FAO
-
ఆహారానికి ‘అనారోగ్య మూల్యం’ అంతింత కాదయా!
వ్యవసాయ రంగం, ఆహార శుద్ధి పరిశ్రమల వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా సుమారు 800 కోట్ల మంది ప్రజల ఆకలి తీర్చుతూ, కోట్లాది మందికి ఉపాధి చూపుతున్నాయి. అయితే, అస్తవ్యస్థ వ్యవసాయ పద్ధతులు, ఆహార శుద్ధి–పంపిణీ గొలుసు వ్యవస్థల కారణంగా మన ఆరోగ్యంతో పాటు, భూగోళం ఆరోగ్యానికి కూడా పరోక్షంగా తీరని నష్టం జరుగుతోంది. నగదు రూపంలో అది ఎంత ఉంటుందో ఇప్పటి వరకూ ఇదమిత్దంగా తెలియదు. మొట్టమొదటి సారిగా ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) ప్రపంచవ్యాప్తంగా 154 దేశాల్లో ప్రజలు అపసవ్యమైన ఆహార వ్యవస్థల మూలంగా పరోక్షంగా చెల్లిస్తున్న ఈ మూల్యం ఎంతో లెక్కగట్టి తాజా నివేదికలో వెల్లడించింది. ప్రతి ఏటా మనం చెల్లిస్తున్న ఈ ‘పరోక్ష మూల్యం’ ఎంత ఎక్కువంటే.. అది మన ఊహకు కూడా అందదు! ఏకంగా 12.7 లక్షల కోట్ల డాలర్ల నష్టం జరుగుతోందట. ప్రపంచ దేశాల స్థూల జాతీయోత్పత్తిలో ఇది పది శాతం వరకు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ పరోక్ష మూల్యాన్ని ఎక్కువగా చెల్లిస్తున్న మొదటి రెండు దేశాలు చైనా (2.5 లక్షల కోట్ల డాలర్లు. 20%), అమెరికా (1.5 లక్షల కోట్ల డాలర్లు. 12.3%). ఆ తర్వాత స్థానం భారత్ (1.1 లక్షల కోట్ల డాలర్లు. 8.8%)దే. మూడేళ్ల క్రితం నాటి గణాంకాలు.. 2020 నాటి గణాంకాల ఆధారంగా, అప్పటి మార్కెట్ ధరలు, కొనుగోలు సామర్థ్యాన్ని బట్టి, ఏయే దేశం ఎంత మూల్యం చెల్లించిందో ఎఫ్.ఎ.ఓ. లెక్కతేల్చింది. పర్చేజింగ్ పవర్ పారిటీ (పిపిపి) ప్రకారం డాలర్ మార్పిడి విలువను ఎఫ్ఎఓ నిర్థారించింది. భారత్‌కు సంబంధించి డాలర్ మార్పిడి విలువను రూ. 21.989గా లెక్కగట్టింది. 12.7 లక్షల కోట్ల డాలర్లలో భారత్ వాటా 8.8%. అంటే.. 1.1 లక్షల కోట్ల డాలర్లు. ఆ విధంగా చూస్తే మన దేశం వ్యవసాయ, ఆహార వ్యవస్థల మూలంగా ప్రతి ఏటా రూ. 25 లక్షల కోట్లను ‘పరోక్ష మూల్యం’గా చెల్లిస్తోంది. జబ్బులకు వైద్యం కోసం ప్రతి ఏటా రూ. 14.7 లక్షల కోట్లు చెల్లిస్తోంది. రూ. 6.2 లక్షల కోట్ల మేరకు ఏటేటా పర్యావరణ, జీవైవిధ్య నష్టాన్ని చవిచూస్తోంది. సాంఘిక అంశాలకు సంబంధించి రూ.4.1. లక్షల కోట్ల మేరకు ప్రతి ఏటా పరోక్ష మూల్యంగా చెల్లిస్తోంది. అయితే, ఈ జాబితాలోకి చేర్చని విషయాలు ఇంకా ఉన్నాయని, అవి కూడా కలిపితే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఎఫ్ఎఓ వివరించింది. పిల్లల్లో పెరుగుదల లోపించటం, పురుగుమందుల ప్రభావం, భూసారం కోల్పోవటం, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్, ఆహార కల్తీ వల్ల కలిగే అనారోగ్యాలకు సంబంధించిన పరోక్ష మూల్యాన్ని గణాంకాలు అందుబాటులో లేని కారణంగా ఈ నివేదికలో పరిగణనలోకి తీసుకోలేదని, అవి కూడా కలిపితే నష్టం మరింత పెరుగుతుందని ఎఫ్ఎఓ పేర్కొంది. ‘పరోక్ష మూల్యా’న్ని లెక్కించేదిలా? ఆహారోత్పత్తులను మనం మార్కెట్లో ఏదో ఒక ధరకు కొనుగోలు చేస్తూ ఉంటాం. పోషకాలు లోపించిన, రసాయనిక అవశేషాలతో కూడిన ఆ ఆహారోత్పత్తులకు నేరుగా మనం చెల్లించే మూల్యం కన్నా.. వాటిని తిన్న తర్వాత మన ఆరోగ్యంపై, పర్యావరణంపై కలిగే ప్రతికూల ప్రభావాల వల్ల దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉందని అమెరికాలో రాక్ఫెల్లర్ ఫౌండేషన్ నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. ఆహారాన్ని కొన్నప్పుడు చెల్లించే ధరతో పాటు.. తదనంతర కాలంలో మనం మరో విధంగా (ఉదా.. వైద్య ఖర్చులు, పర్యావరణ నష్టాలకు..) చెల్లిస్తున్న మూల్యాన్ని కూడా కలిపి చూస్తేనే మనకు దానికి చెల్లిస్తున్న ‘అసలు ధర’ పూర్తిగా తెలుస్తుంది. అందుకే దీన్ని ‘హిడెన్ కాస్ట్’ అంటున్నారు. ‘ట్రూ కాస్ట్ అకౌంటింగ్’ అనే సరికొత్త మూల్యాంకన పద్ధతిలో ఆహారోత్పత్తులకు మనం చెల్లిస్తున్న ‘పరోక్ష మూల్యాన్ని’ ఎఫ్ఎఓ లెక్కగట్టింది. ఆ వివరాలను ‘వ్యవసాయ, ఆహార స్థితిగతులు–2023’ పేరిట తాజా నివేదికలో ఎఫ్ఎఓ వెల్లడించింది. వ్యవసాయం చేసే అస్థిర పారిశ్రామిక పద్ధతుల్లో పండించిన ఆహారానికి తోడైన ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల తినే ఆహారమే మన కు దీర్థకాలంలో జబ్బుల పాలు చేస్తోంది. ఊబకాయం, బీపీ, షుగర్, గుండె జబ్బులు, కేన్సర్ వంటి అసాంక్రమిత జబ్బులు ఇటీవల దశాబ్దాల్లో విజృంభించి ప్రజారోగ్యాన్ని హరించడానికి ఈ ఆహారాలే కారణమని ఎఫ్ఎఓ నివేదిక తేల్చింది. ఈ జబ్బులకు చికిత్స ఖర్చు, జబ్బుపడిన కాలంలో కోల్పోయే ఆదాయం కింద చెల్లిస్తున్న ‘పరోక్ష మూల్యం’ ప్రపంచవ్యాప్తంగా 70 శాతం ఉంటే, భారత్‌లో 60% మేరకు ఉంది. అంతేకాదు, మన దేశంలో నత్రజని ఎరువుల వినియోగం వల్ల వెలువడే ఉద్గారాల మూలంగా పర్యావరణానికి, జీవవైవిధ్యానికి మరో 13% చెల్లిస్తున్నాం. వ్యవసాయ కూలీలు, ఆహార పరిశ్రమల్లో కార్మికులు తక్కువ ఆదాయాలతో పేదరికంలో మగ్గటం వల్ల సామాజికంగా మరో 14% పరోక్ష మూల్యాన్ని భారతీయులు చెల్లిస్తున్నారని ఎఫ్ఎఓ తెలిపింది. మరింత సుస్థిరత వైపు.. సంక్షోభాలు, సవాళ్ల నేపథ్యంలో ప్రపంచ వ్యవసాయ, ఆహార వ్యవస్థలను మరింత సుస్థిరత వైపు నడిపించే ఉద్దేశ్యంతో పాలకులకు ప్రాథమిక అవగాహన కలిగించడమే ప్రస్తుత నివేదిక లక్ష్యం. సమగ్ర విశ్లేషణతో వచ్చే ఏడాది రెండో నివేదిక ఇస్తాం. సుస్థిర వ్యవసాయ, ఆహార వ్యవస్థల నిర్మాణానికి ఏయే దేశాలు ఏమేమి చర్యలు తీసుకోవచ్చు.. రైతులు, వినియోగదారుల ప్రయోజనాల రక్షణకు ప్రభుత్వాలు, పారిశ్రామికవేత్తలు ఏయే చర్యలు చేపట్టవచ్చో స్పష్టంగా సూచిస్తాం. దీని ప్రాధాన్యాన్ని అందరూ గుర్తించగలరని ఆశిస్తున్నానని ఎఫ్ఎఓ డైరెక్టర్ జనరల్ డొంగ్యు క్యూ ప్రకటించారు. (చదవండి: 'ప్రకృతి' పద్ధతిలో చీడపీడల యాజమాన్యం మేలు!) -
ప్రకృతి ప్రకోపానికి మూల్యం... 12,300 కోట్ల డాలర్లు!
(సాక్షి, సాగుబడి డెస్క్) :: అధిక ఉష్ణోగ్రతలు, కరువు, వరదలు, తుపాన్లు, భూకంపం, కార్చిచ్చులు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తులు పెను సవాళ్లు విసురుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి గతమెన్నడూ లేనంత ఎక్కువ సార్లు, తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. పంటలు, పశువులకు విపత్తుల నష్టం ప్రతి ఏటా 12,300 కోట్ల డాలర్లు! గత 30 ఏళ్లలో 3.8 లక్షల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లిందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) తాజా అధ్యయనంలో తేలింది. ప్రపంచ ఆహార దినోత్సవం(అక్టోబర్ 16) సందర్భంగా ‘వ్యవసాయం, ఆహార భద్రతలపై విపత్తుల ప్రభావం’పేరుతో వెల్లడించిన మొట్టమొదటి సమగ్ర నివేదికలో ఎఫ్ఏఓ ఈ వివరాలను తెలిపింది. ఎఫ్ఏఓ నివేదికలోని ముఖ్యంశాలివీ... పంటలు, పశువులకు గత (1991–2021) 30 ఏళ్లలో ప్రకృతి విపత్తుల వల్ల 3.8 లక్షల కోట్ల డాలర్ల మేర నష్టం జరిగింది. ప్రధానంగా అధిక ఉష్ణోగ్రతలు (26%), కరువు (19%), వరదలు (16%) వల్ల వీటికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ప్రపంచవ్యాప్తంగా విపత్తుల వల్ల పంటలు, పశువులకు జరిగే ఆర్థిక నష్టంలో సగానికి సగం ఆసియా దేశాల్లోనే జరుగుతోంది. ఆసియా దేశాలు 45% (1,72,000 కోట్ల డాలర్లు), ఉత్తర, దక్షిణ అమెరికా దేశాలు 22% (82,800 కోట్ల డాలర్లు), యూరప్ దేశాలు 17% (65,900 కోట్ల డాలర్లు), ఆఫ్రికా దేశాలు 15% (57,800 కోట్ల డాలర్లు), ఓసియానియా 1% (5,500 కోట్ల డాలర్లు) నష్టపోయాయి. ప్రతి ఏటా సగటున నష్టం 12,300 కోట్ల డాలర్లు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి కనీసం 5% ప్రకృతి విపత్తుల వల్ల చిల్లుపడుతోంది. అంటే గత 30 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా పంటలు, పశువులకు జరిగిన నష్టం.. 2022లో బ్రెజిల్ జీడీపీకి సమానం! అల్పాదాయ దేశాలు, అల్ప–మధ్య ఆదాయ దేశాల్లో ఈ నష్టం అత్యధికంగా వాటి జీడీపీల్లో 10–15% వరకు ఉంటోంది. గత 30 ఏళ్లలో గణాంకాలను పరిశీలిస్తే.. విపత్తుల వల్ల సగటున ఏడాదికి ప్రపంచవ్యాప్తంగా 6.9 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి చే జారిపోతోంది. 2021లో ఫ్రాన్స్‌లో ఉత్పత్తయిన మొత్తం ఆహార ధాన్యాలతో ఇది సమానం. ఏడాదికి 4 కోట్ల టన్నుల పండ్లు, కూరగాయలు, చెరకు ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోతున్నాం. 2021లో వియత్నాం, జపాన్ ఉత్పత్తి చేసిన పండ్లు, కూరగాయలతో ఇది సమానం. మాంసం, పాల ఉత్పత్తులు, గుడ్ల ఉత్పత్తిలో ఏటా 1.6 కోట్ల టన్నులు కోత పడుతోంది. 2021లో భారత్, మెక్సికో దేశాల్లో ఉత్పత్తయిన వాటికి ఇది సమానం. అయితే, వ్యవసాయ జీడీపీలో ఆసియా దేశాలు 4% విపత్తుల వల్ల కోల్పోతుంటే.. ఆఫ్రికా దేశాలు 8% వరకు కోల్పోతున్నాయి. పోషకాల పరంగా చూస్తే.. విపత్తుల వల్ల గత 30 ఏళ్లుగా ప్రతి రోజూ ఒక్కొక్కరు 147 కిలో కేలరీలను నష్టపోతున్నారు. విపత్తులతో కోల్పోతున్న ఆహారం ప్రతి రోజూ 40 కోట్ల మంది పురుషులు లేదా 50 కోట్ల మంది మహిళల ఆకలి తీర్చడానికి సరిపోతుంది. కార్చిచ్చుల వల్ల ఏటా 34–37 కోట్ల హెక్టార్ల భూమిలో పచ్చదనం దగ్ధమవుతోంది. ఒక్క 2021లోనే 2.5 కోట్ల అడవులు తగులబడ్డాయి. పంటలను రక్షించుకోవడానికి ఉపకరించే, వాతారణ మార్పుల్ని దీటుగా తట్టుకునే, ప్రకృతికి అనుగుణమైన వ్యవసాయ పద్ధతులను అమల్లోకి తేవాలి. వాతావరణ మార్పుల వల్ల ఇతర దేశాల నుంచి వచ్చిపడే సరికొత్త చీడపీడలు పంటలకు కలిగిస్తున్న నష్టం గురించి సమగ్రంగా అంచనా వేయగలిగే యంత్రాంగం, కొలమానం కొరవడ్డాయి. అయితే, ఈ నష్టం సంపన్న దేశాల్లో ఎక్కువగా ఉంటోంది. సాంకేతిక సహకారం, క్షేత్రస్థాయిలో ఉత్తమ సాగు పద్ధతులను అనుసరిస్తే వ్యవసాయంలో విపత్తుల నష్టాన్ని నివారించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. తద్వారా వాతావరణ మార్పుల్ని దీటుగా తట్టుకోవచ్చు. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలపై రూపాయి వెచ్చిస్తే రూపాయిల మేరకు ప్రయోజనం కలుగుతోందని అంచనా. -
భారత్ సూచనతో చిరుధాన్యాల సంవత్సరం ప్రారంభం
రోమ్: అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం–2023 మంగళవారం అధికారికంగా ప్రారంభమైంది. ఇటలీలోని రోమ్‌లో ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎఫ్ఏవో ప్రధాన కార్యదర్శి క్యూ డోంగ్యు, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభతో పాటు ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ జాక్వలిన్ హ్యుగ్స్ పాల్గొని ప్రత్యేక చిహ్నాన్ని ఆవిష్కరించారు. భారత్ ప్రతిపాదన మేరకు ఐరాస సర్వసభ్య సమావేశం 2023ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన విషయం తెలిసిందే. వాతావరణ మార్పుల్ని దీటుగా ఎదుర్కొని పౌష్టికాహార, ఆరోగ్య భద్రతను కలిగించే శక్తి చిరుధాన్యాలకు ఉందని.. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంలో వినియోగదారులు, రైతులు, పాలకులను చైతన్యపరిచి కార్యోన్ముఖుల్ని చేయటమే తమ లక్ష్యమని ఎఫ్ఏవో ప్రధాన కార్యదర్శి క్యూ డోంగ్యు ఈ సందర్భంగా అన్నారు. చిరుధాన్యాలు తరతరాలుగా భారతీయ సమాజానికి ఆహార భద్రతను కల్పిస్తున్నాయని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. మోదీ సందేశాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభ చదివి వినిపించారు. ఇదీ చదవండి: పని ప్రదేశాల్లో వేధింపులు ఎక్కువే: ఐక్యరాజ్యసమితి -
AP: ఆర్బీకేలు అద్భుతం.. వినూత్నం.. ఆసియా దేశాల ప్రతినిధులు ప్రశంసలు
సాక్షి, అమరావతి/సాక్షి, అమలాపురం: ‘రైతుభరోసా కేంద్రాల ఏర్పాటు ఆలోచన వినూత్నం.. ల్యాబ్ టూ ల్యాండ్ సాంకేతికత అద్భుతం’ అంటూ ఆసియా దేశాల ప్రతినిధులు కొనియాడారు. వ్యవసాయాధారిత దేశాలన్నీ తప్పకుండా అందిపుచ్చుకోవాల్సిన, ఆచరించాల్సిన సాంకేతికత పరిజ్ఞానం ఇదని వారు కితాబిచ్చారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో) ఆధ్వర్యంలో బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియా పసిఫిక్ సింపోజియంలో ‘వ్యవసాయ వ్యవస్థల పరివర్తన’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆర్బీకేలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చదవండి: మరో కీలక అడుగు.. విశాఖలో ఆంగ్లియాన్ పారిశ్రామిక, లాజిస్టిక్ పార్క్ ఏపీ ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలో రైతులకు అందిస్తోన్న సేవలపై ఆ దేశాల ప్రతినిధులు ప్రశంసలు కురిపించారు. సింపోజియంకు భారత్ తరఫున కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ సుభాఠాకూర్, ఏపీ వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య హాజరయ్యారు. సదస్సు రెండో రోజైన శుక్రవారం మిల్లెట్ మిషన్ ఆఫ్ ఇండియాపై సుభాఠాకూర్ ప్రసంగించగా, ఆర్బీకే వ్యవస్థ ఏర్పాటు, అమలుతీరుపై పూనం మాలకొండయ్య పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఆమె ఏమన్నారంటే.. సీఎం జగన్ ఆలోచన నుంచి పుట్టినవే.. పౌర సేవలను ప్రజల ముంగిటకు తీసుకెళ్లే లక్ష్యం తో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటుచేశారు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు అండగా నిలుస్తున్నారు. ఆక్వా, పాడి రైతులకు కూడా ఆర్బీకేల ద్వారా సేవలందిస్తున్నాం. పరిశోధనా ఫలితాలను నేరుగా వ్యవసాయ క్షేత్రాల వద్దకు (ల్యాబ్ టూ ల్యాండ్) తీసుకెళ్తున్నాం. సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో పాటు చేప, రొయ్య సీడ్, ఫీడ్, పశువుల దాణాలనూ ఆర్బీకేల్లో బుక్ చేసుకున్న గంటల్లోనే రైతులకు సరఫరా చేస్తున్నాం. సాగులో మెళకువలు నేర్పుతున్నాద్దాం. ఈ–క్రాప్, ఈ–ఫిష్ బుకింగ్ ద్వారా వాస్తవ సాగుదారులను గుర్తించి ప్రభుత్వ రాయితీలు, సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం. ఆర్బీకేలకు అనుబంధంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లతోపాటు ప్రతీ ఆర్బీకే పరిధిలో యంత్ర సేవా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఆర్బీకేలకు అనుబంధంగా రూ.17వేల కోట్లతో గ్రామస్థాయిలో మౌలిక సదు పాయాలు కల్పిస్తున్నాం’.. అని పూనం మాలకొండయ్య వివరించారు. ఆర్బీకే సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ఇథియోపియా ప్రతినిధులు త్వరలో తమ రాష్ట్రంలో పర్యటించనున్నారని ఆమె ఈ సదస్సు దృష్టికి తీసుకొచ్చారు. మా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తాం ఇక గేమ్ చేంజర్‌గా నిలిచిన ఆర్బీకేలు అనతికాలంలోనే అంతర్జాతీయ ఖ్యాతిని గడించాయని ఆసియా దేశాల ప్రతినిధులు కొనియాడారు. ఆర్బీకేల గురించి తమ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి ఆచరింపజేసేందుకు కృషిచేస్తామన్నారు. భారత్ వచ్చేందుకు తామూ ఆసక్తిగా ఉన్నట్లు బంగ్లాదేశ్ మంత్రి మహ్మద్ అబ్దుర్ రజాక్ కూడా చెప్పారు. థాయ్‌లాండ్‌తో పాటు యూకే, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, వియత్నాం, జపాన్, సింగపూర్, హాంకాంగ్, కంబోడియా, టాంగో, కుక్, సోలోమోన్ ఐలాండ్స్ దేశాల వ్యవసాయ మంత్రులు, కార్యదర్శులు, వివిధ యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు, శాస్త్రవేత్తలతో పాటు ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు పాల్గొన్నారు. అట్టడుగు స్థాయికి సేవలు సూపర్ ‘ఏపీలో రైతుభరోసా కేంద్రాల ద్వారా అట్టడుగు స్థాయి రైతులకూ సమస్త సమాచారం, ప్రభుత్వం నుంచి సహకారం అద్భుతంగా అందుతున్నాయి. ఇది నిజంగా రైతులకు మంచి ఫలితాలిస్తోంది. అలాగే, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌పీఓ) కూడా రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయడం అభినందనీయం’.. అని జర్మనీలోని హాంబర్గ్ యూనివర్సిటీ పరిశోధకులు జూలియా, రాబీర్, కార్మన్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో ఎఫ్‌పీవోలను వారు శుక్రవారం పరిశీలించారు. వాటి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. తెల్లదోమ ఆశించిన కొబ్బరి ఆకుకు డ్రైకోక్రైసా బదనికల గుడ్లు ఉన్న పేపర్ అతికించే విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు. మన దేశంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ విధానంపై అధ్యయనం చేసేందుకు వారు వచ్చారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఎఫ్‌పీవోలు బాగా పనిచేస్తున్నాయి జర్మనీలో సహకార వ్యవస్థ మాత్రమే ఉందని.. అదే భారత్‌లో సహకార వ్యవస్థతో పాటు ఎఫ్‌పీవోలు కూడా బాగా పనిచేస్తున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలకు.. వీటిని ప్రకృతి వ్యవసాయం ఏవిధంగా నిరోధించగలదనే అంశంపై అధ్యయనం చేసేందుకు తాము వచ్చామన్నారు. ఆర్బీకేలు, సహకార సొసైటీలు, ఎఫ్పీఓల ద్వారా ప్రభుత్వం నుంచి రైతులకు.. రైతుల నుంచి ప్రభుత్వానికి సమాచారం చేరడం మంచి పరిణామమని చెప్పారు. ఈ సందర్భంగా ఎఫ్పీఓల ద్వారా రైతులకు కలుగుతున్న ప్రయోజనాలను ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ సభ్యుడు జిన్నూరి రామారావు (బాబీ), వ్యవసాయ, ఉద్యాన శాఖల జిల్లా అధికారులు వై. ఆనందకుమారి, ఎన్.మల్లికార్జునరావు, ప్రకృతి వ్యవసాయ డీపీఎం ఎలియాజర్‌లతో వారు చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కస్టమ్ హైరింగ్ సెంటర్ల ద్వారా వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు, యంత్ర పరికరాలను, సన్న, చిన్నకారు రైతులు వినియోగించుకుంటూ లబ్ధిపొందుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్మెంట్ నేచురల్ ఫార్మింగ్ రాష్ట్ర అధికారి శ్రీకర్ దాసరి, మద్రాస్ ఐఐటీ ఇంజినీరింగ్ విద్యార్థి రుషీకా, టాటా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సోషల్ సెక్షన్ విద్యార్థి పునీత్ పాల్గొన్నారు. -
హంగర్ ఇండెక్స్‌లో దిగజారిన ఇండియా: ముంచుకొస్తున్న ఆకలి భూతం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ ఆకలి తీర్చడమే వరల్డ్ ఫుడ్ డే ప్రధాన లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా 150 కి పైగా దేశాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. అందరికీ ఆరోగ్యకరమైన ఆహారం అంటూ ప్రతీ ఏడాది లాగానే ‘‘ఆరోగ్యకరమైన రేపటి కోసం ఇప్పుడు సురక్షితమైన ఆహారం" అనే థీమ్‌ను నిర్ణయించారు. ఆహారాన్ని ఆదా చేయడం, వ్యర్థాలను తగ్గించడం, వ్యవసాయం, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల అభివృద్ధిని పెంచడం అనేది లక్ష్యం. తద్వారా భవిష్యత్తు తరాల కోసం ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ప్రబలంగా ఉన్న పోషకాహారలోప సమస్యను నిర్మూలించాలనేది ప్రధానోద్దేశం. వరల్డ్ ఫుడ్ డే : చరిత్ర, ప్రాధాన్యత ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) 1945లో స్థాపితమైంది. దీనికి గుర్తుగా ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పాటిస్తున్నారు. 1979 నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటారు. హంగేరియాకు చెందిన మాజీ వ్యవసాయ, ఆహార మంత్రి డాక్టర్ పాల్ రోమానీ సూచన మేరకు ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాలు ఈ డేను జరుపుకుంటాయి. దాదాపు 821 మిలియన్ల ప్రజలు దీర్ఘకాలికంగా పోషకాహార లోపంతో ఉన్నారు. వీరిలో దాదాపు 99 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలలో నివసిస్తుండటం గమనార్హం. ప్రపంచంలో ఆకలితో ఉన్నవారిలో 60శాతం మంది మహిళలు. ప్రతి సంవత్సరం దాదాపు 20 మిలియన్ల మంది పిల్లలు తక్కువ బరువుతో పుట్టారు. ఇందులో కూడా 96.5శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉన్నారు. అది కూడా ప్రతి ఐదు జననాలలో ఒకటి సరైన వైద్య సదుపాయం లేనందు వల్ల చనిపోతున్నారు. ఫలితంగా పిల్లల్లో మరణాలలో దాదాపు 50శాతం మంది 5 సంవత్సరాల లోపే ఉంటున్నాయి. ఎయిడ్స్, మలేరియా, క్షయ వ్యాధి కారణగా సంభవిస్తున్న మరణాలకంటే ఆకలి కారణంగా ప్రపంచవ్యాప్తంగాఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి. ప్రతి రోజు, 10,000 మందికి పైగా పిల్లలతో సహా 25,000 మంది ఆకలి, సంబంధిత కారణాలతో మరణిస్తున్నారు. 2050 నాటికి ప్రపంచ జనాభా 9.6 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఈ నేపథ్యంలో ఆహార ఉత్పత్తని పెంచడం అంటే తక్కువ ప్రాంతంలో ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేసే పద్ధతులు ముఖ్యంగా సహజ వనరులను ఉపయోగించాలినేది లక్ష్యం. మెరుగైన పంట, నిల్వ, ప్యాకింగ్, రవాణా, మౌలిక సదుపాయాలు, మార్కెట్ యంత్రాంగాలతో పాటు, సంస్థాగత చట్టపరమైన చర్యల తో అనేక కార్యక్రమాల ద్వారా తుది వినియోగానికి ముందు ఆహార నష్టాలను తగ్గించాలని నిర్ణయించింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ మరోవైపు గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో ఇండియా మరింత దిగజారింది. ప్రపంచ ఆకలి సూచిక (జీహెచ్ఐ) 2021లో 116 దేశాలలో భారతదేశం 101వ స్థానానికి పడి పోయింది. తాజా నివేదిక ప్రకారం 94వ స్థానం 101కి దిగజారింది. తద్వారా పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ , నేపాల్ కంటే కూడా ఇండియా వెనుకబడి ఉంది. బ్రెజిల్, చిలీ, చైనా. క్యూబా కువైట్ సహా పద్దెనిమిది దేశాలు జీహెచ్ఐ స్కోరు తొలి అయిదు టాప్ ర్యాంక్‌లో నిలిచాయని ఆకలి, పోషకాహారలోపాలను లెక్కించే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వెబ్సైట్ గురువారం తెలిపింది. అంతేకాదు ఇండియాలో ఆకలి స్థాయి ఆందోళనకరంగా ఉందని పేర్కొంది. దేశంలో కరోనా వైరస్ మహమ్మారి, సంబంధిత ఆంక్షల ప్రభావంతో ప్రజలు తీవ్రంగా నష్ట పోతున్నారనీ, ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే పోషహార లోపంతో బాధపడుతున్న పిల్లల రేటు అత్యధికంగా ఉన్న దేశం ఇండియానే అని నివేదిక పేర్కొంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 47 ప్రకారం దేశంలో పోషకాహార ప్రమాణాలను కాపాడటం ప్రభుత్వాల విధి. -
20న పండ్లు, కూరగాయలపై ఎఫ్.ఎ.ఓ. వెబినార్
అంతర్జాతీయ పండ్లు, కూరగాయల సంవత్సరం సందర్భంగా ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) ఈ నెల 20న వెబినార్‌ను నిర్వహించనుంది. చిన్న, సన్నకారు రైతుల చిన్న కమతాల్లో, పెరటి తోటల సాగులో సవాళ్లు, అవకాశాలపై చర్చిస్తారు. ఈ అంశంపై ఎఫ్.ఎ.ఓ. ప్రచురించిన సావనీర్‌ను విడుదల చేస్తారు. భారతీయ కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఆంగ్ల వెబినార్‌లో ఉచితంగా పాల్గొనదలచిన వారు పేర్లు నమోదు చేసుకోవచ్చు.. https://fao.zoom.us/webinar/register/WN_xZvk3yfwQLWgUtdjnemJHw 19న కొర్నెపాడులో మిరప సాగుపై శిక్షణ గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడులో సెప్టెంబర్ 19 (ఆదివారం)న ప్రకృతి/ సేంద్రియ వ్యవసాయ విధానంలో మిరప సాగుపై రైతునేస్తం శిక్షణా కేంద్రంలో శిక్షణ ఇస్తారు. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మహిళా రైతు లావణ్యారెడ్డి శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 97053 83666 -
హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ ఖ్యాతి
సాక్షి, హైదారబాద్ : గ్రేటర్ హైదరాబాద్‌కు మరో అరుదైన గుర్తింపు దక్కింది. భాగ్యనగరాన్ని ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్-2020’గా ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ), ఆర్బర్ డే ఫౌండేషన్ ప్రకటించింది. హైదరాబాద్ మహానగరంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు వాటిని పెంచేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నందుకుగాను ఈ గుర్తింపు లభించింది. ఈక్రమంలో ఎఫ్ఏఓ, ఆర్బర్ డే ఫౌండేషన్ ప్రపంచంలోని 63 దేశాల నుంచి 120 నగరాలు పరిశీలించాయి. వీటిలో 2020 సంవత్సరానికిగాను 51 నగరాలను ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్’గా ప్రకటించాయి. వీటిలో అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు చెందిన నగరాలు ఈ జాబితాలో ఉండగా భారతదేశం నుంచి ఈ అవార్డు దక్కించుకున్న ఏకైక నగరంగా హైదరాబాద్ నిలిచింది. భాగ్యనగరానికి ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్ట్’గా గుర్తింపు దక్కడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. హరితహారం వల్లే ఇది సాధ్యమయ్యిందని తెలిపారు. హరితహారంలో భాగంగా గత నాలుగేళ్లుగా హైదరాబాద్‌లో 2,76,97,967 మొక్కలను నాటడం, పంపిణీ చేయడం జరిగింది. 2016 నుంచి 2020 వరకు 3 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యానికి గాను 86.28 శాతం మొక్కలు పంపిణీ, నాటడం జరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రెండున్నర కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యానికి గాను 2.08 కోట్ల మొక్కలను పంపిణీ, నాటడం జరిగింది. నగరంలోని 65 ప్రాంతాల్లో యాదాద్రి మోడల్ మియావాకి ప్లాంటేషన్‌ను చేపట్టారు. 19 మేజర్ పార్కులు, 17 థీమ్ పార్కులు, 919 కాలనీ పార్కులు, 105 సెంట్రల్ మీడియన్లు, 66 ట్రాఫిక్ ఐ-లాండ్లు, 18 ఫ్లైఓవర్లు, 327 ట్రీ ఫార్కులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. చదవండి: హైదరాబాద్‌లో హైరైజ్ బిల్డింగ్స్.. రికార్డ్ బ్రేక్ -
రూ.75 స్మారక నాణెం విడుదల చేసిన ప్రధాని
సాక్షి, న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏఓ) 75 వ వార్షికోత్సవం సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75 రూపాయల స్మారక నాణాన్ని విడుదల చేశారు. ఎఫ్ఏవో తో భారతదేశానికి ఉన్న దీర్ఘకాల సంబంధాన్ని గుర్తుచేస్తూ స్మారక నాణాన్ని శుక్రవారం విడుదల చేశారు.ప్రత్యేకమైన ఈ కాయిన్ ప్రజలకు అందుబాటులో ఉండదు. ఎఫ్ఏఓ , ‘సాహీ పోషన్ దేశ్ రోషన్’ అనే హిందీలో ఉంటుంది.అలాగేే నేడు ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఇటీవల అభివృద్ధి చేసిన 17 రకాల బయోఫోర్టిఫైడ్ పంటలను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి గెల్చుకోవడం గొప్ప విషయని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆహార సరఫరా విషయంలో భారత పాత్ర, భాగస్వామ్యం చరిత్రాత్మకమైందన్నారు. బలహీన వర్గ ప్రజలను , ఆర్థికంగా, పౌష్టికంగా బలంగా మార్చడంలో ఎఫ్ఏఓ ప్రయాణం అసమానమైనదన్నారు. 2016 లో అంతర్జాతీయ పప్పుధాన్యాలు సంవత్సరంగా ప్రకటించిన సంస్థ, 2023 ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్‌గా ప్రకటించిందని, దీనికి భారత మద్దతు పూర్తిగా ఉంటుందని ప్రధాని మోదీ వెల్లడించారు. -
రాకాసి మిడతలు.. ముంచుకొస్తున్న ముప్పు!
పులి మీద పుట్రలా కరోనా మహమ్మారికి తోడు మరో ఉపద్రవం ముంచుకువస్తోంది. కరోనాతో సతమతమవుతున్న ఆఫ్రికా, ఆసియా దేశాలపై ఈ వేసవిలో మరో పిడుగు పడబోతోందా? లక్షలాది ఎకరాల్లో పంట పొలాలపై రాకాసి మిడతల దండు ఒకటి, రెండు నెలల్లో విరుచుకుపడి ఆహార భద్రతకు ముప్పు తెచ్చిపెట్టే పెను ప్రమాదం పొంచి ఉందా? అవుననే అంటున్నారు ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) నిపుణులు. ఇప్పటికే ఆహార కొరత, కరోనా మహమ్మారితో సతమతమవుతున్న తూర్పు ఆఫ్రికా దేశాల్లో గత పాతికేళ్లలో ఎన్నడూ ఎరుగనంత భీకరంగా రాకాసి మిడతల దండు ఇప్పుడు విలయాన్ని సృష్టిస్తోంది. కొద్ది నెలల క్రితం మిడతల దండు విజృంభించడంతో ఇథియోపియా, సోమాలియా, పాకిస్తాన్‌తోపాటు మన దేశంలోనూ లక్షలాది ఎకరాల్లో నోటికాడికి వచ్చిన పంటలు ధ్వంసమయ్యాయి. అప్పట్లో రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో 3,70,000 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. తెలంగాణలోని సిద్ధిపేట, మెదక్ జిల్లాల్లోనూ వేలాది ఎకరాల్లో మొక్కజొన్న తదితర పంటలు నాశనమయ్యాయి. అప్పట్లో కొద్ది రోజుల్లోనే సమసిపోయిన ఈ సమస్య తూర్పు ఆఫ్రికా దేశాలను కొద్ది నెలల్లోనే భీకర రూపం దాల్చి మళ్లీ చుట్టుముట్టింది. రెండో దశలో ఇథియోపియా, కెన్యా, సోమాలియా దేశాల్లో అంతకు ముందుకన్నా 20 రెట్లు ఎక్కువ సంఖ్యలో మిడతల దండు విజృంభిస్తున్నది. ఇలాగే ఉంటే వచ్చే జూన్ నాటికి మిడతల సంఖ్య 400 రెట్లు పెరిగిపోతుందని, సుమారు 60 దేశాలకు నష్టం చేకూర్చవచ్చని ఎఫ్.ఎ.ఓ. నిపుణుల అంచనా. అయితే, కరోనా మహమ్మారి లాక్డౌన్ మధ్య ఆఫ్రికా దేశాలు మిడతల దండును అరికట్టలేకపోతున్నాయి. ఫలితంగా ఇథియోపియాలో లక్షల హెక్టార్లలో టెఫ్ అనే చిరుధాన్యం, ఉల్లి పంటలు ఇప్పటికే పూర్తిగా నాశనం అయ్యాయి. మిడతల దండును అరికట్ట లేని పరిస్థితుల్లో రానున్న ఒకటి, రెండు నెలల్లో అనేక ఆఫ్రికా, ఆసియా దేశాల్లో పంటలకు పెనునష్టం జరగనుంది. ఆఫ్రికా దేశాల నుంచి బయలుదేరే మిడతల దండు జూన్ నాటికి భారత్‌లో పంజాబ్, హర్యానాలతో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లోనూ చుట్టుముట్టి పంటలకు నష్టం కలిగించే ముప్పు పొంచి ఉందని తాజా నివేదికలో ఎఫ్.ఎ.ఓ. హెచ్చరించింది. – పంతంగి రాంబాబు, సాగుబడి భారత్‌కు రెండు వైపుల నుంచి ముప్పు పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో పుట్టిన మిడతల దండు రెండు వలస దారుల్లో భారత్‌పై దాడి చేసే అవకాశం ఉంది. ఎమెన్, బహ్రెయిన్, కువైట్, ఖతార్, ఇరాన్, సౌదీ అరేబియా, పాకిస్తాన్ భూభాగం మీదుగా భారత్‌లోని పంజాబ్, హర్యానాల్లో పంట పొలాలపై మే, జూన్ మాసాల్లో మిడతల దండు దాడి చేసే ప్రమాదం ఉందని ఎఫ్.ఎ.ఓ. హెచ్చరిస్తోంది. అదేవిధంగా, ఇథియోపియా, సోమాలియా దేశాల నుంచి హిందూ మహా సముద్రం మీదుగా దక్షిణ భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్ సహా తూర్పు, పశ్చిమ తీరంలోని వివిధ రాష్ట్రాల్లో మిడతల దండు దాడి చేసి పంటలను తీవ్రంగా నష్టపరిచే అవకాశం ఉందని ఎఫ్.ఎ.ఓ. తాజా నివేదికలో హెచ్చరించింది. ఎడారి మిడతలు.. 8 తూర్పు ఆఫ్రికా దేశాల్లో (కెన్యా, ఇథియోపియా, సోమాలియా, జిబౌటి, ఉగాండ, టాంజానియా, సూడాన్, ఎరిట్రియ) పంటలు, మొక్కలు, చెట్లకు పెనుముప్పుగా పరిణమించాయి. ఇథియోపియా, సోమాలియాలలో గత పాతికేళ్లుగా ఎన్నడూ లేనంత ఎక్కువగా ఆహార, ఆదాయ భద్రతకు గొడ్డలిపెట్టుగా మారాయి. కెన్యా.. 70 ఏళ్లలో ఎరుగనంత ఎక్కువగా మిడతల బెడదను ఎదుర్కొంటున్నది. ఆఫ్రికా దేశాల నుంచి మన దేశానికి మిడతల దండు పయనించే అవకాశం ఉన్న మార్గాలను సూచిస్తూ ఎఫ్.ఎ.ఓ. రూపొందించిన చిత్రం 10 లక్షల హెక్టార్లలో గుడ్లు కరువు కాటకాలతో నిరంతరం అల్లాడే ఈ తూర్పు ఆఫ్రికా దేశాల్లో గతేడాది అక్టోబర్‌లో భారీ వర్షాల తర్వాత ఎడారి మిడతలు గుడ్లు పెట్టి సంతతిని తామరతంపరగా వృద్ధి చెయ్యటం మొదలు పెట్టాయి. 8 దేశాల్లో 10 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో గుడ్లు పెట్టి సంతతిని పెంచుకుంటున్నాయి. ఇది నూర్పిడి సీజన్ కావడంతో రైతులు అల్లాడుతున్నారు. ఆహార , ఆదాయ భద్రతకు ముప్పు వచ్చిపడింది. మూక శక్తితోనే విధ్వంసం ఎడారి మిడత ప్రవర్తన ఒంటరిగా ఉన్నప్పుడు సాధారణంగానే ఉంటుంది. అప్పుడు పంటలకు వీటి వల్ల బెడద ఉండదు. కానీ, ఎక్కువ సంఖ్యలో ఒక చోట చేరినప్పుడు విధ్వంసకర మూక శక్తిగా ప్రవర్తిస్తాయి. మిడతల దండు ప్రవర్తనలోనే కాదు.. వాటి రంగు, రూపంలో కూడా మార్పులు వస్తాయి. రోజూ తనంత తిండి! మిడత రోజూ తన బరువుతో సమానమైనంత ఆకులు, అలములు, గింజలు ఆహారంగా తింటుంది. మిడతల దండు అనేక కిలోమీటర్ల వెడల్పున విస్తరించి ఉండవచ్చు. ఒక చదరపు కిలోమీటరు విస్తరించి ఉండే మిడతల దండులో 4–5 కోట్ల వరకు మిడతలు ఉంటాయి. ఇవి ఒక్క రోజులో 35 వేల మంది మనుషులు తినేంత ఆహారాన్ని తినేస్తాయి. ఈ దండు నేల వాలిందంటే ఆయా ప్రాంతాల్లో పంటలు, గడ్డి, ఆకులు పచ్చదనం అంతా ఇట్టే ఖాళీ అయిపోతుంది. ఆహార పంటలతోపాటు పచ్చిక బయళ్లను కూడా మిడతల దండు ఆరగించేస్తుంది. అడవులకూ బెడద పొంచి ఉంది. జీవన కాలం 3 నెలలు ఎడారి మిడత జీవిత కాలం సాధారణంగా 3 నెలలు. అయితే, చల్లని వాతావరణంలో 6 నెలలు కూడా జీవిస్తుంది. ఎడారి ప్రాంతాల్లో సైతం నెలకు 2.5 ఎం.ఎం. వర్షపాతం వరుసగా రెండు నెలల్లో కురిస్తే చాలు మిడతల దండు సంతతి వృద్ధికి సరిపోతుంది. తగిన తేమ ఉన్న ఇసుక నేలల్లో 2–4 అంగుళాల లోతున మిడత గుడ్లు పెడుతుంది. ఒక మిడత 80 నుంచి 160 గుడ్లను గంపగుత్తగా పెడుతుంది. చదరపు మీటరు స్థలంలో వందలాది మిడతలు గుడ్లు పెడతాయి. గుడ్ల లో నుంచి రెండు వారాల్లో పిల్లలు బయటకు వస్తాయి. 4–6 వారాల్లో రెక్కలు సంతరించుకొని ఎగర గలుగుతాయి. ఆ దశలో మిడతల దండులో చేరుతుంది. అప్పటి నుంచి 3–4 వారాలు యాక్టివ్‌గా ఉండిన తర్వాత మిడత గుడ్లు పెడుతుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే గుడ్లు పెట్టిన తర్వాత చనిపోతుంది. అడ్డుకునేదెలా? వాతావరణ మార్పుల నేపథ్యంలో అకాల వర్షాలతో ఏర్పడే అనువైన వాతావరణమే మిడతల దండు విజృంభించడానికి కారణమని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. పురుగులు మందు చల్లి సంతతిని అరికట్టే ప్రయత్నం చేయటం తప్ప అరికట్టేందుకు మరో మార్గమేదీ లేదంటున్నారు. ఆఫ్రికాలో రెండు రకాల (Schistocerca gregaria, Locusta migratoria) మిడతలు సమస్యాత్మకంగా తయారయ్యాయి. శక్తివంతమైన పురుగుమందులను మనుషులతోను, విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్ల తోను పిచికారీ చేయిస్తున్నారు. పురుగులను అరికట్టే మెటార్హిజియం శిలీంధ్రం (Metarhizium sp.) చల్లుతున్నారు. అయితే, శిలీంధ్రం వృద్ధి చెంది మిడతలను మట్టుబెట్టడానికి 7 నుంచి 14 రోజుల వ్యవధి అవసరం అవుతుంది. చెద పురుగులు, స్కరబ్ బీటిల్స్‌పై ఈ శిలీంధ్రం ప్రతికూల ప్రభావం చూపుతున్నదని అంటున్నారు. మిడతలపై పురుగుల మందు పిచికారీ -
80 కోట్ల మందికి రోజూ రాత్రి భోజనం కరువు
న్యూఢిల్లీ: ప్రపంచంలో ఆకలితో అలమటిస్తున్నవారు, పోషకాహార లోపంతో బాధ పడుతున్నవారు రోజురోజుకు కోకొల్లలుగా పెరిగిపోతున్నారంటూ ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే తగిన చర్యలు తీసుకోక పోయినట్లయితే 2035 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభాలో సగం మంది ఈ పోషకాహార లోపానికి గురవుతారని ఐక్యరాజ్య సమితి ఆహారం, వ్యవసాయ సంఘం గురువారం విడుదల చేసిన ఓ నివేదికలో హెచ్చరించింది. ప్రస్తుతం ప్రపంచంలో మూడోవంతు జనాభా ఆకలితో, పౌషకాహార లోపంతో బాధ పడుతున్నారని, ఫలితంగా వీరి ఆరోగ్య ఖర్చులకు, వీరి ఉత్పాదన శక్తి తగ్గిపోవడం వల్ల ఏడాదికి మూడున్నర లక్షల కోట్ల డాలర్లు నష్టపోతున్నామని నివేదిక అంచనా వేసింది. ప్రతి రోజు 80 కోట్ల మంది ప్రజలు రాత్రిపూట భోజనం లేక కాలే కడుపులతోనే కలత నిద్ర పోతున్నారని నివేదిక పేర్కొంది. మరోపక్క 190 కోట్ల మంది ప్రజలు ఊబకాయంతో బాధపడుతున్నారట. పౌష్టికాహార సమస్యను ప్రభుత్వం తన సమస్యగా భావించి నివారించేందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని పౌష్టికాహార లోపంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో సమితి ఆహార, వ్యవసాయ సంఘం డెరైక్టక్ జనరల్ జోష్ గ్రజియానో హెచ్చరించారు. సరైన డైట్, వ్యాయామం లేకపోవడం వల్లనే ప్రపంచంలో ఎక్కువ మంది ఆస్పత్రుల పాలవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. -
పొలాల్లో కన్నా 15 రెట్లు ఎక్కువ!
పొలాల్లో కూరగాయల ఉత్పాదకత కన్నా ఇంటి పెరట్లో/భవనాలపైన కుండీలు, మడుల్లో సాగు చేసే కూరగాయల ఉత్పాదకత 15 రెట్లు ఎక్కువ. ప్రపంచ ఆహార సంస్థ (ఎఫ్ఏఓ) గణాంకాల ప్రకారం.. ఇంటిపట్టున చదరపు మీటరు విస్తీర్ణంలో ఏడాదికి 20 కిలోల ఆహారాన్ని పండించవచ్చు. ఎఫ్ఏఓ ఇంకా ఏమన్నదంటే.. ఇంటిపంటల సాగు వల్ల దూరం నుంచి ఆహారోత్పత్తుల్ని పట్టణాలు, నగరాలకు తరలించాల్సిన అవసరం తగ్గి, ఆ మేరకు ఇంధనం ఆదా అవుతుంది. కాలుష్యం తగ్గుతుంది. పోషకవిలువలతో కూడిన తాజా సహజాహారం లభిస్తుంది. కూరగాయల సాగు కాలం తక్కువ. కొన్ని రకాలైతే విత్తిన 60 రోజుల్లోనే దిగుబడినిస్తాయి. పట్టణాలు, నగరాల్లో సాగుకు అనుకూలం. ప్రపంచవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో 80 కోట్ల మంది కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నారు. పట్టణాల్లో నివసిస్తున్న అల్పాదాయ వర్గాల ప్రజలు కూరగాయలు, ఆకుకూరలను తమకున్న కొద్దిపాటి చోటులో పండించుకుంటూ ఆహారంపై ఖర్చును తగ్గించుకుంటున్నారు. పట్టణాల పరిసరాల్లో సాగయ్యే కూరగాయలు, పండ్ల తోటల్లో ప్రతి వంద చదరపు మీటరుకు ఒకరికి చొప్పున ఉపాధి దొరుకుతుంది! 1.5 నుంచి 2 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మొక్కలు పెంచితే ఒకరికి సరిపోయే ఆక్సిజన్ వెలువడుతుందట. కమ్మటి కూరలతోపాటు ఈ బోనస్ బాగుంది కదండీ..! -
కలప వస్తువులే బెటర్ అట..
రోమ్: ఇంట్లోని టేబుల్, కుర్చీ, మంచం లాంటి ఫర్నీచర్ కలపతో చేసిందయితేనే పర్యావరణానికి మంచిదట. ఇల్లు కూడా కాంక్రీట్ మెటీరియల్‌తో కట్టింది కాకుండా రిసైక్లింగ్ కలపతో చేసిందయితే ఇంకా మంచిదట. ఫర్నీచర్ తయారీకి ఉపయోగించే కలప కోసం అడవులను అక్రమంగా నరికి వేస్తున్నారని, అడవులు అంతరించి పోవడం వల్ల పర్యావరణం దెబ్బతింటోందని, వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెరుగుతున్నాయని ఇంతకాలం అందరం భావిస్తూ వచ్చాం. ఇందులో కొంతవరకే వాస్తవం ఉందని, వాస్తవానికి ఫర్నీచర్ కోసం కలపకు బదులుగా ప్లాస్టిక్, అల్యూమినియం, ఇనుము, ఉక్కుతో తయారు చేస్తున్న వస్తువుల వల్లనే పర్యావరణానికి ఎక్కువ ప్రమాదమని ఐక్యరాజ్యసమితి ‘ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ)’ ఓ నివేదికలో వెల్లడించింది. ప్లాస్టిక్, ఇతర మెటీరియల్‌తో ఫర్నీచర్ తయారు చేయడానికి శిలాజ ఇంధనం ఎక్కువ అవసరమవుతుందని, ఈ ఇంధనం ఖర్చు వల్ల వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెరుగుతున్నాయని, ఇది భూతోపన్నతికి దారి తీస్తోందని ఆ నివేదిక పేర్కొంది. ప్లాస్టిక్ వస్తువులు, వాటి రీసైక్లింగ్ వల్ల కూడా ఇంధనం ఖర్చు ఎక్కువగా పెరుగుతోందని తెలిపింది. పైగా ఈ వస్తువులకు కార్బన్‌ను పీల్చుకునే గుణాలు కూడా లేవు. అదే ఫర్నీచర్ తయారీకి మెటల్ మెటీరియల్‌ను కాకుండా కలపను ఉపయోగించినట్లయితే ఫర్నీచర్ తయారీకి ఎలాంటి ఇంధనం అవసరం ఉండదని, కలపను కట్ చేయడానికి మాత్రం విద్యుత్‌ను ఉపయోగించాల్సి వస్తుందని ఎఫ్‌ఏఓకు చెందిన ఫారెస్ట్ అసిస్టెంట్ డెరైక్టర్ జనరల్ రెనీ కాస్ట్రో సలాజర్ తెలియజేశారు. పైగా కలపకు కర్బన ఉద్గారాలను కొన్నేళ్లపాటు తనలో ఇముడ్చుకునే గుణం ఉందని, పైగా కలప ఫర్నీచర్‌ను ఆరు బయట పడేస్తే అది సేంద్రీయ పదార్థంగా కూడా మరుతోందని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్న కర్బన ఉద్గారాల్లో 12 శాతమే కలప కోసం అడవులను అక్రమంగా నరికి వేయడం వల్ల జరుగుతోందని ఎఫ్ఏఓ నివేదిక వెల్లడించింది. అదే ఇంట్లోని ఫర్నీచర్‌తోపాటు ఇంటిని కూడా రీసైక్లింగ్ కలపతో నిర్మించుకున్నట్లయితే ఏటా 13.5 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలను అరికట్టవచ్చని, ఇది ఒక బెల్జియం దేశం ఏటా విడుదల చేసే కర్బన ఉద్గారాలకన్నా ఎక్కువని నివేదిక పేర్కొంది. ఈ అంచనాల ప్రకారం కలపకు బదులుగా మనం ఉపయోగిస్తున్న ప్రత్యామ్నాయ మెటీరియల్ వల్లనే పర్యావరణం ఎక్కువ దిబ్బతింటోంది. అలా అని కలప కోసం అడవులను అడ్డంగా నరకడాన్ని నియంత్రించాల్సిందే. కర్బన ఉద్గారాలను తన కడుపులో ఇముడ్చుకునే చెట్లను పరిరక్షించుకోవాల్సిందే. ఓ పక్క సమృద్ధిగా చెట్లను పెంచుతూనే మానవ అవసరాలకు కలపను సమన్వయంతో ఉపయోగించుకుంటే పర్యావరణానికి మేలు చేసిన వారమవుతాం. మనకు తెలియకుండానే మైనర్ పిల్లలతో తయారు చేస్తున్న చెప్పులను, బూట్లను కొనుగోలు చేస్తుంటాం. తెలిశాక అలాంటి బ్రాండ్లకు దూరంగా ఉండాలనుకుంటాం. అలాగే మనకు వస్తున్న కలప అక్రమంగా వస్తుందా, సక్రమంగా వస్తుందా, సమృద్ధిగా ఉన్న చోట నుంచి వస్తుందా ? తెలసుకొని వ్యవహరించే విచక్షణ మనకుంటే అడవులను కాపాడుకోవచ్చు. మన కలప అవసరాలను తీర్చుకోవచ్చు. సక్రమమైన కలపంటూ సర్టిఫై చేయడానికి ‘ఫారెస్ట్ స్టీవర్డ్ కౌన్సిల్’ లాంటి అంతర్జాతీయ సంస్థల సేవలను వినియోగించుకోవచ్చు. -
వాణిజ్య ఒప్పందాన్నిఅడ్డుకోవడం లేదు:మోడీ
న్యూఢిల్లీ: నిబంధనలతో కూడిన అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాన్ని తాము అడ్డుకోవడం లేదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. అయితే తమ దేశప్రజల, రైతుల ప్రయోజనాలపై రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. మంగళవారమిక్కడ తనతో సమావేశమైన ఎఫ్ఏఓ డైరెక్టర్ జనరల్ జోస్ గ్రాజియానో డ సిల్వాకు ఈ మేరకు తేల్చిచెప్పారు. ప్రపంచ వాణిజ్య సంస్థ లో పేదలు, రైతుల ప్రయోజనాలను పరిరక్షించడంలో నాయకత్వం వహించాలని ఆయనను కోరారు. తమ దేశ వ్యవసాయరంగంలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి, మహిళలకు పోషకాహారం అందించడానికి కార్యక్రమం రూపకల్పనలో ఎఫ్ఏఓ చురుకైన పాత్ర పోషించాలని భారత్ కోరుకుంటోందని మోడీ చెప్పారు. -
ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఆహార ఉత్పత్తుల ధరలు
న్యూఢిల్లీ: ఆహార ఉత్పత్తుల ధరలు అక్టోబర్‌లో పెరిగాయి. వరుసగా ఐదు నెలల పాటు తగ్గిన ధరలు మళ్లీ అక్టోబర్‌లో పైకి ఎగసినట్లు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆహార వ్యవసాయ సంఘం (ఎఫ్ఏఓ) పేర్కొంది. ఎఫ్ఏఓ ధరల సూచీలో చక్కెర ధరల భారీ పెరుగుదలను ప్రత్యేకంగా ప్రస్తావించింది. ప్రపంచంలోనే అత్యధికంగా చక్కెర ఉత్పత్తి, ఎగుమతిదారు అయిన బ్రెజిల్లో అననుకూల వాతావరణం వల్ల చెరకు పంట దెబ్బతినడం మొత్తం సూచీ పెరుగుదలకు ఒక కారణమని తెలిపింది. ఎఫ్ఏఓ ధరల సూచీ అక్టోబర్‌లో 205.8 పాయింట్లుగా ఉందని తెలిపింది. సెప్టెంబర్‌తో పోల్చితే ఈ సూచీ 1.3 శాతం పెరిగిందని వెల్లడించింది. తృణధాన్యాలు, ఆయిల్‌సీడ్స్, డయిరీ ఉత్పత్తులు, మాంసం, చక్కెర నెలవారీ ధరల మార్పు ప్రాతిపదికన ఎఫ్ఏఓ ధరల సూచీ కూర్పు ఉంటుంది.