Enthiran 2
-
బాహుబలి, రోబో 2లను మించిపోతుందా.. ?
తమిళ ఇళయదళపతి విజయ్‌కు భారీ ఆఫర్ వచ్చింది. సి సుందర్ దర్శకత్వంలో దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించే సినిమాలో విజయ్ నటించనున్నట్టు సమాచారం. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన బాహుబలి, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రతిష్టాత్మక చిత్రం రోబో 2 బడ్జెట్లను ఈ సినిమా దాటిపోతుందని సినీ వర్గాల టాక్. సి సుందర్-విజయ్ కాంబినేషన్లో రానున్న ఈ సినిమాను 350 కోట్ల రూపాయలకుపైగా బడ్జెట్‌తో నిర్మించనున్నారనే వార్త కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ హిస్టారికల్ ఫాంటసీ థ్రిల్లర్‌కు ఇంకా టైటిల్‌ను ఖరారు చేయలేదు. శ్రీ తెనండల్ ఫిల్మ్స్ నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించేందుకు సి సుందర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలో మరో హీరో సూర్య నటించనున్నట్టు మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే సూర్య వీటిని ఖండిస్తూ.. పా రంజిత్ దర్శకత్వంలో తన తర్వాతి సినిమా ఉంటుందని స్పష్టత ఇచ్చాడు. శ్రీ తెనండల్ ఫిల్మ్స్ నిర్మించే భారీ చిత్రంలో విజయ్ నటించనున్నట్టు తాజా సమాచారం. కాగా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. విజయ్ ప్రస్తుతం భరతన్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. -
3డీ ఫార్మెట్లో ఎందిరన్-2 ?
చెన్నై : ఎందిరన్-2 చిత్రం ప్రారంభం కాకుండానే పలు ఆసక్తి కరమైన విశేషాలతో క్రేజ్‌ను పెంచేసుకుంటోంది. అందుకు ఎందిరన్ సంచలన విజయం ఒక కారణం కాగా,ఆ చిత్ర సృష్టికర్తలు గ్రేట్ డెరైక్టర్ శంకర్, సూపర్‌స్టార్ రజనీకాంత్ మరో కారణం. టెక్నాలజీ పరంగా అబ్బుర పరచిన ఆ చిత్రానికి సీక్వెల్ రంగం సిద్ధం అవడంతో ఎందిరన్-2 పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే ఎందిరన్-2 చిత్ర కథను పకడ్బంధీగా సిద్ధం చేసిన శంకర్ ఇప్పుడా కథకు పర్ఫెక్ట్ ఆర్టిస్టులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు.అయితే ఈ చిత్రంలో సూపర్‌స్టార్ సరసన నటించే హీరోయిన్ ఎవరన్న విషయంలో బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకొనే, కత్రినాకైఫ్, ఇంకా కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరు ఎందిరన్-2లో నటించే లక్కీచాన్స్‌ను దక్కించుకుంటారోనన్న ఆసక్తి నెలకొంది. ఇక ఈ చిత్రంలో రజనీకాంత్‌తో ఢీకొనే ప్రతినాయకుడు ఎవరన్న అంశంలోనూ చాలా కుతూహలం కలిగిస్తోంది. నటుడు విక్రమ్ రజనీకి విలన్‌గా మారనున్నారనే ప్రచారం జరిగింది.అయితే ఆ ప్రపోజల్ నిర్మాతలకు అంతగా నచ్చలేదనే టాక్ వినిపిస్తోంది. ఇక పోతే ఈ చిత్రాన్ని ఎందిరన్ చిత్రం కంటే రెట్టింపు బడ్జెట్లో నిర్మించడానికి లైకా సంస్థ సన్నాహాలు చేస్తునట్లు సమాచారం. చిత్ర షూటింగ్‌కు ముహుర్తం కూడా నిర్ణయించేశారు. సూపర్‌స్టార్ పుట్టిన రోజు డిసెంబర్ 12న పూజా కార్యక్రమాలతో శ్రీకారం చుట్టి 2016లో రెగ్యులర్ చిత్రీకరణకు రెడీ అవుతున్నట్లు తెలిసింది. కాగా ఎందిరన్ చిత్రాన్ని గ్రాఫిక్స్‌తో బ్రహ్మాండంగా తెరపై ఆవిష్కరించిన శంకర్ ఎందిరన్-2 ను అదనంగా 3డీ హంగులు అద్దనున్నట్లు తాజా సమాచారం. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్, యానిమేషన్ చిత్రం వరకూ నటించిన ఏకైక కోలీవుడ్ నటుడిగా చరిత్రకెక్కిన మన సూపర్‌స్టార్ ఇప్పుడు ఎందిరన్-2 3డీలో తెరకెక్కితే 3డీచిత్రంలో నటించిన తొలి కోలీవుడ్ నటుడిగా మరో రికార్డ్ సాధిస్తారన్న మాట.ప్రస్తుతం రజనీకాంత్ కబాలి చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. -
రజనీతో హాలీవుడ్ సూపర్ స్టార్?
త్వరలో ఒక వండర్ఫుల్ మల్టీస్టారర్ చిత్రాన్ని సెల్యులాయిడ్‌పై ఎక్కించడానికి సన్నాహాలు జరుపుతున్నారన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం. అదేమిటన్నది చాలామందికి చాలా వరకు అర్థం అయ్యి ఉంటుంది. ఎస్ సూపర్‌స్టార్ రజనీకాంత్, స్టార్ డెరైక్టర్ శంకర్ల కాంబినేషన్లో ఎందిరన్ 2 తెరకెక్కనుందన్న విషయం తెలిసిందే. వీరి కలయికలో ఇంతకు ముందు ఎందిరన్ చిత్రం రూపొంది బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో ఆ చిత్రానికి సీక్వెల్ గురించి ఊహాగానాలు ఎప్పటి నుంచో మొదలైనా, ఎందిరన్ 2 కథను వండడంలో శంకర్ చాలా సీక్రెట్ మెయిన్‌టెయిన్ చేస్తున్నారు.అయితే ఈ చిత్ర ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చాలా ప్రీ ప్లాన్డ్గా జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రను సియాన్ విక్రమ్ పోషించనున్నారనే ప్రచారం ఇంతకు ముందు నుంచే జరుగుతున్న విషయం తెలిసిందే. అదే విధంగా ఇందులో బాలీవుడ్ భామ విద్యాబాలన్ రజనీకాంత్ సరసన నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. వీటన్నిటికీ మించిన అబ్బురపరచే అంశం ఏమిటంటే ఎందిరన్ 2లో ఇండియన్ సూపర్‌స్టార్ రజినీకాంత్‌తోపాటు హాలీవుడ్ సూపర్‌స్టార్, కండలవీరుడు, టెర్మినేటర్ ఫేమ్ ఆర్నాల్డ్ నటించే అవకాశం ఉందన్నదే. ఐ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్నాల్డ్, శంకర్ దర్శకత్వంలో నటించాలనే ఆకాంక్షను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన అభిలాషను శంకర్ నెరవేర్చేపనిలో ఉన్నట్లు సమాచారం. ఇదే గనుక జరిగితే ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్లో తెరకెక్కే బ్రహ్మాండ చిత్రం ఎందిరన్ 2 అవుతుందని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. -
రజనీ పాత్రలో అజిత్?
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు నటుడు అజిత్ అంటే చాలా ఇష్టం. అజిత్కూ రజనీ అంటే చాలా గౌరవం. ఇంతకు ముందు రజనీ నటించిన బిల్లా చిత్రం రీమేక్‌లో అజిత్ నటించి మెప్పించారు. ఇప్పడు రజనీ నటించాల్సిన పాత్రలో అజిత్ నటించే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం. అజిత్ తొలిసారిగా స్టార్ డెరైక్టర్ శంకర్‌తో కలిసి పని చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విషయానికొస్తే రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో ఇంతకు ముందు వచ్చిన ఎందిరన్ చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లోనూ అనువాదమై విజయవంతమైంది. ఈ చిత్రానికి కొనసాగింపు తెరకెక్కించాలన్నది దర్శకుడు శంకర్ ఆకాంక్ష. ఇందుకు కథను కూడా సిద్ధం చేసుకున్నారు. ఎందిరన్ -2 ను కూడా రజనీకాంత్‌తోనే రూపొందించాలన్నది శంకర్ భావన. ఈ విషయమై శంకర్, రజనీ కాంత్‌లు ఇటీవల చర్చించుకున్నట్లు సమాచారం. అయితే ఎందిరన్-2, చిత్రంలో రజనీకాంత్ నటించడానికి ఆసక్తి చూపడంలేదని తెలిసింది. అందుకు కారణం ఆయన ఆరోగ్యమే. ఎందిరన్-2 చిత్రంలో నటించే విషయమై రజనీకాంత్ ఇంతకు ముందు తనకు చికిత్స అందించిన వైద్యులను సంప్రదించగా వారు నటించవద్దని చెప్పినట్లు సమాచారం. శరీరానికి ఒత్తిడి కలిగించే పాత్రల్లో నటించరాదని వైద్యులు రజనీకాంత్‌కు సూచించారట. ఎందిరన్-2 చిత్రంలో శరీర బరువు తగ్గించి నటించే సన్నివేశాలుంటాయట. దీంతో ఈ చిత్రంలో సూపర్ స్టార్ నటించే అవకాశం లేదని తెలుస్తోంది. రజనీ కాకుంటే శంకర్ దృష్టిలో అజిత్ ఉంటారని సమాచారం.ప్రస్తుతం విక్రమ్ హీరోగా ఐ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న శంకర్ తదుపరి ఎందిరన్ -2 కు తెరరూపం ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.