the employment guarantee scheme
-
నీటిపారుదల పథకం.. వేగవంతం చేయండి: నరేంద్ర మోదీ
నీటిపారుదల పథకంపై మంత్రులకు ప్రధాని ఆదేశం ఉపాధి హామీతో నీటిపారుదల పథకాన్ని అనుసంధానించాలి న్యూఢిల్లీ: గ్రామీణ నీటిపారుదల పథకం ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన అమలును వేగవంతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ తన సహచర మంత్రులను కోరారు. మంగళవారం వ్యవసాయం, నీటి వనరులు, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలతో ఆయన సమావేశమై పలు ఆదేశాలిచ్చారు. ప్రతి పొలానికి నీటిని అందించడమే ఈ పథకం లక్ష్యంగా ఉండాలన్నారు. దీన్ని ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయాలన్నారు. స్థూలస్థాయిలో నదుల అనుసంధానం ప్రాజెక్టులను గుర్తించి వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. ఉపగ్రహ చిత్రాలను, 3డీ చిత్రాలను ఉపయోగించి నీటిపారుదల అవకాశాలకు సంబంధించి మ్యాప్‌లను రూపొందించాలని, వాటితో వ్యవసాయదారులకు మార్గనిర్దేశనం చేయాలని సూచించారు. నీటి సంరక్షణ, ఆధునిక నీటిపారుదల పద్ధతుల వినియోగానికి సంబంధించి నేతృత్వం వహించడానికి ఆదర్శ రైతులను గుర్తించాలన్నారు. కొన్ని పట్టణాలను గుర్తించి, అక్కడ నీటిని రీసైక్లింగ్ చేయడం ద్వారా సమీపంలోని గ్రామాలకు సాగునీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే నీటి సంరక్షణ ప్రాముఖ్యంపై ప్రజల్ని చైతన్యపరచాలని సూచించారు. ఈ సమావేశానికి నీటి వనరుల శాఖ మంత్రి ఉమా భారతి, వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ తదితరులు హాజరయ్యారు. కాగా, ప్రభుత్వ ఉన్నతాధికారులు గడువు ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్‌నాటికి ఆస్తుల వివరాలు వెల్లడించేందుకు వీలుగా జనవరి చివరికల్లా ఏర్పాట్లు పూర్తి చేయాలని మోదీ అధికారులను ఆదేశించారు. -
ఆ కార్మికులకు ప్యాకేజీ కోసం చర్చించండి
వైఎస్సార్సీపీ అధినేత జగన్‌కు వ్యవసాయ కార్మిక సంఘం నేతల వినతి సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంతంలో సర్వం కోల్పోతున్న వ్యవసాయ కార్మికులు, దళితుల కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిం చేలా అసెంబ్లీలో చర్చించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నేతలు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.వెంకటేశ్వర్లు, కార్యదర్శి టి.క్రాంతికిరణ్ బుధవారం జగన్‌ను వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కలిసి వ్యవసాయ కార్మికుల, దళితుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. రాజధాని ప్రాంతంలో లక్ష మంది దళితులు, వ్యవసాయకార్మికులు సర్వం కోల్పోతారని.. అయినా ఏపీ ప్రభుత్వం ఇంత వరకూ ఒక నిర్దిష్టమైన ప్యాకేజీని ప్రకటించలేదని జగన్ దృష్టికి తెచ్చారు. కాగా, ఉపాధి హామీ పథకాన్ని కొన్ని మండలాలకే పరిమితం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ, శాసనమండలి తీర్మానం చేసినట్లుగానే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా చేయడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఈ సందర్భంగా జగన్‌కు విజ్ఞప్తి చేసింది. -
అక్రమాల పుట్టగా ‘ఉపాధి'
సైదాపురం: పల్లె ప్రాంత ప్రజలకు జీవనోపాధి చూసేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ ఉపాధి హామీ పథకం అక్రమాల పుట్టగా మారింది. కొందరు సిబ్బంది వివిధ రకాలుగా అందినకాడికి దోచుకుతింటున్నారు. చనిపోయిన వారి పేర్లతో పింఛన్లు స్వాహా చేయడంతో పాటు ఒక వ్యక్తి నాటిన నిమ్మ మొక్కలనే ముగ్గురు నాటినట్లు నిధులు డ్రా చేశారు. ఇలా అనేక రకాలుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. మొత్తంగా సైదాపురం మండలంలోని 31 పంచాయతీల్లో 2013 జూలై నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు రూ.3.5 కోట్లతో పనులు జరగ్గా రూ.కోటికి పైగా దుర్వినియోగం అయినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా జరుగుతున్న సామాజిక తనిఖీ నామమాత్రంగా జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శనివారం ప్రజావేదికపై నివేదిక బహిర్గతం చేయాలి. భారీగా అక్రమాలు మండలంలో సుమారు 500 మంది చనిపోయిన వృద్ధుల పేరు మీద గతంలో ప్రతి నెలా రూ.200 చొప్పున డ్రాచేసినట్లు తెలిసింది. నెలకు రూ.లక్ష వంతున 14 నెలలుగా రూ.14 లక్షలు స్వాహా అయినట్లు సమాచారం. ఓ పంచాయతీలో ఎంఐ ట్యాంకు నిర్మాణానికి రూ.12 లక్షలు మంజూరయ్యాయి. ఈ ఏడాది జూన్ 5 నుంచి అక్టోబర్ 1 వరకు 13,515 మంది కూలీలు పనులు చేసినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. ప్రతి వారం రూ.3,500 నుంచి రూ.5 వేలు చొప్పున డ్రా చేశారు. రోజూ ఇద్దరు ముగ్గురు మాత్రమే కూలీలు ఆ పనులకు వెళ్లినట్లు సమాచారం. సైదాపురానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పంచాయతీలో సుమారు రూ.16 లక్షలతో హార్టికల్చర్ అభివృద్ధి పనులు చేపట్టారు. ఆ నిధుల్లోనూ రూ.6 లక్షలు పక్కదారి పట్టాయని తెలిసింది. అప్పటికే నాటిన నిమ్మమొక్కలను మళ్లీ నాటినట్లు చూపి నిధులను కాజేసినట్లు తనిఖీల్లో తేలినట్లు సమాచారం. ఉపాధి సిబ్బందికి కొందరు నాయకులు కూడా తోడవడంతో ఆ పంచాయతీకి సంబంధించిన రికార్డులు మొదట గల్లంతవగా, తర్వాత మళ్లీ దొరికినట్లు ప్రచారం జరుగుతోంది. వ్యక్తిగత మ రు గుదొడ్ల నిర్మాణంలో అయితే అక్రమాలకు అంతేలేదని సమాచారం. ఓ గ్రామంలోని నిమ్మతోటను చూపించి ఒక ఇంట్లోని ముగ్గురి పేరుతో నిధులు డ్రా చేసినట్లు తెలుస్తోంది.