలుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం కరెన్సీపై కూడా ఎలిజబెత్ బదులు ఇక చార్లెస్ ఫొటో వస్తుంది. అయితే ఇందుకు కొన్నేళ్లు పట్టవచ్చు. బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ పాస్‌పోర్టుల్లోనూ రాణి స్థానంలో రాజు పేరు వస్తుంది. బకింగ్‌హం ప్యాలెస్ బయట విధులు నిర్వహించే క్వీన్స్ గార్డ్ ఇకపై కింగ్ గార్డ్‌గా మారుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
క్వీన్ ఎలిజబెత్-2 ప్రస్థానంలో కీలక ఘట్టాలివే!
ఒక్కవైపు ప్రజాస్వామ్యం ఉన్నా.. బ్రిటిష్ రాజరిక పాలన కిందే కొనసాగుతూ వస్తోంది. అందునా బ్రిటన్ చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలంగా రాణిగా కొనసాగారు ఎలిజబెత్-II. బ్రిటన్ రాణిగా ఆమె పాతికేళ్ల వయసు(1952) నుంచి ఆ హోదాలో ఉన్నారు. తాజాగా.. ఆరోగ్యం విషమించిన పరిస్థితుల్లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూశారు. ఆమె రాణి ప్రస్థానం గమనిస్తే.. కీలక పరిణామాలకు మౌనసాక్షి 70 ఏళ్లకు పైగా పాలనా కాలంలో ఎలిజబెత్–2 రాణి ప్రపంచంలో యునైటెడ్ కింగ్డమ్ ప్రాభవం వేగంగా క్షీణించడం, ప్రపంచాన్ని ఒంటిచేత్తో పాలించిన బ్రిటన్ ఒక చిన్న ద్వీపదేశంగా మిగిలిపోవడం, ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో బ్రిటిష్ పాలన అంతం కావడం వంటి ముఖ్యమైన పరిణామాలను మౌనంగా వీక్షించారు. బ్రిటిష్ ఛత్రఛాయ కింద ఉన్న దేశాల్లో స్వతంత్ర దేశాలుగా అవతరించాయి. గణతంత్ర రాజ్యాలుగా మారాయి. కొన్ని సందర్భాల్లో రాజకుటుంబంలో చోటుచేసుకున్న పరిణామాలు ఎలిజబెత్ రాణికి ఇబ్బందికరంగా పరిణమించాయి. విమర్శలకు తావిచ్చాయి. ఆమె నలుగురి సంతానంలో ముగ్గురి వివాహాలు విచ్ఛిన్నమయ్యాయి. కోడలు డయానా విషయంలో నిర్దయగా ప్రవర్తించి, ఆమె మరణానికి కారణమయ్యారంటూ ఎలిజబెత్‌పై ప్రసార మాధ్యమాలు సంస్థలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. అయినప్పటికీ ఆమె ప్రతిష్ట దెబ్బతినలేదు. ఆటుపోట్ల సమయంలో బ్రిటన్ ప్రజలు మద్దతుగా నిలిచారు. ఎలిజబెత్–2 హయాంలో బ్రిటన్‌కు 15 మంది ప్రధానమంత్రులు సేవలందించారు. ఎలిజబెత్ కుమారుడు చార్లెస్‌ను బ్రిటన్ రాజుగా ప్రకటించే అవకాశం ఉంది. అదే జరిగితే ఆయన కింగ్ చార్లెస్–3గా పదవిలో కొనసాగుతారు. నిరాడంబర జీవితం క్వీన్ ఎలిజబెత్ నిరాడంబరంగా ఉండేందుకే ఇష్టపడేవారు. అధికారిక విధులు, కార్యక్రమాల్లోనూ హంగు ఆర్భాటాలకు దూరంగా ఉండేవారు. ప్రభుత్వ పరిపాలనా, ప్రజల బాగోగులపై ఎక్కువగా దృష్టి పెట్టేవారు. గుర్రాల పరుగు పందేలంటే రాణికి ఆసక్తి ఎక్కువ. రేసు గుర్రాలను పోషించేవారు. తరచుగా రేసులకు హాజరయ్యేవారు. ఆమె స్వయంగా మంచి రౌతు కూడా కావడం గమనార్హం. క్వీన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆస్తులున్నాయి. ప్రపంచంలోని అత్యంత ధనిక మహిళల్లో ఆమె ఒకరిగా గుర్తింపు పొందారు. ► ఎలిజబెత్-2.. ఏప్రిల్ 21వ తేదీ, 1926లో లండన్‌లోని 17 బ్రూటన్ స్ట్రీట్‌లో జన్మించారు. ► తల్లిదండ్రులు.. కింగ్ జార్జ్-6, క్వీన్ ఎలిజబెత్ ► గ్రీస్ యువరాజు, నేవీ లెఫ్టినెంట్ ఫిలిప్ మౌంట్‌బాటెన్‌ను 1947లో ఆమె వివాహం చేసుకున్నారు. వీళ్లకు.. ప్రిన్స్ ఛార్లెస్, ప్రిన్సెస్ అన్నె, ప్రిన్స్ ఆండ్రూ, ప్రిన్స్ ఎడ్వర్డ్ సంతానం. ► 1952, ఫిబ్రవరి 6వ తేదీన తండ్రి మరణించడంతో వారసురాలిగా ఆమె ప్రకటించబడ్డారు. అయితే ఆ టైంకి ఆమె రాయల్ టూర్లో కెన్యాలో ఉన్నారు. ఏడాది తర్వాత జూన్ 2వ తేదీన ఆమె వెస్ట్మిన్స్టర్ అబ్బేలో బ్రిటన్‌కు రాణిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ► క్వీన్ ఎలిజబెత్-2 పట్టాభిషేకానికి.. సోవియట్ యూనియన్, చైనా, యునైటెడ్ స్టేట్స్ నుంచి జోసెఫ్ స్టాలిన్, మావో జెదాంగ్, హ్యారీ ట్రూమన్ హాజరయ్యారు. అప్పుడు బ్రిటన్ ప్రధానిగా విన్స్టన్ చర్చిల్ ఉన్నారు. ► 15 మంది ప్రధానులు.. ఈమె హయాంలో బ్రిటన్‌కు పని చేశారు. అమెరికాకు 14 మంది అధ్యక్షులు పని చేశారు. అందులో లిండన్ జాన్సన్‌ను తప్ప ఆమె అందరినీ కలిశారు. ► యునైటెడ్ కింగ్‌డమ్‌తోపాటుగా పద్నాలుగు దేశాల సార్వభౌమత్వం ఈమె చేతిలోనే ఉంది. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, జమైకా, ఆంటిగ్వా, బార్బుడా, బెహమస్, బెలిజే, గ్రెనెడా, పాపువా న్యూ గినియా, సోలోమన్ ఐల్యాండ్స్, సెయింట్ కిట్స్ అండ్ నేవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, ది గ్రెనాడైన్స్, తువాలుకు కూడా క్వీన్ ఎలిజబెత్-2 మహారాణిగా వ్యవహరిస్తున్నారు. ► ప్రపంచ చరిత్రలో రాచరిక వ్యవస్థలో అత్యధిక కాలం పాలించిన వారిలో బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 రెండో స్థానానికి చేరారు. ఈ విషయంలో ఇప్పటి వరకు సెకండ్ ప్లేస్‌లో ఉన్న థాయ్‌లాండ్ రాజు భూమి బోల్ అదుల్యదేజ్ (1946-2016 మధ్య 70 ఏండ్ల 126 రోజులు పాలన చేశారు)ను ఎలిజబెత్-2 దాటేశారు. మొదటి స్థానంలో ఫ్రాన్స్‌కి చెందిన లూయిస్-14 (1643-1715 మధ్య కాలంలో 72 ఏండ్ల 110 రోజులు) ఉన్నారు. ► 2015 నాటికే ఎలిజబెత్-2 ఇప్పటికే క్వీన్ విక్టోరియాను దాటేసి బ్రిటన్ పాలకురాలిగా అత్యధిక కాలం ఉన్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ► భర్త ఫిలిప్ 2021 ఏప్రిల్‌లో కన్నుమూశారు. ► ఫిబ్రవరి 6, 2022న ఆమె సింహాసం అధిరోహించి 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ప్లాటినమ్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ► అనారోగ్యంతో ఆమె మరణించిన క్రమంలో ‘‘లండన్ బ్రిడ్జ్ ఈజ్ డౌన్’’ అని కోడ్ భాషలో ప్రకటించింది బకింగ్ హామ్ ప్యాలస్. ఆపరేషన్ లండన్ బ్రిడ్జి పేరిట ఇప్పటికే ఆమె మృతి అనంతర పరిస్థితులను ఎలా ఎదుర్కొవాలో ఇప్పటికే సిద్ధపడ్డారు అధికారులు. ► ఎలిజబెత్-II తర్వాత ఆమె కొడుకు ప్రిన్స్ ఛార్లెస్ ను బ్రిటన్ రాజుగా ప్రకటించే అవకాశం ఉంది. ఆయన బ్రిటన్ రాజుగా బాధ్యతలు స్వీకరిస్తే కింగ్ చార్లెస్ III పేరుతో కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
కరోనా: బ్రిటన్ రాణి వీడియో సందేశం
లండన్ : ‘అందరం కలిసి కట్టుగా కరోనాను ఎదుర్కొంటున్నాం. ఇకమీదట కూడా ఇలాంటి ఐక్యతను ప్రదర్శించినట్లైతేనే దాన్నుంచి బయటపడగలుగుతామ’ని బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 వ్యాఖ్యానించారు. బ్రిటన్‌లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో జాతిని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. విండ్సర్ క్యాసిల్‌లో చిత్రీకరించిన వీడియోను ఆదివారం ఆమె విడుదల చేశారు. ఆ వీడియోలో.. ‘‘మంచి రోజులు వస్తాయి. మనం మన స్నేహితులు, కుటుంబసభ్యులతో కలుసుకునే రోజులు. మనం మళ్లీ కలుసుకుంటామ’’ని అన్నారు. అనంతరం రెండవ ప్రపంచ యుద్ధ సమయాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘‘ నేను మొదటిసారి వీడియో తీసుకున్న రోజులు గుర్తుకొస్తున్నాయి. 1940లో మా అక్క ఆ వీడియోను తీసింది. అప్పుడు మేము చిన్న పిల్లలం. యుద్ధ సమయంలో ఇళ్లకు దూరమై బాధపడుతున్న పిల్లలను ఉద్ధేశించి ఆ వీడియోలో మాట్లాడాను’’ అని చెప్పారు. ( కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు ) ఆమె తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ ఈ రోజు చాలా మంది తమ ప్రియమైన వారికి దూరమై మరోసారి బాధపడుతున్నారు. కరోనా వైరస్‌పై పోరాటంలో మనం కచ్చితంగా విజయం సాధిస్తాం. ఈసారి ప్రపంచ దేశాలతో కలిసి మనం పోరాడుతున్నాం. అత్యాధునికమైన సైన్స్ మనకు అండగా ఉంది. మన స్వభావసిద్ధమైన కోలుకునే శక్తితో మనం కచ్చితంగా విజయం సాధిస్తాం. ఆ విజయం మనలోని ప్రతీ ఒక్కరికి చెందుతుంద’’ని అన్నారు. కాగా, బ్రిటన్‌లో ఇప్పటివరకు 47,806 మంది కరోనా వైరస్ బారిన పడగా.. 4,934 మంది మరణించారు. -
ఫొటో 1 తరాలు 4
లండన్: కొత్త దశాబ్దం ప్రారంభం సందర్భంగా బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ శనివారం తన వారసులతో కలసి దిగిన ఫొటోను విడుదల చేశారు. అందులో రాణి సహా నాలుగు తరాల రాజరికం ఉంది. గతంలో 2016లో ఆమె 90వ పుట్టిన రోజు సందర్భంగా ముగ్గురు వారసులతో కలసి ఫొటో దిగగా, ఇప్పుడు విడుదల చేసింది రెండో ఫొటో కావడం గమనార్హం. ఇప్పటి ఫొటోలో కూడా రాణి కుమారుడు ప్రిన్స్ చార్లెస్, మనవడు ప్రిన్స్ విలియం, ముని మనవడు ప్రిన్స్ జార్జ్‌లు ఉన్నారు. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో క్రిస్మస్ పండుగకు వారంముందు ఈ ఫొటోను తీశారు. ఇందులో రాణి తెలుపు గౌన్ ధరించారు. ఆమెకు ఇరు వైపులా రాజకుమారులు ఉన్నారు. -
ఆమెతో ట్రంప్ తింగరి చేష్టలు
బ్రిటన్ ప్రధానితోసహా దేశం మొత్తం గౌరవించే లండన్ రాణి ముందు.. అమెరికా అధ్యక్షుడు చేసిన ఓ ఫీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. తీవ్ర నిరసనల మధ్యే డొనాల్డ్ ట్రంప్ యూకే పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం విండ్సోర్ క్యాసల్లో రెడ్ కార్పెట్‌పై ట్రంప్.. క్వీన్ ఎలిజబెత్-2(ఎలిజబెత్ అలెగ్జాండ్ర మేరీ)తో కలిసి సైనిక వందనం స్వీకరించారు. కార్పెట్‌పై నడుస్తున్న సమయంలో రాణిని దాటేసి.. ట్రంప్ ముందుకు నడుచుకుంటూ వెళ్లారు. ఆ వెంటనే ఒక్కసారిగా ఆగి ఆమె కోసం వెనక్కి తిరగ్గా.. పక్కనుంచి క్వీన్ ముందుకొచ్చేశారు. ఇది సాధారణంగా అనిపించినప్పటికీ.. యూకే వాసుల మనోభావాలను మాత్రం దెబ్బతీసింది. ‘రాణిని దాటి ముందుకెళ్తావా? ఎంత ధైర్యం.. మహామహులే రాణి ముందు మోకరిల్లుతారు? నువ్వెంత.. అసలే నీ మీద కాకతో ఉన్నాం, ఇలాంటి సమయంలో తింగరి చేష్టలు చేస్తావా?’ అంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. 1992లో అప్పటి ఆస్ట్రేలియా ప్రధాని పౌల్ కేటింగ్ రాణి వెనకాల చెయ్యేసి ఫోటోలకు ఫోజులు ఇవ్వగా.. ఆయన్ని తీవ్రంగా విమర్శిస్తూ కథనాలు వెలువడ్డాయి. నిరసనల మధ్యే... ఇదిలా ఉంటే ట్రంప్ పర్యటనను నిరసిస్తూ లండన్‌లో పెద్ద ఎత్తున్న నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. ట్రంప్ లండన్‌లో అడుగుపెట్టే కొద్దిగంటల ముందు ట్రఫల్గర్ స్క్వేర్‌లో ట్రంప్ ముఖంతో ఉన్న ఆరెంజ్ బెలూన్ను ఎగరేసి నిరసనకారులు ప్రదర్శన నిర్వహించారు. గో బ్యాక్ అంటూ నినాదాలతో పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగాయి. -
రాణిగారి పాదాలు
గ్రౌండ్ అప్ ఈవారం విశేషాల రౌండప్ తొంభై ఏళ్ల బ్రిటన్ మహారాణి రెండో ఎలిజబెత్‌కు కొత్త కొత్త దుస్తులన్నా, కొత్త షూలు అన్నా మహా ప్రీతి. మామూలే! ప్రతి మహిళకూ ఉండే ఇష్టాలే. కానీ కొత్త షూలకు గానీ, కొత్త చెప్పులకు గానీ... రాణిగారి పాదాలకు, సాధారణ మహిళ పాదాలకు మధ్య తేడా తెలీదు. ఇద్దరి పాదాలను వివక్ష లేకుండా సమానంగా కొరికేస్తాయి. ‘షూ బైట్’ అన్నమాట! అందుకే... ఎలిజబెత్ మహారాణికి షూ బైట్ సమస్య లేకుండా రాజప్రాసాదం గత వారం ఒక ‘ఫుట్ ఉమన్’ని నియమించింది. ఆమె పని... రాణిగారి పాదాలకు సదుపాయంగా, సౌకర్యవంతంగా ఉండేలా కొత్త షూలను మెత్త బరచడం. అంటే ముందు ఈవిడ తొడుక్కుని వాటిని కరకుదనం పోగొట్టాక, రాణిగారు తొడుక్కుంటారు. వచ్చే శుక్రవారం (ఏప్రిల్ 21) మహారాణి బర్త్ డే. రాణిగారి పుట్టిన రోజు వేడుకలకు బ్రిటన్‌తో పాటు, రాణిగారూ సిద్ధం అవుతున్నారు. కొత్త షూలను కూడా అందుకోసమే కొన్నారా అన్నది తెలీదు. ఒక అన్న... ఒక చెల్లి యు.ఎస్.లోని ఆహియో ప్రాంతంలో తూర్పుపాలస్తీనా అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఇద్దరు అన్నాచెల్లెళ్లు ఉన్నారు. అన్నకు 8 ఏళ్లు. చెల్లికి 4 ఏళ్లు. చెల్లికి బర్గర్ తినాలనిపించింది. అన్నయ్యకు చెప్పింది. ‘మెక్‌డొనాల్డ్స్’లో బర్గర్ బాగుంటుందన్నయ్యా’ అని కూడా చెప్పింది. మెక్‌డీ... వాళ్లింటికి దగ్గర్లో లేదు. కొంచెం దూరంలో ఉంది. అన్నయ్య ఆలోచించాడు. ‘పద వెళ్దాం’ అన్నాడు. పోర్టికోలో కారు ఉంది. అమ్మానాన్న నిద్రపోతున్నారు. పోర్టికో లోంచి మెల్లిగా కారు బయటికి తీసాడు అన్నయ్య. పక్క సీట్లో చెల్లినికూర్చోబెట్టుకున్నాడు. కారు స్టార్ట్ చేశాడు. మెక్‌డీ వైపు డ్రైవ్ చేశాడు. ఒకటిన్నర కిలోమీటరు దూరం వెళ్లాడు. మధ్యలో నాలుగు క్రాసింగులు ఉన్నాయి. రైల్ రోడ్డు ట్రాకులు ఉన్నాయి. వాటినీ దాటేశాడు. తర్వాత రెండు రైట్లు, ఒక లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు. ఈ మలుపుల దగ్గర ఎవరో... కారు లోపల ఉన్న అన్నాచెల్లెళ్లను చూసి వెంటనే పోలీసులకు అప్పగించారు. తెలిసిన వాళ్లెవరో వచ్చి విడిపించుకెళ్లారు. విశేషం ఏమిటంటే.. ఈ అన్నగారు ఎక్కడా రోడ్డు రూల్స్ అతిక్రమించలేదనీ, స్పీడ్‌లిమిట్ దాట లేదని ట్రాఫిక్ పోలీసులు మురిసిపోతున్నారు. యు.ఎస్. రూల్స్ ప్రకారం బాల నేరస్థుల పేర్లను బయటపెట్టరు, కాబట్టి వీళ్ల పేర్లు తెలీవు. ఒక అన్న. ఒక చెల్లి. అంతే. పేపర్ బాయ్ ‘ది లీడర్ హెరాల్డ్’ అనే పత్రిక సర్క్యులేషన్ 7,500. మధ్యాహ్నపు దిన పత్రిక. న్యూయార్క్ లోని గ్లోవర్స్విల్ ప్రాంతంలో ప్రింట్ అవుతుంది. సర్క్యులేషన్ తక్కువే కానీ బాగా పేరున్న పేపర్. అందులో పని చేస్తున్న మెల్ రూలిసన్ అనే ఒక సాధారణ ఉద్యోగి కారణంగా ఈ పత్రిక ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. ఇంతకీ మెల్ ఏం చేశాడు? పని చేశాడు. ఏ ఉద్యోగి అయినా పనే కదా చేస్తాడు. అందులో విశేషం ఏముంటుంది? మెల్ పదవీ విరమణ చేశాడు. ఉద్యోగం అన్నాక ఎప్పుడో ఒక రోజు రిటైర్ కావలసిందే కదా? ఇందులో వింతేముంది? ఉంది. వింతా, విశేషం కాదు కానీ... అంకితభావం ఉంది. మెల్ రూలిసన్ 57 ఏళ్లుగా ఆ పేపర్‌కు రూట్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం రిటైర్ అయ్యాడు. రిటైర్ అయ్యేనాటికి... ఈ 57 ఏళ్లలో మెల్ 50 లక్షల కాపీలు డెలివరీ చేశాడని పత్రిక యాజమాన్యం అభినందించింది. రోజుకు అతడు 220 నుంచి 300 కాపీలు డెలివరీ చేసేవాడట. సో... ‘ది లీడర్ హెరాల్డ్’ లో పని చేసిన ‘లీడర్ హెరాల్డ్’ అన్నమాట మన హీరో ఎంప్లాయి. లీడర్ హెరాల్డ్ అంటే ముందుండి నడిపినవాడు. ఇలాంటి సిబ్బంది ఉంటే కంపెనీలే కాదు, దేశం కూడా ‘హీరో ఆఫ్ ద నేషన్స్’ అవుతుంది. అభినందనలు మెల్ రూలిసన్. రెండో ఉద్యోగం ఒక ఉద్యోగి ఒక ఉద్యోగమే చెయ్యాలి. అది నియమం. అది నిబంధన. అది నీతి. అయితే కొందరు రెండో ఉద్యోగమూ చేస్తుంటారు. అది మానవ నైజం. యు.ఎస్. నేవీలో ‘సీల్’ అనే విభాగం ఉంది. అందులో ఉద్యోగం అంటే.. మాటలు కాదు. ఆటలు కాదు. పాటలు కాదు. సినిమా కూడా కాదు. అంత సీరియస్! అయితే అందులో చీఫ్ స్పెషల్ వార్ఫేర్ ఆఫీసర్ గా పనిచేస్తున్న జోసెఫ్ ష్మిట్ కొన్నాళ్లుగా ఎవరికీ తెలియకుండా, అందరికీ తెలిసేలా రెండో ఉద్యోగం చేసేస్తున్నాడు! అది బయటపడి ఆయనపై ఇప్పుడు విచారణ జరుగుతోంది. జోసెఫ్ చేస్తున్న రెండో ఉద్యోగం.. పోర్న్ చిత్రాల్లో నటించడం. ‘జే ఊమ్’ పేరుతో ఇప్పటికి ఆయన 29 సెక్స్ చిత్రాల్లో నటించాడు. ఆ వీడియోలు చూసిన వాళ్లెవరో సీల్‌కి ఉప్పందించారు. ఏడేళ్లుగా జోసెఫ్ ఈ రెండో ఉద్యోగం చేస్తున్నాడట. ఆయన భార్య జెవెల్స్ జేడ్ ఆల్రెడీ ఓ పోర్న్ స్టార్. ఆ సంగతి కూడా యు.ఎస్.నేవీ అధికారులకు ఇప్పుడే తెలిసింది! భార్యాభర్తలిద్దరూ కలిసి నటించినవి కూడా ఈ చిత్రాలలో ఉన్నాయట! జోసెఫ్గారి రెండో ఉద్యోగం.. మొదటి ఉద్యోగానికే ముప్పుతెచ్చేలా ఉందిప్పుడు. చికెన్ చిన్నయ్య యు.ఎస్.లోని నెవాడలో ఉంటున్న 16 ఏళ్ల కార్టర్ విల్కెర్సన్కు ఇప్పుడు కోటీ 80 లక్షలు కావాలి! అంత మొత్తాన్నీ సంపాదిస్తే అతడు ఒక ఏడాదంతా ఉచితంగా చికెన్ ముక్కలు తినేయొచ్చు. నాలుగు రాళ్ల కోసం కొండనే తవ్వాలా? రోజుకు రెండు ముక్కల చికెన్ కోసం అన్ని డాలర్లు పోగేసుకోవాలా?! ఇదేనా మీ డౌటు? అసలు విషయం ఏంటంటే.. కోటీ 80 లక్షలు అన్నవి డాలర్లు కాదు. రీ ట్వీట్లు! కార్టర్ విల్కెర్సన్ రోజూ వెళ్లి ఇష్టంగా చికెన్ తింటున్న వెండీస్ రెస్టారెంట్లో (మన వెంకీస్ రెస్టారెంట్లా ఉంది కదా) ఒక ఆఫర్ ఉంది. కస్టమర్లు ఎవరైనా కోటీ 80 లక్షల రీట్వీట్లు సంపాదించగలిగితే 365 రోజుల పాటు ఫ్రీగా వెండీస్లో చికెన్ నగెట్స్ లాగించేయొచ్చు. ఈ ఆఫర్ కార్టర్ నోరు ఊరించింది. వెంటనే పనిలో పడిపోయాడు. ఫ్రీ ఆఫర్ గురించి రెస్టారెంట్లో మేనేజర్‌కీ, తనకు జరిగిన సంభాషణ స్క్రీన్ షాట్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేసి ఏ్ఛ p ఝ్ఛ p ్ఛ్చట్ఛ, ్చ ఝ్చn n్ఛ్ఛఛీటజిజీటnuజజటఅని పెట్టి, ఈ ట్వీట్‌కు, రీ–ట్వీట్ పంపండి అని అభ్యర్థించాడు. ఇది జరిగి వారం కావస్తోంది. ఇంత వరకు కార్టర్ ఏమీ మాట్లాడలేదంటే.. అనుకున్నన్ని రీట్వీట్లు రావడానికి ఇంకా టైమ్ పట్టేలా ఉంది. పది లక్షలు చోరీ ఆస్ట్రియా రాజధాని వియన్నాకు దక్షిణం వైపున ఉన్న ఎబ్రీస్డార్ఫ్ అనే చిన్న గ్రామంలో పెద్ద చోరీ జరిగింది. ఏప్రిల్ 11న దొంగలొచ్చి నలభై పెట్టెల్ని పట్టుకుపోయారు. వాటిలో ఏముంది? మణులున్నాయా? మాణిక్యాలున్నాయా? యూరోలున్నాయా? రోమన్ కాలం నాటి బంగారు నాణేలు ఉన్నాయా? అంతకంటే విలువైనవే ఉన్నాయి. హార్స్›్టఅనే రైతు పెంచుకుంటున్న పది లక్షల తేనెటీగలు ఉన్నాయి! తేనెటీగలతో పాటు, వాటిల్లోని రాణి తేనెటీగల్నీ, తేనె సీసాల్నీ దుండగులు పట్టుకుపోయారని హార్స్›్ట లబోదిబోమంటున్నాడు. దొంగల్ని పట్టుకునేందుకు పోలీసులు ఇప్పుడు వియన్నాలోని చెట్టూపుట్టా గాలిస్తున్నారు. తిక్క.. తిరిగొచ్చింది చెక్కు మీద ఏం ఉంటుంది? అమౌంట్ ఉంటుంది. చెక్కు ఎవరికి ఇవ్వాలో వాళ్ల పేరు ఉంటుంది. డేట్ ఉంటుంది. చెక్కు ఇచ్చిన వారి సంతకం ఉంటుంది. ఇవన్నీ ఉన్నా కూడా స్కాట్ డియాన్ అనే ఆయన ఇంటి పన్ను కోసం ఇచ్చిన 48 వేల రూపాయల (745 డాలర్లు) చెక్కు వాపస్ వచ్చింది! ‘నా అకౌంట్లో డబ్బులు ఉన్నాయి కదా! చెక్కు ఎందుకు బౌన్స్ అయింది?’ అని స్కాట్ బోలెడంత ఆశ్చర్యపోయాడు. ‘అకౌంట్‌టో డబ్బులు ఉంటే సరిపోదు, నీక్కొంచెం బుద్ధి కూడా ఉండాలి’ అని లోకల్ ట్రెజరీ అధికారి నుంచి సమాధానం వచ్చింది! విషయం ఏంటంటే.. చెక్కు మీద ఉండే మెమో లైన్లో స్కాట్ గారు ‘ఆస్తి పన్నుకోసం’ అని కాకుండా, ‘ఫర్ సెక్సువల్ ఫేవర్స్’ అని రాసి పంపారు. (మీరిచ్చిన సుఖానికి ప్రతిఫలంగా అని), దాంతో ఆ చెక్ పాస్ చేసేవాళ్ల కోపం నషాళానికి అంటింది. స్కాట్.. యు.ఎస్.లోని మాంటానా నివాసి. అతడి చెక్కులు ఎప్పుడూ అలాగే ఉంటా యని చుట్టుపక్కల వాళ్లు ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారట. -
కోహినూర్ దేనికి ప్రతీక?!
యాదృచ్ఛికమే కావొచ్చుగానీ...బ్రిటన్ రాణి ఎలిజెబిత్ 90వ పుట్టినరోజు జరుపు కుంటున్న సమయంలోనే అత్యంత విలువైన, అపురూపమైన కోహినూర్ వజ్రంపై మన దేశంలో పెను దుమారం మొదలైంది. ప్రస్తుతం బ్రిటన్ అధీనంలో ఉన్న ఆ వజ్రాన్ని వెనక్కు ఇవ్వమని అడగటం సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభు త్వం తెలియజేయడం ఈ దుమారానికి మూలం. ‘బ్రిటన్ పాలకులు దాన్ని బలవం తంగా గానీ, దొంగిలించిగానీ తీసుకెళ్లలేదు. బహుమతిగా పొందారు. కనుక తిరిగి వ్వాలని అడగలేం’అని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ విషయంలో వెల్లువెత్తిన ఆగ్రహావేశాలను గమనించి 24 గంటలు గడవక ముందే కేంద్రం తన వైఖరిని మార్చుకుంది. ‘సామరస్య ధోరణి’లో దాన్ని తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తామని తెలిపింది. ఆ వజ్రం పొదిగివున్న బ్రిటన్ మహారాణి కిరీటం ప్రస్తుతం లండన్ మ్యూజియంలో కొలువై ఉంది. అదొక్కటే కాదు...500 కిలోల బరువుతో 2.3 మీటర్ల ఎత్తుతో ఉండే సుల్తాన్‌గంజ్ బుద్ధ విగ్రహం సైతం బ్రిటన్ అధీనంలోనే ఉంది. అలాంటివి ఇంకా అనేకం ఉన్నాయి. చరిత్రను మనకిష్టం వచ్చినట్టు మార్చలేం. మన అభిప్రాయాలకు తగ్గట్టు మల చలేం. అయితే చరిత్రలో జరిగిన తప్పుల్ని తప్పులుగా అంగీకరించడం ద్వారా, క్షమాపణ కోరడంద్వారా ...తగిన పరిహారం చెల్లించడం ద్వారా కొంతవరకూ సరి చేసుకోవచ్చు. అలా చేస్తే ఆ తప్పుల పర్యవసానంగా బాధితులైనవారి వారసులకు సాంత్వన లభిస్తుంది. స్వీయ తప్పిదాలను గుర్తించడం, సరిచేసుకోవడం పరిణతి చెందిన వ్యక్తిత్వానికి, మనస్తత్వానికి చిహ్నం. అలాంటి వారిని మన్నించడమైనా అంతే...ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం. న్యూజిలాండ్‌లోని ఆదిమజాతులపై 1840లో సాగించిన దౌష్ట్యానికి బ్రిటన్ రాణి 1995లో క్షమాపణ కోరారు. చైనాలో సాగించిన అరాచకాలపై, నరమేథంపై జపాన్ చక్రవర్తి, ప్రధాని చైనా ప్రజలకు క్షమాపణ చెప్పారు. 200 ఏళ్లపాటు సాగించిన వలస పాలనలో ప్రజలను ఉక్కు పాదాలకింద అణచి ఉంచి, ఇక్కడి సంపదను సర్వస్వం దోచుకుపోయిన బ్రిటన్ మనకు మాత్రం ఇంతవరకూ క్షమాపణ చెప్పలేదు. ఎందరో వీరుల్ని ఉరికంబం ఎక్కించినందుకూ, ఎన్కౌంటర్ల పేరుతో కాల్చిచంపినందుకూ, లక్షలాదిమందిని జైళ్లపాలు చేసినందుకూ అది పశ్చాత్తాపం ప్రకటించలేదు. కనీసం కోహినూర్ లాంటి అపురూపమైన వస్తువుల్ని తిరిగివ్వడానికైనా అది ముందుకు రావడం లేదు. కోహినూర్ ఈ దేశ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న అనేకానేక అం శాల్లో ఒకటి. అది ఇక్కడి తరగని సంపదలకూ, విలువైన వనరులకూ ప్రతీక మాత్రమే కాదు... రెండు శతాబ్దాలపాటు అడ్డూ ఆపూ లేకుండా సాగిన వలస దోపి డీకి కూడా చిహ్నం. పర్షియన్ భాషలో కోహినూర్ అంటే ‘కాంతి శిఖరం’ అని అర్ధం. దాని వేయేళ్ల చరిత్రను గమనిస్తే ఆ పేరు దానికి అన్ని విధాలా సరిపోతుం దనిపిస్తుంది. మన పురాణగాధల్లోని శమంతకమణి కథకు ఉన్న మలుపులన్నీ కోహినూర్‌కు కూడా ఉన్నాయి. కాకతీయుల ఏలుబడి కొనసాగుతున్న దశలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా పరిటాల దగ్గర లభ్యమైన ఆ వజ్రం ఎందరెం దరో చేతులు మారింది. మహమ్మద్ బీన్ తుగ్లక్ సేనలు వరంగల్‌ను ముట్టడించి నప్పుడు 793 క్యారట్ల(158.6 గ్రాముల) ఆ వజ్రం ఢిల్లీకి చేరింది. ఆ తర్వాత నాదిర్ షా నెమలి సింహాసనంతోపాటు దాన్ని కూడా ఎత్తుకెళ్లాడు(నెమలి సింహా సనం ప్రస్తుతం ఇరాన్ దగ్గరుంది). అఫ్ఘానిస్తాన్‌పై దండెత్తి లాహోర్ కేంద్రంగా పం జాబ్‌ను పాలించిన రంజిత్‌సింగ్ కోహినూర్‌ను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. తన మరణానంతరం పూరీలోని జగన్నాథాలయానికి అప్పగించమని వీలునామా కూడా రాశాడు. 1843లో ఆయన మరణించాక కుమారుడు అయిదేళ్ల దలీప్ సింగ్‌ను రాజుగా ఉంచి తల్లి పాలనా బాధ్యతలు నిర్వహించిన కొన్నాళ్లకు రాజ్యంలో కల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. దాన్ని చక్కదిద్దే సాకుతో ఈస్టిండియా కంపెనీ రంగ ప్రవేశం చేసి, సిక్కుల తిరుగుబాటును అణిచి ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంది. దలీప్ పదమూడేళ్ల బాలుడిగా ఉండగా ఈస్టిండియా కంపెనీ ప్రతి నిధులు అతన్ని ఇంగ్లండ్‌కు వలస తీసుకుపోయి అతనితోనే బ్రిటిష్ రాణికి కోహినూర్ వజ్రాన్ని బహుకరించే ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు ముందు అది ‘బహుమతి’ అని కేంద్రం చెప్పింది ఈ కారణంతోనే! బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ఇద్దరు సమాన స్థాయి వ్యక్తులు లేదా స్వతంత్ర వ్యక్తుల మధ్య మాత్రమే ఉంటుంది. ఆ ఇద్దరిలో స్వీకరించేవారు యజ మానిగా లేదా అజమాయిషీ చెలాయించేవారిగా...‘ఇచ్చేవారు’ బానిసగా ఉన్న ప్పుడు దాన్ని ‘బహుమతి’ అనరు. అందుకు దోపిడీ, దొంగతనంలాంటి వేరే పేర్లు న్నాయి. వలస పాలకుల వారసుల పరిభాష వేరే ఉండొచ్చు. వలస దోపిడీకి గురైన వారిగా మనం ఏం మాట్లాడాలో...ఏం మాట్లాడుతున్నామోనన్న స్పృహ కలిగి ఉం డాలి. సొలిసిటర్ జనరల్ రంజిత్‌కుమార్‌కు ఈ విషయంలో సూచనలిచ్చిన మహా నుభావులకు ఆ స్పృహ లోపించినట్టు కనబడుతోంది. బ్రిటన్‌ది ఈ విషయంలో ఒకే వాదన. ‘అలా తిరిగివ్వడానికి మా చట్టాలు అంగీకరించవ’న్నదే ఆ వాదన సారాం శం. 1963లో ఆ దేశం బ్రిటిష్ మ్యూజియం చట్టం పేరిట ఒక శాసనాన్ని తెచ్చింది. దాని ప్రకారం జాతీయ మ్యూజియంలో కొలువై ఉన్న వస్తువుల్ని తిరిగిచ్చేందుకు వీలుకావడం లేదని బ్రిటన్ వాదిస్తోంది. ఈ బాపతువాదాన్ని మర్కట తర్కం అం టారు. దొంగిలించిన వస్తువులన్నిటినీ బాహాటంగా ఓ మ్యూజియంలో పెట్టుకోవ డమే సిగ్గుమాలినతనం. వాటిని ఇచ్చేది లేదంటూ చట్టం తెచ్చుకోవడం ఆ సిగ్గుమా లినతనానికి పరాకాష్ట. ఇవ్వడానికి అది అడ్డంకిగా మారిందంటూ చెప్పడం వం చన. మన దేశం 1948 నుంచీ ఈ కోహినూర్ వజ్రాన్ని తిరిగివ్వాలని అడుగుతోంది. మరికొన్ని ఇతర దేశాలు కూడా వారి వారి వస్తువులు తిరిగివ్వాలని కోరారు. వీట న్నిటినీ దృష్టిలో పెట్టుకునే 1963లో మ్యూజియం చట్టం తీసుకొచ్చారన్నది దాచేస్తే దాగని సత్యం. కోహినూర్‌తో మన పేదరికం పోతుందా... మన సమస్యలన్నీ తీరి పోతాయా...దానికోసం ఎందుకంత రాద్ధాంతమని కొందరు తర్కం లేవదీస్తు న్నారు. అలాంటి సమస్యల పరిష్కార సాధనలో కావలసిన సొంత వ్యక్తిత్వానికీ, రాజీపడని తత్వానికీ కోహినూర్ తిరిగి పొందడమన్నది ఒక చిహ్నం. అందుకోసం కావాలి మనకు కోహినూర్! ఈ విషయంలో వైఖరి మార్చుకోవడమే కాదు...దాన్ని సాధించేదాకా అన్ని స్థాయిల్లోనూ ఎన్డీఏ ప్రభుత్వం పోరాడుతుందని ఆశిద్దాం. -
వేలానికి రాణి ‘ప్రేమ’ లేఖ
లండన్: బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్, యువరాజు ఫిలిప్‌తో తన ప్రేమ గురించి పుస్తక రచయిత బెట్టీ స్పెన్సర్‌కు రాసిన అరుదైన లేఖను వచ్చేవారం వేలం వేయనున్నారు. రెండు పేజీలున్న ఈ లేఖలో వారు ప్రేమలో ఎలా పడ్డారో ఆమె రచయితకు చెప్పారు. ఇది 1947లో, ఫిలిప్, ఎలిజబెత్‌ల వివాహానికి కొద్ది రోజుల ముందు రాసిన లేఖ. ఏప్రిల్ 23న దీన్ని వేలం వేయనున్నారు. -
స్కాట్లాండ్ వాసులకు బ్రిటన్ రాణి సూచన
జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి లండన్: బ్రిటన్ నుంచి స్వతంత్రం ప్రకటించుకునే అంశంపై ఈ నెల 18న స్కాట్లాండ్లో జరగనున్న రిఫరెండమ్‌పై బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ ఎట్టకేలకు మౌనం వీడారు. స్కాట్లు ఓటేసే ముందు తమ భవిష్యత్తు గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించాలని సూచించారు. ఆమె ఆదివారం స్కాట్లాండ్లోని ఓ చర్చిలో తన అభిమానులనుద్దేశించి మాట్లాడారు. రిఫరెండమ్‌లో స్వాతంత్య్రం వద్దని ఓటేసేలా కోరాలని సమైక్యవాదులు తనను కోరడం, ఈ విషయంలో తన జోక్యం కోసం బ్రిటన్ రాజకీయ నేతలు ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఆమె స్పందించారు. -
ఇంగ్లండ్ రాణికీ ఆర్థిక కష్టాలు..!
లండన్: ఇంగ్లండ్.. ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన దేశం. గత వైభవానికి గౌరవ చిహ్నంగా నేటికీ అక్కడ రాచరిక వారసులు కొనసాగుతున్నారు. అయితే ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్ 2 ప్యాలెస్ నిర్వహణ కోసం కేటాయించిన నిధులు గతంలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి పడిపోయాయి. కేవలం పది కోట్ల రూపాయిల నిధులు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఇంగ్లండ్ కామన్స్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నివేదిక ఈ విషయాల్ని వెల్లడించింది. నిధుల్ని సద్వినియోగంగా వాడుకోవడం, తగినంత నిల్వ ఉంచడంలో రాణి సలహాదారులు విఫలమయ్యారని అకౌంట్స్ కమిటీ దుయ్యబట్టింది. 2001లో రాణి ప్యాలెస్ నిధులు 350 కోట్ల రూపాయిలు ఉండగా నేడు పది కోట్ల రూపాయిలకు దిగజారినట్టు పేర్కొంది. ట్రెజరీ వెంటనే గాడిన పెట్టాల్సిన అవసరముందని కమిటీలో ఉన్న ఓ ఎంపీ చెప్పారు. ప్యాలెస్ ఆర్థిక ప్రణాళిక, పర్యవేక్షణ వ్యవహారాలను పునఃసమీక్షించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. -
క్వీన్ ఎలిజబెత్ ను కలిసిన మలాలా!
తాలిబాన్ ఉగ్రవాదుల తూటాలకు ఎదురొడ్డిన సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్ శుక్రవారం బ్రిటన్ రాణి ఎలిజబెత్ ను బంకింగ్ హమ్ ప్యాలెస్ లో కలిశారు. ఇటీవల తాను రాసిన ఐ యామ్ మలాలా అనే పుస్తకాన్ని క్వీన్ ఎలిజబెత్ కు అందించారు. కామన్ వెల్త్ యూత్ అండ్ ఎడ్యుకేషన్ కోసం ఏర్పాటు చేసిన రిసెప్షన్ కు రావడం తనకు లభించిన గొప్ప గౌరవం అని ఎలిజబెత్ కు మలాలా తెలిపింది. విద్యనభ్యసించడానికి ఎదురైన ఇబ్బందులను ఎలిజబెత్ దృష్టికి తీసుకువచ్చింది. ప్రతి ఒక్కరికి విద్యను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మలాలా అభిప్రాయం పడినట్టు తెలిసింది.