
కళకు ఎల్లలు లేవు. అది కళాకారుడి ఊహాశక్తికి సంబంధించిన విషయం. అందుకే తరాలు మారుతున్నకొద్దీ కళ కొత్త రూపాలను సంతరించుకుంటుంది. ఆ రూపాలు కళను ప్రేమించేవారికి నిత్యనూతన ఆనందాన్ని...అందులోకి ప్రవేశించాలి అనుకునేవారిలో నిరంతర ఆసక్తిని పెంపొందిస్తున్నాయి. గ్లిట్టర్ ఆర్ట్ గా పిలుచుకునే పెయింటింగ్ కళ కూడా ఇప్పుడు ఇదే వరుసలో ఉంది. కాన్వాస్ పై గమ్ తో మొత్తం పెయింటింగ్ వేసి...చూసే ప్రేక్షకుల్లో అమితమైన ఆసక్తిని రేకెత్తిస్తూ...చివర్లో ఆ కాన్వాస్ మీదికి రంగులు వెదజల్లడంతో కళారూపాన్ని ఆవిష్కరించడం సరికొత్త ప్రక్రియ. ప్రముఖ సాండ్ ఆర్టిస్ట్ వేణుగోపాల్ సాక్షి స్టూడియోలో రూపొందించిన అలాంటి ఒక కళారూపం మీరూ చూడండి..




