expencs
-
కోట్లు పలికే ‘రంగురాయి’ ఏది? బంగారం, ప్లాటినం ఎందుకు దిగదుడుపు?
ఎవరైనా ఏదైనా ఖరీదైన వస్తువు గురించి మాట్లాడినప్పుడు ముందుగా బంగారాన్ని ప్రస్తావిస్తారు. నిజానికి ఒక గ్రాము బంగారం కొనాలన్నా కూడా చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్లాటినం దాని కంటే ఖరీదైనదిగా పరిగణిస్తారు. అయితే బంగారం, ప్లాటినం మాత్రమే అత్యంత ఖరీదైన ఖనిజాలు కాదు. దీనికంటే ఖరీదైన ఖనిజాలు భూమిపై చాలా ఉన్నాయి. అందుకే ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఖనిజం ఏది? దాని ధర ఎంత అనేది తెలుసుకుందాం. బంగారం కంటే ఖరీదైన ఖనిజాల ప్రస్తావన వచ్చినప్పుడు ఈ జాబితాలో అనేకమైనవి కనిపిస్తాయి. వాటిలో మనం ఉపయోగించే వాటి విషయానికొస్తే రోథియం, పల్లాడియం, ఇరిడియం, జాడైట్ మొదలైనవి ఉన్నాయి. ఇవేకాకుండా మనం నేరుగా ఉపయోగించని అనేక ఖనిజాలు కూడా ఉన్నాయి. అవి బంగారం కంటే చాలా ఖరీదైనవి. వీటిలో లిథియం లాంటి అనేక పదార్థాలు ఉన్నాయి. ఇప్పుడు అత్యంత ఖరీదైన ఖనిజం ఏమిటో తెలుసుకుందాం. అత్యంత ఖరీదైన ఖనిజం విషయంలో అనేక వాదనలు వినిపిస్తాయి. దానికి సంబంధించిన అనేక నివేదికలు కనిపిస్తాయి. ఆ నివేదికల ప్రకారం చూస్తే రోథియం అత్యంత ఖరీదైనది. మరికొందరు శాస్త్రవేత్తలు జాడైట్ ఖనిజం అత్యంత ఖరీదైనదిగా చెబుతారు. జాడైట్ ఒక రకమైన రాయి. అది లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీనిని ఖరీదైన ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు. దీని ధర క్యారెట్లలో ఉంటుంది. డైమండ్ మాదిరిగా ఇది క్యారెట్ల లెక్కన లభిస్తుంది. జాడైట్ క్యారెట్ ధర చాలా అధికం. ఒక క్యారెట్ జాడైట్ ధర 3 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ అని చెబుతారు. అంటే ఒక్క జాడైట్ రాయి కోసం కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది కూడా చదవండి: ఏ రాష్ట్రంలో బిచ్చగాళ్లు అధికం? -
‘సాక్షి ఎఫెక్ట్’.. ట్రాఫిక్ సమస్యకు చెక్..
సాక్షి, వేములవాడ(రాజన్న సిరిసిల్ల): వేములవాడలో రోడ్ల విస్తరణతోనే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. నిత్యం వస్తున్న భక్తులు, అవసరాల కోసం బయటకు వచ్చే స్థానికులతో వేములవాడ పట్టణంలోని రోడ్లు జన సమ్మర్థంగా మారుతున్నాయి. సోమవారం, పండుగల రోజుల్లో ట్రాఫిక్ ఇబ్బందలు అన్నీ.. ఇన్నీ కావు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో ‘రోడ్ల విస్తరణ’ అంశంపై శుక్రవారం ‘జూమ్ డిబేట్’ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ చర్చలో మున్సిపల్ చైర్‌పర్సన్‌తోపాటు పుర ప్రముఖులు పాల్గొన్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చైర్పర్సన్ హామీ ఇవ్వడంతో పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి చొరవ సమస్య పరిష్కారానికి ముందడుగు అని అభిప్రాయపడుతున్నారు. సమస్య పరిష్కారానికి ‘సాక్షి’ తీసుకున్న చొరవపై స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు. ఆశలు చిగురించాయి వేములవాడలో ఇరుకైన రోడ్లతో బండిపై వెళ్లడం భయంగానే ఉంటుంది. ‘సాక్షి’ చేపట్టిన డిబేట్తోనైన పనులు చేపడతారని ఆశ చిగురించింది. ఎన్నో ఏళ్లుగా చెబుతున్నరు.. ఇప్పటికీ పనులు చేపట్టలేదు. – బి.నరేశ్, స్థానికుడు రోడ్లు వెడల్పు చేయాలి ఇరుకైన రోడ్లతో వేములవాడ ఎదుగుతలేదు. గుడితోని కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్నా.. రోడ్ల విస్తరణను పట్టించుకోవడం లేదు. – వి.రవి, చిరువ్యాపారి అధికారులు స్పందించాలి పెద్ద బజార్‌కు పోవాలంటేనే భయంగా ఉంటుంది. ఎటునుంచి ఎవరు వస్తరో అర్థం కాదు. ‘సాక్షి’ పేపరోళ్లు మంచి కార్యక్రమం ముందేసుకున్నరు. అధికారులు పనులు చేయాలి. – జి.మాధవి, గృహిణి, వేములవాడ ఎటు చూసినా సందులే.. నేను చిన్నగున్నప్పటి నుంచి సూత్తున్న ఈ రోడ్లు మారుతనే లేవు. కూరగాయలకు పోదామన్నా తిప్పలుగా ఉంది. – సీహెచ్.మల్లవ్వ, గృహిణి పాలకుల్లో మార్పు రావాలి నేను ఇక్కడే పుట్టి, పెరిగిన. రోడ్లు వెడల్పు చేస్తారని చిన్నప్పటి నుంచి అంటున్నరు. చాలా సార్లు ధర్నాలు, రాస్తారోకోలు చేసినం. ‘సాక్షి’ చేపట్టిన డిబేట్ హర్షనీయం. ఇకనైన పాలకుల్లో మార్పు వస్తుందేమో చూడాలి. – ఎండీ.ఖాజాపాషా, రిౖటైర్డ్ కండక్టర్, వేములవాడ కదలికలు మొదలయ్యాయి వేములవాడలో రోడ్ల విస్తరణపై ‘సాక్షి’లో కథనం చూసి ఆనందం వేసింది. అధికారుల్లో కదలికలు మొదలయ్యాయి. జూమ్ డిబేట్ ద్వారా ప్రజల అభిప్రాయాలను పాలకుల వద్దకు తీసుకొచ్చినందుకు ‘సాక్షి’కి కృతజ్ఞతలు. వేములవాడలో వెంటనే రోడ్లు వెడల్పు చేపట్టాలి. – బింగి శ్రీనివాస్, ఎలక్ట్రీషియన్, వేములవాడ పేపర్ చూస్తే సంతోషమైంది వేములవాడ ప్రజలు, రాజన్న భక్తులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య రోడ్ల విస్తరణ. ఈ సమస్యపై ఈరోజు ‘సాక్షి’ లో ప్రచురితమైన కథనం చూస్తుంటే చాలా సంతోషమైంది. ఉమ్మడిరాష్ట్రంలో వేములవాడకు ఏమీ జరుగలేదు. కనీసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలోనైన రోడ్ల విస్తరణకు మోక్షం రాకపోవడం బాధాకరం. ఇప్పటికైన పాలకులు కాస్త స్పందించాలి. – చిలుక, రమేశ్, స్థానికుడు, వేములవాడ -
ఆ ఖర్చూ మేమే భరిస్తాం!
– అధికారపార్టీ అభ్యర్థికి తేల్చి చెప్పిన ఎమ్మెల్యేలు, ఇన్చార్జీలు – ప్రచార ఖర్చుకు రూ.10 లక్షలు ఇస్తామని అవమానించారని ఫైర్ – సర్దిచెప్పేందుకు యత్నించిన మంత్రులు సాక్షి ప్రతినిధి, కర్నూలు: పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార ఖర్చు విషయం అధికార పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఒక్కో నియోజకవర్గంలో ప్రచారానికి రూ. 5లక్షల మొత్తాన్ని ఇస్తామని అధికారపార్టీ అభ్యర్థి కేజే రెడ్డి.. ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలకు ఇవ్వచూపడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై ఇన్చార్జీలు, ఎమ్మెల్యేలు మండిపడటంతో.. నియోజకవర్గానికి రూ.10 లక్షల మేరకు సర్దుబాటు చేస్తామని ప్రకటించడాన్ని అందరూ ముక్తకంఠంతో నిరసించినట్టు సమాచారం. ఈ మాత్రం మొత్తాన్ని తామే భరిస్తామని.. మాకు ఇచ్చేది ఏందని నిలదీసినట్టు తెలిసింది. మొత్తం మీద ఎమ్మెల్సీ అభ్యర్థి వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అయితే, ఎలాగోలా సర్దుకుపోవాలని.. అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని మంత్రులు సర్దిచెప్పినట్టు తెలిసింది. ఈ పరిస్థితుల్లో గెలుపు సాధ్యమయ్యే అవకాశం లేదని ఆ పార్టీ నేతలు తేల్చిచెప్పినట్టు సమాచారం. అధికార పార్టీ ఉక్కిరిబిక్కిరి వాస్తవానికి పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో అధికారపార్టీ మొదటి నుంచీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. నియోజకవర్గ ఇన్చార్జీలు, ఎమ్మెల్యేలను కనీసం పలకరించలేదని.. తమతో సంబంధం లేకుండానే నియోజకవర్గాల్లో ఫ్లెక్సీలు కట్టారని ఫిర్యాదు చేశారు. దీంతో అభ్యర్థి కేజే రెడ్డికి అధిష్టానం క్లాస్ తీసుకుంది. అయితే, ప్రచారంలో ఎంతో వెనుకబడ్డారు. ఎక్కడా అభ్యర్థికి సానుకూలంగా వాతావరణం కనిపించలేదు. దీంతో మరోసారి సమన్వయ కమిటీ పేరుతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో కచ్చితంగా గెలుపునకు కృషి చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు సర్దిచెప్పారు. ఈ పరిస్థితుల్లో గెలుపు కష్టమని.. ఇందుకు కారణం అభ్యర్థి వైఖరేనని అందరూ తేల్చిచెప్పారు. దీంతో ఎలాగైనా గెలుపు సాధించేందుకు ప్రయత్నించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అడ్డగోలుగా కోడ్ ఉల్లంఘిస్తూ ప్రచారానికి అధికారపార్టీ పావులు కదుపుతోంది. ఇందుకోసం అధికారాన్ని ఉపయోగించుకుని ఓటు వేయాలని మరీ బెదిరింపులకు దిగుతోంది. ఎంతగా కోడ్ ఉల్లంఘిస్తున్నా ఎన్నికల అధికారులు కూడా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘన గెలుపు కష్టమని తేలిపోవడంతో.. ఎన్నికల కోడ్‌ను అధికారపార్టీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తోంది. మంత్రి హోదాలో అధికారులతో సమావేశాలు మొదలు... ఓటు వేయాల్సిందేనంటూ గురుకుల టీచర్లను, ప్రిన్సిపాళ్లను పిలిపించి మరీ అభ్యర్థితో కలిసి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా దర్జాగా పోలీసు బందోబస్తుతో నగరంలో అక్కడికి.. ఇక్కడికి చక్కర్లు కొట్టారు. ఇక ప్రచారంలో కూడా అందరి ఫ్లెక్సీలను చించి వేసినప్పటికీ అధికారపార్టీ అభ్యర్థి ఫ్లెక్సీలను మాత్రం అధికారులు తొలగించడం లేదు. పైగా రోజుకొక ప్రాంతంలో ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. అయినా అధికారులు మిన్నకుండిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్ని చేస్తున్నప్పటికీ సానుకూల వాతావరణం మాత్రం కనిపించడం లేదని అధికారపార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.