glitter
-
సరికొత్త కళారూపం
కళకు ఎల్లలు లేవు. అది కళాకారుడి ఊహాశక్తికి సంబంధించిన విషయం. అందుకే తరాలు మారుతున్నకొద్దీ కళ కొత్త రూపాలను సంతరించుకుంటుంది. ఆ రూపాలు కళను ప్రేమించేవారికి నిత్యనూతన ఆనందాన్ని...అందులోకి ప్రవేశించాలి అనుకునేవారిలో నిరంతర ఆసక్తిని పెంపొందిస్తున్నాయి. గ్లిట్టర్ ఆర్ట్ గా పిలుచుకునే పెయింటింగ్ కళ కూడా ఇప్పుడు ఇదే వరుసలో ఉంది. కాన్వాస్ పై గమ్ తో మొత్తం పెయింటింగ్ వేసి...చూసే ప్రేక్షకుల్లో అమితమైన ఆసక్తిని రేకెత్తిస్తూ...చివర్లో ఆ కాన్వాస్ మీదికి రంగులు వెదజల్లడంతో కళారూపాన్ని ఆవిష్కరించడం సరికొత్త ప్రక్రియ. ప్రముఖ సాండ్ ఆర్టిస్ట్ వేణుగోపాల్ సాక్షి స్టూడియోలో రూపొందించిన అలాంటి ఒక కళారూపం మీరూ చూడండి.. -
అక్షయ తృతీయ..బంగారం కొనాలా? వద్దా?
ముంబై: అక్షయ తృతీయ సందర్భంగా అక్షయమైన బంగారాన్ని కొనాలా? లేక దానం చేయాలా? అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే శభప్రదం అనే నానుడి వ్యాపార ప్రయోజనాల కోసమే వచ్చిందా? అసలు పురాణాలు ఏం చెబుతున్నాయి. ఈ సందేహాలను పక్కన పెడితే మార్కెట్ ఎనలిస్టుల మాత్రం బంగారం ధరలు ఇంకా దిగి వచ్చే సంకేతాలు అందిస్తున్నారు. ధరలతో సంబంధంలేకుండా అక్షయ్ తృతీయా సమయంలో కొనుగోళ్లు పుంజుకుంటాయని వెల్వెట్ కేస్.కామ్ సఋఈవో, సహ వ్యవస్థాపకుడు మంజు కొఠారియా వ్యాఖ్యానించారు. అలాగే మారుతున్న పరిస్థితుల్లో బంగారం కంటే డైమండ్ కొనుగోళ్లపై వినియోగదారులు ఎక్కువ దృష్టిపెడుతున్నట్టు తెలిపారు. మరోవైపు ఫిజికల్ గోల్డ్‌తో పోలిస్తే.. గోల్డ్ ఈక్విటీ బాండ్స్ , ప్రభుత్వం జారీ చేసే గోల్డ్‌బాండ్స్ కొనుగోలు పెట్టుబడులకు మంచి అవకాశమని విశ్లేషకులు సూచిస్తున్నారు. అటు ఫ్యూచర్స్ మార్కెట్లో పుత్తడి నష్టాలనుంచి కోలుకొని లాభాల్లోకి మళ్లింది. పది గ్రా. రూ.37లు లాభపడి రూ. 28,806 వద్ద ఉంది. ఇది ఇలా ఉంటే లాభాల స్వీకరణతో నష్టాల బాటలోపయనిస్తున్న మార్కెట్లలో జ్యుయల్లరీ స్టాక్స్ ఆకర్షణీంగా నిలిచాయి. అక్షయ తృతీయ సందర్భంగా సెన్సెక్స్ 100 పాయింట్ల నష్టాల్లోకి జారుకున్నప్పటికీ, మార్కెట్లో జ్యువెలరీ స్టాక్స్ పాజిటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. ఒక్క టైటన్ తప్ప, మిగతా షేర్లన్నీ లాభాల్లో ఉన్నాయి. ప్రధానంగా రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ 1.2 శాతం గీతాంజలి 1 శాతం, టీబీజెడ్ 0.7 శాతం , పీసీ జ్యువెలర్స్ 0.7 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. -
అక్షయ తృతీయనాడు 30 వేల దిగువకు పసిడి
న్యూఢిల్లీ: అక్షయ తృతీయ సెంటిమెంట్ వ్యాపారులకు నిరాశ మిగిల్చింది. డిమాండ్ బాగా పెరిగిందని ఆన్ లైన్ వ్యాపారులు ఒకవైపు ప్రకటించగా, బంగారు ఆభరణాల దుకాణాలు మాత్రం అక్షయ తృతీయ రోజు పసిడి అమ్మకాలు ఆశించినంతగా లేక వెలవెల బోయాయి. పవిత్రమైన అక్షయ తృతీయ రోజు అంచనాలకు అనుగుణంగా వ్యాపారం జరగలేదు. కొనుగోలుదారులనుంచి స్పందన పెద్దగా లేకపోవడంతో బులియన్ మార్కెట్ చిన్నబోయింది. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండడంతో విలువైన మెటల్ మార్కెట్ లో మెరుపులు మాయమయ్యాయి. ఒక దశలో పసిడి 250 రూ.ల నష్టపోయి 10గ్రా. ధర 30,100 దగ్గర స్థిరంగా ట్రేడయిన పసిడి ధరలు ఆతర్వాత 30 వేల మార్క్ దిగువకు పడిపోయాయి. 389 రూపాయలను కోల్పోయి 29, 989 స్థాయిని నమోదు చేసింది. బలహీన అమెరికా పే రోల్ నివేదిక అనంతరం డాలర్ విలువ పుంజుకుంది. దీంతోపాటు విదేశీ మార్కెట్లలో బలహీన ధోరణి బంగారం ధరలు పతనానికి దారితీసిందని ఎనలిస్టులు భావిస్తున్నారు. పెళ్ళిళ్ళ సీజన్ లేకపోవడం, ఈ మధ్య కాలంలో ధరలు పెరగడం కారణంగా పవిత్రమైన అక్షయ తృతీయ సెంటిమెంట్ పనిచేయలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం బలహీనంగా ఉన్నప్పటికీ, కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందని ఢిల్లీ కి చెందిన వ్యాపారి గౌరవ్ ఆనంద్ తెలిపారు. వివాహాది శుభకార్యాలు ముగియడం, ప్రస్తుతం మూఢం నడుస్తున్నందున, భారీ కొనుగోళ్లు ఆశించలేమని వ్యాపారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అటు పారిశ్రామిక వర్గాలు, నాణాల తయారీదారులనుండి డిమాండ్ తగ్గడంతో వెండి కూడా బలహీనంగానే ట్రేడ్ అవుతోంది. దాదాపు కిలో రూ 350 క్షీణతతో రూ 41.200 దగ్గర ఉంది. గ్లోబల్ గా పసిడి ధరలను ప్రభావితం చేసే సింగపూర్ మార్కెట్ లో బంగారం 0.7 శాతం, వెండి అరశాతం మేర ధరలు పడిపోయాయి. ఇది దేశరాజధాని నగరంలోని బులియన్ మార్కెట్ ను కూడా ప్రభావితం చేసింది.అటు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి.