fires on chandrababu
-
చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ తోడుదొంగలు
స్కిల్డ్ దొంగను కాపాడేందుకు లోకేశ్, పవన్ ఆరాటపడుతున్నారని, అందులో భాగంగానే ఢిల్లీ మీడియాతో లోకేశ్ సొల్లు కబుర్లు చెబుతున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. మీ తండ్రి అవినీతిపై దర్యాప్తు సంస్థలు పిలుస్తుంటే.. చర్చంటూ సవాళ్లేమిటి లోకేశ్?.. ఏ తప్పూ చేయకపోతే అసెంబ్లీకొచ్చి చర్చించే దమ్ముందా? అని సవాల్ విసిరారు. ఇక పవన్‌కళ్యాణ్ నకిలీ కాపు అని, ఆయన ఏనాడూ కాపు ఉద్యమాలకు సహకరించలేదని మండిపడ్డారు. వంగవీటి హత్య, ముద్రగడపై వేధింపుల్లో చంద్రబాబు కుట్రను ప్రశ్నించలేదని, జనసేన కేడర్‌ను జెండాకూలీలుగా మార్చాడని, టీడీపీలో జనసేన విలీనమే ములాఖత్ ప్రకటన రహస్యమని స్పష్టీకరించారు. విశాఖపట్నం: నగరంలోని సర్యూట్హౌస్లో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే.. ఈడీ, ఐటీ, సీఐడీలతో చర్చించు ఢిల్లీలో నిన్న నారా లోకేశ్ జాతీయమీడియాతో మాట్లాడాడు. తన తండ్రి చంద్రబాబు హయాంలో జరిగిన స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి వివరిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి గురించి ప్రస్తావించాడు. చంద్రబాబు ఏ తప్పూ చేయకుండానే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారని.. జగన్ గారితో తాను చర్చించేందుకు సిద్ధమంటూ లోకేశ్ ఛాలెంజ్ విసిరాడు. అయితే, ఆయనతో చర్చకు ఏ స్థాయి వ్యక్తి ముందుకొస్తారనేది పక్కనబెడితే.. చంద్రబాబు చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించి ముందు వారిని ఈడీ అరెస్టులతో పిలిచింది. ఒకపక్కేమో ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ షోకాజ్ నోటీసులు ఇచ్చి పిలుస్తుంటే.. మరోపక్క సీఐడీ సాక్ష్యాధారాలతో సహా జైలుకు పంపింది. తండ్రీకొడులు కుంటిసాకులతో.. ఒకపక్కన కేంద్ర దర్యాప్తు సంస్థలతో పాటు సీఐడీ చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్‌ను అవినీతిపై నోరు విప్పాలని నోటీసులిస్తుంటే.. మరి, వాటి సంగతి తేల్చాలి కదా..?. సీఐడీ పిలుస్తుంటేనేమో.. నేను సమాధానం చెప్పను. నాకు సంబంధం లేదు. నాకు నోటీసులివ్వలేదు. గవర్నర్ గారికి చెప్పి నన్ను అరెస్టు చేస్తున్నారా..లేదా..? స్పీకర్ చెప్పి నన్ను అరెస్టు చే స్తున్నారా..? అంటూ చంద్రబాబు వితండవాదం చేశాడు. అదేవిధంగా ఐటీశాఖ కూడా బాబూ.. నువ్వు ఆదాయపన్ను లెక్కల్లోకి రాని రూ.118 కోట్లు బొక్కేశావు. రాష్ట్ర ఖజానా నుంచి కాంట్రాక్టర్లకు చెల్లింపుల్లో లంచాలకు సంబంధించి కొట్టేసిన మొత్తానికి సరైన లెక్కలతో సమాధానం చెప్పాలంటూ నోటీసులిస్తే.. దానికి సమాధానం చెప్పడు. లోకేశ్ కూడా నోరుమెదపడు. 2020 నుంచి కేంద్ర ఐటీశాఖ నుంచి నోటీసులు వస్తూనే ఉన్నాయి. వాటికి సంబంధించి ఏవేవో కుంటి సాకులు చెబుతూ రిప్లైలు ఇచ్చినా.. వాటినన్నింటినీ ఐటీశాఖ తోసిపుచ్చింది తెలిసిందే. మరోవైపు ఏపీలో జరిగిన స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే అనేమందిని విచారించింది. అరెస్టులు కూడా చేసింది. రేపోమాపో చంద్రబాబు, లోకేశ్‌ను కూడా విచారణకు పిలుస్తుంది. అయితే, సమాధానం చెప్పుకోవాల్సిన చోట నోరువిప్పకుండా.. తండ్రీకొడుకులు పనికిమాలిన కబుర్లు మాట్లాడుతున్నారు. నువ్వెంత..నీ బతుకెంత..? రాష్ట్రంలో ప్రజలను అడ్డంగా దోచుకుని తిని అవినీతి ఆధారాలతో నీ తండ్రి జైలుకెళ్తే.. నువ్వేమో నాతో చర్చకు ఫలానా వాళ్లు రావాలంటూ జాతీయమీడియాతో మాట్లాడతావా లోకేశ్..? అసలు, అక్కడిదాకా వెళ్లి నీ తండ్రికి పట్టిన గతి గురించి మాట్లాడుకోవడానికి సిగ్గనిపించడం లేదా..? ఒకటీ రెండు కాదు. అక్షరాలా రూ.371 కోట్ల ప్రజాధనాన్ని దోచుకు తిన్న పందికొక్కులు నువ్వు, నీతండ్రి. అందుకే, ఇన్నాళ్లకు మీ పాపం పండి ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు మీ భరతం పట్టేందుకు సిద్ధమయ్యాయి. నువ్వేమో ముఖ్యమంత్రితో చర్చించాలంటున్నావు. లోకేశ్.. నీ బతుకేంటి.? నీ స్థాయేంటి..? అని హెచ్చరిస్తున్నాను. నీ తండ్రి అవినీతిని ఒప్పుకున్నావా..? రిపబ్లిక్ టీవీలో నిన్న లోకేశ్ మాట్లాడుతూ.. ఒక అద్భుతమైన పోలిక చెప్పాడు. ఏదైనా బ్యాంకు బ్రాంచిలో తప్పు జరిగితే బ్యాంకు ఛైర్మన్‌ను అరెస్టు చేస్తారా..? అంటూ లోకేశ్ ప్రశ్నించాడు. అంటే, సిల్క్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు సంబంధించి రూ.371 కోట్లు కుంభకోణం జరిగిందని లోకేశ్ ఒప్పుకున్నట్టే కదా..? ఈ దోపిడీకి గురైన ప్రజాధనం మొత్తం అటూఇటూ తిరిగి చంద్రబాబు ఖాతాకు చేరాయని ఆధారాలు చెబుతున్నాయి. అంటే, నీ తండ్రి అవినీతికి పాల్పడ్డాడంటూ ఒప్పుకున్నట్టే కదా..? అని లోకేశ్‌ను ప్రశ్నిస్తున్నాను. ఈ స్కామ్‌కు సంబంధించి ప్రభుత్వ అధికారులపై ఐదు పర్యాయాలు చంద్రబాబు వత్తిళ్లకు గురిచేసినట్లు నోట్‌ఫైల్స్ చెబుతున్నాయి. అయితే, ఈ తండ్రీకొడుకులు మాత్రం తమకేమీ తెలియదని రూ.371 కోట్ల ప్రజల సొమ్మును కొట్టేసి సుద్ధపూసల్లా మాట్లాడుతున్నారు. దొంగలెప్పుడూ తామెలాంటి తప్పు చేయలేదనే మాటే అంటారు. కానీ, చట్టం ముందు అందరూ సమానమేనని గుర్తించాలి. చట్టం దొంగల్ని సమాజం ముందుకు తెస్తుందని తెలుసుకోవాలి. చంద్రబాబు దేశంలోనే రిచ్ ఎమ్మెల్యే దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలందరిలోకెల్లా నాల్గో ధనవంతుడైన ఎమ్మెల్యేగా చంద్రబాబు రికార్డుల్లోకి ఎక్కాడు. ఇది నా సొంతంగా చెబుతున్న మాట కాదు. తన ఎన్నికల అఫిడవిట్లోనే రూ.683 కోట్ల విలువైన ఆస్థి తనపేరిట ఉన్నట్లు చంద్రబాబు స్వయంగా చెప్పుకున్నాడు. మరి, ఇదే వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు కేవలం 2 ఎకరాల పొలం మాత్రమే ఉండేది. ఆ రెండెకరాల రాజకీయ ప్రస్థానం రూ.683 కోట్లకు ఎలా పెరిగిందని మేం అడుగుతున్నాం. అధికారాన్ని అడ్డంపెట్టుకుని మీరు దోచేసిన రూ.లక్షల కోట్లు గురించి కాకుండా.. మీరు అధికారికంగా చెప్పిన రూ.కోట్లపైనే ప్రశ్నిస్తున్నాను. దీనికి చంద్రబాబు గానీ.. ఆయన సుపుత్రుడు లోకేశ్ గానీ సమాధానం చెప్పాలి. ఆధారాలతో అడ్డంగా దొరికిన దొంగ బాబు ఎక్కడో ఉన్న ఒక కంపెనీని తెరమీదికి తెచ్చి.. ఏపీలో స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పేరుతో యువతకు శిక్షణతో పాటు ఉద్యోగాల కల్పనకు సంబంధించి 90 శాతం పెట్టుబడి పెడుతుందని చెప్పారు. ప్రభుత్వం మాత్రం 10 శాతం వాటా పెట్టాలన్నారు. తీరా 90 శాతం పెట్టుబడి పెట్టాల్సిన కంపెనీ నుంచి ఒక్క పైసా రాకుండానే ప్రభుత్వ ఖజానా నుంచి 10 శాతం చెల్లింపులు చేసుకున్నారు. అంటే, రూ.371 కోట్లు ప్రజాధనాన్ని స్వాహా చేశారు. సీమెన్స్ కంపెనీ పేరిట అబద్ధాలు చెప్పి.. ప్రభుత్వ సొమ్మును అప్పన్నంగా కాజేయడానికి పన్నిన చంద్రబాబు పన్నాగమిది. ఇంతా దోచుకుని మేం కొట్టేసినట్టు ఆధారాలేంటి..? అని తండ్రీకొడుకుల బుకాయింపులు. ఇదేమన్నా హెరిటేజ్ ఫ్రెష్‌లో టమాటాల్ని కొంటే ఇచ్చే రసీదులా..? లంచాలకు రసీదులెక్కడుంటా యి..? దర్యాప్తు సంస్థల విచారణలో ఆధారాలన్నీ బయటపడతాయని లోకేశ్ తెలుసుకోవాలి. ఏపీలో స్కిల్‌డెవలప్‌మెంట్ గురించి తామెలాంటి ఒప్పందం చేసుకోలేదని.. ఎదురుపెట్టుబడి పెట్టి తామెలాంటి ప్రాజెక్టులు చేపట్టిన దాఖల్లాలేవంటూ సీమెన్స్ సంస్థ అధికారికంగా చెప్పింది. మరి, చంద్రబాబు తెరమీదికి తెచ్చిన సీమెన్స్ బోగస్ ఒప్పందాన్ని ఏమంటారు..? అది అవినీతి కార్యక్రమం కాదా..? అని అడుగుతున్నాను. కనుక, చంద్రబాబు స్కిల్‌స్కామ్‌లో ఆధారాలతో దొరికన దొంగ అని స్పష్టమైంది. 13చోట్ల సంతకాలతో అడ్డంగా దొరికాడు చంద్రబాబు అరెస్టు తర్వాత ఆయనతో పాటు న్యాయవాదులు, లోకేశ్, టీడీపీ నాయకులు ఎక్కడా.. తాము అవినీతికి పాల్పడలేదని చెప్పలేదు. కుంభకోణం జరిగిన మాట వాస్తవమే గానీ.. ఈ కేసులో మమ్మల్ని అరెస్టు చేయడానికి పరిమితులు, పరిధులు వర్తిస్తాయంటూ అడ్డదిడ్డంగా ‘లా’ పాయింట్లు పీకుతున్నారు. లోకేశ్ నిన్న జాతీయమీడియాతో మాట్లాడుతూ.. మా నాన్న ఎక్కడా సంతకం చేయలేదని చెబుతున్నాడు. స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో బోగస్ కంపెనీల ఒప్పందాలు గానీ.. రాష్ట్ర ఖజానా నుంచి రూ.371 కోట్ల నిధుల విడుదలకు సంబంధించిన ఫైళ్లల్లో మొత్తం 13 చోట్ల చంద్రబాబు సంతకాలున్నట్లు సీఐడీ ఆధారాల్ని కోర్టుకు సైతం సమర్పించింది. మరి, ఆయనకెలాంటి సంబంధం అంటదని లోకేశ్‌తో పాటు పచ్చమీడియా కూడా ఎలా వాదిస్తుంది..? అని అడుగుతున్నాను. ఆ సంతకాలు కూడా బాబువి కాదు.. ఫోర్జరీ చేశారని దీనిపై కూడా రేపోమాపో మరో అబద్ధాన్ని కూడా వీళ్లంతా ప్రచారం చేస్తారేమో.. అంతటి అసాధ్యులే వీళ్లు. అసెంబ్లీకొచ్చి చర్చించే దమ్ముందా..? ఏదిఏమైనా చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి అక్రమాల్లో ఈ స్కిల్‌డెవలప్‌మెంట్ స్కామ్ అనేది కేవలం ఒక తీగమాత్రమే.. ఇంకా కదలాల్సిన డొంక చాలా ఉందని మరోమారు గుర్తుచేస్తున్నాను. రూ.371 కోట్ల ప్రజాధనాన్ని కొట్టేసేందుకే చంద్రబాబు సూత్రధారిగా, పాత్రధారిగా వ్యవహరించినట్లు సీఐడీ అన్నీ ఆధారాలతోనే అరెస్టు చేసింది. ఏసీబీ కోర్టు కూడా సీఐడీ వాదనలతో ఏకీభవించింది కనుకే చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలుకెళ్లాల్సి వచ్చింది. దీనిపై ఇప్పటికైనా తండ్రీకొడుకులతో పాటు తెలుగుదేశం పార్టీ స్పష్టమైన సమాధానం చెప్పాలి. ప్రజాధనం కొట్టేసినందుకు రాష్ట్రప్రజలకు క్షమాపణలు చెప్పి.. చట్టపరంగా శిక్ష అనుభవిస్తామని నేరాన్ని అంగీకరించాలని మేం డిమాండ్ చేస్తున్నాం. తామేమీ అవినీతికి పాల్పడలేదని నిరూపించుకోవాలంటే రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ స్కామ్‌పై చర్చించే దమ్మూధైర్యం ఉందా..? అని ఆ పార్టీ నేతలకు సవాల్ విసురుతున్నాను. నకిలీ కాపు పవన్‌కళ్యాణ్ కాపు ఉద్యమాలకు ఏనాడు సహకరించని నకిలీ కాపు పవన్‌కళ్యాణ్. ఇదే చంద్రబాబు కుట్రలతో వంగవీటి మోహనరంగా హత్యకు గురైనప్పుడు గానీ.. ముద్రగడ పద్మనాభం గారిలాంటి వాళ్లు తీవ్రమైన వేధింపులకు గురైనప్పుడూ ఏరోజూ పవన్‌కళ్యాణ్ స్పందించలేదు. ఆయా సందర్భాలపై ఆయన మాట్లాడింది కూడా లేదు. అలాంటి వ్యక్తి ఈరోజు కాపు నాయకుడిగా చెలామణి అవుతూ టీడీపీకి సపోర్టు చేయాలని పిలుపునిస్తే కాపుసోదరులెవరూ పట్టించుకోరు. అసలు, ఇప్పటికే పవన్‌కళ్యాణ్‌ను పూర్తిగా కాపులు పక్కనబెట్టారు. జెండా కూలీలుగా జనసైనికులు వెనకటికెవరో ఎప్పుడో జరిగిన పెళ్లికి ఇప్పుడు భజంత్రీలన్నాడంట.. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ప్రకటనలు అలా ఉన్నాయి. అవినీతి కేసులో జైలుకెళ్లిన చంద్రబాబుతో ఆయన ములాఖత్ అయ్యాడు. జైలు బయటకొచ్చి తామిద్దరం మిలాఖత్ అయ్యామంటున్నాడు. ఆ రెండు పార్టీల పొత్తు గురించి ఇప్పుడు కొత్తగా చెప్పేదేముంది..?ఒక తండ్రికి ఉత్తపుత్రడితో పాటు దత్తపుత్రుడి ఆట గురించి మా నాయకుడు జగన్ గారు ఎప్పట్నుంచో చెబుతూనే ఉన్నారు. చంద్రబాబు దత్తపుత్రుడైన పవన్‌కళ్యాణ్ లేటెస్టుగా టీడీపీతో పొత్తు అన్నంతమాత్రానా ఏమీ ఊడిపడేదిలేదు. పైగా, జనసేన నాయకులు, కేడర్‌కు ఇన్నాళ్లకు కళ్లు తెరుచుకున్నాయి. పవన్‌కళ్యాణ్‌పై అభిమానంతో ఆ పార్టీ కార్యకర్తలు పనిచేస్తుంటే.. ఆయన మాత్రం చంద్రబాబుకు బానిసత్వం చేస్తున్నారనే చర్చ మొదలైంది. తాము టీడీపీని భుజానికెత్తుకునే జెండాకూలీలుగా ఉండబోమని జనసేన సైనికులంటున్నారు. విలీనం చేయడానికి సరికొత్త ఎత్తుగడ.. జనసేనను టీడీపీలో విలీనం చేయడానికి ఇది సరికొత్త ఎత్తుగడగా చంద్రబాబు, పవన్‌లు పథక రచన చేశారంటూ ఇరుపార్టీల కేడర్ భావిస్తుంది యధార్థమే..అయితే, బాబును భుజానికెత్తుకుంటే పవన్‌కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగానే మారబోతుందనడంలో సందేహం లేదు. -
చంద్రబాబు ఒక రాక్షషుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
-
బాబును ప్రజలు నమ్మొదు..!
-
ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి శతజయంతి వేడుకలు చేస్తున్నారు
-
రియల్ ఏస్టేట్ బ్రోకర్ చంద్రబాబుతో పోరాటం.. పేదలదే విజయం
-
బిగ్ క్వశ్చన్ : కరకట్ట బాబు, కల్యాణ్ బాబు కుతంత్రాలు
-
పవన్ కల్యాణ్ పై కొడాలి నాని ఫైర్
-
చంద్రబాబు వాణి వినిపించేదుకే పవన్ విశాఖ వచ్చారు : మంత్రి అంబటి రాంబాబు
-
చంద్రబాబు పై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫైర్
-
ఎన్టీఆర్ నుంచి పార్టీ ని లాక్కున్న చరిత్ర బాబుది : కారుమూరి
-
రాజధాని పేరుతో చంద్రబాబు డబ్బంతా వృధా చేశారు : సోము వీర్రాజు
-
అయ్యన్న పాత్రుడి పై తీవ్రస్థాయిలో మండిపడ్డ నారాయణ స్వామి
-
అయ్యన్న లాంటి బఫూన్ ని పట్టించుకోనవసరం లేదు
-
కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లుంది: ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
-
ఈనాడు రోత రాతలపై ఎమ్మెల్యే బాలరాజు ఫైర్
-
తగ్గేదేలే.. దూకుడు పెంచిన సీఎం వైఎస్ జగన్
-
సిగ్గుమాలిన మనిషి.. ఈ వీడియో చూసి బాబు,వర్ల సిగ్గు తెచ్చుకోవాలి
-
‘కుప్పం ప్రజల దెబ్బకు చంద్రబాబు కళ్లు నేలకు దిగాయి’
సాక్షి, చిత్తూరు: నగరి ఎమ్మెల్యే రోజా, సింగర్ ఎస్పీ శైలజ పలువురు ప్రముఖులు ఆదివారం ఉదయం విఐపీ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఎమ్మెల్యే రోజా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు కుప్పం పర్యటనపై విమర్శలు చేశారు. చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నట్లు చంద్రబాబు.. కుప్పం చుట్టు గిరగిరా తిరుగుతున్నారని విమర్శించారు. 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న బాబు.. కుప్పం ప్రజలకు కనీసం మంచి నీటి సౌకర్యం కల్పించలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు కుప్పంలో ఇల్లుకట్టుకోవాలనే ఆలోచన వచ్చిందంటే.. ప్రజలు గట్టిగా బుద్ధిచెప్పారని అర్థం అవుతుందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకునే చంద్రబాబుకు.. కుప్పం ప్రజలు వాస్తవాలను చూపించారని పేర్కొన్నారు. చంద్రబాబుకు నెత్తిన ఉన్న కళ్లు నేలకి దిగాయని రోజా పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలు అంటున్న చంద్రబాబు వాస్తవాలను గుర్తుంచుకోవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం సాధించింది. కావాలంటే చంద్రబాబు కుప్పంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీకి సిద్ధం కావాలని సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న 23 మంది ఎమ్మెల్యేలకు సరదాగా ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకి రండి.. మీ సరదా వైఎస్ జగన్ తీర్చేస్తాడని రోజా ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్న,కరోనా,వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్నప్పటికి.. ఇచ్చిన అన్ని హామీలను వైఎస్ జగన్ నెరవేరుస్తున్నారని రోజా తెలిపారు. సీఎం జగన్.. చంద్రబాబులా కుంటిసాకులు చెప్పి తప్పించుకునే వ్యక్తి కాదని, ప్రతి కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్నారని రోజా అన్నారు. అందుకే ప్రజలు సీఎంగా జగన్ ప్రభుత్వానికి అండగా ఉన్నారని రోజా పేర్కొన్నారు. -
బురదజల్లడమే చంద్రబాబు పని..
సాక్షి, గుంటూరు: అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో దేశచరిత్రలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా అనేక పథకాలతో.. సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని చంద్రబాబు.. ప్రభుత్వంపై నిత్యం బురదజల్లుతున్నారని వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. గుంటూరులో గురువారం జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినాతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మృదు స్వభావి అయిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ సలహాదారుగా ప్రతిపక్ష నేతను, నాయకులను వ్యక్తిగతంగా ఏ ఒక్క మాట అనని రామకృష్ణారెడ్డి గురించి ఇష్టారాజ్యంగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హె చ్చరించారు. చంద్రబాబు సంస్కారం తెలియని అజ్ఞాని అంటూ దుయ్యబట్టారు. పేదలకు మేలు చేసే ఓటీఎస్‌పై తప్పుడు ఆరోపణలు చేయడం చంద్రబాబు రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. మూడుసార్లు సీఎంగా.. 14 ఏళ్ల పాటు పరిపాలన చేసిన చంద్రబాబు పేరు చెబితే ప్రజలకు గుర్తుకొచ్చే ఒక్క సంక్షేమ పథకమైనా ఉందా.. అని ప్రశ్నించారు. పెయిడ్ ఆర్టిస్టులకు డబ్బులు ఇచ్చి నిత్యం ప్రభుత్వంపై బురద జల్లిస్తున్నారని, వారి ఆటలు ఇక సాగనిచ్చేదిలేదన్నారు. తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాటిస్తున్న సమన్యాయం, సహనం కారణంగానే టీడీపీ నేతలు ఎంతలా అవాకులు, చవాకులు పేలినా భరిస్తున్నామని, ఇలానే రెచ్చగొడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. గుంటూరు జెడ్పీ చైర్పర్సన్ క్రిస్టినా మాట్లాడుతూ పాత్రికేయ విలువలు కలిగిన సజ్జల రామకృష్ణారెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. -
చంద్రబాబువి వికృత రాజకీయాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలను మంగళవారం వాడవాడలా ప్రజలంతా ఘనంగా నిర్వహించి, అభిమానాన్ని చాటుకోవడాన్ని చూసి ఓర్వలేని ప్రతిపక్ష నేత చంద్రబాబు వికృత రాజకీయాలకు తెరతీశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. సీఎం జగన్ జన్మదిన వేడుకల నుంచి ప్రజల దృష్టిని మరల్చాలనే లక్ష్యంతో చంద్రబాబు మంగళవారం టీడీపీ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వంపై నోరుపారేసుకున్నారని అన్నారు. క్రిస్టియన్ ఎయిడెడ్ విద్యా సంస్థలను దోచుకోవాలని సీఎం జగన్ చూస్తున్నారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేశానని బాబు చెప్పుకోవడం విడ్డూరమన్నారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంతపాడుతున్నాయని చెప్పారు. అంబటి బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏమీ చేయకున్నా.. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయకపోయినా చేసినట్లుగా చంద్రబాబు కలలు కంటుంటారంటూ అంబటి ఎద్దేవా చేశారు. ‘హైదరాబాద్‌కు అవుటర్ రింగ్ రోడ్డు వేయాలని బాబు కలలు కంటే.. దానికి పునాది రాయి వేసి, పూర్తి చేసి, ప్రారంభించింది వైఎస్సార్. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే దారిలో పీవీ నరసింహారావు ప్లైఓవర్ నిర్మించాలని బాబు కలలు కంటే.. దానికి పునాది రాయి వేసి, పూర్తి చేసి, జాతికి అంకితం చేసింది వైఎస్సార్. హైదరాబాద్‌కు ఐటీ తెచ్చానని చంద్రబాబు కలలు కంటే.. అక్కడ ఐటీ రంగం వర్ధిల్లేలా చేసింది వైఎస్సారే’ అని చెప్పారు. ‘2014 ఎన్నికలకు ముందు డ్వాక్రా, రైతు రుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేస్తే.. సీఎం జగన్ ఈ 30 నెలల్లో సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లో రూ.1.16 లక్షల కోట్లు జమ చేశారు’ అని చెప్పారు. తాము ఏది చేశామో వైఎస్సార్, సీఎం జగన్‌లు చెబితే.. చంద్రబాబు మాత్రం ఇది చేయాలనుకున్నా అని అంటుంటారని ఎద్దేవా చేశారు. నాడు దళితులను కించపరిచి.. గుంటూరులో మద్యం కోసం వ్యక్తిగతంగా గొడవ జరిగి, దళితుడిపై దాడి జరిగితే.. దాన్ని వైఎస్సార్సీపీపై నెడుతున్నారని మండిపడ్డారు. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని దళితులను కించపరిచిన చంద్రబాబు ఇప్పుడు ఆ వర్గాన్ని వైఎస్సార్సీపీ నుంచి దూరం చేసేందుకు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు హోదా కంటే ప్యాకేజీతోనే రాష్ట్రానికి అధిక ప్రయోజనం చేకూరుతుందని చెప్పి మళ్లీ ఇప్పుడు హోదా కావాలని కోరడం విడ్డూరంగా ఉందని అంబటి ఎద్దేవా చేశారు. చదవండి: ఎస్సై పరీక్షల్లో అభ్యర్థి హైటెక్ ఛీటింగ్.. ట్వీట్ చేసిన ఐపీఎస్ ఆఫీసర్ -
చంద్రబాబుకు చేతనైతే ప్రజా క్షేత్రంలో తేల్చుకోవాలి: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన 11మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు బుధవారం ఏపీ మండలి ఛైర్మన్ ఆఫీస్‌లో ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. శాసనమండలిలో సీఎం జగన్ అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు చేస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతలు ఇళ్ల రుణమాఫీ పథకంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గతంలో చంద్రబాబు.. సీఎంగా ఉన్నప్పుడు డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో మహిళలను మోసం చేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు.. శాసన మండలిలో గ్యాలరీ ఎక్కి మరీ బెదిరించారని పెద్దిరెడ్డి గుర్తుచేశారు. చంద్రబాబు.. రాజకీయాలకు సిగ్గుచేటని.. వ్యవస్థలను, కుల వ్యక్తులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని పెద్దిరెడ్డి మండిపడ్డారు. ఆయనకు చేతనైతే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. టీడీపీ శాంతి భద్రతల సమస్య సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తోంది: సజ్జల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన 11మంది వైఎస్సార్సీపీ సభ్యులు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, ఆది మూలపుసురేష్ ,సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ నేతలు శాంతి భద్రతల సమస్య సృష్టించడానికి కుట్రలు చేస్తున్నారని అన్నారు. ప్రతి పక్షాలు పాదయాత్రల పేరుతో వందల కోట్లు వసూలు చేస్తున్నారని సజ్జల ప్రశ్నించారు. ప్రజలు.. వైఎస్సార్సీపీని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని తెలిపారు. ప్రజలంతా ముక్తకంఠంతో తమ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారని సజ్జల అన్నారు. కాగా, నిజమైన ప్రజల పక్షంగా ఉన్న పార్టీగా వైఎస్సార్సీపీ అవతరించిందని సజ్జల అన్నారు. అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేలా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని సజ్జల పేర్కొన్నారు. -
విపత్తువల్లే మట్టికట్ట తెగింది
సాక్షి, అమరావతి: ప్రకృతి విపత్తువల్లే అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిందేగానీ మానవ తప్పిదంవల్ల కానేకాదని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టంచేశారు. గోదావరి పుష్కరాల్లో నాటి సీఎం చంద్రబాబు ప్రచార పిచ్చితో ఒకేసారి ప్రజలను వదిలేయడంవల్ల తొక్కిసలాట జరిగి 29 మంది మరణించారని.. మానవ తప్పిదమంటే ఇదని చెప్పారు. రాయలసీమలో సహజంగా వరదలు రావని.. 140 ఏళ్ల తర్వాత కుంభవృష్టితో ఊహించని రీతిలో వరదలు ముంచెత్తడంవల్లే అన్నమయ్య, ఇతర ప్రాజెక్టులు తెగిపోయాయని కూడా కేంద్ర బృందం నివేదిక ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబైనా కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అయినా వాస్తవాలను గ్రహించి మాట్లాడాలని హితవు పలికారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు ఆదివారం మీడియాతో మాట్లాడారు. అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిపోవడంతో జరిగిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని మానవ తప్పిదంగా చిత్రీకరించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. నిత్యం అసత్యాలతో ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా చంద్రబాబు పెట్టుకున్నారని మండిపడ్డారు. అసహనంలో కూరుకుపోయిన బాబు వరద బాధితులను యుద్ధప్రాతిపదికన పునరావాస శిబిరాలకు తరలించి.. అన్ని విధాలా ఆదుకునేలా అధికారులతో సీఎం వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారని అంబటి చెప్పారు. సొంతూళ్లకు వరద బాధితులను చేర్చాక క్షేత్రస్థాయిలోకి సీఎం వైఎస్ జగన్ వెళ్లి.. వారిని పరామర్శించి ధైర్యం చెప్పారన్నారు. కష్టకాలంలో తమను ఆదుకున్న సీఎం వైఎస్ జగన్‌పై వరద బాధితులు తమ ప్రేమను తెలియజేస్తే.. దాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. బాధితులు సీఎం జగన్‌పై తిరగబడితే రాక్షసానందం పొందాలని చూసిన చంద్రబాబు.. పరిస్థితులు తద్భిన్నంగా ఉండటంతో తీవ్ర అసహనంలో కూరుకుపోయారన్నారు. అందువల్లే ప్రజలకు బుద్ధిలేదంటూ చంద్రబాబు తిడుతున్నారని చెప్పారు. కష్టనష్టాల్లో తోడునీడగా ఉండి.. ఉదారంగా ఆదుకుని, అండగా నిలిచే సీఎం వైఎస్ జగన్‌ను ప్రజలు ప్రేమగా పలకరిస్తారని.. కుట్రలు, కుతంత్రాలతో కీడు చేయాలని చూసే చంద్రబాబును చూస్తే ప్రజలకు మొట్టబుద్ధి అవుతుందన్నారు. గతంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో గుంటూరు, విజయవాడల్లో ప్రజలను ఇదే రీతిలో చంద్రబాబు తిడితే.. జనం తగిన రీతిలో బుద్ధిచెప్పారని అంబటి గుర్తుచేశారు. చంద్రబాబును ‘ఎర్రగడ్డ’లో చేర్చాలి ఒక వరద ప్రభావిత గ్రామాల్లో ప్రజలను రెచ్చగొట్టడానికే చంద్రబాబు వెళ్లారని అంబటి రాంబాబు చెప్పారు. అనూహ్యంగా ముంచెత్తిన వరదవల్ల సర్వం కోల్పోయిన బాధితుల కష్టాలను తెలుసుకోకుండా, తన భార్యను ఎవరూ దూషించకున్నా దూషించినట్లుగా వక్రీకరించి చెప్పుకున్నారన్నారు. వీటిని పరిశీలిస్తే చంద్రబాబు మానసిక స్థితి సరిగాలేదన్నది స్పష్టమవుతోందని.. తక్షణమే ఆయన్ని ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో చేర్చాలని సూచించారు. ఇక వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటించిన కేంద్ర బృందం.. దేశంలో ఎక్కడాలేని రీతిలో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారని అధికారులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించిందని గుర్తుచేశారు. కేంద్ర బృందం ఇచ్చిన నివేదికను ఒక్కసారి పరిశీలించి ఆ తర్వాత మాట్లాడాలని కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు సూచించారు. ఓటీఎస్ అప్పుడెందుకు గుర్తుకురాలేదు? ఇళ్లకు సంబంధించి పేదలకు ప్రయోజనం చేకూర్చే ఓటిఎస్ పథకం తీసుకొస్తే.. డబ్బులు కట్టొద్దని, తాను అధికారంలోకి వస్తే ఉచితంగా చేస్తానని చంద్రబాబు హామీ ఇస్తున్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఓటీఎస్ పథకం ఎందుకు గుర్తుకురాలేదని అంబటి ప్రశ్నించారు. పేదలు బాగుపడటం చంద్రబాబుకు ఇష్టంలేదని.. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. -
విపత్తులోనూ శవ రాజకీయాలా?
సాక్షి, అమరావతి: ప్రకృతి విపత్తు వల్ల జరగరాని నష్టం జరిగితే.. దాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరిస్తూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శవ రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్ యాదవ్ మండిపడ్డారు. చిల్లర రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకు ప్రతిపక్ష నేతగా కొనసాగే అర్హత లేదని చెప్పారు. ప్రకృతి విపత్తు నుంచి ప్రజలను రక్షించి, భరోసా కల్పించిన ప్రభుత్వాన్ని, అధికారులను కించపరచడం తగదని అన్నారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పెన్నా వరదలపై చంద్రబాబు, టీడీపీ నేతల అనైతిక రాజకీయాలను తుర్పారబట్టారు. మంత్రి చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. సోమశిలకు ఇంత వరద వస్తుందని వారే అంచనా వేయలేదు పెన్నా నది చరిత్రలో గత నెలలో భారీ వరద వచ్చింది. సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) లెక్కల ప్రకారం 1882లో సోమశిలకు 5 లక్షల క్యూసెక్కులు వచ్చింది. 140 ఏళ్ల తర్వాత గత నెల 19న 6 లక్షల క్యూసెక్కులు వరద వచ్చిందంటే పెన్నా బేసిన్లో ఏ స్థాయిలో కుంభవృష్టి కురిసిందో అర్థం చేసుకోవచ్చు. పెన్నాకు ఈ స్థాయిలో వరద వస్తుందని సీడబ్ల్యూసీగానీ, బాబు ఆయనే ఏర్పాటు చేశానని చెప్పుకుంటున్న వ్యవస్థగానీ అంచనా వేయలేదు. అన్నమయ్య ప్రాజెక్టుకు ఒక్కసారిగా 3.20 లక్షల క్యూసెక్కులు వచ్చింది అన్నమయ్య ప్రాజెక్టు స్పిల్ వే ప్రవాహం విడుదల గరిష్ట సామర్థ్యం 2.17 లక్షల క్యూసెక్కులు. గత నెల 17న వరద రాలేదు. 18న ఉదయం 10 గంటలకు 12 వేల క్యూసెక్కులు వస్తే.. అంతకంటే ఎక్కువ స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేసి, ప్రాజెక్టును ఖాళీ చేశాం. రాత్రి 8 గంటలకు 42 వేల క్యూసెక్కులకు ప్రవాహం పెరిగితే అంతే స్థాయిలో విడుదల చేశాం. ప్రాజెక్టు దిగువన ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశాం. పింఛా ప్రాజెక్టు స్పిల్ వే వరద విడుదల సామర్థ్యం 50 వేల క్యూసెక్కులు. అయితే, అక్కడకు 1.30 లక్షల క్యూసెక్కులు రావడంతో రింగ్ బండ్ తెగిపోయింది. గత నెల 19న రాత్రి పింఛా, బాహుదా, చెయ్యేరు బేసిన్లలో 20 సెంటీమీటర్ల కుండపోత వర్షం పడటంతో తెల్లవారుజామున 3 – 4 గంటల ప్రాంతంలో అన్నమయ్య ప్రాజెక్టుకు ఒక్కసారిగా 3.20 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. ప్రాజెక్టుకు ఉన్న ఐదు గేట్లలో ఒక్కో గేటు నుంచి 40 వేల క్యూసెక్కులు విడుదల చేయవచ్చు. సామర్థ్యం కంటే ఒకటిన్నర రెట్లు వరద వస్తే దిగువకు వరద ఎలా వెళ్తుంది? అందువల్లే అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగింది. దీని వల్లే కొంత మంది చనిపోయారని కేంద్ర బృందం చెబుతోంది. ఈ పాపం చంద్రబాబుదే ప్రకృతి విపత్తు వల్ల జరగరానిది జరిగితే దాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించడం చంద్రబాబు అవగాహన రాహిత్యానికి నిదర్శనం. 14 ఏళ్లు సీఎంగా పనిచేశానని, 40 ఏళ్లు రాజకీయ అనుభవముందని చెప్పుకునే వ్యక్తి ఇలా వ్యవహరించడం హేయం. డ్యామ్ సేఫ్టీ కమిటీ 2017లో అన్నమయ్య ప్రాజెక్టును తనిఖీ చేసి.. 1.30 లక్షల క్యూసెక్కుల సామర్థ్యంతో అదనంగా స్పిల్ వే నిర్మించాలని నివేదిక ఇచ్చింది. అదనపు స్పిల్ వే నిర్మించకుండా రెండున్నరేళ్లపాటు చంద్రబాబు గాడిదలు కాశారా? అదే నిర్మించి ఉంటే ఈ రోజున అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయే అవకాశమే ఉండేది కాదు. ఈ పాపానికి మూలకారణం చంద్రబాబే. రాజకీయ అవసరాల కోసమే షెకావత్ అవాస్తవాలు ప్రకృతి విపత్తు వల్లే అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిందని కేంద్ర బృందం నివేదిక ఇచ్చింది. కానీ.. కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వాస్తవాలను పరిగణనలోకి తీసుకోలేదు. చంద్రబాబు ఏజెంట్లు సీఎం రమేష్, సుజనా చౌదరి మాటలు విని, రాజకీయ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లడం తగదు. గతేడాది హిమానీ నదాలు కరగడం వల్ల ఒక్క సారిగా వచ్చిన వరదకు ఉత్తరాఖండ్‌లో 170 మంది మరణించారు. ఆ పాపం కేంద్రానిదా లేక ఉత్తరాఖండ్ సర్కార్‌ది అని అనుకోవాలా? సహాయక కార్యక్రమాలకే సీఎం జగన్ పెద్దపీట ముఖ్యమంత్రి క్షేత్ర స్థాయికి వెళ్తే వరద బాధితులకు సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు సూచించారు. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం నుంచి సహాయక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. బాధితులను వేగంగా పునరావాస శిబిరాలకు తరలించి ఆదుకున్నారు. వరద తగ్గాక ప్రజలను సొంతూళ్లకు చేర్చాం. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాం. సహాయక చర్యలు ముగిశాక బాధితులను సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. సహాయం అందిందో లేదో తెలుసుకున్నారు. ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు తరహాలో ప్రచార పిచ్చితో సహాయక కార్యక్రమాలకు ఆటంకం కలిగేలా సీఎం జగన్ వ్యవహరించలేదు. గోదావరి పుష్కరాల్లో ప్రచార పిచ్చితో, బోయపాటి సినిమా కోసం 38 మందిని పొట్టన పెట్టుకున్న చంద్రబాబుకూ, సీఎం వైఎస్ జగన్‌కూ ఇదీ తేడా! -
‘చంద్రబాబు ఉగ్రవాదుల ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడు’
న్యూఢిల్లీ: చంద్రబాబు ఉగ్రవాదుల ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడని, దొంగల ముఠాను ఎన్నికలకు అనుమతిస్తే దేశం పరిస్థితి అధోగతి పాలవుతోందని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు లోకేష్, బోండా ఉమ, దేవినేని ఉమ, పట్టాభి వ్యాఖలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. రాజ్యంగ బద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి పై అసభ్యపదజాలాన్ని ఉపయోగిస్తున్న విషయాన్ని వివరించామని తెలిపారు. అనాగరికంగా వ్యవహరిస్తున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోని.. ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రవర్తిస్తున్న తెలుగుదేశం పార్టీ గుర్తింపు రద్దుచేయాలని కోరామన్నారు. రాజ్యంగా బద్ధంగా జరిగే ఎన్నికలలో టీడీపీ ఉగ్రవాదులకు స్థానంలేదని మండిపడ్డారు. కాగా, అసభ్య పదజాలం ఉపయోగిస్తున్న వారిపై కేసులు పెడితే తప్పేంటని ఎన్నికల సంఘం ప్రశ్నించిందని అన్నారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నంబర్లను పంపాలని ఈసీ కోరిందని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. చదవండి: స్వామీజీల పీఠాలకు భూములు ఇస్తే తప్పేంటి?: మంత్రి వెల్లంపల్లి -
అధికారం ఊడిందనే అక్కసు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమాభివృద్ధి పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చడం, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వారం క్రితం ప్రారంభించిన బూతు డ్రామాకు మంగళవారం ఢిల్లీ వేదికగా తెరదించారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అధికారం ఊడిందనే అక్కసుతో.. తనకు ఓటు వేయని ప్రజలపై కక్ష తీర్చుకునేలా చంద్రబాబు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీలో చంద్రబాబు బూతు డ్రామాను ఎవరూ పట్టించుకోకపోవడంతో.. ఎల్లో మీడియా ద్వారా ఏదో జరుగుతోందని చూపించే ప్రయత్నం చేశారని ఎద్దేశా చేశారు. అందులో భాగంగానే ‘ఈనాడు’లో అశ్వత్థామ హతః కుంజరః అన్నట్లుగా ‘రాష్ట్రపతి పాలన పెట్టండి’ అనే డిమాండ్‌తో బ్యానర్ హెడ్డింగ్‌లు పెట్టించి తృప్తి పడ్డారని దెప్పిపొడిచారు. బూతులు తిట్టించిన చంద్రబాబేమో ఢిల్లీ నుంచి కిక్కురుమనకుండా హైదరాబాద్ చేరుకున్నారని, తిట్టినవాడేమో మాల్దీవులకు పోయాడని మండిపడ్డారు. ఈ సమావేశంలో సజ్జల ఇంకా ఏమన్నారంటే.. ఢిల్లీలో దివాలా తీసిన చంద్రబాబు ► తిమ్మిని బమ్మి చేయటమే కాదు.. శూన్యంలోంచి చంద్రబాబు ఏమైనా సృష్టించగలరు. ఒక ఛండాలమైన బూతు మాటను సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశించి టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి మాట్లాడితే.. దానిపై వచ్చిన ప్రతిస్పందన చూసి చంద్రబాబు పెద్ద ఉద్యమాన్ని నిర్మించాలని ప్రయత్నించారు. ► ఒక రోజు బంద్‌కు పిలుపు ఇచ్చారు. 36 గంటల నిరాహార దీక్ష చేసిన డయాబెటిక్ పేషెంట్ ఊగిపోతూ గంటన్నర సేపు నినదించి ప్రసంగించారు. అంతశక్తి ఉందంటే అది దీక్షకాని దీక్ష అనుకోవాలి. దాన్ని వ్యూహాత్మకంగా ముగించాలని ఢిల్లీకి ప్రయాణమయ్యాడు. అక్కడ చంద్రబాబు దివాలా తీశారని పసిగట్టిన జాతీయ మీడియా ఆయన పర్యటనను ఏమాత్రం పట్టించుకోలేదు. అమిత్ షా ఫోన్ చేశారని మరో డ్రామా ► ఢిల్లీలో రాష్ట్రపతిని చంద్రబాబు బృందం కలిసింది. రాష్ట్రపతి ఏమన్నారో తెలియదు. చంద్రబాబు అయితే చెప్పాల్సింది చెప్పి, కక్కాల్సింది కక్కారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రమ్మని పిలిచినట్లు.. శిఖరాగ్ర చర్చలు జరిపి.. సీఎం వైఎస్ జగన్ పాలనకు తెరదించేలా అమీతుమీ తేల్చుకోనున్నట్లు చంద్రబాబు కలరింగ్ ఇచ్చారు. కానీ అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదో ఎల్లో మీడియా రాయలేదు. ► అదే సీఎం వైఎస్ జగన్ అమిత్ షాను కలిస్తే.. మొట్టికాయలు వేశారని ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తుంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నాక అమిత్ షా ఫోన్ చేసినట్లు ఎల్లో మీడియాకు చంద్రబాబు లీకులు ఇచ్చి మరో డ్రామాకు తెరతీశారు. అమిత్ షా ఫోన్ చేశారో లేదో తెలియదు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి చక్రం కాదు కదా.. దీపావళి పండుగ పూట తిప్పే విష్ణు చక్రం కూడా తిప్పలేదు. ► చంద్రబాబుకు ఏనాడూ ప్రజలంటే ప్రేమ, అభిమానం లేదు. లెక్కలేనితనం ఉంది. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న పార్టీ అధ్యక్షుడు, 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు.. గంజాయి సాగు, స్మగ్లింగ్‌కు రాష్ట్రం రాజధానిగా మారిందని చెప్పడం దారుణం. చంద్రబాబుకు ఏ సెక్షన్ కింద ఎంత కఠినాతి కఠినమైన శిక్ష వేసినా తప్పులేదు. ► చంద్రబాబు ఉగ్రవాదిలా వ్యవహరిస్తున్నారు. దారినపోయేవాడు అక్కసుతో తిడితే దానికో అర్థముంటుంది. ఈ రాష్ట్రంలో యువతకు బూతులు నేర్పాలని అనుకుంటున్నావా? టీడీపీ సర్కార్ హయాంలోనే గంజాయి స్మగ్లింగ్ ► 2016లో నాటి మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం ప్రాంతం కేంద్రంగా గంజాయి వెళ్తోందని ఏమాత్రం దాపరికం లేకుండా మాట్లాడారు. దీనిపై చంద్రబాబు, ఆయన్ను సపోర్ట్ చేసే పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలి. ► సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో గంజాయి సాగు, స్మగ్లింగ్‌ను తుదముట్టించడానికి ఎస్ఈబీని ఏర్పాటు చేశారు. ఏడాదిలోనే 3 లక్షల కిలోలకుపైగా గంజాయిని ఎస్ఈబీ స్వాధీనం చేసుకుంది. సాగు చేసిన గంజాయి పంటను ధ్వంసం చేస్తున్నారు. స్మగ్లర్లకు పెద్ద ఎత్తున శిక్షలు పడుతున్నాయి. ఇది వాస్తవం కదా? ► ఎయిడెడ్ స్కూళ్లపై చేస్తున్న ఆందోళన వెనుక టీడీపీ నేతల పాత్ర ఉంది. ఎవరి మెడ మీదా కత్తి పెట్టి బలవంతంగా స్కూళ్లను తీసుకోలేదు. ► దేశంలో ఎవరైనా ఏ రాష్ట్రంలోనైనా పార్టీ పెట్టుకోవచ్చు. కేసీఆర్ కూడా రాష్ట్రంలో పార్టీ పెట్టుకోవచ్చు. సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఉమ్మడి ఏపీ దేశంలో అగ్రగామిగా అభివృద్ధి చెందుతుందని వైఎస్సార్సీపీ చెప్పింది. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో అడ్డగోలుగా విద్యుదుత్పత్తి చేస్తుండటం, సింగరేణి బొగ్గు గనులు ఉండటం వల్లే తెలంగాణలో విద్యుత్ సమస్య ఉత్పన్నం కాలేదన్నది వాస్తవం కాదా? చదవండి: కాంగ్రెస్ ,బీజేపీ లకు డిపాజిట్ రాకుండా బుద్ధి చెప్పండి: అంబటి రాంబాబు -
ఏపీ పరువు తీయడానికే బాబు ఢిల్లీ టూర్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పరువు తీయడానికే చంద్రబాబు తన బృందంతో ఢిల్లీ వెళ్లారని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ ధ్వజమెత్తారు. తనకు అధికారం దక్కలేదన్న అక్కసుతో చంద్రబాబు అబద్ధాలు, అవాస్తవాలు పోగేసుకుని ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలిశారని.. రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు, ఇక్కడ యువత డ్రగ్స్‌కు బానిసలైపోయినట్టు నిస్సిగ్గుగా ఆరోపణలు చేశారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇటువంటి కుట్ర రాజకీయాలు చంద్రబాబుకు కొత్తకాదని, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయనపై చెప్పులు వేయించిన ఘనుడని ధ్వజమెత్తారు. ఓటుకు కోట్లు కేసు వ్యవహారం మెడకు చుట్టుకున్నప్పుడు కూడా చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని, ఆ కేసు నుంచి బయట పడేందుకు చివరకు ఏపీకి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఎంపీ భరత్ ఇంకా ఏమన్నారంటే.. గంజాయి రవాణాపై అప్పటి మీ మంత్రులు ఏమన్నారో మర్చిపోయారా ‘ఏపీ నుంచే దేశం మొత్తానికి గంజాయి వెళుతున్న విషయం ఓపెన్ సీక్రెట్’ అని మీరు సీఎంగా ఉన్నప్పుడు కేబినెట్లో చర్చించలేదా? స్కూల్ బస్సుల్లో కూడా గంజాయి రవాణా చేస్తున్నారని మీ కేబినెట్ మంత్రులు గంటా, అయ్యన్నపాత్రుడు చెప్పలేదా? గంజాయి అక్రమ రవాణాలో పెద్దల హస్తం ఉందని స్వయానా మీ కేబినెట్ మంత్రులే చెప్పింది నిజం కాదా. వాస్తవాలు ఇలా ఉంటే.. రాష్ట్ర యువతపై టీడీపీ డ్రగ్స్ నెపం మోపుతోంది. బూతుల్ని సమర్థించుకోవడానికే.. సాక్షాత్తు ప్రధాన మంత్రిని బూతులు తిట్టిన సీడీలను, అమిత్ షా తిరుపతి వచ్చినప్పుడు రాళ్లు రువ్వించిన వీడియోలను రాష్ట్రపతికి చూపించారా? బాబు అండ్ కో మాట్లాడిన బూతులను సమర్థించుకోవడానికే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఎన్నికల్లో గెలవలేనని తెలిసిన బాబు ఆర్టికల్ 356 కోరుతున్నట్టున్నారు. దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతికి అబద్ధాలు, అవాస్తవాలు చెప్పినందుకు, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అనే నెపాన్ని వేస్తున్న బాబు అండ్ కోను అరెస్ట్ చేసి అండమాన్ దీవుల్లాంటి చోటకు పంపిస్తే ప్రజలు హర్షిస్తారు. అసాంఘిక శక్తులకు రారాజు చంద్రబాబు అసాంఘిక శక్తులకు రారాజు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిడితే, అందుకు ప్రజలు స్పందిస్తే, దాన్ని అల్లర్లుగా సృష్టించాలని బాబు చూస్తున్నారు. గతంలోనూ మత, కుల రాజకీయాలు చేసి రాష్ట్రంలో చిచ్చు పెట్టాలని బాబు తీవ్ర ప్రయత్నం చేశారు. ఇప్పుడు డ్రగ్స్ రాజకీయాలు తీసుకొస్తూ అందులో బూతు రాజకీయాలు కలుపుతున్నారు. -
చంద్రబాబు పైత్యం పరాకాష్టకు చేరింది: సజ్జల
తాడేపల్లి: చంద్రబాబు పైత్యం పరాకాష్టకు చేరిందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతి పక్షాలు ఏక్కడ ఏది జరిగినా ప్రభుత్వంపై కావాలనే విషప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు. హెరాయిన్, డ్రగ్స్‌లకు ఏపీ అడ్డగా మారిందని విపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని సజ్జల మండిపడ్డారు. చంద్రబాబు దిగజారీ రాజకీయాలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమకు అనుకూల మీడియాల్లో అడ్డమైన కథనాలు రాయించుకుంటున్నారని సజ్జల విమర్శించారు. హెరాయిన్ కేసును కేంద్ర నిఘా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని సజ్జల తెలిపారు. టీడీపీ వాళ్లు డ్రగ్స్ వ్యాపారంలోకి దిగారేమోనన్న అనుమానం ఉందని విమర్శించారు. దొంగే దొంగ.. దొంగ అన్నట్లుగా టీడీపీ తీరు ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రూ.వేల కోట్ల డ్రగ్స్ కేసులో ఎవరు ఉన్నారో దర్యాప్తులో తేలుతుందని అన్నారు. టీడీపీ హయాంలో గంజాయి రవాణాను చూసీ చూడనట్లు వదిలేశారని అన్నారు. దీనిపై సీఎం జగన్ ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు ఇచ్చినందువల్లే.. గంజాయి రవాణాపై అధికారులు విస్తృత దాడులు చేస్తున్నారని అన్నారు. ప్రజలు ఎన్నిసార్లు తిరస్కరించినా.. చంద్రబాబుకు సిగ్గులేదని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చదవండి: ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్ -
చంద్రబాబును తరిమికొడతారు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాం.. వడ్డీలేని రుణాలిస్తామని 2014 ఎన్నికల సమయంలో బూటకపు హామీలిచ్చి వాటన్నింటినీ తుంగలొ తొక్కేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై తిరుగుబాటు చేసేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్ సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ శ్రీకాకుళం నియోజకవర్గ బూత్‌కమిటీ మహిళా కన్వీనర్ల సమావేశం శనివారం పార్టీ నియోజకవర్గ అధ్యక్షురాలు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎం.వి.పద్మావతి అధ్యక్షతన జరిగింది. జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ముందుగా దివంగనేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మహిళల ఓట్లు దండుకోవడానికి ‘అక్కచెల్లెమ్మల్లారా నేను మారాను.. ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటాను.. నన్ను నమ్మండి’ అని ప్రాధేయపడితే ఓట్లు వేసిన మహిళలను నట్టేట ముంచాడని దుయ్యబట్టారు. పిల్లనిచ్చిన మామకే ముప్పు తిప్పలు పెట్టిన బాబుకు అమాయకులైన మహిళలను మోసం చేయడం పెద్ద విచిత్రం కాదన్నారు. డ్వాక్రా రుణాలు రూ.3వేలు ఇచ్చినందుకు సన్మానం చేయాలా? కట్టాల్సిన బకాయిలు లక్షల రూపాయలకు చేరినందుకు తగిన బుద్ధి చెప్పాలా అని మహిళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ గెలుపులో మహిళలే కీలకమన్నారు. 279 మంది మహిళా కన్వీనర్లు ఒక్కొక్కరూ 10 మంది సభ్యులతో కలిపి మొత్తం 2790మందితో కూడిన కమిటీని మరింత బలంగా తయారుచేసి పార్టీ విజయానికి దోహదపడాలన్నారు. నవరత్న పథకాలను అన్ని వర్గాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. తినడానికి తిండిలేక ఎంతోమంది నిరుపేదలు ఇబ్బందులు పడుతుంటే టెక్నాలజీ పేరుతో ప్రచార ఆర్భాటం చేస్తున్న బాబుని ప్రజలు క్షమించరన్నారు. బస్సుచార్జీలు, విద్యుత్ చార్జీలు, పెట్రోలు, డీజిల్ ధరలతో పాటు పన్నులు పెంచేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. మహిళా శక్తికి మించినది లేదు: కృష్ణదాస్ సమాజంలో మహిళలకి మించిన గొప్పవారు ఎవరూ ఉండదని, కుటుంబాలను అభివృద్ధి పథంలో నడిపించే శక్తి సామర్థ్యాలున్న వ్యక్తులని వైఎస్సార్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. షర్మిలమ్మ 3180 కిలోమీటర్లు పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించారని గుర్తు చేశారు. అంత శక్తి సామర్థ్యాలున్న మహిళలు వైఎస్సార్సీపీని గెలిపించడం పెద్ద విశేషం కాదన్నారు. జిల్లాలోని 10 నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించి టీడీపీని కంగుతినిపించాలన్నారు. జగన్‌తోనే మహిళా సాధికారత: దువ్వాడ మహిళాసాధికారతపై ఉద్యమాలు జరుగుతుంటే దానికి తూట్లు పొడిచేవిధంగా చంద్రబాబునాయుడు వ్యవహరించడం దారుణమని వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. ఏ సంక్షేమ పథకాన్నైనా మహిళల పేరుపైనే ఇవ్వాలని తొలిసారిగా ప్రతిపాదించి మహిళలకు చేయూతనిచ్చింది దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని గుర్తు చేశారు. అనంతరం వైఎస్సార్సీపీ అధిష్టానం తమకు అప్పగించిన బాధ్యతలను బాధ్యతాయుతంగా, నిస్వార్థంతో చేస్తామని కన్వీనర్లు ప్రమాణం చేశారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు చింతాడ మంజు, మహిళా ప్రధాన కార్యదర్శి అంబటి అంబిక, రాష్ట్ర మహిళా కార్యదర్శి టి.కామేశ్వరి, మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా అలివేలు మంగ, శ్రీకాకుళం పట్టణ అధ్యక్షురాలు పి.సుగుణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ సతీమణి పిరియా విజయమ్మ, ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు సతీమణి ధర్మాన సుశ్రీ, మూల కృష్ణవేణి, రాధారాణి, టెక్కలి ఎంపీటీసీ సత్తారు ఉషారాణి, మూకళ్ల సుగుణా, పైడి భవానీ, గార మండల అధ్యక్షురాలు సుగ్గు లక్ష్మినర్సమ్మ, పైడి భవానీ, మహిళా కన్వీనర్లు పాల్గొన్నారు. -
శత్రువులతో టీడీపీ పొత్తా!
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): సీఎం చంద్రబాబు అధికారం కోసం ఎదైనా చేస్తారని బద్ధ శత్రువులైన కాంగ్రెస్‌తో జతకట్టడం సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. నరసన్నపేట నియోజకవర్గంలోని పోతయ్యవలసలో రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అందించిన సుపరిపాలన మళ్లీ ప్రజలకు అందుతాయని ఆకాంక్షించారు. ఆమదాలవలస నియోజకవర్గంలో సరుబుజ్జిలి మండలం తెలికిపెంట, పర్వతాలపేట గ్రామాల్లో పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం టీడీపీ వళ్లే సర్వనాశనం అయిందన్నారు. అధికార పార్టీ కార్యకర్తల ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో ఆర్‌ఎల్‌పురం పంచాయతీ మామిడిపల్లిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి నవరత్నాల పథకాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. టెక్కలి నియోజకవర్గంలోని నందిగాం మండలంలో కొండతెంబూరు, సుభద్రాపురం గ్రామాల్లో నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ పర్యటించారు. ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలంలో కొండకుంకాం, ఇజ్జుపేట, లక్ష్మీనారాయణపురం, లింగాలవలస గ్రామాల్లో నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. పలాస నియోజకవర్గంలో పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సీదిరి అప్పలరాజు పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పథకాలపై ప్రచారం నిర్వహించారు. ఇచ్ఛాపురం నియోజకవర్గం తులసిగాం గ్రామంలో పార్టీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో పర్యటించి గ్రామస్తులతో మమేకం అయ్యారు. -
చిల్లర రాజకీయాలు మానుకో బాబూ..
గుత్తి: చిల్లర రాజకీయాలు మానుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు జిల్లా వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ మిథున్‌రెడ్డి హితవు పలికారు. గుత్తి సబ్‌జైలులో ఉన్న తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిని శనివారం హిందూపురం, అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్తలు నదీమ్ అహమ్మద్, పీడీ తలారి రంగయ్య, అనంతపురం, హిందూపురం పార్లమెంటు అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి, శంకరనారాయణ, గుంతకల్లు, కదిరి సమన్వయకర్తలు వై. వెంకటరామిరెడ్డి, సిద్దారెడ్డితో కలిసి ఆయన పరామర్శించారు. అనంతరం స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. రాబోయేది రాజన్న రాజ్యం ఆరు మాసాల్లో ప్రభుత్వ పతనం ఖాయమంటూ జాతీయ ఛానెళ్లు, పత్రికలు ప్రముఖంగా పేర్కొంటున్నాయన్నారు. జిల్లాలో టీడీపీకి ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదన్నారు. వైఎస్ జగన్ సీఎం కావడం ద్వారా రాజన్న రాజ్యం ఖాయమంటూ సర్వేలు స్పష్టం చేస్తున్నాయన్నారు. వీటన్నింటినీ గమనించిన టీడీపీ నేతలు.. అధికారం కోసం వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలపై దాడులు చేయిస్తున్నారన్నారు. అక్రమ కేసుల బనాయింపు మానుకోవాలి వైఎస్సార్ సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించడం, గృహ నిర్బంధాలు చేయడం మానుకోవాలని సూచించారు. తాడిపత్రి, రాయదుర్గం, హిందూపురం, రాప్తాడు, ధర్మవరం సమన్వయకర్తలు పెద్దారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, నవీన్ నిశ్చల్, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, జేసీ బ్రదర్స్ అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. ఎలాంటి తప్పు చేయకున్నా వారిని పోలీసుల చేత గృహ నిర్బంధాలు చేయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రాయదుర్గంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ మంత్రి కాలవ విసిరిన సవాలన్‌ను కాపు రామచంద్రారెడ్డితో పాటు పార్టీ స్వీకరించిందన్నారు. ఆయన నిర్ణయించిన తేదీకే బహిరంగ చర్చకు సిద్ధమైతే.. తన అక్రమాలు వెలుగు చూస్తాయనే భయంతో పోలీసులను అడ్డుపెట్టుకుని చర్చకు అనుమతి లేదంటూ తొక్కిపడేశారన్నారు. రాష్ట్ర కార్యదర్శులు పైలా నరసింహయ్య, రమేష్‌రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పామిడి వీరాంజనేయులు, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గయాజ్ బాషా, రాష్ట్ర నాయకులు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి దిలీప్‌రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శులు నాగిరెడ్డి, గూడూరు సూర్యనారాయణరెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లయ్యయాదవ్, గుత్తి పట్టణ, మండల కన్వీనర్లు పీరా, గోవర్దన్‌రెడ్డి, న్యాయవాది బుసా సుధీర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శులు గురుప్రసాద్ యాదవ్, సీవీ రంగారెడ్డి, ఫారూక్, సుభాష్‌రెడ్డి, శివయ్య, జిల్లా ట్రేడ్ యూనియన్ కార్యదర్శి శ్యామ్యూల్, నియోజకవర్గ అధ్యక్షుడు సోమిరెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శి గోవిందు పాల్గొన్నారు. అధికారం శాశ్వతం కాదు కొన్ని సంవత్సరాలుగా మహారాష్ట్ర నుంచి కోర్టు నోటీసులు వస్తున్నా.. పట్టించుకోకుండా ఇప్పుడిప్పుడే తనకు నోటీసులు అందినట్లు సీఎం చంద్రబాబు నటిస్తున్నాడని విమర్శించారు. కేవలం సానుభూతి పొందేందుకు ఈ తరహా చిల్లర రాజకీయాలకు ఆయన పాల్పడుతున్నాడని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులు అధికమయ్యాయన్నారు. దాడులకు బాధ్యులైన వారిపై, వారిని ప్రోత్సహిస్తున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా వైఎస్సార్ సీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. ఈ నాలుగేళ్లలో పోలీస్, రెవెన్యూ వ్యవస్థలు పూర్తి భ్రష్టుపట్టిపోయాయన్నారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని వారు గుర్తించాలని హితవు పలికారు. -
మాటలతో మభ్యపెడుతున్నారు
- చేసిన కార్యక్రమాలే మళ్లీ మళ్లీ చేస్తున్న చంద్రబాబు - రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అనంతపురం: చేసిన ప్రారంభోత్సవాలు.. కార్యక్రమాలే మళ్లీ మళ్లీ చేస్తూ తానేదో చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారని రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఆయన జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కృష్ణా జలాలతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని మూడున్నరేళ్లుగా చెబుతూనే ఉన్నారన్నారు. గతేడాది హంద్రీనీవా రెండోదశలో రాప్తాడు నియోజకవర్గం వరకు నీళ్లు పారించి మమ అనిపించారని మండిపడ్డారు. 2014 ఆగస్టు 15 నుంచి ఇప్పటివరకు అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సీఎం అనేక ప్రాజెక్టులు ప్రకటించారని గుర్తుచేశారు. పేరూరు డ్యాంకు, బీటీపీకి నీళ్లిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఒక్క ప్రాజెక్టు కూడా వాస్తవరూపం దాల్చలేదన్నారు. ఉరవకొండ నియోజకవర్గానికి రూ.850 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టం అని చెబుతున్నారు.. 52వ ప్యాకేజీకి సంబంధించి రాకెట్ల లిఫ్ట్ పైన 8 వేల ఎకరాలకు డిస్ట్రిబ్యూటరీలు ఏర్పాటు చేయడమనేది ఇప్పటికే లైవ్‌లో ఉందన్నారు. మళ్లీ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంటని ప్రశ్నించారు. ఉరవకొండలో ప్రకటించిన లిఫ్ట్ ద్వారా 20 వేల ఎకరాలు, బీటీపీ ద్వారా 20 వేల ఎకరాలు, పేరూరు లిఫ్ట్ ద్వారా 10 వేల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు రూ.3,500 కోట్లు ఖర్చు చేసేందుకు అంచనాలు వేస్తున్నారన్నారు. కేవలం రూ.300 కోట్లతో 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే వీలున్నా దానిపై దృష్టి పెట్టడం లేదని మండిపడ్డారు. సమావేశంలో జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ (కనగానపల్లి జెడ్పీటీసీ సభ్యుడు) బిల్లే ఈశ్వరయ్య, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వెంకటచౌదరి, లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరూరు నాగిరెడ్డి, పార్టీ నాయకులు ప్రసన్నాయపల్లి మహానందరెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేంద్రరెడ్డి పాల్గొన్నారు. -
‘బాబు పాలన అవినీతిమయం’
కూడేరు : సీఎం చంద్రబాబు మూడేళ్ల పాలనలో అవినీతి, అక్రమాలు విపరీతంగా పెరిగిపోయాయని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి శైలజనాథ్ అన్నారు. శుక్రవారం కూడేరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు మూడేళ్లలో ఏం చేశారని విజయోత్సవాలు జరుపుకుంటున్నారని ప్రశ్నించారు. మూడేళ్లలో భూకబ్జాలు, ఇసుక దోపిడీలు అధికమైయ్యాయని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకం కింద కొన్ని పనులు చేయకనే చేసినట్టు చూపించి ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు నిధులను నొక్కేస్తున్నారని ఆరోపించారు. అధికారం చేపట్టినప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క పక్కా ఇంటిని కూడా నిర్మించింది లేదన్నారు. సీఎం మాత్రం హైదరాబాద్‌లో ఇంటిని నిర్మించుకుని దానిని పార్టీ క్యాంపు కార్యాలయంగా ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. జిల్లాలో కరువును రూపుమాపుతానని సీఎం జిల్లాకు వచ్చినపుడల్లా ప్రకటనలు చేయడం తప్పా చేసింది ఏమి లేదన్నారు. కూడేరు మండలం పీఏబీఆర్ డ్యాం వద్ద రూ.56 కోట్లతో నిర్మించిన తాగునీటి ప్రాజెక్ట్‌ను ప్రారంభించకుండా రాజకీయం చేస్తున్నారన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్, పీసీసీ అధికార ప్రతినిధి రమణ, కార్యదర్శి జయచంద్రనాయుడు, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ విష్ణునారాయణ, మండల కన్వీనర్ ఆంజనేయులు, మండల నాయకులు రంజిత్, జనార్దన్, రమణ, అక్కులప్ప తదితరులు పాల్గొన్నారు. -
ఫ్యాక్షన్‌ను పోషిస్తున్న బాబు
నారాయణరెడ్డి హత్యను సీబీఐతో విచారణ జరిపించాలి మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గుమ్మఘట్ట : రాష్ట్రంలో ఆటవిక, నియంతృత్వ పాలన సాగుతోందని రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. రోజురోజుకూ ప్రజాదరణ చూరగొంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అణిచివేయాలనే లక్ష్యంతోనే సీఎం చంద్రబాబు ఫ్యాక్షన్‌ను పెంచిపోషిస్తున్నాడని ఆయన మండిపడ్డారు. ఆదివారం ఆయన గుమ్మఘట్టలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చిననాటి నుంచి 500ల మంది వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారని, ఈ రాక్షస రాజ్యానికి ప్రజలే బుద్ధిచెప్పాలన్నారు. ఇటీవల కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నారాయణరెడ్డి హత్య కేసును సీబీఐతో విచారణ జరిపిస్తే అసలు నిందితులు బయటకొస్తారని, ఈ విషయంలో గవర్నర్, కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అక్రమ కేసులతో తమ నాయకులు, కార్యకర్తలను బెదిరించాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. రాయదుర్గం నియోజక వర్గ వ్యాప్తంగా ఇసుక మాఫీయా పెట్రేగిపోతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నీరు–చెట్టులో జరిగిన దోపిడీ పై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. -
'ప్రభుత్వానికి దోచుకోవడమే పని'
యర్రగొండపాలెం: తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకుందని సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. పుల్లలచెరువు మండలంలోని నాయుడుపాలెంలో టీడీపీకి చెందిన 50 కుటుంబాలు ఎమ్మెల్యే సురేష్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. వైఎస్సార్ సీపీ నాయకుడు ఆకుల కోటిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షుడు ఉడుముల శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు అధికారులను బెదిరిస్తూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. రెండేళ్ల టీడీపీ పాలనలో ఒక్క గృహాన్ని కూడా నిర్మించలేదని, కేవలం మాటలు చెబుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారన్నారు. నారా చంద్రబాబునాయుడు పదేళ్లు సీఎంగా, మరో పదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశానని, దేశంలోనే తనంతటి మనిషి లేడని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. అధికారం కోసం ఎన్నికల సమయంలో అలివికాని వాగ్దానాలు చేసి, ఒక్కటి కూడా నెరవేర్చిన పాపానపోలేదని దుయ్యబట్టారు. రాష్టానికి అన్యాయం జరిగింది వాస్తవమేనని, అయితే సీఎం కేంద్రం నుంచి ఒక్క రూపాయి గ్రాంటు తీసుకుని రాలేకపోయారన్నారు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదులపై ఆనకట్టలు కట్టి ప్రధాన జీవనాధారమైన వెలిగొండ ప్రాజెక్టుకు నీరు రాకుండా చేస్తుంటే సీఎం ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారన్నారు. ఓటుకు కోట్లు కేసు భయంతోనే సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎంను జలాలపై నిలదీయలేకపోతున్నారన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల ఆదర్శ ముఖ్యమంత్రిగా దివంగతనేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నిలిచారని, అటువంటి రామరాజ్యం మళ్లీ రావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు. 2018లో ఎన్నికల గంట మోగుతుందని, ఆ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అఖండ మెజార్టీ సాధించి సీఎం అవుతారని ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. నమ్మించి మోసం చేసినవారికి అండగా ఉండబోమని నాయుడుపాలెం గ్రామానికి చెందిన ప్రజలు నిక్కచ్చిగా చెప్పి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం శుభపరిణామమన్నారు.