English words
-
English Idiom: ఏ బోల్ట్ ఫ్రమ్ ది బ్లూ.. అర్థం తెలుసా?
తనకు బుకర్‌ప్రైజ్ వచ్చిన సందర్భంగా రచయిత్రి గీతాంజలి శ్రీ తొలి స్పందనగా ఇలా అన్నారు... ఏ బోల్ట్ ఫ్రమ్ ది బ్లూ! అనుకోని సంఘటన, ఊహించని ఫలితం...మొదలైన సందర్భాలలో ఉపయోగించే ఇడియమ్ ఇది. ఇక దీని మూలాల విషయానికి వస్తే... ప్రశాంతమైన ఆకాశం ఉన్నట్టుండి ఉరుముతుంది. ఎక్కడో పిడుగుపడుతుంది...ఇదంతా ఊహకు అందనిది. మరొకటి ఏమిటంటే... మధ్యయుగాల కాలంలో యుద్ధాలలో ‘క్రాస్బో’(అడ్డవిల్లు)ను ఉపయోగించేవారు. సాధారణ విల్లుతో పోల్చితే ఇందులో నుంచి ప్రయోగించే ‘బోల్ట్’ ఎక్కువ దూరం దూసుకువెళుతుంది. టార్గెట్పర్సన్కు షూటర్ కనిపించడు. ఇది ఊహించనిది. ‘బోల్డ్ ఫ్రమ్ ది బ్లూ’ థామస్ కార్లైల్ ది ఫ్రెంచ్ రెవల్యూషన్ (1857) పుస్తకంలో మొదటిసారిగా కనిపిస్తుంది. చదవండి: Brain Gym: భర్తను షూట్ చేసిన తర్వాత అతడితో కలిసి భోజనం చేసిన భార్య.. ఇదెలా సాధ్యం? -
Idioms: ‘మెట్ దేర్ వాటర్లూ’.. వెనుక కథ తెలుసా?
ఒక వ్యక్తి తన కెరీర్లో వరుసగా విజయాలు సాధిస్తున్నాడు. అట్టి విజేతకు ఒక పరాజయం ఎదురైంది. పరాజయం ఒకసారి ఎదురైనా మళ్లీ నిలదొక్కుకునే వాళ్లు ఉంటారు. అలా కాకుండా ఆ పరాజయం అతడి కెరీర్‌నే మసకబార్చితే, అతడి జీవితాన్ని అగాధంలోకి తోస్తే....అదే ‘మెట్ దేర్ వాటర్లూ’ ఇడియమ్. ఉదా: ఎవ్రీ మ్యాన్ మీట్స్ హిజ్ వాటర్లూ ఎట్ లాస్ట్ నేపథ్యంలోకి వెళితే... ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్‌ని తిరుగులేని వీరుడు అంటారు. అలాంటి వీరుడి జీవితం ఒక యుద్ధం(వాటర్లూ)తో తలకిందులైపోయింది. సెంట్రల్ బెల్జియంలో 1815లో నెపోలియన్ సైన్యానికి, ‘ఫస్ట్ డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్’ అర్థర్ వెల్లెస్లీ నాయకత్వంలోని బ్రిటన్, నెదర్లాండ్స్... మొదలైన సంకీర్ణసేనలకు మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో నెపోలియన్ ఓడిపోతాడు. మరోవైపు అర్థర్ స్వదేశంలో హీరోగా వెలిగిపోతాడు. నెపోలియన్ ఓటమి యూరోపియన్ రాజకీయ, సామాజిక చరిత్రలో కీలకమైన ఘట్టం అయింది. ఫ్రెంచ్ ఆధిపత్య ధోరణికి తెరపడేలా చేసింది. చదవండి: World Sleep Day: నిద్ర లేకపోతే ఎంత డేంజరో తెలుసా? మీకు తెలియని షాకింగ్ విషయాలు -
అక్కడి పరిస్థితి హెలైసియస్గా ఉంది...!
కొత్త పదాలు... వాటి అర్థాలు తెలుసుకోవడం కొంతమందికి హాబీ. అలాంటి వారి కోసం రెండు పదాలు, వాటి అర్థాలు, నిత్య జీవితంలో వాటిని ఎలా ఉపయోగించాలో ఇక్కడ చెబుతున్నాం. ‘హెల్’ అనే పదం, సఫిక్స్ ‘సీయస్’లను కలపడం వల్ల ఏర్పడిన పదమే Hellacious. దీని అర్థాలు: పవర్ఫుల్, వాయిలెన్స్, ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్, ఎక్ట్స్రర్డినరీ లార్జ్. ఉదా: ట్రాఫిక్ ఈజ్ హెలైసియస్ దిస్ టైమ్ ఆఫ్ డే. hygge (హుగా) ఇది డేనిష్ పదం. ఫిలింగ్ వామ్, కంఫర్టబుల్, సేఫ్...మొదలైన అర్థాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే, బాగా సంతోషం ఇచ్చేపనులు, కుటుంబసభ్యులతో ఇంట్లో గడపడం...మొదలైనవి. ఉదా: హాలిడేస్ ఆర్ ఫుల్ ఆఫ్ హుగా ఫర్ మీ అండ్ మై ఫ్యామిలీ ట్రెండింగ్ మై నేమ్ ఈజ్ కోవిడ్ కపూర్ ప్రపంచాన్ని కోవిడ్ వణికిస్తున్న సమయంలో, తనలో గూడుకట్టుకున్న ఒత్తిడి, భయాన్ని తొలిగించుకోవడానికి హాస్యాన్ని ఆశ్రయించి, తన పేరును ‘కోవిడ్ కపూర్’గా మార్చుకున్నాడు బెంగళూరుకు చెందిన ఒక వ్యాపారి. ఇతను ఒక ట్రావెల్ సైట్‌ను నడుపుతున్నాడు. తొలిసారిగా ‘నా పేరు కోవిడ్. అయితే నేను వైరస్ కాదు’ అని ట్విట్ చేసినప్పుడు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇక కోవిడ్ మీద తేలికపాటి జోక్స్ మొదలయ్యాయి. తానొక జోక్ చెబితే ఫాలోవర్స్ మరికొన్ని జోక్స్ చెప్పేవాళ్లు. మొత్తానికైతే ఈ కోవిడ్ జోక్స్‌తో కపూర్ ‘మినీ సెలబ్’గా మారాడు. చదవండి: Vegan Fashion: జంతు చర్మాలు ఒలిచి అలంకారం.. ఇదిగో సమాధానం! -
గూగుల్‌లో సూపర్ ఫీచర్, ఇక ఇంగ్లీష్‌లో అదరగొట్టేయొచ్చు
ఇంగ్లీష్..! ప్రస్తుతం ఈ పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ అవసరమైన లాంగ్వేజ్. ఎడ్యుకేషన్ లేకపోయినా, డిగ్రీలు చదవకపోయినా ఇంగ్లీష్ మాట్లాడడం, చదవడం, రాయడం వస్తే చాలు అవకాశాలు దానంతటే అవే మనల్ని వెతుక్కుంటూ వస్తుంటాయి. అందుకే ఇంగ్లీష్ నేర్పించేందుకు ఇనిస్టిట్యూట్లు, యాప్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. తాజాగా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సైతం యూజర్లకు ఉచితంగా ఇంగ్లీష్ నేర్పించేందుకు సిద్ధమైంది. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే ఔత్సాహికులకు ఇంగ్లీష్ ల్వాంగేజ్ను నేర్పించాలనే ఉద్దేశంతో గూగుల్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ సాయంతో ప్రతిరోజూ కొత్త ఇంగ్లీష్ అర్ధాన్ని నేర్చుకోవచ్చు. యూజర్లు తమ ఫోన్లలో ఈ ఫీచర్‌ను యాక్టివేషన్ చేసుకుంటే గూగుల్ ప్రతిరోజూ ఒక కొత్త అర్ధాన్ని నేర్పిస్తుంది. ఇందుకోసం సెర్చ్ ఇంజిన్ ఇంగ్లీష్‌లో ప్రావీణ్యులైన అధ్యాపకుల్ని నియమించినట్లు గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. తద్వారా ఇంగ్లీష్ భాషపై పట్టుసాధించవచ్చని గూగుల్ అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. ఇటీవల విడుదలైన ఓ రిపోర్ట్ ప్రకారం..ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో గూగుల్ ట్రెండ్స్‌లోని టాప్ సెర్చ్‌లో కొన్ని ఇంగ్లీష్ అర్ధాల్ని తెలుసుకునేందుకు ఎక్కువగా సెర్చ్ చేసినట్లు గూగుల్ తెలిపింది. వాటిలో ఇంట్రోవర్ట్, ఇంటిగ్రిటీ అనే పదాలు ఉన్నాయని, అందుకే యూజర్ల రోజూవారి జీవితాల్లో అవసరమైన ఇంగ్లీష్‌లో నైపుణ్యం సాధించేలా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు గూగుల్ వెల్లడించింది. గూగుల్ ఫీచర్‌ను ఎలా యాక్టీవ్ చేసుకోవాలి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తరువాత సెర్చ్బార్లో ఉదాహరణకు ఇంటిగ్రిటీ అనే పదం అర్ధం తెలుసుకోవాలని ఉంటే..ముందుగా define అని టైప్ చేయాలి. ఆ వర్డ్ పక్కనే ఇంటిగ్రిటీ (define integrity) అని టైప్ చేస్తే ఆ పదం అర్ధం వస్తుంది. పైన ఇమేజ్‌లో చూపించినట్లుగా సెర్చ్ బార్ పక్కనే బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని మీరు యాక్టివేషన్ చేసుకుంటే గూగుల్ ప్రతిరోజు ఓ కొత్త అర్ధాన్ని నేర్పించేలా మీ మొబైల్‌కి నోటిఫికేషన్ పంపిస్తుంది. చదవండి: Facebook: పేరు మారిస్తే ఫేస్బుక్ ఇమేజ్ దెబ్బతినదా? -
ఈ పదాన్ని 645 విధాలుగా ఉపయోగిస్తారు!
Run అనే ఆంగ్లపదంలో ఉన్నవి మూడు అక్షరాలే. కాని ఇది మోస్ట్ కాంప్లికేటెడ్, మల్టీ ఫేస్డ్ వర్డ్‌గా పేరు మోసింది. ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీ ఎడిటర్స్ చెబుతున్నదాని ప్రకారం ‘రన్’ను రకరకాల సందర్భాలను బట్టి 645 విధాలుగా ఉపయోగిస్తున్నారు. ‘కాంటెక్ట్స్ ఈజ్ ఎవ్రీ థింగ్’ కదా మరి! 'రన్' అనే పదానికి తెలుగులో పరుగు అనే అర్థం ఉంది. ‘రన్’కు క్రియాపదం అయిన ‘రన్నింగ్’కు మాత్రం సందర్భానుసారం అనేక అర్థాలు ఉన్నాయి. కాబట్టి ‘రన్’ ఇంగ్లీషు భాషను నడిపిస్తుందంటే అతిశయోక్తి కాదని భాషా నిపుణులు అంటున్నారు. (Fenty's Fortune: మీకేమైనా తెలుసా... వాట్స్ మై నేమ్?) -
పావురాలూ పదాలను గుర్తిస్తాయి!
బెర్లిన్: పావురాలు ఇంగ్లిష్ పదాలను నేర్చుకోగలవని పరిశోధనలో తేలింది. ఇలాంటి సంక్లిష్ట పరీక్షల్లో బబూన్ జాతి కోతులతో సమానంగా పక్షులు కూడా ప్రతిభ చూపిస్తాయని న్యూజిలాండ్‌లోని ఒటాగో వర్సిటీ, జర్మనీలోని రుహుర్ వర్సిటీలు అధ్యయనంలో గుర్తించాయి. స్క్రీన్‌పై వచ్చే నాలుగు ఇంగ్లిష్ అక్షరాల పదాలను గుర్తించేలా పావురాలకు శిక్షణ ఇచ్చారు. కొన్ని గుర్తులను కూడా గుర్తించేలా చేశారు. గుర్తుల నుంచి అక్షరాలను పావురాలు వేరు చేసి గుర్తుపడుతున్నాయా అని పరీక్షించారు. 26 నుంచి 58 అక్షరాలతో కూడిన పదాల సముదాయాలను, 8 వేలకు పైగా గుర్తులను చూపించారు. అప్పుడు కొత్తగా చూపిన పదాలను పావురాలు కచ్చితంగా గుర్తించాయి. ఎప్పుడో 30 కోట్ల ఏళ్ల కింద మానవుల నుంచి పావురాలు(పక్షి జాతి) పరిణామం చెంది, వేర్వేరు మెదడు అమరిక ఉన్నా మానవుల్లాగే అక్షరాల్ని గుర్తించే సామర్థ్యం ఒకేలా ఉండటం ఆశ్చర్యమని శాస్త్రవేత్తలు చెప్పారు.