Free gas
-
ప్రతీ ఇంటికీ మూడు సిలెండర్లు ఇస్తామని గతంలో చంద్రబాబు హామీ
-
ప్రశ్నలతో మంత్రులను ఉక్కిరి బిక్కిరి చేసిన వరుదు కళ్యాణి
-
AP: ‘బండ’ మోసం.. అరకోటి కుటుంబాలకు ‘గ్యాస్’ ఎగ్గొట్టిన బాబు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మొత్తం కుటుంబాల సంఖ్య 1.80 కోట్లకుపైనే! వీరిలో 1.54 కోట్ల మందికి యాక్టివ్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అంటే దాదాపు కోటిన్నరకుపైగా కుటుంబాలు! ‘ఇంటింటికీ ఉచిత గ్యాస్’ ఇస్తామన్న టీడీపీ కూటమి పార్టీల ఎన్నికల హామీని నెరవేర్చాలంటే ఏటా దాదాపు రూ.4 వేల కోట్లు అవసరం. కానీ ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల కోసం రూ.2,684.75 కోట్లు మాత్రమే ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. దాదాపు పది లక్షల వరకు ఉన్న ప్రధాని ఉజ్వల యోజన కనెక్షన్లకు పాక్షిక రాయితీతోపాటు మిగతా గ్యాస్ వినియోగదారులకు ఎన్నిల హామీ ప్రకారం పూర్తి ఉచితంగా సిలిండర్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన మొత్తం లబ్ధిదారులకు ఒక్క ఉచిత సిలిండర్ పంపిణీ కోసం రూ.1,345 కోట్లు అవసరం. కానీ కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ఇచ్చిందెంతో తెలుసా? దీపావళికి తొలి సిలిండర్ పంపిణీ కోసం ఇచ్చింది కేవలం.. రూ.894.92 కోట్లు మాత్రమే!! అంటే పథకాన్ని కేవలం కోటి కుటుంబాలకు లోపే పరిమితం చేసి మిగతా 54 లక్షల కుటుంబాలకు ఎగ్గొడుతున్నట్లు స్పష్టమవుతోంది. ప్రతి ఇంటికీ ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తామని ఎన్నికల వేళ బుకాయించిన కూటమి పార్టీల నేతలు ఈ ఏడాది ఇవ్వాల్సిన రెండు సిలిండర్లకు ఎగనామం పెట్టేయడంతోపాటు అర కోటికిపైగా కుటుంబాలను పథకానికి దూరం చేయడం గమనార్హం.అంతా ఉత్త గ్యాసేనా!రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ‘ఉత్త గ్యాస్’గా మారిపోతోందా? అర్హత ఉన్నా ఉచిత గ్యాస్ అందుతుందన్న గ్యారంటీ పోయిందా? రేషన్ కార్డు ఉండీ.. దశాబ్దాలుగా గ్యాస్ కనెక్షన్ వినియోగిస్తున్న కుటుంబాలు ప్రభుత్వం దృష్టిలో అనర్హులైపోతున్నాయా? కూటమి పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టోలో చెప్పిన ‘ఇంటింటికీ ఉచిత గ్యాస్’ వాగ్దానంలో మోసం బట్టబయలైందా? అంటే.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అవుననే అంటున్నాయి. దీపం–2 కింద దీపావళి కానుకగా తీసుకొచ్చిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అందరికీ కాదనేది తేటతెల్లమవుతోంది. గ్యాస్ బుక్ చేసుకున్న ప్రతి అర్హుడికీ రాయితీ మొత్తం ఖాతాల్లో పడుతుందనేది భ్రమగా తేలిపోయింది.ఇంటింటికీ అని నమ్మించి..ఎన్నికల్లో ఓట్లే పరమావధిగా చంద్రబాబు బృందం ప్రతి ఇంటికీ ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని బూటకపు హామీని గుప్పించింది. నమ్మి ఓట్లు వేసిన ప్రజలను మోసం చేస్తూ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలు తర్వాత పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు హడావుడి చేసింది. ఓట్లు వేయించుకునేందుకు ఎలాంటి అడ్డంకులు విధించని కూటమి నాయకత్వం ఉచిత గ్యాస్ పథకం పొందాలంటే మాత్రం అర్హత ఉండాలనే మెలిక పెట్టింది. నిజానికి కూటమి పార్టీల ఎన్నికల హామీ ప్రకారం చూస్తే రాష్ట్రంలో 1.80 కోట్ల కుటుంబాలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు చొప్పున (ప్రభుత్వ జీవో ప్రకారం సిలిండర్‌కు రూ.894) ఇవ్వడానికి రూ.4,827.60 కోట్లు ఖర్చవుతుంది. దీంతో ఉచిత గ్యాస్ పథకాన్ని కుదించేందుకు సిద్ధమయ్యారు. రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఉచిత గ్యాస్ రాయితీ వర్తిస్తుందంటూ షరతులు విధించారు.పొంతన లేని సర్కారు లెక్కలు..రేషన్ కార్డు, ఆధార్, గ్యాస్ కనెక్షన్ ఉంటే ఉచిత గ్యాస్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలోని 1,48,43,671 మంది కార్డుదారులు తమకు పూర్తిగా గ్యాస్ రాయితీ వస్తుందని ఆశపడ్డారు. వీరంతా బీపీఎల్ కిందే నమోదైన వారే. అయితే పథకాన్ని ప్రారంభించిన తొలి రోజే లక్షల కుటుంబాలకు నిరాశ ఎదురైంది. ఏళ్ల తరబడి గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డులున్నా పథకానికి అనర్హులుగా తేల్చడంతో నివ్వెరపోతున్నారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు.54 లక్షల కుటుంబాలకు అర్హత లేదా?రేషన్ కార్డులున్నప్పటికీ సుమారు 54 లక్షల కుటుంబాలను ఉచిత గ్యాస్ పథకం నుంచి ప్రభుత్వం పక్కన పెట్టేసింది. వీరిని వడపోసిన తర్వాతే పథకానికి బడ్జెట్ ప్రకటించినట్లు సమాచారం. ఏ ప్రమాణాల ప్రకారం వీరిని అనర్హులుగా ప్రకటించారో చెప్పకుండా అర్హులందరికీ ఉచిత గ్యాస్ ఇస్తున్నట్లు మభ్యపెడుతోంది. అర్హుల కుదింపుతోపాటు మరోవైపు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా నాలుగు నెలలకు ఒకసారి సిలిండర్ బుక్ చేసుకునేలా మూడు బ్లాక్ పీరియడ్స్‌ను తెచ్చింది. ఆయా సమయాల్లో గ్యాస్ సిలిండర్ఖాళీగా లేకుంటే లబ్ధిదారుడు నష్టపోవాల్సి వస్తుంది. తద్వారా ప్రభుత్వం ఖర్చును తగ్గించుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో మార్చి నెలాఖరు వరకు ఒక్క సిలిండర్‌తోనే సరిపెడుతూ రెండు సిలిండర్లకు ఎగనామం పెట్టింది.ఇదీ గ్యాస్ ‘‘పథకం’’!రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య 1.80 కోట్లుయాక్టివ్ గ్యాస్ కనెక్షన్లు 1.54 కోట్లురేషన్ కార్డులు 1,48,43,671» ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల ఖర్చు రూ.4 వేల కోట్లు(ఒక్కోటి రూ.894 చొప్పున 1.54 కోట్ల మందికి 3 సిలిండర్లు ఇచ్చేందుకు)కానీ మూడు సిలిండర్లకు ప్రభుత్వం ఎంత ఇస్తోంది?: రూ.2,684.75 కోట్లు(ఈ బడ్జెట్ కోటి కుటుంబాలకు కూడా సరిపోదు.. మరో అర కోటికిపైగా అర్హులైన కుటుంబాలకు మొండి చెయ్యే)» కార్డుదారులకు ఒక్క సిలిండర్ ఇవ్వటానికయ్యే ఖర్చు రూ.1,345 కోట్లు»తొలి సిలిండర్ కోసం విడుదల చేసిన మొత్తం రూ.894.92 కోట్లు » ప్రభుత్వ బడ్జెట్ ప్రకారం చూస్తే లబ్ధి పొందే కుటుంబాలు సుమారు కోటి» అర్హత ఉన్నప్పటికీ పథకానికి దూరమైన కుటుంబాలు సుమారు అర కోటినోట్: ఏపీలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద సుమారు 9.68 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. వీరికి కేంద్రం గ్యాస్ సిలిండర్‌కు రూ.300 రాయితీ ఇస్తోంది. అది పోనూ ఇటువంటి కనెక్షన్లకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.594 మాత్రమే చెల్లిస్తుంది. మిగిలిన మాత్రం పూర్తిగా రాయితీ ఇవ్వాల్సి ఉంటుంది. -
ఏపీలో ఉచిత గ్యాస్.. 40 లక్షల మందికి తుస్
విజయవాడ, సాక్షి: ఉచిత గ్యాస్ పేరుతో మరో భారీ మోసానికి సీఎం చంద్రబాబు నాయుడు తెర తీశారు. ప్రారంభంలోనే 40 లక్షల మంది లబ్ధిదారులకు ఎగనామం పెట్టారు. ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటన ద్వారా తేటతెల్లం కావడం గమనార్హం. ఏపీలో మొత్తం కోటి 48 లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. అలాగే.. రాష్ట్రవ్యాప్తంగా కోటి 55 లక్షలకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నారు. అయితే.. పథకం ప్రారంభించిన నాడే 40 లక్షల మంది లబ్ధిదారులకు పైగా షాక్ తగిలింది. నిబంధనల పేరుతో వాళ్లకు ఫ్రీ సిలిండర్ కోత పెట్టింది కూటమి ప్రభుత్వం. మరోవైపు.. ఇన్నాళ్లూ లబ్ధిదారుల సంఖ్యను చంద్రబాబు ప్రభుత్వం బయటపెట్టకుండా వచ్చింది. అయితే డిప్యూటీ సీఎం పవన్ ఏమరపాటులో అన్నారో.. కావాలనే చెప్పారో తెలియదుకానీ.. ఈ పథకం కింద కోటి 8 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించామని చెప్పారు. దీంతో కూటమి సర్కార్ మోసం బయటపడింది. ఎన్నికల టైంలో.. కూటమి మేనిఫెస్టోలో ప్రతీ ఇంటికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆ గ్యాస్ సిలిండర్ల హామీకి తూట్లు పొడుస్తూ నిబంధనలను తెరపైకి తెచ్చారు. రేషన్ కార్డులున్న కుటుంబాలకు ఉచిత సిలిండర్లు ఇవ్వకపోగా.. తర్వాత డబ్బులు జమ చేస్తామంటూ మెలిక పెడుతున్నారు. చూస్తుంటే.. ఆరంభంలోనే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఈ పథకం లబ్ధిదారుల సంఖ్యను మరింతగా తగ్గించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. -
మార్చి వరకు ‘ఒకటే’ గ్యాస్.. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలులో మెలిక!
హామీల పేరుతో ప్రజలను వంచించడంలో కూటమి సర్కారు నేతల నైజం మరోసారి బయటపడింది. వారిని నమ్మి ఓట్లేసిన మహిళల నెత్తిన కుచ్చుటోపీ పెట్టేశారు. దీపావళి సందర్భంగా ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ప్రతి ఇంటికీ ఏటా మూడు ఉచిత సిలిండర్ల వాగ్దానాన్ని తుంగలో తొక్కేసింది. ఈ ఏడాది అక్టోబర్ 29 నుంచి వచ్చే మార్చి 31 వరకు తొలి గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చని పేర్కొంటూ మిగిలిన రెండు ఉచిత సిలిండర్లకు ఎగనామం పెట్టింది. తద్వారా ఈ ఆరి్థక సంవత్సరంలో ఒక్క సిలిండర్‌తోనే పండగ చేసుకోమని చెబుతోంది. – సాక్షి, అమరావతిఒక్క సిలిండర్‌తో ఐదు పండుగలా! వచ్చే మార్చి వరకు విభిన్న వర్గాల పండుగల సీజన్ కనిపిస్తోంది. దీపావళి తర్వాత నవంబర్‌లో కార్తీకమాసం, డిసెంబర్లో క్రిస్మస్, జనవరిలో సంక్రాంతి, మార్చిలో ఉగాదితో పాటు రంజాన్ ఉన్నాయి. ఈ క్రమంలో ఉదారంగా పథకాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వం ఒక్క సిలిండర్‌తోనే ఐదు నెలల పాటు సరిపుచ్చుతోంది. రాష్ట్రంలోసగటున ఒక్కో కుటుంబం ఏడాదికి ఐదారు సిలిండర్లు వినియోగిస్తోంది. కూటమి ప్రభుత్వం మాత్రం ఒక్క సిలిండర్ ఇచ్చి ఐదు నెలలు గడిపేయాలని చెబుతుండటం గమనార్హం.క్షీణించిన కొనుగోలు శక్తి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటినా పేదల సంక్షేమాన్ని పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకుండా సాకులు చెబుతోంది. మరోవైపు బయట మార్కెట్లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతిన్నాయి. ప్రజల జీవన విధానం అతలాకుతలమైంది. సర్వం కోల్పోయి రోడ్డుపై నిలబడ్డారు. చేసేందుకు పనులు దొరక్క.. చేతిలో చిల్లిగవ్వ లేక ప్రజల్లో కొనుగోలు శక్తి క్షీణించింది. ఫలితంగా ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. దీన్ని పసిగట్టిన కూటమి ప్రభుత్వం ఉచిత గ్యాస్ పథకాన్ని తెరపైకి తెచి్చంది. అయితే తొలి ఏడాది మూడు సిలిండర్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం వచ్చే మార్చి దాకా కేవలం ఒక్క సిలిండర్‌ను మాత్రమే ఇస్తామని ప్రకటించింది. తద్వారా మహిళలను మోసం చేస్తోంది.అసలు మెలిక ఇదా? ఉచిత గ్యాస్ సిలిండర్ పేరుతో ప్రజలు ముందుగా డబ్బులు చెల్లించి బుక్ చేసుకున్న గ్యాస్ తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఆ తర్వాత 48 గంటల్లో రాయితీ సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో (డీబీటీ) జమ చేస్తామని చెబుతోంది. రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికీ షెడ్యూల్ ప్రకారం సిలిండర్ డబ్బులు ఖాతాల్లో వేస్తే లబ్ధిదారులు తమకు కావాల్సిన సమయంలో గ్యాస్ బుక్ చేసుకుంటారు. ఇలా చేస్తే ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత గ్యాస్ కింద నగదు ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ఏడాదికి మూడు బ్లాక్ పీరియడ్స్‌ను తెచ్చినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ –జూలై, ఆగస్టు – నవంబర్, డిసెంబర్ – మార్చి బ్లాక్ పీరియడ్స్‌లో మాత్రమే గ్యాస్ బుక్ చేసుకునేలా పథకాన్ని రూపొందించింది. దీనివల్ల ఆ సమయంలో ఖాళీ సిలిండర్ లేకపోతే లబ్ధిదారుడు సిలిండర్ రాయితీని నష్టపోవాల్సి వస్తోంది. పొంతన లేని లెక్కలు.. అర్హులందరికీ ఇస్తారా? రాష్ట్రంలో 1.48 కోట్లకుపైగా రైస్ కార్డుదారులుంటే ప్రభుత్వం మాత్రం 1.47 కోట్లుగానే చెబుతోంది. ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్, ఆధార్, తెల్ల రేషన్ కార్డు ఉంటే పథకానికి అర్హులుగా ప్రకటించింది. ప్రభుత్వం రూ.894 ఉన్న గ్యాస్‌ను ఉచితంగా ఇస్తున్నట్లు చెబుతోంది. ఈ లెక్కన ఓ కుటుంబానికి ఏడాదికి రూ.2,682 విలువైన మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలి. తద్వారా మొత్తం కార్డుదారులకు ఏడాదికి దాదాపు రూ.4,000 కోట్లు వెచి్చంచాల్సి ఉంటుంది. ప్రభుత్వం మాత్రం ఏడాదికి రూ.2,684.75 కోట్లు బడ్జెట్ మాత్రమే చూపిస్తుండటం పథకం అమలుపై సందేహాలు రేకెత్తిస్తోంది. ఎన్నికల సమయంలో ప్రతి ఇంటికీ ఉచిత గ్యాస్ అని హామీ ఇచి్చన చంద్రబాబు.. తీరా తెల్లరేషన్ కార్డు నిబంధన పెట్టడంతో లక్షలాది మంది అనర్హులుగా మిగిలిపోతున్నారు. రేపు శ్రీకాకుళంలో ‘ఉచిత గ్యాస్’ ప్రారంభం⇒ హాజరుకానున్న సీఎం చంద్రబాబు ⇒ తొలి సిలిండర్ ఖర్చు రూ.894 కోట్లు విడుదలసాక్షి, అమరావతి: దీపం–2 పథకంలో భాగంగా మూడు సిలిండర్లను ఉచితంగా అందించేందుకు వీలుగా తొలి సిలిండర్‌కు అయ్యే ఖర్చు రూ.894 కోట్లను సీఎం చంద్రబాబు బుధవారం పెట్రోలియం సంస్థలకు అందజేశారు. ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా అందించేందుకు రూ.2,684 కోట్ల ఖర్చుకు ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇక 1వ తేదీన శ్రీకాకుళంలో దీపం–2 పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు.కాగా, ఈనెల 29 నుంచే ప్రభుత్వం గ్యాస్ బుకింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. లబ్ధిదారులు ముందుగా డబ్బు చెల్లించి బుక్ చేసుకోవాలని సూచించింది. సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లో లబ్ధిదారుల ఖాతాల్లో రాయితీ సొమ్ము జమవుతుందని ప్రకటించింది. కేంద్రం ఇచ్చే రూ.25 రాయితీ పోను మిగిలిన రూ.876లను ప్రభుత్వం అందజేస్తుంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తన ‘ఎక్స్’ ఖాతాలో తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘దీపం 2.0’తో దీపావళి కాంతులు తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. -
1.57 కోట్ల దీపాలు ఎప్పుడు వెలిగిస్తారు?
ఏవమ్మా దీపం ఇచ్చాను నేను. దీపం పెట్టాను మీకు జ్ఞాపకం ఉందా? చిన్నప్పుడు మా తల్లిని చూసేవాడిని. ఇంటిలో వంట చేస్తే కళ్లలో నీళ్లు వచ్చేవి. కడుపు నిండా పొగపోయేది. నా తల్లి పడిన కష్టం ఏ ఆడబిడ్డా పడకూడదని ‘దీపం’ పథకం కింద వంట గ్యాస్ సిలిండర్లు అందించిన పార్టీ తెలుగుదేశం. ఈ రోజు గ్యాస్ రేట్లు పెరిగి పోవడంతో మళ్లీ కట్టెల పొయ్యిలకు పోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తానని హామీ ఇస్తున్నా. – మే 28న రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడు సభలో చంద్రబాబుసాక్షి, అమరావతి : ఎన్నికల ప్రచారం ముగిసేంత వరకు సూపర్–6 పథకాల్లో భాగంగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే హామీపై చంద్రబాబు మైకులు పగిలేలా ప్రసంగాలు చేశారు. ఇప్పుడు “సూపర్–6 చూస్తుంటే భయమేస్తోందం’టూ కుంటిసాకులు వెదుకుతున్నారు. రాష్ట్రంలో 1.57 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. సగటున ఒక కుటుంబం ఏడాదికి 5–6 గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తోంది. ప్రస్తుతం గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ.900గా ఉంది. ఈ లెక్కన ఏడాదికి పేద కుటుంబం సగటున రూ.1000 చొప్పున రూ.5 వేల నుంచి రూ.6వేల వరకు గ్యాస్ కోసం వెచ్చించాల్సిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రజలు తమకు 3 ఉచిత సిలిండర్లు ఇస్తే ఆర్థిక భారం తగ్గుతుందని భావించారు. తద్వారా ఒక్కో కుటుంబానికి ఏటా రూ.2,700 మిగులుతుంది. ఈ లెక్కన చంద్రబాబు ప్రభుత్వం ఏడాదికి 1.57 కోట్ల కనెక్షన్లపై రూ.4,239 కోట్లు, ఐదేళ్లలో రూ.21 వేల కోట్లు వెచ్చించాలి. అయితే ఇప్పటి వరకు ఈ పథకం గురించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నోరు విప్పలేదు. ఎగ్గొట్టడంపైనే బాబు దృష్టి 2019 ఎన్నికల ముందు వరకు రూ.800గా ఉన్న గ్యాస్ సిలిండర్‌పై కేంద్రం రూ.400 సబ్సిడీ ఇచ్చేది. అలాంటింది 2020–21 ఆర్థిక సంవత్సరం నుంచి సబ్సిడీని పూర్తిగా తగ్గించేయడంతో పాటు సిలిండర్ ధర క్రమంగా రూ.1200కు పెంచేసింది. సబ్సిడీ రూపంలో రూ.15 మాత్రమే జమ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్ సర్కార్ అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు ఆర్థిక దన్నుగా నిలిచాయి. తర్వాత 2024 ఎన్నికలకు ముందు కేంద్రం అదే గ్యాస్ ధరను రూ.900కు తగ్గించింది. అయినప్పటికీ చంద్రబాబు గ్యాస్ సిలిండర్ ధర రూ.1200 ఉన్నప్పుడు హామీ ఇచ్చారు. ఆ రేటు తగ్గడంతో ఆనందంగా పథకాన్ని అమలు చేయాల్సిందిపోయి ఎగ్గొట్టడంపైనే ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. కాగా, వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా రూ.2.69 లక్షల కోట్లు, ఇతర సంక్షేమ పథకాల (నాన్–డీబీటీ) రూపంలో రూ.1.84 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో జమ చేసింది. వీటన్నింటి ఫలితంగానే కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ పేదలు, ముఖ్యంగా అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా నిలదొక్కుకోగలిగారు. ఫలితంగా గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో దశాబ్దాలుగా కనిపించని ఆర్థిక స్థిరత్వం (రూరల్ సస్టైనబులిటీ) నాలుగేళ్లలోనే సాధ్యపడింది. కానీ, అధికార దాహంతో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మోసపూరిత హామీలతో పేదల ఆర్థిక సూచీ స్థిరత్వాన్ని కోల్పోనుంది. మహిళలను డీఫాల్టర్లు చేసిన బాబు 2014లో పొదుపు సంఘాల మహిళలకు చెందిన రూ.14,204 కోట్ల రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక లేదు పొమ్మన్నారు. ఫలితంగా మహిళలు బ్యాంకులకు రుణం చెల్లించలేక వడ్డీలపై వడ్డీలు పెరిగిపోయాయి. ఆ రుణ భారం రూ.25,571 కోట్లకు చేరుకుంది. 18.36% సంఘాలు బ్యాంకుల వద్ద డిఫాల్టు అయ్యాయి.అలాంటి సమయంలో సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే వైఎస్సార్ ఆసరా పథకం కింద పొదుపు సంఘాల మహిళలకు వాళ్ల అప్పు మొత్తం చెల్లించారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. దేశంలో మొత్తం పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాల్లో 30% ఏపీలో పొదుపు సంఘాలకే పంపిణీ చేయించారు. -
ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోంది
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రాంగోపాల్‌పేట్: గొంతుమీద కత్తిపెట్టినా భరతమాతకు జై అనబోమని కొంత మంది అంటున్నారని భరతమాతకు జై అంటే అమ్మకు జై అన్నట్లేనని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో తింటూ విదేశాలకు ఊడిగం చేసే వారికి అలా అనే హక్కు ఎవరిచ్చారని ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. గురువారం సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో బంగారు లక్ష్మణ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ‘అయామ్ డోనర్’ పేరుతో రూపొందించిన రక్తదాన యాప్‌ను, ట్రస్టు వెబ్‌సైట్‌ను, లోగోను ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..స్వాతంత్య్ర ఉద్యమంలో జాతి నేతలు వందేమాతరం అన్నారని అంటే మాతా నీకు వందనం అని అర్థమని అన్నారు. ఆనాడు ఖాసీం రజ్వీ తెలంగాణలో ఎన్నో అరాచకాలు చేశాడని ఆయన కూడా భారతమాతకు జై అనలేక పాకిస్తాన్ వెళ్లిపోయాడని గుర్తు చేశారు. అలాంటి వారసత్వంలో వచ్చిన మత ఛాందసవాద సంస్థలు మతం పేరుతో ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. అలాంటి పార్టీలతో పొత్తు పెట్టుకున్న వారు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు. హెచ్‌సీయూలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకుంటే వర్సిటీని కొంత మంది రాజకీయ తీర్థయాత్రలా మార్చివేశారన్నారు. రోహిత్ ఆత్మహత్యకు కారణాలేంటి, కారకులు ఎవరు అనేదానిని విశ్లేషించాల్సింది పోయి కేవలం తమను నిందించేందుకు వాడుకున్నారని అన్నారు. అప్జల్‌గురు, యాకుబ్ మెమెన్‌లకు కీర్తించ డం జాతి వ్యతిరేక చర్య అని ఆయన ఖండించారు. దేశంలో 740 యూనివర్శిటీలు ఉండగా, అందులో 3, 4 యూనివర్శిటీల్లో మాత్రమే ఇలాంటి వివాదాలు చోటు చేసుకుంటుండటం దురదృష్టకరమని అన్నారు. త్వరలో ఉజ్వల పథకం కింద దేశంలో 5కోట్ల మంది మహిళలకు ఉచిత గ్యాస్ అందించనున్నామన్నారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ బంగారు లక్ష్మణ్ పార్టీకి, సమాజానికి అందించిన సేవల గురించి వివరించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ టీవీ నారాయణ, కూచిపూడి నృత్య కళాకారిణి డాక్టర్ శోభానాయుడులను ఘనంగా సత్కరించారు. రిటైర్డ్ జడ్జి సీవీ రాములు, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉచితం గ్యాస్!
కళ్ల మంటలు, దగ్గు, కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగ బాధ, తడిసిపోయిన కర్రలు వెలగక... మంట కోసం ఊదలేక గుండెలార్చుకుపోయే పరిస్థితి నుంచి బయటపడవచ్చని ఎంతో ఆశతో గ్యాస్ కనెక్షన్లకోసం ఏజెన్సీల వద్దకు వెళుతున్న పేదల ఆశలు నీరుగారిపోతున్నాయి. డబ్బులు చెల్లించలేక, గ్యాస్ కనెక్షన్లు పొందలేకపోతున్నవారి కోసం కేంద్రం ప్రవేశపెట్టిన ఉచిత గ్యాస్ కనెక్షన్ పథకానికి ఏజెన్సీలు తూట్లు పొడుస్తున్నాయి. అధిక ధరలను వసూలు చేస్తూ , అడ్డమైన ఉత్పత్తులనూ అంటగడుతున్నాయి. విజయనగరం కంటోన్మెంట్: కేవలం పది రూపాయలు చెల్లిస్తే గ్యాస్ కనెక్షన్, ఖాళీ సిలెండర్ ఉచితంగా అందజేస్తామని, గ్యాస్ ఫిల్చేసిన సిలెండర్, ట్యూబ్‌ల కోసం రూ.790లు చెల్లిస్తే సరిపోతుందని ఒక వైపు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంటే జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు మాత్రం అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదంతా తెలిసినా అధికారులు దొంగనిద్ర నటిస్తున్నారు. గ్యాస్ కనెక్షన్ లేని నిరుపేదల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత గ్యాస్ కనెక్షన్ పథకం ఏజెన్సీలకు కాసులవర్షం కురిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్యాస్ ఏజెన్సీలలో ఎవరికి నచ్చిన ధరను వారు వసూలు చేస్తున్నారు. తమ దగ్గర గ్యాస్ స్టౌలను కొంటేనే కనెక్షన్ ఇస్తామని నిబంధన విధిస్తున్నారు. కేవలం కనెక్షన్ ను రూ. 790కు ఇవ్వాల్సినప్పటికీ వాటి ధరను రూ.900కు పెంచారు. అలాగే గ్యాస్ స్టౌను బయట కొనుగోలు చేసుకోవచ్చని ప్రారంభంలో ప్రకటించినా ఇప్పుడు తమ వద్దే కొనుగోలు చేయాలని, లేకుంటే గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం కుదరదని తెగేసిచెబుతున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు.దీంతో గత్యంతరం లేక వారి వద్దే అధిక ధరకు స్టౌలను కొనుగోలు చేస్తున్నామని బాబామెట్ట, గాజుల రేగ ప్రాంతాలకు చెందిన మహిళలు వాపోయారు. కొన్ని ఏజెన్సీలు కుక్కర్లు, మరికొన్ని ఏజెన్సీలు వివిధ కంపెనీలకు చెందిన టీ పొడులు అంటగడుతున్నారు. 46 వేలు మాత్రమే మంజూరు జిల్లాలో బీపీసీ, ఐఓసీ,హెచ్‌పీ కంపెనీలకు సంబంధించి 63 వేల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం 46 వేలు మాత్రమే మంజూరయ్యాయి. ఇందులో హెచ్‌పీసీఎల్ కంపెనీకి ఎక్కువ కనెక్షన్లు కేటాయించారు. హెచ్‌పీకి 32 వేలు, ఐఓసీకి 8,500, బీపీసీకి 5,500 కనెక్షన్లు కేటాయించారు. ఆయా కంపెనీలు ఏజెన్సీల వారీగా జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. ప్రారంభంలో ప్రకటించిన విధంగా రూ.790లు తీసుకుని వెళితే ఏకంగా 2,900 చెల్లించాలని కొన్ని ఏజెన్సీలు చెబుతున్నాయి. మరికొన్ని ఏజెన్సీలు రూ.3,080 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. ట్యూబు కోసం రూ.190లు, పుస్తకానికి రూ.50లు, స్టౌధర రూ.1975 నుంచి 2,300 వరకూ టీపొడి రూ.107లు, గ్యాస్ కోసం రూ.651.50లు వసూలు చేస్తున్నారు. దీంతో అంతసొమ్ము చెల్లించలేక చాలా మంది కనెక్షన్లను తీసుకోకుండా వెనుదిరుగుతున్నారు. గతంలో మంజూరైన 16,000 దీపం కనెక్షన్లను కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. గ్యాస్ ఏజెన్సీలపై ఆరోపణలు వెల్లువెత్తడంతో కలెక్టర్ సమీక్ష నిర్వహించి ఎక్కువ ధరలకు విక్రయిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సమీక్ష జరిగి కనీసం పది రోజులయినా గడవక ముందే ఈ విధంగా ఏజెన్సీలు వ్యాపారం చేసుకుంటున్నాయి.