Emperor
-
షాజహాన్‌కు ‘మసాలా పిచ్చి’ ఎందుకు పట్టింది?
మొఘల్ చక్రవర్తులు అటు యుద్ధమైదానాలు, ఇటు అంతఃపురాలపై ప్రత్యేక దృష్టి సారించేవారు. దీనితో పాటు ఆహార విభాగంలోనూ వివిధ రకాల ప్రయోగాలు చేసేవారు. బాబర్‌కు పాలనాకాలం తక్కువగా ఉండడంతో ప్రత్యేక ప్రయోగాలేవీ చేయలేకపోయాడని చరిత్రకారులు చెబుతుంటారు. అయితే హుమాయున్ తన పాలనాకాలంలో చాలావరకూ తడబడుతూనే ఉన్నాడంటారు. అయితే అక్బర్‌కు తన పాలనలో తగినంత సమయం దొరకడంతో వివిధ రంగాలలో అనేక ప్రయోగాలు చేశాడంటారు. అక్బర్ తర్వాత జహంగీర్ కాలంలో, నూర్జహాన్ వివిధ రకాల మద్యాలను ప్రత్యేక పద్ధతిలో తయారు చేయించేవారు. వీటన్నింటిమధ్యలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తీరు ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. జహంగీర్, అక్బర్‌లతో పోలిస్తే షాజహాన్ భార్యకు అత్యంత విధేయుడిగా ఉన్నాడని చెబుతారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్‌కు సుగంధ ద్రవ్యాలపై మోజు ఎందుకు పెరిగిందనే దాని వెనుక ఆసక్తికర కథనం వినిపిస్తుంటుంది. షాజహాన్ హయాంలో ఢిల్లీలో ఇన్ఫెక్షియస్ ఫ్లూ(అంటువ్యాధి) వ్యాపించింది. ఈ నేపధ్యంలో ప్రజల ఆహారంలో పెను మార్పు వచ్చింది. ఫ్లూ ప్రభావాన్ని తగ్గించేందుకు నాటి చెఫ్‌లు, రాజ వైద్యులు కలిసి ఆహారంలో పలు రకాల ప్రయోగాలు చేశారు. శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి, వ్యాధులతో పోరాడడంలో సహాయపడటానికి మసాలా దినుసులను వంటలలో విరివిగా ఉపయోగించసాగారు. ఫ్లూ లాంటి వ్యాధులతో పోరాటానికి సుగంధ ద్రవ్యాలను తగినంతగా ఉపయోగించాలని రాజ వైద్యుడు స్వయంగా షాజహాన్‌కు సూచించాడట. ఈ మేరకు షాజహాన్ తాను తీసుకునే ఆహారంలో ఎక్కువమోతాదులో మసాలాలు ఉండేలా ఆదేశాలు జారీచేసేవాడు. అది అతని ఆరోగ్యానికి తగినది కాకపోయినా దానినే అనుసరించేవాడట. షాజహాన్ ఎప్పుడూ యమునా నది నీరు తాగేందుకు ఇష్టపడేవాడు. మామిడిపండ్లన్నా షాజహాన్‌కు ఎంతో ఇష్టం. ప్రత్యేక తోటల నుంచి తాజా కూరగాయలు, నిమ్మ, దానిమ్మ, రేగు, పుచ్చకాయలను తెప్పించేవాడట. అంతే కాదు కొత్తిమీర, జీలకర్ర, పసుపు మొదలైనవాటిని ఎక్కువగా వినియోగించాలని షాజహాన్ తన వంటవాళ్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేవాడు. దీని వెనుక అతనికి ఆరోగ్యంపైగల శ్రద్ధనే ప్రధాన కారణమని చరిత్రకారులు చెబుతున్నారు. ఆహారంలో సుగంధ ద్రవ్యాలు ఉపయోగించకపోతే ఆరోగ్యం మెరుగ్గా ఉండదని షాజహాన్ నమ్మేవాడు. ఇది కూడా చదవండి: అంతరిక్షంలోకి దూసుకెళ్లే రాకెట్లు తెలుపు రంగులోనే ఎందుకుంటాయి? -
వింత మొఘల్ పాలకుడు: ‘ఇడియట్ మొఘల్ కింగ్‌గా పేరు
1712లో బహదూర్ షా (ప్రథమ) మరణం తరువాత, మొఘల్ పీఠం కోసం అతని కుమారుల మధ్య యుద్ధం జరిగింది. చివరికి జహందర్ షా విజయం సాధించి మొఘల్ సామ్రాజ్య సింహాసనంపై కూర్చున్నాడు. జహందర్ షా తన అసభ్యకర ప్రవర్తన కారణంగా అపఖ్యాతి పాలయ్యాడు. జహందర్ షా మొఘల్ సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్టించిన వెంటనే తనకు ఎంతో ఇష్టమైన మహిళ లాల్ కున్వర్‌కు అధికార బాధ్యతలను అప్పగించాడు. అందానికి దాసోహమై.. లాల్ కున్వర్ మొఘల్ ఆస్థాన గాయకుడు ఖాసురత్ ఖాన్ కుమార్తె. లాల్ కున్వర్.. జహందర్ షాకు రెట్టింపు వయస్సు కలిగినది. ఆమె తన అందం నృత్యంతో విటులను అలరించేంది. లాల్ కున్వర్ చక్రవర్తి జహందర్ షాను తన ఆధీనంలో ఉంచుకున్నదని చరిత్రకారుడు స్మిత్ ‘ది హిందూ’లో ప్రచురితమైన ఒక కథనంలో రాశారు. జహందర్ షా అధికారంలోకి వచ్చిన వెంటనే లాల్ కున్వర్‌కు రాణి హోదాను అప్పగించాడు. అలాగే ‘ఇమ్తియాజ్ మొఘల్’ అనే బిరుదు కూడా ఇచ్చారు. జహందర్ షా అధిక సమయం లాల్ కున్వర్ కోసం వెచ్చించేవాడు. లాల్ కున్వర్ దీనిని తన ప్రయోజనాలకోసం సద్వినియోగం చేసుకున్నది. ఆమె మొదట తన కుటుంబ సభ్యులను మాన్సబ్లుగా నియమించింది. తరువాత వారు మొఘల్ సామ్రాజ్యం నుండి జాగీర్లు అందుకున్నారు. తరువాత ఆమె తన బంధువులను అన్ని కీలక పదవులలో నియమించింది. కుమారుల కళ్లను తొలగించి.. లాల్ కున్వర్ ఆధీనంలోకి వెళ్లిన జహందర్ షా క్రూరమైన, మూర్ఖపు చర్యలకు పాల్పడ్డాడు. చరిత్రకారులు తెలిపిన వివరాల ప్రకారం జహందర్ కుమారులపై లాల్ కున్వర్‌కు ద్వేషం పెంచుకుంది. అతని ఇద్దరు కుమారుల కళ్లను తొలగించి, వారిని జైలులో పెట్టాలని జహందర్ షాను కోరింది. జహందర్ షా ఆమె చెప్పినట్టే చేశాడు. అతని క్రూరత్వానికి సంబంధించిన మరొక ఉదంతం ఎంతోప్రసిద్ధి చెందింది. ఒకసారి తన సరదా కోసం జనంతో నిండిన పడవను నీట ముంచి, వారి ఆర్తనాదాలు విని విరగబడి నవ్వాడట. ‘ఇడియట్ మొఘల్ కింగ్’ జహందర్ షా కొన్నిసార్లు పూర్తి నగ్నంగా దర్బారుకు హాజరయ్యేవాడు. మరికొన్నిసార్లు స్త్రీల దుస్తులు ధరించి దర్బారు నిర్వహించేవాడు. జహందర్ షా వికృత చేష్టల కారణంగా అతనికి ‘ఇడియట్ మొఘల్ కింగ్’ అనే పేరు వచ్చింది. అతను మొఘల్ చరిత్రలో అత్యంత తెలివితక్కువ చక్రవర్తి అనే పేరు పొందాడు. జైలులోనే దారుణ హత్య జహందర్ మొఘల్ సామ్రాజ్య సింహాసనంపై కేవలం 9 నెలలు మాత్రమే ఉండగలిగాడు. అతని మేనల్లుడు ఫరూక్సియార్ అతనికి వ్యతిరేకంగా ఒక దళాన్ని నడిపాడు. 1713 జనవరి 6న ఫరూక్సియార్తో ఓటమి ఎదురయ్యాక అతను లాల్ కున్వర్‌తో కలిసి ఢిల్లీకి పారిపోయి, అక్కడ ఆశ్రయం పొందాడు. అక్కడ జహందర్‌ను ఖైదు చేశారు. తరువాత అతను జైలులోనే దారుణ హత్యకు గురయ్యాడు. ఇది కూడా చదవండి: ‘నాన్నా నేను బతికే ఉన్నాను’.. తలకొరివి పెట్టేంతలో తండ్రికి ‘మృతురాలి’ నుంచి ఫోన్.. -
చైనా తొలి చక్రవర్తి సమాధికి పాదరస రక్షణ!
బీజింగ్: చైనాను పాలించిన మొట్టమొదటి చక్రవరి కిన్ షీ హువాంగ్. ఆయన సమాధికి పాదరసం(మెర్క్యూరీ)తో రక్షణ కలి్పంచినట్లు తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. ద్రవ రూపంలో ఉండే లోహమే పాదరసం. ఇది విషపూరితమైంది. కిన్ క్రీస్తుపూర్వం 221 నుంచి 210 దాకా.. పదేళ్లపాటు డ్రాగన్ దేశాన్ని శాసించాడు. కిన్ సమాధిని కట్టుదిట్టంగా నిర్మించారు. షాన్షీ ప్రావిన్స్‌లో 1974లో రైతులు పొలం దున్నుతుండగా కిన్ షీ హువాంగ్ సమాధి బయటపడింది. చక్రవర్తి సమాధిని తెరిచే చూస్తే వినాశనం తప్పదన్న ప్రచారం బాగా వ్యాప్తిలో ఉంది. దీంతో, తెరిచే సాహసం చేయలేకపోయారు. సమాధికి సమీపంలో మట్టితో తయారు చేసిన సైనికులు, ఆయుధాలు, గుర్రాల విగ్రహాలు భారీగా బయటపడ్డాయి. మరణానంతరం కూడా చక్రవర్తిని కాపాడడానికి ఈ ‘టెర్రకోట ఆరీ్మ’ని ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, చక్రవరి సమాధి చుట్టూ మెర్క్యూరీ లోహం స్వేచ్ఛగా కదులుతున్నట్లు పరిశోధకులు ఇటీవలే తేల్చారు. సమాధిని ఎవరూ తాకకుండా ఇలాంటి ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. -
పురోహితుడికి గ్రామానికి గ్రామమే దానం
సాక్షి, హైదరాబాద్: పురోహితుల కోసం ప్రత్యేకంగా అగ్రహారాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కానీ, రాజ పురోహితులకు గ్రామం మొత్తాన్ని దానంగా సమర్పించిన ఉదంతాలు అరుదు. అలాంటి ఓ దాన శాసనం తాజాగా వెలుగు చూసింది. నల్లగొండ జిల్లా గుండ్లపల్లి మండలంలోని వావికొల్లు గ్రామం పొలిమేరలోని చారగొండవాగు తీరంలోని పొలాల్లో స్థానిక యువకుడు దీనిని గుర్తించాడు. దాన్ని తగుళ్ల గోపాల్ అనే కవి తన దృష్టికి తెచ్చారని, ఏడడుగుల ఎత్తు అడుగున్నర మందంతో ఉన్న ఈ శిలపై నాలుగు వైపులా 81 పంక్తులలో తెలుగులో చెక్కిన శాసనం ఉందని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. చదవండి: మణికొండ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతికి బాధ్యత వహిస్తాం: మంత్రి కేటీఆర్ కళ్యాణీ చాళుక్యుల చక్రవర్తి త్రిభువన మల్లదేవ రెండో జగదేకమల్ల పాలనా కాలంలో, పానగల్లు రాజధానిగా కందూరు నాడును పాలించిన సామంతుడైన ఉదయనచోడ మహారాజు ఈ శాసనాన్ని వేయించారని హరగోపాల్ పేర్కొన్నారు. క్రీ.శ.1158 ఆగస్టు 10న బోడవిప్పఱ్రు అనే గ్రామాన్ని దానం చేసినట్టు, బహుధాన్య నామ సంవత్సరం భాద్రపద శుద్ధ పౌర్ణమినాడు చంద్రగ్రహణ ప్రత్యేక వేళ ఈ దానాన్ని సమర్పించినట్టు తెలుస్తోందని చెప్పారు. చదవండి: టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో కేవలం 10 వేలే, బంగారం, బండి లేనే లేదు గ్రామం నుంచి వసూలయ్యే పన్నులు రాజ్యానికి సమర్పించాల్సిన అవసరం లేకుండా, ఆ రాజ పురోహితులే అనుభవించేలా అవకాశం కల్పించారు. పుర హితానికి తోడ్పాటునందించే పురోహితులకు ఇలా దానాలు సమర్పించటం అప్పట్లో ఆనవాయితీగా ఉండేదని ఈ శాసనం ద్వారా తెలుస్తోంది. ఉదయనచోడుడి పాలన 1158 వరకు కొనసాగిందన్న ఆధారాన్ని చూపిన శాసనమిది కావటం విశేషం. గతంలో ఇదే రాజు వేయించిన 1157 నాటి శాసనం భువనగిరి సమీపంలో లభించింది. -
దేవుని తీర్పు కోసం సిద్ధపడే తరుణమిది
బబులోను రాజైన బెల్షస్సరు రాజవంశీయులైన వెయ్యి మంది అధిపతులకు, తన రాణులకు, ఉపపత్నులకు ఒక రాత్రి గొప్ప విందు చేశాడు. తన రాజధానియైన బబులోను పట్టణమంటే అతనికెంతో అతిశయం!! బబులోను పట్టణం చుట్టూ 350 అడుగుల ఎత్తు, 85 అడుగుల వెడల్పున మహా ప్రాకారముంది. శత్రువుల ఆగమనాన్ని పసిగట్టేందుకు ఆ గోడ మీద 350 చోట్ల కాపలా శిఖరాలున్నాయి. ప్రాకారాన్ని ఆనుకొని పట్టణం చుట్టూ మొసళ్ళు నివసించే నీళ్లతో లోతైన కందకాలున్నాయి. శత్రువు బయటి నుండి ముట్టడి వేసినా కోట లోపల కొన్ని ఏళ్లపాటు సుఖంగా బతికేందుకు అవసరమైనన్ని ధాన్యం, ఆహారం నిల్వలు న్నాయి. అందువల్ల తమ ప్రాణాలకు, భద్రతకు ఏమాత్రం ఢోకా లేదన్న అతివిశ్వాసంతో రాజైన బెల్షస్సరు విందులు వినోదాలతో కాలక్షేపం చేస్తున్నాడు. పైగా యెరూషలేము మహాదేవుని ఆలయం నుండి దోపిడీ చేసి తెచ్చిన బంగారు పాత్రల్లో ద్రాక్షారసం తాగేందుకు పూనుకోవడం అతని అహంకారానికి పరాకాష్ట అయ్యింది. ఆ రాత్రే ఒక అదృశ్యవ్యక్తి తాలూకు హస్తం అతని ఎదుట గోడమీద ఏదో రాయడం అతనికి కలవరం కలిగించింది. తన వద్దనున్న జ్యోతిష్కులు, గారడీవాళ్ళు, మంత్రగాళ్ళ ద్వారా దాని భావాన్ని తెలుసుకోవడానికి విఫల ప్రయత్నం చేశాడు. చివరికి దానియేలు ప్రవక్త అతనికి దాని గుట్టు విప్పి చెప్పాడు. ‘రాజా, నీ తండ్రి నెబుకద్నెజరు చేసిన తప్పిదాన్నే నీవు కూడా చేస్తున్నావు. నీ తండ్రిని దేవుడు ఎలా శిక్షించాడో అంతా ఎరిగి కూడా నిన్ను నీవు సరిచేసుకోకుండా, నిగ్రహించుకోకుండా పరలోకమందలి దేవుని కన్నా పైగా నిన్ను నీవు హెచ్చించుకున్నావు. అందువల్ల ‘మేనే మేనే టేకేల్ ఉఫారసీన్’ అని దేవుని హస్తం నిన్ను గురించి దైవభాషలో రాసింది. అంటే దేవుడు నీ విషయం లెక్క చూసి, తన త్రాసులో తూచగా నీ అహంకారం వల్ల నీవు చాలా తక్కువగా తూగావు. అందువల్ల ‘ఇదంతా నాదేనంటూ నీవు విర్రవీగుతున్న నీ రాజ్యాన్నంతా తీసి దేవుడు నీ శత్రువులైన మాదీయులు, పారసీకులకు ఇవ్వబోతున్నాడు’ అని దేవుని తీర్పును అతనికి వెల్లడించాడు. ఆ రాత్రే అదంతా నెరవేరి, బెల్షస్సరు శత్రువుల చేతిలో చనిపోగా, అతని రాజ్యం శత్రురాజుల చేజిక్కింది. దేవుడెంత న్యాయవంతుడంటే, ముందుగా హెచ్చరించకుండా, పరివర్తన చెందేందుకు సమయమివ్వకుండా ఎవరినీ శిక్షించడు. సమయమిచ్చినా దాన్ని వాడుకొని మారనివారిని దేవుడెట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టడు కూడా. ‘ఎంతోమంది చక్రవర్తులు, మహాపాలకులు కూలిపోయింది శత్రురాజుల చేతిలో కాదు, వాళ్ళు తమ అహంకారానికే బలయ్యారు’ అన్నది చరిత్ర చెప్పే సత్యం!! రాజైన హిజ్కియా కూడా దారి తప్పి పశ్చాత్తా్తపపడితే దేవుడు మరో అవకాశాన్నిచ్చి అతని ఆయువును పెంచాడు. అతని కొడుకు మనశ్శహే రాజు కూడా తప్పులు చేసినా, తన తండ్రిలాగే తనను తాను సరిదిద్దుకొని మరో అవకాశం పొందాడు. బబులోను రాజైన బెల్షస్సరు మాత్రం తన తండ్రి నెబుకద్నెజరుకు జరిగిన దాన్నంతా చూసి కూడా గుణపాఠం నేర్చుకోక తన అహంకారానికి, అజ్ఞానానికి బలై భ్రష్టుడయ్యాడు. తన చుట్టూ ఉన్న కోట, తన సైనికులు తనను కాపాడుతారనుకున్నాడు కాని మహాకాశంలో తన సింహాసనాన్ని కలిగి ఉన్న దేవదేవుడు తనను కూడా పాలించే మహాపాలకుడన్న వాస్తవాన్ని మరచిపోయి విచ్చలవిడిగా ప్రవర్తించి, వినాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. దేవుడు ఆది నుండీ చెప్పేది అదే!! మనిషి వినాశనం మనిషి చేతుల్లోనే ఉంటుంది. తనను తాను తగ్గించుకొని దేవుణ్ణి ఆశ్రయించిన వాడే ఆ వినాశనం నుండి తప్పించుకోగలడు. దేవుడిచ్చిన పాపక్షమాపణను పొందిన వారే దేవుని తీర్పును తప్పించుకోగలరు. –రెవ.డా. టి.ఎ.ప్రభుకిరణ్ ఈమెయిల్:prabhukirant@gmail.com -
చక్రవర్తి పట్టాభిషేకం.. వింత ఆచారం
టోక్యో : జపాన్ నూతన చక్రవర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరుహిటో ఆచారం ప్రకారం చేసే డైజోసాయి అనే కార్యక్రమానికి సిద్ధమయ్యారు. ఇంతకు ముందు 30 ఏళ్లు చక్రవర్తిగా ఉన్న నరుహిటో తండ్రి అకిహిటో గత ఏప్రిల్‌లో పదవీ విరమణ చేయగా, మేలోనే ఈ కార్యక్రమం నిర్వహించాల్సింది. అయితే జపాన్‌లో ఘోరమైన తుపాన్లు రావడంతో ‘డైజోసాయి’ ఆలస్యమైంది. పట్టాభిషేకానంతరం నిర్వహించే ఆచారంలో చివరిదీ, ముఖ్యమైనది డైజోసాయి. ఈ ఆచార కార్యక్రమంలో నరుహిటో గురువారం పాల్గొన్నారు. రెండో ప్రపంచ యుద్ధానికి పూర్వం జపాన్‌వాసులు తమ చక్రవర్తులను అమతెరసు ఒమికామి అనే సూర్య దేవత అంశగా భావించేవారు. డైజోసాయి ఆచారం వెయ్యి సంవత్సరాల పూర్వం నుంచి ఉన్నా.. క్రీస్తు శకం 1800 చివర్లో మరింత బలపడింది. అప్పటి జపాన్ చక్రవర్తి చుట్టూ ఉన్న చిన్న చిన్న రాజ్యాలను జయించి, వాటన్నింటినీ కలిపి ఒకే దేశంగా నిలిపే ప్రయత్నం చేశాడు. ఈ విజయాలను వివరిస్తూ అప్పట్లో విద్యార్థులకు బోధించే పాఠ్యపుస్తకాల్లో చక్రవర్తి గొప్పదనం గురించి పాఠాలు ఉండేవి. నరుహిటో తాత హిరోహిటో చక్రవర్తిగా ఉన్నప్పుడు (1926 - 1989) చక్రవర్తికి దైవశక్తి ఉందని, సూర్యదేవత అయిన అమతెరసు ఒమికామితో సంబంధాలుండేవని, అందుకే చక్రవర్తికి ఓటమి లేదని విద్యార్థులకు బోధించేవారు. అయితే రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోయాక చక్రవర్తికి ఉన్న దైవత్వాన్ని పుస్తకాల్లోంచి తొలగించారు. అయితే డైజోసాయి ఆచారం మాత్రం అలాగే కొనసాగుతోంది. కొత్తగా చక్రవర్తి అయ్యేవారు ఈ ఆచారాన్ని పాటించాల్సిందే. చక్రవర్తి పట్టాభిషేక మహోత్సవం డైజోసాయి ప్రకారం.. రాజ ప్రసాద మైదానంలో చెక్కతో నిర్మించిన రెండు ప్రత్యేక భవంతులను ఏర్పాటు చేస్తారు. తెల్లటి వస్త్రాలు ధరించిన చక్రవర్తి, మసక వెలుతురు ఉన్న మొదటి భవంతిలోకి ఒంటరిగా వెళ్తాడు. అందులో ఓక్ ఆకులతో చేసిన 32 ప్లేట్లలో నైవేద్యం నింపి, తెల్లటి వస్త్రాలతో కప్పి ఉంచిన ప్రదేశం ముందు మోకరిల్లి జపాన్ శాంతి కోసం ప్రార్థనలు చేస్తాడు. అనంతరం దేవతతో కలిసి అన్నం, తృణ ధాన్యాలు, వరితో చేసిన పానీయాన్ని సేవిస్తాడు. ఈ తతంగం పూర్తవ్వడానికి రెండున్నర గంటలు పడుతుంది. ఇలాగే మరో భవంతిలో మరోసారి చేస్తారు. ఇలా తెల్లవారుజాము మూడు గంటలలోపు ఈ కార్యక్రమం పూర్తవుతుంది. అనంతరం ఆ రెండు భవంతులను దహనం చేసేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని షింజో అబెతో సహా దేశంలోని ప్రముఖులను ఆహ్వానించినా, భవంతి లోపలికి ఎవ్వరికీ అనుమతించరు. దీని గురించి క్యోటోలోని అంతర్జాతీయ జపనీస్ స్టడీస్ కేంద్ర అధ్యాపకుడు జాన్ బ్రీన్ అభిప్రాయంలో ‘డైజోసాయి లాంటి కార్యక్రమాలు చక్రవర్తి పట్టాభిషేక మహోత్సవంలో చాలా ఉంటాయి. కాకపోతే డైజోసాయి అనేది బహిరంగ కార్యక్రమం కనుక అందరి దృష్టి దీని మీద ఉంటుంది. ఈ ఆచారంపై జపాన్ వాసుల్లో చాలా మందికి మంచి నమ్మకం ఉంది. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు చాలా మంది జపనీయులు తరలివస్తారు. అంతేకాక, ఈ కార్యక్రమం తర్వాత తమ చక్రవర్తి పరిపూర్ణ వ్యక్తిగా రూపాంతరం చెందుతాడనే నమ్మకం చాలా బలంగా ఉంద’ని వివరించారు. మరోవైపు ఈ కార్యక్రమానికి అవుతున్న ఖర్చు జపాన్ కరెన్సీలో 2.07 బిలియన్ల యెన్లు. అమెరికా డాలర్లలో చూస్తే దాదాపు 25 మిలియన్ డాలర్లు. ఈ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. అయితే ఈ విషయంలో కొందరు విభేదిస్తున్నారు. ఎలాంటి ప్రయోజనాలు లేని ఇలాంటి ఆచారాలకు ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై కోర్టులో కేసులు కూడా వేశారు. కేసులు వేసిన బృందానికి నాయకత్వం వహిస్తున్న కొయిచి షిన్ (60) అనే వ్యక్తి మాట్లాడుతూ.. ‘ఈ ఆచారానికయ్యే ఖర్చును రాజకుటుంబీకుల సొంత ఖజానా నుంచి పెట్టుకోవాలి. ప్రజల సొమ్ము ఈ విధంగా దర్వినియోగం చేయడం సరికాదు. ఈ ప్రతిపాదనకు కొత్త చక్రవర్తి తమ్ముడు అకిషినో కూడా సమర్థించారు. మరోవైపు ఈ తతంగాన్ని నిరసిస్తూ 30 ఏళ్ల కింద అకిహిటో పట్టాభిషేకం సందర్భంగా కోర్టుల్లో 1700 మంది కేసులు వేశారు. ఈ సారి ఆ సంఖ్య 318కి తగ్గింది. అయినా కోర్టు నిర్ణయం మాకు అనుకూలంగా వస్తుందనే నమ్మకం లేదు. కానీ మతం, రాజ్యం ఒక్కటిగా ఉండడం తప్పు. ఇది మంచి పద్ధతి కాదనే భావనను విస్తృతపరచడమే మాకు ప్రధానమ’ని తెలిపారు. జపాన్‌లో ప్రధాన మతం బౌద్ధం. 99.99 శాతం ప్రజలు ఆ మతస్థులే. క్రిస్టియన్లు, ముస్లింలు, కమ్యూనిస్టులు చాలా తక్కువగా ఉంటారు. డైజోసాయికి వ్యతిరేకంగా కేసులు వేసేవారిలో వీరే ముందుంటున్నారు. - రవీందర నాయక్, సాక్షి వెబ్ డెస్క్. -
అనుగ్రహం
అది.. సత్యం, న్యాయం, ధర్మానికి ప్రతీక అయిన ఇస్లామీయ చక్రవర్తి హజ్రత్ ఉమర్ షారుఖ్ (ర) పరిపాలనా కాలం. రెండు మూడు సంవత్సరాలుగా వర్షాలు కురియక రాజ్యంలో ప్రజలు ఆహారం కోసం అలమటిస్తున్నారు. చక్రవర్తి వెంటనే రాజ్యంలోని వ్యాపారస్తులందరిని సమావేశపరిచి, మీరు కోరినంత ధర ఇస్తాను. మీ దగ్గర ఉన్న ధాన్యం మొత్తం తీసుకుని రమ్మని చెప్పాడు.‘‘ఓ చక్రవర్తి! ఇది నిజంగా మాకు మంచి తరుణం. ఒకటికి పది రెట్లు అధికంగా లాభం పొందే అవకాశం. కాని మా దౌర్భాగ్యం మేము మా దగ్గర ఉన్న ధాన్యం మొత్తం హజ్రత్ ఉస్మాన్ (ర)కి ముందే అమ్మేసాం’’ అన్నారు. చక్రవర్తి హజ్రత్ ఉమర్ షారుఖ్ (ర), హజ్రత్ ఉస్మాన్ (ర) దగ్గరకు వెళ్లి.. ‘‘ఓ ఉస్మాన్ (ర), రాజ్యంలో కరువు తాండవిస్తున్న సంగతి మీకు తెలిసిందే కదా. మీ దగ్గర ఉన్న ధాన్యం మాకు ఇస్తే దానికి బదులుగా మీరు కోరినంత విలువ ఇస్తాను’’ అన్నారు.‘‘క్షమించాలి చక్రవర్తి గారు నేను నా దగ్గర ఉన్న ధాన్యం మొత్తం ఈ ప్రపంచంలో ఎవరూ వెల కట్టలేని ధరకు అమ్మి వేసాను’’ అని అన్నాడు.‘అయ్యో! నా ప్రజలకు సహాయం చేయలేకపోతున్నానే’ అన్న నిరాశ, నిస్పృహలతో అక్కడి నుండి వెళ్తూ, వెళ్తూ చెట్టు నీడన కూలబడ్డాడు హజ్రత్ ఉమర్.కాసేపటికి తరువాత జనాలు బస్తాల కొద్దీ ధాన్యం మొసుకొని వెళ్లడం గమనించి, ఎంత ధరకైనా కొందామన్నా లభించని ధాన్యం వీళ్లకు ఎలా లభించిందబ్బా, అని వాకబు చేయగా, ఉస్మాన్ (ర) ఉచితంగా పంచుతున్నాడని తెలిసింది. హజ్రత్ ఉస్మాన్ (ర) దగ్గరకు వెళ్లి, ‘‘ఓ ఉస్మాన్! నేను నువ్వు కోరినంత ధర ఇస్తాను అన్నా అమ్మను అన్నావు. మరి ఇదేమిటి ఇలా ఉచితంగా పంచుతున్నావు?’’ అని అడిగాడు.‘‘క్షమించాలి చక్రవర్తి గారు! మీరు మహ అంటే వంద రెట్లు అధికంగా ఇస్తారేమో. కాని పరలోకంలో నా ప్రభువు ఇచ్చినంత ఇవ్వలేరుగా. అందుకే నేను నాకు ఈ అనుగ్రహం ప్రసాదించిందిన అల్లాహ్ కే తిరిగి అమ్మేసాను’’ అన్నాడు.యదార్థం ఏమిటంటే, విశ్వాసుల నుండి అల్లాహ్ వారి ప్రాణాలనూ, వారి సిరి సంపదలనూ స్వర్గానికి బదులుగా కొన్నాడు. మరీ ముఖ్యంగా రంజాన్ మాసంలో అల్లాహ్ మార్గంలో చేసే ప్రతి కర్మకు మిగతా మాసాల్లో చేసే కర్మలకన్నా 70 రెట్లు అధికంగా దైవం ప్రసాదిస్తాడని ప్రవక్త (స) తెలిపారు. – షేక్ అబ్దుల్ బాసిత్ -
దైవాదేశ పాలనకే ప్రాధాన్యం
మహమూద్ గజనవీ దర్బారులో అయాజ్ అనే మంత్రి ఉండేవాడు. అయాజ్ అంటే చక్రవర్తికి ఎంతోఇష్టం. దీంతో మిగతా మంత్రులకు కాస్త అసూయగా ఉండేది. ఒకసారి చక్రవర్తి తన చేతిలో ఉన్న ముత్యాల హారాన్ని కొలనులో విసిరేశాడు. దర్బారులోని కొలను స్వచ్ఛమైన నీటితో కళకళలాడుతోంది. ముత్యాలహారం నీటి అడుగుభాగానికి చేరింది. అప్పుడుచక్రవర్తి, మంత్రులను పిలిచి,’మీలోఎవరైనా ఈ హారాన్ని బయటికి తీస్తారా?’అని అడిగాడు. దానికి అందరూ’ అదెంతపని చిటికెలో తీస్తాం.’ అన్నారు.‘సరే.. అయితే, ఒంటిపై వస్త్రాలు తడవకుండా హారాన్ని బయటికి తీయాలి.’ అన్నాడు చక్రవర్తి.‘అదెలాసాధ్యం?’ అంటూ అందరూ చేతులెత్తేశారు. బట్టలు తడవకూడదు అన్న షరతు లేకపోతే తీస్తామన్నారు.అప్పుడు చక్రవర్తి, అయాజ్‌ను పిలిచి ‘నువ్వు తీస్తావా?’అని అడిగాడు. అయాజ్ వెంటనే వెనుకాముందూ ఆలోచించకుండా కొలనులోకి దూకి ముత్యాల హారాన్ని బయటికి తీశాడు. అతని బట్టలు, శరీరమంతా నీటిలో తడిసి పొయ్యాయి. వణుకుతున్న చేతులతోనే హారాన్ని చక్రవర్తికి అందించాడు అయాజ్ .‘నేను బట్టలు తడవకుండా హారాన్ని తియ్యాలని చెప్పానుకదా..!’ అని ఆగ్రహించాడు చక్రవర్తి.‘అవును ప్రభూ! హారం తియ్యాలి.. వస్త్రాలు తడవద్దు.’ అన్న మీ ఆజ్ఞను శిరసావహించాలన్న ఆరాటంలో బట్టలు తడుస్తాయా.. తడవకుండా ఎలా తియ్యాలి..? అనే విషయాలేవీ నేను పట్టించుకోలేదు ప్రభూ..! మీ రెండు ఆజ్ఞల్లో ఒకదాన్ని పాలించాను. మరొకదాని విషయంలో నన్ను క్షమించండి’ అని చేతులు జోడించాడు అయాజ్ .అప్పుడు చక్రవర్తి, ‘చూశారా.. ఇదీ అయాజ్ ప్రత్యేకత. మీరంతా బట్టలు తడవకుండా ఎలా? తడుస్తాయి కదా.. ఆ షరతు తొలగించండి.. అదీ ఇదీ..’ అంటూ మీనమేషాలు లెక్కించారు. కాని అయాజ్ అదేమీ ఆలోచించలేదు. విలువైన హారాన్ని తీయడమే అతని దృష్టిలో ఉంది. ఆ క్రమంలో బట్టలు తడిస్తే శిక్షించబడతానని అతనికి తెలుసు. అయినా సరే నా విలువైన హారం కోసం తను శిక్షకు సిద్ధపడ్డాడు.మీరేమో హారం సంగతి తరువాత.. మేమెందుకు శిక్ష అనుభవించాలి?’ అని ఆలోచించారు.దైవాదేశపాలనలో మన పరిస్థితి కూడా ఇలాగే ఉండాలి. ఆయన ఆజ్ఞాపాలనలో మనం త్యాగానికి సిద్ధపడితే అల్లాహ్ మనల్ని తన సన్నిహితుడిగా చేసుకుంటాడు. మన పాపాలను క్షమిస్తాడు. ఇహలోకంలో గౌరవాన్ని ప్రసాదిస్తాడు. దైవదూతల ముందు మనల్ని గురించి గర్వంగా పొగుడుతాడు. ఆయన అమితంగా ప్రేమించేవాడు. అనన్యంగా కరుణించేవాడు. గొప్ప క్షమాశీలి. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ఎర్ర సముద్రం
‘మూసా మమ్మల్ని తీసుకొచ్చి ఈ సముద్రం పక్కన నిలబెట్టావేమిటి? ఈజిప్టులోని ఖననవాటికలు సరిపోలేదా?’ అని అస్మదీయులు నిష్టూరంగా పలుకుతున్న ఆ ఘడియలో దైవ సహాయం అందింది! నేటికి వేల సంవత్సరాల క్రితం ఇస్రాయీల్ అనే జాతి ప్రజలు శతాబ్దుల తరబడి ఈజిప్టులో కడు దుర్భరమైన, అవమానకరమయిన జీవితం గడపాల్సి వచ్చింది. ఫిరౌన్ అనే రాజు పీడనకు గురవ్వాల్సి వచ్చింది. ఫిరౌన్ తనకు తాను ‘నేనే దేవుడిని’ అని విర్రవీగేవాడు. తన రాజ్యంలోని అప్పుడే పుట్టిన మగబిడ్డల్ని చంపేసేవాడు. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో దేవుడు వారి మధ్యన మహనీయ మూసా (అలైహిస్సలామ్)ను ప్రభవింపజేశాడు. అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉన్న ఆ కాలంలో సత్యాన్ని సమర్థించడానికి ఇస్రాయీల్ ప్రజలు మూసా (అలై)ను దేవుని ప్రవక్తగా అంగీకరించారు. ఆయన ద్వారానే ఆ జాతి వారు ఫిరౌనీయుల చెరనుండి విముక్తి పొందారు. ఇలా ఉండగా, ఒకానొక రాత్రివేళ రాజ్యంలోని అన్ని ప్రాంతాల నుండి ప్రజలు బయలుదేరి దైవప్రవక్త మూసా (అలైహిస్సలామ్)తో కలిసి వేరే ఎర్రసముద్రం వైపునకు సాగిపోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఈ పయన బృందం ఎర్రసముద్రం తీరానికి చేరుకుంటూ ఉన్న సమయంలోనే ఫిరౌన్ చక్రవర్తి ఒక భారీ సేనా వాహినిని తీసుకుని వాళ్లను వెంబడిస్తూ వచ్చాడు! ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారయ్యింది పరిస్థితి. మూసా ప్రవక్త అనుయాయులు ఫిరౌన్ సేనల చేతికి చిక్కుకుపోయేలానే ఉన్నారు. వెనుక శత్రు సేనలు, ముందేమో ఎర్ర సముద్రం. దిక్కుతోచని పరిస్థితి. ‘‘మూసా మమ్మల్ని తీసుకొచ్చి ఈ సముద్రం పక్కన నిలబెట్టావేమిటి? ఈజిప్టులోని ఖననవాటికలు సరిపోలేదా?’ అని అస్మదీయులు నిష్టూరంగా పలుకుతున్న ఆ ఘడియలో దైవ సహాయం అందింది. ‘‘మూసా నీ చేతికర్రతో సముద్రంపై కొట్టు’’ అని దైవాదేశమయింది. అల్లాహ్ వాణిని అనుసరించి మూసా ప్రవక్త, సముద్రంపై తన చేతికర్రతో కొట్టాడు. అంతే! సముద్రం రెండు ముక్కలుగా చీలిపోయింది. వాటిలోని ప్రతి భాగం ఓ పర్వతంలా వుంది. ఆ రెండు నీటి గుట్టల మధ్యన ఒక సందు, నీరు ఏ మాత్రం లేని ఓ పొడి దారి ఏర్పడింది. ఆ దారి గుండా మూసా అనుయాయులు సాగిపోవడం గమనించిన ఫిరౌన్ తన సైనికులతో సహా వారిని వెంబడించాడు. మూసా అనుయాయులు సముద్రం దాటే సమయానికి ఫిరౌన్ సేనలు ఆ దారి మధ్యన ఉన్నాయి. దైవాదేశానుసారం అప్పటివరకు ప్రహరీ గోడల్లా నిశ్చలంగా నిలిచి ఉన్న ఆ రెండు నీటి భాగాలు పరస్పరం కలిసిపోయాయి. ఫిరౌన్ తన సేనల సమేతంగా సాగర గర్భంలో కలిసిపోయాడు. దైవప్రవక్త మూసా (అలై) ఇస్రాయీల్ సంతతి వారిని తీసుకుని సీనాయ్ ద్వీపకల్పంలో ప్రవేశించారు. ఈ విధంగా ప్రవక్త మూసా (అలై) ఇస్రాయీల్ జాతిని ఫిరౌన్ చెరనుంచి విడిపించారు. అందుకే ముస్లిములు ముహమ్మద్ ప్రవక్త (సఅసం) సంప్రదాయం ప్రకారం మొహర్రం నెల 10వ తేదీన యౌమే ఆషూరాగా జరుపుకుంటారు. ఆషూరా రోజున ఉపవాసం పాటిస్తారు. – ముహమ్మద్ ముజాహిద్ -
‘అక్బర్ గొప్ప చక్రవర్తేం కాదు’
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘అక్బర్ కంటే మహారాణా ప్రతాప్ చాలా గొప్ప చక్రవర్తి’ అని పేర్కొన్నారు. గురువారం లక్నో ఐఎమ్‌ఆర్‌టీలో నిర్వహించిన ఒక కార్యక్రమానికి యోగి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ.. ‘మహారాణా ప్రతాప్ గొప్పవీరుడు, శౌర్యవంతుడు. వేరేమతానికి చెందిన వాడైన విదేశీయుడు అక్బర్ చక్రవర్తిత్వాన్ని ఆయన ఒప్పుకోలేదు. అంతేకాక ఆ విషయాన్ని నేరుగా అక్బర్ రాయబారితోనే చెప్పగలిగాడు. మహారాణా ప్రతాప్ రాజ్యాన్ని కోల్పోయి దేశాలు పట్టుకుతిరిగినా తన ఆత్మగౌరవాన్ని మాత్రం వదులుకోలేదు. అందుకే విదేశియుడైన అక్బర్‌ను చక్రవర్తిగా ఒప్పుకోలేదు. కానీ దురదృష్టం కొద్ది మన చరిత్రకారులు ఇలాంటి అంశాలను పట్టించుకోలేదు. ఫలితంగా ఒక తరం మొత్తం ఇలాంటి గొప్ప విషయాలు తెలుసుకునే అవకాశం కొల్పోయింది. మహారాణా ప్రతాప్ జీవితం నేటి తరానికి ఎంతో ఆదర్శదాయకం. ఆయన జీవితం నుంచి నేటి యువత శౌర్యం, ప్రతాపం వంటి లక్షణాలను అలవర్చుకోవా’లని సూచించారు. ఈ కార్యక్రమంలో యోగి ‘యువశౌర్య’ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకంలో మహారాణా ప్రతాప్ జీవితం, ధైర్యసాహసాల గురించి వ్యాసాలు, కథలను పొందుపర్చారు. గతంలోనూ... ముస్లీం పాలకుల గురించి నోరు పారేసుకోవడం బీజేపీ నేతలకు ఇదే ప్రథమం కాదు. కొన్ని రోజుల క్రితం బల్లియా సురేంద్ర సింగ్ అనే ఒక బీజేపీ ఎమ్మేల్యే ప్రపంచ వింతల్లో ఒకటైన ‘తాజమహల్’ పేరును ‘రామ్ లేదా క్రిష్ణ మహల్ లేదా రాష్ట్ర భక్తి మహల్’గా మార్చాలన్నారు. బీజేపీ నేతల వ్యాఖ్యల గురించి సమాజ్‌వారి పార్టీ నేత రాజేంద్ర చౌదరి మాట్లాడుతూ.. ‘2019 ఎన్నికల నాటికి సమాజాన్ని మతం ప్రతిపాదికను చీల్చాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. కానీ వారు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. బీజేపీ, ఆ పార్టీ నేతలు ఎవరు కూడా చరిత్రను మార్చలేరు. అది తెలియకుండా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నార’ని విమర్శించారు. -
ఆ ముగ్గురు స్త్రీలే మహా సైన్యం
ఇశ్రాయేలీయులు లేదా హెబ్రీయుల ఐగుప్తు దాస్య విముక్తి, వారి వాగ్దాన దేశయాత్రలో ముఖ్య విలన్ ఫరో చక్రవర్తి కాగా, దేవుడు వాడుకున్న గొప్ప హీరో మోషే! కాని ప్రాణార్పణకు కూడా సిద్ధపడి ఆ మోషేను బతికించిన ముగ్గురు స్త్రీల పాత్ర చిరస్మరణీయం, స్ఫూర్తిదాయకం కూడా. హెబ్రీ మగపిల్లవాణ్ని పుట్టగానే చంపేయాలన్నది మంత్రసానులకు ఫరో చక్రవర్తి ఇచ్చిన ఆజ్ఞ. ధిక్కరిస్తే మరణశిక్ష తప్పదు. అయినా తన కుమారుణ్ని బతికించుకోవాలని నిర్ణయించుకుంది మోషే తల్లి యోకెబెదు. షిఫ్రా, పూయా అనే ఇద్దరు హెబ్రీ మంత్రసానులు చక్రవర్తి ఆజ్ఞను ధిక్కరించి దైవభయంతో ఆమెకు సహకరించారు. అలా పురిటినాడే చనిపోవలసిన మోషే ఆ ముగ్గురి తెగువ, దైవభక్తి కారణంగా బతికాడు. ఆయనే ఇశ్రాయేలీయుల దాస్య విముక్తిని సాధించాడు. కండలు తిరిగిన యుద్ధవీరులే బలవంతులంటుంది లోకం. కాని దేవునికి లోబడి ఆయన మాట నెరవేర్చేవారే నిజమైన బలశూరులంటుంది బైబిల్ (కీర్తన 103:20). దేవునికి భయపడటం అంటే హింస, దౌర్జన్యం, అశాంతి, మోసం లాంటి లోక వైఖరిని ధిక్కరించడమని బైబిలు వివరిస్తోంది. తెగువలేని దైవభక్తి చక్రాలు లేని బండిలాగే నిష్ప్రయోజనకరమైనది. విశ్వాసికి దైవభక్తి ఉండాలి, దాన్ని ఆచరణలో పెట్టగల అసమానమైన తెగువ కూడా ఉండాలి. మోషే ఉదంతంలో దేవుని సంకల్పం అనే దీపం ఆరిపోకుండా తెగించి తమ చేతులు అడ్డుపెట్టిన మహాసైన్యం ఈ ముగ్గురు స్త్రీలు. అందుకే మోషే ఉదంతమున్న బైబిలు నిర్గమకాండంలో మహాబలుడనని విర్రవీగిన ఫరో చక్రవర్తి పేరును దేవుడు ప్రస్తావించలేదు కాని ఏ విధంగా చూసినా అనామకులు, దుర్బలులైన ఆ ముగ్గురు సామాన్య స్త్రీల పేర్లు ప్రస్తావించాడు. స్త్రీలను చులకన చేసి మాట్లాడే పురుషాధిక్య సమాజానికి దేవుడు పెట్టిన చురక, నేర్పిన అమూల్యమైన పాఠమిది. దైవభక్తిలో తెగింపు, చొరవ లేకపోతే అది ‘కొంగజపం’, ‘వేషధారణ’ అవుతుంది. దేవుని రాజ్యాన్ని, సమాజాన్నంతటినీ, చర్చిని, పరిచర్యను కాపాడుకోవలసిన బాధ్యత విశ్వాసులందరిదీ. పాము ఇంట్లో దూరితే ఇంటిని, ఇంట్లోని చంటిపిల్లల్ని ఒదిలి ప్రాణభయంతో పారిపోయే తల్లిదండ్రులు ఇలాంటివారే! దైవభక్తి తెగింపు మిళితమైన పరిచర్య చేసిన ఒకప్పటి మార్టిన్ లూథర్, మదర్ థెరిస్సా, స్పర్జన్, నిన్నమొన్నటి మాసిలామణి, భక్తసింగ్, పి.ఎల్.పరంజ్యోతిగార్లు, ఇప్పటి స్వర్గీయ జాన్‌డేవిడ్ (చిలకలూరిపేట), రెవ.డా.జీ.శామ్యేల్ (హైదరాబాద్ బాప్టిస్టుచర్చి) అలా తెగించి దేవుని సంక్పల్పాలను నెరవేర్చినవారే! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
తన ప్రేమను పంచేవారికోసం ఎదురు చూస్తున్నాడు దేవుడు!
సువార్త బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు తన పరాక్రమంతో బబులోను సామ్రాజ్యాన్ని విస్తరించి, స్థిరపర్చి ఖ్యాతినార్జించాడు. ఎంతో కిరాతకుడు, పాలనాదక్షుడుగా చెప్పుకునే నెబుకద్నెజరు యూదురాజ్యాన్ని కూడా ఆక్రమించి, అక్కడి దేవుని ప్రజలైన యూదులను చెరబట్టి బబులోనుకు బానిసలుగా తీసుకెళ్లాడు. యెరూషలేము దేవాలయాన్ని ధ్వంసం చేసి అందులోని బంగారు, వెండినంతా కొల్లగొట్టాడు. అయితే దేవుని ప్రజలైన యూదులు అతని చెరలో ఉన్న కారణంగా దేవుడతనికి కలల ద్వారా హెచ్చరికలు జారీ చేయగా, అతని వద్ద బానిసల్లో ఒకరైన దానియేలు వాటిని ఆయనకు విడమర్చి చెప్పవలసి వచ్చేది. అంతటి మహాచక్రవర్తి కూడా ఒక బానిస తెలివితేటల మీద ఆధారపడేవిధంగా దేవుడు తన శక్తిని నిరూపించాడు. చివరికతను పిచ్చివాడై రాజధాని వదిలి అరణ్యంలో జంతువులతో సమానంగా తిరుగుతూ గడ్డితింటూ గడిపే పరిస్థితి ఏర్పడింది (దానియేలు 4:1-33). మనిషికి అహంకారమే గొప్ప శత్రువు. ఈరోజున్న వైభవమే శాశ్వతమన్న భ్రమను ఆ శత్రువు కల్పిస్తాడు. పొద్దున వికసించి సాయంత్రానికి వాడిపోయే పూవులాంటి వైభవాన్ని నమ్ముకొని నన్ను మించినవారు లేరని విర్రవీగేవారి జీవితం, క్షణాల్లో పెకైగసి, వెలుగులు విరజిమ్మి బూడిదకుప్పగా ఎక్కడో కూలిపోయే తారాజువ్వలాంటిదేనన్నది చరిత్ర చెప్పే వాస్తవం. డబ్బు, పేరు ప్రఖ్యాతులు, జనాకర్షక విధానాలు పునాదిగా నిర్మించబడిన జీవితాలు, పరిచర్యలు, చర్చిలు కొద్దిరోజులు కనబడి ఆ తర్వాత అంతర్థానమై పోవడం వెనక రహస్యం ఇదే! విశ్వాసులను, దేవుణ్ణి కూడా సొంతలాభం కోసం వాడుకునే స్థాయికి దిగజారితే, దేవుని రాజ్య నిర్మాణం జరగదు సరికదా, అలా నిర్మించుకున్న సొంత సామ్రాజ్యాల పునాదులు కూడా కదిలిపోయి అవి కుప్పకూలిపోవడం తప్పదు. అయినా ఎంతో ఐశ్వర్యవంతుడు, సర్వాధిపతి, సర్వసృష్టికర్తగా, జగత్ రక్షకుడైన యేసుక్రీస్తే అన్నీ వదిలేసి రిక్తుడుగా, పేదగా, దాసుడుగా ఈ లోకానికి వేంచేస్తే ఆ దేవుని పరిచారకులమని చెప్పుకునే వారు అన్నీ సంపాదించుకోవడానికే తెగిస్తున్నారంటే, యేసుక్రీస్తు ఎవరో ఆయన ఆశయమేమిటో వారికింకా అర్థం కానట్టే!! యేసుప్రభువు అడుగుజాడల్లో నడిచిన ఆదిమ విశ్వాసులు, అపొస్తలులు కూడా అన్నీ వదులుకొని సేవ చేసి తరించినవారే. కాగా వారి వారసులైన ఈనాటి తరం పరిచర్య ముసుగులో అన్నీ సంపాదించుకోవడానికే ఆరాటపడటం బాధ కలిగించే విషయం. ప్రేమ, క్షమాపణ, పరిశుద్ధత తప్పనిసరిగా నిర్మించబడవలసిన దేవుని రాజ్యాన్ని, స్వార్థం, కుట్రలు, డబ్బుతో కంపుకొడుతున్న సొంత సామ్రాజ్యాల స్థాపన కోసం నిర్లక్ష్యం చేసినందుకు ఒకరోజున మూల్యం చెల్లించవలసి వస్తుంది. దేవుడు గొప్ప కార్యాలు, గొప్ప చర్చిలకోసం కాదు, తన ప్రేమను వెదజల్లే మంచి కార్యాలు, మంచి చర్చిలకోసం చూస్తున్నాడు. - రెవ.టి.ఎ. ప్రభుకిరణ్