employees prc
-
పీఆర్సీపై పచ్చపత్రికల విషం
సాక్షి, అమరావతి: ఉద్యోగులకు పీఆర్సీపై ‘ఈనాడు’ మరోసారి తన మార్కు విషం వెళ్లగక్కింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంతోపాటు దేశంలో అత్యధిక రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీని ప్రకటించింది. తద్వారా ఏటా రూ.11,707 కోట్ల ఆర్థిక భారం భరించేందుకు సిద్ధపడింది. కానీ, ఈనాడు పత్రిక మాత్రం ‘అశుతోష్ మిశ్రా కమిటీ సిఫార్సులకు వక్రభాష్యం చెబుతూ ‘ప్రభుత్వంపై పీఆర్సీ భారం రూ.3,181 కోట్లే’ అనే శీర్షికన అవాస్తవ కథనాన్ని ప్రచురించి ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నించింది. తనదైన శైలిలో కమిటీ నివేదికకు వక్రభాష్యాలు చెబుతూ అసత్యాలతో కథనాన్ని వండివార్చింది. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రజలకు వాస్తవాలు వివరించేందుకే ఈ కథనం. ఏటా అదనపు ఆర్థికభారం రూ.11,707 కోట్లు 23 శాతం ఫిట్మెంట్ అమలుచేస్తూ ఈ ఏడాది జనవరి 17న జారీచేసిన రెండు జీఓల ప్రకారం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, హెచ్ఆర్ఏతో పాటు, అదనపు పెన్షన్ మొత్తం (ఏక్యూపీ) చెల్లింపుల వల్ల ప్రభుత్వంపై అదనంగా పడిన ఆర్థిక భారం రూ.10,247 కోట్లు. ఆ తర్వాత ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు, వేతనాల సవరణపై ఉద్యోగులకు ఉన్న అపోహలు తొలగిస్తూ, వారి సందేహాల నివృత్తి కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటుచేశారు. ఆ ఉప సంఘం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో పలు దఫాలుగా చర్చలు జరిపిన అనంతరం హెచ్ఆర్ఏ, ఏక్యూపీతో పాటు, సీసీఏలు సవరించాలని సిఫార్సు చేసింది. దీంతో ప్రభుత్వంపై మరో రూ.1,460 కోట్ల భారం పడుతోంది. దీంతో 11వ పీఆర్సీ అమలువల్ల ప్రభుత్వంపై అదనంగా పడుతున్న మొత్తం భారం రూ.11,707 కోట్లు. ► అలాగే, 2019 జూలై నుంచి 2020 మార్చి వరకు ఇచ్చిన ఐఆర్‌ను తిరిగి వసూలు చేయకూడదని తీసుకున్న నిర్ణయంవల్ల ప్రభుత్వంపై ఒకేసారి రూ.5,156 కోట్ల భారం పడింది. ► ఐఆర్‌తో పాటు, కొత్తగా ఫిట్మెంట్ ఇస్తూ అమలుచేసిన వేతనాల సవరణ వల్ల ప్రభుత్వంపై పడుతున్న మొత్తం భారం రూ.11,707 కోట్లు. వాస్తవాలు ఇలా ఉంటే.. టీడీపీ అనుకూల పత్రిక ఈనాడు మాత్రం పీఆర్సీతో ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం ఏటా రూ.3,181 కోట్లేనంటూ అవాస్తవాలను ప్రచురించి ఉద్యోగులు, ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. కేవలం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు వాస్తవాలను వక్రీకరిస్తూ బురదజల్లేందుకు యత్నించడంపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం, భారతీయ కార్మిక సదస్సు (ఐఎల్సీ) నియమాలకు అనుగుణంగా వేసిన గణాంకాల మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు 23 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని 11వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) సూచించింది. అయితే, ఉద్యోగులకు అప్పటికే 27 శాతం తాత్కాలిక భృతి (ఐఆర్) ఇస్తున్నందున అంతే ఫిట్మెంట్ ఇవ్వాలని 11వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వివిధ శాఖల కార్యదర్శుల కమిటీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఎందుకంటే అంతకుముందు ఎక్కువ మొత్తంలో ఇచ్చిన ఫిట్‌మెంట్స్‌వల్ల ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) గణనీయంగా పెరిగి రాష్ట్ర ఖజానాపై మోయలేని భారం పడుతోంది. ప్రభుత్వ సొంత ఆదాయం (ఎస్ఓఆర్) కంటే కూడా ఉద్యోగుల జీతభత్యాల వ్యయం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో.. ప్రతి ఐదేళ్లకోసారి వేతనాలు సవరించాలన్న ప్రక్రియ కార్యరూపం దాల్చడం కష్టమని కమిటీ భావించింది. అందుకే కేంద్ర ప్రభుత్వ 7వ వేతన సంఘం (సీపీసీ) సిఫార్సులకు అనుగుణంగా ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని కార్యదర్శుల కమిటీ సిఫార్సు చేసింది. సిఫారసు చేయకపోయినా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 23శాతం ఫిట్మెంట్ ఇక మరో పచ్చపత్రిక ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకూ 30శాతం స్కేల్ పెంచాలని పీఆర్సీ కమిటీ సిఫార్సులంటూ అవాస్తవాలను ప్రచురించడం విస్మయపరుస్తోంది. వాస్తవం ఏమిటంటే.. 11వ పీఆర్సీ కమిటీ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలపై ఎలాంటి సిఫార్సులూ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సానుకూల దృక్పథంతో స్పందించి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 23శాతం ఫిట్మెంట్ అమలుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. తద్వారా ఏటా రూ.430కోట్ల ఆర్థిక భారాన్ని వహించేందుకు సిద్ధపడింది. ఆర్థిక ఇబ్బందులున్నా ఉద్యోగుల సంక్షేమానికే పెద్దపీట ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతి పదేళ్లకోసారి పీఆర్సీ విధానాన్ని అమలుచేస్తూ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ప్రకటించింది. దేశంలో చాలా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ విధానాన్నే అమలుచేశాయి. ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు తదితర రాష్ట్రాలు తమ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ప్రకటించాయి. కేరళ ప్రభుత్వం అంతకంటే తక్కువగా 10 శాతం ఫిట్మెంట్ మాత్రమే ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగులు, పింఛనర్ల సంక్షేమానికి మరింత ప్రాధాన్యమిచ్చి సానుకూల దృక్పథంతో వ్యవహరించింది. 23 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వంతోపాటు పలు రాష్ట్రాలు ఇచ్చిన ఫిట్మెంట్ కంటే ఇది చాలా ఎక్కువ. అంతేకాదు.. ఏపీ ప్రభుత్వం ఐదేళ్లకోసారి పీఆర్సీ అమలుచేస్తామని కూడా చెప్పింది. -
ఉద్యోగుల సమస్యలపై సానుకుల నిర్ణయమే తీసుకుంటాం..
-
సాయంత్రానికి శుభంకార్డు?
-
చర్చలే దారి
సాక్షి, అమరావతి: జీతాల విషయంలో ఏ ఒక్క ఉద్యోగిని కూడా నష్టపోనివ్వబోమని, కొత్త పే స్లిప్ వచ్చిన తర్వాత వాస్తవాలు తెలుస్తాయని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. పీఆర్సీపై అపోహలు తొలగించేందుకు ప్రభుత్వం నాలుగు మెట్లు దిగేందుకైనా సిద్ధంగా ఉందన్నారు. గురువారం సచివాలయంలో మంత్రుల కమిటీ వరుసగా మూడో రోజు సమావేశం అనంతరం రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. షరతులు విధిస్తే ఎలా? పీఆర్సీ సాధన కమిటీ నుంచే కాకుండా ఇతర ఏ సంఘాలు వచ్చినా ప్రభుత్వం చర్చలు జరుపుతుందని సజ్జల తెలిపారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్లాల్సిన అవసరం రాకుండా పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఏ పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో తెలియచేసే అవకాశం ఇవ్వకుండా చర్చలకు షరతులు విధిస్తే ఎలా? అని ప్రశ్నించారు. చర్చలు కాకుండా ఇక ఏ మార్గంలో సమస్యకు సాంత్వన లభిస్తుందో చెప్పాలని సూచించారు. ప్రభుత్వం నియమించిన అధికారిక కమిటీ వ్యక్తిగతంగా ఫోన్ చేసి ఆహ్వానించినా ఉద్యోగ సంఘాలు రాకపోవడం దురదృష్టకరమన్నారు. బాధ్యతాయుత నాయకులు అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. మొండి వైఖరి విడనాడి న్యాయబద్ధమైన అంశాలు ఉంటే ప్రభుత్వంతో కలిసి సరిదిద్దుకోవాలన్నారు. సెలవు రోజుల్లో మినహా నిత్యం మధ్యాహ్నం 12 గంటల నుంచి సచివాలయంలో మంత్రుల కమిటీ అందుబాటులో ఉంటుందన్నారు. కమిటీ స్థాయిలో సమస్యకు పరిష్కారం లభించకుంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. రెచ్చగొట్టే ధోరణితో వ్యతిరేకతను పెంచుకోవద్దని సూచించారు. చర్చలకు వెళ్లాల్సిందిగా ఉద్యోగులు సంఘాల నాయకులకు సూచించాలని కోరారు. కొన్ని పత్రికలు వక్ర భాష్యాలు చెబుతూ ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని మండిపడ్డారు. చర్చలకొచ్చి.. ఒత్తిడి తగ్గించుకోండి ‘ఉద్యోగ సంఘాల నాయకులు తమపై ఉద్యోగుల నుంచి ఒత్తిడి ఉందని చెబుతున్నారు. అసలు ఒత్తిడికి గల సమస్యను పరిష్కరించుకోవాలి. సమ్మె తేదీ దగ్గరపడినా.. ఒకవేళ సమ్మెకు వెళ్లాల్సి వచ్చినా అప్పుడైనా చర్చలకు కూర్చోవాలి కదా? సీఎం సమక్షంలో ఫిట్మెంట్ ప్రకటనలో పాల్గొని సమ్మతి తెలిపారు. ఇప్పుడు మళ్లీ పాత పీఆర్సీ కోరడం అంటే పరిపక్వత లేకపోవడమో లేక ఇంకేమంటారో అర్థం కావట్లేదు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం సమ్మె చట్ట విరుద్ధం. కానీ మేము వాటి జోలికి వెళ్లట్లేదు. ఆర్థిక అంశాల వ్యవహారాలను నిరాకరించడం క్రమ శిక్షణ ఉల్లంఘన, ప్రభుత్వ వ్యతిరేక చర్యల కిందకే వస్తుంది. ఇలాంటివి జరగకుండా చర్చలకు వచ్చి సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకోవాలి. మేం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాం’ అని సజ్జల పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కోసం బాధ్యతాయుత నాయకులుగా చర్చలకు రావాలే కానీ తాము చెప్పిందే జరగాలని అనుకోవడం సరికాదని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. సమావేశంలో మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ తదితరులు పాల్గొన్నారు. -
కష్టకాలంలో మంచి నిర్ణయాలు
సాక్షి, అమరావతి: ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు, సొంతింటి కల దిశగా ఎంఐజీ లే అవుట్లలో ప్లాట్లు తాము ఊహించలేదని, మొత్తంగా పీఆర్సీ పట్ల సంతృప్తిగా ఉన్నామని ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. చాలా సమస్యలకు పరిష్కారం లభించిందని, కష్టకాలంలో సీఎం వైఎస్ జగన్ మంచి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శనివారం వారు సీఎంవో అధికారులతో సమావేశం అయ్యారు. అనంతరం అక్కడి మీడియా పాయింట్ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి. జగన్ చిత్రపటానికి స్వర్ణ కమలాభిషేకం శ్రీకాళహస్తి: ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, ఇతర వరాలు ప్రకటించిన నేపథ్యంలో శనివారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఆయన చిత్రపటాన్ని స్వర్ణ పుష్పాలతో అభిషేకించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో సంఘం నాయకులు చెంచురత్నంయాదవ్, నారాయణరెడ్డి, రవికాంత్, నాగేశ్వర్‌రెడ్డి, ఉపాధ్యాయ సంఘం నేతలు కృష్ణగిరి రెడ్డి, గోపి, విశ్రాంత ఉద్యోగుల సంఘం నేత రమణయ్య, పురపాలక, ఆర్టీసీ తదితర ఉద్యోగ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఉద్యోగుల్లో పండుగ సందడి ప్రభుత్వం పీఆర్సీ 23 శాతం పెంచడంతో పాటు పలు అనుకూల నిర్ణయాలు తీసుకోవడం పట్ల ఉద్యోగులందరూ ఆనందంగా ఉన్నారని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా.బి.ప్రతాపరెడ్డి అన్నారు. శనివారం ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో ఆయన ఉద్యోగుల సమక్షంలో కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచినందుకు గుంటూరులో ఎమ్మెల్సీ కల్పలత ఉపాధ్యాయ, ఉద్యోగులతో కలసి కేక్ కట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగులు ఆశించినట్లే హెచ్ఆర్ఏ ఉంటుంది హెచ్ఆర్ఏ విషయంలో ప్రస్తుత శ్లాబులనైనా కొనసాగించాలి, లేదా పీఆర్సీ కమిషనర్ సూచించిన శ్లాబులనైనా పరిగణలోకి తీసుకోవాలని తెలియజేశాం. పెన్షనర్లకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పాం. హెచ్ఆర్ఏ ఉద్యోగులు ఆశించినట్లే ఉంటుంది. సీఎం నిర్ణయాల పట్ల అందరూ ఆనందంగా ఉన్నారు. – కాకర్ల వెంకట్రామిరెడ్డి, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రభుత్వంపై నమ్మకం ఉంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పైన, ప్రభుత్వ ఉన్నతాధికారుల మీద మాకు నమ్మకముంది. అదనపు పెన్షన్ విషయంలో సీఎస్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తే పెన్షనర్లు ఇబ్బందులు పడతారని చెప్పాం. 62 ఏళ్లకు పదవీ విరమణ, సొంతింటి కల మేము ఊహించని నిర్ణయం. అన్ని సమస్యలపై సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం. – బొప్పరాజు వెంకటేశ్వర్లు, చైర్మన్, ఏపీ జేఏసీ అమరావతి సచివాలయాల ఉద్యోగులకు మేలు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తెలిసీ తెలియక కొంత మంది ఆందోళన చేస్తున్నారు. వాళ్లందరికీ తప్పకుండా రెగ్యులర్ అవుతుంది. ఇతర ఉద్యోగులతో సమానంగా వారికి అన్ని విషయాల్లో న్యాయం జరుగుతుంది. కారుణ్య నియామకాల విషయంలో ఏ శాఖలో అయినా నియామకం చేయాలని కోరాం. – కె.వి.శివారెడ్డి, ఏపీ ఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేటి సమావేశం వాయిదా ఈ నెల 7న సీఎం జగన్ ప్రకటించినవి కాకుండా మిగిలిన విషయాల గురించి శనివారం సీఎంవో అధికారులతో చర్చించాం. కోవిడ్, నాన్ కోవిడ్‌లో చనిపోయిన వారికి కూడా కారుణ్య నియామకాలు చేయాలని కోరాం. సానుకూలంగా నిర్ణయాలు జరిగాయి కాబట్టి మా కార్యాచరణ కోసం ఆదివారం జరగాల్సిన సమావేశం వాయిదా వేస్తున్నాం. – వైవీ రావు, ఆర్టీసీ ఉద్యోగుల సంఘం నేత డీఏలు అన్నీ ఒకేసారి క్లియర్ ఫిట్మెంట్ విషయంలో ఉపాధ్యాయులు కొంత అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమే. కానీ డీఏలు అన్నీ ఒకేసారి క్లియర్ చేస్తున్నారు కాబట్టి బాగానే ఉంది. సీఎం రాష్ట్ర పరిస్థితి గురించి ఆలోచించాలని చెప్పారు. మేమంతా అర్థం చేసుకుని ఆమోదించాం. ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లన్నీ పరిష్కారం అవుతున్నాయి. – జోసెఫ్ సుధీర్ బాబు, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని కోరాం. సీఎంవో అధికారులను కలిసి మా సమస్యను వివరించాం. ఎలిజిబిలిటీ ఉన్న వారికి వెంటనే ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని విన్నవించాం. ఉన్నతాధికారి అజయ్ జైన్ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమావేశం నిర్మాణ భవన్లో నిర్వహిస్తామన్నారు. – బత్తుల అంకమ్మ రావు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు కొత్త పీఆర్సీలో భాగంగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా కొత్త స్కేల్స్ వర్తింప చేస్తామని ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. సీఎం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత కార్యక్రమాలతో పాటు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)కు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డులు దక్కడం పట్ల గర్వంగా ఉంది. – కె.నాగరాజు, స్టేట్ సెర్ప్ ఎంప్లాయిస్ జేఏసీ కన్వీనర్ సీఎం నిర్ణయం సాహసోపేతం ఉద్యోగుల పీఆర్సీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం సాహసోపేతమైనది. ఈ పీఆర్సీలో మానవత్వం ఉంది. ఈ ప్రభుత్వం ఉద్యోగులను వేరుగా చూడటంలేదు. ప్రభుత్వంలో అంతర్భాగంగా చూస్తోంది. ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ, ఏమాత్రం తగ్గకుండా ఉద్యోగుల కష్టాలను తీరుస్తోంది. రిటైర్మెంట్ వయో పరిమితి పెంచటంపై ఎల్లో మీడియా పెదవి విరచడం దారుణం. చంద్రబాబు వయస్సు ఎంత, ఎందుకు రాజకీయాలకు రిటైర్మెంట్ ఇవ్వడంలేదో చెప్పాలి. ఇది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్లకు జగనన్న ఇచ్చిన సంక్రాంతి కానుక. – వెన్నపూస గోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ -
సీఎం జగన్ పీఆర్సీ ప్రకటనపై ఉద్యోగ సంఘాల హర్షం
-
ఉద్యోగుల పక్షపాతి సీఎం జగన్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం సంతోషకరమైన నిర్ణయమని ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి తెలిపారు. తాము అనుకున్న దానికంటే ఎక్కువే చేసినందున సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ జనవరి జీతం నుంచే పెంచిన పీఆర్సీ, ఐదు డీఏలు ఇస్తామడం మంచి బెనిఫిట్ అనిపేర్కొన్నారు. ఉద్యోగుల పక్షపాతి సీఎం జగన్ ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై సీఎం వైఎస్ జగన్డ్ తీసుకున్న నిర్ణయంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ ఉద్యోగుల పక్షపాతి అని నిరూపించుకున్నారు. రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచడం సంతోషకరమైన నిర్ణయం. ఈ జనవరి జీతం నుంచే పెంచిన పీఆర్సీ, 5డీఏలు ఇస్తామనడం మంచి బెనిఫిట్. ఏప్రిల్‌లోపు పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేస్తామని చెప్పడం మంచి పరిణామం. – కాకర్ల వెంకట్రామిరెడ్డి, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎవరూ ఊహించని వరాలు ఎవరూ ఊహించని విధంగా సీఎం.. మాకు వరాలిచ్చారు. సీఎస్ కమిటీ సిఫారసు చేసినట్లు 14.29 ఫిట్‌మెంట్‌ను పక్కన పెట్టి 23 శాతం ఇచ్చారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను జూన్ 30లోపు కొత్త ఫిట్మెంట్ సహా క్రమబద్దీకరిస్తామని స్పష్టంగా చెప్పారు. ఇళ్లు లేని వారికి 20 శాతం రిబేటుతో స్థలాలు కేటాయిస్తామనడం అభినందనీయం. మేం ప్రభుత్వానికి 71 డిమాండ్లు ఇవ్వగా 50 డిమాండ్లకు పరిష్కారం దొరికింది. – బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ చైర్మన్ సాహసోపేత నిర్ణయాలు సీఎస్‌తో కూడిన అధికారుల కమిటీ 2022 అక్టోబర్ నుంచి కొత్త పీఆర్సీ ప్రకారం సవరించిన జీతాలివ్వాలని ప్రతిపాదించినప్పటికీ, ఉద్యోగుల ఆకాంక్షల మేరకు 10 నెలల ముందే ఇవ్వాలని సీఎం ఆదేశించటం అభినందనీయం. రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచడంపై మేం ఆశ్చర్యానికి గురయ్యాం. ఇది నిజంగా సాహసోపేత నిర్ణయం. మెజారిటీ బెనిఫిట్స్ ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నాం. – బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఎసీ అమరావతి చైర్మన్ అన్నీ ఉద్యోగ సంఘాలు హర్షిస్తున్నాయి ఎక్కడా లేని విధంగా పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడం పట్ల అన్ని ఉద్యోగ సంఘాలు హర్షించాయి. రెండు వారాల్లో హెల్త్ కార్డుల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం చెప్పారు. ఇళ్లు లేని ఉద్యోగులకు ఎంఐజీ లే అవుట్ లో 20 శాతం రిబేటు ఇచ్చి స్థలం కేటాయిస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను ఈ నెల వేతనంతో ఇవ్వనున్నారు. మొత్తంగా సీఎం నిర్ణయాల పట్ల ఉద్యోగులందరిలో ఆనందం వెల్లివిరుస్తోంది. – ఎన్.చంద్రశేఖరరెడ్డి, ప్రభుత్వ సలహాదారు జగన్ అంటే ఒక నమ్మకం ఊహించని విధంగా ఉద్యోగులకు సీఎం వరాలు ఇచ్చారు. చేస్తానని చెప్పటం వేరు.. చేయడం వేరు. సీఎం జగన్ చేసి చూపించారు. అది ఒక్క సీఎం జగన్‌కే సాధ్యం. సీఎం జగన్ అంటే ఒక నమ్మకం. ఇది ఉద్యోగులకు సీఎం జగన్ ఇచ్చిన సంక్రాంతి కానుక. పెండింగ్ డీఏలన్నీ ఒకేసారి చెల్లిస్తామనడం రాష్ట్రంలో ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదు. రాష్ట్రంలోని ఉద్యోగులంతా సంతోషంగా ఉన్నారు. – వైవీరావు, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నేత మాకు శుభవార్త గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మూడు నెలలుగా పడుతోన్న ఆందోళనకు తెరపడింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసులు పర్మినెంట్ కావని కొందరు చేసిన దుష్ప్రచారానికి సీఎం అడ్డుకట్ట వేశారు. ఉద్యోగులకు మేలు చేసే విషయంలో మనసుతో, గుండెతో స్పందించి సీఎం జగన్ ఈ నిర్ణయాలను ప్రకటించినట్లు అర్థమైంది. ప్రభుత్వం మంచి పాలన అందించడంలో ఉద్యోగుల సహాయ, సహకారాలు మరింతగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయని చెబుతున్నాం. ఉద్యోగుల ఆశీస్సులు, చల్లని దీవెనలు సీఎం జగన్‌కు ఎల్లవేళలా ఉంటాయి. – మహ్మద్ జానీ బాషా, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘం నేత నిజంగా మాకు పండుగే సంక్రాంతి ముందు ఇంకో పెద్ద పండుగలా ఉంది. కరోనా ఆర్థిక పరిస్థితుల్లో సైతం 23 శాతానికిపైగా ఫిట్మెంట్ ప్రకటించడం హర్షించతగ్గ విషయం. పదవీ విరమణ వయస్సు పెంపు హర్షణీయం. – బి.సేవానాయక్, కార్యదర్శి, జేఏసీ ఏపీ నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నేరియన్స్ ఫెడరేషన్ చైర్మన్ స్వాగతిస్తున్నాం ఉద్యోగుల విషయంలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఉద్యోగులు ఊహించని విధంగా సర్వీసు కాల పరిమితిని 62 ఏళ్లకు పెంచడం పట్ల కృతజ్ఞతలు. సర్వీసు కాలాన్ని పెంచడంతో పాటు ఇంటి స్థలాల కొనుగోలుపై 20 శాతం రిబేట్ ఇవ్వడం, పెండింగ్ డీఏల చెల్లింపు, నిర్ణీత సమయంలో కారుణ్య నియామకాలు తదితర నిర్ణయాలు మాకందరికీ సంతృప్తినిచ్చాయి. అర్హత గలవారికి పదోన్నతులు ఇవ్వాలని కోరుతున్నాం. – ఎస్.కృష్ణమోహన్, ఏపీ మునిసిపల్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సీఎంకు ధన్యవాదాలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏప్రిల్ లోపు ఉన్న బకాయిలన్నీ క్లియర్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం హర్షించతగ్గ విషయం. వైద్యపరంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సీఎస్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయడం ఆహ్వానిస్తున్నాం. ఉద్యోగులెదుర్కొంటున్న సమస్యల పరిష్కారం దిశగా ఆదేశాలు ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. – పావులూరి హనుమంతరావు, ఏపీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆనందంగా ఉంది కరోనా పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ 23.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వడం హర్షణీయం. ఈ నెల నుంచే డీఏలన్నీ ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది. పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం నిజంగా హర్షించతగ్గ విషయం. ఉద్యోగుల తరఫున సీఎంకు కృతజ్ఞతలు. – ఏఏ భాస్కరరెడ్డి, అధ్యక్షుడు, ఏఎంసీ రాష్ట్ర ఉద్యోగుల సంఘం ఉద్యోగులకు ఎంతో మేలు ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఉద్యోగులకు ప్రభుత్వం 23 శాతం ఫిట్మెంట్ ప్రకటించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. స్మార్ట్ సిటీలలో 10 శాతం స్థలాల కేటాయింపుతో పాటు 20 శాతం రాయితీ ఇవ్వడం ఇళ్లు లేని ఉద్యోగులకు ఎంతో మేలు చేసే అంశం. ఈ పీఆర్సీలో ఉద్యోగులు ఊహించని ఎన్నో లాభాలను చేకూర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు. – వి.జయదేవ్, టూరిజం కార్పొరేషన్ ఆఫీసర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అనుకున్నదాని కంటే ఎక్కువ ఉద్యోగుల పీఆర్సీపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆనందం కలిగిస్తోంది. ఉద్యోగులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనుకున్న దానికంటే సీఎం ఎక్కువే చేసినందుకు కృతజ్ఞతలు. – కళ్లే పల్లి మధుసూదన రాజు, కన్వీనర్ కోన దేవదాసు, ఏపీ గ్రంథాలయ ఉద్యోగుల సంఘం (108/19) ఆర్థిక సమస్యలున్నా ఉద్యోగుల సంక్షేమాన్ని వీడలేదు కోవిడ్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ సీఎం వైఎస్ జగన్ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడ్డారు. రాష్ట్ర ఉద్యోగుల కోర్కెలను చాలావరకు తీర్చారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు వచ్చే జూన్ నాటికి ప్రొబేషన్ డిక్లేర్ చేసి రెగ్యులర్ పే స్కేల్ ఇస్తామని ప్రకటించడం శుభపరిణామం. – వీఎస్ దివాకర్, రాష్ట్ర రెవెన్యూ జేఏసీ చైర్మన్ హర్షణీయం కోవిడ్ సంక్షోభంలో ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా 23 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించడం హర్షణీయం. ఉద్యోగుల సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారనేందుకు ఇది తార్కాణం. ఇళ్లు లేని ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ ఇళ్లు.. తదితర అంశాలు ఎంతో అభినందనీయం. – కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీ ముందుగానే సంక్రాంతి అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు 27శాతం ఐఆర్ ఇచ్చారు. పెండింగ్ డీఏలను జనవరి నుంచి ఇస్తామనడం, ఇళ్లు లేని ఉద్యోగులకు రాయితీపై ఎంఐజీలో అవకాశం కల్పించడంతో ఉద్యోగులకు సంక్రాంతి సంబరాలు ముందే వచ్చాయి. సీఎంకు వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున కృతజ్ఞతలు – కె.జాలిరెడ్డి, కె.ఓబుళపతి వైఎస్సార్ టీఎఫ్ సంతోషకరం ఉద్యోగులకు 23% ఫిట్మెంట్ నిర్ణయం, ఉద్యోగుల పదవీవిరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం హర్షణీయం. ఇళ్లు లేని ఉద్యోగులకు ఇళ్ల నిర్ణయం సంతోషకరం. – లెక్కల జమాల్‌రెడ్డి, గురువారెడ్డి.. అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆపద్బాంధవుడు సీఎం ఉద్యోగుల పాలిట ఆపద్బాంధవుడుగా సీఎం జగన్ మరోసారి నిలిచారు. ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడం ఎందరో మధ్యతరగతి ఉద్యోగులకు ఊరటనిచ్చింది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా సీఎం జగన్ 27శాతం ఐఆర్ ఇచ్చారు. – తూతిక శ్రీనివాసవిశ్వనాథ్, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రకాశం చదవండి: ఫిట్మెంట్తో పాటు ఉద్యోగులకు సీఎం జగన్ మరో గుడ్‌న్యూస్ -
పీఆర్సీ బకాయిలపై రచ్చ
ప్రభుత్వ సమాధానం కోసం బీజేపీ పట్టు మంత్రులు, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ బకాయిల చెల్లింపుపై స్పష్టత కోరుతూ భారతీయ జనతాపార్టీ(బీజేపీ) ఆందోళనకు దిగడంతో గురువారం శాసనసభలో కొంతసేపు గందరగోళం నెలకొంది. ఈ అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో బీజేపీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీవీఎస్ ప్రభాకర్, రాజాసింగ్ స్పీకర్ పోడియం వద్దకు దూసుకొచ్చి నిరసనకు దిగారు. పీఆర్సీ అమలుకు సంబంధించి బుధవారం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో శాఖలవారీగా ఉద్యోగుల పేస్కేళ్ల వివరాలులేవని, వేతన స్థిరీకరణ మెమో రాలేదని, గ్రాట్యూటీని రూ.15 లక్షలకు పెంచుతామని ప్రభుత్వం అంగీకరించిన ఇంకా ఉత్తర్వులు జారీ చేయలేదని బీజేపీ సభ్యుడు జి.కిషన్‌రెడ్డి ‘జీరోఅవర్’లో ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. 2014 జూన్ 2 నుంచి రావాల్సిన పీఆర్సీ బకాయిలను బాండ్ల రూపంలో కాకుండా జీపీఎఫ్ ఖాతాలో జమా చేయాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ సభలో లేకపోవడంతో ప్రభుత్వం తరఫున ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి కె.తారకరామారావులు స్పందిస్తూ ఈ విషయాన్ని ఆర్థికశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమాధానమిప్పిస్తామన్నారు. ఈ సమాధానంపై బీజేపీ సంతృప్తి చెందకపోవడం, జీరోఅవర్‌లో సభ్యులు లేవనెత్తే ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానమిచ్చే సంప్రదాయం లేదని మంత్రులు బదులిచ్చారు. అయినా.. పీఆర్సీ బకాయిల అంశంపై సమాధానం కోసం బీజేపీ సభ్యులు పట్టుబట్టి నిరసనగా దిగారు. మంత్రులు కడియం శ్రీహరి, కేటీఆర్‌లు మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఉద్యోగుల స్నేహపూరిత ప్రభుత్వమన్నారు. ఎక్కడాలేని విధంగా 43 శాతం ఫిట్మెంట్, ప్రత్యేక ఇంక్రిమెంట్‌తోపాటు ఆరోగ్యకార్డులను జారీ చేశామన్నారు. కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే బీజేపీ ఈ ప్రశ్నను లేవనెత్తిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీఎల్పీ నేత కె.లక్ష్మణ్ స్పందిస్తూ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్యకార్డులు నిరుపయోగంగా మారాయని, కార్పొరేట్ ఆస్పత్రులు వీటిని తిరస్కరిస్తున్నాయని మండిపడ్డారు. భవిష్యత్తులో బాండ్లు సైతం ఇలానే చెల్లవన్నారు. ఆర్థికమంత్రితో సమాధానమిప్పిస్తామని స్పీకర్ నచ్చజెప్పి బీజేపీ సభ్యులతో ఆందోళన విరమింపజేశారు. జీరో అవర్‌లో ఎవరెవరు.. బహదూర్‌పూర తహసీల్దార్‌పై దాడి చేసినవారిని పీడీ యాక్టు కింద అరెస్టు చేయాలని అహమ్మద్ పాషా ఖాదీ(ఎంఐఎం) ప్రభుత్వాన్ని కోరారు. హెదరాబాద్-విజయవాడ మార్గంలో సర్వీసు రోడ్డు నిర్మించకపోవడంతో ఇప్పటివరకు 200 మంది ప్రమాదాలకు గురై మృతి చెందారని వేముల వీరేశం(టీఆర్ఎస్) ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఎస్సీ కులాల జాబితాలో నేతకాని కులాన్ని నితారిగా పేర్కొనడంతో కుల ధ్రువీకరణపత్రాలు జారీ కావడం లేదని, దీనిని సరిచేయాలని దుర్గం చెన్నయ్య(టీఆర్ఎస్) విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్-నర్సి రోడ్డులో ఇరుకుగా మారిన బ్రిడ్జీలతో తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే షకీల్ అహమద్(టీఆర్ఎస్) ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వేతనాలను రూ.1000 నుంచి రూ.15 వేలకు పెంచాలని, మెస్ చార్జీలను రూ.4.35 పైసల నుంచి రూ.15కు పెంచాలని రవీంద్ర కుమార్(సీపీఐ) డిమాండు చేశారు. -
తిరిగొచ్చిన సీఎం.. సమీక్షలతో బిజీబిజీ
-
తిరిగొచ్చిన సీఎం.. సమీక్షలతో బిజీబిజీ
నాలుగురోజుల వరంగల్ పర్యటన అనంతరం సీఎం కేసీఆర్ హైదరాబాద్ నగరానికి తిరిగొచ్చారు. వచ్చిన వెంటనే ఆయన పలు అంశాలపై సమీక్ష సమావేశాలతో బిజీబిజీగా గడిపారు. ఉద్యోగుల పీఆర్సీ అంశంపై ముందుగా సమీక్షించారు. పీఆర్సీపై తుది నిర్ణయం తీసుకోడానికి ఓ కమిటీ ఏర్పాటుచేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ చంద్ర నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుంది. మరోవైపు హైదరాబాద్ నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై కూడా సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముంబై నగరంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల వ్యవస్థను పరిశీలించి ఇక్కడ ఏర్పాటుచేయాలని సూచించారు. అన్ని జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు ఒకేచోట భవనాల ఏర్పాటుపై కూడా సీఎం సమీక్షించారు. రాజధానిలో సీఎం, సీఎస్, డీజీపీల నివాస ప్రాంగణాలు ఒకేచోట ఏర్పాటుచేయడంపై చర్చించారు. ఇంకోవైపు.. తెలంగాణలో గుడుంబా నియంత్రించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారని ఎక్సైజ్ అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. మూడు రోజుల్లో ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. -
పీఆర్సీ విషయం వెంటనే తేల్చండి: కేసీఆర్
ఉద్యోగుల పీఆర్సీ విషయాన్ని చర్చించి త్వరగా తేల్చాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. అలాగే, రైతులకు సోలార్ పంపుసెట్లు అందించేందుకు ఉద్దేశించిన టెండర్ల ఖరారు అంశాన్ని కూడా సీఎస్ కమిటీకి అప్పగించాలని నిర్ణయించారు. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ లాంటి ముఖ్యశాఖల్లో పనిచేసిన ఉద్యోగులు వేరే చోటకు డిప్యూటేషన్‌పై వెళ్తే వారిని వెంటనే మాతృశాఖకు సమర్పించాలని కేసీఆర్ ఆదేశించారు. వ్యవసాయ ట్రాక్టర్లు, ఇతర పనిముట్లు రోడ్లపైకి రావడం వల్ల రోడ్లు బాగా పాడవుతున్నాయని ఆయన చెప్పారు. పనిముట్లతో ఉన్న ట్రాక్టర్లను రోడ్ల మీద తిప్పకుండా ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని సీఎం కోరారు. అలాంటి చర్యలు పునరావృతం అయితే బాధ్యులపై కేసులు పెట్టాలని ఆదేశించారు. మెదక్ జిల్లా గజ్వేల్‌లో రెండు ఎకరాల విస్తీర్ణంలో రెండువేల మంది పట్టే ఆడిటోరియాన్ని నిర్మిస్తామని కూడా కేసీఆర్ చెప్పారు.