ethipothala project
-
ఆకట్టుకుంటున్న ఎత్తిపోతల జలపాతం..చూసేందుకు పర్యాటకులు క్యూ (ఫొటోలు)
-
16 ‘ఎత్తిపోతల’కు కార్యాచరణ!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు కృష్ణా జలాలు అందించేవిధంగా కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా 16 ఎత్తిపోతల పథకాల పనులకు శ్రీకారం చుట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. వీటి తుది అంచనాలకు సైతం ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్యాచరణపై సీఎం కేసీఆర్ ఇంజనీర్లకు మార్గదర్శనం చేయనున్నారు. ఆగస్టు 2న నాగార్జునసాగర్ నియోజకవర్గం లోని హాలి యాలో పర్యటించనున్న సీఎం టెండర్లు, నిధుల సమీకరణ, కార్యాచరణ ప్రణాళికపై ఇంజనీర్లకు కీలక ఆదేశాలివ్వనున్నారు. సీఎం పర్యటన తర్వాత టెండర్లు మిర్యాలగూడ, దేవరకొండ, నకిరేకల్, నాగార్జునసాగర్, హజూర్‌నగర్, సూర్యా పేట, కోదాడ నియోజకవర్గాల్లో 1.70 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరందించేలా రూ.3,691 కోట్లతో ఈ ఎత్తిపోతల పథకాలను చేపట్టనున్నారు. ఇందులో నెల్లికల్ కింద 24,886 ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చేలా రూ.692 కోట్లు, ముక్త్యాల కింద 53 వేల ఎకరాలకు నీరిచ్చేలా రూ.1,480 కోట్లు, దున్నపోతలగండి 12,239 ఎకరాలకు నీరిచ్చేలా రూ.219.90 కోట్లు, బోతలపాలెంతో 8,610 ఎకరాలకు నీరిచ్చేలా రూ.229.25 కోట్లు, జాన్‌పహడ్ కింద 5,650 ఎకరాలకు నీరిచ్చేలా రూ.185 కోట్లతో చేపట్టే ఎత్తిపోతల పథకాలకు ఇప్పటికే అంచనాలు సిద్ధమయ్యాయి. ఈ పథకాలన్నింటికీ ఏకకాలంలో టెండర్లు పిలిచి నెల రోజుల్లో పనులు మొదలు పెట్టాలని గత నెల సమీక్ష సందర్భంగానే ముఖ్యమంత్రి సూచించినప్పటికీ టెండర్ల ప్రక్రియ ముందుకెళ్లలేదు. 1.70 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరందించేలా రూ.3,691 కోట్లతో ఈ ఎత్తిపోతల పథకాలను చేపట్టనున్నారు. ఇందులో నెల్లికల్ కింద 24,886 ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చేలా రూ.692 కోట్లు, ముక్త్యాల కింద 53 వేల ఎకరాలకు నీరిచ్చేలా రూ.1,480 కోట్లు, దున్నపోతలగండి 12,239 ఎకరాలకు నీరిచ్చేలా రూ.219.90 కోట్లు, బోతలపాలెంతో 8,610 ఎకరాలకు నీరిచ్చేలా రూ.229.25 కోట్లు, జాన్‌పహడ్ కింద 5,650 ఎకరాలకు నీరిచ్చేలా రూ.185 కోట్లతో చేపట్టే ఎత్తిపోతల పథకాలకు ఇప్పటికే అంచనాలు సిద్ధమయ్యాయి. ఈ పథకాలన్నింటికీ ఏకకాలంలో టెండర్లు పిలిచి నెల రోజుల్లో పనులు మొదలు పెట్టాలని గత నెల సమీక్ష సందర్భంగానే ముఖ్యమంత్రి సూచించినప్పటికీ టెండర్ల ప్రక్రియ ముందుకెళ్లలేదు. ఎస్సారెస్పీ స్టేజ్–2 పనులకు.. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజక వర్గంలోని చివరి ఆయకట్టు వరకు గోదావరి నీటిని పారించేలా శ్రీరాంసాగర్ రెండోదశ (స్టేజ్–2) కాల్వలను పూర్తిస్థాయిలో లైనింగ్ చేసి ఆధునీకరించే పనులకు సీఎం పర్యటనలో మోక్షం లభించే అవకాశముంది. రూ.400 కోట్లతో స్టేజ్–2 పరిధిలోని ప్రధాన డిస్ట్రిబ్యూటరీలన్నింటినీ ఆధునికీకరించేలా ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. డీబీఎం–69 కాల్వల లైనింగ్‌ను రూ.54 కోట్లు, డీబీఎం–70 కాల్వల లైనింగ్‌ను రూ.12 కోట్లు, డీబీఎం–71 లైనింగ్‌కు రూ.159 కోట్లతో ప్రతిపాదించగా, వీటితోపాటే ఈ డిస్ట్రిబ్యూటరీల కింది పిల్ల కాల్వలు, ఇతర చిన్న కాల్వల లైనింగ్ పనులను మరో రూ.175 కోట్లతో ప్రతిపాదించారు. వీటిపై సీఎం సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేసే అవకాశముంది. -
నిధులొచ్చాయ్.. ఎత్తిపోతలకు మంచి రోజులు
నిర్మల్: రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 24 గంటలపాటు ఉచిత కరెంటును కానుకగా అందిస్తోంది. ఇక సాగునీటికీ ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా జిల్లాలోని ఆరు ఎత్తిపోతల పథకాలకు పునరుజ్జీవం పోసేందుకు నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు గురువారం రూ.కోటి 74లక్షల 40వేలు మంజూరు చేస్తూ జీవో జారీచేసింది. వివిధ రకాల మరమ్మతులతో మూలన పడిన బన్సపల్లి(దిలావర్పూర్), తిర్పెల్లి(లక్ష్మణచాంద), కొత్తూర్(మామడ), ముజ్గి సాంగ్వి(దిలావర్పూర్), సిద్ధులకుంట(సోన్), సుద్దవాగు(కుంటాల) ఎత్తిపోతల పథకాలకు ఈ నిధులు మంజూరు చేసింది. ఈ పథకాల పునరుద్ధరణ పూర్తయితే మొత్తం 4,885 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. తాము పంపిన ప్రతిపాదనల మేరకు నిధులు మంజూరైనందున త్వరలో మరమ్మతులు చేపట్టి ఖరీఫ్ నాటికి పూర్తిస్థాయిలో నీరందేలా చూస్తామని నీటిపారుదల అభివృద్ధి సంస్థ జిల్లా అధికారులు చెబుతున్నారు. ఒక్కో పథకానికి ఎంత... జిల్లాలోని మొత్తం 21 పథకాలు కొనసాగుతుండగా ఇందులో మరమ్మతులు, పునరుద్ధరణ కోసం ఇటీవల ఆరు పథకాలకు జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపించారు. దీనిపై జిల్లాకు చెందిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. టీఎస్ఐడీసీ చై ర్మన్, ఎండీలతో చర్చించి త్వరితగతిన నిధులు విడుదలయ్యేలా కృషిచేశారు. ఇందులో భాగంగా దిలావర్పూర్ మండలంలోని బన్సపల్లి పథకానికి రూ.3లక్షల50వేలు, ఇదే మండలంలోని సాంగ్వి(ముజ్గి) పథకా నికి రూ.30లక్షలు, లక్ష్మణచాంద మండలంలోని తిర్పెల్లి పథకానికి రూ.19లక్షలు, మామడ మండలంలోని కొత్తూరు ఎతిపోతలకు రూ.39లక్షల 40వేలు, సోన్ మండలంలోని సిద్ధులకుంట ఎత్తిపోతల పథకానికి రూ.14లక్షలు, కుంటాల మండలం అ ర్లి చెక్క వద్ద గల సుద్ధవాగు ఎత్తిపోతలకు రూ.68లక్ష ల 50వేలు మంజూరయ్యాయి. మొత్తం ఆరు పథకా లకు గానూ రూ. కోటీ 74లక్షల 40వేలు మంజూరు చేశారు. పునరుద్ధరణ, పునరుజ్జీవం.. ఎప్పుడో ఏళ్ల క్రితం నిర్మించిన ఎత్తిపోతల పథకాలు సరైన నిర్వహణ లేకపోవడంతో ఉత్తగా మిగిలిపోయాయి. ఆయకట్టు ఉన్నా.. నీళ్లు అందుబాటులో ఉన్నా ఎత్తిపోసే పథకం మూలన పడటంతో రైతన్నలు ఇబ్బందులు పడుతున్నారు. చాలాసార్లు పాలకుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లారు. ఈ క్రమంలో స్పందించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆయా పథకాలను తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఇందులో ఒక బన్సపల్లి పథకానికి మాత్రమే పునరుద్ధరణ చేయాల్సి ఉండగా.. మిగిలి ఐదు పథకాలకూ పునరుజ్జీవం పోయాల్సిందే. ఈ దిశగా త్వరలోనే మరమ్మతులను చేపడతామని అధికారులు వెల్లడించారు. ఖరీఫ్‌నాటికి అందుబాటులోకి.. జిల్లాలోని కడెం, స్వర్ణ, గడ్డెన్నవాగు ప్రాజెక్టులతో పాటు పక్కనే ఉన్న శ్రీరాంసాగర్ నుంచి సరస్వతీ కాలువ సాగుకు అండగా నిలుస్తున్నాయి. ప్రధానంగా జిల్లా సరిహద్దుగా సాగుతోన్న గోదావరి నదిపై శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్‌లోనే ఎత్తిపోతల పథకాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో చాలా పథకాలకు నీరందుతున్నా మరమ్మతులకు నోచుకోక ఎత్తిపోయడం లేదు. ఇప్పుడు ప్రభుత్వం వీటిపై దృష్టిపెట్టి నిధులు మంజూరు చేస్తుండటంతో పథకాలకు పునరుజ్జీవం పోసినట్లేనని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో త్వరలోనే టెండర్లు చేపట్టి పనులను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ పనులు పూర్తయితే ఖరీఫ్ నాటికి సాగుకు నీళ్లందే అవకాశాలు ఉన్నాయి. మరో రెండింటికి ప్రతిపాదనలు జిల్లా నీటిపారుదల అభివృద్ధి సంస్థ పరిధిలో మరో రెండు కొత్త ఎత్తిపోతల పథకాలకు అధికారులు ప్రతిపాదనలను పంపించారు. ఇందులో ఒకటి లోకేశ్వరం మండలం పిప్రి కాగా, మరొకటి జిల్లాకు సరిహద్దుగా ఉన్న జగిత్యాల జిల్లాలోని రాయికల్ మండలంలో గోదావరిని ఆనుకుని ఉన్న బోర్నపల్లి–2 పథ కం. మొత్తం 4200 ఎకరాల ఆయకట్టుతో పిప్రి పథకానికి రూ.58 కోట్లతో ప్రతిపాదనలను పంపించారు. బోర్నపల్లి–2 పథకం పక్కజిల్లాలో ఉన్నప్పటికీ గోదా వరిని ఆనుకుని జిల్లావాసుల భూములు ఉండటంతో నిర్మల్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఈ పథకం పనులు చేపట్టనుంది. బోర్నపల్లి–2 పథకానికి 113ఎకరాల ఆయకట్టును పేర్కొంటూ రూ.60లక్షలతో ప్రతిపాదనలు పంపించారు. ఆరు ఎత్తిపోతలకు నిధులు జిల్లాలోని ఆరు ఎత్తిపోతల పథకాలకు పంపించిన ప్రతిపాదనల మేరకు గురువారం రూ.కోటి 74లక్షల 40వేలు మంజూరయ్యాయి. ఇందులో బన్సపల్లి పథకం పునరుద్ధరణ చేయడంతో పాటు మిగిలిన ఐదు పథకాలకు పూర్తిస్థాయి మరమ్మతులు చేయాల్సి ఉంది. రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చొరవ తీసుకోవడం వల్ల త్వరితగతిన నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు పనులు చేపట్టి వచ్చే ఖరీఫ్ నాటికి ఆయకట్టుకు నీరందించేలా చర్యలు తీసుకుంటాం. – వి.హంజనాయక్, జిల్లా నీటిపారుదల అభివృద్ధి సంస్థ అధికారి లబ్ధి పొందే ‘ఎత్తిపోత’లివే.. 1. బన్సపల్లి(దిలావర్పూర్) 2. తిర్పెల్లి(లక్ష్మణచాంద) 3. కొత్తూర్(మామడ) 4. ముజ్గి సాంగ్వి(దిలావర్పూర్) 5. సిద్ధులకుంట(సోన్) 6. సుద్దవాగు(కుంటాల) -
ఉత్తిపోతలు..
దండేపల్లి, న్యూస్‌లైన్ : లక్ష్యం ఘనం.. ఆచరణ శూన్యం అన్న చందంగా తయారైంది దండేపల్లి మండలం గూడెం గోదావరి ఒడ్డున నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం దుస్థితి. ఉన్నత ఆశయంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో పనులు ప్రారంభిస్తే ఐదేళ్లు గడుస్తున్నా ప్రస్తుత ప్రభుత్వం పూర్తిచేయడం లేదు. ఫలితంగా నిర్మాణ పనులు నత్తకంటే హీనంగా నడుస్తున్నాయి. దండేపల్లి మండలం గూడెం గోదావరి ఒడ్డున నిర్మిస్తున్న ఎత్తిపోతల ఫథకం పనులు నత్తకంటే అధ్వానం గా నడుస్తున్నాయి.. ఐదేళ్లుగా నిర్మాణ పనులు సా...గుతూనే ఉన్నాయి. రూ.125 కోట్ల వ్య యంతో నిర్మించే ఈ ఎత్తిపోతల పథకానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2009, జన వరి 27న శంకుస్తాపన చేశారు. 2011లోనే పనులు పూర్తి కావాల్సి ఉన్నా నేటికీ అలాగే నడుస్తున్నాయి. గడువు ముగిసి మూడేళ్లవుతున్నా పనులు వేగవంతం కనిపించడంలేదు. శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జిల్లా కు కేటాయించిన 3 టీఎంసీల నీటిని కడెం ఆయకట్టు పరిధిలోని దండేపల్లి, లక్సెట్టిపేట, మంచిర్యాల మండలాలకు సాగునీరందించడానికి గోదావరి ఒడ్డున ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నారు. జలయజ్ఞంలో భాగంగా వైఎస్సార్ ఈ ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించారు. ఆయన మరణానంతరం ఈ పథకం నిర్మాణంపై పట్టించుకునే వారు కరువయ్యారు. సదరు కాంట్రాక్టర్లు నిర్మాణ పనులు చేపట్టి ఏళ్లు గడుస్తున్నా పూర్తిచేయడం లేదు. పనులిలా.. గూడెం గోదావరి ఒడ్డున ఏర్పాటు చేసిన పంపింగ్ స్టేషన్ నుంచి తానిమడుగు వరకు 11 కిలోమీటర్ల పొడవున 2.30 మీటర్ల వ్యాసం గల పైపులైన్ నిర్మిస్తున్నారు. తానిమడుగు వద్ద నిర్మించిన డెలివరీ పాయింట్ ద్వారా నీటిని కడెం ప్రధాన కాల్వలో అనుసంధానం చేయనున్నారు. అక్కడ నుంచి కడెం ఆయకట్టు చివరిదాక సాగునీరు వెళ్తుంది. పంప్‌హౌజ్ నిర్మాణం పూర్తయ్యింది. మోటార్లు బిగించారు. పైపులైను నిర్మాణ పనులు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ అంతంతా మాత్రంగానే ఉండడంతో పనుల్లో నాణ్యత లోపిస్తోందనే ఆరోపణలూ ఉన్నాయి. పంప్‌హౌజ్ సమీపంలో ఒకటి, రెబ్బనపల్లి మరొక నెగెటివ్ ప్రెషర్ ట్యాంకులు నిర్మిస్తున్నారు. అయితే.. పంప్‌హౌజ్ సమీపంలోని ట్యాంకు నిర్మాణం చివరి దశకు చేరుకోగా రెబ్బనపల్లి వద్ద నిర్మించిన ట్యాంకుకు ఇప్పుడే పైపులు బిగిస్తున్నారు. ఎత్తిపోతల పథకానికి విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రత్యేకంగా నిర్మిస్తున్న విద్యుత్ సబ్‌స్టేషన్ పనులు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. అసంపూర్తి పనులన్నీ పూర్తి కావడానికి మరో ఆరు నెలలు పట్టనుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఖరీఫ్ నాటికి నీరందడం కష్టంగానే కనిపిస్తోంది. వచ్చే ఖరీఫ్‌కు నీరందిస్తాం.. వచ్చే ఖరీఫ్‌కు ఎత్తిపోతల పథకం నీరందిస్తాం. నిర్మాణ పనులు చివరి దశకు చేరాయి. వాటిని త్వరలో పూర్తిచేస్తాం. భూ సేకరణలో కొంత ఆలస్యం జరగడంతో నిర్మాణంలోనూ జాప్యం జరిగింది. సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయ్యేలోగా మిగిలిన పనులు పూర్తి చేస్తాం. - కనకేశ్, ఎల్లంపల్లి ఈఈ -
ఎత్తిపోతలకు జాతీయ హోదా కల్పించాలి
ఆలంపల్లి, న్యూస్‌లైన్: పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదాను కల్పించాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి.విఠల్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన స్థానిక ఆర్అండ్బీ వసతి గృహంలో విలేకరులతో మాట్లాడారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తయితే జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. తెలంగాణ ఉద్యమం చేస్తున్న సమయంలో సీమాంధ్రులు అవహేళన చేశారని, దేశ ద్రోహులంటూ కేసులు పెట్టారని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్ల పంపకాల్లో తేడాలు వస్తాయని, తెలంగాణ ప్రజలే నష్టపోతారని సీమాంధ్ర నాయకులు అర్థంలేని ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. సోనియాగాంధీ భిక్షతో సీఎం అయిన కిరణ్‌కుమార్‌రెడ్డి అధిష్టానానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుని తప్పు చేశారన్నారు. తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించిన తర్వాతే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారన్నారు. ఉప ముఖ్యమంత్రికి కూడా సంప్రదించకుండా సీఎం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆంధ్రాపాలకుల వల్లే వెయ్యేళ్ల తెలంగాణ చరిత్ర కనుమరుగైందన్నారు. తెలంగాణ చరిత్రపై ప్రత్యేక పుస్తకాన్ని తయారుచేసి భవిష్యత్ తరాలకు అందిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడంతోపాటు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు తీర్మానం చేస్తామన్నారు. వికారాబాద్ మరో హైటెక్ సిటీగా ఆవిర్భవిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సత్తయ్య, జిల్లా జేఏసీ నాయకులు తుల్జారాం, జిల్లా జేఏసీ సలహాదారు రమేష్‌కుమార్, జేఏసీ నాయకులు శ్రీనివాస్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ కోతలకు నిరసనగా ధర్నా
మునగాల, న్యూస్‌లైన్ విద్యుత్‌కోతలు ఎత్తివేసి వ్యవసాయానికి ఏడుగంటలు, ఎత్తిపోతల పథకాలకు 16 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, డివిజన్ కార్యదర్శి జుట్టుకొండ బసవయ్య మాట్లాడుతూ వ్యవసాయానికి 7 గంటలు, సాగర్ ఎడమ కాలువపై ఉన్న ఎత్తి పోతల పథకాలకు 16 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, కానీ నేడు కనీసం మూడు గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయడం లేదని పేర్కొన్నారు. దీంతో రబీలో పంటలు సాగు చేసిన రైతులు నీటి కోసం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. తక్షణమే అప్రకటిత విద్యుత్ కోతలను ఎత్తివేసి నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే రైతులను సమీకరించి విద్యుత్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం స్థానిక ఏఈ దుర్గాప్రసాద్‌కు వినతిపత్రం అందచేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి దేశిరెడ్డి స్టాలిన్‌రెడ్డి, రైతుసంఘం నాయకులు చందా చంద్రయ్య, బుర్రి శ్రీరాములు, పోటు పుల్లయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు చిర్రా శ్రీనివాస్, మిట్టగణుపుల సుందరం, షేక్ సైదా, ఎల్పి.రామయ్య, ఖాజాబీ తదితరులు పాల్గొన్నారు. -
దేవా ‘దశ’ తిరగదా..
వరంగల్, న్యూస్‌లైన్ : భూ సేకరణ చేయకపోవడం, ప్రైస్ ఎస్కలేషన్ కోసం కాంట్రాక్టర్ల పంతం... పరిష్కరించేందుకు సర్కారు వెనుకంజ వెరసి జె. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనులు ముందుకు కదలడం లేదు. ఒక్కో ప్యాకేజీలో సగం పనులు కూడా చేయలేదు. పనులు జాప్యమవుతున్న కొద్దీ... కాంట్రాక్టర్లకు మాత్రం మేలే జరుగుతోంది. కోట్ల రూపాయల అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. మొత్తం ప్రాజెక్ట్‌ను రూ.9,427 కోట్లతో నిర్మాణం చేయాల్సి ఉండగా... గడువు పెంచుకుంటూ పోవడంతో మరో రూ.1,976 కోట్లు అదనంగా పెరిగారుు. జిల్లాలో ఈ ప్రాజెక్ట్ కింద 5,61,229 ఎకరాల బీడు భూములను సాగులోకి తీసుకొచ్చేందుకు రూపకల్పన చేశారు. అంతేకాకుండా... 484 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, 36.250 టీఎంసీల నీటి వినియోగంతో ఈ బృహత్తర ప్రాజెక్ట్‌ను రూపొందించినా... నిర్లక్ష్యం కారణంగా పనులు కొనసా...గుతూనే ఉన్నారుు. దేవాదుల ప్రాజెక్ట్ పనులు మొదలై బుధవారానికి సరిగ్గా పదేళ్లు. ఈ కాలంలో చేపట్టిన పనులు, నిలిచిన పనుల వివరాలు ఓ సారి పరిశీలిస్తే... మొదటి నుంచీ అంతే.. ఏటూరునాగారం మండలం గంగారం నుంచి దేవాదుల ప్రాజెక్ట్ మొదలవుతుంది. గంగారంలో ఇన్‌టేక్‌వెల్ నిర్మాణంతో తొలి దశ పనులు ప్రారంభమయ్యాయి. రూ.844 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పనులను 2004 జనవరి 8వ తేదీన హెచ్‌సీసీ, కేబీఎల్ జాయింట్ వెంచర్‌కు కట్టబెట్టారు. పనులు పూర్తి చేయాల్సిన గడువు 18 నెలలు... అంటే 2005 జూలై 7వ తేదీ వరకు పూర్తి కావాలి. కానీ... ఇప్పటివరకు సరిగ్గా 15సార్లు గడువు పెంచారు. రూ. 844 కోట్లతో ప్రారంభమైన తొలి దశ ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఇప్పుడు రూ. 1,419.98 కోట్లకు ఎగబాకింది. తొలిదశలో మొత్తం 138.50 కిలోమీటర్ల పరిధిలో పైపులైన్ వేయాలి. ఈ మేరకు గంగారం నుంచి ధర్మసాగర్ వరకు పైపులైన్ వేసినా... నీటి తరలింపు భారమవుతోంది. మోటార్లు పనిచేయకపోవడం... పైపులైన్ లీకేజీ వంటి కారణాలు ప్రతిబంధకంగా నిలిచారుు. 138 కిలోమీటర్ల పరిధిలో అక్కడక్కడా 2 కిలోమీటర్ల మేర భూ సేకరణ చేపట్టాల్సి ఉంది. ఈ దశలో 77,700 ఎకరాల నీరందించాల్సి ఉండగా... ఇప్పటికీ ఒక్క ఎకరాకూ నీరు పారడం లేదు. 1.23 లక్షల ఎకరాలకు నీరందించేందుకు ధర్మసాగర్ చెరువును రిజర్వాయరుగా మార్చడం... ప్రధాన, ఉప కాల్వల నిర్మాణానికి రూ.120 కోట్లు కేటాయించారు. 45, 46 ప్యాకేజీలుగా వీటిని గుర్తించారు. 2005 మార్చి 16, 17న వరుసగా 45, 46వ ప్యాకేజీ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఈ పనుల గడువు 30 నెలలు కాగా... 45వ ప్యాకేజీ పనులను ఎనిమిది సార్లు, 46వ ప్యాకేజీ పనులను ఆరు సార్లు పొడిగించారు. ఈ రెండు ప్యాకేజీలకు అదనంగా పెంచిన అంచనా వ్యయం రూ.30 కోట్లు. కానీ... పనులు 60 శాతం మాత్రమే పూర్తయ్యూరుు. నగర శివారులో భూ సేకరణ ఇబ్బందిగా మారింది. ఈ ప్యాకేజీల్లో కనీసం 231 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. కానీ... భూముల ధరలు పెరగడం, ప్రభుత్వ ధర తక్కువగా ఉండడంతో రైతులు భూములివ్వడం లేదు. ప్రభుత్వం కూడా చేష్టలుడిగి చూస్తోంది. దిశ లేని రెండో దశ మొత్తం 7.25 టీఎంసీల నీటి వినియోగం లక్ష్యంతో 196 కిలోమీటర్ల మేర కాల్వల నిర్మాణానికి రూ.1,820 కోట్లతో రెండో దశ పనులకు శ్రీకారం చుట్టారు. 2005 ఏప్రిల్ నాలుగో తేదీన 4.74 శాతం ఎక్సెస్ అంటే.. రూ.1887 కోట్లతో హెచ్‌సీసీ, ఎన్సీసీ జాయింట్ వెంచర్‌కు పనులు అప్పగించారు. పనులు పూర్తి చేయాల్సిన గడువు 30 నెలలు. కానీ... ఇప్పటివరకు ఎనిమిది సార్లు పెంచారు. దీంతో అంచనా వ్యయం రూ. 2,037 కోట్లకు చేరింది. ఇంకా గడువు పెంచాలని ఇంజినీర్లు ప్రతిపాదనలు చేస్తుండడం గమనార్హం. ఈ దశలో స్టేషన్ ఘన్పూర్ రిజర్వాయర్ కింద 24,900 ఎకరాలకు నీరందించేందుకు కాల్వల నిర్మాణానికి రూ. 72 కోట్లతో 2007 జనవరి ఒకటిన అగ్రిమెంట్ చేసుకున్నారు. గడువు 18 నెలలే అరుునప్పటికీ... ఇప్పటివరకు ఏడు సార్లు గడువు పెంచారు. పెంచిన అంచనా రూ. 12 కోట్లు కాగా... పనులు ఆగిపోయాయి. స్టేషన్ ఘన్పూర్, తపాస్‌పల్లి శివారులో సుమారు 210 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. భూ సేకరణ లేకపోవడంతో పనులు నిలిచిపోయూరుు. ఇదే రిజర్వాయరు కింద మరో 24 వేల ఎకరాలకు నీరందించేందుకు రూ. 61 కోట్లతో నాలుగో కాల్వ నిర్మాణ పనులకు 2010 ఆగస్టు 18న అగ్రిమెంట్ చేశారు. 24 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటివరకు మూడుసార్లు గడువు పెంచారు. అంచనా వ్యయూన్ని కూడా రూ.4 కోట్లకు పెంచుకున్నారు. ఈ దశలోనే తపాస్‌పల్లి రిజర్వాయర్ కింద 60 వేల ఎకరాలకు నీరందించే కాల్వల నిర్మాణానికి రూ.74 కోట్లు కేటాయించారు. 2007 ఫిబ్రవరిలో అగ్రిమెంట్ చేసుకోగా... 18 నెలలో పనులు పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటివరకు మూడుసార్లు గడువు పెంచగా... అంచనా రూ. మరో 6 కోట్లు పెరిగింది. అశ్వరావుపల్లి, చీటకోడూర్ రిజర్వాయర్ల కింద 56 వేల ఎకరాలకు నీరందించేందుకు రూ. 87 కోట్లతో 2007 ఫిబ్రవరిలో అగ్రిమెంట్ చేశారు. 18 నెలల కాల వ్యవధిలో ఈ పనులు పూర్తి కావాల్సి ఉండగా... ఇప్పటివరకు 40 శాతం కూడా చేయలేదు. ఇప్పటికే నాలుగుసార్లు గడువు పెంచారు. అంచనా కూడా రూ. 4 కోట్లకు పెరిగింది. మూడోదశకు భూసేకరణ గండం మూడో దశ పనులకు భూ సేకరణ అడ్డంగా మారింది. ఈ దశలో 25.75 టీఎంసీల నీటిని వినియోగించడం, 9 చోట్ల లిప్టులు, 89 కిలోమీటర్ల సొరంగంతో 2.42 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలి. ఈ పనులను 2005 ఏప్రిల్ 29న హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్టర్‌కు కట్టబెట్టారు. ముందుగా అంచనా వ్యయం రూ. 4554 కోట్లు కాగా... ఇప్పటివరకు రెండుసార్లు గడువు పెంచారు. దీంతో అంచనాలు రూ. 5,789 కోట్లకు పెరిగాయి. రామప్ప నుంచి ధర్మసాగర్ వరకు నిర్మాణం చేయాల్సిన సొరంగం పనులు ఏడాదిన్నరగా ఆగిపోయాయి. 19 కిలోమీటర్లు మేర మాత్రమే తవ్వారు. ఇప్పటి వరకు చేసిన పని కేవలం 20 శాతమే. దీనికి కూడా కభూ సేకరణ చేయాల్సి ఉన్నప్పటికీ... పనులు సాగకపోవడంతో అధికారులు పక్కన పడేశారు. భారీగా పెరిగిన రివైజ్డ్ అంచనాలు ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి అటు ప్రభుత్వం, ఇటు కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. దీంతో కాంట్రాక్టర్లపై కనీస చర్యలు తీసుకునేందుకు సర్కారు సాహసం చేయలేదు. అంతేకాకుండా గడువు పెంచినప్పుడల్లా అంచనాలు కూడా పెంచింది. ఇప్పటివరకూ పెంచిన అంచనాలు రూ. 1976.98 కోట్లకు చేరుకున్నాయి. ప్రాజెక్టు నిర్మాణానికి ముందుగా నిర్ణయించిన రూ. 9,427 కోట్లకు ఇది అదనం. -
ఎత్తిపోతలకు గ్రహణం
మేదరమెట్ల, న్యూస్‌లైన్: వర్షాధారంగా పంటలు పండించుకుంటున్న కొరిశపాడు మండల రైతుల బాధలను గట్టెక్కించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టిన యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. 177 కోట్లతో చేపట్టిన ఈ పథ క నిర్మాణం 2008లో ప్రారంభించినా ఇప్పటికీ పూర్తికాలేదు. పథకం పూర్తయితే మండలంలోని కొరిశపాడు, దైవాలరావూరు, రావినూతల, బొడ్డువానిపాలెం, రాచపూడి, పమిడిపాడు, ప్రాసంగులపాడుతో పాటుగా నాగులుప్పలపాడు మండలం పోతవరం, బీ నిడమానూరు, కే తక్కెళ్లపాడు, కళ్లగుంట గ్రామాల పరిధిలోని 20 వేల ఎకరాల భూములకు సూక్ష్మ సేద్యం ద్వారా సాగు నీరందించేందుకు వీలు కలుగుతుంది. పథకం నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటి వరకు * 77 కోట్లు ఖర్చు చేసింది. 55 శాతం మేర పనులు జరిగాయి. 2010 నాటికే పథక నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నా.. అప్పట్లో సంభవించిన లైలా, జల్ తుఫాన్ల వల్ల పనులకు కొంతమేర ఆటంకాలు కలిగాయి. విపత్తుల దృష్ట్యా 2011 డిసెంబర్ 31వ తేదీ వరకు ప్రభుత్వం గడువు పొడిగించింది. అప్పటికీ పనులు పూర్తికాకపోవడంతో మళ్లీ 2013 డిసెంబర్ వరకు గడువిచ్చింది. భూసేకరణే పెద్ద అడ్డంకి.. చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తిచేసేందుకు భూ సేకరణే ప్రధాన అడ్డంకిగా మారింది. పథకానికి సంబంధించిన నీటిని నిల్వ చేసేందుకు రెండు రిజర్వాయర్లు నిర్మించాల్సి ఉండగా కొరిశపాడులో మాత్రమే రిజర్వాయర్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరొక రిజర్వాయరు పనులు నేటికీ ప్రారంభం కాలేదు. కొరిశపాడు రిజర్వాయర్ నుంచి బొల్లవరప్పాడులో నిర్మించాల్సిన రెండో రిజర్వాయర్‌కు నీటిని సరఫరా చేసేందుకు సుమారు 8.5 కిలోమీటర్ల మేర కాలువలు తవ్వేందుకు భూ సేకరణ చేయాల్సి ఉంది. అలాగే బొల్లవరప్పాడు రిజర్వాయర్ నిర్మాణం కోసం సుమారు 350 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ప్రభుత్వం ఇస్తామన్న నష్టపరిహారానికి రైతులు అంగీకరించకపోవడంతో భూసేకరణలో జాప్యం జరుగుతోంది. తమ్మవరం వద్ద పంప్ హౌస్ నిర్మాణం మాత్రమే పూర్తయింది. కానీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయలేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పథకం నిర్మాణం సకాలంలో పూర్తిచేసేలా చూడాలని రైతులు కోరుతున్నారు. భూ సేకరణ చేస్తే..పనుల్లో పురోగతి పీ చంగారావు, ఇరిగేషన్ ఏఈఈ భూసేకరణలో జాప్యం వల్లే పనులు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం ఇస్తామన్న నష్టపరిహారానికి, రైతులు కోరుతున్న దానికి వ్యత్యాసం ఉండటంతో భూసేకరణ జరగలేదు. రైతులతో చర్చలు జరుపుతున్నాం. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుంది. -
రైతన్న గోస ఆదుకోని ‘ప్రాణహిత’
గజ్వేల్, న్యూస్‌లైన్: తెలంగాణ జిల్లాలకు వరప్రదాయినిగా భావిస్తున్న ‘ప్రాణహిత-చెవేళ్ల’ ఎత్తిపోతల పథకం కోసం భూములిచ్చి ఏడాదైనా పరిహారం అందక రైతులు సతమతమవుతున్నారు. అటు పరిహారం అందక.. ఇటు ఆ భూముల్లో సాగు చేసుకోలేక అవస్థలు పడుతున్నారు. అధికారుల తప్పిదం కారణంగా బాధిత రైతులు ఏడాది కాలంగా గోసను అనుభవిస్తున్నారు. ఒకే భూమి రెవెన్యూ కార్యాలయంలో ఓ విధంగా, ల్యాండ్ రికార్డు కార్యాలయంలో మరో విధంగా నమోదై ఉండడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఏడాదైనా ఈ సమస్యను పరిష్కరించకపోవడంతో రైతులు రోడ్డున పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఇలాగే ఉంది. ఒక్క గజ్వేల్ మండలం దాతర్పల్లిలోనే 35 ఎకరాల్లో ఈ సమస్య ఉత్పన్నమైంది. ప్రాణహిత ఎత్తిపోతల పథకం కోసం గజ్వేల్ మండలం దాతర్‌పల్లిలో 87 ఎకరాల భూమిని సేకరించారు. మెరుగైన పరిహారం ఇస్తామని చెప్పి డబ్బులు ముట్టజెప్పకుండానే భూములను స్వాధీనం చేసుకున్నారు. ధర నిర్ణయం విషయంలో నెలల తరబడి జాప్యం కొనసాగింది. చివరకు ఎకరాకు రూ.4.35 లక్షల నుంచి రూ.4.79 లక్షల వరకు ధర నిర్ణయించారు. ఈ ధర ప్రకారం గ్రామంలో సేకరించిన 87 ఎకరాల్లో 52 ఎకరాలకు మాత్రమే రెండు నెలల క్రితం పరిహారాన్ని అందజేశారు. మిగిలిన 35 ఎకరాలు (సర్వే నంబర్లు 42, 129) గజ్వేల్ తహశీల్ కార్యాలయ రికార్డుల్లో పట్టాభూములుగా... ల్యాండ్ రెవెన్యూ కార్యాలయ రికార్డుల్లో ప్రభుత్వ భూములుగా నమోదై ఉంది. సదరు భూములకు సంబంధించి పరిహారం చెల్లించకుండా ఆ విషయాన్ని కలెక్టర్‌కు నివేదించారు. ఇవి ఏ రకమైన భూములో తేలిన తర్వాతే పరిహారం ఇచ్చే అవకాశముండగా ఈ వ్యవహారంలో నెలల తరబడి జాప్యం జరుగుతోంది. ఫలితంగా ఏడాది క్రితం భూములను స్వాధీన పరిచిన రైతులు పంటలు కోల్పోయి, చివరకు పరిహారం అందక అల్లాడుతున్నారు. ఇలాంటి సమస్య ఒక్క దాతర్పల్లిలోనే కాదు జిల్లా వ్యాప్తంగా నెలకొంది. ఈ పథకం కోసం జిల్లా పరిధిలో 27,934 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా ఇప్పటివరకు సుమారు మూడు వేల ఎకరాలను కూడా సేకరించలేకపోయారు. ఏడాది నుంచి ఎదురు చూస్తున్న.. దాతర్పల్లిలోని 42 సర్వే నంబర్లో 8 ఎకరాల 36 గుంటల భూమిని ప్రాణహిత పథకం కోసం అధికారులు తీసుకున్నారు. రెవెన్యూ కార్యాలయంలో పట్టా భూమి అని ఉంటే సంగారెడ్డిలోని ల్యాండ్ రికార్డ్ కార్యాలయ రికార్డుల్లో పీపీ భూమి అని ఉందట. ఈ సాకుతో ఏడాది కాలంగా పరిహారం ఇస్తలేరు. పరిహారం ఇచ్చేదాక పంటలైనా సాగు చేద్దామంటే అధికారులు ఒప్పుకుంటలేరు. ఈ సమస్య ఎప్పుడు తెగుతదో తెలుస్తలేదు. - జూపల్లి సత్యనారాయణ, రైతు దాతర్పల్లి త్వరలోనే పరిహారం.. దాతర్పల్లి గ్రామంలో 42, 129వ సర్వే నంబర్లలో నష్టపరిహారం నిలిచిపోయింది. ఈ సర్వే నంబర్లలోని భూములు ప్రభుత్వానివా? పట్టా భూములా? అనేది తేలిపోగానే పరిహారం పంపిణీకి చర్యలు చేపడతాం. తొందర్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం. - చంద్రమౌళి, ప్రాణహిత-చెవేళ్ల పథకం డిప్యూటీ తహశీల్దార్