gottipati narasaiah
-
రాజధాని ప్రాంతంలో త్వరలో పర్యటిస్తా
రాజధాని రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తా: జగన్ తాడేపల్లి వద్ద జగన్‌ను కలిసి గోడు వెళ్లబోసుకున్న రాజధాని ప్రాంత రైతులు సాక్షి ప్రతినిధి, గుంటూరు/ఒంగోలు: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాజధాని ప్రాంతంలో త్వరలోనే తాను పర్యటిస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఆ ప్రాంత రైతులు, పేదలకు తుదివరకూ అండగా ఉంటానని.. భూసమీకరణ అంశాన్ని శాసనసభలో లేవనెత్తి చర్చిస్తామని భరోసా ఇచ్చారు. కృష్ణా జిల్లా గన్నవరం నుంచి ప్రకాశం జిల్లా పర్చూరు నియోజవర్గానికి రోడ్డు మార్గంలో వెళ్తున్న జగన్మోహన్రెడ్డిని.. గుంటూరు జిల్లా తాడేపల్లి బైపాస్ రోడ్డు వద్ద రాజధాని ప్రాంత రైతులు, నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కలిశారు. రాజధాని కోసం భూసేకరణ పేరుతో.. ఏడాదికి మూడు పంటలు పండే సారవంతమైన భూములను ప్రభుత్వం తమ అభీష్టానికి వ్యతిరేకంగా లాగేసుకుంటోందని తమ గోడు వెళ్లబోసుకున్నారు. ముఖ్యమంత్రి, మంత్రివర్గ ఉపసంఘం భూసేకరణ విషయమై రైతులతో సంప్రదించకుండానే సింగపూర్ ప్రతినిధుల బృందంతో ఏరియల్ సర్వే నిర్వహించడం ఎంతవరకు సమంజసమని వాపోయారు. జగన్ వారికి భరోసా ఇస్తూ.. రైతులు ఆధైర్యపడవలసిన అవసరం లేదని.. రాజధాని ప్రాంతమైన మంగళగిరి, తుళ్ళూరు, తాడేపల్లి మండలాల్లో తాను త్వరలో పర్యటిస్తానని చెప్పారు. అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తి చర్చిస్తామని ధైర్యం చెప్పారు. జర్నలిస్టు హత్య కేసును అసెంబ్లీలో ప్రస్తావిస్తా... అనంతరం మార్గంలో చిలకలూరిపేటలో స్థానిక జర్నలిస్టు నాయకులు జగన్‌ను కలిసి.. 15 రోజుల కిందట హత్యకు గురైన జర్నలిస్టు శంకర్ కేసులో దోషులను ఇంతవరకూ అరెస్ట్ చేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసినందునే ఆయన హత్యకు గురయ్యారని.. ఈ కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలంటే సీబీసీఐడీ దర్యాప్తు జరిపించేందుకు కృషి చేయాలని కోరారు. జగన్ మాట్లాడుతూ.. ఈ అంశాన్ని అసెంబ్లీలో లెవనెత్తుతానని హామీ ఇచ్చారు. భరత్ కుటుంబానికి అండగా ఉంటా.. ఆ తర్వాత యద్దనపూడి చేరుకున్న జగన్.. అక్కడ గొట్టిపాటి నరసయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడారు. గొట్టిపాటి మరణించినప్పుడు తాను వచ్చాననీ అప్పుడు అమ్మ (నరసయ్య భార్య పద్మ) భరత్ బాధ్యత నీదే అందనీ అది తన గుండెను తాకిందన్నారు. ఆ కుటుంబానికి అండగా ఉంటానని అన్నారు. 90 ఏళ్ల వయసులో పింఛన్ తీసేశారు..! ‘‘జగన్ బాబూ మీ నాన్న హయూంలోనే నెల నెలా పింఛన్ అందుకున్నాం. ఇప్పుడు రూ.వెయ్యకు పెంచుతామని చెప్పి ఉన్నది కూడా తీసేశారు’’ అంటూ చిలకలూరిపేట పట్టణానికి చెందిన వృద్ధులు కాటుకూరి మరియమ్మ, కంచి నాగరత్తమ్మలు జగన్‌ను కలిసి తమ గోడు చెప్పుకున్నారు. చిలకలూరిపేటలో మర్రి రాజశేఖర్ ఇంటి సమీపంలో కారు దిగిన జగన్.. నేరుగా వెళ్లి సమీపంలో ఉన్న ఈ వృద్ధులను పలకరించినపుడు వారు తమ ఆవేదన వెల్లడించారు. మరియమ్మ తనకు 90ఏళ్లని, అవసాన దశలో ఉన్న సమయంలో పింఛను తొలగించారని వాపోయారు. నాగరత్తమ్మ తన పరిస్థితి చెప్పి కంటతడిపెట్టింది. వారిని జగన్ ఓదార్చి ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లి న్యాయం చేస్తామని చెప్పారు. జగన్‌కు జననీరాజనం జగన్మోహన్రెడ్డి గురువారం నాడు గుంటూరు జిల్లా మీదుగా ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం యద్దనపూడి వెళ్లారు. ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో కృష్ణా జిల్లా గన్నవరం చేరుకున్న జగన్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించారు. ఆయనకు గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజలు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. జాతీయ రహదారిపై చాలా ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులా నిలుచుని ఆయనకు నీరాజనాలు పలికారు. జగన్ చిలకలూరిపేటకు చేరుకునే సమయానికి నియోజకవర్గం నుంచే కాక వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డుపైకి చేరుకొన్నారు. జగన్ రాక సందర్భంగా యద్దనపూడి గ్రామం జనసంద్రంగా మారింది. ఉదయం నుంచి వర్షం కురుస్తున్నా ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. రైతులతో ముచ్చట్లు.. జగన్ పర్యటన సమాచారం అందుకున్న గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రాంత రైతులు, పార్టీ కార్యకర్తలు తాడేపల్లి బైపాస్ వద్ద జగన్ కాన్వాయ్‌ను నిలిపి ఆయనతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. జగన్‌ను కలిసిన వారిలో ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి రైతులతో పాటు, స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. మర్రి నివాసంలో నేతలతో భేటీ..: ఆ తర్వాత మార్గమధ్యంలో చిలకలూరిపేటలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ నివాసంలో జగన్ కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలకు చెందిన పలువురు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు జగన్‌తో సమావేశమయ్యారు. గొట్టిపాటి విగ్రహావిష్కరణ.. అనంతరం జగన్ ప్రకాశం జిల్లా పర్చూరు నియోజవర్గం యద్దనపూడి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. నరసయ్య కుమారుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గొట్టిపాటి భరత్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వర్ధంతి సందర్భంగా వేలాది మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. విగ్రహావిష్కరణ అనంతరం భరత్ ఇంటికి వెళ్లిన జగన్ రెండు గంటల సేపు ఆ కుటుంబ సభ్యులతో గడిపారు. -
గొట్టిపాటి విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్
-
ఆ ఒక్కమాట నన్ను కదిలించి వేసింది
-
గొట్టిపాటి విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్
-
గొట్టిపాటి విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్
యద్దనపూడి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ప్రకాశం జిల్లా యద్దనపూడిలో మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన ఈ సందర్భంగా నరసయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పలువురు నేతలు పాల్గొన్నారు. మరోవైపు వైఎస్ జగన్‌ను చూసేందుకు వేలాదిమంది కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. -
అభిమాన నేతకు ఆత్మీయ స్వాగతం
పర్చూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రాకతో చిలకలూరిపేట- యద్దనపూడి రోడ్డు జనసంద్రమైంది. రోడ్డుకు ఇరువైపులా బారులుతీరిన వేలాదిమంది ప్రజలు తమ అభిమాన నేతకు ఆత్మీయస్వాగతం పలికారు. ఆయన్ను తనివితీరా చూసి పులకించిపోయారు. చిన్నాపెద్దా తేడా లేకుండా జగన్‌ను చూసేందుకు ఉత్సాహంగా ఉరుకులు పెట్టారు. ‘జై జగన్’అంటూ నినదించారు. ఆయన కాన్వాయ్ వెంట కొంతదూరం వరకు పరుగులు తీశారు. ‘అన్నా జగనన్నా...’అంటూ చేయెత్తిన ప్రతి ఆడపడుచునూ జగన్ పలకరించారు. రోడ్డు పక్కన ఆశగా నిలబడిన వృద్ధులను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. కన్నీళ్లు పెట్టుకున్న మహిళల్ని ఓదార్చి ‘మీ అందరికీ నేనున్నానంటూ’ ధైర్యం చెప్పారు. చెమర్చిన కళ్లతో పలకరించే ప్రతి ఒక్కరికీ నమస్కరిస్తూ ముందుకు సాగారు. పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త గొట్టిపాటి నరసింహారావు శనివారం మృతిచెందారు. నరసింహారావు భౌతికకాయానికి నివాళులర్పించి ఆయన కుటుంబాన్ని ఓదార్చేందుకు వై.ఎస్.జగన్ హైదరాబాద్ నుంచి ఆదివారం ఉదయం తెనాలి చేరుకుని చిలకలూరిపేట వచ్చారు. అక్కడ నుంచి ఉదయం 10గంటలకు గొట్టిపాటి నరసింహారావు స్వగ్రామం యద్దనపూడికి బయలుదేరారు. ఆయన ఐదో నెంబరు జాతీయ రహదారి దిగి యద్దనపూడి రోడ్డులోనికి ప్రవేశించగానే ఆ మార్గంలోని చింతపల్లిపాడు, యనమదల, యద్దనపూడి గ్రామాల అభిమానులు, మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున రోడ్డు పక్కన చేరారు. జగన్ కాన్వాయ్ దగ్గరకు రాగానే వందల చేతులు పైకి లేచి ఆగాలంటూ అభ్యర్థించాయి. అంతే...అందరి దగ్గరా ఐదేసి నిమిషాల చొప్పున ఆగిన వైఎస్ జగన్ ఆప్యాయంగా పలకరించారు. అందరి అభ్యర్థనల్నీ మన్నిస్తూ... వై.ఎస్.జగన్మోహన్రెడ్డి డేగరమూడి చేరుకోగానే పొలాల్లో ఉన్న మహిళలు, కూలీలు రోడ్డు మీదకు పరుగులు తీశారు. చింతపల్లిపాడు సమీపంలోకి రాగానే తమ నేతను చూడాలనే తపనతో రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు పెట్టి ఆయన కాన్వాయ్‌ను నిలువరించారు. అభిమానుల కోరిక మేరకు వై.ఎస్.జగన్ చింతపల్లి పాడు పాఠశాల వద్ద దిగి అందరికీ అభివాదం చేశారు. ‘అయ్యా...ఒక్కసారి కారు దిగి ముసలాయన్నంట పలకరించయ్యా...నీకు పుణ్యముంటుంది’ అంటూ రోడ్డు పక్క నిలబడి ముకుళిత హస్తాలతో అభ్యర్థించిన డెబ్బయ్యేళ్ల ముసలావిడను చూసి జగన్ కరిగిపోయారు. వెంటనే కారు దిగారు. ‘అవ్వా.. పద’ అంటూ ఆమె చేయి పట్టుకుని ఇంటివైపు అడుగులు వేశారు. ఈ సందర్భంగా ఒక్కసారి ఈలలు..కేరింతలు పెద్ద ఎత్తున హోరెత్తాయి. కాలనీలోని ఓ పూరి గుడిసె దగ్గర ఆగి అక్కడ నడవలేని స్థితిలో కూర్చున్న పెద్దాయన ప్రభుదాసును పలకరించారు. ‘ఏయ్యా... బాగున్నావా?’ అంటూ అమాయకంగా అడిగిన ఆయన ముఖాన్ని దగ్గరకు తీసుకుని ప్రేమగా ముద్దాడిన జగన్ అవ్వ అన్నపూర్ణమ్మకు ధైర్యాన్ని చెప్పారు. ‘అవ్వా...మన ప్రభుత్వం కోసం దేవునికి మొక్కు. ఆ తరువాత అన్నీ మంచే జరుగుతాయి’అని కాన్వాయ్‌ను చేరుకున్నారు. యనమదల గ్రామంలో తనను పలకరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్న మహిళల్ని ఊరడిస్తూ, ‘అమ్మా...ఎవ్వరూ ఏడ్వొద్దు...కొద్ది కాలం ఓపిక పట్టండి. ఆపైన అన్నీ మంచిరోజులే’అని ధైర్యం చెప్పారు. ‘జగనన్నా ఇటు చూడన్నా’అని ఆడపడుచులు తన చేతుల్లో పెట్టిన ప్రతి చంటిపాపను ప్రేమగా ముద్దాడారు. చింతపల్లిపాడుకాలనీకి చెందిన పులిపాటి రాజమ్మ కుమార్తె అర్చనను ఎత్తుకుని లాలించారు. స్కూలు యూనిఫాంలతో పరుగులు తీస్తూ వచ్చిన విద్యార్థినుల్ని దగ్గరకు తీసుకుని బాగా చదువుకోండంటూ వారి తలలపై ఆప్యాయంగా నిమిరారు. చెట్లు, గోడలు, మిద్దెలు, వాటర్ ట్యాంకులెక్కి కేరింతలు కొడుతూ గాలిలో చేతులూపే యువత వైపు చూసి అభివాదం చేశారు. చింతపల్లిపాడు, యనమదల గ్రామాల్లోని చర్చిల్లో పాస్టర్ ఇస్రాయిల్ ప్రార్థనలు నిర్వహించి యెహోవా ఆశీస్సుల్ని యువనేతకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జనం ‘జై జగన్..జైజై వైఎస్సార్’ అంటూ చెవులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. చిలకలూరిపేట నుంచి యద్దనపూడికి ఉన్న 17 కి.మీ. ప్రయాణించడానికి రెండుగంటల సమయం పట్టిందంటే దారిపొడుగునా ప్రజలు ఎంతగా పోటెత్తారో తెలుస్తోంది. ఆ మార్గమధ్యంలో మొత్తం 16 చోట్ల ఆగిన వైఎస్ జగన్ ఎవ్వరినీ నిరుత్సాహ పరచకుండా అందరినీ పలకరిస్తూ, చెరగని చిరునవ్వుతో అభివాదం చేసుకుంటూ యద్దనపూడి చేరుకున్నారు. గొట్టిపాటి నరసింహారావు కుటుంబాన్ని పరామర్శించిన వై.ఎస్.జగన్ తిరుగు ప్రయాణంలోనూ ప్రజలు దారిపొడుగునా తమ అభిమాన నేత కోసం నిరీక్షించారు. వారిని నిరాశపర్చడం ఇష్టంలేక ఆయన మళ్లీ పలుచోట్ల తన వాహనాన్ని ఆపి అందర్నీ పలకరించారు. -
కన్నీటి వీడ్కోలు
యద్దనపూడి, మార్టూరు, న్యూస్‌లైన్: అనారోగ్యానికి గురై శనివారం మృతిచెందిన మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ పర్చూరు సమన్వయకర్త గొట్టిపాటి నరసింహారావు భౌతికకాయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదివారం సందర్శించారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నరసింహారావు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నప్పుడు కూడా వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఆయన్ని పరామర్శించారు. ఆయన కోలుకోవాలని ఆకాంక్షించారు. కానీ నరసింహారావు తుదిశ్వాస విడిచారని తెలుసుకున్న జగన్మోహన్రెడ్డి తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని జిల్లాకు వచ్చారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి హైదరాబాద్ నుంచి ఆదివారం ఉదయం తెనాలి వచ్చి అక్కడి నుంచి చిలకలూరిపేట మీదుగా యద్దనపూడిలోని గొట్టిపాటి స్వగృహానికి చేరుకున్నారు. అక్కడ నరసింహారావు భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన భార్య పద్మ, కుమారుడు భరత్, కుమార్తె లక్ష్మిలను ఓదార్చారు. ఆయన తమ్ముడి కుమారుడు, మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ను ఓదార్చి ధైర్యం చెప్పారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే బాలినేని గొట్టిపాటి కుటుంబ సభ్యులను ఓదార్చారు. దాదాపు గంటపాటు గొట్టిపాటి నివాసంలో గడిపిన అనంతరం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తిరుగు ప్రయాణమయ్యారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు: పార్టీ నేతలు, అభిమానులు అశ్రునయనాలతో గొట్టిపాటి నరసింహారావుకు అంతిమ వీడ్కోలు పలికారు. ఆయన మరణవార్త తెలుసుకుని పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు, ప్రజలు యద్దనపూడి తరలివచ్చారు. మాజీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాదరెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని, జోగి రమేష్, బాపట్ల నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కోన రఘుపతి, పాలేటి రామారావు, ముక్కు కాశిరెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, బాచిన చెంచుగరటయ్య, దారా సాంబయ్య, దివి శివరాం, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ, పార్టీ నేతలు తూమాటి మాధవరావు, బత్తుల బ్రహ్మానందరెడ్డి, రమణారెడ్డి, భవనం శ్రీనివాసరెడ్డిలతోపాటు నేతలు, కార్యకర్తలు, ప్రజలు నరసింహారావు భౌతికకాయానికి నివాళులర్పించారు. అంతిమ యాత్రకు భారీగా తరలిన జనం.. గొట్టిపాటి నరసింహారావు అంతిమ యాత్ర ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన నివాసం నుంచి బయలుదేరింది. నరసయ్య అమర్హ్రే అంటూ నినాదాలు చేస్తూ అభిమానులు.. నాయకులు, కార్యకర్తలు ఆయన పార్ధివ దేహం వెంట తరలి వచ్చారు. ఆయన కుమారుడు భరత్ తన తండ్రి భౌతికకాయం ముందు నడుస్తూ ఉంటే అభిమానులు కన్నీటిపర్యంతమయ్యారు. గొట్టిపాటి రవికుమార్ అన్న పాడె మోశారు. అంతిమ యాత్ర యద్దనపూడి సెంటర్ నుంచి వింజనంపాడు రోడ్డులోని నరసింహారావు సొంత పొలం వరకు కిలోమీటరు పొడవున భారీ జన సందోహం మధ్య సాగింది. దారిపొడవునా అభిమానులు, వైఎస్ఆర్ సీపీ నాయకులు ఆయన భౌతికకాయం వెంట నడిచారు. గం.2.30కు ఆయన సొంత వ్యవసాయ క్షేత్రానికి అంతిమ యాత్ర చేరుకుంది. గొట్టిపాటి నరసింహారావు కుమారుడు భరత్ ఆయన చితికి నిప్పంటించి దహన సంస్కారాలు చేశారు. అంతిమ యాత్రలో మాజీ మంత్రి పాలేటి రామారావు, మార్టూరు, యద్దనపూడి, చినగంజాం, ఇంకొల్లు, పర్చూరు మండల పార్టీ కన్వీనర్లు పటాన్ కాలేషావలి, ధూళ్లిపాళ్ల వేణుబాబు, కోటా విజయభాస్కరరెడ్డి, బండారు ప్రభాకరరావు, తోకల కృష్ణమోహన్, నర్రా శేషగిరి, దొడ్డా బ్రహ్మం, పావులూరి వెంకటేశ్వర్లు, దరువూరి వీరయ్య చౌదరి, అమ్మిరెడ్డి, ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య, పోపూరి శ్రీనివాసరావు, చిన్నికృష్ణ, చెరుకూరి అనిల్, సుబ్బారెడ్డి, మల్లినీడి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా తరలి వచ్చిన ప్రజలు, నాయకులు గొట్టిపాటికి నివాళులర్పించటానికి పార్టీలకు అతీతంగా నాయకులు, ప్రజలు తరలి వచ్చారు. అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాల నుంచి అధిక సంఖ్యలో తరలి వచ్చి ఆయనకు నివాళులర్పించారు. -
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గొట్టిపాటి నరసయ్య కన్నుమూత
మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి నరసయ్య (51) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న నరసయ్య ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. రేపు ఆయన స్వగ్రామం ప్రకాశం జిల్లా యద్దనపూడిలో అంత్యక్రియలు జరుగుతాయి. నరసయ్య 1997 ఉపఎన్నికల్లో, 1999 ఎన్నికల్లో మార్టూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈయన తండ్రి గొట్టిపాటి హనుమంతరావు సీనియర్ రాజకీయవేత్తగా, మంత్రిగా పనిచేశారు. తండ్రి మరణానంతరం 97 ఉపఎన్నికల్లో నరసయ్య గెలుపొందారు.