eyewitness
-
‘‘నీళ్లు ఇవ్వలేదని కాల్పులు జరిపారు’’
జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లా, హీరానగర్ పరిధిలోని సైదా సోహల్ గ్రామంలో మంగళవారం రాత్రి ఒక ఇంటిలోకి ఉగ్రవాదులు ప్రవేశించారు. విషయం తెలియగానే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో పాకిస్తాన్‌కు చెందిన ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఈ ఘటనలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓంకార్ అనే వ్యక్తి గాయపడ్డాడు. అతను ఘటనాక్రమాన్ని పోలీసులకు వివరించాడు. కథువాలోని జీఎంసీలో చికిత్స పొందుతున్న ఓంకార్ పోలీసులతో మాట్లాడుతూ తమ ఇంటి బయట అకస్మాత్తుగా పేలుడు శబ్దం వినిపించిందని, దీంతో తామంతా తలుపులు వేసుకుని, లోపలికి వెళ్లే ప్రయత్నిం చేస్తుండగా కాల్పులు జరిగాయన్నాడు. ఇంతలో ఉగ్రవాదులు లోనికి ప్రవేశించి తమ ఇంటిలోని ఒక మహిళను నీరు అడిగారని, ఆమె నిరాకరించడంలో కాల్పులు జరిపారని ఓంకార్ తెలిపాడు. వెంటనే తాము ఇంటిలోని మూలల్లో దాక్కున్నామన్నారు. సమపంలోని ఇళ్లలోని వారు కూడా ఇంటి తలుపులు వేసుకున్నారన్నారు.ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని ఎదురుదాడి ప్రారంభించి, ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. ప్రస్తుతం అతని సహచర ఉగ్రవాది కోసం గాలింపు కొనసాగుతోంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఉగ్రవాదులు భుజాలపై బ్యాగులు ధరించారు. వారి దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ఈ ఎన్కౌంటర్ దరిమిలా సైదా సోహల్తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో భయాందోళనకర వాతావరణం నెలకొంది. -
కోహ్లీ, గంభీర్ గొడవ గురించి ప్రత్యక్ష సాక్షి మాటల్లో...
-
రూ.5.5 కోట్ల కిడ్నాప్ కేసు.. ప్రత్యక్ష సాక్షిగా అంధుడు
లక్నో: ఉత్తరప్రదేశ్ పోలీసుల పని తీరుపై జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు. మీలాంటి అధికారులుంటే.. మా జీవితాలు బాగుపడ్డట్లే అని విమర్శిస్తున్నారు. పోలీసులపై ఇంత భారీ ఎత్తున ఆగ్రహం వ్యక్తం కావడానికి కారణం ఏంటంటే ఓ కిడ్నాప్ కేసులో పోలీసులు అంధుడిని ప్రత్యక్ష సాక్షిగా పేర్కొన్నారు. దీనిపై జనాలతో పాటు.. విపక్షాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆ వివరాలు... (చదవండి: రు. కోటి పెట్టి నిర్మించిన రోడ్డు.. కొబ్బరికాయ దెబ్బకు బీటలు) కొన్ని రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. శ్యామ్నగర్కు చెందిన మాంసం వ్యాపారి హాజీ ఆస్ మహ్మద్ అనే వ్యక్తిని అతడి బంధువులు హాజీ అన్సార్, అన్వర్లు మోసం చేశారు. మాంసం వ్యాపారం సాకుతో అతడి వద్ద నుంచి ఐదున్నర కోట్ల రూపాయలు తీసుకున్నారు. డబ్బు తీసుకున్నారు కానీ పని చేయలేదు. ఈ క్రమంలో తన డబ్బులు తిరిగి ఇచ్చేయాల్సిందిగా హాజీ నిందితులను కోరాడు. వారు అంగీకరించకపోగా.. అతడిపై దాడి చేసి.. కిడ్నాప్ చేస్తామని బెదిరించారు. దాంతో హాజీ ఆస్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుల మీద దాడి, కిడ్నాప్ కేసు నమోదు చేశారు పోలీసులు. (చదవండి: ఒమిక్రాన్ అందరిని చంపేస్తుందంటూ హత్యలు చేసిన డాక్టర్!) మొదటి నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పోలీసులు ఈ కేసులో ఓ అంధుడిని ప్రత్యక్ష సాక్షిగా పేర్కొన్నారు. అతడి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఈ విషయం కాస్త బయటకు రావడంతో పోలీసు శాఖపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. ఎలా.. అంధుడిని ప్రత్యక్ష సాక్షిగా పేర్కొని.. తమకు కళ్లు లేవని పోలీసులు నిరూపించుకున్నారు అని దుయ్యబట్టారు. వివాదం కాస్త పెద్దది కావడంతో ఉన్నతాధికారులు దీనిపై స్పందించారు. విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశించారు. చదవండి: 6 నెలల క్రితమే వివాహం.. భార్య పుట్టింటికి వెళ్లిందని.. -
‘చంపిరిరా.. నన్ను చంపిరి రా’ అని రెడ్డి అరిచాడు
నారాయణరెడ్డి హత్యలో ప్రత్యక్ష సాక్షుల కథనం ముందుగా మా జీపు వెళ్తోంది. వెనుక మాది ఇంకో జీపు వస్తోంది. మధ్యలో ఒక ట్రాక్టర్ పొలంలో నుంచి వేగంగా వచ్చి మా జీపును (నారాయణరెడ్డి జీపును) ఢీకొంది. బ్రేక్ సరిగ్గా పడక తగిలిందనుకున్నా. మిర్రర్లో వెనుకవైపు చూస్తుండగా, ముందుగా ఇంకో ట్రాక్టర్ వచ్చి ఢీకొట్టింది. ఒకేసారి రెండు వైపుల నుంచి రెండు ట్రాక్టర్లు కొద్దిసేపు ఢీకొట్టాయి. దీంతో మా జీపు రోడ్డు కిందకు వెళ్లిపోయింది. ఆ వెంటనే జీపుపై రాళ్లతో దాడి చేశారు. ఇదే సమయంలో మోరీల్లో, బెండచేనులో దాక్కున్న వారు వెంటనే బయటకు వచ్చి కొడవళ్లు, కత్తులతో దాడి చేశారు. నారాయణరెడ్డి జీపు ముందుభాగంలో కూర్చున్నాడు. దిగుదామంటే ట్రాక్టర్ అడ్డంగా ఉంది. అదే సమయంలో దాడి చేయడానికి వచ్చిన వారు నన్ను గుంజి (లాగి) పోతావారా.. నిన్ను చంపాలా అన్నారు. ఇంక నేను దిగి పారిపోయినా. జీపులో ఉన్న మిగతావారిని కూడా అలాగే బెదిరించి పంపించేశారు. సాంబశివుడు ఒక్కడే వారిని ఎదిరించాడు. దీంతో ఆయనను కాస్త దూరం తీసుకెళ్లి నరికి చంపేశారు. ఆ వెంటనే నారాయణరెడ్డి తలనరికి, రాళ్లతో కొట్టి చంపేశారు. ఆ సమయంలో రెడ్డి ‘చంపిరి రా నన్ను చంపిరి రా’ అని అరిచాడు. మొత్తం 20 మందికి పైగా దాడి చేశారు. దాడి చేసిన వారిలో నలుగురిని గుర్తుపట్టాను. ట్రాక్టర్ తోలిన వారిలో రామాంజనేయులు, రామనాయుడుతో పాటు మరో ముగ్గురు ఉన్నారు. మిగతా వారు మాస్క్‌లు వేసుకుని వచ్చారు. చంపిన తర్వాత ట్రాక్టర్‌పై వెళ్లేటప్పుడు కొడవళ్లు తిప్పుకుంటూ వెళ్లిపోయారు. – ఎల్లప్ప, నారాయణరెడ్డి వాహన డ్రైవర్ అబ్బా.. రెడ్డిని చంపిరే అని కూతలు వేసినా..! రెండు బండ్లు కలిసిపోతున్నాయి. కల్వర్ట్ రిపేరి ఉండటంతో మా బండ్లు స్లో అయ్యాయి. ఇదే సమయంలో ఒక ట్రాక్టర్ రఫ్‌గా రెండు బండ్ల మధ్య దూరింది. ఆ వెంటనే నారాయణరెడ్డి జీపును వెనుక నుంచి గుద్దాడు. ఆ జీపులో ఉన్న డ్రైవర్ ఎల్లప్ప మిర్రర్ నుంచి వెనుక చూసేలోపు ముందు నుంచి మరో ట్రాక్టర్ గుద్దింది. అప్పుడు డౌట్ వచ్చేసింది మాకు. అబ్బా.. రెడ్డిని చంపిరే అని నేను కూతలు వేసినా. బండి స్లో చేసి దిగడానికి వెళితే లెఫ్ట్‌సైడ్ బాంబు వేసినారు. మనలను కూడా చంపుతారు. మన వద్ద ఏమీ లేవని ముందుకెళ్లి చూసినా అంతలోపే నారాయణరెడ్డి బండిపైకి ఎక్కేసి రాళ్లు వేసి కొడవళ్లతో ఆయనను పొడుస్తున్నారు. మేము ఇబ్బంది పడతామని చెప్పి కిలోమీటర్న్నర దూరంలో ఉన్న క్రిష్ణగిరి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాం. సార్ రెడ్డిని చంపుతున్నారు సార్ అని చెబితే నలుగురైదుగురు పోలీసులు బైక్‌లపై వచ్చారు. ఈలోగా సాంబశివుడును చంపిన వారు పొలాల్లో, నారాయణరెడ్డి చంపిన వారు చెరుకులపాడు వైపు ట్రాక్టర్లో వెళ్లిపోయారు. మొత్తం పది నిమిషాల్లో అయిపోయింది. – కృష్ణమోహన్, నారాయణరెడ్డిని అనుసరిస్తున్న జీపు డ్రైవర్ కేఈ శ్యాంబాబు బెదిరించాడు... కేఈ శ్యాంబాబు నాకు గతంలో ఫోన్ చేసి బెదిరించారు. ‘నువ్వు చిట్యాలలో సుధాకర్‌రెడ్డి కట్ట విషయంలో ఎక్కువ మాట్లాడుతున్నావు. ఆ పంచాయతీలో నీవు ఎక్కువ తల దూరుస్తున్నావు. మీ చెరుకులపాడు నారాయణరెడ్డి ఆరు నెలల కంటే ఎక్కువ బతకడు’ అని చెప్పి వెంటనే నా ఫోన్ కట్ చేశాడు. – నాగరాజు, చిట్యాల గ్రామస్తుడు, నారాయణరెడ్డి అనుచరుడు -
'నేతాజీ మంటల్లో కాలిపోవటం చూశా'
నేతాజీతో కలిసి విమానంలో ప్రయాణించిన ఆయన ముఖ్య అనుచరుడు కల్నల్ హబీబ్ ఉర్ రహమాన్ వాగ్మూలం: 'పెద్ద శబ్ధంతో ప్రొఫెల్లర్.. ఆ వెంటనే విమానం నేల కూలి మంటలు చెలరేగాయి. ముందువైపు డోర్లన్నీ బిగుసుకుపోవటంతో 'నేతాజీ.. వెనుకవైపు మార్గమొక్కటే మిగిలింది మనకు' అన్నాన్నేను. వేరే దారిలేక ఇద్దరమూ మంటల్లో నడుస్తూ బయటికొచ్చాం. నేను వేసుకున్నవి ఉన్ని దుస్తులు కావటం వల్ల తీవ్రంగా కాలిపోలేదు. బయటికొచ్చి నేతాజీని చూద్దునుకదా.. నడుస్తున్న మంటలా ఉన్నారాయన. దుస్తులు, వెంట్రుకలు, శరీరంలో కొన్ని భాగాలు కాలిపోయాయి. నేతాజీ ఖాదీ దుస్తులు వేసుకోవటం వల్ల మంటలు త్వరగా అంటుకున్నాయని అర్థమైంది. వెంటనే నేతాజీ దగ్గరికెళ్లి ఆయన్ను కింద పడుకోబెట్టి నడుముకున్న బెల్ట్ ను విప్పే ప్రయత్నం చేశా. అప్పుడు గమనించా.. నేతాజీ తలకు ఎడమవైపు పెద్ద గాయమైంది. ఆ స్థితిలోనూ నేతాజీ.. 'నీకేం ప్రమాదం లేదు కదా, మనవాళ్లు ఎలా ఉన్నారు?' అని వాకబుచేశారు. జపనీస్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్ మేజర్ టారో కానో వాగ్మూలం: 'బోస్ బృందం ప్రయాణించడం కంటే రెండు రోజుల ముందే బాంబర్ విమానం ఎడమ ఇంజన్ లో లోపం ఉన్నట్లనిపించడంతో పరీక్షించా. ఆ తర్వాత అది బాగానే పనిచేస్తోదని నిర్ధారించుకున్నా. ఎందుకైనా మంచిదని ఇంజనీర్ చేతా కూడా ఓసారి పరీక్ష చేయించా. అతనుకూడా ఇంజన్ పర్ ఫెక్ట్ గా ఉందన్నాడు' టోరెన్స్ ఎయిర్ పోర్ట్ గ్రౌండ్ ఇంజనీర్ కెప్టెన్ నకామురా అలియాస్ యమామొటో వివరణ: 'బాంబర్ విమానం ఎడమ ఇంజన్ లో లోపం ఉన్నట్లనిపించింది. అదే విషయం పైటల్(మేజర్ టకిజవా) తో చెబితే ఓ ఐదు నిమిషాలపాటు దానికి మరమ్మతులు చేశాడు. బోస్ బృందం విమానం ఎక్కకముందు రెండు సార్లు టెస్ట్ ఫ్లై కూడా చేశాడు. అంతా సిద్ధంగా ఉందనుకున్న తర్వాతే విమానం టోక్యోకు బయలుదేరింది. నేను ఎయిర్ బేస్ లో నిలబడి విమానాన్నే చూస్తున్నా.. టేకాఫ్ తీసుకుని బహుషా 100 మీటర్లు వెళ్లిందోలేదో.. విమానం ఒక్కసారిగా ఎడమవైపునకు తిరిగి, నేలరాలుతున్నట్లు అనిపించింది. విమానం గాలిలో ఉండగానే ప్రొఫెల్లర్ ఊడిపడటం చూశా. కాంక్రీట్ రన్ వేకు దూరంగా విమానం కుప్పకూలి మంటలు చెలరేగిన దృశ్యాలు కనిపించాయి. వెంటనే మేం అటువైపు పరెగుపెట్టాం' షానవాజ్ ఖాన్ కమిటీ నివేది: 'ఇండియన్ నేషనల్ ఆర్మీ చీఫ్ సుభాష్ చంద్రబోస్, జపాన్ సైన్యానికి చెందిన లెప్టినెట్ జనరల్ సునామసా, సైనికులు, పైలట్, సిబ్బంది అంతా కలిపి 13 మంది ఆ రోజు ఉదయమే జపనీస్ ఎయిర్ పోర్స్ కు చెందిన బాంబర్ లోకి ప్రవేశించారు. టొరెన్స్(వియత్నాం) నుంచి హౌతో, తైపీ మీదుగా టోక్యో వెళ్లటం వారి ఉద్దేశం. అప్పుడు వాతావరణం సాధారణంగా ఉంది. విమానం ఇంజన్ లోనూ ఎలాటి లోపాలు లేవు. దీంతో హౌతోలో దిగకుండా నేరుగా తైపీకే వెళ్దామని నిర్ధారించాడు పైలట్. టోక్యోకు చేరుకోవాలనే తొందరలో బోస్, మిగతవాళ్లుకూడా అందుకు సరేనన్నారు ప్రమాదం జరిగిన తర్వాత.. విమాన ప్రమాదాన్ని గుర్తించిన ఎయిర్ బేస్ సిబ్బంది ఆంబులెన్స్ లతోసహా ఘటనా స్థలికి చేరుకున్నారు. నేతాజీ సహా విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అందర్నీ సమీపంలోని నన్మూన్ మిలటరీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేరేసమయానికి బోస్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ఈ సంఘటన గురించి తెలియగానే ఇండియాలోని బ్రిటిష్ అధికారులు ఇద్దరు ఇంటెలిజెన్స్ అధికారులను వియత్నాంకు పంపారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆ ఇద్దరు ఇంటెలిజెన్స్ అధికారులు ఆసుపత్రిలో బోస్ పరిస్థితి గురించి బ్రిటిష్ పాలకులకు సమాచారం అందించారు. వెలుగులోకి తెచ్చిన బ్రిటిష్ వెబ్ సైట్.. నేతాజీ మరణించినట్లుగా భావిస్తున్న రోజు (ఆగస్టు 18, 1945)న అసలేం జరిగిందనేది ప్రత్యక్ష సాక్షుల వాగ్మూలం ఆధారంగా రూపొందించిన పత్రాల్ని బ్రిటన్ కు చెందిన బోస్ ఫైల్స్ ఇన్ఫో అనే వెబ్ సైట్ శనివారం విడుదల చేసింది. వీటిలో షాజవాజ్ ఖాన్ కమిటీ (నేతాజీ అంతర్ధానంపై 1956లో భారత్ ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ) రిపోర్టుతోపాటు మరో ముగ్గురు ప్రత్యక్ష సాక్షుల వాగ్మూలాలను వెబ్ సైట్ బయలుపర్చింది. వాగ్మూలం ఇచ్చిన వారిలో ఒకరు నేతాజీ అనుచరుడు హబీబ్ ఉర్ రహమాన్ కాగా, మిగతా ఇద్దరు ఎయిర్ స్టాఫ్ అధికారి, సహ ప్రయాణికుడు. తర్వాత ఏం జరిగింది? బోస్ ఆసుపత్రిలో కోలుకున్నారా? లేక పరమపదించారా? ఆయన్ని చూడటానికి ఇండియా నుంచి ఎవరైనా వెళ్లారా? అసలు ఆసుపత్రిలో ఏం జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానాల కోసం జనవరి 16 వరకు నిరీక్షించాలి. అదే రోజున బోస్ ఫైళ్లకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పేర్కొంది www.bosefiles.info వెబ్ సైట్. -
ఆశారాం కేసులో ప్రధాన సాక్షిపై కాల్పులు
పానిపట్ : సూరత్ అత్యాచారం కేసులో ప్రధాన సాక్షి మహేందర్ చావ్లాపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. చండీగఢ్, పానిపట్టు జిల్లా సానౌలి గ్రామంలో మహేందర్ ఇంటి దగ్గర దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించారు. వెన్నులో రెండు బుల్లెట్లు దిగాయని, ప్రస్తుతం చావ్లా పరిస్థితి ప్రమాదకరంగా ఉందని పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సూరత్ అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు, ఆశారాం బాపు కుమారుడు, నారాయణ సాయికి గత రెండు వారాల క్రితమే గుజరాత్ హైకోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ కాల్పులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు వివిధ ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయని, దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. 2001- 2005 మధ్య కాలంలో ఆశారాం బాపు కుమారుడు నారాయణసాయి తనపై పలు సార్లు అత్యాచారం చేశాడని ఓ మహిళ గుజరాత్‌లోని సూరత్ నగరంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే 2000 సంవత్సరంలో ఆశారాం బాపు ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న తమపై బాపు, ఆయన కుమారుడు నారాయణ సాయి అత్యాచారం చేశారని గుజరాత్‌కు చెందిన ఇద్దరు అక్కచెల్లెళ్లు పోలీసు స్టేషన్లలో వేర్వేరుగా ఫిర్యాదుచేశారు. ఈ నేపథ్యంలో గుజరాత్, పంజాబ్, ఢిల్లీ పోలీసుల సంయుక్తంగా గాలింపు చర్యల్లో భాగంగా నారాయణ సాయిని, ఆశారాం బాపును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.