GG YSR
-
పైరు దెబ్బతిన్నా పట్టించుకోవట్లేదు..
* పరిహారంపై స్పష్టత లేదు * గడప గడపకు వైఎస్సార్‌లో ముంపు బాధితుల గగ్గోలు సాక్షి, గుంటూరు: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయామని, ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరిస్తోందని, నష్టపరిహారం విషయంలో స్పష్టత లేకుండా పోయిందని యడ్లపాడు మండలం సందెపూడి గ్రామానికి చెందిన రైతులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన మర్రి నష్టపరిహారం అందించకుండా ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తే వైఎస్సార్సీపీ అండగా ఉండి పోరాడుతుందని హామీ ఇచ్చారు. జిల్లాలో శనివారం చిలకలూరిపేట, గురజాల, వినుకొండ, పెదకూరపాడు నియోజకవర్గాల్లో గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను నేతల ఎదుట మొర పెట్టుకున్నారు. నిత్యావసరాలూ పంపిణీ చేయలేదు... వరదల వల్ల తీవ్రంగా నష్టపోయామని, కనీసం బియ్యం, నిత్యావసర వస్తువులు కూడా ప్రభుత్వం పంపిణీ చేయలేదని దాచేపల్లి మండలం శంకరాపురం గ్రామానికి చెందిన భూక్యా నరసింహ నాయక్ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన జంగా.. పంటలు దెబ్బతిని, ఇళ్లలోకి నీరు చేరి నష్టపోయిన బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ అండగా ఉండి పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు. కార్యాలయాల చుట్టూ తిప్పుకొంటున్నారు... మరుగుదొడ్లు నిర్మించుకుంటే బిల్లులు ఇవ్వకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుకొంటున్నారని బొల్లాపల్లి మండలం పలుకూరు గ్రామానికి చెందిన చంద్రమ్మ అనే మహిళ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు ఎదుట వాపోయారు. రేషన్ కార్డులో తండ్రి పేరు లేకపోవడంతో దాన్ని చేర్చాలంటూ కార్యాలయం చుట్టూ రెండు నెలలుగా తిరుగుతున్నామని, అయినా అధికారులు స్పందించడం లేదని, అది లేకపోతే స్కాలర్‌షిప్పు పోయే ప్రమాదం ఉందని గ్రామానికి చెందిన బంకా దేవి అనే విద్యార్థిని బ్రహ్మనాయుడు ఎదుట వాపోయింది. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానంటూ బ్రహ్మనాయుడు వారికి హామీ ఇచ్చారు. -
సమస్యల నివేదన
ఆరు నియోజకవర్గాల్లో గడపగడపకు వైఎస్సార్ వైఎస్సార్సీపీ నేతల ఎదుట కష్టాలు ఏకరువు పెడుతున్న ప్రజలు సాక్షి, గుంటూరు: రేషన్ కార్డులు, గృహ రుణం కోసం దరఖాస్తు చేసి ఎన్నిసార్లు తిరిగినా మంజూరు కాలేదు.. వరదల్లో పంటలు దెబ్బతిన్నా ప్రభుత్వం ఇంతవరకు ఆదుకోలేదు.. గ్రామాల్లో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాథుడే లేడు.. అంటూ ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం జిల్లాలో శుక్రవారం ఆరు నియోజకవర్గాల్లో జరిగింది. ఈ సందర్భంగా స్థానికులు నేతలకు తమ సమస్యలు నివేదించారు. ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నారు.. రేషన్ కార్డు కోసం అధికారులకు అనేక సార్లు దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు మంజూరు కాలేదని గుంటూరు ఈస్ట్ నియోజకవర్గ పరిధిలోని రెండో డివిజన్ ఇజ్రాయిల్‌పేటకు చెందిన షేక్ పర్విన్ అనే మహిళ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా ఎదుట వాపోయారు. గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకున్నా కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారు తప్ప మంజూరు చేయడం లేదంటూ ఎం.చినమస్తాన్ ముస్తఫా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు దెబ్బతిన్నా పట్టించుకున్నవారు లేరు.. వరదల్లో పంటలు పూర్తిగా దెబ్బతిని తీవ్రంగా నష్టాలపాలయ్యామని, ప్రభుత్వం ఇంతవరకు ఆదుకోలేదంటూ రాజుపాలెం మండలం అంచులవారిపాలెం గ్రామానికి చెందిన తోటా శౌరయ్య అనే రైతు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికారప్రతినిధి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి ఎదుట వాపోయారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణం పథకం కింద ఇల్లు మంజూరు చేస్తామంటూ గ్రామానికి చెందిన కొందరు టీడీపీ దళారులు రూ.5 వేలు తీసుకున్నారని, ఇంతవరకు పట్టించుకోలేదని, డబ్బులు కూడా తిరిగి ఇవ్వటం లేదని గ్రామానికి చెందిన గణపా శారద అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. తాగేందుకు నీరు లేదు.. గ్రామాల్లో తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని, మద్యం మాత్రం ఏరులై పారుతోందని అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారంటూ చిలకలూరిపేట మండలం బొప్పూడికి చెందిన సుశీల అనే మహిళ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. రోగాల బారిన పడుతున్నాం.. దుగ్గిరాలలో కాఫీ ఫ్యాక్టరీ నుంచి వచ్చే మురుగునీరు వల్ల గ్రామంలోని తాగునీటి చెరువు కలుషితంగా మారి రోగాలబారిన పడుతున్నామంటూ తెనాలి మండలం కొలకలూరు బీసీ కాలనీకి చెందిన శివనాగేంద్రమ్మ, ప్రసాదం శ్రీనివాస్ నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో రోడ్లు వేసిన దాఖలాలు లేవని, గతంలో నిర్మించుకున్న ఇళ్లకు ఇంతవరకు బిల్లులు చెల్లించలేదని గ్రామానికి చెందిన జెట్టి మంగమ్మ, కొప్పర ప్రసాదరావు పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు ఎదుట వాపోయారు. గ్రామంలో కనీస మౌలిక వసతులైన తాగునీరు, డ్రెయినేజీ వ్యవ్యస్థ, వీధి దీపాలు సైతం ఏర్పాటు చేయలేదని, దీంతో తాము ఇబ్బందులు పడుతున్నామని బొల్లాపల్లి మండలం కనుమలచెరువు గ్రామానికి చెందిన వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడుకు వివరించారు. జనం సమస్యలపై నేతలు స్పందిస్తూ వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
గడప గడపకూ సమస్యలే!
* రేషన్ బియ్యం ఇవ్వడం లేదు * పంట నష్టం పరిహారం అందలేదు * వీధి దీపాలు వెలగవు * గ్రామాల్లో పేరుకుపోతున్న మురుగు సాక్షి, అమరావతి బ్యూరో : ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేయడం లేదని, వీధి దీపాలు వెలగవని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని జిల్లాలో పలువురు ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో వాపోయారు. గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం మంగళవారం గుంటూరు తూర్పు, తాడికొండ, వినుకొండ, పొన్నూరు, తెనాలి, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో జరిగింది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఇజ్రాయిల్‌పేటకు చెందిన రఫ్ ఉన్నిసా అనే మహిళ వీధి దీపాలు వెలగడం లేదని ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫాకు తెలిపారు. ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు మంజూరు కాలేదని కోటేశ్వరమ్మ అనే మహిళ ఎమ్మెల్యే ఎదుట వాపోయింది. అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని వారికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తాడికొండ నియోజకవర్గం తుళ్లూరు మండలం దొండపాడుకు చెందిన ఎ.జ్యోతి అనే మహిళ గ్రామంలో పంచాయతీ ద్వారా నీటి సరఫరా జరగడం లేదని, నియోజకవర్గ సమన్వయకర్త హెనీ క్రిస్టినా దష్టికి తీసుకొచ్చారు. గ్రామంలో మట్టిరోడ్లు కావడం, కాలువలు సరిగా లేకపోవడంతో రోడ్లు బురదమయంగా మారుతున్నాయని సలోమి అనే మహిళ ఫిర్యాదు చేశారు. అన్ని అర్హతలు ఉన్నా పింఛన్ రావడం లేదని పోలు రాజు అనే వ్యక్తి సమన్వయకర్త ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టం జరిగినా... అకాల వర్షాలకు పంట నష్టం జరిగినా ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి పరిహారం అందలేదని వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం శానంపూడి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, సిద్ధయ్య నియోజకవర్గ సమన్వయకర్త బొల్లాబ్రహ్మనాయుడు దృష్టికి తీసుకొచ్చారు. గ్రామంలో వీధి లైట్లు, మురుగు కాల్వలు, మంచినీటి పథకం సరిగా పనిచేయడం లేదని మానపాటి శ్రీనివాస్ తెలిపారు. పొన్నూరు పట్టణంలో 3వ వార్డుకు చెందిన దుర్గమ్మ అనే మహిళ పింఛను రావడం లేదని నియోజకవర్గ సమన్వయకర్త రావి వెంకటరమణకు ఫిర్యాదుచేశారు. గ్యాస్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకు మంజూరు చేయలేదని, జన్మభూమి కమిటీలు సిఫార్సు చేస్తేనే గ్యాస్ ఇస్తామని అంటున్నారని నాగేశ్వరమ్మ అనే మహిళ వాపోయింది. పింఛను రావడం లేదు.. తెనాలి మండలం కొలకలూరు ముస్లిం కాలనీకి చెందిన మహిళలు షేక్ బీనాబి, రహీమున్నీసా, ఫాతిమున్నిసా, నాగరత్నమ్మ తమకు పింఛను అందడం లేదని నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ ఎదుట వాపోయారు. గ్రామంలో సైడు కాల్వలు లేక మురుగునీరు ప్రవహిస్తోందని, బ్లీచింగ్, సున్నం కూడా వేయడం లేదని, దీంతో దోమల విపరీతంగా పెరిగిపోయాయని జిలానీ, జానీ, రఫీముల్లా పేర్కొన్నారు. రేషన్ బియ్యం అందడం లేదు.. చిలకలూరిపేట రూరల్ మండలం వేలూరుకు చెందిన ఛాయమ్మ అనే మహిళ మంచంలో నుంచి కదలలేకుండా ఉన్నానని, ఐరిస్, ఫింగర్‌ప్రింట్స్ పనిచేయడం లేదని, అందుకని నాకు రేషన్ బియ్యం ఇవ్వడం లేదని నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం ఇల్లు నిర్మించుకున్నా ఇంత వరకు బిల్లులు ఇవ్వలేదని శ్యామల అనే మహిళ వాపోయింది. ఇప్పుడు జన్మభూమి కమిటీలు సిఫార్సు చేస్తే ఇల్లు మంజూరు చేస్తామని అంటున్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు పలు సమస్యలను వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిల దృష్టికి తీసుకు రాగా, మీకు అండగా ఉండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని వారు భరోసా ఇచ్చారు. -
నడక యాతన.. పారిశుద్ధ్యం రోత
* వీధి లైట్లు లేక రాత్రిళ్లు భయం భయం * అందని ద్రాక్షగా మారిన రుణమాఫీ * నకిలీ విత్తనాలతో నిండా మునిగాం.. ఆదుకోండి * ‘గడప గడపకు వైఎస్సార్’లో ప్రజానీకం సమస్యల ఏకరువు సాక్షి, అమరావతి బ్యూరో: గ్రామాల్లో అంతర్గత రోడ్లు నరకకూపంగా ఉన్నాయని, పారిశుద్ధ్యం అధ్వానంగా మారిందని పలు గ్రామాల ప్రజలు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జుల దృష్టికి తీసుకొచ్చారు. సోమవారం ‘గడప గడపకు వైఎస్సార్’ కార్యక్రమం గుంటూరు తూర్పు, తెనాలి, వినుకొండ, తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో జరిగింది. ఈ సందర్భంగా జనం తాము పడుతున్న ఇబ్బందులను నేతలకు వివరించి పరిష్కరించాలని కోరారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని రెండో డివిజన్లోని గాంధీనగర్‌కు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి డ్రెయిన్లలో నీరు నిల్వ ఉంటోందని, ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరిగాయని, దీంతో దోమల బెడద తీవ్రంగా ఉందని ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా దృష్టికి తీసుకొచ్చాడు. ఆర్టీసీ కాలనీలో రోడ్లు సరిగా లేవని, నడవాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని స్థానికులు ఎమ్మెల్యేకు తెలిపారు. విద్యుత్ తీగలు వేలాడుతూ భయపెడుతున్నాయని హరీష్ ఆవేదన వ్యక్తం చేశాడు. స్పందించిన ఎమ్మెల్యే పూడిక, పిచ్చిమొక్కలను పొక్లయినర్ల ద్వారా తొలగించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. విద్యుత్ సమస్యపై అధికారులతో చర్చించారు. తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం మండలం బేతపూడి గ్రామంలో రాత్రి వేళల్లో తిరగాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వీధి లైట్లు లేవని గాలి బిక్షమ్మ నియోజకవర్గ కన్వీనర్ కత్తెర సురేష్ దృష్టికి తీసుకొచ్చారు. తుళ్లూరు మండలం దొండపాడు గ్రామ పంచాయతీ పరిధిలో సమస్యలపై స్పందించడం లేదని అచ్చయ్య, సుహాసిని నియోజకవర్గ ఇన్చార్జి కత్తెర హెనీ క్రిస్టినా దృష్టికి తెచ్చారు. వర్షాలు పడితే కాలువలు నిండి నీరు బయటకు వెళ్లడం లేదని, అష్టకష్టాలు పడాల్సివస్తోందని గ్రామస్తులు పేర్కొన్నారు. తెనాలి పట్టణంలోని కొలకలూరుకు చెందిన చొప్పయ్య అనే రైతు ఆంధ్రా బ్యాంకులో రెండేళ్ల క్రితం రూ. 40వేలు రుణం తీసుకున్నానని, మాఫీ కాలేదని నియోజకవర్గ ఇన్చార్జి అన్నాబత్తుని శివకుమార్ దృష్టికి తెచ్చాడు. తమ వీధిలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఖాసిం, వెంకటరావు, కరీముల్లా, విశ్వేశ్వరరావులు ఫిర్యాదు చేశారు. వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం పలుకూరు పంచాయతీ రామాపురం గ్రామానికి చెందిన ఎస్.కె.మౌలాలి, షేక్ బోడయ్యలు నకిలీ మిర్చి విత్తనాలతో నిండా మునిగామని వాపోయారు. ఎస్.మౌలాలి అనే రైతు మూడు ఎకరాల్లో పంటను సాగు చేశానని, రూ. 50వేలకు పైగా పెట్టుబడి అయిందని వివరించారు. షేక్ బోడయ్య ఐదు ఎకరాల్లో పంట సాగు చేశానని, ఇప్పటి వరకు రూ. 80వేలకు పైగా పెట్టుబడి పెట్టానని, నకిలీ విత్తనాలు కావడంతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని నియోజకవర్గ ఇన్చార్జి బొల్లాబ్రహ్మనాయుడు దృష్టికి సమస్యను తీసుకొచ్చారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపుతామని ప్రజలకు భరోసా ఇస్తూ గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమాన్ని ఆ పార్టీ నేతలు చేపట్టారు. తాగేందుకు నీరు లేదు.. గుంటూరు రూరల్ మండలం అంకిరెడ్డిపాలెంలో నాలుగేళ్లుగా తాగేందుకు సరిగా నీరందక ఇబ్బందులు పడుతున్నామని రోశమ్మ అనే మహిళ నియోజకవర్గ ఇన్చార్జి మేకతోటి సుచరితకు తెలిపారు. ఎస్సీ కాలనీలో అంతర్గత రోడ్ల గురించి పట్టించుకున్న నాథుడే లేరని ఎం.ప్రభావతి తమ సమస్యను ఇన్చార్జి దృష్టికి తీసుకొచ్చారు. -
కష్టాలు వింటూ.. భరోసా ఇస్తూ..
* కొనసాగుతున్న గడప గడపకు వైఎస్సార్ * టీడీపీ నేతల హామీలు నమ్మి మోసపోయామంటూ వైఎస్సార్సీపీ నేతల ఎదుట జనం ఆవేదన సాక్షి, గుంటూరు: ‘గత ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారు.. అధికారంలోకొచ్చాక వాటి అమలే మరిచా రు.. జనాన్ని నిలువునా మోసంచేశారు..’ అంటూ వైఎస్సార్సీపీ నేతల ఎదుట జనం ఆవేదన వ్యక్తంచేశారు. గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం శనివారం రేపల్లె, బాపట్ల, చిలకలూరిపేట, తెనాలి, తాడికొండ నియోజకవర్గాల్లో జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంటింటికీ వెళ్లి టీడీపీ పాలనపై ప్రజాబ్యాలెట్ అందజేస్తూ అధికార పార్టీ వైఫల్యాలను వివరించారు. చెరుకుపల్లి మండలం గొలుసులపాలెంలో డ్వాక్రా మహిళలు వెంకటేశ్వరమ్మ, సులోచన, విజయకుమారి మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామంటూ టీడీపీ నేతలు ఎన్నికల ముందు హామీ ఇచ్చి మోసం చేశారని, రుణమాఫీ జరగకపోగా, వడ్డీలు పెరిగిపోయి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని వాపోయారు. టీడీపీ నేతలు ఈసారి ఏముఖం పెట్టుకుని ఓట్ల కోసం వస్తారో చూస్తామని స్పష్టం చేశారు. దీనిపై మోపిదేవి స్పందిస్తూ వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే మహిళల కష్టాలు తీరుస్తామంటూ వారికి భరోసా ఇచ్చారు. ఆ మూడు వేలు కూడా తీయనీయడం లేదు.. డ్వాక్రా రుణమాఫీ జరగకపోగా, బ్యాంకులో మొదటివిడతగా వేసిన రూ.3 వేల మూలధనాన్ని సైతం బ్యాంకర్లు డ్రా చేసుకోనీయడం లేదని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఎదుట పిట్టలవానిపాలెం మండలం కక్కుర్తివారిపాలేనికి చెందిన దాసరి సుందరమ్మ అనే మహిళ వాపోయింది. ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు ఇప్పిస్తామంటూ ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తరువాత పట్టించుకోవడం లేదంటూ అదే గ్రామానికి చెందిన సాంబమ్మ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. త్వరలో రాజన్న పాలన రాబోతోందని, అప్పుడు మహిళలందరికీ న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా కోన రఘుపతి వారికి హామీ ఇచ్చారు. పింఛను ఇవ్వటం లేదు.. అయ్యా రేషన్ కార్డు లేదు.. ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా ఇవ్వడం లేదంటూ చిలకలూరిపేట పట్టణం 34వ వార్డుకు చెందిన రామసుబ్బాయమ్మ, భర్త చనిపోయి ఇబ్బంది పడుతుంటే వితంతు పింఛను ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ శౌరమ్మ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఎదుట వాపోయారు. దీనిపై మర్రి స్పందిస్తూ.. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మహిళల కష్టాలన్నీ తీరుతాయంటూ భరోసా ఇచ్చారు. * దుగ్గిరాలలో కాఫీ పొడి ఫ్యాక్టరీ నుంచి వచ్చే మురుగునీరు తాగునీటిలో కలిసి పోయి రోగాలబారిన పడాల్సి వస్తోందని తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని కల్యాణమండపం ఏరియాకు చెందిన బాకిరాజు, జిలానీ, సుబ్బయ్య నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్‌కు వివరించారు. * డ్వాక్రా రుణమాఫీ కాకపోవడంతో వడ్డీలు పెరిగిపోయి పొదుపు డబ్బును బ్యాంకులు జమ చేసుకుంటున్నాయంటూ ఫిరంగిపురం మండలం బేతపూడికి చెందిన ఆకారపు మల్లేశ్వరి అనే మహిళ నియోజకవర్గ ఇన్చార్జి కత్తెర హెనీ క్రిస్టినా ఎదుట వాపోయింది. స్పందించి న క్రిస్టినా వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే మహిళల కష్టాలుతీర్చుతామని హామీఇచ్చారు. -
వీధి దీపాలు ఆర్పేస్తున్నారు..
ఏ వీధిలోకి వెళ్తే ఆ వీధిలోనే లైట్ల ఆర్పివేత చిలకలూరిపేటలో అధికార పార్టీ కుట్రలు గడపగyýlపకు వైఎస్సార్ కార్యక్రమానికి.. అడ్డంకులు సృష్టించే యత్నం చిలకలూరిపేట టౌన్ : చిలకలూరిపేట పట్టణంలో గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగటం అధికారపార్టీకి కంటగింపుగా మారింది. కార్యక్రమానికి లభిస్తున్న విశేష ఆదరణ, ప్రజాస్పందనను చూసి ఓర్వలేక ఏదో రకంగా అవాంతరాలు సృష్టించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అధికారం చేతిలో ఉందికదా అని అహంకారంతో అధికార దుర్వినియోగానికి తెరతీసింది. గత నెల 8వ తేదీన నియోజకవర్గంలో ప్రారంభమైన గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమానికి రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ గురించి సమాచారం సేకరిస్తున్న అధికార పార్టీ నాయకులు విద్యుత్ సరఫరా నిలిపివేసి సమస్యలు సృష్టిస్తున్నారు. గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం పట్టణంలో ప్రతిరోజు సాయంత్రం ప్రారంభమై రాత్రి వరకు కొనసాగుతోంది. దీంతో ఏ వీధిలో కార్యక్రమం జరుగుతుందో ఆ వీధి దీపాలు వెలగకుండా విద్యుత్ సరఫరా నిలిపి వేయిస్తున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు వీధిలోని ఒక లైను దాటి మరో లైనుకు వెళ్లాక కార్యక్రమం ముగిసిన లైనులో వీధి దీపాలు వెలుగుతున్నాయి. కొత్తగా ప్రవేశించినలైనులో వీధిలైట్లు ఆరిపోతున్నాయి. ఈ రకంగా అవాంతరాలు సృష్టిస్తుండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చార్జింగ్ లైట్లను తెచ్చి ఆ వెలుగులోనే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అధికార పార్టీ చేస్తున్న ఈ అనైతిక చర్య పట్ల ప్రజలు ఏహ్యభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు ఏమాత్రం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
మోసం.. చంద్రబాబు నైజం
వెయ్యి అబద్ధాలతో అధికారం జగన్మోహన్రెడ్డి పాలన కోసం ప్రజల ఎదురుచూపు బహిరంగ సభలో వైఎస్సార్సీపీ నాయకులు బాపట్ల: దివంగత ముఖ్యమంత్రి డాక్టరు రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన పాదయాత్రకు చంద్రబాబునాయుడు చేసిన పాదయాత్రకు ఎంతో వ్యత్యాసం ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఎమ్మెల్యే కోన రఘుపతి గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం ప్రారంభించి నెల రోజుల పూర్తయిన సందర్భంగా బాపట్ల పట్టణంలోని జమ్ములపాలెం పై ్లఓవర్ బ్రిడ్జి వద్ద మంగళవారం భారీ బహిరంగ స¿¶ నిర్వహించారు. సభలో ప్రసాదరావు మాట్లాడుతూ రాజశేఖర్‌రెడ్డి 2004లో చేపట్టిన పాదయాత్ర ద్వారా పేద ప్రజల సమస్యలు తెలుసుకుని వారి కోసం ఉచిత పథకాలు ప్రవేశపెట్టి ఆదుకున్నారని, చంద్రబాబు కేవలం అధికార దాహం, భూదందా, మోసం చేయటం కోసమే పాదయాత్ర నిర్వహించారని విమర్శించారు. ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే అతిపెద్ద కుంభకోణం పట్టిసీమ అని ఆయన విమర్శించారు. కోనను కొనే దమ్ము ఉందా.. ఇటీవల గుడిపూడి గ్రామాన్ని సందర్శించినప్పుడు అప్పడే వర్షం కురిసి రోడ్లు బురదమయం అయ్యాయని ఎమ్మెల్యే కోన రఘుపతి గుర్తు చేసుకున్నారు. ఓ వృద్ధురాలు అయ్యా.. మీకు ఓట్లు వేశామని.. మాకు రోడ్లు వేయరా అని ప్రశ్నించిందని చెప్పారు. ‘అమ్మా పార్టీ మారితే రోడ్లు మంజూరు చేస్తామని చెబుతున్నారు. మరీ వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీలో గెలిచిన నేను తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళమంటావా’ అని ప్రశ్నించిగా.. అందుకు ఆ వృద్ధురాలు బదులిస్తూ రాబోయేది మన ప్రభుత్వమే.. నా పెద్దకొడుకు జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత అప్పుడు వేద్దువుగానీ.. దయచేసి పార్టీ మారవద్దని ఆమె కన్నీంటితో నాముందు విన్నవించిందని ఒకింత రఘుపతి భావోద్వేగంగా ప్రసంగించారు. రఘుపతి కూడా పార్టీ మారుతున్నారని బాపట్లలో పుకార్లు పుట్టించిన వారిని ఒక్కటే అడుగుతున్నా కోనను కొనేదమ్ము ఉందా అని ప్రశ్నించారు. ప్రజలవెంటే ఉంటాం : మర్రి రాజశేఖర్ ప్రజల వెంటే ఉంటామని, ప్రజా సమస్యలపై నిత్యం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర్ తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడే నాయకుడు కోన రఘుపతి అని...దానికి నిదర్శనమే తరలివచ్చిన జనమన్నారు. ఎమ్మెల్సీ డాక్టరు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణాలో టీఆర్ఆర్ఎస్ పార్టీలో చేరిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడిన మాటలను ఈసందర్భంగా ఆయన గుర్తు చేశారు. భారీ ప్రదర్శన.. గడపగడపకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వచ్చిన సమస్యలు, ఎన్నికల హామీలను నెరవేర్చాలని కోరుతూ బహిరంగ సభ అనంతరం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. -
గళమెత్తిన వైఎస్సార్ సీపీ నాయకులు