మోసం.. చంద్రబాబు నైజం
వెయ్యి అబద్ధాలతో అధికారం
జగన్‌మోహన్‌రెడ్డి పాలన కోసం ప్రజల ఎదురుచూపు
బహిరంగ సభలో వైఎస్సార్‌సీపీ నాయకులు
బాపట్ల: దివంగత ముఖ్యమంత్రి డాక్టరు రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన పాదయాత్రకు చంద్రబాబునాయుడు చేసిన పాదయాత్రకు ఎంతో వ్యత్యాసం ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఎమ్మెల్యే కోన రఘుపతి గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం ప్రారంభించి నెల రోజుల పూర్తయిన సందర్భంగా బాపట్ల పట్టణంలోని జమ్ములపాలెం పై ్లఓవర్ బ్రిడ్జి వద్ద మంగళవారం భారీ బహిరంగ స¿¶ నిర్వహించారు. సభలో ప్రసాదరావు మాట్లాడుతూ రాజశేఖర్‌రెడ్డి 2004లో చేపట్టిన పాదయాత్ర ద్వారా పేద ప్రజల సమస్యలు తెలుసుకుని వారి కోసం ఉచిత పథకాలు ప్రవేశపెట్టి ఆదుకున్నారని, చంద్రబాబు కేవలం అధికార దాహం, భూదందా, మోసం చేయటం కోసమే పాదయాత్ర నిర్వహించారని విమర్శించారు. ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే అతిపెద్ద కుంభకోణం పట్టిసీమ అని ఆయన విమర్శించారు.
కోనను కొనే దమ్ము ఉందా..
ఇటీవల గుడిపూడి గ్రామాన్ని సందర్శించినప్పుడు అప్పడే వర్షం కురిసి రోడ్లు బురదమయం అయ్యాయని ఎమ్మెల్యే కోన రఘుపతి గుర్తు చేసుకున్నారు. ఓ వృద్ధురాలు అయ్యా.. మీకు ఓట్లు వేశామని.. మాకు రోడ్లు వేయరా అని ప్రశ్నించిందని చెప్పారు. ‘అమ్మా పార్టీ మారితే రోడ్లు మంజూరు చేస్తామని చెబుతున్నారు. మరీ వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీలో గెలిచిన నేను తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళమంటావా’ అని ప్రశ్నించిగా.. అందుకు ఆ వృద్ధురాలు బదులిస్తూ రాబోయేది మన ప్రభుత్వమే.. నా పెద్దకొడుకు జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత అప్పుడు వేద్దువుగానీ.. దయచేసి పార్టీ మారవద్దని ఆమె కన్నీంటితో నాముందు విన్నవించిందని ఒకింత రఘుపతి భావోద్వేగంగా ప్రసంగించారు. రఘుపతి కూడా పార్టీ మారుతున్నారని బాపట్లలో పుకార్లు పుట్టించిన వారిని ఒక్కటే అడుగుతున్నా కోనను కొనేదమ్ము ఉందా అని ప్రశ్నించారు.
ప్రజలవెంటే ఉంటాం : మర్రి రాజశేఖర్
ప్రజల వెంటే ఉంటామని, ప్రజా సమస్యలపై నిత్యం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర్ తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడే నాయకుడు కోన రఘుపతి అని...దానికి నిదర్శనమే తరలివచ్చిన జనమన్నారు. ఎమ్మెల్సీ డాక్టరు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణాలో టీఆర్‌ఆర్‌ఎస్ పార్టీలో చేరిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడిన మాటలను ఈసందర్భంగా ఆయన గుర్తు చేశారు.
భారీ ప్రదర్శన..
గడపగడపకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వచ్చిన సమస్యలు, ఎన్నికల హామీలను నెరవేర్చాలని కోరుతూ బహిరంగ సభ అనంతరం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.