employee arrested
-
కరోనాపై ఇన్ఫోసిస్ ఉద్యోగి పైత్యం...అరెస్టు
సాక్షి, బెంగళూరు : ఒకవైపు ప్రపంచమంతా కరోనా కల్లోలంతో భయకంపితులవుతోంది. మరీ ముఖ్యంగా శరవేగంగా పెరుగుతున్నకరోనా( కోవిడ్ -19) పాజిటివ్ కేసులతో కర్ణాటక రాష్ట్రం అల్లకల్లోలమవుతోంది. మరోవైపు బెంగళూరులోని ఒక ఇన్ఫోసిస్ ఉద్యోగి (25) పెట్టిన సోషల్ మీడియా పోస్టు ప్రకంపనలు రేపింది. "అందరూ బయటకు వెళ్లండి..తుమ్మండి...కరోనా వైరస్‌ని వ్యాపింపజెయ్యండి' అంటూ అభ్యంతరకర పోస్టు పెట్టాడు. ఇది క్షణాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన సిటీ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) అతగాడిని అరెస్టు చేసింది. బెంగళూరులోని ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేస్తున్న అతనిపై కేసు నమోదైందని జాయింట్ కమిషనర్ సందీప్ పాటిల్ ప్రకటించారు ఈ వ్యవహారంపై ఇన్ఫోసిస్ లిమిటెడ్ కూడా స్పందించింది. అతని అనుచితమైన పోస్ట్ పై దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. దర్యాప్తునకు ఆదేశించింది. ఇది తమ కంపెనీ ప్రవర్తనా నియమావళికి , బాధ్యతాయుతమైన సామాజిక భాగస్వామ్యానికి వ్యతిరేకమని స్పష్టం చేసింది. అంతర్గత దర్యాప్తు అనంతరం అతణ్ని ఉద్యోగం నుంచీ తొలగిస్తున్నామని ట్విటర్ ద్వారా ప్రకటించింది. అంతేకాదు ఇలాంటి చర్యల్ని ఎంతమాత్రం సహించే ప్రసక్తే లేదన్న ఇన్ఫోసిస్ యాజమాన్యం...ఇది అతను అనుకోకుండా చేసిన పొరపాటు కాదని, ఉద్దేశపూర్వంగానే ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని వివరించింది. కాగా కరోనాను విస్తరణను అడ్డుకునే క్రమంలో ఇన్ఫోసిస్ బీపీఎం, నాస్కామ్ సహకారంతో కర్ణాటక ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది. ముఖ్యంగా విదేశాలనుంచి తిరిగి వచ్చిన ప్రజలు పాటించాల్సిన స్వీయ-నిర్బంధ పద్ధతులు, పరీక్షా సౌకర్యాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. అలాగే ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనావైరస్ బారిన పడిన పౌరుల ఆరోగ్య అవసరాలను తీర్చడానికి, వైద్య సదుపాయాల విషయంలో అక్కడి ప్రభుత్వానికి మద్దతు నందిస్తోంది. Infosys has completed its investigation on the social media post by one of its employees and we believe that this is not a case of mistaken identity. (1/2) — Infosys (@Infosys) March 27, 2020 The social media post by the employee is against Infosys’ code of conduct and its commitment to responsible social sharing. Infosys has a zero tolerance policy towards such acts and has accordingly, terminated the services of the employee. (2/2) — Infosys (@Infosys) March 27, 2020 -
మనీల్యాండరింగ్ వివాదంలో రిలయన్స్!
న్యూఢిల్లీ: దేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) తాజాగా మనీల్యాండరింగ్ వివాదంలో చిక్కుకుంది. నెదర్లాండ్స్ సంస్థ ఎ హక్ తోడ్పాటుతో 1.2 బిలియన్ డాలర్లు మళ్లించినట్లు డచ్ ప్రాసిక్యూటర్స్ ఆరోపించడం సంచలనం రేపుతోంది. ఈ కేసులో ఎ హక్ ఉద్యోగులు ముగ్గురు అరెస్టయ్యారు. మూడు రోజుల విచారణ తర్వాత వారిని కోర్టు విడుదల చేసింది. మరోవైపు, ఈ ఆరోపణలను రిలయన్స్ ఇండస్ట్రీస్ తోసిపుచ్చింది. వివరాల్లోకి వెడితే.. ఎ హక్ ఉద్యోగులను అరెస్ట్ చేసిన ఫిస్కల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ సర్వీస్ అండ్ ఎకనమిక్ ఇన్వెస్టిగేషన్ సర్వీస్ (ఎఫ్ఐవోడీ–ఈసీడీ) కథనం ప్రకారం.. 2006–2008 మధ్య ఈస్ట్‌వెస్ట్ పైప్‌లైన్ (ఈడబ్ల్యూపీఎల్) అనే సంస్థ రిలయన్స్‌కి చెందిన కేజీ–డీ6 బ్లాక్ క్షేత్రం నుంచి పశ్చిమ భారతంలోని రాష్ట్రాల కస్టమర్లకు గ్యాస్ చేరవేసేందుకు పైప్‌లైన్ నిర్మాణం చేపట్టింది. దీనికి డచ్ సంస్థ ఎ హక్ కూడా సర్వీసులు అందించింది. ఈ క్రమంలోనే ఎ హక్ ఉద్యోగులు కొందరు ఓవర్ ఇన్వాయిసింగ్ (బిల్లులను పెంచేయడం) ద్వారా 1.2 బిలియన్ డాలర్ల మేర అవకతవకలకు పాల్పడ్డారు. ఈ నిధులు ఆ తర్వాత సంక్లిష్టమైన లావాదేవీలతో దుబాయ్, స్విట్జర్లాండ్, కరీబియన్ దేశాల గుండా అంతిమంగా సింగపూర్‌లో ఉన్న బయోమెట్రిక్స్ మార్కెటింగ్ అనే సంస్థకు చేరాయి. ఈ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందినదేనని ప్రాసిక్యూటర్స్ ఆరోపిస్తున్నారు. ఈ లావాదేవీలకు ప్రతిఫలంగా ఎ హక్ ఉద్యోగులకు 10 మిలియన్ డాలర్లు ముట్టాయని వారు పేర్కొన్నారు. ఇలా పైప్‌లైన్ నిర్మాణ వ్యయాలను పెంచేయడం వల్ల అంతిమంగా భారత ప్రజలే నష్టపోతున్నారని తెలిపారు. నష్టాల్లోని ఈడబ్ల్యూపీఎల్ (గతంలో రిలయన్స్ గ్యాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ –ఆర్జీటీఐఎల్) సంస్థను కొన్నాళ్ల క్రితం కెనడా సంస్థ బ్రూక్‌ఫీల్డ్‌కు చెందిన ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ రూ. 13,000 కోట్లకు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. ఈడబ్ల్యూపీఎల్ ఖండన.. మనీల్యాండరింగ్ ఆరోపణలను ఈడబ్ల్యూపీఎల్ ఖండించింది. ఈ పైప్‌లైన్ ప్రాజెక్టు పూర్తిగా ప్రమోటరు సొంత నిధులతో ఏర్పాటు చేసిన ప్రైవేట్ కంపెనీ ద్వారా నిర్మించడం జరిగిందని పేర్కొంది. భారత్, చైనా, రష్యా, మధ్యప్రాచ్య దేశాలకు చెందిన స్వతంత్ర కాంట్రాక్టర్ల కన్సార్షియం దీన్ని పూర్తి చేసిందని, స్వతంత్ర ఏజెన్సీలు మదింపు చేసిన ప్రామాణిక వ్యయాలతో ఈ ప్రాజెక్టును అత్యంత వేగవంతంగా పూర్తి చేయడం జరిగిందని పేర్కొంది. సదరు కాంట్రాక్టర్లలో ఎ హక్ కూడా ఒకటని వివరించింది. ఇక పెట్టుబడి వ్యయాలు పెరగడం వల్ల అధిక టారిఫ్ భారం పడిందన్న ఆరోపణలు తప్పని తెలిపింది. ఈ కేసంతా ఊహాగానాలు, అంచనాలే ప్రాతిపదికగా ఉందని, వాస్తవాలు లేవని పేర్కొంది. మరోవైపు, రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా మనీలాండరింగ్ ఆరోపణలను ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. 2006లో తాము గానీ తమ అనుబంధ సంస్థలు గానీ ఏ గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటు చేయలేదని స్పష్టం చేసింది. ఏ పైప్‌లైన్ నిర్మాణంలోనూ ఎప్పుడూ నెదర్లాండ్స్‌కి చెందిన ఏ సంస్థతోనూ కలిసి పనిచేయలేదని స్పష్టం చేసింది. ‘ఆర్ఐఎల్ ఎప్పుడూ కూడా చట్టాలు, నిబంధనలకు లోబడే పనిచేస్తోంది. అవకతవకల ఆరోపణలను ఖండిస్తున్నాం‘ అని ఆర్ఐఎల్ పేర్కొంది. -
విజయవాడలో పోలీసుల వీరంగం
-
ఇద్దరు ఉద్యోగుల అరెస్ట్
జంగారెడ్డిగూడెం : వైద్య, ఆరోగ్య శాఖలో నకిలీ నియామక పత్రాలు సృష్టించి ఏడుగురికి ఉద్యోగాలు ఇచ్చిన వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ వెల్లడించారు. శుక్రవారం రాత్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను ఆయన తెలిపారు. 2017 జూలైలో వైద్య, ఆరోగ్య శాఖలో జిల్లాలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాల నియామకం కోసం వైద్య, ఆరోగ్య శాఖ 47 మందికి నియామక పత్రాలు ఇచ్చినట్టు తెలిపారు. వీరిలో ఏడుగురు నకిలీ నియామక పత్రాలతో విధుల్లో చేరినట్టు గుర్తించారన్నారు. గౌరీపట్నం పీహెచ్సీలో కె.వరప్రసాద్, పూళ్ల పీహెచ్సీలో మహ్మద్ అజీముల్లా, బొర్రంపాలెం పీహెచ్సీలో ఎస్.దుర్గాప్రసాద్, లక్కవరం పీహెచ్సీలో వై.వెంకటరాజు, యలమంచిలి పీహెచ్సీలో ఆర్.ఏడుకొండలు, గుండుగొలను పీహెచ్సీలో ఎన్.నాగేశ్వరరావు, వీఆర్‌గూడెం పీహెచ్సీలో బి.రాజ్‌కుమార్ నకిలీ నియామక పత్రాలతో విధుల్లో చేరారన్నారు. వీరికి అప్పట్లో డీఎంహెచ్‌వో కార్యాలయంలో పనిచేస్తున్న అబ్దుల్ కరీం, అవుట్ సోర్సింగ్‌పై డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న కేవీ సత్యప్రసాద్ ఒక్కొక్కరి నుంచి రూ.4 లక్షలు తీసుకుని ఏడుగురు ఉద్యోగులకు నకిలీ నియామక పత్రాలు ఇచ్చారన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ప్రస్తుతం లక్కవరం పీహెచ్సీలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మహ్మద్ అబ్దుల్ కరీం, ఏలూరుకు చెందిన కేవీ సత్యప్రసాద్‌లను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వీరి నుంచి రూ.1.10 లక్షలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నకిలీ నియామక పత్రాలపై ఉద్యోగం పొందిన ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్టు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. సమావేశంలో సీఐ కె.బాలరాజు, లక్కవరం ఎస్సై జగదీశ్వరరావు పాల్గొన్నారు. ‘సాక్షి’ కథనంతో వెలుగులోకి.. వైద్య, ఆరోగ్య శాఖలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాల నియామకాల్లో చోటు చేసుకున్న అక్రమాలపై ‘సాక్షి’ గత నెల 8న ‘ఆరోగ్య శాఖకు నకిలీ మకిలి’ శీర్షికన కథనం ప్రచురించింది. ఆ తర్వాత వరుసగా మరో రెండు కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. ఈ కథనాలపై స్పందించిన జిల్లా ఎస్పీ పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించారు. దీంతో నకిలీ ఉద్యోగుల గుట్టు రట్టైంది. ఈ కేసులో సూత్రదారులను తాజాగా అరెస్ట్ చేశారు. అయితే ఈ వ్యవహారంలో ఆ శాఖ ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉన్నట్టు సమాచారం. ఉన్నతాధికారులను వదిలి కిందిస్థాయి సిబ్బందిని మాత్రమే బాధ్యులను చేశారని ఆ శాఖ ఉద్యోగులు విమర్శిస్తున్నారు. -
రక్షణశాఖ పత్రాల లీక్‌పై మరొకరి అరెస్టు
భారత రక్షణశాఖకు సంబంధించిన విలువైన పత్రాల లీకేజీ వ్యవహారం కేసులో పోలీసులు మరో ముందడుగు వేశారు. పత్రాల లీక్ లో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న వీరేందర్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఇతడు రక్షణశాఖలో స్టాఫ్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం వీరేందర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దాదాపు ఆరుగంటలపాటు విచారించారు. దీంతో ఈ కేసు మరింత లోతుగా విచారణ చేసేందుకు అవకాశం ఏర్పడినట్లు వేసినట్లు తెలుస్తోంది.