funds usage
-
ఆ విషయంలో వెనుకబడ్డ చట్టసభ సభ్యులు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (ఏసీడీపీ) కింద ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను వినియోగించుకోవడంలో చట్టసభల సభ్యులు వెనకబడి ఉన్న ట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో అత్యవసర కార్యక్రమాలు, అభివృద్ధి పనులను వేగంగా జరపాలనే ఉద్దేశంతో ఏటా ప్రభుత్వం విడుద ల చేస్తున్న ఏసీడీపీ నిధుల్లో సగం మేర ఖజానాలోనే మూలుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎంపీ ల్యాడ్స్ తరహాలో క్రమం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేస్తున్నప్పటికీ వినియోగం మాత్రం పూర్తి స్థాయిలో ఉండడంలేదు. ఒక్కో సభ్యుడికి ఏటా రూ.3 కోట్ల చొప్పున ప్రభుత్వం ఇస్తుండగా... వీటిని తమ విచక్షణాధికారంతో ఖర్చు చేసే వెసులుబాటు ఉంది. (చదవండి: బెంజి కార్లలో వచ్చి కల్లు తాగుతున్నారు.. ) ఐదేళ్లలో 1,900 కోట్లు... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 2014–15 వార్షిక సంవత్సరం నుంచి 2018–19 వార్షిక సంవత్సరం వరకు ఐదేళ్ల కాలంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఏసీడీపీ నిధుల కింద రూ.1,900 కోట్లు విడుదల చేసింది. అయితే వీటిలో కేవలం రూ.1,228.93 కోట్లు ఖర్చు చేశారు. అంటే విడుదల చేసిన నిధులలో కేవలం 64.66 శాతం మాత్రమే ఖర్చు చేయగా.. మిగతావన్నీ ఖజానాలో మూలుగుతున్నాయి. ఖర్చు కాని నిధులను క్యారీఫార్వర్డ్ చేసే వెసులుబాటు ఉన్నప్పటికీ సకాలంలో వీటిని వినియోగించకపోవడంతో ఆశిం చిన ప్రయోజనం కలగడం లేదు. ఎమ్మెల్యేలు కాస్త నయం... ఏసీడీపీ కార్యక్రమం కింద విడుదలైన నిధులను ఖర్చు చేయడంలో ఎమ్మెల్సీల కంటే ఎమ్మెల్యేలు కాస్త ముందు వరుసలో ఉన్నారు. ఐదేళ్లలో ఎమ్మెల్యే కోటాలో ప్రభుత్వం రూ.1,440 కోట్లు విడుదల చేయగా... ఇప్పటివరకు రూ.974.85 కోట్లు (67.69 శాతం)ఖర్చు చేశారు. ఎమ్మెల్సీల కోటాలో రూ.460.5 కోట్లు విడుదల చేస్తే ఇప్పటివరకు రూ.254.08 కోట్లు (55.17శాతం)మాత్రమే ఖర్చు చేశారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే ఎమ్మెల్యేలు కాస్త ఎక్కువ నిధులు ఖర్చు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో వినియోగించకపోవడంతో నియోజకవర్గాల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. (చదవండి: తుపాకీతో మాజీ మంత్రి బెదిరింపులు) -
ప్రభుత్వ నిధుల వినియోగంలో మార్గదర్శకాలు ఇలా..
పశ్చిమగోదావరి, నిడమర్రు : ప్రభుత్వ ఉద్యోగులు/ఉపాధ్యాయులకు సంబంధించి నిధుల వినియోగంలో ఫైనాన్షియల్ కోడ్ రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. ప్రభుత్వం నుంచి విడుదల అయిన నిధులకు సంబంధించి నిబంధనలు ఫైనాన్షియల్ కోడ్‌లో పొందుపరిచి ఉన్నాయి. ప్రత్యేక నిబంధనలు లేని సందర్భంలో అవి స్థానిక సంస్థలకు కూడా వర్తిస్తాయి. ఆ కోడ్‌లో పొందుపరిచిన మార్గదర్శకాల్లో ముఖ్యమైనవి తెలుసుకుందాం. విడుదలైన నిధులకు ఏడాది గడువు ప్రభుత్వం కానీ సంబంధిత అధికారి కానీ విడుదల చేసిన నిధుల మంజూరు విషయంలో మంజూరు చేసిన తేదీ నుంచి సంవత్సరం అమల్లో ఉంటుంది. ఈ ఏడాదికాలంలో విడుదల చేసిన నిధులు వినియోగించని పక్షంలో ఆ మొత్తం సొమ్ములో కొంత భాగం కూడా విడుదల చేసిన తేదీ నుంచి ఏడాది తర్వాత ఏమాత్రం వినియోగించడం చెల్లదు. ఏ సందర్భంలోనైనా అధికంగా డ్రా చేసిన నిధులకు డ్రాయింగ్ అధికారే బాధ్యుడు అవుతారు. వేతన స్థిరీకరణ విషయంలో.. ఉద్యోగి వేతనంలో మూడో వంతుకు మించి పే బిల్లు నందు మినహాయింపులు ఉండరాదు.(దీనికి లోబడే బ్యాంక్‌లు లేదా ఇతర సంస్థలు అప్పులు మంజూరు చేస్తాయి). జీతంలో మినహాయింపులు మూడో వంతుకంటే తక్కువ ఉండకుండా సంబంధిత డ్రాయింగ్ అధికారి పరిశీలించాలి. ♦ వేతన స్థిరీకరణ వెనుకటి తేదీ నుంచి జరిగినప్పుడు దాని(నూతన పీఆర్సీ) ఆధారంగా టీఏ బకాయిలను క్లెయిమ్ చేయడానికి అనుమతించబడును. ♦ ఉద్యోగి ఆప్షన్ ఇచ్చినప్పటి నుంచి ఆరు నెలలలోగా వేతన స్థిరీకరణ చేయాలి. జీతభత్యాల విషయంలో... ఉద్యోగుల జీతభత్యాలను తదుపరి నెల ఒకటో తేదీన చెల్లించాలి. ♦ అన్ని మేనేజ్మెంట్లలోని ఉపాధ్యాయులకు ఏప్రిల్ జీతాన్ని వేసవి సెలవులు ప్రారంభానికి ముందు రోజే చెల్లించాలి. (సాధారణంగా వేసవి సెలవులు ప్రతీ ఏటా ఏప్రిల్ 23వ తేదీన ప్రకటిస్తారు) ఆ రోజు సెలవు రోజు అయినట్టయితే మరుసటి రోజు జీతం చెల్లించాలి. ♦ ట్రెజరీ ద్వారా జీతం పొందేవారు నెల చివరి రోజుకు 5 రోజులు మందుగా ట్రెజరీలో బిల్లులు సంబంధిత సిబ్బంది ద్వారా సమర్పించాలి. ♦ డ్రాయింగ్ అధికారి సంతకం చేసిన వార్షిక ఇంక్రిమెంట్/ప్రమోషన్ ఇంక్రిమెంట్/ఏదైనా ఇతర ఇంక్రిమెంట్‌కు సంబంధించిన ధ్రువీకరణ పత్రం ఆ ఉద్యోగి జీతం బిల్లుకు జతపరచాలి. ♦ పీఎఫ్, జీవిత బీమా, వృత్తి పన్ను, సహకార బ్యాంకులకు సంబధించిన తగ్గింపులు మాత్రమే జీతం బిల్లు నుంచి అధికారిక తగ్గింపులుగా పరిగణించాలి. ♦ ఉద్యోగి చెల్లించాల్సిన ఆదాయం పన్నును జీతం బిల్లుల నుంచి డ్రాయింగ్ అధికారే తగ్గించాలి. కనిపించకుండా పోయిన ఉద్యోగి విషయంలో.. కనిపించకుండా పోయిన ఉద్యోగి మరణించినట్టు ధ్రువీకరణ అయ్యేవరకూ అతని జీతభత్యాలు వారసులకు చెల్లించరాదు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్–1972 ప్రకారం ఏడేళ్లుగా కనిపించని ప్రభుత్వ ఉద్యోగి, అతడు మరణించినట్టు భావించి అతనికి సంబంధించిన చెల్లింపులకు అతని కుటుంబ సభ్యులకు చెల్లించాలి. అయితే సంవత్సరకాలం కనిపించని ఉద్యోగి కుటుంబానికి పెన్షన్ చెల్లించే అవకాశం 1987 నుంచి కల్పించారు. (కుటుంబ పెన్షన్‌కు అర్హతగల ఉద్యోగులకు మాత్రమే) ♦ ఉద్యోగి మరణించిన రోజుకు అతడు మరణించిన సమయం ఏదైననూ జీతం/సెలవు జీతం మొదలైనవి చెల్లిచాలి. సందేహం లేనపుడు లీగల్హేయిర్ ధ్రువీకరణ పత్రం దాఖలుచేయక పోయినా మరణించిన ఉద్యోగి వారసులకు అతని జీతభత్యాలు చెల్లిస్తారు. -
నిధుల వ్యయంలో స్వేచ్ఛనివ్వండి
స్థానిక అవసరాలను బట్టే పథకాల రూపకల్పన నీతి ఆయోగ్ భేటీలో సీఎం కేసీఆర్ రాష్ర్టంలో పలుపథకాలకు నిధులివ్వాలని ప్రధానికి విజ్ఞప్తి ప్రత్యేకాభివృద్ధి ప్యాకేజీ కోసమూ విన్నపం సాక్షి, న్యూఢిల్లీ: స్థానిక అవసరాలకు తగినట్టుగా నిధులివ్వాలని, కేంద్ర పథకాలను కూడా రాష్ట్రాలకనుగుణంగా మలచాలని కేంద్రాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కోరారు. ఆదివారం ఇక్కడ జరిగిన ‘నీతి ఆయోగ్’ పాలకమండలి సమావేశంలో ఆయన ఐదు నిమిషాలపాటు మాట్లాడారు. రాజీవ్ విద్యామిషన్ పథకాన్ని ఉదహరిస్తూ.. ఒక్కో రాష్ర్టంలో ఒక్కో విధంగా ఉన్న అవసరాలను ఈ సందర్భంగా సీఎం వివరించారు. కేంద్ర పథకాల కొనసాగింపుపై నీతి ఆయోగ్ పరిధిలో సబ్ కమిటీ వేయాలని కోరారు. దీంతో కేసీఆర్‌ను ప్రధాని మోదీ ప్రశంసించినట్టు సమాచారం. కేంద్ర నిధుల వ్యయంలో స్వేచ్ఛనివ్వాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్ర్టంలో అమలు చేస్తున్న వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ తదితర పథకాలకు కేంద్రం భారీగా నిధులు మంజూరు చేయాలన్నారు. కాగా, ఈ సమావేశం అనంతరం ప్రధానితో కేసీఆర్ ఐదు నిమిషాలపాటు విడిగా మాట్లాడారు. కేజీ నుంచి పీజీ వరకు నిర్బంధ విద్య అమలు, బలహీన వర్గాలకు ఇళ్ల నిర్మాణం వంటి అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. వీటన్నింటికీ నిధులు కావాలని కోరారు. అలాగే తెలంగాణకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ మంజూరు చేయాలని సీఎం విన్నవించారు.