Fresh Air
-
స్వచ్ఛ గాలి కేరాఫ్ ఏపీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 13 పట్టణాల్లో వాతావరణ కాలుష్యం తగ్గించడంపై నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్సీఏపీ) కింద చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 131 పట్టణాలు, 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో వాయుకాలుష్యం తగ్గించే విధంగా 2019లో ఈ కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించింది. 2025–26 నాటికి వాతావరణ కాలుష్యాన్ని ఆయా ప్రాంతాల్లో తగ్గించడం ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. 2023–24లో నమోదైన వాతావరణ కాలుష్యం డేటా ప్రకారం..దేశవ్యాప్తంగా 131 పట్ణణాల్లో అత్యధిక కాలుష్యం నమోదవుతుండగా... అందులో ఏపీ నుంచి 13 ప్రాంతాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే అత్యధికంగా ఢిల్లీ 208 పీఎం10తో తొలి స్థానంలో నిలిచింది. దేశస్థాయిలో విశాఖ 30వ స్థానంలో, కడప 128వ స్థానంలో నిలిచాయి. కాలుష్యం పెరుగుదలలో పీఎం10 (వాతావరణంలో పీల్చుకునే స్థాయిలో ఉండే 10 మైక్రోమీటర్ల వ్యాసం కలిగిన ముతక కణాలు) స్థాయి 120 పాయింట్లతో ఏపీలో విశాఖ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో రాజమహేంద్రవరం, విజయనగరం, ఏలూరు నిలిచాయి. 42 పీఎం10 స్థాయితో ఏపీలో కడప చివరి స్థానంలో నిలిచింది. విజయవాడలో తగ్గుముఖంఈ పథకం అమలు తర్వాత రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో కాలుష్యం తగ్గుముఖం పట్టినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎన్సీఏపీ చర్యలతో విజయవాడ, కడప, కర్నూలు, నెల్లూరు వంటి పట్టణాల్లో కాలుష్యం తగ్గుముఖం పట్టింది. 2022–23లో విజయవాడలో పీఎం10 స్థాయి 90 పాయింట్లుగా ఉంటే అది 2023–24కు 61 పాయింట్లకు చేరింది. ఇదే సమయంలో కడపలో 57 నుంచి 42కు, నెల్లూరులో 56 నుంచి 52కు, కర్నూలులో 64 నుంచి 56కు తగ్గినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే విశాఖలో వాతావరణ కాలుష్యం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ 2022–23లో పీఎం10 స్థాయి 116 పాయింట్లుగా ఉండగా అది 2023–24 నాటికి 120 పాయింట్లకు పెరిగింది. రాజమహేంద్రవరంలో 68 నుంచి 76, గుంటూరులో 60 నుంచి 61 పాయింట్లకు పెరిగింది. జనాభా పెరుగుదల, పారిశ్రామిక పురోగతి ఎక్కువ అవడం, స్థానికంగా వాతావరణ మార్పులు చోటుచేసుకోవడం తదితర కారణాల వల్ల ఈ ప్రాంతాల్లో కాలుష్యం పెరుగుతున్నట్లు తెలిపింది. ఏపీలో ఇప్పటివరకు రూ.109.78 కోట్ల వినియోగంవాతావరణంలో పీఎం10, పీఎం 2.5 స్థాయిలను ప్రస్తుతమున్న స్థాయి నుంచి 2025–26కి కనీసం 40% తగ్గించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 131 పట్టణాలకు రూ.19,614 కోట్లను కేటాయించింది. 10 లక్షల కంటే అధిక జనాభా కలిగిన నగరాల్లో ఈ మొత్తాన్ని 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు విడుదల చేస్తుండగా.. మిగిలిన పట్టణాలకు స్థానిక సంస్థల ద్వారా విడుదల చేస్తోంది. ఈ మొత్తంలో ఇప్పటివరకు రూ.11,211.13 కోట్లను ఖర్చు చేసింది. ఎన్సీఏపీ కింద ఏపీ నుంచి ఎంపికైన 13 పట్టణాలకు ఇప్పటివరకు రూ.361.09 కోట్లు విడుదల చేయగా అందులో రూ.109.78 కోట్లను ఖర్చు పెట్టారు. వాతావారణ కాలుష్యానికి కారణమైన రహదారులపై దుమ్ము, వ్యర్థాలను తగలపెట్టడం, వాహన, పారిశ్రామిక కాలుష్యం, నిర్మాణ రంగ వ్యర్థాలు వంటి వాటిని గుర్తించి వాటిని నియంత్రించడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి. -
గాలి పీల్చుకోవడానికి రూ.15 లక్షలు ఖర్చు చేసిన రొనాల్డో
అదేంటీ వాతావరణంలోని పుక్కిడికి దొరికే గాలిని పీల్చుకోవడానికి స్వేచ్ఛ ఉంది కదా! అంతేసి ఖర్చు ఎందుకు? దండగ కాకపోతే.. అనుకుంటున్నారా?. ఆ గాలికి చాలా ప్రత్యేకత ఉంటుంది మరి. ప్యూర్ ఎయిర్‌గా పేరున్న ఈ మెషిన్ కోసం సాకర్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో భారీగానే ఖర్చుపెట్టాడు. ఇంతకీ దాని ఖర్చెంతో.. ప్రత్యేకతలేంటో తెలుసా? హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ (HBOT) మెషిన్ ఖరీదు 15,000 పౌండ్లు. మన కరెన్సీలో 15 లక్షల రూపాయలపైనే. ఈ డివైజ్ ప్రత్యేకత ఏంటంటే.. ప్యూర్ ఆక్సిజన్‌ను రక్తంలోకి సరఫరా చేస్తుంది. తద్వారా రక్తపు ప్లాస్మాలోని దెబ్బతిన్న కణజాలం క్యూర్ అయిపోతుంది. ఫిట్‌నెస్‌కు మొదటి ప్రాధాన్యత ఇచ్చే 36 ఏళ్ల రొనాల్డో.. ఈ ఛాంబర్‌ను తన జిమ్ రూంలో ఈ మధ్యే ఏర్పాటు చేయించాడు. చిన్నచిన్నగాయాలకు సైతం మ్యాచ్‌లకు దూరం అయ్యే రొనాల్డ్.. ఇలాంటి హైటెక్ చికిత్సల ద్వారా తరచూ ఉపశమనం పొందుతాడట. వాస్తవానికి రొనాల్డో ఇలాంటి ఛాంబర్లను ఉపయోగించడం కొత్తేం కాదు. 2016లో యూరో ఫైనల్లో తగిలిన మోకాలి గాయం తర్వాత స్పానిష్ ఐల్యాండ్ ఇబిజాకు వెళ్లి.. ఇలాంటి ఛాంబర్‌లోనే ట్రీట్మెంట్ తీసుకున్నాడు. కానీ, యూకేలో అలాంటి మెషిన్లు దొరక్కపోవడంతో కొని.. చెషైర్‌లోని తన ఇంట్లో ఇన్స్టాల్ చేయించుకున్నాడు. ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది 50 వేల పౌండ్లు ఖర్చు పెట్టి ఐస్ ఛాంబర్‌ను కొన్న విషయం తెలిసిందే. ప్రపంచంలోనే రిచ్చెస్ట్ సాకర్ ప్లేయర్‌గా పేరున్న రొనాల్డోతో మామూలుగా ఉండదు మరి!. ఛాంబర్ ప్రత్యేకతలు చిన్న ఛాంబర్ లాంటి గది ఉంటుంది. డ్రైవింగ్ సంబంధిత సమస్యలు ఉన్నవాళ్ల కోసం రూపొందించినప్పటికీ.. రకరకాల జబ్బులు ఉన్నవాళ్లు తమకు నయం కావడానికి ఈ చికిత్సను ఆశ్రయిస్తుంటారు. ఈ లిస్ట్‌లో సెలబ్రిటీలు కూడా ఎక్కువ!. 1662లో ఓ ఫిజీషియన్ ఈ తరహా ఛాంబర్ ఒకటి స్వచ్ఛమైన ఆక్సిజన్ కోసం నిర్మించినట్లు ప్రచారంలో ఉంది. 1940లో మిలిటరీ డైవర్స్ కోసం అమెరికా దేశం HBOT ఎక్కువ స్థాయిలో తయారు చేయించింది. అనుమతులు పొందాకే వీటిని వాడాల్సి ఉంటుంది. HBOTలతో ఉపయోగాలే కాదు.. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయట. అందుకే వీటిని వినియోగించేముందు కొన్ని పరీక్షలు కూడా నిర్వహిస్తుంటారు మరి!. ఎక్కువ మంది ఒకేసారి ఈ చికిత్స తీసుకునేందుకు ప్రత్యేక గదులను సైతం ఏర్పాటు చేయిస్తుంటారు. ఈ ట్రీట్మెంట్కు కాస్ట్ ఎక్కువగా ఉంటోంది. చదవండి: రొనాల్డోకు భారత్‌లో అరుదైన గౌరవం -
తొమ్మిదేళ్ల బాలిక నిరసన
-
రాష్ట్రపతి భవన్ వద్ద తొమ్మిదేళ్ల బాలిక నిరసన
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్ ముందు తొమ్మిదేళ్ల బాలిక లిసిప్రియా కంగుజమ్ నిరసనకు దిగింది. దేశ రాజధానిలో స్వచ్ఛమైన గాలి కరువైందని ఆక్షేపించింది. గురువారం రాత్రి ప్రాంభమైన ఆమె నిరసన కార్యక్రమం శుక్రవారం ఉదయం వరకూ కొనసాగింది. ‘కాలుష్యకారక గాలి పీల్చలేక ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల నుంచి ఎలా బయడతామని ఆందోళన చెందుతున్నారు. రాజకీయ నాయకులేమో చర్యలు తీసుకోవడం మరచి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఢిల్లీలో ఫ్రెష్ ఎయిర్ కోసం ప్రభుత్వాలు ఇప్పటివరకు చెప్పుకోదగ్గ చర్యలేమీ తీసుకోలేదు! కలుషిత గాలిని పీల్చడం వల్ల ప్రతియేడు ప్రపంచవ్యాప్తంగా 60 లక్షల మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. (చదవండి: ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత) మాకు శాశ్వత పరిష్కారం కావాలి. ఢిల్లీ కాలుష్యం నుంచి రక్షించండి. పటిష్టమైన క్లయిమేట్ ‘లా’ తీసుకురండి’ అని ఆమె ప్లకార్డు ప్రదర్శింది. ఆమె వెంట మరికొందరు పర్యావరణ పరిరక్షణ కార్యకర్తలు ఉన్నారు. అనంతరం వారంతా సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని కలిశారు. ప్రమాదకర కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను మూసేయాలని, దేశ రాజధానిలో వాతావరణ కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు.లిసిప్రియ మణిపూర్ యాక్టివిస్ట్. బెంగళూరు ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతోంది. డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్ కలామ్ చిల్డ్రన్ అవార్డు, వరల్డ్ చిల్డ్రన్స్ పీస్ ప్రైజ్, ఇండియా పీజ్ ప్రైజ్, రైజింగ్ స్టార్ ఆఫ్ ఎర్త్ డే నెట్వర్క్, ఎస్.డి.జీస్ అంబాసిడర్ అవార్డు, నోబెల్ సిటిజన్ అవార్డులను లిసిప్రియ అందుకుంది. పర్యావరణ కార్యకర్తల్లో ప్రపంచంలోనే ఆమె అత్యంత పిన్నవయస్కురాలిగా పేరొందింది. (చదవండి: అడుగుతున్నా చెప్పండి) -
కరోనా కట్టడికి కిటికీలు తెరవాలి!
గ్వాంగ్జౌ : కరోనా రోగులతో సన్నిహితంగా ఉన్నా, వారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు శ్లేష్మం తుంపర్లు మీద పడినా కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకుతుందని అందరికి తెల్సిందే. కరోనా వైరస్ బాధితుడు తుమ్మినా, దగ్గినా తుంపర్ల ద్వారా బాహ్య వాతావరణంలోకి వెలువడే కరోనా వైరస్ కొన్ని గంటలపాటు అలా గాలిలో జీవిస్తాయని, అవి ఆవహించి ఉన్న ప్రాంతం నుంచి వెళ్లేవారికి కూడా అవి సోకుతాయని జూలై నెలలో దేశంలోని 200 మంది శాస్త్రవేత్తలు ఓ అభిప్రాయానికి వచ్చారు. అంటే కరోనా వైరస్ గాలి ద్వారా కూడా సోకుతుందన్నమాట. ‘జర్నల్ క్లినికల్ ఇన్ఫెక్సియస్ డిసీసెస్’లో ఈ మేరకు జూలై 6వ తేదీన ఓ వ్యాసాన్ని కూడా ప్రచురించారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అంగీకరించింది. ఈ కారణంగా మన ప్రమేయం లేకుండా మన ఇళ్లలోకి కూడా కరోనా వైరస్ వచ్చే ప్రమాదం ఉంది. ఆ దాడి నుంచి తప్పించుకోవాలంటే ఇంట్లో గాలిపోయే మార్గాలను, అంటే తలుపులను, కిటికీలను వీలైనంత వరకు తెరచి ఉంచాలని.. భవనాలు లేదా ఇళ్ల నిర్మాణాలు కూడా గాలి, వెలుతురు వచ్చేలా, ఇంట్లో గాలి బయటకు వెళ్లేలా ఉండాలని శాస్త్రవేత్తలతోపాటు ఆర్కిటెక్ట్‌లు సూచిస్తున్నారు. వెంటిలేషన్ సరిగ్గా లేని రెస్టారెంట్లు, పబ్బులు, మందిరాల్లో కరోనా కేసులు ఎక్కువగా వ్యాపించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. చైనాలోని గ్వాంగ్జౌ నగరంలో కిటికీలులేని ఐదో అంతస్తు రెస్టారెంట్లో మధ్యాహ్నం భోజనం చేసిన పది మందికి కరోనా వచ్చింది. కరోనా నుంచి తప్పించుకోవాలంటే మాస్క్‌లు, శానిటైజర్లు ఉపయోగించడం ఎంత అవసరమో, ఇంటికి కిటికీలు, వెంటిలేటర్లు తెరచి ఉంచడం కూడా అంతే అవసరమని పరిశోధకులు సూచిస్తున్నారు. (చదవండి: కరోనా కట్టడిలో ఆ నగరాలు ఫస్ట్) -
కాలుష్యం బతికి ‘బట్ట’కట్టదు!
రెండు వందల కోట్లు.. ఏటా అమ్ముడయ్యే టీషర్ట్‌ల సంఖ్య ఇది. 440 పార్ట్స్ పర్ మిలియన్.. రికార్డుస్థాయికి చేరిన వాతావరణ కాలుష్యానికి ఓ లెక్క ఇది. టీషర్ట్‌లకు.. కాలుష్యానికి సంబంధం ఏమిటి? అనుకుంటున్నారా..! ఇప్పటివరకూ లేదు.. ఇకపై మాత్రం బోలెడంత ఉంటుంది. ఎందుకంటారా? టీషర్ట్ వేసుకుంటే కాలుష్యం తగ్గిపోతుంది కాబట్టి..!!! ఆగండాగండి.. మీరు మామూలుగా వేసుకునే టీషర్ట్‌తో ప్రయోజనం ఒక్కటే. ఒళ్లు కప్పుతుందంతే. అదే ఈ ఫొటోలో చూపించిన టీషర్ట్ వాడటం మొదలుపెట్టారనుకోండి. ఒక్కదెబ్బకు రెండు పిట్టలన్నట్లు గాల్లోని కాలుష్యాన్ని కూడా శుభ్రం చేసేయొవచ్చు. ఇటలీ కంపెనీ క్లాటర్స్ తయారు చేసిన ఈ వినూత్న టీషర్ట్ పేరు ‘రిపేయిర్’. ఛాతీ భాగంలో మూడు పొరలు ఉన్న వస్త్రాన్ని ఉంచుకుంటే చాలు.. మీరు అటు ఇటూ కదిలేటప్పుడు సోకే గాలిలో ఉండే ప్రమాదకరమైన విషవాయువులను పీల్చేసు కుంటుంది. స్వచ్ఛమైన గాలి మాత్రమే విడుదలయ్యేలా చేస్తుంది. ఫ్యాషన్ ఆసరాగా కాలుష్యంపై అవగాహన పెంచడం రిపేయిర్ అభివృద్ధి వెనుక ఉన్న లక్ష్యమని అంటున్నారు క్లాటర్స్ వ్యవస్థాపకులు ఫెడ్రికో సురియా, మార్కో లోగ్రీకో, సిల్వియో పెరుకాలు. మూడు పొరలు.. ఆరు రకాల కాలుష్యాలు.. రిపేయిర్ టీషర్ట్ ఛాతీ భాగంలో ఉండే ప్రత్యేక వస్త్రాన్ని ‘ద బ్రీత్’అని పిలుస్తున్నారు. అనిమోటెక్ అనే కంపెనీ తయారు చేసింది దీన్ని. ముందుగా చెప్పుకున్నట్లు ఇందులో మూడు పొరలు ఉంటాయి. ఒక్కోటి అతిసూక్ష్మమైన జల్లెడలాంటిది. ఎంత సూక్ష్మమంటే.. నానోస్థాయిలో ఉండే కాలుష్యాలను కూడా ఒడిసి పట్టగలిగేంత. గాల్లో ఉండే నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్లు, బెంజీన్ వంటి ప్రమాదకరమైన, కేన్సర్ కారకమైన వాయువులు ఒక పొరలోని జల్లెడలో చిక్కుకుపోతాయి. రెండోపొరలో ఉన్న ప్రత్యేకమైన పోగులు బ్యాక్టీరియాను చంపేస్తాయి. మూడో పొరకు దుర్వాసనలను పీల్చేసుకునే లక్షణం ఉంటుంది. ఈ మూడు ఒక్కటిగా పనిచేయడం ద్వారా ఎక్కడికక్కడ గాలి శుభ్రమవుతూంటుంది. స్వచ్ఛమైన గాలి మాత్రమే బయటకు వస్తూంటుంది. అనిమోటెక్ ద బ్రీత్ను ఇప్పటికే యూనివర్సిటీ పాలిటెక్నికా డెల్లే మార్సేలో పరీక్షించింది కూడా. సల్ఫర్ డయాక్సైడ్లను ఈ వస్త్రం 92 శాతం వరకూ ఒడిసి పట్టగలదని.. అదే సమయంలో నైట్రోజన్ ఆక్సైడ్లను 86 శాతం, ప్రమాదకరమైన సేంద్రీయ కణాలను 97 శాతం వరకూ తనలో నిక్షిప్తం చేసుకోగలదని ఈ పరీక్షల్లో రుజువైంది. టీషర్ట్లోని పొరలో పెట్టుకునే ద బ్రీత్ను ఏడాదికి ఒకసారి మార్చుకుంటే చాలు. ఎలాంటి శక్తిని వాడకుండా గాలిని శుభ్రం చేస్తూ ఉండవచ్చు. ద బ్రీత్ను ఇళ్లల్లో ఎయిర్ ప్యూరిఫయర్ల మాదిరిగా, బహిరంగ ప్రదేశాల్లో భారీ హోర్డింగ్‌లపై ప్రకటనల కోసమూ వాడుకోవచ్చని అనిమోటెక్ అంటోంది. ఒక టీషర్ట్.. రెండు కార్ల కాలుష్యం.. ద బ్రీత్‌తో కూడిన రిపేయిర్ టీషర్ట్‌ను ఏడాదిపాటు వాడితే దాదాపు రెండు కార్ల నుంచి వెలువడే కాలుష్యం వాతావరణంలోకి చేరకుండా అడ్డుకోవచ్చని క్లాటర్స్ అంటోంది. భూమ్మీద మొత్తం వంద కోట్ల కార్లు ఉన్నాయనుకుంటే.. రెండు వందల కోట్ల టీషర్ట్‌లలో ద బ్రీత్ ఏర్పాటైతే వాయు కాలుష్యం గణనీయంగా తగ్గిపోతుందని ఫెడ్రికో సురియా అంటున్నారు. క్లాటర్స్ ప్రస్తుతం నిధుల సేకరణ కోసం కిక్‌స్టార్టర్‌లో ప్రత్యేకమైన ప్రచారాన్ని చేపట్టింది. ఒక్కో రిపేయిర్ టీషర్ట్‌ను 29 యూరోల (రూ.2,400)కు అమ్ముతోంది. వాణిజ్యస్థాయి ఉత్పత్తి ప్రారంభిస్తే దీని ధర రూ.3,600 అవుతుందని సురియా అంటున్నారు. ఇంకొన్ని నెలల్లో టీషర్ట్‌లతోపాటు ట్రాక్ సూట్లు, జాకెట్లను విడుదల చేస్తామని చెబుతున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
గాలి.. కొనాలి..
గాలి కొనాలి! అవును మరి.. చైనాలో ఫ్రెష్ ఎయిర్ కావాలంటే మీరు ఆ పని చేయాల్సిందే. మినరల్ వాటర్ బాటిళ్ల తరహాలో ఈ ఫ్రెష్ ఎయిర్ బాటిళ్లను కూడా పైసలిచ్చి కొనాల్సిందే. చైనాలో ఇటీవల వాయు కాలుష్యం బాగా పెరిగిపోవడంతో పర్యాటకులకు ఆక్సిజన్ బాటిళ్లను అమ్మాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అక్కడి వాయు కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో చైనా ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. పర్యాటక పథకంలో భాగంగా దేశంలోని ఎకో టూరిజం జోన్లుగా పేరొందిన ఫాన్జింగ్, లీగాంగ్ పర్వత ప్రాంతాల వద్ద గాలిని సేకరించి..జూన్ 20 నుంచి అమ్మనున్నారు. ఫాన్జింగ్, లీగాంగ్ పర్వత ప్రాంతాల వద్ద అత్యంత పరిశుద్ధమైన గాలి దొరుకుతుందట. ప్రధానంగా గుజౌ ప్రావిన్స్‌లో వీటిని ఎక్కువగా అమ్మనున్నారు. ఈ మేరకు ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ అనుమతి కూడా ఇచ్చారు. ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారన్న దాన్ని నిర్ణయించడంలో నాణ్యమైన గాలి కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు. ఇక ప్రైవేటు సంస్థలైతే.. ప్రభుత్వం కంటే ముందుగానే అమ్మడానికి సన్నాహాలు చేసేసుకుంటున్నాయి.