కొత్త పదాలు... వాటి అర్థాలు తెలుసుకోవడం కొంతమందికి హాబీ. అలాంటి వారి కోసం రెండు పదాలు, వాటి అర్థాలు, నిత్య జీవితంలో వాటిని ఎలా ఉపయోగించాలో ఇక్కడ చెబుతున్నాం.
‘హెల్’ అనే పదం, సఫిక్స్ ‘సీయస్’లను కలపడం వల్ల ఏర్పడిన పదమే Hellacious.
దీని అర్థాలు: పవర్‌ఫుల్, వాయిలెన్స్, ఎక్స్‌ట్రీమ్‌లీ డిఫికల్ట్, ఎక్ట్స్రర్డినరీ లార్జ్.
ఉదా: ట్రాఫిక్ ఈజ్ హెలైసియస్ దిస్ టైమ్ ఆఫ్ డే.
hygge (హుగా) ఇది డేనిష్ పదం. ఫిలింగ్ వామ్, కంఫర్టబుల్, సేఫ్...మొదలైన అర్థాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే, బాగా సంతోషం ఇచ్చేపనులు, కుటుంబసభ్యులతో ఇంట్లో గడపడం...మొదలైనవి.
ఉదా: హాలిడేస్ ఆర్ ఫుల్ ఆఫ్ హుగా ఫర్ మీ అండ్ మై ఫ్యామిలీ
ట్రెండింగ్
మై నేమ్ ఈజ్ కోవిడ్ కపూర్
ప్రపంచాన్ని కోవిడ్ వణికిస్తున్న సమయంలో, తనలో గూడుకట్టుకున్న ఒత్తిడి, భయాన్ని తొలిగించుకోవడానికి హాస్యాన్ని ఆశ్రయించి, తన పేరును ‘కోవిడ్ కపూర్’గా మార్చుకున్నాడు బెంగళూరుకు చెందిన ఒక వ్యాపారి. ఇతను ఒక ట్రావెల్ సైట్‌ను నడుపుతున్నాడు.
తొలిసారిగా ‘నా పేరు కోవిడ్. అయితే నేను వైరస్ కాదు’ అని ట్విట్ చేసినప్పుడు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇక కోవిడ్ మీద తేలికపాటి జోక్స్ మొదలయ్యాయి. తానొక జోక్ చెబితే ఫాలోవర్స్ మరికొన్ని జోక్స్ చెప్పేవాళ్లు. మొత్తానికైతే ఈ కోవిడ్ జోక్స్‌తో కపూర్ ‘మినీ సెలబ్’గా మారాడు.
చదవండి: Vegan Fashion: జంతు చర్మాలు ఒలిచి అలంకారం.. ఇదిగో సమాధానం!
Comments
Please login to add a commentAdd a comment