వాణిజ్య ఒప్పందాన్నిఅడ్డుకోవడం లేదు:మోడీ
న్యూఢిల్లీ: నిబంధనలతో కూడిన అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాన్ని తాము అడ్డుకోవడం లేదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. అయితే తమ దేశప్రజల, రైతుల ప్రయోజనాలపై రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. మంగళవారమిక్కడ తనతో సమావేశమైన ఎఫ్‌ఏఓ డైరెక్టర్ జనరల్ జోస్ గ్రాజియానో డ సిల్వాకు ఈ మేరకు తేల్చిచెప్పారు. ప్రపంచ వాణిజ్య సంస్థ లో పేదలు, రైతుల ప్రయోజనాలను పరిరక్షించడంలో నాయకత్వం వహించాలని ఆయనను కోరారు.
తమ దేశ వ్యవసాయరంగంలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి, మహిళలకు పోషకాహారం అందించడానికి కార్యక్రమం రూపకల్పనలో ఎఫ్‌ఏఓ చురుకైన పాత్ర పోషించాలని భారత్ కోరుకుంటోందని మోడీ చెప్పారు.