energy efficiency
-
నాడు విద్యుత్ పొదుపు భేష్
సాక్షి, అమరావతి: విద్యుత్ పొదుపులో ఆంధ్రప్రదేశ్ తీసుకున్న చర్యలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ) ఇటీవల వెల్లడించింది. రాష్ట్రంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ఉజాలా పథకం ద్వారా అందరికీ ఎల్ఈడీ బల్బులు అందుబాటులోకి తీసుకురావడం, వీధి దీపాల జాతీయ పథకం, వ్యవసాయ బోర్లకు విద్యుత్ ఆదా పంపు సెట్లు అమర్చడం వంటి ప«థకాలు సమర్థవంతంగా అమలయ్యాయి.రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలు, పంచాయతీలలో దాదాపు 29 లక్షల ఎల్ఈడీ వీధి దీపాలను ఎప్పటికప్పుడు పునరుద్ధరిస్తూ ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలిచింది. అదే విధంగా బీఈఈ ఆధ్వర్యంలో భవనాల్లో భారీ ఎత్తున విద్యుత్ పొదుపు సాధించేందుకు ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ) అమలు, రవాణా రంగంలో కాలుష్య నియంత్రణకి ఉద్దేశించిన ఎలక్ట్రిక్ వాహనాల(ఈ–మొబిలిటీ) పథకంలో విద్యుత్ వాహనాలకు రాయితీలు కల్పించడంలో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇటువంటి చర్యల ద్వారా రాష్ట్రంలో భారీగా విద్యుత్ ఆదాతో పాటు కర్బన ఉద్గారాలు తగ్గినట్లు బీఈఈ తెలిపింది. తద్వారా రాష్ట్ర విద్యుత్ వినియోగదారులకు, విద్యుత్ సంస్థలకు రూ.కోట్లలో ఆర్థిక ప్రయోజనం చేకూరినట్లు వివరించింది.ఉజాలా పథకంలో ఆదా ఇలా..దేశ వ్యాప్తంగా వార్షిక విద్యుత్ ఆదా – 47,882 మిలియన్ కిలోవాట్లు రాష్ట్రంలో వార్షిక విద్యుత్ ఆదా – 2,863 మిలియన్ కిలోవాట్లు ›దేశంలో వార్షిక విద్యుత్ వ్యయంలో మిగులు– రూ. 19,153 కోట్లు, రాష్ట్రంలో వార్షిక విద్యుత్ వ్యయంలో మిగులు – రూ.1,145 కోట్లు. దేశంలో పీక్ డిమాండ్ తగ్గుదల – 9,586 మెగావాట్లు రాష్ట్రంలో పీక్ డిమాండ్ తగ్గుదల – 573 మెగావాట్లుదేశంలో కర్బన ఉద్గారాల నియంత్రణ – 3,87,84,253 టన్నులు రాష్ట్రంలో కర్బన ఉద్గారాల నియంత్రణ – 33,18,461 టన్నులువీధి దీపాల జాతీయ పథకంలో ఆదా ఇలా.. దేశంలో వార్షిక విద్యుత్ ఆదా – 8,989.66 మిలియన్ కిలోవాట్లు రాష్ట్రంలో వార్షిక విద్యుత్ ఆదా – 1,980 మిలియన్ కిలోవాట్లు దేశ వ్యాప్తంగా పీక్ డిమాండ్ తగ్గుదల– 1,498 మెగావాట్లు రాష్ట్రంలో పీక్ డిమాండ్ తగ్గుదల– 330 మెగావాట్లుజాతీయ స్థాయిలో కర్బన ఉద్గారాల నియంత్రణ – 6.19 మిలియన్ టన్నులురాష్ట్రంలో కర్బన ఉద్గారాల నియంత్రణ – 1.36 మిలియన్ టన్నులు విద్యా సంస్థల్లో ఎనర్జీ క్లబ్లురాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ఇంధన సామర్థ్య ఫలాలను అందించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నాం. బీఈఈ ఆర్థిక సహకారంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) ద్వారా రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో ఇప్పటికే సుమారు 1,000 ఇంధన సామర్థ్య క్లబ్(ఎనర్జీ క్లబ్)లను ఏర్పాటు చేశాం. వీటి ద్వారా విద్యుత్ పొదుపుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం’’ – కె విజయానంద్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శివిద్యుత్ ఆదాలో తెలుగు రాష్ట్రాల కృషి ప్రశంసనీయంవిద్యుత్ ఆదా, లైఫ్‌మిషన్ అమలులో దక్షిణాది రాష్ట్రాలు, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలు చేస్తున్న కృషిని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (సీఐసీ) హీరాలాల్ సమారియా కొనియాడారు. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అన్ని వర్గాల ప్రజలకు పర్యావరణహిత జీవన విధానాల కోసం మిషన్‌లైఫ్‌లో భాగస్వామ్యం కావాలని సమారియా పిలుపునిచ్చారు. బీఈఈ దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మీడియా సలహాదారు ఎ.చంద్రశేఖర్‌రెడ్డి ఢిల్లీలో సమారియాతో సోమవారం భేటీ అయ్యారు. ఏపీ సాధించిన విజయాలకు సంబంధించిన సమగ్ర నివేదికను సమారియాకు చంద్రశేఖరరెడ్డి అందించారు. – సీఐసీ హీరాలాల్ సమారియా -
మరోసారి అంతర్జాతీయ ప్రశంసలందుకున్న ఏపీ ప్రభుత్వం
‘నవరత్నాలు’లో భాగమైన పెదలందరికి ఇల్లు పథకం కోసం ఎనర్జీ ఎఫిషియెన్సీ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపుతున్న దృఢమైన అంకితభావానికి అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంది. హౌసింగ్ డిపార్ట్మెంట్, ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL) సహకారంతో లబ్ధిదారులకు ఎనర్జీ ఎఫిషియెన్సీ స్టార్-రేటెడ్ ఉపకరణాలను అందించడానికి చర్యలు తీసుకుంది. దీని ద్వారా మెరుగైన జీవన ప్రమాణాలు, గణనీయమైన ఇంధన వనరుల పరిరక్షణకు హామీ ఇస్తుంది. ఢిల్లీలోని స్విట్జర్లాండ్ ప్రభుత్వ రాయబార కార్యాలయంలో ఎనర్జీ హెడ్ ఆఫ్ కోఆపరేషన్ అండ్ కౌన్సెలర్ జోనాథన్ డెమెంగే, దక్షిణ భారతదేశం.. కేంద్ర పాలిత ప్రాంతాలలో వ్యాపార అభివృద్ధి & ప్రభుత్వ వ్యవహారాల కోసం ఈఈఎస్ఎల్ సలహాదారు ఎ చంద్రశేఖర్ రెడ్డికి పంపిన కమ్యూనికేషన్లో ఈఈఎస్ఎల్ అండ్ గృహనిర్మాణ పథకంలో ఇంధన సామర్థ్య ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ఆకట్టుకునేలా అమలు చేస్తోందని తెలిపారు. ఇదీ చదవండి: అమెరికాలో వరదొస్తే ఆఫ్రికాకు వరం! ఎలా? ఎనర్జీ కన్సర్వేషన్ అండ్ గ్రీన్హౌస్ గ్యాస్ ఎమిషన్ తగ్గింపుపై ప్రజల్లో అవగాహన పెంచడం, దాని ప్రభావాన్ని గురించి అర్థమయ్యేలా వివరించడం, వాతావరణ మార్పులను సమర్థవంతంగా పరిష్కరించడంలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ఇప్పుడు చాలా అవసరం అని ఆయన అన్నారు. ఇదీ చదవండి: ఒక్క నెయిల్ పాలిష్ ధర ఇన్ని కోట్లా..!! ఆ డబ్బుతో మూడు బెంజ్ కార్లు కొనేయొచ్చు! డెమెంగే ప్రశంసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరుకి దక్కిన ఖ్యాతి అని చెప్పాలి. హౌసింగ్ పథకాలలో ఎనర్జీ ఎఫిషియెన్సీ చర్యలను ప్రవేశపెట్టేందుకు హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ & ఈఈఎస్ఎల్ సీఈఓ విశాల్ కపూర్లు చేసిన ప్రయత్నాలను కూడా ఆయన అభినందించారు. -
ఇంధన పొదుపులో ఏపీనే లీడర్
సాక్షి, విశాఖపట్నం: ఇంధన సామర్థ్య నిర్వహణలో అన్ని రాష్ట్రాలకు ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్(ఏపీఎస్ఈసీఎం) లీడర్‌గా వ్యవహరిస్తోందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) సెక్రటరీ రాకేష్ కే రాయ్ వెల్లడించారు. ఎనర్జీ ఎఫిషియన్సీలో మిగిలిన రాష్ట్రాలకు ఏపీని బ్రాండ్‌గా చూపిస్తున్నామని తెలిపారు. ఇంధన పొదుపునకు ప్రత్యేకంగా స్టేట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీ (ఎస్డీఏ)లు ఏర్పాటు చేయడం శుభ పరిణామమని చెప్పారు. ఆయన గురువారం ‘సాక్షి’తో మాట్లాడుతూ పలు అంశాలను వివరించారు. వాటిలో ప్రధానమైనవి.. ఏపీలో ఏటా రూ.3,500 కోట్లు ఆదా ఇంధన సామర్థ్య చర్యల్ని పటిష్టంగా అమలు చేయడంలో ఏపీ ప్రభుత్వం ముందంజలో ఉంది. అన్ని రాష్ట్రాలకూ ఏపీఎస్ఈసీఎం ఆదర్శంగా నిలుస్తోంది. ఇందుకోసం ఏపీలో ప్రత్యేకంగా ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్, స్టేట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీలు ఏర్పాటు చేయడం విశేషం. ఏపీ అనుసరిస్తున్న విధానాల్ని దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని నిర్ణయించాం. దేశంలో తొలిసారిగా రాష్ట్రపతి అవార్డుని ఏపీఎస్ఈసీఎం దక్కించుకోవడం ఇంధన పొదుపుపై ఏపీ విధానాలకు నిదర్శనం. ఇప్పటికే పవర్ ప్లాంట్స్, సిమెంట్, టెక్స్టైల్స్, డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఇలా.. రాష్ట్రంలోని మొత్తం 53 గుర్తింపు పొందిన భారీ పరిశ్రమలు బీఈఈ ప్రమాణాలకు అనుగుణంగా ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేస్తున్నాయి. దీని ద్వారా 3,430 మిలియన్ యూనిట్లు ఆదా చేస్తున్నాయి. దీని ద్వారా పెర్ఫార్మ్ అచీవ్ ట్రేడ్ (ప్యాట్) అమలులో ఏపీ ఇప్పటికే అద్భుతమైన పనితీరు కనబరుస్తోంది. ఏపీలోని పరిశ్రమల్లో ఇంధన పొదుపు ద్వారా ఏటా రూ.3,500 కోట్లు ఆదా అవుతోంది. ఏపీలో 12 వేల ఎనర్జీ క్లబ్‌లు ఏర్పాటు ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బీఈఈ విభిన్న కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా భవిష్యత్తు వారధులైన విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలని భాగస్వామ్యం చేస్తూ దేశవ్యాప్తంగా లక్ష ఎనర్జీ క్లబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ఏపీలో 12 వేల క్లబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి క్లబ్‌కు ఏటా రూ.10 వేలు నిధులు సమకూరుస్తాం. ఈ క్లబ్‌లు విద్యార్థుల్లో ఇంధన పొదుపుపై అవగాహన కల్పిస్తాయి. త్వరలో వలంటరీ కార్బన్ ట్రేడ్.. బీఈఈ అడ్మినిస్ట్రేటర్‌గా ఈ ఏడాది నుంచి వలంటరీ కార్బన్ ట్రేడింగ్ ఫ్రేమ్ వర్క్‌కు సిద్ధమవుతున్నాం. ఇంధన పొదుపు పాటించే ప్రతి పరిశ్రమకు కర్బన ఉద్గారాల నియంత్రణకు సంబంధించి బీఈఈ ఈ ట్రేడ్ ధ్రువపత్రం అందిస్తుంది. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ మరో 1.5 డిగ్రీలు దాటితే మరింత కర్బన ఉద్గారాలకు దారితీసే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే రుతుపవనాల రాకలో కూడా తీవ్రమైన మార్పులుంటాయి. దీనిని నియంత్రించడానికి భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దేశంలో 2030 నాటికి కర్బన ఉద్గారాలు 45 శాతం తగ్గించే లక్ష్యంతో రోషనీ అనే కార్యక్రమాన్ని బీఈఈ అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇంధన సామర్థ్య సాంకేతికత సాయంతో విద్యుత్, ఇతర ఇంధన వనరుల వినియోగాన్ని తగ్గించేందుకు నిర్మాణాత్మక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. భవిష్యత్తులో కర్బన ఉద్గారాల నియంత్రణలో భారత్ దిక్సూచిగా మారబోతోంది. మనం ఆదా చేసే విద్యుత్ శ్రీలంక సరఫరాతో సమానం ఇంధన సామర్థ్యం విషయంలో భారత్.. మిగిలిన దేశాలతో పోలిస్తే.. అద్భుతంగా అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో తలెత్తబోయే ప్రమాదాలను ముందే పసిగట్టిన ఏపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు.. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. దేశంలోని 13 రంగాలకు చెందిన పరిశ్రమలు ఇంధన సామర్థ్యాల్ని అమలు చేస్తుండటం వల్ల ఏటా రూ.48 వేల కోట్లు ఆదా విద్యుత్ వినియోగం అవుతోంది. ఇది శ్రీలంక వంటి దేశాలకు విద్యుత్ సరఫరాతో సమానం. ఈ సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉంది. -
ఇంధన పొదుపే మానవాళికి రక్ష
మానవాళి సహజవనరుల వినియోగంలో సంయమనం పాటించకపోతే మొత్తం జీవజాతి మనుగడే ప్రమాదంలో పడుతుంది. భూతాపం పెరుగుదలకు విచక్షణా రహితమైన ఇంధన వినియోగం ముఖ్య కారణం. ఈ సంగతిని గుర్తించింది కాబట్టే భారత్ కర్బన ఉద్గారాలను 2070 నాటికి సున్నా శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ లక్ష్య సాధనలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముందువరుసలో ఉంది. ఇంధన పరిరక్షణ, ఇంధన సామర్థ్యం వంటివి కర్బన ఉద్గారాల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇంధన సామర్థ్య కార్యక్రమాలను ప్రోత్సహించడం, ఇంధన పొదుపు సంస్కృతిని పెంపొందించే లక్ష్యంతో... అన్ని ప్రభుత్వ శాఖలలో ఇంధన సంరక్షణా విభాగాల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా జీఓ 89 జారీ చేసింది. వేగంగా అభివృద్ధి సాధించాలన్న తాపత్రయంతో విచక్షణారహితంగా సహజవనరులను కొల్లగొడుతుండడంతో వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. వాతావరణ మార్పులతో భూతాపం పెరిగిపోయి జీవవైవిధ్యం దెబ్బతింటోంది. రానున్న కాలంలో భూతాపోన్నతి 1.5 డిగ్రీలు దాటి 2.6–4.8 డిగ్రీ సెంటిగ్రేడ్లకు పెరిగిపోయే అవకాశం ఉందని పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 40 నుంచి 45 గిగా టన్నుల కర్బన ఉద్గారాలు విడుదల అవుతున్నాయి. వచ్చే 10 ఏళ్ళలో ఇది 480 నుంచి 490 గిగా టన్నులకు చేరే అవకాశం ఉంది. ఈ ఉద్గారాలు 500 గిగా టన్ను లకు మించి పెరిగితే వాతావరణంలో విపరీతమైన మార్పులు సంభ విస్తాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఉపరితల ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల పరి మితిని దాటకూడదనే లక్ష్యంతో కాప్–27 పర్యావరణ సదస్సు నిర్దేశిం చిన సంగతి తెలిసిందే. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు చేపట్టవలసిన చర్యలపై ప్రపంచ దేశాలన్నీ దృష్టి సారించాయి. కర్బన ఉద్గారాలను 2070 నాటికి సున్నా శాతానికి చేర్చాలని మన దేశం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో మన ప్రభుత్వాలు మనకున్న పరిమితమైన ఇంధన వనరులను కాపాడటం, గ్లోబల్ వార్మింగ్‌కు కారణమైన కాలుష్య కారకాలను తగ్గించడంపై దృష్టి పెడు తున్నాయి. ఇంధన భద్రత సాధించడంలో ఇంధన పరిరక్షణ, ఇంధన సామర్థ్యం కీలక పాత్ర పోషిస్తాయి. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడానికి దోహదపడతాయి. కాలుష్య కారక ఇంధనాలను పునరు త్పాదక ఇంధన వనరులతో భర్తీ చేయడం, ఇంధన కొరతను ఎదుర్కోవటం, పర్యావరణాన్ని కాపాడడం అనేవి.. ఇంధన పరిరక్షణ అత్యంత చవకైన, తక్షణ పరిష్కారాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. విద్యుత్, ఇతర ఇంధన వనరుల ఉత్పత్తిలో సహజ వనరుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. సహజ వనరులను కాపాడుకోవ డంలో ఇంధన పరిరక్షణ, ఇంధన సామర్థ్యం అత్యంత ప్రయోజన కరంగా ఉంటాయి. విద్యుత్తును ఆదా చేస్తే సహజ వనరులను పెద్ద ఎత్తున పరిరక్షించినట్లే. ఇంధన పరిరక్షణ వల్ల వాతావరణంలోకి కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించగలుగుతాం. ఇంధన సామర్థ్య కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే, ఆర్థిక ప్రగతిని సాధించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని ఆయన ప్రకటించారు. అంతేగాక ఆంధ్రప్రదేశ్‌ను 2027 నాటికి ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారుస్తామని కూడా ప్రకటించారు. ఇంధన సామర్థ్య కార్య క్రమాలను ప్రోత్సహించడం, ఇంధన పొదుపు సంస్కృతిని పెంపొం దించే లక్ష్యంతో అన్ని ప్రభుత్వ శాఖలలో ఇంధన సంరక్షణ విభాగాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేకంగా జీఓ 89 జారీ చేసింది. అటవీ పర్యావరణ శాఖను పర్యవేక్షిస్తున్న ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కాలుష్యం తగ్గించేందుకు టార్గెట్లను పెట్టడం కూడా మంచి పరిణామమే. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన పొదుపునకు పెద్ద ఎత్తున అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిసియెన్సీ గుర్తించింది. రాష్ట్రంలో 2030 నాటికి 6.68 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వివలెంట్ (ఎంటీఓఈ) ఇంధనాన్ని పొదుపు చేయా లని రాష్ట్రానికి లక్ష్యంగా నిర్ణయించింది. ఈ లక్ష్య సాధనకు అవస రమైన అన్ని చర్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటోంది. ప్రభుత్వ, ప్రైవేట్, పారిశ్రామిక సంస్థలలో ఇంధన సామర్థ్య కార్య క్రమాలను పెద్ద ఎత్తున అమలు చేసేందుకు చర్యలు చేపడుతోంది. విద్యుత్తు, ఇతర ఇంధన వనరులపై చేసే వ్యయాన్ని తగ్గించడం, విద్యుత్ డిమాండును తగ్గించడంలో ఇంధన సామర్థ్యం తక్షణ, చౌకైన పరిష్కారంగా పేర్కొనవచ్చు. ఇంధన సామర్థ్యం, ఇంధన సంరక్షణ కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయడం ద్వారా రాష్ట్రంలో ఉన్న మొత్తం విద్యుత్ డిమాండ్ 65,830 మిలియన్ యూనిట్లలో సుమారు 25 శాతం (16,450 ఎంయూ) ఆదా చేసే అవకాశం ఉంది. దీని విలువ సుమారు రూ. 11,480 కోట్లుగా అంచనా వేశారు. ఏపీ ఇప్పటికే ఎంపిక చేసిన భారీ పరిశ్రమల్లో ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి ‘పాట్’ (పెర్ఫార్మ్, అచీవ్, ట్రేడ్) పథకం అమలు చేస్తోంది. దీని వల్ల రాష్ట్రం ఇప్పటికి 0.818 (ఎంటీఓఈ) ఇంధనాన్ని ఆదా చేయగలిగింది. రాష్ట్రంలో ఇప్ప టికే నిర్వహించిన ఎల్ఈడీ వీధి లైట్లు, ఎల్ఈడీ బల్బుల పంపిణీ, పాట్ వంటి కార్యక్రమాల ద్వారా రూ. 3,800 కోట్ల విలువైన దాదాపు 5,600 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేసింది. ఇంధన సామర్థ్య రంగంలో భారీ పెట్టుబడులకు అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం అంటోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన ఇంధన సామర్థ్య పెట్టుబడుల సదస్సులో 29 ఇంధన సామర్థ్య ఫైనాన్సింగ్ ప్రాజెక్టులను గుర్తించడం జరిగింది. వీటిలో 14 ప్రాజెక్టులకు ఇప్పటికే రూ. 411 కోట్లు పెట్టుబడి వ్యయం అవుతుందని కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఈఈ అంచనా వేసింది. మిగిలిన ప్రాజెక్టుల పెట్టుబడి అంచనా వ్యయాన్ని అది త్వరలో ప్రకటించనుంది. ఈ సదస్సులను క్రమం తప్పకుండా నిర్వ హించటం ద్వారా రాష్ట్రానికి ఇంధన సామర్థ్య పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. దేశంలో తొలిసారిగా ఏపీ నిర్వహించిన ఇంధన సామర్థ్య పెట్టుబడుల సదస్సు స్ఫూర్తితో ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ తరహా సదస్సులు నిర్వహించడానికి బీఈఈ సమాయ త్తమైంది. ఇంధన పరిరక్షణ, ఇంధన సామర్థ్య కార్యక్రమాలకు ఉన్న విస్తృత ప్రయోజనాల దృష్ట్యా – ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో పాటు ప్రజ ల్లోనూ ఇంధన పరిరక్షణ, ఇంధన పొదుపు ఆవశ్యకతపై పెద్దఎత్తున అవగా హన కల్పించే లక్ష్యంతో ఈ నెల 14 నుండి 20 వరకు జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాలను జరుపుకొంటున్నాం. దీనిలో వివిధ వర్గాల ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులను, స్వయం సహాయక సంఘాలను భాగస్వాములు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇంధన పొదుపు, ఇంధన భద్రత సాధించే ప్రయత్నంలో రాష్ట్రం లోని ప్రతి పౌరుడినీ భాగస్వాములుగా చేయాలన్నదే ఈ కార్యక్రమ లక్ష్యం. ప్రజల్లో ఇంధన పొదుపు జీవన శైలిపై అవగాహన కల్పిం చడం, తద్వారా కలిగే ప్రయోజనాలను వివరించేందుకు వారం రోజుల పాటు అవగాహనా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇళ్లలో విద్యుత్ వృథాను అరికట్టడం ఒక భాధ్యతగా భావించాలి. వినియోగంలో లేనపుడు లైట్లు, ఫ్యాన్లు ఆఫ్ చేయడం, ఎయిర్ కండీషనర్ 24 డిగ్రీల వద్ద సెట్ చేయడం వంటి పొదుపు చిట్కాలను తప్పక పాటించాలి. ఎల్ఈడీ లైట్లు, ట్యూబ్ లైట్లు, స్టార్ రేటెడ్ విద్యుత్ ఉపకరణాలను వినియోగించడంతో విద్యుత్ ఆదా అవుతుంది. ఒక యూనిట్ విద్యుత్తును ఉత్పత్తి చేయాలంటే 800 గ్రాముల బొగ్గు అవసరం. దీని వల్ల 700 గ్రాముల కార్బన్ డయాక్సైడ్ వెలువ డుతుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, ప్రజానీకాన్ని ఇంధన సామర్థ్య కార్యకలాపాలలో భాగస్వా ములుగా చేయడం; ఇంధన సామర్థ్య సాంకేతికతను ప్రవేశపెట్టడం, ఇంధన పొదుపు కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలుచేసే విధంగా ఏపీఎస్ఈసీఎం ఒక రోడ్ మ్యాప్‌ను తయారు చేస్తోంది. రాష్ట్రం విద్యుత్ వినియోగంలో 25 శాతం పొదుపు సాధించడమే ఈ రోడ్ మ్యాప్ లక్ష్యం. రాష్ట్రాన్ని ఇంధన పొదుపులో దేశానికి ఆదర్శంగా నిలిపేలా చేస్తున్న కృషిలో మనమందరం భాగస్వాములమవుదాం. ఎ. చంద్రశేఖర రెడ్డి వ్యాసకర్త సీఈఓ, ఏపీ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఇంధన పొదుపులో ఏపీ ప్రభుత్వం రాష్ట్రపతి నుంచి జాతీయ అవార్డు అందుకుంటున్న సందర్భంగా) -
23న విశాఖలో ఇంధన సామర్థ్య పెట్టుబడుల సదస్సు
సాక్షి, అమరావతి: ఇంధన సామర్థ్యం పెట్టుబడుల సదస్సు (ఇన్వెస్ట్మెంట్ బజార్)ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) సమన్వయంతో 23న విశాఖలో నిర్వహించనున్నట్టు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే ప్రకటించారు. రాష్ట్ర ఇంధన శాఖ, ఏపీఎస్ఈసీఎం అధికారులతో ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర పారిశ్రామిక రంగంలో ఇంధన సామర్థ్య సాంకేతికతను అందుబాటులోకి తేవటం, దానిని వినియోగించుకోవడం కోసం పరిశ్రమలకు ఆర్థిక సహకారం అందించడమే లక్ష్యంగా ఆసక్తి గల పరిశ్రమలను, బ్యాంకులను, ఆర్థిక సంస్థలను ఒకే వేదిక పైకి తెచ్చేందుకు సదస్సును నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ఇన్వెస్ట్మెంట్ బజార్ వేదికగా పెట్టుబడులకు అవకాశమున్న ప్రాజెక్టులను గుర్తిస్తామని, సదస్సులో ఎంపికైన పరిశ్రమలకు ప్రాజెక్టులు అమలు చేసేందుకు ఆర్థిక సహకారం అందే ఏర్పాటు చేస్తామని అభయ్ బాక్రే చెప్పారు. గతేడాది మార్చిలో ఇదే విశాఖలో దేశంలో తొలిసారిగా ఇంధన సామర్థ్య పెట్టుబడుల సదస్సును నిర్వహించిన ఘనత ఏపీకి దక్కుతుందని, విద్యుత్ రంగంలో ప్రత్యేకించి ఇంధన సామర్థ్యం, పునరుత్పాదక ఇంధన రంగాల్లో ఏపీ పనితీరును గుర్తించి మరోసారి విశాఖలో సదస్సు నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఇంధన సామర్థ్య ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పరిశ్రమల నుంచి ఏపీఎస్ఈసీఎంకు ప్రతిపాదనలు వస్తే వాటికి అవసరమైన సాంకేతిక ప్రక్రియ నిర్వహించి, ఆర్థిక సంస్థలకు పంపుతామని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. సమావేశంలో ఏపీఎస్ఈసీఎం సీఈవో చంద్రశేఖరరెడ్డి, ఇంధన శాఖ అధికారులు పాల్గొన్నారు. -
శుద్ధ ఇంధనాలు, ఇన్ఫ్రాకు ప్రాధాన్యం ఇవ్వాలి
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల శుద్ధ ఇంధనాలు, మౌలిక సదుపాయాల కల్పన తదితర ప్రాధాన్య రంగాల్లో పెట్టుబడులు పెంచాలని ఆసియా మౌలిక అభివృద్ధి బ్యాంకు (ఏఐఐబీ)ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. అలాగే, విద్య, ఆరోగ్యంపైనా పెట్టుబడుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఏఐఐబీ బోర్డ్ ఆఫ్ గవర్నర్ల ఏడో వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి మంత్రి సీతారామన్ మాట్లాడారు. ప్రాధాన్య రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఏఐఐబీని కోరారు. విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాలు, సామాజిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ సదుపాయాలు, విద్య, ఆరోగ్య సదుపాయాల కల్పన ప్రాధాన్యతలను మంత్రి గుర్తు చేశారు. ఈ రంగాల్లో చెప్పుకోతగ్గ మార్పును తీసుకొచ్చేందుకు మరిన్ని పెట్టుబడుల అవసరం ఉందన్నారు. ఏఐఐబీ సభ్య దేశాల విస్తృత మౌలిక అవసరాలను చేరుకోవడం కేవలం ప్రభుత్వాలు చేసే కేటాయింపులతోనే సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్వావలంబన బాటలో భారత్.. భారత్ స్వావలంబన ఆర్థిక వ్యవస్థ బాటలో ఉన్నట్టు గుర్తు చేశారు. దీంతో కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ప్రతికూల ప్రభావాలను సమర్థంగా అధిగమించినట్టు చెప్పారు. పెద్ద ఎత్తున నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టడం, లక్ష్యాలకు అనుగుణమైన విధానాలు.. సవాళ్ల మధ్య బలంగా నిలబడేందుకు సాయపడినట్టు వివరించారు. -
AP Special: శ్రీవారి సన్నిధిలో ఇం‘ధన’ పొదుపు
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానములు(టీటీడీ)లో విద్యుత్ పొదుపునకు చర్యలు తీసుకుంటున్నారు. పర్యావరణహిత, ఇంధన సామర్థ్య సాంకేతికతలను ప్రవేశపెడుతున్నారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ), ఆంధ్రప్రదేశ్ ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) సహకారంతో ఈ ఇంధన సామర్థ్య కార్యక్రమాలను టీటీడీ అమలు చేయనుంది. దీనివల్ల టీటీడీ ప్రస్తుతం విద్యుత్ బిల్లులపై చేస్తున్న వ్యయంలో దాదాపు 10 శాతం ఆదా అయ్యే అవకాశముందని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. టీటీడీ ఏటా 68 మిలియన్ యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తోంది. ఇందులో 30 శాతం సౌర, పవన విద్యుత్తు కాగా, 70 శాతం విద్యుత్‌ను ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) సరఫరా చేస్తోంది. విద్యుత్ బిల్లులకు ఏటా సుమారు రూ. 40 కోట్ల వరకు టీటీడీ ఖర్చు చేస్తోంది. విద్యుత్ ఆదా చర్యలు అమలు చేయడం ద్వారా బిల్లులలో కనీసం 10 శాతం ఆదా చేయాలని భావిస్తోంది. దీనికోసం టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని పాఠశాలలు, కళాశాలల భవనాలపై 2 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్తు కేంద్రాలను న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎన్ఆర్ఈడీసీఏపీ), జాతీయ స్థాయి ఏజెన్సీల సహకారంతో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పాత ఫ్యాన్ల స్థానంలో కొత్తవి.. టీటీడీలోని పాత పంప్ సెట్ల స్థానంలో ఇంధన సామర్థ్య పంపు సెట్లు, 5 వేల సాధారణ ఫ్యాన్ల (75 వాట్లు) స్థానంలో సూపర్ ఎఫిషియంట్ బీఎల్డీసీ (బ్రష్ లెస్ డైరెక్ట్ కరెంటు) ఫ్యాన్లు (35 వాట్లు) వంటి ఇంధన సామర్థ్య ఉపకరణాలను అమర్చనున్నారు. వీటి వల్ల ఏడాదికి రూ. 62 లక్షల విలువైన 0.88 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఆదా అయ్యే అవకాశముంది. విద్యుత్ ఆదాకు ప్రణాళికలు టీటీడీ అనుబంధ ఆలయాలు, సత్రాలలో విద్యుత్ పొదుపు చర్యలు చేపడుతున్నాం. దీనిలో భాగంగా బీఈఈ స్టార్ రేటెడ్ ఉపకరణాలు వినియోగంతో పాటు పునరుత్పాదక ఇంధన వనరులను తగినంత స్థాయిలో వినియోగించుకోవాలని భావిస్తున్నాం. అదే విధంగా తిరుమల, తిరుపతిలో ఎలక్ట్రిక్ రవాణా సదుపాయాలను కూడా ప్రోత్సహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. ఈ చర్యల వల్ల విద్యుత్ వినియోగం తగ్గడంతో పాటు భక్తులకు మరింత సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నాం. –టీటీడీ ఈవో కె.జవహర్‌రెడ్డి -
‘ఇంధన’ సూచీలో భారత్‌కు 76వ ర్యాంక్...
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) రూపొందించే అంతర్జాతీయ ఇంధన పరివర్తన సూచీలో భారత్ ఈ ఏడాది రెండు స్థానాలు పైకి ఎగబాకి 76కు చేరుకుంది. ఇందన భద్రత, పర్యావరణ స్థిరత్వం, ఇంధన అందుబాటు వంటి అంశాలను ఏ విధంగా సమతుల్యం చేసుకుంటున్నాయన్న దాని ఆధారంగా 115 దేశాలకు ఈ ర్యాంకులను డబ్ల్యూఈఎఫ్ కేటాయిస్తుంటుంది. ఈ జాబితాలో స్వీడన్ మరోసారి అగ్ర స్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్, నార్వే మొదటి మూడు స్థానాల్లో ఉన్నట్టు సోమవారం విడుదలైన డబ్ల్యూఈఎఫ్ నివేదిక పేర్కొంది. ఇంధన అనుసంధానత పెరిగినప్పటికీ... ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ 100 కోట్ల మంది విద్యుత్ వినియోగానికి దూరంగా ఉన్నట్టు వెల్లడించింది. అధిక జనాభాతోపాటు ఇంధన వ్యవస్థలో కార్బన్ డై ఆక్సైడ్ తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటని తెలిపింది. ‘‘భారత్ ఇటీవలి సంవత్సరాల్లో ఇంధన అందుబాటును పెంచేందుకు పెద్ద ముందడుగు వేసింది. ఇంధన పరివర్తనలో నియంత్రణ, రాజకీయ కట్టుబాటు విభాగాల్లో స్కోరు మెరుగ్గా ఉంది’’ అని నివేదిక పేర్కొంది. కాలం చెల్లిన ఇంధన వ్యవస్థలు భారత్‌లో ఉన్నప్పటికీ పరివర్తన దిశగా ఆశావహ పరిస్థితులు ఉన్నట్టు తెలిపింది. సిస్టమ్‌ల పనితీరులో భారత్ కాస్తంత వెనుకనే ఉన్నప్పటికీ, సన్నద్ధతలో మెరుగ్గా ఉంది. మొత్తం మీద భారత్ ఈ సూచీలో రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 78 నుంచి 76కు చేరుకుంది. ఇక పొరుగు దేశం చైనా మన కంటే ఆరు స్థానాలు దిగువన 82లో ఉంది. -
వాయిదా పద్థతిలో ఫైవ్‌స్టార్ ఫ్యాన్లు
- పెలైట్ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లా - లక్ష ఫ్యాన్ల పంపిణీ.. ఒక్కొక్కటీ రూ.1,400 - ఏపీఈఆర్సీ అనుమతి కోరిన ఎస్పీడీసీఎల్ హైదరాబాద్: ఏపీలోని విద్యుత్ వినియోగదారులకు వాయిదాల పద్ధతిలో 5 స్టార్ ఫ్యాన్లు ఇవ్వబోతున్నారు. ఇందుకోసం కృష్ణా జిల్లాను పెలైట్ ప్రాజెక్టుగా గుర్తించి, తొలుత ఇక్కడ లక్ష ఫ్యాన్లు అందించాలని నిర్ణయించారు. ఈ పథకానికి అనుమతివ్వాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)ని దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) సోమవారం కోరింది. సంస్థ ప్రతినిధులు ఫ్యాన్ల అమ్మకాలకు సంబంధించిన వివరాలతో సమగ్ర నివేదికను సమర్పించారు. ఏపీఈఆర్సీ అనుమతి రావడంతోనే ఫ్యాన్ల అమ్మకాలు మొదలుపెడతామని అధికారులు తెలిపారు. ఇంధన పొదుపులో భాగంగా కేంద్ర ఇంధన పొదుపు సంస్థ (ఈఈఎస్ఎల్) కృష్ణా జిల్లాకు లక్ష ఫ్యాన్లు అందిస్తోంది. టెండర్ల ద్వారా ఈ ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశారు. ఒక్కో ఫ్యాన్ ఖరీదు రూ.1,400. వీటిని 24 నెలల సులభవాయిదాల్లో వినియోగదారుడు చెల్లించాల్సి ఉంటుంది. నెలకు సుమారు రూ.60 వరకూ ఇన్స్టాల్మెంట్గా వసూలు చేస్తారు. ఈ మొత్తాన్ని నెలవారీ విద్యుత్ బిల్లులో కలుపుతారు. ఒకవేళ వినియోగదారుడు వాయిదాల పద్ధతి అవసరం లేదనుకుంటే, రూ.1,260 కే ఫ్యాన్‌ను అందజేస్తారు. బజాజ్, ఉషా ఫ్యాన్లను పంపిణీ చేయబోతున్నట్టు ఏపీఈఆర్సీకి ఎస్పీడీసీఎల్ తెలిపింది. విద్యుత్ వినియోగదారుల నుంచి వసూలు చేసే వాయిదా సొమ్మును పంపిణీ సంస్థ నేరుగా ఈఈఎస్ఎల్కు ఇవ్వాల్సి ఉంటుంది. ఏ ఒక్క నెలలో వాయిదా చెల్లించకపోయినా వినియోగదారుడి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు. డిస్కమ్‌ల అయిష్టత ఫ్యాన్ల పంపిణీ పథకంపై విద్యుత్ పంపిణీ సంస్థలు అయిష్టంగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే సిబ్బంది కొరత వెంటాడుతుంటే, ఫ్యాన్ల అమ్మకాల కోసం దుకాణాలు తెరవాల్సిన పరిస్థితి ఇబ్బందిగా ఉంటుందని చెబుతున్నారు. ఫ్యాన్లను ఈఈఎస్ఎల్ నేరుగా విద్యుత్ సెక్షన్ కార్యాలయాలకు పంపుతుంది. ఒకవేళ అవి పనిచేయకపోయినా, చెడిపోయినా తాము బాధ్యత వహించలేమని పేర్కొంటున్నారు. వినియోగదారుడు నేరుగా ఈఈఎస్ఎల్తో సంప్రదించాల్సిరావడం సాధ్యమయ్యే పనికాదంటున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు ఆగ్రహించే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదీగాక ఇందుకు సంబంధించిన రికార్డులు నిర్వహించడం కూడా సమస్యేనని, క్షేత్రస్థాయి సిబ్బంది నాణ్యతలేని ఫ్యాన్లు అందించినా నియంత్రించడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం బలవంతంగా దీన్ని తమపై రుద్దుతోందని విద్యుత్ అధికారులు వాపోతున్నారు.