Female candidate
-
Wardah Khan: ఇంట్లో ప్రిపేరయ్యి విజేతల వీడియోలు చూసి
యు.పి.ఎస్.సి. 2023 ఫలితాల్లో టాప్ 25 ర్యాంకుల్లో 10 మంది మహిళా అభ్యర్థులున్నారు. భిన్న జీవనస్థాయుల నుంచి వీరంతా మొక్కవోని పట్టుదలతో పోరాడి ఇండియన్ సివిల్ సర్వీసుల్లో సేవలు అందించేందుకు ఎంపికయ్యారు. 18వ ర్యాంకు సాధించిన 23 ఏళ్ల వార్దా ఖాన్ సివిల్స్ కల కోసం కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి పెట్టింది. సొంతగా ఇంట్లో ప్రిపేర్ అవుతూ గతంలో ర్యాంక్ సాధించిన విజేతలతో స్ఫూర్తిపొందింది. నోయిడాలోని ఆమె ఇలాకా ఇప్పుడు సంతోషంతో మిఠాయిలు పంచుతోంది. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతుండగా వార్దా ఖాన్‌ను ‘మాక్ ఇంటర్వ్యూ’లో ఒక ప్రశ్న అడిగారు– ‘నువ్వు సోషియాలజీ చదివావు కదా. సమాజంలో మూడు మార్పులు తేవాలనుకుంటే ఏమేమి తెస్తావు’ అని. దానికి వార్దా ఖాన్ సమాధానం 1.స్త్రీల పట్ల సమాజానికి ఉన్న మూస అభి్రపాయం మారాలి. వారికి అన్ని విధాల ముందుకెళ్లడానికి సమానమైన అవకాశాలు కల్పించగల దృష్టి అలవడాలి. 2. దేశ అభివృద్ధిలో గిరిజనులకు అన్యాయం జరిగింది. వారి సంస్కృతిని గౌరవిస్తూనే వారిని అభివృద్ధిలోకి తీసుకురావాలి. 3. దేశానికి ప్రమాదకరంగా మారగల మత వైషమ్యాలను నివారించాలి. ‘నా మెయిన్ ఇంటర్వ్యూ కూడా ఇంతే ఆసక్తికరంగా సాగింది’ అంటుంది వార్దా. నోయిడాకు చెందిన వార్దా ఖాన్ రెండో అటెంప్ట్‌లోనే సివిల్స్‌ను సాధించింది. 18వ ర్యాంక్ సాధించి సగర్వంగా నిలుచుంది. ఇంటి నుంచి చదువుకుని వార్దాఖాన్ది నోయిడాలోని వివేక్ విహార్. తండ్రి తొమ్మిదేళ్ల క్రితం చనిపోయాడు. చిన్నప్పటి నుంచి చదువులో చాలా ప్రతిభ చూపిన వార్దా వక్తృత్వ పోటీల్లో మంచి ప్రతిభ చూపేది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. ఆ వెంటనే కార్పొరేట్ సంస్థలో ఉద్యోగానికి చేరినా ఆమెకు అది సంతృప్తి ఇవ్వలేదు. ప్రజారంగంలో పని చేసి వారికి సేవలు అందించడంలో ఒక తృప్తి ఉంటుందని భావించి సివిల్స్‌కు ప్రిపేర్ అవసాగింది. అయితే అందుకు నేరుగా కోచింగ్ తీసుకోలేదు. కొన్ని ఆన్లైన్ క్లాసులు, ఆ తర్వాత సొంత తర్ఫీదు మీద ఆధారపడింది. అన్నింటికంటే ముఖ్యం గతంలో ర్యాంకులు సాధించిన విజేతల వీడియోలు, వారి సూచనలు వింటూ ప్రిపేర్ అయ్యింది. ‘సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆందోళన, అపనమ్మకం ఉంటాయి. విజేతల మాటలు వింటే వారిని కూడా అవి వేధించాయని, వారూ మనలాంటి వారేనని తెలుస్తుంది. కనుక ధైర్యం వస్తుంది’ అని తెలిపింది వార్దాఖాన్. ఏకాంతంలో ఉంటూ ‘సివిల్స్‌కి ప్రిపేర్ అవ్వాలంటే మనం లోకంతో మన సంబంధాలు కట్ చేసుకోవాలి. నాకు నలుగురితో కలవడం, మాట్లాడటం ఇష్టం. కాని దానివల్ల సమయం వృథా అవుతుంది. సివిల్స్‌కు ప్రిపేర్ అయినన్నాళ్లు ఇతరులతో కలవడం, సోషల్ మీడియాలో ఉండటం అన్నీ మానేశాను. అయితే మరీ బోర్ కొట్టినప్పుడు ఈ సిలబస్ ఇన్నిగంటల్లో పూర్తి చేయగలిగితే అరగంట సేపు ఎవరైనా ఫ్రెండ్‌ని కలవొచ్చు అని నాకు నేనే లంచం ఇచ్చుకునేదాన్ని. అలా చదివాను’ అని తెలిపిందామె. పది లక్షల మందిలో 2023 యు.పి.ఎస్.సి పరీక్షల కోసం 10,16,850 మంది అభ్యర్థులు అప్లై చేస్తే వారిలో 5,92,141 మంది ప్రిలిమ్స్ రాశారు. 14,624 మంది మెయిన్స్‌లో క్వాలిఫై అయ్యారు. 2,855 మంది ఇంటర్వ్యూ వరకూ వచ్చారు. 1,016 మంది ఎంపికయ్యారు. వీరిలో 664 మంది పురుషులు 352 మంది స్త్రీలు. ఇంత పోటీని దాటుకుని వార్దా ఖాన్ 18 వ ర్యాంకును సాధించిందంటే ఆమె మీద ఆమెకున్న ఆత్మవిశ్వాసమే కారణం. ‘మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా కష్టపడితే కచ్చితంగా సివిల్స్ సాధించవచ్చు’ అని తెలుపుతోందామె. ఆమె ఐ.ఎఫ్.ఎస్ (ఇండియన్ ఫారిన్ సర్వీసెస్)ను తన మొదటి ్రపాధాన్యంగా ఎంపిక చేసుకుంది. ‘గ్లోబల్ వేదిక మీద భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తెలియచేసి దౌత్య సంబంధాల మెరుగులో కీలక పాత్ర పోషించడమే నా లక్ష్యం’ అంటోంది వార్దా. -
Shambhavi Choudhary: అతి చిన్న వయసు దళిత అభ్యర్థి
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిహార్ నుంచి 25 ఏళ్ల శాంభవి చౌదరి ఎన్నికల్లో పోటీ చేయనుంది. దేశంలో అతి చిన్నవయసు మహిళా దళిత అభ్యర్థిగా శాంభవి వార్తల్లో నిలిచింది. రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా తాను వేయదగ్గ ముద్ర... తనదైన దృష్టికోణం ఉన్నాయంటున్నది శాంభవి. ‘నేను పనిచేసే చోట స్త్రీలు, యువతే నా లక్ష్యం. వీరికి ఆర్థిక స్వావలంబన, ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తే అభివృద్ధి దానంతట అదే జరుగుతుంది’ అంటోంది శాంభవి చౌదరి. 25 ఏళ్ల 9 నెలల వయసు వున్న ఈ డాక్టరెట్ స్టూడెంట్ బిహార్‌లోని ‘సమస్తిపూర్’ పార్లమెంట్ స్థానం నుంచి లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) తరఫున పోటీ చేయనుంది. ఇది రిజర్వ్డ్ స్థానం. బహుశా శాంభవి దేశంలోనే అత్యంత చిన్న వయసు కలిగిన దళిత మహిళా అభ్యర్థి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో. అందుకే అందరూ ఆమెవైపు ఆసక్తిగా చూస్తున్నారు. రాజకీయ కుటుంబం నుంచి ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఎం.ఏ. సోషియాలజీ చేసి ఇప్పుడు ‘బిహార్ రాజకీయాల్లో కులం, జెండర్ ప్రాధాన్యత’ అనే అంశం మీద పీహెచ్డీ చేస్తున్న శాంభవి రాజకీయ కుటుంబం నుంచి వచ్చింది. ఈమె తండ్రి అశోక్ కుమార్ చౌదరి జెడి (యు)లో మంత్రి. తాత మహదేవ్ చౌదరి కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పని చేశారు. శాంభవి భర్త సాయన్ కునాల్ సామాజిక రంగంలో ఉన్నాడు. ఈమె మామగారు మాజీ ఐ.పి.ఎస్ అధికారి ఆచార్య కిశోర్ కునాల్ దళితుల కోసం చాలా పోరాటాలే చేశాడు. చాలా గుడులలో దళిత పురోహితులను ఆయన నియమించాడు. వీరందరి మధ్యలో చదువు మీద దృష్టి పెట్టి, పరిశోధన కొనసాగిస్తున్న శాంభవి ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో దిగింది. నాకంటూ వ్యక్తిత్వం ఉంది శాంభవి పోటీ చేస్తున్న లోక్ జనశక్తి పార్టీ ఎన్డిఏ కూటమిలో ఉంది. బిజెపి కుటుంబ వారసత్వం గురించి అభ్యంతరం చెప్పడం తెలిసిందే. ‘మీ నాన్నగారు మంత్రి. మరి మీకు సీటిచ్చారు’ అనే ప్రశ్నకు ‘నిజమే. కాని నాకు సీటు రావడంలో ఆయన ప్రమేయం మాత్రం లేదు. చిన్నప్పటి నుంచి నేను మా తాత, నాన్న పేదవాళ్ల సమస్యలు వింటూ వారి కోసం పనిచేయడం చూస్తూ పెరిగాను. అది నామీద ఎక్కడో ప్రభావం చూపింది. దళితుల్లో పుట్టి పెరిగిన వ్యక్తిగా, చదువుకున్న మహిళగా దళితుల పట్ల నాకు అవగాహన ఉంది. రాజకీయ కుటుంబం నుంచి రావడం వల్ల ప్రజలను ఎలా అర్థం చేసుకోవాలో తెలుసు. ఎలక్షన్లు సమీపించేవరకూ నేను నిలబడాలని అనుకోలేదు. కాని సమీపించాక లోక్ జనశక్తి చీఫ్ చిరాగ్ పాశ్వాన్‌తో చెప్పాను. ఆయన నా భర్తను సొంత తమ్ముడిలా చూస్తారు. అంతేకాదు, బిహార్ రాజకీయాలలో యువత రాణించాలని భావిస్తారు. నాకు అన్ని అర్హతలు ఉన్నాయన్న కారణం రీత్యానే సీట్ ఇచ్చారు’ అని తెలిపిందామె. అత్తగారి ఊరు పట్నాలో పుట్టి పెరిగిన శాంభవి తన అత్తగారి ఊరైన సమస్తిపూర్‌లో గెలవడానికి సిద్ధమవుతోంది. ‘ఆ ఊరి గురించి నిజం చెప్పాలంటే నాకేమీ తెలియదు. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. మొదట అక్కడ ఒక ఇల్లు కొని అక్కడే ఉంటానన్న భరోసా కల్పించాలి. ఆ ఊరి యువతతో ఇప్పటికే కాంటాక్ట్‌లోకి వెళ్లాను. ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని గెలిపిస్తారు. అవి వమ్ము చేయకుండా ఉండటమే నా ప్రథమ లక్ష్యం’ అంటున్న శాంభవి రాజకీయ జీవితాన్ని త్వరలో ఓటర్లు నిర్ణయిస్తారు. -
పోలీస్ రిక్రూట్మెంట్లో యువతి.. మెడికల్ టెస్ట్‌లో ‘అతడు’గా తేలింది!
ముంబై: పోలీస్ రిక్రూట్మెంట్లో భాగంగా దరఖాస్తు చేసుకున్న ఓ యువతికి.. మెడికల్ టెస్టుల్లో మాత్రం ఊహించిన పరిణామం ఎదురైంది. ఆమె ఆమె కాదు.. అతడు అని ధృవీకరిస్తూ ఉద్యోగం ఇవ్వలేమని తేల్చి చెప్పింది రిక్రూట్మెంట్ బోర్డు. ఈ తరుణంలో ఆమె న్యాయపోరాటంలో విజయం సాధించింది. బాంబే హైకోర్టు తాజాగా సంచలన ఆదేశాలు జారీ చేసింది. మెడికల్ టెస్టుల వల్ల ఉద్యోగం దక్కకుండా పోయిన ఓ యువతికి.. రెండు నెలల్లో అపాయింట్మెంట్ ఇప్పించాలని చెప్పింది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 2018లో సదరు యువతి (23) నాసిక్ రూరల్ పోలీస్ రిక్రూట్మెంట్ 2018కి ఎస్సీ కేటగిరీలో దరఖాస్తు చేసుకుంది. రాత పరీక్ష, ఫిజికల్ ఎగ్జామ్‌లు అన్నీ క్వాలిఫై అయ్యింది. అయితే మెడికల్ ఎగ్జామ్‌లో ఆమె జనానాంగాలు లేవని గుర్తించారు. మరో పరీక్షలో ఆమెలో మగ-ఆడ క్రోమోజోమ్స్ ఉన్నట్లు తేడంతో ఆమెను పురుషుడిగా నిర్ధారించి పక్కనపెట్టారు. ఈ పరిస్థితిలో ఉద్యోగం రాకపోవడంతో ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తనకున్న జన్యుపరమైన సమస్య గురించి తనకు ఏమాత్రం అవగాహన లేదని, పుట్టినప్పటి నుంచి తాను మహిళగానే పెరిగాని, చదువు కూడా అలాగే కొనసాగిందని, ఈ పరిస్థితుల్లో తనకు న్యాయం చేయాలంటూ ఆమె న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. దీంతో కార్యోటైపింగ్ క్రోమోజోమ్ టెస్ట్‌ల ద్వారా ఆమెను పురుషడిగా గుర్తించడం ఏమాత్రం సరికాదన్న ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్.. ఆమెకు ఉద్యోగం ఇప్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తరుణంలో.. సానుభూతి ధోరణితో యువతికి ఉద్యోగం ఇప్పించేందుకు పోలీస్ శాఖ సుముఖత వ్యక్తం చేసినట్లు అడ్వొకేట్ జనరల్ అశుతోష్ కుంభకోణి హైకోర్టుకు వెల్లడించారు. చదవండి: గుడ్ బై.. గుడ్ లక్.. కాంగ్రెస్‌కు షాక్ -
వన్ థర్డ్
మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తే వచ్చింది.. లేదంటే మహిళలే తమంతట తాము ముప్పై మూడు శాతంలోకి వచ్చేస్తారన్న ఒక ఉత్తేజకరమైన ఆశాభావాన్ని అత్యధికంగా ఎన్నికైన కొత్త మహిళా ఎంపీల సంఖ్య కలిగిస్తోంది. మహిళలు ఉత్సాహంగా రాజకీయాల్లోకి వచ్చేందుకు ఈ సంఖ్య పెరగడం అనేది ఒక ప్రేరణాంశం. మాధవ్ శింగరాజు పార్టీల సిద్ధాంతాలు వేరుగా ఉన్నట్లే, ఎన్నికల్లో పార్టీలు ఇచ్చే హామీలూ వేరుగా ఉంటాయి. అయితే ఈసారి నరేంద్రమోదీ, రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు వేర్వేరుగా ఉన్నప్పటికీ ఒక విషయంలో మాత్రం ఇద్దరూ ఒకే విధమైన హామీ ఇచ్చారు. తమని అధికారంలోకి తెస్తే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తామని! బాగా పాతబడిన హామీ ఇది. ఇరవై రెండేళ్లుగా నాయకులు హామీ అయితే ఇస్తున్నారు కానీ, రిజర్వేషన్ మాత్రం ఇవ్వడం లేదు. గత ఐదేళ్ల పాలనలో మన్‌కీ బాత్, పాకిస్తాన్‌కి జరిపిన ఆశ్చర్యకర పర్యటన, ‘యోగా డే’కి ఐక్యరాజ్య సమితిలో చేసిన ప్రసంగం, పెద్ద నోట్ల రద్దు, స్వచ్ఛ భారత్, సర్జికల్ స్ట్రయిక్స్.. ఇవి మాత్రమే మోదీ సాధించిన ఘనతలుగా, గుర్తులుగా మిగిలిపోయాయి. రిజర్వేషన్ బిల్లుని నోటి మాటగానైనా మోదీ ఎక్కడా ప్రస్తావించలేదు. బహుశా పైన వేటికీ (మన్ కీ బాత్ వగైరా..) పార్లమెంటు ఆమోదం అవసరం లేదు కాబట్టి అవి సాధ్యమయ్యాయేమో! మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం అవసరం. రాజ్యసభ 2010లోనే బిల్లును ఆమోదించింది. అప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. పదహారవ లోక్‌సభలో (ఇప్పుడొచ్చింది పదిహేడవ లోక్‌సభ) ఎన్డీయేకి తగినంత బలం ఉన్నప్పటికీ మహిళా బిల్లును తెచ్చే సంకల్పబలం లేకపోయింది. గత ఐదేళ్లలో వంద వరకు కీలకమైన బిల్లులు పాస్ అయిన లోక్‌సభలో మహిళా బిల్లు కనీసం ప్రతిపాదనకు కూడా రాలేదు.హెచ్.డి. దేవెగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు తొలిసారిగా 1996 సెప్టెంబర్ 12న పార్లమెంటులో ప్రతిపాదనకు వచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఆయన తర్వాత.. ఐ.కె.గుజ్రాల్, అటల్ బిహారీ వాజ్‌పేయి. మన్మోహన్సింగ్, నరేంద్ర మోదీ.. ఇంత మంది ప్రధానులు మారినా.. లోక్‌సభకు రాలేదు. మహిళా బిల్లు చట్టంగా వస్తే కనుక లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల స్థానాలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ లభిస్తుంది. మహిళా బిల్లు చట్టంగా రావాలంటే లోక్‌సభలో, రాజ్యసభలో ఆమోదం పొందాలి. దేశంలోని కనీసం సగం రాష్ట్రాలు ఆమోదం తెలపాలి. రాష్ట్రపతి సంతకం చేయాలి. ఇప్పటి వరకు ఒక్క రాజ్యసభలో మాత్రమే అయితే బిల్లు ఆమోదం పొందింది.2009 డిసెంబర్ 17న మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రెండు సభల్లో బిల్లును ప్రవేశపెట్టింది. సమాజ్‌వాదీ, జనతాదళ్ (యు), ఆర్జేడీ నిరసనలు, తీవ్ర వ్యతిరేకతల నడుమ బిల్లుపై ప్రభుత్వం ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోయింది. అనంతరం 2010 మార్చి 8న బిల్లును ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఆ మర్నాడు జరిగిన ఓటింగులో భారీ మెజారిటీతో మహిళా బిల్లును రాజ్యసభ ఆమోదించింది. అప్పట్నుంచీ ఎనిమిదేళ్లు గడిచాయి. జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం లేకపోవడం వల్లనే బిల్లును లోక్‌సభకు తేలేకపోతున్నామని రెండు దశాబ్దాలుగా ప్రభుత్వాలు చెబుతూ వస్తున్నా.. వాస్తవానికి రాజ్యాంగం ప్రకారం గానీ, పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం గానీ ఒక చట్టం తెచ్చేందుకు ఏకాభిప్రాయంతో పని లేదని నిపుణులు ఎప్పటి నుంచో వాదిస్తున్నారు.బీజేపీని గెలిపిస్తే మహిళా రిజర్వేషన్ బిల్లును తెస్తామని ఈ ఎన్నికల్లో మోదీ హామీ ఇచ్చారు. ఆ హామీ కారణంగానే ఆయన గెలవక పోవచ్చు కానీ, గెలిచాక హామీని నెరవేర్చే బాధ్యత ఆయన మీద ఉంది. రాహుల్ వచ్చి ఉంటే రాహుల్ మీద ఉండేది. కొద్ది రోజుల్లో కొలువు తీరబోతున్న కొత్త లోక్‌సభకు 78 మంది మహిళా ఎంపీలు ఎన్నికయ్యారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఇప్పటి వరకు జరిగిన పదహారు సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇంత పెద్ద సంఖ్యలో మహిళా ఎంపీలు లేరు. 78 మంది అంటే లోక్‌సభలో 14 శాతం. ఇది ముప్పైమూడు శాతానికి చేరుకోవాలంటే ఇంకా 103 మంది ఉండాలి. రిజర్వేషన్లేమీ లేకుండా లోక్‌సభలో మహిళా ఎంపీల సంఖ్య వన్ థర్డ్కు (వందకు ముప్పైమూడు) అందుకోవాలంటే మరో నలభై ఏళ్లు పడుతుందని ఒక అంచనా! అంటే మరో ఎనిమిది సార్వత్రిక ఎన్నికలు. ‘పెర్ఫార్మింగ్ రిప్రెజెంటేషన్ : ఉమెన్ మెంబర్స్ ఇన్ ది ఇండియన్ పార్లమెంట్’ అనే పుస్తకం కోసం 2009–2016 మధ్య.. డాక్టర్ కరోల్ స్ప్రే అనే ఇంగ్లండ్ ప్రొఫెసర్.. షిరిన్ రాయ్ అనే భారతీయ ప్రొఫెసర్ సహకారంతో వందల మంది మహిళా ఎంపీలను, పురుష ఎంపీలను ఇంటర్వ్యూ చేశారు. కరోల్ వేసిందే ఈ ‘మరో నలభై ఏళ్లు’ అనే అంచనా. అసలీ రిజర్వేషన్లు లేకుండా ప్రతి పార్టీ తప్పనిసరిగా 33 శాతం సీట్లను మహిళలకు ఇచ్చేలా ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరిస్తే పోయేదానికి రాజ్యాంగాన్నే సవరించడం ఎందుకు?! అలా చేస్తే మహిళలకు మళ్లీ అదొక అవరోధం అవుతుంది. ఓడిపోయే స్థానాల్లో పార్టీలు మహిళా అభ్యర్థుల్ని నిలబెట్టి, గెలిచే చోట మగాళ్లను నిలబెడతాయి. అప్పుడిక రిజర్వేషన్ అన్నమాటకే అర్థం ఉండదు. పోటీ చేసేవాళ్లు 33 శాతం ఉంటారు కానీ, గెలిచి చట్టసభల్లోకి వెళ్లే వాళ్లు అంతమంది ఉండరు. ఇన్ని రాజకీయాలు ఉంటాయి కనుకే మహిళలు చట్టసభల్లోకి రావడానికి మహిళా రిజర్వేషన్ చట్టం తప్పనిసరిగా ఉండాలి. చట్టం రాకపోతే.. కరోల్ భావిస్తున్నట్లు చట్టంతో పనిలేకుండా తమంతట తామే ముప్పై మూడు శాతంలోకి వచ్చేస్తారు..కాలక్రమంలోనో, కాలాన్ని తామే ముందుకు నడిపిస్తూనో! -
మహిళలకు ప్రాధాన్యం అంతంతే
మహిళలకు ప్రాధాన్యమనే మాటకు అర్ధమే లేకుండాపోయింది. 33 నుంచి 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు గొప్పలు చెబుతున్నప్పటికీ ఎన్నికల విషయానికొచ్చేసరికి ఆయా పార్టీలు మహిళలకు ఇస్తున్న సీట్లు తక్కువే. సాక్షి, ముంబై: రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యమిస్తున్నామని వివిధ పార్టీలు ఢంకా బజాయిస్తున్నప్పటికీ అది ఆచరణలో అంతంతగానే ఉంది. మహిళలకు పెద్ద పీట వేస్తున్నామని, 33 శాతం నుంచి 50 శాతం వరకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని గొప్పలు చెబుతున్నప్పటికీ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో అతి తక్కువ సంఖ్యలో మహిళలు పోటీ చేస్తుండడం ఈ సందర్భంగా గమనార్హం. 2009 ఎన్నికలతో పోలిస్తే ఈసారి తక్కువ మంది మహిళా అభ్యర్థులు లోక్‌సభ ఎన్నికల బరిలో దిగారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరఫున 25 మంది పురుష అభ్యర్థులు బరిలోకి దిగగా, మహిళా అభ్యర్థి మాత్రం ఒక్కరే. 2009లో కూడా ఒక్క మహిళే పోటీ చేశారు. అదేవిధంగా శివసేనలో 19 మంది పురుష అభ్యర్థులు పోటీ చేస్తుండగా, కేవలం ఒక టికెట్ మాత్రమే మహిళకు ఇచ్చారు. 2009లో శివసేన తరఫున 20 మంది పురుష అభ్యర్థులు బరిలోకి దిగగా, అప్పుడు కూడా మహిళా అభ్యర్థి ఒక్కరే. ప్రస్తుతం బీజేపీ తరఫున 21 మంది పురుష అభ్యర్థులు, ముగ్గురు మహిళలు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా 2009లో 24 మంది పురుష అభ్యర్థులు పోటీ చేయగా, కేవలం ఒక మహిళా అభ్యర్థి తలపడ్డారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎన్సీపీ తరఫున 18 మంది పురుష అభ్యర్థులు బరిలో ఉండగా, ముగ్గురు మహిళలు తలపడుతున్నారు. 2009లో ఎన్సీపీ తరఫున 17 మంది పురుష అభ్యర్థులు, ముగ్గురు మహిళలు బరిలోకి దిగారు. ఎమ్మెన్నెస్ తరఫున 10 మంది పురుష అభ్యర్థులు పోటీ చేయగా, ఒక్క మహిళ కూడా బరిలోకి దిగకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 2009లో ఎమ్మెన్నెస్ తరఫున ఏడుగురు పురుషులు పోటీ చేయగా, నలుగురు మహిళలు బరిలో దిగారు. అయితే మహిళా అభ్యర్థుల సంఖ్య స్వల్పంగా ఉండడానికిగల కారణాలను ఆయా పార్టీల అధికార ప్రతినిధులు స్పష్టంగా చెప్పలేకపోయారు. ఈ విషయమై బీజేపీ అధికార ప్రతినిధి మాధవ్ భండారీ మాట్లాడుతూ.. ప్రతి స్థాయిలో మహిళా నాయకత్వాన్ని పెంచేం దుకు తమ పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. శివసేన అధికార ప్రతినిధి నీలం గోరె మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో జరిగిన సమావేశాల్లో తమ పార్టీ అధినేత ఉద్ధవ్‌ఠాక్రే మహిళలు ముందుకు రావాలని పిలుపునిచ్చారన్నారు. అయినప్పటికీ అతితక్కువ మంది మహిళలు ముందుకొచ్చారన్నారు.వీరిలో అనేకమంది విధానసభ లేదా మేయర్ స్థాయిలో పోటీ చేయడంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారన్నారు. ఇదే విషయమై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సచిన్ సావంత్ మాట్లాడుతూ..మహిళలు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని రాహుల్ పిలుపునిస్తున్నారని పేర్కొన్నారు. -
మహిళా సభ్యుల సంఖ్య అంతే..
సాక్షి, న్యూఢిల్లీ:మహిళలకు టికెట్లు ఇవ్వడంలో రాజకీయ పార్టీలు పిసినారితనాన్ని ప్రదర్శిస్తే వారికి ఓటు వేయడంలో ఓటర్లు సైతం పిసినారితనాన్ని పాటించారు. ఢిల్లీ విధాన సభ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు మొత్తం 17 మంది మహిళలకు టికెట్లు ఇవ్వగా ముగ్గురిని మాత్రమే ఓటర్లు గెలిపించారు. దాంతో ఈ విధాన సభలోనూ మహిళా ఎమ్మెల్యేల సంఖ్య మూడుకే పరిమితమైంది. ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆరుగురు, బీజేపీ తరఫున ఐదుగురు, ఆప్ తరఫున ఆరుగురు నిలుచున్నసంగతి తెలిసిందే. వీరిలో ఆప్ తరఫున పోటీచేసిన ముగ్గురు మాత్రమే గెలిపొందారు. ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌తో పాటు మంత్రి కిరణ్ వాలియా. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ బర్ఖాసింగ్ పరాజయంతో గత అసెంబ్లీలో సభ్యులుగా ఉన్న ముగ్గురు మహిళలూ ఓటమి పాలైనట్లయ్యింది. కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్యంగా మహిళా అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. పటేల్‌నగర్‌లో ఆప్‌కు చెందిన వీణా ఆనంద్ బీజేపీకి చెందిన పూర్ణిమా విద్యార్థిని ఓడించారు. బందనా కుమారి షాలిమార్ బాగ్ నుంచి, రాఖీ బిర్లా మంగోల్‌పురిలో గెలిచారు. రాఖీ బిర్లా మంగోల్‌పురిలో మంత్రి రాజ్‌కుమార్ చౌహాన్‌ను ఓడించగా, మరో మహిళా అభ్యర్థి ఫర్హానా అంజుమ్ మంత్రి హరూన్ యూసఫ్ చేతిలో ఓడిపోయారు. మాలవీయ నగర్, ఆర్కేపురంలో కూడా మహిళలు ప్రధాన పార్టీల తరఫున పోటీపడినప్పటికీ వారు ఓడిపోయారు. మాలవీయనగర్‌లో పోటీపడిన కాంగ్రెస్, బీజేపీల తరఫున పోటీపడిన మహిళా నేతలు కిరణ్ వాలియా, ఆర్తీ మెహ్రా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి సోమ్‌నాథ్ భారతి చేతిలో ఓడిపోయారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో జరిగిన ముక్కోణపు పోటీలో షీలాదీక్షిత్ అర్వింద్ కేజ్రీవాల్ చేతిలో ఓడిపోయారు. తిలక్‌నగర్‌లో డూసూ మాజీ అధ్యక్షురాలు అమతాధవన్ మూడవ స్థానంలో నిలిచారు. డూసూ అధ్యక్షురాలు రాగిణీనాయక్ జనక్‌పురిలో బిజెపి దిగ్గజం జగ్దీశ్ముఖి చేతిలో పరాజయం పాలయ్యారు. ఆమె కూడా మూడవ స్థానంలో నిలిచారు. రాజోరీ గార్డెన్లో సిట్టింగ్ ఎమ్మెల్యే సతీమణి ధన్వంతీ చందీలా ఓటమి చెందారు. బీజేపీ తరఫున పోటీచేసిన ఇతర మహిళల విషయానికి వస్తే కస్తూర్బానగర్‌లో ఆప్ అభ్యర్థి మదన్‌లాల్ చేతిలో శిఖారాయ్ ఓడిపోయారు. ఎమ్సీడీ మాజీ మేయర్ రజనీ అబ్బీ తిమార్‌పుర్‌లో ఆప్ అభ్యర్థి హరీష్ ఖన్నా చేతిలో ఓడిపోయారు. సుల్తాన్‌పురి మాజ్రా నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన సుశీలా కుమారి నాలుగవ స్థానంలో నిలిచారు.