Formulation
-
జార్ఖండ్‌లో బీహార్ ఫార్ములా? ఇద్దరు డిప్యూటీ సీఎంలు?
జార్ఖండ్‌లో చంపాయ్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ ఫిబ్రవరి 16న జరగనుంది. కొత్త కేబినెట్లో నాలుగైదు కొత్త ముఖాలు కనిపించనున్నాయి. ఇద్దరు మంత్రులకు డిప్యూటీ సీఎం హోదా దక్కనుందని సమాచారం. కాంగ్రెస్ కోటా నుంచి వచ్చిన నలుగురు మంత్రుల్లో బాదల్ పాత్రలేఖ్, బన్నా గుప్తా, రామేశ్వర్ ఓరాన్ సహా మరో ముగ్గురు మంత్రులను మార్చనున్నారు. జార్ఖండ్‌లో బీహార్ ఫార్ములాను అనుసరించనున్నట్లు తెలుస్తోంది. అలాగే భూషణ్ బడా, దీపికా పాండే, రామచంద్ర సింగ్‌లకు మంత్రులుగా అవకాశం కల్పించనున్నారని సమాచారం. మంత్రి పదవికి భూషణ్ బడా, దీపికా పాండే పేర్లు దాదాపు ఖాయమని, రామచంద్ర సింగ్ లేదా ప్రదీప్ యాదవ్ పేర్లపై చర్చ జరగుతోంది. బసంత్ సోరెన్ 2020లో జరిగిన దుమ్కా ఉపఎన్నికల్లో విజయం సాధించి, మొదటిసారి అసెంబ్లీకి చేరుకోగా, అతని పెద్ద కోడలు సీతా సోరెన్ జామా నుండి మూడవసారి ఎన్నికయ్యారు. జేఎంఎంలో హేమంత్ సోరెన్ తమ్ముడు బసంత్ సోరెన్, కోడలు సీతా సోరెన్లలో ఒకరికి మాత్రమే చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. మహిళా కమిషన్ లేదా మరేదైనా కమిషన్ చైర్‌పర్సన్‌గా సీతా సోరెన్‌కు మంత్రి హోదా ఇవ్వవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. -
రాజస్థాన్ సీఎం ఎంపికకు ఛత్తీస్‌గఢ్ ఫార్ములా?
రాజస్థాన్ తదుపరి సీఎం ఎవరు? రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ సాధించినప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ సీఎం ఎంపికకు మల్లగుల్లాలు పడుతోంది. రాజస్థాన్‌కు కొత్త సీఎంను ఎంపిక చేసే బాధ్యతను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌తో సహా ముగ్గురు పరిశీలకులకు పార్టీ హైకమాండ్ అప్పగించింది. ఈ నేపధ్యంలో వారు జైపూర్ చేరుకుని, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారని తెలుస్తోంది. అయితే ఇంతలోనే ఛత్తీస్‌గఢ్‌లో కొత్త సీఎం పేరును బీజేపీ ప్రకటించింది. దీంతో రాజస్థాన్‌లో సీఎంను ఎంపిక చేసేందుకు బీజేపీ ఛత్తీస్‌గఢ్ ఫార్ములాను అనుసరించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజన సామాజిక వర్గానికి చెందిన విష్ణు దేవ్‌సాయిని ముఖ్యమంత్రిగా నియమించిన బీజేపీ తన భవిష్యత్ వ్యూహానికి సంబంధించిన అనేక లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అరుణ్ సావో, జనరల్ కేటగిరీ నుంచి వచ్చిన విజయ్ శర్మలను డిప్యూటీలుగా నియమించడం ద్వారా పార్టీలోని సామాజిక, రాజకీయ, అంతర్గత సమీకరణాలను చక్కదిద్దేందుకు బీజేపీ తన వంతు కృషి చేసింది. ఈ విధమైన ఫార్ములా ద్వారా లోక్‌సభ- 2024 ఎన్నికల వ్యూహానికి అనుగుణమైన రహదారిని ఏర్పాటు చేసింది. బీజేపీ తన ప్రత్యేక వ్యూహంలో భాగంగా గిరిజన సమాజాన్ని అక్కున చేర్చుకుంది. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎన్నో కార్యక్రమాలను కూడా చేపట్టింది. ద్రౌపది ముర్ముని రాష్ట్రపతిని చేయడం లేదా బిర్సా ముండా జన్మదినాన్ని గిరిజన దినోత్సవంగా ప్రకటించడం, తాజాగా గిరిజన ముఖ్యమంత్రిని ఎంచుకోవడం.. ఇవన్నీ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ వ్యూహంలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటి వరకు రాజస్థాన్‌లో వసుంధర రాజే, బాబా బాలక్‌నాథ్‌లు సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారనే వాదన వినిపించింది. అయితే ఈ రేసులో నుంచి తాను తప్పుకుంటున్నట్లు బాబా బాలక్‌నాథ్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు వసుంధర రాజేను సీఎం చేసే విషయమై పార్టీ ఇంతవరకూ ఏమీ తేల్చలేదు. మరోవైపు సీఎం రేసులో అశ్విని వైష్ణవ్, కిరోరి లాల్ మీనా, రాజ్యవర్ధన్ రాథోడ్, గజేంద్ర సింగ్ షెకావత్, ఓం బిర్లా, దియా కుమారి, అర్జున్ రామ్ మేఘ్వాల్, సీపీ జోషి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. రాజస్థాన్‌లో జాట్ జనాభా అత్యధికంగా ఉన్నప్పటికీ ఆ కమ్యూనిటీకి చెందిన ఏ నేత కూడా ముఖ్యమంత్రి పదవికి చేరుకోలేకపోయాడనే అసంతృప్తి ఆ వర్గంలో ఉంది. గతంలో జాట్ కమ్యూనిటీకి చెందిన నేతల పేర్లు సీఎం రేసులో వినిపించాయి. అయితే చివరి నిముషంలో వారెవరికీ అవకాశం దక్కలేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల విషయంలో ఇదే జరిగింది. 1973లో రామ్నివాస్ మిర్ధా, 1998లో పరశ్రమ్ మదెర్నా, 2008లో శిశ్రామ్ ఓలా.. ఇలా ఈ ముగ్గురూ నాడు సీఎం పదవికి పోటీదారులుగా నిలిచారు. కానీ వారికి ఎమ్మెల్యేల నుంచి మద్దతు లభించలేదు. ఈసారి కూడా జాట్ నేతను సీఎం చేయాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. దీనికి మద్దతుగా ఒక హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. రాజస్థాన్‌లోని 10 జిల్లాల్లో దాదాపు 65 స్థానాలపై జాట్ ఓటర్లు ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తున్నారు. అలాగే 100 సీట్లపై నిర్ణయం తీసుకునే కీల పాత్ర పోషిస్తున్నారు. అందుకే రాజస్థాన్ శాసనసభా పక్ష సమావేశంలో బీజేపీ నేతలు ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇది కూడా చదవండి: జమ్ము కశ్మీర్‌కు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు: అమిత్ షా -
అరబిందో చేతికి వెరిటాజ్ దేశీ ఫార్ములేషన్స్ వ్యాపారం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా తాజాగా వెరిటాజ్ హెల్త్‌కేర్‌కి చెందిన దేశీ ఫార్ములేషన్ వ్యాపారాన్ని రూ. 171 కోట్లకు కొనుగోలు చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని, కొనుగోలు ప్రక్రియ మే నాటికి పూర్తి కాగలదని సంస్థ తెలిపింది. దేశీ మార్కెట్లో విస్తరించడానికి ఈ డీల్ తోడ్పడగలదని అరబిందో ఫార్మా ఎండీ కె. నిత్యానంద రెడ్డి తెలిపారు. అత్యుత్తమ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను నిర్మించడంలో అరబిందోకి ఉన్న సామర్థ్యాలు, విస్తృతమైన వెరిటాజ్ నెట్వర్క్ తోడ్పాటుతో రాబోయే రోజుల్లో దేశీ ఫార్మా మార్కెట్లో కార్యకలాపాలను మరింతగా విస్తరించగలమని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా బయోసిమిలర్లు, ఇతర ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఈ ఒప్పందం తోడ్పడగలదని వివరించారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, క్రిటికల్ కేర్ చికిత్స విభాగంలో వెరిటాజ్కు 40 పైగా బ్రాండ్లు ఉన్నాయి. ఫెపానిల్, మెరోగ్రామ్ మొదలైనవి వీటిలో ఉన్నాయి. 50,000 మంది పైచిలుకు రిటైలర్లు సంస్థ నెట్‌వర్క్‌లో ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 127 కోట్ల టర్నోవరు సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో రూ. 133 కోట్ల టర్నోవరు నమోదు చేసింది. సోమవారం అరబిందో షేరు బీఎస్ఈలో సుమారు ఒకటిన్నర శాతం క్షీణించి దాదాపు రూ. 707 వద్ద క్లోజయ్యింది. -
ప్లాస్టిక్ నుంచి పెట్రోల్..అందుబాటులో ఎప్పుడంటే ?
సాక్షి, హైదరాబాద్: నేల, నీరును కలుషితం చేస్తున్న ప్లాస్టిక్‌ను వదిలించుకొనేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో కీలక ముందడుగు పడింది. విమానాల విడిభాగాలు, రసాయనాలను తయారుచేసే అంతర్జాతీయ కంపెనీ ‘హనీవెల్’ తాజాగా ప్లాస్టిక్ భూతంపై ఓ కొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది. అన్ని రకాల ప్లాస్టిక్ చెత్తను నాణ్యమైన ముడి చమురుగా మార్చేసే ప్రక్రియను ఆవిష్కరించింది. హనీవెల్ అక్కడితోనే ఆగిపోలేదు. స్పెయిన్ సంస్థ సాకైర్ ఎస్ఏతో కలసి ఏటా 30 వేల టన్నుల ప్లాస్టిక్ చెత్తను ముడి చమురుగా మార్చే ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తోంది. అన్నీ సవ్యంగా సాగితే 2023 కల్లా ఈ ఫ్యాక్టరీ ఉత్పత్తి ప్రారంభించవచ్చు. సుమారు 57 శాతం సీఓ2ను తగ్గించొచ్చు ఒక్కసారి తయారు చేశామంటే ప్లాస్టిక్‌ను నాశనం చేయడం అంత సులువైన పని కాదన్నది మనందరికీ తెలిసిన విషయమే. లెక్కలు చూస్తే ఏటా ఉత్పత్తి అయిన ప్లాస్టిక్‌లో వాడకం తరువాత సగం చెత్తకుప్పల్లోకి చేరుతున్నట్లు తెలుస్తుంది. ఇంకో 30 శాతం నదులు, సముద్రాలను కలుషితం చేస్తున్నాయి. రెండు శాతం ప్లాస్టిక్ మాత్రం మళ్లీ వాడుకొనే కొత్త ఉత్పత్తుల తయారీకి ఉపయోగపడుతోంది. ప్లాస్టిక్‌తో పెట్రోల్, డీజిల్, కృత్రిమ నూలు తయారీలకు ఇప్పటికే కొన్ని టెక్నాలజీలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే హనీవెల్ అభివృద్ధి చేసిన పద్ధతి వల్ల ప్లాస్టిక్‌ను కూడా ఇతర పదార్థాల మాదిరిగా మళ్లీమళ్లీ వాడుకొనే అవకాశం లభిస్తుంది. ఆ కంపెనీ అంచనా ప్రకారం ఈ పద్ధతి వల్ల ప్లాస్టిక్ తయారీ ద్వారా వాతావరణంలోకి విడుదల అవుతున్న కార్బన్ డై ఆక్సైడ్ మోతాదు దాదాపు 57 శాతం వరకూ తగ్గుతుంది. ఏమిటా పద్ధతి? నిజానికి హనీవెల్ ఉపయోగించిన ఆక్సిజన్ లేకుండా మండించే (పైరోలసిస్) పద్ధతి కొత్తదేమీ కాదు. కాకపోతే ముడి చమురులోని సూక్ష్మస్థాయి కాలుష్యాలను కూడా దశాబ్దాలుగా తొలగిస్తున్న హనీవెల్ తన అనుభవాన్నంత ఈ టెక్నాలజీ అభివృద్ధికి ఉపయోగించింది. అప్‌సైకిల్ అని పిలుస్తున్న ఈ పద్ధతిలో అన్ని రకాల ప్లాస్టిక్‌ను కలిపి వాడగలగడం విశేషం. పైరాలసిస్కు తోడు కొన్ని రసాయన ప్రక్రియలను కూడా ఉపయోగించడం ద్వారా తాము ముడి చమురును తయారు చేయగలుగుతున్నామని కంపెనీ తెలిపింది. స్పెయిన్‌లో మాదిరిగా మరింత మంది భాగస్వాములను కలుపుకొని ఈ టెక్నాలజీని విస్తృత వినియోగంలోకి తెస్తామని, ప్లాస్టిక్ వ్యర్థాల్లో 90 శాతాన్ని మళ్లీ వాడుకొనేలా ముడిచమురుగా మార్చగలమని కంపెనీ వివరిస్తోంది. చదవండి:బైకు కంటే విమానాలకే చీప్‌గా ఫ్యూయల్ -
చైనా మందుల దిగుమతులకు చెక్
• ఏటా చైనా నుంచి 3 బిలియన్ డాలర్ల దిగుమతులు • దేశీయంగానే రసాయనాలు, ఏపీఐ తయారీకి సిద్ధం • ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాం • ఫార్మాక్సిల్ చైర్మన్ మదన్ మోహన్ రెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చైనా నుంచి మన దేశానికి దిగుమతి అవుతున్న ఔషదాలకు త్వరలోనే చెక్ పడనుంది. ‘‘ఫార్ములేషన్లను తయారుచేసే మూల ఔషదాల్లో భారత్ వెనకబాటు మొత్తం ఔషద రంగంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. దీంతో ఏటా 3-3.2 బిలియన్ డాలర్ల ఔషదాలు, ముడిపదార్థాలు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది’’ అని ఫార్మాక్సిల్ చైర్మన్, అరబిందో ఫార్మా డెరైక్టర్ ఎం.మదన్మోహన్ రెడ్డి తెలిపారు. ‘ఇండియా ఫార్మా వీక్-2016’ కార్యక్రమం వివరాలను వెల్లడించేందుకు మంగళవారమిక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘నిజానికిపుడు చైనా నుంచి దిగుమతవుతున్న టాప్ వంద ఔషదాలు దేశీయంగానే తయారు చేసే సామర్థ్యం భారత్కంది. కానీ ఇందుకోసం దేశీ కంపెనీలను బలోపేతం చేసి ఉమ్మడి మౌలిక సదుపాయాలు, ఔషద క్లస్టర్లను ఏర్పాటు చేయాలి. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వంతోనూ చర్చించాం. దేశీయంగా ఫార్మా క్లస్టర్ల ఏర్పాటు ఆవశ్యకతను వివరించాం. కేంద్రం కూడా సుముఖంగానే ఉంది. వీటి ఏర్పాటుతో పాటు స్థలం, మౌలిక వసతుల కల్పన వంటి వాటిలో సబ్సిడీ ఇవ్వాలని సూచించాం. ఇది జరిగితే కంపెనీలకు వ్యయం తగ్గి పోటీతత్వం పెరుగుతుంది’’ అని ఆయన వివరించారు. ఫార్మా క్లస్టర్ల ఏర్పాటుతో దేశీయంగానే రసాయనాలు, యాక్టివ్ ఫార్మా ఇన్గ్రేడియెంట్లు (ఏపీఐ), అడ్వాన్స్ ఇంటర్మీడియేట్లు, ఇంటర్మీడియేట్ల తయారు చేయగలమని చెప్పారాయన. ప్రస్తుతం అమెరికా వంటి దేశాలకు ఫార్మా ఎగుమతులు 16.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని, ఈ ఏడాది ముగిసే నాటికి మరో 10 శాతం వృద్ధిని సాధిస్తామనే నమ్మకముందని చెప్పారాయన. నవంబర్ 17-23 వరకు ‘ఇండియా ఫార్మా వీక్-2016’.. సీపీహెచ్ఎల్, పీ-ఎంఈసీ సంయుక్త ఆధ్వర్యంలో వచ్చే నెల 17 నుంచి 23 వరకు వారం రోజుల పాటు ‘ఇండియా ఫార్మా వీక్-2016’ జరగనుంది. ముంబైలోని బీఈసీ, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ రెండు వేదికల్లో జరగనున్న ఈ ఫార్మా వీక్ పోస్టర్‌ను మంగళవారం విడుదల చేశారు. దీన్లో 100కు పైగా దేశాల నుంచి 1,300లకు పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటారు. ఫార్మా రంగంలో బిజినెస్ నాలెడ్జ్, లీడర్షిప్, నెట్వర్కింగ్ వంటి అంశాలపై ప్రదర్శన సాగనుంది. ఈ కార్యక్రమంలో ఫార్మాక్సిల్ అడిషనల్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రవి ఉదయ్ భాస్కర్, సింతొకెమ్ ల్యాబ్స్ ఎండీ జయంత్ ఠాగూర్, ఎకోబ్లిస్ ఎండీ ఏవీపీఎస్ చక్రవర్తి, యూబీఎం ఇండియా ఎండీ యోగేష్ ముద్రాస్ పాల్గొన్నారు. -
డయాబెటిస్ కౌన్సెలింగ్
ఆందోళన వద్దు... మంచికాలం ముందుంది! నా వయసు 25. గృహిణిని. టైప్-1 డయాబెటిస్తో బాధపడుతున్నాను. ప్రతి రోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్‌ను నాలుగుసార్లు తీసుకోవాల్సి వస్తోంది. చాలా బాధాకరంగా ఉంటోంది. ఇటీవలే ‘సూప్రామాలెక్యులార్ ఇన్సులిన్ అసెంబ్లీ-॥అనే ఫార్ములేషన్ గురించి తెలుసుకున్నాను. దీన్ని తీసుకుంటే ఇన్నిసార్లు ఇంజెక్షన్లు తీసుకునే బాధ తప్పుతుందని చదివాను. టైప్-1 డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఉపయోగపడుతుందా? ఇండియాలో ఇది లభ్యమవుతుందా? - సృజన, సికింద్రాబాద్ సూప్రామాలెక్యులార్ ఇన్సులిన్ అసెంబ్లీ-॥అనే ఫార్ములేషన్ ఇన్సులిన్‌ను ఒకేసారి గుమ్మరించినట్లుగా కాకుండా చాలా నియంత్రితంగా విడతలు విడతల్లో కొద్దికొద్దిగా విడుదల చేస్తుంది. దాంతో రోగుల్లో చాలాసార్లు ఇంజెక్షన్ సూది గుచ్చుకోవాల్సిన అగత్యం తప్పుతుంది. కేవలం 200 మైక్రోగ్రాముల ఒక్క సింగిల్ మోతాదుతోనే డయాబెటిస్తో బాధపడే జంతువులలో దాదాపు 120 రోజుల నుంచి 140 రోజుల వరకు రక్తంలోని గ్లూకోజ్ పాళ్లను నార్మల్‌గా ఉంచవచ్చునని ఇప్పటికి నిరూపితమైంది. అయితే ఇప్పటికి ఈ అధ్యయనాలన్నీ కేవలం డయాబెటిస్ ఉన్న జంతువులకే పరిమితమై ఉన్నాయి. కొద్దిరోజుల్లోనే ఇది చాలా సురక్షితమని పూర్తిగా నిరూపితమైతే అప్పుడు మనుషులపైనా తగిన అధ్యయనాలు జరగాల్సి ఉంది. అది మనుషుల్లోనూ అంతే ప్రభావపూర్వకంగా పనిచేస్తుందనీ, అంతే సురక్షితమైనదనీ నిరూపితమైతే, త్వరలోనే మనకూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే అది పరిశోధనల దశలోనే ఉంది. నా వయసు 64. గృహిణిని. గత ఐదేళ్లుగా డయాబెటిస్తో బాధపడుతున్నాను. డయాబెటిస్ మందులతో పాటు గుండెకు సంబంధించిన మందులూ వాడుతున్నాను. నేను కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను. ఇలా తీసుకోవడం హానికరమా? దయచేసి నాకు వివరంగా చెప్పండి. - శ్రీలత, కరీంనగర్ ప్రతిరోజూ రెండు కూల్‌డ్రింక్స్ తాగడం లేదా ఐస్ టీ (చాయ్)లు తాగడం టైప్-2 డయాబెటిస్ వచ్చే రిస్క్‌ను 26 శాతం పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దానికి తోడు అధికరక్తపోటూ వచ్చే ప్రమాదం ఉంది. ఇక మెటబాలిక్ సిండ్రోమ్ అనే జబ్బుకు చాలా రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్నాయి. అవి... అధిక రక్తపోటు, నడుము చుట్టుకొలత పెరగడం వంటివి. ఈ లక్షణాల వల్ల గుండె ధమనుల జబ్బులూ రావచ్చు. గతంలో జరిగిన చాలా అధ్యయనాల్లో కూల్‌డ్రింక్స్ తాగడానికీ, డయాబెటిస్, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి జబ్బులు వచ్చేందుకు సంబంధం ఉందని తేలింది. రోజూ రెండు బాటిల్స్ కూల్‌డ్రింక్స్ తాగేవారిలో మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చే అవకాశాలు 20 శాతం ఎక్కువ. ఇక నెలకు ఒకసారి 340 గ్రాముల కూల్‌డ్రింక్ మాత్రమే తాగేవారిలోనూ టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు 15 శాతం వరకు ఉంటాయని అధ్యయనాలు స్పష్టంగా చెబుతున్నాయి. అందుకే డయాబెటిస్తో బాధపడేవారు ఎట్టిపరిస్థితుల్లోనూ కూల్‌డ్రింక్స్ తాగవద్దని, ఐస్‌క్రీములు తినవద్దని డాక్టర్లుగా మా సలహా.