Fudan University
-
అమెరికాపై నిప్పులు చెరిగిన ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: అగ్రరాజ్యం అమెరికాపై పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నిప్పులు చెరిగారు. వ్యూహాత్మక లక్ష్యాలు సాధించుకొనేందుకు పాకిస్తాన్‌ను ఉపయోగించుకోవడం, అవసరం తీరాక పక్కన పెట్టేయడం, పైగా ఆంక్షలు విధించడం అమెరికాకు అలవాటుగా మారిపోయిందని దుయ్యబట్టారు. ‘మిత్ర’ దేశం చైనా తమకు అండగా నిలుస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరీక్షా సమయంలో చైనా తమను ఆదుకుంటోందని అన్నారు. చైనా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడాన్ యూనివర్సిటీ సలహా కమిటీ డైరెక్టర్ ఎరిస్ లీకి ఇమ్రాన్ ఖాన్ ఇటీవల ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ వివరాలను న్యూస్ ఇంటర్నేషన్ పత్రిక శుక్రవారం బహిర్గతం చేసింది. ఇంటర్వ్యూలో ఓ ప్రశ్నకు ఇమ్రాన్ ఖాన్ బదులిస్తూ.. గతంలో అమెరికాతో పాకిస్తాన్‌కు సన్నిహిత సంబంధాలు ఉండేవని చెప్పారు. ఇప్పుడు పాక్ అవసరం లేదని అమెరికా భావిస్తోందని, అందుకే దూరం పెడుతోందని పేర్కొన్నారు. అవసరం ఉన్నప్పుడల్లా మళ్లీ తమ దేశానికి దగ్గర కావడం అగ్రరాజ్యం విధానమని అన్నారు. అవసరం తీరాక తమవైపు కన్నెత్తి కూడా చూడదని ఆక్షేపించారు. 1980వ దశకంలో పాక్–యూఎస్ సంబంధాలను ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావించారు. అప్పట్లో సోవియన్ యూనియన్ సైనిక దళాలు అఫ్గానిస్తాన్‌లో అడుగుపెట్టాక అమెరికా తమ దేశంతో చేతులు కలిపిందన్నారు. సోవియట్ యూనియన్ను అడ్డుకోవడానికి పాకిస్తాన్‌ను వాడుకుందని తెలిపారు. అఫ్గాన్ నుంచి సోవియట్ యూనియన్ సైన్యం వెనక్కి వెళ్లిపోయాక పాక్‌పై అమెరికా ఆంక్షలు విధించిందని మండిపడ్డారు. సెప్టెంబర్ 11(9/11) దాడుల అనంతరం పాక్–అమెరికా మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని గుర్తుచేశారు. గత ఏడాది చోటుచేసుకున్న అఫ్గానిస్తాన్ పరిణామాల తర్వాత తమ దేశాన్ని ఆమెరికా నిందిస్తోందని తప్పుపట్టారు. చైనా–పాకిస్తాన్ గత 70 ఏళ్లుగా పరస్పరం చక్కగా సహకరించుకుంటున్నాయని ఇమ్రాన్ ఖాన్ ఉద్ఘాటించారు. -
రక్తంతో సెల్‌ఫోన్ చార్జింగ్
బీజింగ్ : మానవుల శరీరంలోని రక్తనాళాల్లో ప్రవహించే రక్త పీడనంతోనే విద్యుత్ ఉత్పత్తి అయితే వైద్యవిజ్ఞాన పరంగా ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు. అదే విద్యుత్‌తో మన సెల్‌ఫోన్‌ను చార్జి చేసుకోగలిగితే మొబైల్ రంగంలో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకరావచ్చు. సరిగ్గా ఈ దిశగానే చైనాలో ఫుడాన్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు విజయం సాధించారు. మానవుల శరీరంలోని రక్త ప్రవాహంతో సెల్‌ఫోన్‌ను చార్జి చేసుకోవచ్చని నిరూపించారు. రక్త ప్రవాహం నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అతి తేలికపాటి విద్యుత్ జనరేటర్‌ను ఫైబర్‌తో తయారు చేసిన నానో కార్బన్ గొట్టాల ద్వారా రూపొందించారు. దీన్ని ‘ఫైబర్ షేప్డ్ ఫ్లూడిక్ నానో జనరేటర్ (ఎఫ్ఎఫ్ఎన్జీ)’గా వ్యవహరిస్తున్నారు. దీన్ని ఎలక్ట్రోడ్స్‌తో అనుసంధానించి ఓ ద్రావకంలోకి పంపించి ద్రావకాన్ని రక్తనాళాల్లోకి పంపించారు. ఎఫ్ఎఫ్ఎన్జీ, ద్రావకం మధ్య ఉత్పన్నమైన తరంగాల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఇంతవరకు జరిపిన ఇలాంటి ప్రయోగాలకన్నా ఈ ప్రయోగం ద్వారా ఎక్కువ విద్యుత్, అంటే 20 శాతం విద్యుత్ ఉత్పత్తి అయిందని పరిశోధకులు తెలిపారు. వాస్తవానికి సెల్‌ఫోన్‌ను చార్జి చేసుకోవడం కన్నా గుండెకు అమర్చే పేస్‌మేకర్ లాంటి వైద్య పరికరాలకు అవసరమైన విద్యుత్‌ను ఈ పద్ధతి ద్వారా ఉత్పత్తి చేయడం ఉత్తమమైన మార్గమని పరిశోధకులు తెలిపారు. నీటి ప్రవాహాన్ని ఉపయోగించి టర్బైన్ల ద్వారా విద్యుత్‌ను ఎలాగైతే ఉత్పత్తి చేస్తామో అలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రక్త ప్రవాహం ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తిని చేయగలిగామని చెప్పారు. మానవ రక్తంలోకి నానో విద్యుత్ జనరేటర్ లేదా దానికి సంబంధించిన ద్రావకాన్ని పంపించినట్లయితే రక్త ప్రవాహానికి ఎక్కడైనా అవాంతరం ఏర్పడే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. పైగా తాము ఈ ప్రయోగాన్ని కప్పల రక్తనాళాలపై జరిపి విజయం సాధించామని, ఇంకా మానవ రక్త నాళాలపై పరిశోధనలు జరపాల్సి ఉందని వారు చెప్పారు. -
ఫుడాన్ యూనివర్శిటీలో గీతా పఠనం
-
ఫుడాన్ యూనివర్శిటీలో గీతా పఠనం
షాంఘై: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మూడోరోజు పర్యటనలో భాగంగా చైనాలోని షాంఘై పట్టణంలో ఉన్న ఫుదాన్ యూనివర్సిటీని శనివారం సందర్శించారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. రెండు యూనివర్సిటీల విద్యార్థులను కలవడం ఆనందంగా ఉందన్నారు. విదేశాల్లో యూనివర్సిటీల విద్యార్థులను కలవడం చాలా అరుదుగా నాయకులకు లభిస్తుందని అలాంటి అవకాశం తనకు లభించడం సంతోషంగా ఉందని తెలిపారు. భారత్-చైనా సత్సంబంధాలతో భవిష్యత్తరాలకు చాలా మేలు జరుగుతుందన్నారు. మోదీ ప్రసంగం ముగియగానే మోదీ, మోదీ అంటూ ఫుదాన్ యూనివర్సిటీలో నినాదాలు మార్మోగాయి. మరోవైపు మోదీని చూసేందుకు ఫుదాన్ వర్సిటీకి ఎన్నారైలు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా మోదీతో పలువురు ఎన్నారైలు సెల్ఫీలు దిగారు. ప్రపంచానికి రెండు ప్రధాన సవాళ్లు ఉన్నాయని ఒకటి ఉగ్రవాదం, రెండోది గ్లోబల్ వార్మింగ్ అన్నారు. ఉగ్రవాదంపై పోరాటానికి గాంధేయ మార్గమే మంచిదని భావిస్తున్నామన్నారు. అలాగే గ్లోబల్ వార్మింగ్‌కు కూడా గాంధీయే మార్గమే సరైందన్నారు. ఈ సందర్భంగా యూనివర్శిటీలోని చారిత్రాత్మకమైన సెంటర్ ఫర్ గాంధీయన్ అండ్ ఇండియన్ స్టడీస్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతిపితి గాంధీ మహాత్ముని సిద్దాంతాలు, ఆచరణ ప్రపంచంలో వున్న మానవులందరికీ ఆదర్శం కావాలన్నారు. ఆయన విశ్వమానవుడని, యుగపురుషుడని ప్రధాని కొనియాడారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో చైనా విద్యార్థులు భగవద్గీతను శ్లోకాలను పఠించారని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి విశ్వరూప్ ట్విట్ చేశారు.